చిత్రం: గజిని (2007)
గానం: హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ
సంగీతం: హరీష్ జైరాజ్
*******************
పల్లవి:
హృదయం ఎక్కడున్నదీ- హృదయం ఎక్కడున్నది
నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం- ఆడుకున్న వయసే
నాలో విరహం పెంచుతున్నదీ..
చూపులకై వెతికా - చూపుల్లోనే బ్రతికా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా తొలిసారీ..
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా // హృదయం ఎక్కడున్నదీ //
చరణం 1:
కుందనం మెరుపు కన్నా- బంధనం వయసుకున్నా
చెలి అందం నేడే అందుకున్నా
గుండెలో కొసరుతున్నా - కోరికే తెలుపుకున్నా
చూపే వేసీ బ్రతికిస్తావనుకున్నా
కంటిపాపలా పూవులనే - నీ కనులలో కన్నా..
నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా- (2) //హృదయం ఎక్కడున్నదీ //
చరణం 2:
మనసులో నిన్ను కన్నా- మనసుతో పొల్చుకున్న
తలపుల పిలుపులు విన్నా-
సెగలలో కాలుతున్నా.. చలికి నే వణుకుతున్నా -
నీడే లేని జాడే తెలుసుకున్నా
మంచు చల్లనా ఎండ చల్లనా -
తాపం లోనా మంచు చల్లనా కన్నా
నీ కోపం లోనా ఎండ చల్లనా (2) // హృదయం ఎక్కడున్నదీ //
No comments:
Post a Comment