Saturday, February 7, 2009

Sithara - Kukuku kokila



చిత్రం: సితార (1983)
గాయకులు: S.P. బాలసుబ్రమణ్యం
సంగీతం: ఇళయరాజా
దర్శకత్వం: వంశీ
**************


పల్లవి:

కు కు కు కు కూ కు కు కు కూ కూ కోకిల రావే
కు కు కు కు కు కూ కోకిల రావే
రాణివాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో

చరణం 1:

రంగుల లోకం పిలిచే వేళ  
రాగం నీలో పలికే వేళ 
విరుల తెరలే తెరచి రావే
బిడియం విడిచి నడచీ రావే
నా పాటల తోటకు రావే
ఈ పల్లవి పల్లకిలో
నా పాటల తోటకు రావే
ఈ పల్లవి పల్లకిలో
స్వరమై రావే
విరి పొదల ఎదలకు //కు కు కు కూ కోయిల// 

చరణం 2:

సూర్యుడు నిన్నే చూడాలంట
చంద్రుడు నీతో ఆడాలంతా
బురుజు బిరుదు విడిచి రావే
గడప తలుపు దాటి రావే
నువ్వు ఏలే రాజ్యం ఉంది
ఆ నాలుగు దిక్కులలో
నువ్వు ఏలే రాజ్యం ఉంది
ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయ జతులకు // కు కు కు కూ కోయిల //

No comments:

Related Posts with Thumbnails