Monday, August 21, 2017

Good Morning - 663


తల్లిప్రేమ 
తాను వర్షానికి తడుస్తున్నా, పిల్లల మీద ఒక్క చినుకూ పడకుండా, 
రెక్కలని కప్పి వెచ్చదనాన్ని కలిగిస్తున్న ఈ అమ్మ మనసుకి జోహార్లు. 


Sunday, August 20, 2017

టైపు చేసినప్పుడు కింద బాక్సులో ఆప్షన్లు వస్తున్నవి. అట్లా రాకుండా చేయటం ఎట్లా?

[తెలుగుబ్లాగు:22383] టైపు చేసినప్పుడు కింద బాక్సులో ఆప్షన్లు వస్తున్నవి. అట్లా రాకుండా చేయటం ఎట్లా? 

అనే ప్రశ్నకు నేనిచ్చిన సమాధానం..

టైపు చేసినప్పుడు కింద బాక్సులో ఆప్షన్లు వస్తున్నవి. అట్లా రాకుండా చేయటం ఎట్లా? అని అడిగారు కదా.. అలా రావటం అన్నది మామూలే.. మన టైపింగ్ సౌలభ్యం కోసం అలా వస్తుంటాయి. నిజానికి అలా రావటం చాలా ఉపయోగకరముగా ఉంటుంది కూడా. మరింత వివరముగా చెప్పాలీ అంటే - యూనికోడ్ లో మనం వ్రాసే టైపింగ్ వల్ల ఒక పదం వ్రాయబోతే మరొక పదం వస్తుంది. ఇలా రావటం అన్నది మనం టైపింగ్ చేసే పదానికి డిఫాల్ట్ గా ఉన్న పదమే మొదటగా కనిపిస్తుంది. అంటే మనం టైపు చేసినది సరియైనది అయితే అది మొదటగా కనిపిస్తుంది. అది ఒకే అనుకుంటే వెంటనే స్పేస్ బార్స్ నొక్కి, మరొక పదాన్ని వ్రాసుకుంటూ వెళతాం.. ఇలా వ్రాసుకుంటూ వెళుతున్నప్పుడు - ఒక్కోసారి మనం అనుకున్న పదాలు అక్కడ రావు. ఎలా టైపు చేసినా సరే.. ఇంస్క్రిప్ట్ లో మాదిరిగా యూనికోడ్ లో మరింత మెరుగ్గా టైప్ చెయ్యటానికి అవకాశం లేదు. అందువల్ల ఈ ఆప్షన్స్ తప్పనిసరి అవుతుంది. అవి రాకుండా మనం అనుకున్న పదాలతో విషయాన్ని టైప్ చెయ్యటం కాస్త కష్టమే. అచ్చుతప్పులు రాకుండా సరైన కీలను వాడి పదాలను టైపింగ్ చెయ్యటం అందరికీ సాధ్యం కాదు కదా.. 

అంతెందుకు.. పైన ఈ పోస్ట్ లో వల్ల అనే పదాన్ని ఎర్రని రంగులో పెట్టాను. ఆ పదాన్ని వ్రాయటం అస్సలు వీలు కాలేదు. రెండు మూడు సార్లు టైప్ చేసినా వాళ్ళ అనే పదం మొదటగా వచ్చింది. 


అంటే పదమే డిఫాల్ట్ గా సెట్ అయ్యి ఉందన్నమాట. చివరికి ఆప్షన్స్ లోని పదమే ఎన్నుకొని.. ముందుకు సాగాను. ఆ ఆప్షన్ లేకుంటే వాళ్ళ అనే వచ్చి, వారి యొక్క అనే అనే అర్థం వచ్చేది. సో, ఆప్షన్ ఉండటమే మంచిదన్నది నా అభిప్రాయం. అందరికీ అర్థం కావాలని చాలా పెద్దగా చెప్పా.. మన్నించండి. Friday, August 18, 2017

Good Morning - 662


మనుష్యుల మధ్య ఆత్మీయత, అనుబంధాలకు బంధువులే అయి ఉండక్కరలేదు.. 
మనసుకి నచ్చిన వాళ్ళందరూ ఆత్మబంధువులే.. 

Wednesday, August 16, 2017

ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు - 2

దైనందిక జీవితములో వాడే ఆంగ్ల పదాలకు సమాన తెలుగు పదాలు ఏమిటో కొన్ని వార్తా పత్రికల నుండి సేకరించాను. వాటన్నింటినీ ఇక్కడ మీకు తెలియచేస్తున్నాను. ఇలాంటి ప్రయత్నం ఇంతకు ముందు ఒకసారి ( https://achampetraj.blogspot.in/2015/05/blog-post.html ) చేశాను. ఇప్పుడు మరొక సేకరణ.. మీకోసం.

