Saturday, August 31, 2013

Good Morning - 438


చదువు క్రమశిక్షననను అలవారుస్తుంది. 
చూపుని విశాలం చేస్తుంది. 
చదువుకున్న పౌరులు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు. కట్లు తెంపుకోవడానికి కత్తిలాంటి ఆయుధం చదువోక్కటే. 

Friday, August 30, 2013

Good Morning - 437


నీతో ఏ బంధమూ లేని అనుబంధం నాది.. అయినా అన్ని బంధాల కంటే అపురూపమైనది. 

మనం ఎవరికీ వారిమి, వేరుగా ఉన్న మనం ఏదో అనుకోని పరిస్థితుల్లో కలిశాం.. బంధం ఏర్పడింది. అయినా ఆ బంధం ఈ జగాన ఉన్న బంధాల కంటే ప్రత్యేకమైనది.. అందమైనది. 

Thursday, August 29, 2013

Good Morning - 436


జీవితం ఒక ఆట - ఆది గెలువు. 
జీవితం ఒక ప్రయాణం - కొనసాగించు. 
జీవితం ఒక యుద్ధం - పోరాడి గెలువు. 
జీవితం ఒక బహుమానం - స్వీకరించు. 
జీవితం ఒక రహస్యం - పరిశోధించు 
జీవితం ఒక నాటకం - నీ పాత్రని ప్రదర్శించు. 
జీవితం ఒక చాలెంజ్ - ధైర్యముగా ఎదుర్కో. 
" జీవితములో ఎన్నిసార్లు ఓడిపోయినా, 
గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. " 
వెనకడుగు వేయకు - ముందడుగు వేసి ఆగకు. 

Wednesday, August 28, 2013

Good Morning - 435


ఏదైనా మంచి పనిని క్రమశిక్షణతో, చిత్త శుద్ధితో, పట్టుదలతో చెయ్యటానికి సంకల్పం ప్రధానం. అంటే ముందుగా మనం దేనిని నేర్చుకోవాలో నిర్ణయించుకొని, ఆ తరవాత అందుకు అవసరమయ్యే సాధన మార్గాలని ఎంచుకోవాలి.
అభ్యాసం చెయ్యాలంటే - వైరాగ్యం అవలబించాలి. అన్నింటినీ క్షణికాలుగా భావించాలి. ఈ భావన ఒక్కసారిగా రాదు. పదే పదే మననం చేసుకుంటూ మనస్సుని ధృడపరచుకోవడమే అభ్యాసం. 

Tuesday, August 27, 2013

Good Morning - 434


నీవు నా ఊపిరి అయినట్టు, 
నా లోపల ఉన్నట్టు, 
ఏదో చెబుతున్నట్టు, 
ఏవో కలలు.. 

Monday, August 26, 2013

Good Morning - 433


జీవన వికాసం లో - ఒక స్నేహం ఒక పరిమళ భరిత అనుభవం. ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నామంటే మనకు విశాల మనస్థత్వం ఉన్నట్లే..! 

ఈ సృష్టిలో తీయనైనది స్నేహమే.  మన జీవన వికాసములో - స్నేహం అనేది ఒక సుగంధ పరిమళమైన అనుభవం. మంచి స్నేహం వద్ద ఉంటే మీకు ఆ చక్కని పరిమళం మిమ్మల్ని అక్కడి నుండి కదలనీయదు. అలాగే ఇంకా ఆస్వాదిస్తూ ఉండిపోవాలని అనుకుంటాం. అలా మనం ఆ స్నేహ సుగంధాన్ని పీలుస్తున్నాం అంటే - మనలో అందరినీ దగ్గరికి చేర్చుకొనే విశాల హృదయం మనకి ఉన్నట్లే.. 

Sunday, August 25, 2013

Good Morning - 432


నిజమైన స్నేహితుడు మనం పాపకార్యాలు చేస్తుంటే చేయ్యనివ్వడు. అలాగే మన రహస్యాలని బయటకి పొక్కనివ్వడు. మన కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళలేడు. డబ్బులేక బాధ పడుతుంటే సహాయం చేస్తాడు, కాపాడుతాడు. 

నిజమైన స్నేహితుడికి తగిన నిర్వచనం ఇది. అలాంటి స్నేహితుడు కనుక మీకు ఉంటే ఎన్నడూ వదులుకోకండి. అలాంటి స్నేహితుడి వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. 

