mlaana పదాన్ని లెఖినిలో వ్రాయడమెలా?
మీరడిగిన mlaana అనే పదాన్ని లేఖినిలో తెలుగులో ఎలా వ్రాయాలి అని అడిగారు కదా.. అలాగే టైపు చేస్తే ఈ క్రింది - మొదటి తెరపట్టు లాగా వచ్చిందని అనుకుంటున్నాను. ( జూమ్ చేసి ఎర్రని గదుల్లో పెద్దగా అందరికీ కనిపించేలా చేశాను ) కొన్ని కాంబినేషన్ పదాలు టైపింగ్ లో ఇబ్బంది పెడుతాయి.
Showing posts with label Softwares. Show all posts
Showing posts with label Softwares. Show all posts
Sunday, July 29, 2018
Friday, December 9, 2016
New Blogger Dashboard
కొద్దిరోజుల క్రిందట బ్లాగర్ డాష్ బోర్డ్ మారింది. ఇది వీక్షకులకు కనిపించదు. ఈ మారిన డాష్ బోర్డ్ కేవలం ఆయా బ్లాగ్ స్వంతదారులకు మాత్రమే కనిపిస్తుంది. ఒకప్పుడు బ్లాగర్ డాష్ బోర్డ్ ఇలా క్రింద ఫోటోలోలా కనిపించేడిది. దీని క్రింద మనం పోస్ట్ చేసిన పోస్ట్స్ తాలూకు వివరాలు కనిపించేవి. మిగతా వాటన్నింటికీ లోపలికి వెళ్ళి వివరముగా చూడాల్సి వచ్చేది.
ఇప్పుడు అలా కాకుండా అంతా ఒకే డాష్ బోర్డ్ క్రిందకు మార్చి, ఒకచోటనే మన బ్లాగుకి సంబంధించినవన్నీ చూడటానికి - పాత డాష్ బోర్డ్ స్థానాన్నే - మరొక క్రొత్త బ్లాగ్ డాష్ బోర్డ్ Blog Dash board ని ప్రవేశపెట్టారు. మీరు మీ బ్లాగ్ ని తెరచి చూస్తే మీ బ్లాగ్ హోం పేజీ గా - ఈ క్రొత్త డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఆది ఇలా ఉంటుంది.
అలా మారిన బ్లాగ్ హోం పేజీ కాస్త మసకగా మారి, దానిపైన కాన్ఫిడెన్షియల్ Confidential అంటూ పాపప్ విండో Popup Window కనిపిస్తుంది. 1 వద్ద కనిపిస్తున్న Got it అనే బటన్ ని నొక్కి ఆ పాపప్ విండో ని తీసేయ్యవచ్చు.
అలా అయ్యాక, మీకు Your blogs live here అంటూ మరొక పాపప్ విండో కనిపిస్తుంది. ఇది ఆ డాష్ బోర్డ్ లో ఎడమ, పై భాగములో మూలన కనిపిస్తుంది. ఇందులో - మీరు ఈమధ్య అప్డేట్ చేసిన / పోస్ట్ చేసిన మీ స్వంత బ్లాగ్స్ అన్నింటినీ ఒక వరుసక్రమములో మీరు ఇక్కడ చూడవచ్చును. 2 వద్దనున్న Got it ని నొక్కి, ఈ పాపప్ విండో ని తొలగించవచ్చు.
బ్లాగర్ గుర్తు క్రిందన మీరు ఈమధ్య అప్డేట్ చేసిన / పోస్ట్ చేసిన బ్లాగ్ పేరు కనిపిస్తుంది ( పై ఫోటోలో My VALUABLE LESSONS అని కనిపిస్తున్నది ) దాని ప్రక్కన ఉన్న త్రికోణాన్ని ( ఎర్రని వృత్తములో 3 అనే అంకె వద్ద చూపెట్టబడినది ) నొక్కితే - ఒక డ్రాప్ మెనూ తెరచుకొని, Your blogs అంటూ మీరు నిర్వహిస్తున్న బ్లాగుల లిస్టు 4 కనిపిస్తుంది. అది ఈ క్రింది విధముగా ఉంటుంది.