Optical Fiber - ఆప్టికల్ ఫైబర్              =  దృశ్యా తంత్రులు
Signals - సిగ్నల్స్                                =  సంకేతాలు
Power - పవర్                                     =  శక్తి
Smart city - స్మార్ట్ సీటీ                        =  అందమైన నగరం
CEO - సీ ఈ వో                                    =  ముఖ్య కార్య నిర్వహణాధికారి
Self Declaration - సెల్ఫ్ డిక్లరేషన్        =  స్వీయ ధృవీకరణం
Technical Development - టెక్నికల్ డెవలప్మెంట్ =  సాంకేతిక అభివృద్ధి
Skill Development - స్కిల్ డెవలప్మెంట్ =  నైపుణ్యాభివృద్ధి
Green Revolution - గ్రీన్ రెవల్యూషన్    =  హరిత విప్లవం
Communication skill - కమ్యూనికేషన్ స్కిల్ =  భావ ప్రసరణ నైపుణ్యం
Logical ability - లాజికల్ ఎబిలిటీ         =  తర్క జ్ఞానం
Computer - కంప్యూటర్                       =  సంగకణం
Mobile phone - మొబైల్ ఫోన్              =  చరవాణి
Artificial Intelligence - ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ =  కృతిమ బౌద్ధికత
Word generator - వర్డ్ జెనరేటర్          =  పద జనకం
Spell Checker - స్పెల్ చెకర్                 =  గుణింత పరిష్కరిణి
Converter =  కన్వర్టర్                          =  లిపి పరివర్తకం
Unicode - యూనికోడ్                          =  విశ్వ సంకేత ఖతి


Tuesday, August 15, 2017

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 2


Saturday, August 12, 2017

Good Morning - 661


ప్రేమ అనేది నీడ లాంటిది.. 
అది వెలుతురులోనే కనిపిస్తుంది. 
స్నేహం దీపం లాంటిది. 
అది చీకటిలో దారి చూపిస్తుంది. Friday, August 11, 2017

Good Morning - 660


ఒక తండ్రి అభ్యర్ధన : 
ఒక తండ్రిగా నా వృద్ధాప్యంలో ఆర్థికముగా నీమీద ఆధారపడను. అలాగే జీవితాంతం ఆర్థికముగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత లోకల్ బస్ లో తిరుగుతావా..? నీ సింత లగ్జరీ కారులోనా..? గొప్పవాడిగానా..? మామూలు జీవితమా ?? అన్నది నీవే నిర్ణయించుకో. 

Tuesday, August 8, 2017

Quiz

ఈక్రింది ఏ ట్యాంక్ మొదటగా నిండుతుంది..? 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 7 నంబర్ ట్యాంక్. 
ఎలా అంటే - మొదటి ట్యాంక్ లోకి నీరు రాగానే దానికి అమర్చిన మరొక పైపు కనెక్షన్ గుండా మరొక ట్యాంక్ లోకి ఆ నీరు ప్రవహిస్తుంది. అంటే ఆ ట్యాంక్ కు ఉన్న బయటకు వెళ్ళే పైపు ఎత్తుకి నీరు రాగానే, అప్పటిదాకా ఆ ట్యాంక్ లోకి వచ్చిన నీరు బయటకు వెళ్ళడం మొదలవుతుంది. ఆ నీరు మరొక ట్యాంక్ లోకి చేరుకుంటుంది. అందులోకూడా అలాగే అమర్చిన పైపు గుండా - మొదటి ట్యాంక్ లో మాదిరిగానే జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే - బయటకు వెళ్ళే పైపు మార్గాలు ఆ ట్యాంక్ మూతి వద్ద ఉంటేనే అప్పుడు ఆ ట్యాంక్ నిండుతుంది. ఇలా మొదటగా ఉన్నది ఏడవ (7) నెంబర్ ట్యాంక్. 

Monday, August 7, 2017

Good Morning - 659


ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు.. తప్పక కలిగి ఉండి తీరవలసినది ఏదీ లేదని మరచిపోకు. 
ఇది నీవు సరిగ్గా అర్థం చేసుకున్న రోజు - నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా - నీ మనసు పెద్దగా గాయపడదు. 

Saturday, August 5, 2017

Good Morning - 658


జీవితములో ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు.. 
తప్పక కలిగి ఉండి తీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.. 
ఇది నీవు సరిగ్గా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా, నీ మనసు పెద్దగా గాయపడదు.. 
Thursday, August 3, 2017

Good Morning - 657


నేను అంత త్వరగా నీకు అర్థం కాను.. అర్థం అవడం మొదలయ్యాక నన్ను వదులుకోవడం నీవల్ల కాదు.. 

Sunday, July 30, 2017

Quiz


ఎవరైనా సమాధానం చెబుతారా? ఒక నిరుద్యోగి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వాణ్ని ఒక ప్రశ్న వేశారు. 
సంవత్సరములో " ఒకసారి " 
వారంలో " రెండుసార్లు " 
నెలల్లో " పదకొండుసార్లు " వచ్చేది ఏమిటి అని అడిగారు. 
దానికి అతను సమాధానం చెప్పి, ఉద్యోగం సంపాదించాడు. 
ఇంతకూ అతను చెప్పిన సమాధానం ఏమిటి ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

జవాబు : 

Thursday, July 27, 2017

Good Morning - 656


అది ఎంతకాలమైనా సరే! మనం కలసి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్ళీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా నేస్తమా... 

Saturday, July 22, 2017

Good Morning - 655


నీతో సఖ్యముగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు.. నీ తల్లితండ్రులకు తప్ప నీకు తప్పనిసరిగా మంచే చెయ్యాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో..
Wednesday, July 19, 2017

Good Morning - 654


చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్ళుండవచ్చు. కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.. 
Saturday, July 15, 2017

Good Morning - 653


దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాధ్యమే, కానీ దీవాలా తీసినప్పటి పరిస్థితి దారుణముగా ఉంటుందని మరచిపోకు. 