Saturday, August 24, 2013

Good Morning - 431


మిమ్ములని  మీరు గౌరవించుకుంటేనే ప్రపంచం మీకు గౌరవాన్ని ఇస్తుంది. మనం ఎవరికీ తక్కువ కాదు. 

అవును.. మనల్ని మనమే - నేనో వెధవని, దుర్మార్గున్ని, పిచ్చోడిని అని పడే పడే పది మంది ముందట అంటూ ఉంటే, అవతలి వారిలో మన పట్ల ఒక చులకన భావం ఏర్పడుతుంది. అప్పుడు మీకు దక్కే గౌరవం తగ్గి, మిమ్మల్ని పట్టించుకోకపోవడం జరుగుతుంది. అలాని మిమ్మల్ని మీరు అతిగా గౌరవించుకున్నా అపహాస్యం పాలవుతారు. 

Friday, August 23, 2013

Good Morning - 430


ప్రతి మనిషీ గెలవడానికే పుడతాడు. అయితే చేసే ప్రయత్నాల మీద గెలుపు అన్నది ఆధార పది ఉంటుంది. కాబట్టి గెలదానికి ప్రయత్నించండి. గెలిచి చూపించండి. 

Thursday, August 22, 2013

Good Morning - 429


|| దీపం జ్యోతి: పరబ్రహ్మం, దీపం సర్వ తమోపాహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే || 

" దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. దీపం అన్ని విధములైన చీకట్లను, తొలగిస్తుంది. దీపారాధన అన్నింటినీ సాధించి పెడుతుంది. అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను.." అని పై శ్లోకానికి అర్థం. 

Wednesday, August 21, 2013

Good Morning - 428


నీవు నా ఊపిరి అయినట్టు, 
నాలోపల ఉన్నట్టు, 
ఏదో చేబుతున్నాటు.. 
ఏవో కలలు. 

Tuesday, August 20, 2013

Good Morning - 427


మన స్నేహం ఒకరిని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. అనుమానాలు, అపార్థాలు, శాపనార్థాలతో ఉంటే ఆ స్నేహం నిజముగా బాధాకరమే. ఆ బాధ వర్ణనాతీతమే.. ఆ స్నేహాన్ని వదులుకోలేము.. కొనసాగించనూ లేము.. 

మనం ఈ సృష్టిలో - ఎవరితోనైనా స్నేహం చేస్తుంటాం. అవతలి వ్యక్తి ఆడే కానీ, మగనే కానీ. అభిరుచులు, అభిప్రాయాలు కలుసుకోగానే పరిచయం కాస్తా - స్నేహం గా మారుతుంది. ఈ స్నేహం లో ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యా అనుమానాలు. అపార్థాలు, తిట్లతో ఉంటే ఆ స్నేహం ఎప్పుడూ బాధాకరముగానే ఉంటుంది. అప్పుడు ఆ బాధని వర్ణించలేము. మనిషి లోలోన క్రుంగిపోతాడు. ఎంత చెప్పుకున్నా, ఎవరెంత ఓదార్చినా ఆ బాధ తీరదు. ఆ బాధ తీరాలంటే - అవతలి మిత్రుడు మాత్రమే తీర్చగలడు. ఇలాంటి అనుమానాలు, అపార్థాలతో ఉండే స్నేహం ని ఇటు వదులుకోలేము. అటు కొనసాగించనూ లేము. 

Monday, August 19, 2013

Good Morning - 426


నిన్ను ఎవరు ఏమన్నారన్నది ముఖ్యం కాదు. వారన్నదానికి నువ్వెలా స్పందించావన్నడి ముఖ్యం. కొన్నిసార్లు తప్పుకొని, వెళ్ళిపోవడం కంటే, నిలబడి నవ్వడం మంచి ఫలితాన్నిస్తుంది. ! 

అవును.. ఎవరో ఏదో హేళన చేశారు అంటే - అదేదో తప్పు చేసినట్లు ఫీల్ అవకూడదు. నిజమెంతో గ్రహించాలి. ఒక్కోసారి వారి హేళన మనల్ని బాధపెడితే, మొహం చాటు చెయ్యకుండా ఎదురుగా నిలబడి నవ్వడం గానీ / సమాధానం ఇవ్వటం గానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. 