మీరు ఏదైనా మరొక క్రొత్త బ్లాగ్ ని తెరవాలంటే - ఇక్కడే ఉన్న New blog ని 5 నొక్కి తేలికగా క్రొత్త బ్లాగ్ ని ప్రారంభించవచ్చు. అలా నొక్కితే ఇలా వస్తుంది.
ఈ క్రొత్త డాష్ బోర్డ్ లో చాలానే బగ్స్ ఉన్నాయి. పాత డాష్ బోర్డ్ కన్నా కాస్త తేలికగా ఉన్నా, సాంకేతికముగా కొన్ని బగ్స్ అలాగే ఉండిపోయాయి. కొన్ని అదనముగా వచ్చాయి. వాటిని అప్డేట్ బ్లాగర్ వారు అప్డేట్ చేస్తే మరీ బాగుంటుంది.
Sunday, July 10, 2016
Facebook Friend request - Mark as Spam
సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ Facebook లో మనకి ఎందరెందరో స్నేహితులు అవుతుంటారు. మనకి స్నేహితులు కావాలీ అంటే మన ఫేస్ బుక్ అకౌంట్ శుభ్రముగా, మంచి పోస్ట్స్ తో కూడి ఉండాలి. అప్పుడు మనతో స్నేహానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆ వివరాలు ఏమిటో తరవాత చెప్పుకుందాం.. అంతలోగా ఎవరైనా మనకి స్నేహితులు అవటానికి మాటిమాటికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ ( ఆ రిక్వెస్ట్ ని ఒప్పుకోక రిజెక్ట్ చేస్తే ) విసుగు తెప్పిస్తుంటారు. ఇక వారంతే అనుకొని చాలామంది వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఒప్పుకోవడమో, లేక అలాగే అట్టి పెట్టడం చెయ్యటమో చేస్తారు. వచ్చిన ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని అలాగే అట్టి పెట్టేస్తే - మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ పెట్టలేడు సరికదా - ఇంకో లాభం ఏమిటంటే మనకు ఒక ఫాలోవర్ దొరుకుతాడు. అలా చేస్తే ఆ ఫాలోవర్ లిస్టు పెరిగి - " అబ్బో వీరికి ఇంత ఫాలోయింగ్ ఉందా?.." అని ఈర్ష్యగా ఫీలవుతుంటాం..
ఒక్కోసారి వద్దనుకున్నవారు మాటి మాటికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే - వారిని బ్యాన్ BAN చెయ్యకుండా - వారి వద్దనుండి ఫ్రెండ్ రిక్వెస్ట్స్ వద్దనుకుంటే ఇలా చెయ్యండి.
వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని తీరుబాటుగా పరిశీలించండి. వారు ప్రొఫైల్ వివరాలు - వారి కవర్ ఫోటో క్రిందన ఉన్న - About అబౌట్ లో చూడండి. ఏమైనా వివరాలు ఉన్నాయా అనీ..
ఆ తరవాత వారి ఫ్రెండ్ లిస్టులో ఉన్నవారిని చూడండి. ( చెత్త ప్రొఫైల్స్, అశ్లీల దృశ్యాల ప్రొఫైల్ పిక్స్ గల తన మిత్రులు ఎవరైనా ఉన్నారేమో చూడండి. )
టైం లైన్ లోని పోస్ట్స్ ని గమనించండి. వాటి ఫ్రీక్వెంట్స్ Freequents, వాటిలోని సత్తానీ, ( వచ్చిన లైక్స్ ని పట్టించుకోకండి. అమ్మాయిల పోస్ట్స్ కి అవి ఎక్కువగానే ఉంటాయవి ) వాటికి వచ్చిన కామెంట్స్, ఆ కామెంట్స్ కి వారిచ్చిన రిప్లైస్ Replies ని గమనించండి.
వారి ఫోటో ఆల్బమ్స్ ని పరిశీలించండి.