Thursday, July 13, 2017

Good Morning - 652


ఒక రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవించాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయాన్ని గుర్తించు. 

Sunday, July 9, 2017

Quiz


11 x 11 = 4
22 x 22 = 16 
33 x 33 = ?? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


Friday, July 7, 2017

Good Morning - 651


మనిషి తన నుంచి తాను విడికానంత కాలం - అతడు దేన్నీ చూడలేడు. తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం. దానికి తీవ్ర సాధన కావాలి. 

Tuesday, July 4, 2017

క్రొత్త తినడం - గురించి మరింత సమాచారం.

2011 నవంబర్ 11 న ఇదే బ్లాగులో " క్రొత్త తినడం " గురించి ఒక పోస్ట్ ( లంకె : https://achampetraj.blogspot.in/2011/11/blog-post_27.html ) పెట్టాను. ఆ పోస్ట్ కి బాగా వీక్షణలు వచ్చాయి. అలాగే కామెంట్స్ కూడా.. " ఇలా క్రొత్త తినడం గురించి మేమెప్పుడూ వినలేదు.. మాది రైతు కుటుంబాలు అయినా.. " అని కామెంట్స్ పెట్టారు. వాటికి వివరముగా జవాబు ఇవ్వాలని అనుకున్నాను. కానీ దాని గురించి నాకు తెలిసినదంతా ఆ పోస్ట్ లోనే వ్రాశాను. అందువల్ల వారికి మరింతగా జవాబు ఇవ్వలేక పోయాను. 

మొన్న ఒక మిత్రుడు - ఈ క్రొత్త తినడం గురించి ఒక దినపత్రికలో వచ్చిన దాన్ని నాకు తెలియచేశారు. అది ఎలా ఉందో అలాగే ఫోటో తీసి మీకు ఇప్పుడు పరిచయం చెయ్యబోతున్నాను. ఇది చదివి, ఆ " క్రొత్త తినడం " అనే పాత సంప్రదాయం / పద్ధతి గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఫోటో మీద డబల్ క్లిక్ చేసి, పెద్దగా అయ్యాక చూడమని నా మనవి. Good Morning - 650


తొలి ఏకాదశి / ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.. 

Saturday, July 1, 2017

Good Morning - 649


మనిషి సహజముగా తన బలహీనతలని ఎప్పుడూ ఒప్పుకోడు. వాటిని చూడడు, పట్టించుకోడు, తెలిసినా, తెలిపినా సరిదిద్దుకోడు.. 

Wednesday, June 28, 2017

Good Morning - 648


నువ్వు నీ మాట నిలబెట్టుకో.. ఇతరులనుండి ఇది ఆశించకు. నువ్వు అందరితో మంచిగా ఉండు. అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు.. ఇది సరిగ్గా అర్థం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పవు. 

Monday, June 26, 2017

Good Morning - 647


ప్రేమ అనేది ఒక  నిలకడ లేని, చంచలమైన భావన. కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించాననుకున్నవారు దూరమైనప్పుడు కృంగిపోకు. ఓపిక పట్టు.. కాలం నీ గాయాలను, బాధలను అన్నింటినీ కడిగేస్తుంది. కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాలను గమనించు.. ప్రేమ సౌందర్యాన్ని, అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు.. ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో.. 

Thursday, June 22, 2017

Quiz


ఈ చిత్రములో ఎన్ని త్రిభుజాలు Triangles ఉన్నాయో చెప్పుకోండి  చూద్దాం.. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :  16 

Wednesday, June 21, 2017

Good Morning - 646


కొంతమంది ఆనందాన్ని కొనుక్కుంటారు.. కొందరు సృష్టించుకుంటారు. మనుష్యుల్లో అదే ముఖ్యమైన తేడా. 


Thursday, June 15, 2017

Good Morning - 645


హృదయానికి బాధ కలిగినప్పుడు కళ్ళలోంచి కన్నీళ్ళు కారతాయి.. అది ప్రేమ. 
కళ్ళనుండి కన్నీళ్ళు కారినప్పుడు హృదయం నొప్పి పెడుతుంది.. అది స్నేహం. 

హృదయానికి బాధ కలిగినప్పుడు - మనం అనుకున్నది జరగనప్పుడు, పెట్టుకున్న ఆశలు వమ్ము అయినప్పుడు, ఓటమి బాధ వల్ల మనసు బాధతో నిండిపోయి, అది కన్నీళ్ళ రూపములో మన కన్నుల వెంట బయటకు వస్తుంది. అది ప్రేమ. ఉదాహరణగా చెప్పాలంటే తల్లితండ్రుల ప్రేమ. మనకిష్టమైన వారి కళ్ళనుండి కన్నీళ్ళు కారినప్పుడు మన మనసుకి నొప్పిలా అనిపిస్తుంది. అది స్నేహం.. ఇది నిజమైన స్నేహములో, ఇరువురి మనసులూ ఒకటైన స్నేహంలో చూస్తాము. స్నేహితుని కళ్ళలో కన్నీరు చూడాల్సిరావటం ఏ ఆప్త స్నేహితుడూ ఇష్టపడడు. అవసరమైతే తన బదులు తాను ఏడ్వాల్సివచ్చినా సంతోషముగా ఒప్పుకుంటాడే కానీ, తన స్నేహితున్ని మాత్రం ఏమాత్రం ఏడవటానికి ఇష్టపడడు. ఇదే చక్కని స్నేహానికి పరాకాష్ట. 
( ఇలాంటి స్నేహం నాకు దొరికింది.. అది ఈ జన్మకు చాలు )