ఒకసారి ఒక పేజీలో నా ఈకార్డ్ ని పోస్ట్ చేశాను. దానికి ఒకతను - ఇలా అసహ్యముగా చేస్తారా ? అని వెధవ కామెంట్ పెట్టాడు. నిజానికి నేను చేసేవన్నీ M S Paint లోనే. కాబట్టి ఎక్కువ ఆర్టిస్టిక్ గా చెయ్యటం కుదరదు. ఫోటోషాప్ లో అయితే ఇక అత్యద్భుతమే. కానీ అంత సమయం ఎందుకులే అని ఎమ్మెస్ పెయింట్ లోనే చేస్తున్నాను. అలా కామెంట్ వచ్చాక, గడవ కాకుండా ఏమీ మాట్లాడకుండా వెళ్ళి పోవాలనుకున్నాను. కానీ తన ప్రతిభ ఏమిటో తెలుసుకుందామని, " మీరు ఒకటి చేసి చూపిస్తే సంతోషించి, ఎలా చెయ్యాలో నేర్చుకుంటాను.. " అని జవాబు ఇచ్చాను. తను మరుసటి రోజున ఒక ఈ కార్డ్ పోస్ట్ చేశాడు. అన్నీ అక్షరాల తప్పులే. ఫాంట్ సెలెక్షన్ కూడా డిఫాల్ట్ ఫాంట్ యే వాడారు. అలాగే ఫాంట్ కలర్, సైజూ మారాలి. చూసి, ఇంతేనా అనుకున్నాను కానీ నేనేమీ కామెంట్ చెయ్యలేదు. అంతలోగా వేరేవారెవరో కామెంట్ పెట్టారు.. " ఏమి నాయనా ? చేయ్యకరాకపోతే చెయ్యకు.. ఇలా మమ్మల్ని హింసించకు.. " అనీ.. 

ఇంకో నా ఆన్లైన్ మిత్రుడు తో : నేను ఒక కామెడీ గ్రూప్ లో పెట్టిన ఫొటోస్ కి తమాషా కామెంట్స్ పెట్టడం చేసేవాడిని. నా కామెంట్స్ నచ్చక పోతే ఊరుకుంటే ( అప్పటికే మెచ్చుకోలుగా ఎన్నో లైక్స్ వచ్చాయి వాటికి ) సరిపోయేది.. కానీ ఊరుకోక, ఇలా కామెంట్స్ పెడితే నవ్వు రాదుకదా అపహాస్యం పాలవుతారు అని అందరి ముందూ పబ్లిక్ గా కామెంట్ పెట్టేశాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. ఊరుకుందాం అంటే అందరి ముందూ విలువ తక్కువ. ఏమి చెయ్యాలో తెలీక - " ఎలా పెట్టాలో మీరు గనుక చూపిస్తే, అలాగే ఫాలో అవుతాను .." అని అన్నాను. దానికి అతను రెచ్చిపోయి, చాలా వాటికి కామెంట్స్ పెట్టాడు. అవన్నింటినీ చూశాను. ఒకరోజు తరవాత కూడా చూస్తే అతను పెట్టిన కామెంట్స్ కి ఒక్క లైక్ కూడా రాలేదు. ఇలా ఒక్కోసారి ఎదిరిస్తే - వారికీ పరిస్థితులు అనుభవం లోకి వస్తాయి. 

Sunday, August 18, 2013

Good Morning - 425


దేవుని కంటే ముందు మనిషికి అతడి జీవితం కరునించాలి. జీవితం అతడికి ఆ అవకాశం ఇవ్వాలి. జీవితం చాలా విలువైనది. జీవితం భగవంతుడి వరప్రసాదం. చక్కగా జీవించాలి. జీవితాన్ని ప్రతిక్షణం ఆనందమయం చేసుకోవాలి. నిజమైన ఆనందాన్ని కనుగొనాలి. జీవిత పుష్పం సృష్టికర్త తోటలో పరిమళాలు గుభాలించాలి. 

Saturday, August 17, 2013

Good Morning - 424


జీవితం ఏదిస్తుందో దాన్ని సంతోషముగా స్వీకరించు.. ఎందుకంటే - జీవితం ఒక్కసారిగా తీసుకోవడం అంటూ మొదలు పెట్టింది అంటే , అది నీ ఆఖరి శ్వాసని కూడా నిర్దాక్షిణ్యంగా తీసుకొంటుంది. 