చివరిగా వారు లైక్ చేసిన పేజెస్ Pages ని ఒకసారి సింహావలోకం చెయ్యండి. అందులో వారు చేసిన లైక్ చేసిన పేజెస్ - వారి ప్రస్తుత మనస్తత్వాన్ని చూపిస్తాయి.
అప్పుడు వద్దనుకున్న ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ వారు - ఇక వారి వద్ద నుండి మళ్ళీ రిక్వెస్ట్స్ రావొద్దు అనుకుంటే ఇలా ఈ క్రింది ఫోటోలో చూపినట్లు చెయ్యండి.
1. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఒప్పుకోకుండా Delete చెయ్యండి.
2. అప్పుడు ప్రొఫైల్ కవర్ ఫోటో మీద - రిక్వెస్ట్ రిమూవ్డ్ Request Removed అని కనిపిస్తుంది. దాని ప్రక్కనే మార్క్ ఆజ్ స్పాం Mark as spam అని వస్తుంది. మీరు దాన్ని గనుక నొక్కితే ( ఇక్కడ - If you tick 'Mark as Spam', this person will not be able to send you any more friend requests ) చాలు. వారింక మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పెట్టలేరు.
Friday, July 8, 2016
దిల్^సుఖ్ – ఇది లేఖిని లో ‘దిల్‌సుఖ్’ గా
[తెలుగుబ్లాగు:22373] నమస్తే!,
దిల్^సుఖ్ – ఇది లేఖిని లో ‘దిల్‌సుఖ్’ గా నిలబడుతోంది. కానీ Microsoft Indic Language Input Tool తో టైప్ చేస్తున్నప్పుడు ‘దిల్సుఖ్’గానే ఉంటోంది. ఇక్కడ వేరే ప్రత్యామ్నాయం ఉన్నదా, దయచేసి తెలుపగలరు. పొల్లు తర్వాత అక్షరం సంయుక్తాక్షరంగా అయిపోతోంది. సలహా ఇవ్వగలరు.
వేరే ప్రత్యామ్నాయాలు లేవు.. మీరు ఉదాహరించినట్లుగానే సాగాలి.
మైక్రోసాఫ్ట్ ఇండిక్ లాంగ్వేజ్ ఇన్పుట్ టూల్ అయినా, గూగుల్ వాడి లిప్యంతరమైనా ఒకటే.. ఇవి యూనికోడ్ ని ఆధారం చేసుకొని ఏర్పరచిన పరికరములు. వాటిల్లో పొల్లు తరవాత అక్షరం సంయుక్తాక్షరం గా మారిపోతుంది. రెండు పదాలని మధ్యన స్పేస్ వాడి వేరుచేసి, సేవ్ చేసుకొని, ఆ తర్వాత ఎడిట్ చేసి, స్పేస్ తొలగించిననూ ఆ రెండుపదాలు కలసిపోయి - మీరు చెప్పినట్లుగా దిల్సుఖ్ గానే మారుతుంది. వాటిల్లో అలాగే వస్తుంది. అందుకే అలాంటి పదాలని ఆ టూల్స్ వాడేవారు విడివిడిగానే ( దిల్ సుఖ్ ) వ్రాస్తున్నారు.
లేఖిని, క్విల్ ప్యాడ్, యంత్రం, ఆపిల్, ఇంస్క్రిప్ట్, స్వేఛ్చ.. మొదలగునవి వాటిల్లో ఇలాంటి పదాలని మనం అనుకున్నట్లుగా వ్రాసుకోవచ్చును. యూనికోడ్ లా కాకుండా వీటి టైపింగ్ కాస్త ఎక్కువగా ( షిప్ట్ కీ మొదలగు సహాయక మీటలని ) వాడాల్సి ఉంటుంది. కానీ మనం అనుకున్నట్లుగా వీటివల్ల ( దిల్‌సుఖ్ ) వ్రాయగలుగుతాం. ఇలాంటి పదాలని యూనికోడ్ పరికరాల వల్ల వ్రాయలేము.