Saturday, June 10, 2017

Quiz
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

Answer : 


Sunday, June 4, 2017

Good Morning - 644


మీరు కోల్పోయినదాన్ని గురించి ఎన్నడూ ఆలోచించకండి. ఎందుకంటే - గతమెన్నడూ తిరిగిరాదు.. మీరు కోల్పోయిన వాటిని భవిష్యత్తులో కొన్నిసార్లు తిరిగి పొందుతాము.. ఇదే జీవితం. 

Friday, June 2, 2017

Good Morning - 643


నిజాలు మాట్లాడి నన్ను బాధ పెట్టండి. కానీ, అబద్ధాలు చెప్పి, నన్ను సంతోషంలో ఉంచడానికి ప్రయత్నించకండి. Tuesday, May 30, 2017

Good Morning - 642


ఎవరినీ దూరం చేసుకోకండి. ఎందుకంటే అలా చేసుకోవడం అంటే మనకి బాగా తెలిసిన వాళ్ళలో - వారు ఒకరే కావొచ్చు. కానీ వారి ఆప్యాయత, ఆనందం, సంతోషాలని దూరం చేసుకోవడమే.. అందుకే వారిని ఉన్నప్పుడు బాధ పెట్టకండి. మీరూ బాధ పడకండి. Sunday, May 28, 2017

Quiz


ఈ చిత్రములో ఎన్ని త్రిభుజాలు Triangles ఉన్నాయో చెప్పండి చూద్దాం.. ?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 12


1. ABCA 
2. ABDA 
3. ADCA 
4. ABEA 
5. BECB 
6. ABFA 
7. AFCA 
8. BCFB 
9. BFDB 
10. FDCF 
11. FECF 
12. AFEA Thursday, May 25, 2017

Quiz


రెండు అంకెలని కూడినా, 
గుణించినా జవాబు ఒక్కటే.. 
అవేమిటో చెప్పగలరా ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 2, 2


Tuesday, May 23, 2017

Railing Repair

అలా బాల్కానీ నుండి తొంగి చూస్తుండగా - రేయిలింగ్ Railing కి ఉన్న ఇనుప పట్టీ వదులై అసహ్యముగా కనపడసాగింది. అలాగే వదిలేస్తే మరింతగా పాడేయ్యేలా ఉంది. అప్పట్లో స్క్వేర్ ఐరన్ ట్యూబ్ Square Iron Tube కి డిజైన్ వచ్చేది కాదు. ఆ చదరపు ట్యూబ్ నీ, ఆ డిజైన్ పట్టీని విడివిడిగా వంచి, ఒక్కటిగా దగ్గరకు చేర్చి, వెల్డింగ్ చేశారు. ఈ పని బాగుంది. కానీ కాసింత శ్రద్ధ ( అంటే పట్టీకి ట్యూబ్ కీ మధ్యన ఉండే సన్నని గ్యాప్ ని లప్పం గానీ, సిమెంట్ ద్వారా గానీ పూత వేసి మూసేయ్యలేదు ) తీసుకోక అందులోకి వర్షం నీరు, ఉతికిన బట్టల నీళ్ళూ పడీ, అందులోకి వెళ్ళి... త్రుప్పు పట్టి అ రెండింటి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇలా అవుతుందని ఆ వెల్డర్ గానీ, ఇటు పెయింటర్ గానీ చెప్పలేదు.. ఎవరి స్వార్థాలు వారివి. మనకా తెలీదు. సో, చివరకు బలయ్యేది మనమే.. 

వర్షపు నీరు ఆ సందులోకి చేరి, మరింత త్రుప్పు పట్టేలా చేస్తూ, అక్కడే ఆవిరయ్యేది. ఫలితముగా ఇనుప పట్టీ తడి ఆరిపోగానే సన్నని ఇనుప రజనులా రాలిపోయి, ఆ ట్యూబ్ కీ, పట్టీకీ మరింతగా దూరం చేసింది.. ఫలితముగా అక్కడక్కడా నా చిటికెన వ్రేలు పట్టేలా దూరం జరిగాయి. 

అలా ఉండటం వల్ల వ్రేళ్ళు ఇరుక్కోవడం, త్రుప్పు పట్టడం వల్ల అది సన్నగా అయ్యి, కోసుకపోయేలా మారింది. పెద్దవాళ్ళకే ఇబ్బందిగా ఉంటే ఇక పిల్లల సంగతి..? వామ్మో..! తలుచుకుంటే భయంకరముగా తోచింది. దాన్ని బాగుచేద్దామంటే - వెల్డర్ వచ్చి, చూసి, అది పూర్తిగా తొలగించి, షాపుకి తీసుకరండి. చేసిస్తాను అని అన్నాడు. తన చార్జెస్ ఒక వేయి తీసుకుంటాను అన్నాడు. అదీ నన్ను చూసి.. లేకుంటే ఇంకో ఐదు వందలు అదనంగా చెప్పేవాడట. 