జీవితం ఏదిస్తుందో దాన్నే సంతోషముగా స్వీకరించకతప్పదు. మనం కోరుకున్నవాటిని మనం పొందగలమేమో కానీ అప్పుడు కూడా జీవితం దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడుతుంది. మొత్తానికి మన చేతుల్లో ఏమీ ఉండదు. ఎలా సాగిపోతే, అటు సాగిపోవాల్సిందే. ఏదో చెయ్యాలని అనుకుంటాం. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం. ఒక్కోసారి కుదరవు. అలాంటప్పుడు ఈ భావన అర్థం అవుతుంది. అదే జీవితం ఒక్కోసారి నిర్ధాక్షిణ్యంగా మన నుండి తీసుకోవడం మొదలు పెడుతుంది. అలా తీసుకోవడం కూడా మనకేమీ కనిపించనంతగా, కానీ చుట్టూ మార్పులు జరిగిపోతూనే ఉంటాయి. ఇలా తీసుకోవడం అంటూ మొదలు పెడితే - అది తీసుకొనే ఆఖరి యత్నం మన శ్వాస అయి కూడా ఉండొచ్చును. కనుక తస్మాత్ జాగ్రత్త. 

Friday, August 16, 2013

Good Morning - 423


ఎప్పుడూ మన మనసు చెప్పిన దారిలోనే సాగిపోవాలి. ఏ దారిలో వెళ్తున్నా, ఎన్ని అవరోధాలు వచ్చినా పట్టుదలను మాత్రం వదలకూడదు. సాధించడంలో ఉండే ఆనందం ఇంకెందులో ఉంటుంది. ? 

అవును.. మన మనసు చెప్పిన దారిలోనే సాగిపోవాలి. ఒకవేళ వెళ్ళే దారి సరియైనదైతే - ఆ గొప్పదనం మీకే వస్తుంది. ఒకవేళ అది తప్పుడు దారి అయితే - మీరే ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎక్కువగా బాధించదు. ఏది ఏమైనా మనలోని పట్టుదలని మాత్రం విడిచి పెట్టకూడదు. ఒక నిర్ణయం తీసుకున్నాక, ఆ దిశగా మనం వెళుతున్నపుడు, ఆ సమస్యని సాధించడం లోని ఆనందం ఒకసారి చవి చూస్తే చాలు.. అలాంటి విజయాలు మరెన్నో రావాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. అదే ఆ విజయాలలోని ఆనందం. ఆ తృప్తి ఇచ్చిన ఆనందం మరేదీ ఇవ్వలేదేమో..

Thursday, August 15, 2013

Good Morning - 422


నీలో ఏదో తక్కువ అని చిన్నప్పుడు ఎవరో నీకు చెప్పి ఉంటారు. వయసుతో పాటు అదీ పెరిగి ఉండొచ్చును. ఆ బరువు తగ్గించుకుంటే నీ మనసు తేలిక అవుతుంది. 

ప్రతివారూ ఎదుటివారికి ఏదో నీతులు చెబుతూనే ఉంటారు. అది మానవ సహజం. వారు చెప్పిన లోపాలు మనలో ఉన్నాయో, లేవో నిజాయితీగా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే వాటిని మార్చుకోండి. లేకుంటే నవ్వేసి ఊరుకోండి. వాదన పెట్టేసుకోకండి. వాదన వల్ల పని జరగదు. కొన్ని మాటలు చిన్నప్పుడు విన్నా అవి, వయసుతో బాటూ మనలోనే ఉంటూ మన నీడలా మారుతాయి. అంటే - ఆ విషయం మనం పెద్దయ్యాక కూడా వెంటాడుతునే ఉంటుంది అన్నమాట. అలాంటి మాటలు ఏమైనా ఉంటే తగ్గించుకోండి. అలా చేస్తే - మీ మనసు మీద పడిన వత్తిడి కొద్దిగా తగ్గే ఆస్కారం ఉంటుంది. 

Wednesday, August 14, 2013

Good Morning - 421


నీవు ఎంత బాధను అనుభవిస్తావో, అంతగా మానసికముగా ధృడమౌతావు. 