ఈ యూనికోడ్ పరికరాలని వాడిన నాకు కొద్ది సంవత్సరాల క్రితం వరకూ - " పాఠం " అన్న పదం వ్రాయటం ఎంత ప్రయత్నించినా కుదిరేది కాదు. ఆ ఒక్క పదం కోసం వేరేవాటిని తెరచి, ఆ పదాన్ని టైపు చేసుకొని, తెలుగులోకి వచ్చినదాన్ని కాపీ చేసుకొని నా బ్లాగ్ కోసం పేస్ట్ చేసుకొని వాడుకొనేవాడిని. ఇప్పుడు ఆ పదం యూనికోడ్ లో నేరుగా టైప్ చేస్తే (paatham) వచ్చేస్తున్నది. ఇలాంటివి బగ్స్ ఇంకా కొన్ని ఈ యూనికోడ్ లలో (ఇక్కడా యూనికోడ్ లలో అంటూ విడి విడిగా వ్రాశాను. గమనించగలరు. కలిపివ్రాస్తే వేరుగా - యూనికోడ్లలో - అని వస్తుంది ) అభివృద్ధి చెయ్యాల్సి ఉంది.
- అచ్చంపేట్ రాజ్.
Wednesday, July 6, 2016
[తెలుగుబ్లాగు:22161] బ్లాగ్ ని రిజిస్టర్ చేసుకోవాలా ?
[తెలుగుబ్లాగు:22161] నమస్కారం సోదరులకు
గూగుల్ బ్లాగ్ కు ఒక పేరు పెట్టినతరువాత దానిని రిజిస్టర్ చెయాల ? చేయకపోతే అట్టి బ్లాగ్ నేమ్ రిజిస్టర్ చెసిఉన్నదని ఎలా తెలుసుకోవాలి
ఎందుకంటే
మా స్నేహితుడు ఒక బ్లాగ్ కు తను ఒక పేరు పెట్టినవెంటనే బ్లాగ్ పేరు రిజిస్టర్ చేసియున్నాము పేరు తీసి వేయాలి మెయిల్ ఎవరో పంపారు
వేరొక పేరు నిర్ణయిస్తే దానికి ఇలాగే జరుగుతుందేమో అని అనుమానం
అసలు బ్లాగ్ నేమ్ ఎలా రిజిస్టర్ చేస్తారు దయచేసి తెలుపగలరు - అనే ఈ 6-January-2014 న అడిగిన ప్రశ్నకి నా జవాబు ఇచ్చాను. ఆ సమాధానాన్ని కాస్త అభివృద్ధి / జత చేసి - ఇప్పుడు మీకోసం.. ( అలాగే నా ఈ బ్లాగ్ లో Blog tips లేబుల్ లో ఒక టపాగా చేరుస్తున్నాను )ఎందుకంటే
మా స్నేహితుడు ఒక బ్లాగ్ కు తను ఒక పేరు పెట్టినవెంటనే బ్లాగ్ పేరు రిజిస్టర్ చేసియున్నాము పేరు తీసి వేయాలి మెయిల్ ఎవరో పంపారు
వేరొక పేరు నిర్ణయిస్తే దానికి ఇలాగే జరుగుతుందేమో అని అనుమానం
బ్లాగ్ ఓపెన్ చేశాక,దాన్ని రిజిస్టర్ చేసుకోవాలా : అవసరం లేదండీ.. బ్లాగ్ పేరు అనేది మీ ఇష్టం. మీరు యే పేరు అయిన పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఆ పేరు ఇంతకు ముందే వాడుకలోగానీ, ఎవరైనా ఆ పేరున బ్లాగ్ తెరచి ఉంచితే అపుడు మార్చుకోవాలి. ఇలా ఎందుకూ అంటే - భవిష్యత్తులో ఒకే పేరు మీద ఉన్న బ్లాగుల్లో ఏదైనా ప్రఖ్యాతి చెందినప్పుడు, ఆ బ్లాగ్ ని ఇతరులు చేరుకోవాలని చూసినప్పుడు సాంకేతిక సమస్యలు / కన్ప్యూజన్ ఏర్పడే ప్రమాదం ఉందని - యూనిక్ పేరుని ఎన్నిక చేసుకోమని సూచన బ్లాగర్ / వర్డ్ ప్రెస్ /.... వారి దగ్గర నుండి సూచన వస్తుంది. ఒక బ్లాగ్ పేరు గాంచినది అయితే, అలాంటి పేరుగల ( పోలిక ఉన్న ) బ్లాగ్ ఉన్నట్లయితే - ఆ బ్లాగ్ వీక్షకుల సంఖ్య బాగా ఉంటుంది. ఇలాంటివి బ్లాగుల్లో తక్కువే కానీ సైట్లలో చాలానే ఉన్నాయి. వారేమి చెయ్యకుండానే మన బ్లాగ్ ఖ్యాతి వల్ల వారి బ్లాగ్ కి వీక్షకులు పెరుగుతారు. తద్వారా వారు ఒక స్థాయికి చేరుకోగానే - గూగుల్ వారి ప్రకటన రూపములో ఆడ్ సెన్స్ వల్ల వారు ఆదాయం పొందుతారు. ఇలాంటి ఆదాయం మన తెలుగు భాష బ్లాగులకి అవకాశం లేదు.