ఇక్కడ వర్షం నీరు పడకుండా ఆపే పరిస్థితి లేదు.. బాల్కానీ కాబట్టి. ఉతికిన బట్టలు అక్కడే ఆరేస్తాం కాబట్టి దాన్నీ నివారించలేం... ఈ వెల్డర్ + పెయింటర్ ల తప్పు వల్ల ఇప్పుడు వెల్డర్ కి 1500 + రెయిలింగ్ గ్రిల్ తీయించినందులకు 350 + రానుపోను రిక్షా 200 + మళ్ళీ బిగించటానికి మేస్త్రీ ఖర్చు 650 + తన సహాయకుడికి 350 + పెయింటర్ కి 1000 + పెయింట్స్ కి 600...........( ఇక్కడి వరకే Rs. 4650 )  ఇదీ ఖర్చు. ఇవి కనిపించేటివి. ఇక కనిపించనివి - అక్కడే ఉండి నిర్వహణ చూసుకోవాలి - ఇది ఒకరోజు మన సమయం, కూలీలని, రిక్షానీ, సిమెంట్, పెయింట్స్ తేవటానికి అయ్యే ఖర్చులూ అదనం.. చూశారా !.. చిన్న పొరబాటుకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. అందుకే ఇంటి నిర్వహణ అంత వీజీ కాదు.. అన్నీ బాగుండేలా చూడాలంటే చాలా చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి.. అవును.. చిన్న చిన్న విషయాలే.. బోర్ గా ఫీలయ్యి నేర్చుకోవటానికి ఇష్టపడం.. కానీ ఆ చిన్నపనులు మన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని మింగేస్తాయి. అందుకే ఇలాంటి పనులు ఎలా చెయ్యాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి అయిపోయాక చేయి కాలింది అని తెలిశాక అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు విచారించటం తప్ప మరేమీ చెయ్యలేం.. అందుకే ఇలాంటి విషయాల్ని మీకు తెలియాలని చెబుతున్నాను. ప్రపంచం లోని చాలామందికి ఇలాంటి విషయాలు చాలా అవసరం. ఇలాంటి విషయాలకు గూగుల్ లో వెదికితే ఏమి చెయ్యాలో తెలియడానికి ఇలాంటి పోస్ట్స్ కూడా పెట్టాల్సి వస్తున్నది. అందుకే చాలా వివరముగా వ్రాస్తున్నాను. నిజానికి ఇలాంటి పోస్ట్స్ కి బ్లాగ్ వీక్షకుల సంఖ్య బాగానే ఉంది. మామూలు పోస్ట్స్ కన్నా వీటికే వ్యూయర్ షిప్ Viewership  ఎక్కువగా ఉంది కూడా..  నా బ్లాగ్ స్టాటిస్టిక్స్ కూడా ఇది నిజమని ఋజువు చూపిస్తున్నది కూడా.. 

సరే.. ఇక అసలు విషయానికి వద్దాం.. 

ఆ గ్యాప్ లో ఏమి పెడితే బాగుంటుందో ఆలోచన చేశాను. వాల్ పుట్టీ పెడితే ?? అన్న ఆలోచన. బాగుంది కానీ అంత లావుగా అయితే పగుళ్ళు వచ్చి, ఊడిపోతుంది.. పోనీ M-seal లాంటిది పెడితే?? ఇది బాగుంటుంది కానీ అంత పెద్ద గ్యాపుల్లో దాన్ని నింపేసరికి ఖర్చు మరింతగా పెరిగిపోతుంది. మనకు తక్కువ ఖర్చులో - తక్కువ సమయంలో అంతా బాగా కావాలి. మరి ఎలా ? అని ఆలోచిస్తే - సిమెంట్ పెడితే..? వావ్.. మంచి ఆలోచన. అదే బెస్ట్ ఇది 10 - 20 రూపాయల్లో అయిపోతుంది. 

ముందుగా చదరపు ట్యూబ్ కీ, పట్టీకి మధ్యన జాగాలో ఉన్న తుప్పుని ఒక స్క్రూ డ్రైవర్ సహాయన వచ్చినంతవరకూ తొలగించాను. 

ఆ రెండింటినీ కలిపి ఉంచేలా చేసిన వెల్డింగ్ వద్ద ఉన్న త్రుప్పుని ఒక చిన్న సుత్తె సహాయన లోతుగా త్రుప్పుని రాలగొట్టాను. 

ఆ తరవాత మామూలు బైండింగ్ వైర్ ( ఇంటి స్లాబుల్లో స్టీలు వూచలని బంధించడానికి వాడేది ) కాకుండా GI వైర్ మీడియం మందముగా ఉన్నది తీసుకున్నాను. ఇందులో తేడా ఏమిటంటే - బైండింగ్ వైర్ కొద్ది కాలానికే త్రుప్పు పట్టి విరిగిపోతుంది. అదే GI వైర్ త్రుప్పు పట్టక అలాగే ఉంటూ గట్టిగా ఆ రెండింటినీ పట్టి ఉంచుతుంది. అందువల్ల ఇలాంటి చిన్న విషయాలు కీలకం. ఈ తీగ ఎల్లప్పుడూ అక్కడ వాతావరణానికి ఎక్స్ పోజ్ అవుతుంది. కాబట్టి ఇదే వాడమని సలహా. 