Tuesday, August 13, 2013

Good Morning - 420


సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చును. కానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం కోల్పోతే మాత్రం తిరిగి సాధించుకోలేము.. 
అందుకని నీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. 

Monday, August 12, 2013

Sunday, August 11, 2013

Good Morning - 418


నిన్ను నీవు అద్దములో చూసుకో.. 
నీకు ఆత్మ విశ్వాసం వస్తుంది. 
ఎదుటివారి మనసుని అర్థం చేసుకో..
చక్కని బంధం ఏర్పడుతుంది. 

Saturday, August 10, 2013

ఏదీ శాశ్వతం కాదు.


మొన్న అలా బయటకి వెళ్ళి వస్తున్నప్పుడు - రోడ్డు వారగా అడ్డముగా కొట్టేసిన రావి చెట్టు మొదలు కనిపించింది. ఈ ఫోటోలోని ఆ చెట్టు మొదలు వేసవి కాలములో దారికి అడ్డముగా వస్తున్నదని కొట్టేశారు. ఆ రావి చెట్టు మొదలు చూశారు కదూ. ఎంత లావుగా, పెద్దగా ఉందో.. 

అలాంటి ఆ చెట్టు మొదలుకి ఒక నన్ను ఆశ్చర్య పరిచిన విషయం ఒకటి జరిగింది. మొన్న కురిసిన భారీ వర్షాలకి ఆ ఎండిపోయిన చెట్టు మొదలు లోంచి, ఒక చిన్న మొలక రావటం ఆశ్చర్య పరిచింది. అంతగా ఎండిపోయిన చెట్టు లోంచి ఎలా ఆ మొలక మొదలయ్యిందా అనుకున్నాను బహుశా ప్రక్కన పడ్డ విత్తనం నుండి ఆ మొలక ఏమో అనుకున్నాను. కానీ కాదు.. 

ఆ చెట్టు మొదలు నుండి ప్రక్కగా మొలిచింది. కొద్దిగా సంభ్రమం. కాసేపటి తరవాత ఒక జీవిత సత్యం కనిపించింది. 

ఇక రాదు, ఇక అంతా అయిపోయినట్లే అనుకున్న సమయాన కూడా క్రొత్త ఆశలు వచ్చి, మళ్ళీ సజీవం గా చేస్తాయి. 
Friday, August 9, 2013

Good morning - 417


నీవు ఎంత బాధని అనుభవిస్తావో, 
అంతగా మానసికముగా ధృడమౌతావు. 

Thursday, August 8, 2013

Good Morning - 416


ఈ ప్రపంచములో కనీసం ఐదుగురు నీ గురించి రోజుకి క్షణమైనా తలచుకుంటారు. 
నలుగురు నిన్ను ప్రేమిస్తారు. 
ముగ్గురు నీ ప్రతిభని మెచ్చుకుంటారు. 
ఇద్దరికీ నీ చిరునవ్వు గుర్తొస్తూ ఉంటుంది. 
ఒకరు నీ గురించి, ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడి ఉంటారు. 

Wednesday, August 7, 2013

Good Morning - 415


ఇవ్వడం అంటే ఏదో ఇచ్చాం - అని అనుకోవడం కాదు. దాని ద్వారా అవతలివారి జీవితాన్ని స్పృశించడం. 

ఏదైనా ఒకదాన్ని ఒకరికి ఇస్తున్నాం అంటే - అది వారికి ఖచ్చితముగా ఉపయోగపడి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ ఇవ్వటం వారికి మేలు చేస్తుంది. అలా మేలు చేసిన నాడు - వారికి ఒక చక్కని ఉపయోగకరమైనది ఇచ్చాం అన్న తృప్తి మనకీ, తీసుకున్న వారికీ బాగుంటుంది. ఒక హాకీ క్రీడాకారిణికి - ఆర్థిక పరిస్థితుల వల్ల చక్కని షూస్ కొనే స్థోమత లేనప్పుడు, మనం ఆ షూష్ ని కొనిస్తే, వారికి ఉపయోగపడటమే కాదు, వారి క్రీడా జీవితం మరింత అభివృద్ధి అయ్యేలా సాయం చేస్తున్నాం అన్నమాటే.. 