మీ బ్లాగ్ పేరుని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరము లేదు. బ్లాగ్ అనేది ఉచితముగా నిర్వహించుకోవచ్చు. మీరు ఏదైనా సైట్ ని అంతర్జాలములో నిర్వహించాలీ అనుకుంటే అప్పుడు ఆ సైట్ ని, కొంత డబ్బు కట్టి, మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ( ఉచితముగా కూడా మన పేరు మీద సైట్స్ నిర్వహించుకోవచ్చును.. అది వేరే విషయం )
చేయకపోతే అట్టి బ్లాగ్ నేమ్ రిజిస్టర్ చెసిఉన్నదని ఎలా తెలుసుకోవాలి : మీ బ్లాగ్ ని క్రియేట్ చేస్తున్నప్పుడే ఏమి పేరు ఉండాలో అడుగుతుంది. అప్పుడు మీరు టైప్ చేసిన పేరు ఇంతకు ముందే ఆ పేరుతో ఏదైనా బ్లాగ్ పేరు ఉంటే - ఆల్రెడీ ఆ పేరు వాడుకలో ఉంది - అని సూచన వస్తుంది. అప్పుడు ఇంకో పేరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా అభ్యంతర సూచన రానంతవరకూ మార్చి, సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఆ పేరు ఆ బ్లాగ్ వారు మీకు కేటాయించినట్లే !
మా స్నేహితుడు ఒక బ్లాగ్ కు తను ఒక పేరు పెట్టినవెంటనే బ్లాగ్ పేరు రిజిస్టర్ చేసియున్నాము పేరు తీసి వేయాలి మెయిల్ ఎవరో పంపారు అలా మెయిల్ పెట్టిన వారికి తిరిగి మెయిల్ పెట్టండి.. వారి బ్లాగ్ లింక్ ఇవ్వమని అడగండి. ఆ లింక్ ద్వారా ఆ బ్లాగ్ కి వెళ్ళి, మీ బ్లాగ్ పేరుతో పోల్చుకోండి. సరిపోతే మార్చుకోవాలో వద్దో, లేదా ఏదైనా మార్పు చెయ్యటమో మీరు మీకుగా ఆలోచించుకోండి.
వేరొక పేరు నిర్ణయిస్తే దానికి ఇలాగే జరుగుతుందేమో అని అనుమానం అన్నీ మీరే అనుమానించుకుంటూ ఉంటే అక్కడే ఆగిపోతారు.