( ఇది చేసి, విజయం సాధిస్తానని నాకు తెలీదు. నా స్వంత ఆలోచన.. నిజానికి ఈ పనిలో సక్సెస్ అవుతాననీ తెలీదు. కనుక రెయిలింగ్ మొదట ఎలా పాడయ్యిందో చూపే ఫోటోలు తీయలేదు. అందులకు మన్నించండి. )

GI వైరుతో రెండు చుట్లు చుట్టి, కొనలని ముడివేసి, మెలి త్రిప్పాను. దీనివల్ల అది వాటిని దగ్గరగా లాగుతుంది. అలాగే గట్టిగా బంధించి ఉంచుతుంది. ఈ క్రింది ఫోటో చూడండి. 


ఆ తరవాత సన్నని ఇసుక, సిమెంట్, కాస్త నీరూ కలిపి చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. 

ఆ రెండింటి గ్యాప్ లో ఆ సిమెంట్ వేసే ఒక నిమిషం ముందు - సిమెంట్ వేసే ప్రాంతాన్ని నీటితో తడుపుకోవాలి. ఇలా ఎందుకూ అంటే - ఆ సిమెంట్ మిశ్రమం ఆ ఇనుప రెయిలింగ్ గోడలకి గట్టిగా పట్టుకుంటుంది. చాలామంది మేస్త్రీలు ఈ చిన్న విషయాన్ని మరుస్తారు. ఫలితముగా పగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే కాస్త తడి ఉన్నప్పుడే సిమెంట్ వేసుకోవాలి. 

క్రింది వైపున అట్టముక్క లేదా ఎడమచేతిని వాడి, ఆ గ్యాప్ లో సిమెంట్ మిశ్రమాన్ని వేసి సన్నని తాపీతో అదమాలి. అలా పైవరకూ చేసి, కాసేపు ఆగాక ఒక చెక్క ముక్కతో లెవల్ చేసుకోవాలి. 

స్మూత్ / నునుపు ఫినిషింగ్ కావాలంటే ఒక లప్పం రేకుతో రాస్తే సరి.. నేను మాత్రం ఇక్కడ నీటిలో తడిపిన స్పాంజ్ ముక్కతో నునుపు చేశాను. ఫలితముగా గరకుగా వస్తుంది. ( అది ఆరాక వాల్ పుట్టీ ని లప్పం రేకు సహాయాన పూసి, స్మూత్ / నునుపు చేసి, ఎమరీ పేపర్ తో రుద్ది, మరీ నునుపు చెయ్యాలని నా ఆలోచన. ఆ తరవాత పెయింట్ వేస్తే ఇలా అయ్యిందని మనం చెబితే గానీ ఎవరూ తెలుసుకోలేరు..) 

అలా చేశాక నీటి తడులు చాలానే ఇచ్చాను. ఫలితముగా చాలా బాగా ధృడముగా ఆ రెయిలింగ్ మారింది. 


ఆ తరవాత ఈ రెయిలింగ్ గోడకి కలిసే చోట అక్కడ నీటి తేమ వల్ల పూర్తిగా పాడయ్యి, సన్నని పోచ మీద ఆగింది. ఇక్కడ నిలబడితే ఆధారం లేక పడిపోతామేమో అన్నంతగా భయం వేసేది. అంత ధృడమైన రెయిలింగ్ నీటి తేమ వల్ల త్రుప్పు పట్టి, సన్నని పోచలుగా మారింది.. రెండు పోచల తీగలా మారి దాని ఆధారముగా గోడకి ఫిక్స్ అయ్యింది. ( ఇది ఫోటో తీయటం మరిచా.. తీసుంటే అది ఏ మేరకు త్రుప్పు పట్టి పాడయ్యిందో తేలికగా తెలిసేది. అది గనుక మీరు చూసుంటే అది ఖచ్చితముగా క్రొత్త రెయిలింగ్ ని మార్చాలి అని అనేవాళ్ళు. నేను చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని నాకే నమ్మకం లేక... అలా ఫోటో తీయటం మరిచా. ఎందుకంటే ఇలా నేనెప్పుడూ చెయ్యలేదు. వేరేవారు చెయ్యగా నేనెప్పుడూ చూడలేదు ) దీనికీ చక్కగా సిమెంట్ వేశాను. వేశాక తడి స్పాంజ్ తో ఎక్కువైన  సిమెంట్ ని తొలగించాను. 

వారం రోజులు చక్కని నీటి తడులని ఇచ్చాను. బాగా గట్టిపడిపోయింది. బలముగా నెట్టినా ఏమాత్రం కదలనంతగా గట్టిగా మారింది. దూరం నుండి చూస్తే అది ఆ గ్రిల్ లోని భాగమే అన్నట్లు కుదిరిపోయింది. ఇలా వెయ్యక ముందు అక్కడ నిలబడాలంటేనే భయముగా తోచేది.. ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉండి, నమ్మకముగా ఆనుకొని ఉండేలా మారింది. 