Tuesday, August 6, 2013

Good Morning - 414


తమని తాము గౌరవించుకోలేని వారిని, ఇతరులు కూడా గౌరవించరు. 

అవును.. మనల్ని మనమే - నేనో వెధవని, పిచ్చివాడిని, పనికిరానివాడిని, బేకార్ గాడిని.. అంటూ మనల్ని మనమే కించపరుచుకుంటుంటే ఇక ఇతరులు మనకి ఎందుకు గౌరవం ఇస్తుంటారు ? మనకి మనం - మాన్ విలువని తక్కువ చేసుకుంటూ మాట్లాడితే - మిగిలిన వారూ మనల్ని అలాగే భావించుకుంటారు. అంతవరకూ ఆగితే బాగుండును.. ఇతరుల ముందు మిమ్మల్ని - మ్వీరు పిచ్చోళ్ళు, వెధవ, బేకార్ గాడు.. అంటూ మనల్ని ఉద్దేశ్యించి మాట్లాడితే - మనం ఏమైనా అడ్డు చెప్పినా, ఇందాక నీవే ఒప్పుకున్న మాటలే కదా అంటుంటారు. అలా అందరి ముందు చులకనవుతుంటాం..

Monday, August 5, 2013

Good Morning - 413నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు.. ఎవర్ని ముంచకుండా బతికితే చాలు..!!


Sunday, August 4, 2013

Good Morning - 412


చేతులంటూ ఉంటే - గభాలున పైకి లేచి, - ఎదిగిన నా మానస పుత్రి మొక్కని గాడంగా కౌగిలించుకోనే దాన్ని.. అని అనుకుంటుంది ధరిద్రి. 

Saturday, August 3, 2013

Good Morning - 411


నా దృష్టిలో - 
స్వసుఖం గురించి ఆలోచించేది స్వార్ధం. 
పరుల సుఖం గురించి ఆలోచించేది స్నేహం. 
అలాంటి స్నేహం ఒకరితో అయినా చేస్తేనే జీవితానికి అర్థం. 
నాకు లభించే వారందరూ అలాంటివారే కావటం నా పూర్వ జన్మ సుకృతం.. 

Friday, August 2, 2013

రెండు దశాబ్దాల తరవాత కలసిన మిత్రుడు.

ఆమధ్య మా వరంగల్ మితృడి దగ్గర నుండి ఫోన్ కాల్. తన అమ్మాయి పెళ్ళి, తప్పకుండా సకుటుంబ సమేతముగా రావాలని ఆహ్వానం. " సరే.." అన్నాను.

" నీ అడ్రెస్ కి కార్డ్ పంపిస్తున్నాను.. అడ్రెస్ అదే కదా.. మారలేదు కదా.! తప్పక రావాలి. మరచిపోవద్దు. నేను బిజీగా ఉంటాను ఆ సమయాన.. మళ్ళీ రిమైండ్ చెయ్యలేదు అని అనకూడదు.." అన్నాడు.

" సాధ్యమైనంత వరకూ ప్రయత్నిస్తాను.. చివరి నిమిషాన ఏమైనా అయితే చెప్పలేను.." అన్నాను.

" అలాని కాదు.. తప్పక రావాలి. మన పాత మిత్రులూ వస్తున్నారు.. అందరమూ కలిస్తే - గెట్ టూ గెదర్ లా ఉంటుంది.. రావడానికి తప్పక ప్రయత్నించు.. " అని ఫోన్ పెట్టేశాడు.

సరే అన్నాను. కానీ చాలా దూరం. ఎలా? అనుకున్నాను. ఇంట్లో అడిగా. వెళదాం. లాంగ్ డ్రైవ్ వెళ్ళక చాలా రోజులయ్యింది అనీ. చివరకు వెళ్లటం ఓకే అయ్యింది. మధ్యలో బంధువుల ఇంట్లో విశ్రాంతి తీసుకొని, వేకువ ఝామున్నే బయలుదేరాం. దారి అంతా GPS ద్వారా చూసుకున్నాం. అప్పటికి ఎవరూ అతిధులు రాలేదు. మా ఫ్రెండ్ కుటుంబం తప్ప ఎవరూ లేరు.


తను ఎక్కడ ఉన్నాడో అని కాల్ చేశా.. తను పందిరి వద్ద ఉన్నాడు ట. నేనప్పుడు బయట ఉన్నా. తనూ బయటకి, నేను లోపలి వేరు వేరు దారుల్లో వెళ్ళాం. కనుక కలుసుకోలేదు. మళ్ళీ కాల్ చేస్తే, అక్కడే ఉండమని చెప్పి, వచ్చి కలిశాడు. గట్టిగా హత్తుకున్నాం. ఒక పొట్ట తప్ప తానేమీ మారలేదు. అదే తీరు.. మాటా. క్లాస్ మేట్స్ గా దూరమయ్యాక జీవిత గమనములో వచ్చిన హోదా ఏమిటో చూపిస్తాడేమో అనుకున్నాను. కానీ అదేమీ లేదు. చాలా మామూలుగా కాలేజీలో ఎలా ఉండేవాడో అలాగే ఉన్నాడు. ఎక్కడా హోదా, ఈగో, దర్పం.. చూపలేదు.

కళాశాల చదువులప్పుడు పరిచయం. బాగా చదివేవాడు. ఇద్దరమూ బాగా చదివే వారం. చాలా డిగ్నిటీగా, హుందాగా, పక్కా జెంటిల్ మన్ గా అప్పటి నుండే ఉండేవాడు. చనువు అంతగా లేకున్నా బాగా మాట్లాడుకునేవాళ్ళం. కాలేజీ చదువుల చివర్లో బాగా కలిసిపోయాం. పరీక్షలు అయ్యాక అడ్రెస్ లు తీసుకొని, వీడుకోలు తీసుకున్నాం.

ఆ తరవాత మధ్య మధ్య ఎప్పుడో సంవత్సరానికో, రెండు సంవత్సరాలకి ఒకసారో - ఒకసారి కాల్ చేసుకోనేవాళ్ళం కానీ, ఎన్నడూ ఎదురు కాలేదు. తనకైతే కళాశాల నుండి బయటకి రాగానే పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఎనిమిది నెలల్లో పెళ్ళి అయ్యింది. కొన్ని ఆనివార్య కారణాల వల్ల ఆ పెళ్ళికి నేను వెళ్ళలేదు.. మిస్ అయ్యాను. నా పెళ్ళికి వచ్చాడు.

ఇప్పుడు తన అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం. కాలం చాలా తొందరగా గడిచిపోయినట్లుగా ఉంది. ఈసారి తప్పక వెళ్ళాలి అనుకున్నాను. వెళుతూ సకటుంబ సపరివారముగా వెళ్లాను. ప్రొద్దున్నే బయలుదేరి వెళ్లాను. కలిశాను. చాలా కాలము తరవాత అంటే దాదాపు రెండు దశాబ్దాలు తరవాత - మళ్ళీ కలిశాం. ఇంతకాలం తరవాత మేము కలుసుకోవడం నమ్మశక్యముగా అనిపించలేదు అప్పుడు.

తానేమీ మారలేదు.. కాస్త పొట్ట పెరిగింది అంతే. మాకు చక్కని ఆతిధ్యాన్ని ఇచ్చాడు. తను పెళ్ళి బీజీలో ఉన్నప్పుడు మేము తనకి చెప్పి, భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్ళాం. అంత బీజీగా ఉండి కూడా మాకోసం కాల్ చేశాడు. నేను చూసుకోలేదు. తరవాత చూసుకున్నా. అంత బీజీలో కూడా ఫోన్ చేశాడూ అంటే మా పట్ల ఎంత కన్సర్న్ చూపాడో అనుకున్నాం. తరవాత భోజనాలు అయ్యాక, తను ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వేయిస్తంభాల గుడికీ వెళ్ళాం.

రాత్రి మా బంధువుల ఇంటికి మేము వెళ్ళాం. కానీ మా మిత్రుడు వారింటికి రమ్మని చెప్పాడు - మా ఇంటికి వచ్చేయ్.. కాస్త కులాసాగా మాట్లాడుకుంటూ ఉండొచ్చనీ.. పెళ్ళయ్యాక తను కాస్త రిలాక్స్ గా ఉంటాడేమో గానీ, బాగా అలసిపోయి ఉంటాడు. కాసింత రెస్ట్ తీసుకోమన్నట్లు - మేమే వెళ్ళలేదు.