ఇక కొద్దిరోజుల తరవాత వాల్ పుట్టీని లప్పం రేకుతో వేసి, ఎమరీ పేపర్ సహాయాన నునుపు చేసి, రంగు వెయ్యాల్సిన పని మిగిలింది. అదీ త్వరలోనే ముగిస్తాను. అప్పుడు ఈ గ్రిల్ అలా రిపేర్ చేశా అంటే ఎవరూ నమ్మకుండా తయారవుతుంది. క్రొత్త రెయిలింగ్ మాదిరిగా కనిపిస్తుంది. 

చూశారా ! ఎంత ఖర్చుని తప్పించి, తక్కువ ఖర్చులో బాగుచేసుకున్నాను కదూ.. మొత్తం ఖర్చు అంతా ఇరవై Rs. 20 రూపాయలకు మించలేదు.. ఇక వాల్ పుట్టీ, రంగులూ వంద లోపే అయిపోతాయి.. అవీ నేనే వేసుకుంటే. మొత్తానికి నా కాసింత శ్రమ, ఆలోచనతో  పెద్ద ఖర్చుని తొలగించుకున్నాను.

ఈ పద్ధతిని ఆరుబయట ఎండకు ఎండీ, వానకు నానే పాఠక్ / గేట్లు / జాలీ గేట్లు / గ్రిల్స్ కి శుభ్రముగా వాడుకోవచ్చును.


మీకు తేలికగా అర్థం కావటానికి  ఫోటోలు అన్నీ Extra Large మోడ్ లో అప్లోడ్ చేశాను. 

Friday, May 19, 2017

Good Morning - 641


ఇదిగో.. ఇప్పుడే.. 
నువ్వటు వెళ్ళావో లేదో - 
నా మనస్సంతా ఏదో చెప్పలేని వెలతి, 
అంతా శూన్యం.. 
భరించలేని శూన్యం.. 


Tuesday, May 16, 2017

Repairing of Cheppal Stand

మొన్న ఖాళీగా ఉన్నప్పుడు - ఇల్లు సర్దుతూ ఉంటే మూలన ఉన్న చెప్పుల స్టాండ్ Cheppal stand కనిపించింది. దాని ఒక కాలు నీటి తేమ వల్ల తుప్పు పట్టి విరిగిపోయింది. ఇదే స్టాండ్ ని గతం లో ( 2012 సం.) బాగు చేసుకొని, రంగులు వేశాను. అదెలా చేశానో ఈ బ్లాగ్ పోస్ట్ లో http://achampetraj.blogspot.in/2012/01/blog-post_07.html లో వివరముగా వ్రాసాను. అప్పుడు తరవాత ఇన్నాళ్ళకు ఇప్పుడు పని పెట్టింది. ఒక మామూలు ఇనుప చెప్పుల స్టాండ్ ఇన్ని సంవత్సరాల కాలం పనిచెయ్యడం చాలా గొప్ప విషయమే.. బహుశా నేను దాన్ని 2008 - 2009 లో కొని ఉండొచ్చు. అంతగా గుర్తులేదు. 

ఇప్పుడు ఒక కాలు విరిగి - కదులుతూ పైన పెట్టిన చెప్పుల జతలు పడిపోవటం మొదలెట్టాయి. అయినా దాన్ని చెత్తలోకి పారెయ్యటం నాకు మనసొప్పలేదు.. ఇంకొంత కాలం దాని సేవలని పొందాలనిపించింది. బాగు చేసుకోవాలని అనుకున్నాను. కొద్దిసేపు ఆలోచిస్తే చాలా తేలికైన పరిష్కారం కనిపించింది. అది చాలా తక్కువ ఖర్చులో చేసుకోనేదిగా ఉంది. కేవలం 10 - 20 రూపాయల్లో అయిపోతుంది. ఇది గనుక సక్సెస్ ఐతే మరో ఐదేళ్ళు తేలికగా పనిచేస్తుంది అనిపించింది. చెప్పుల స్టాండ్ మరొకటి రెండొందలు పెట్టి కొనొచ్చు, కానీ 10 - 20 రూపాయల్లో బాగయ్యి, మరింతకాలం ఉపయోగానికి వస్తుందీ అంటే ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా.. అదీ చాలా తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తక్కువ శ్రమ వల్ల. చూద్దాం ఈ ప్రయత్నం చేసి చూద్దాం అనుకున్నాను. బాగయితే వాడుకుందాం.. లేకుంటే చెత్తలోకి పంపడమే.. ఒకసారి ట్రై చేస్తే - నాకున్న సాంకేతిక నైపుణ్యాన్ని మరింతగా అప్డేట్ చేసుకున్నట్లూ అవుతుంది కదా.. అని అనుకున్నాను. 

ముందుగా స్టాండ్ ని బయట పెట్టి శుభ్రం చేసాను. ఇలా ఈ క్రింది ఫోటోలో ఎర్రని వృత్తాల వద్ద చూపిన చోట్ల తుప్పు పట్టి పాడయ్యింది. ఒక రంధ్రం పడింది, ఒక కాలు విరిగింది. నిజానికి ఇలా జరగకుండా చెయ్యటానికి ఒక మార్గం ఉంది. అదేమిటంటే - ఆ స్టాండ్ ని బిగించే ముందు ఆ పైపుల్లో ఎనామిల్ పెయింట్ గానీ, వేడి చేసిన క్రొవ్వొత్తి మైనం గానీ పోసి, లోపల ఒక పూతలా చేస్తే చాలు. కానీ అంత ఓపిక ఎవరికి ఉంది? తక్కువ ఖర్చులో మరొక స్టాండ్ వస్తుంది కదా.. అనుకొని ఆ ఆలోచనని అమలు చెయ్యరు.. ఇప్పుడు నేను బాగుచేసుకున్న పద్ధతిని చూద్దాం.  