మరుసటి రోజున - మేము రామప్ప టెంపుల్ కి వెళ్ళాం. అక్కడ నుండి వచ్చాక మళ్ళీ తన దగ్గరికి భోజనానికి రమ్మని. కానీ వెళితే బాగోదు. మాటిమాటికీ వెళ్ళినట్లు ఉంటుందని ఆపాటికే తినేశాం అని చెప్పి, వెళ్ళలేదు. మధ్యలో హోటల్ లో ఆ కార్యక్రమం ముగించేశాం. తరవాత వారింటికి వెళ్ళాం.

మాకోసమని ఎదురుచూస్తూ ఉన్నాడు. వియ్యపు వారింట సత్యనారాయణ స్వామి కథకి పిలిచారు వారిని. ఆపాటికే కథ అయ్యింది. కానీ వెళ్ళక మాకోసం అని ఆగాడు. కాసేపు పరిచయ కార్యక్రమాలు అయ్యాక, ఒక గిఫ్ట్ ఇచ్చాడు. గుర్తుగా ఒక ఫోటో దిగాను.

ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగితే, షాపింగ్ చెయ్యాలి అని అంటే - నేను వెంట రాలేను కానీ మీకు అన్నీ అయ్యేలా చేస్తాను.. మీకు ఏమేమి కావాలి? అని అడిగి, వెంటనే తనకి తెలిసిన అతనికి ఫోన్ చేసి రప్పించాడు. ఆరోజు ఆదివారం షాప్స్ బంద్ అయినా - తనతో షాప్ ఓపెన్ చేయించి, మేము షాపింగ్ చేసేలా చేశాడు. ధరలు తక్కువగా తీసుకొని, మధ్య మధ్య ఫోన్ చేస్తూ, ఆ అబ్బాయికి చెప్పాడు కూడా. అలా మాకు చాలా తక్కువ ధరల్లో షాపింగ్ ముగిసింది.

ఆ రాత్రికి రిసెప్షన్ కి ఉండి, మరుసటి రోజున బయలుదేరమన్నాడు. ఆ రాత్రి కాసింత ఫ్రీగా కలుసుకున్నట్లు, బిజీ వల్ల మాట్లాడుకోలేదు కదా.. మాట్లాడుకున్నట్లు ఉంటుందీ అనీ తన ఆలోచన. కానీ తనకి ఇబ్బంది కలిగించకూడదు అనుకున్నాం. ఇప్పటికే మా పట్ల బాగా శ్రద్ధ చూపాడు. పెళ్ళి పనుల వల్ల తను ఇంకా కొద్దిరోజుల వరకూ బీజీ. డిస్టర్బ్ చెయ్యొద్దు కదా.. కానీ తను మా అవసరాలు చూడటం కోసం, తన కార్యక్రమాలని ఆపుకుంటున్నాడు. అది తెలిసీ, వారి బంధువుల దృష్టిలో మేము చులకన కావొద్దని, త్వరగా తన నుండి వీడుకోలు తీసుకొని బయలుదేరాం. మేము ఇలా వీడుకోలు తీసుకోగానే, తను వారి వియ్యపుడింటికి వెళ్లాడు.

ఇంత వివరముగా ఎందుకు చెప్పానూ అంటే - మా పట్ల అతను చూపిన అభిమానం, ఆసక్తికి మేము ముగ్ధులమయ్యాం. చాలా సంవత్సరాల తరవాత అదీ రెండు దశాబ్దాల తరవాత కలిసిన కూడా, మాకు మర్యాదలకి లోటు చెయ్యకుండా, మాకు అన్నీ సమకూర్చాడు. దానికే నేను కదిలిపోయాను. నిజానికి ఇలా నేను చెయ్యలేనేమో. ఇప్పుడు తనని కలిసినందులకు ఆ మర్యాదలకి నన్ను నేను అప్డేట్ చేసుకున్నాను. నేనూ అంతకన్నా బాగా చూసుకోవాలి అని నిర్ణయించుకొన్నాను.

ఇలాంటి స్నేహితుడిని పొందినందులకు చాలా సంతోషముగా, గర్వముగా ఉంది కూడా.

Thursday, August 1, 2013

Good Morning - 410


నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు.. ఎవరినీ ముంచకుండా బతికితే చాలు.. !!

Related Posts with Thumbnails