ముందుగా ఆ స్టాండ్ కాళ్ళు దూరేంతగా వెడల్పు ఉన్న ప్లాస్టిక్ పైపుని వెదికాను. ఒకరివద్ద కనిపించింది. వారు దాన్ని వృధాగా పడేశారు. ఒకరికి వృధా అన్నది మరొకరికి అవసరం. అది PVC పైపుల్లో హెవీ గేజ్ ది. ఇప్పుడు క్రొత్తగా నిర్మించే ఇళ్ళకు వాడే వాటర్ పైపులు అయితే మరింత ధృడంగా ఉంటాయి. హెవీ గేజ్ Heavy gauge అంటే - పైపు గోడలు మందముగా / లావుగా ఉంటాయని అర్థం. ఆ పైపుని తీసుకోచ్చేసి, ముందుగా ఒక కాలు సైజు తీసుకొని, ఆ సైజుకి హెక్సా బ్లేడ్ సహాయన కోశాను. అదే సైజుని ప్రామాణికముగా పెట్టుకొని, ఈ క్రింది విధముగా పెట్టి, మరో మూడు కాళ్ళు కోశాను. వాటి అంచులని, వెలుపలి భాగాల్ని ఎమరీ పేపర్ / సాండ్ పేపర్ మీద రుద్ది నునుపు / శుభ్రం చేశాను. 


ఇపుడు ఆ స్టాండ్ ని ఒక పేపర్ మీద తిరగేసి పెట్టి, పైకి వచ్చిన కాళ్ళకి ఆ పైపులని తొడిగాను. ఒక గిన్నెలో కాస్త సన్నని ఇసుక + సిమెంట్ ని జారుడుగా కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ గరాటు తీసుకొని ఆ ప్లాస్టిక్ కాలులో పెట్టి, అందులోకి ఈ సిమెంట్ మిశ్రమాన్ని పోయాలి. బాగా కుదురుకోనేందుకు ఒక సన్నని స్క్రూ డ్రైవర్ తో లోపలికి అదమాలి. అలా ఆ కాలులో నిండుగా సిమెంట్ వేసుకోవాలి. ( క్రింది ఫోటోని చూడండి ) ఇలా స్టాండ్ నాలుగు కాళ్ళలో వేసుకోవాలి. సిమెంట్ వేశాక ఎలా ఉంటుందో మరొక కాలుని ఫోటోలో చూడండి. 


ఆ తరవాత ఆ సిమెంట్ మిశ్రమం గట్టి పడ్డాక - కారిన సిమెంట్ మిశ్రమాన్ని హెక్సా బ్లేడ్ తో గీసేసుకోవాలి. 
ఒక తడి స్పాంజ్ తో తుడిచినా శుభ్రమవుతుంది. ఇది జాగ్రత్తగా చెయ్యాలి. 
ఎందుకంటే లోపల పోసిన సిమెంట్ మిశ్రమం గట్టిపడలేదు. పౌడర్ లాగే ఉంటుంది.
అందువల్ల కదిపితే పగుళ్ళు వచ్చి, ఎక్కువ కాలం నిలబడదు. 
రెండు మూడు సార్లు నీటి తడి ఇవ్వాలి. అప్పుడు కాస్త గట్టి పడుతుంది.
అలా తడి ఇచ్చాక ఆ స్టాండ్ ని మాములుగా పెట్టుకోవాలి. 
ఆ తరవాత నాలుగు ప్లాస్టిక్ గ్లాసుల్ని తీసుకొని, వాటిల్లో ఈ సిమెంట్ పోసిన స్టాండ్ కాళ్ళని పెట్టాలి. 
ఆ గ్లాసుల్లో నీటిని పోయాలి. ( మన్నించాలి.. ఈ ఫోటోని తీయడం మరిచాను ) 
ఇలా కొన్ని రోజులు ఉంచాలి. 
ఇలా చేస్తే ఆ సిమెంట్ మిశ్రమం చాలా గట్టిగా తయారవుతుంది. 
ఆ తరవాత మామూలుగానే ఆ స్టాండ్ ని వాడుకోవచ్చు. మరింత ఎక్కువ కాలం వస్తుంది. 
పైపులు ఊడిపోయినా, సిమెంట్ రాడ్ లా ఉంటుంది. 
ఈ సిమెంట్ వేసేటప్పుడు GI / ఇనుప వైర్ ముక్క అందులో పెట్టి, 
సిమెంట్ వేస్తే - పగుళ్ళు వచ్చినా గట్టిగా ఆపుతుంది. 
ఇంతే.. 
ఆ స్టాండ్ ని మరో ఐదేళ్ళు లేదా ఇంకా ఎక్కువ కాలం నిరభ్యంతరముగా వాడుకోవచ్చును. 


Related Posts with Thumbnails