బ్లాగ్ పేరు వేరు, బ్లాగ్ అడ్రెస్ వేరు. క్రొత్తలో కొద్దిగా తికమకగా ఉన్నా, రెండూ వేరు వేరు. ( బ్లాగ్ విజిబిలిటీ ఆప్షన్ ని ఎన్నుకుంటే - ఈ రెండూ గూగుల్ సర్చ్ లో కనిపిస్తాయి ) మీకు మరింతగా అర్థం అవ్వాలీ అంటే - నా బ్లాగ్ పేరు My VALUABLE LESSONS అని ఉంటుంది. కానీ నా బ్లాగ్ అడ్రెస్ (URL) మాత్రం www.achampetraj.blogspot.in గా ఉంటుంది. ఇలా అడ్రెస్, బ్లాగ్ పేరూ వేరు వేరుగా కూడా ఉండవచ్చును. బ్లాగ్ పేరు అనేది మీ బ్లాగ్ యొక్క పేరు.. అది మీ ఇష్టమైనది పెట్టుకోవచ్చును. కాకపోతే వేరేవారి బ్లాగ్ పేరులకి దగ్గరగా ఉంటే గందరగోళంగా ఉండి, ఆ తరవాత కొన్ని చిక్కులు ఏర్పడతాయి. అప్పుడు మీరే మార్చుకోవాల్సి వస్తే - అప్పటిదాకా ఆ బ్లాగ్ కి వచ్చిన ఆదరణాన్ని కోల్పోవాల్సివస్తుంది. అంటే బ్లాగ్ పేరు ని అందరిలోకి తీసుకెళ్లాలీ అంటే ఆ పేరుని పరిచయం చెయ్యటానికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది.
బ్లాగ్ పేరుని ఎవరికైనా మెయిల్ చేస్తే / చెబితే - వారు ఆ పేరు మీదుగా నేరుగా ఆ బ్లాగ్ కి వెళ్ళలేరు. గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్ లలో టైపు చేసి, వచ్చిన వాటిల్లో ఈ బ్లాగ్ పేరుకి సరియైన లింక్ చూసి, తెరవాల్సి ఉంటుంది. కాస్త పేరున్న బ్లాగ్స్ కి దగ్గరగా ఒక అక్షరం తేడాతో చాలా సైట్స్ కనిపిస్తుంటాయి. వాటిల్లో వెదికి తెరవాల్సి ఉంటుంది. ఇలా పోలిక అబద్దపు సైట్స్ లేకుంటే ఆ పేరుతో ఆ సైట్ / బ్లాగ్ కి నేరుగా వెళ్ళొచ్చును.
URL అంటే Universal Resource Locator అని అర్థం. ఇది 1994 లో టిమ్ బెర్నర్స్ లీ Tim Berners-Lee వరల్డ్ వైడ్ వెబ్ World wide web (WWW) కోసమని తయారుచేశారు. దీనివల్ల బ్లాగ్ అడ్రెస్ / సైట్ అడ్రస్ ని తేలికగా చేరుకోవచ్చును. దీనికి ఉదాహరణగా నా బ్లాగ్ అడ్రెస్ ని మరొకసారి ఇస్తున్నాను - www.achampetraj.blogspot.in
- అచ్చంపేట్ రాజ్.
Wednesday, May 11, 2016
Add a comment to WhatsApp profile pics
WhatsApp లో ఎవరిదైనా ప్రొఫైల్ ఫోటో ( Profile Pic ) లైక్ చెయ్యటానికి ఏదైనా మార్గం ఉందా ? మీ ప్రొఫైల్ ఫోటో బాగుందని మాటల్లో తెలపడానికి ఇబ్బందిగా ఉంది. దీనికి ఏదైనా మార్గం ఉందా ?
ఉందండీ.. భేషుగ్గా ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. కొన్ని ప్రొఫైల్ ఫొటోస్ అద్భుతముగా ఉంటాయి. వాటిని మెచ్చుకోకుండా ఉండలేం.. అలాని పబ్లిక్ గా చెప్పలేం. వారికి మామూలుగా చెప్పొచ్చు. కానీ వారికి మీరు చెప్పిన కాంప్లిమెంట్స్ యే సందర్భంలోనివీ అంటూ సందేహంలో పడతారు. అదే ఆ ఫోటోని అప్లోడ్ చేస్తూ మీ ఫీలింగ్స్ చెబితే మరింతగా బాగుంటుంది కదూ.. ఓకే.. అదెలాగో ఇప్పుడు నేర్చుకుందాం.
ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్న వాటిల్లోని వారి పేర్లని - వారి ప్రైవసీకి అంతరాయం రావొద్దని ఎడిట్ చేశాను. అలాగే -ఆ ఫోటోని అందుకునే వారి ప్రొఫైల్ ని కాకుండా - ఒక గ్రూప్ ని ఎన్నుకున్నాను. అందుకోనేవారి పేరు మీకు కనిపించాలని వాటిని ఎన్నుకున్నాను. గమనించగలరు.
ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేసి, అందులోని కాంటాక్ట్స్ లలోని ఒకరి ప్రొఫైల్ ఫోటోని ఎన్నుకుందాం.
ఉందండీ.. భేషుగ్గా ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. కొన్ని ప్రొఫైల్ ఫొటోస్ అద్భుతముగా ఉంటాయి. వాటిని మెచ్చుకోకుండా ఉండలేం.. అలాని పబ్లిక్ గా చెప్పలేం. వారికి మామూలుగా చెప్పొచ్చు. కానీ వారికి మీరు చెప్పిన కాంప్లిమెంట్స్ యే సందర్భంలోనివీ అంటూ సందేహంలో పడతారు. అదే ఆ ఫోటోని అప్లోడ్ చేస్తూ మీ ఫీలింగ్స్ చెబితే మరింతగా బాగుంటుంది కదూ.. ఓకే.. అదెలాగో ఇప్పుడు నేర్చుకుందాం.
ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్న వాటిల్లోని వారి పేర్లని - వారి ప్రైవసీకి అంతరాయం రావొద్దని ఎడిట్ చేశాను. అలాగే -ఆ ఫోటోని అందుకునే వారి ప్రొఫైల్ ని కాకుండా - ఒక గ్రూప్ ని ఎన్నుకున్నాను. అందుకోనేవారి పేరు మీకు కనిపించాలని వాటిని ఎన్నుకున్నాను. గమనించగలరు.
ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేసి, అందులోని కాంటాక్ట్స్ లలోని ఒకరి ప్రొఫైల్ ఫోటోని ఎన్నుకుందాం.
పైన 1 వద్ద ఉన్న చెవికి ఉన్న బంగారు ఝుంఖా ఫోటోని ఎన్నుకుందాం. అంటే ఆ ప్రొఫైల్ ఫోటో థంబ్ నైల్ ఫోటో మీద టచ్ చెయ్యండి.
అప్పుడు పై ఫోటోలోలా 2 లా ఆ ప్రొఫైల్ పిక్ ఓపెన్ అవుతుంది. ఇది మీడియం సైజులో కనిపిస్తుంది. ఈ ఫోటో మీద మళ్ళీ టచ్ చేస్తే అప్పుడు ఆ ఫోటో స్క్రీన్ ఫుల్ సైజ్ లో ( క్రింది ఫోటోలో మాదిరిగా ) తెరచుకుంటుంది.
ఆ ప్రొఫైల్ ఫోటో మీద - ఆ ఫోటో తమ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్న వారి ప్రొఫైల్ పేరు ఉంటుంది. దాని ప్రక్కన - ప్రక్కకి వంగిన V ఆకారములో ఉండే షేరింగ్ గుర్తు 3 ఉంటుంది. దాన్ని మీరు పై ఫోటోలో చూడవచ్చును. దాన్ని టచ్ చేస్తే మీకు క్రింది ఫోటో మాదిరిగా ఆ ఫోటోని ఎక్కడ షేర్ చెయ్యాలో అని ఫోన్ లోని వివిధ ఆప్షన్స్, ఆప్స్ ని చూపే ఒక మెనూ 4 వస్తుంది. దాన్ని మీరు క్రింది ఫోటోలో చూడవచ్చు.
ఈ మెనూని కొద్దిగా స్క్రోల్ చేస్తే క్రింది ఫోటో మాదిరిగా కనిపిస్తుంది. అందులో మీ ఫోన్ లోని వివిధ అప్లికేషన్స్, స్టోరేజ్ ఆప్స్ మెనూ మీకు కనిపిస్తాయి.
అందులో అల్ఫాబెటికల్ ఆర్డర్ లో Alphabetical చివరగా ఉండేది WhatsApp వాట్సప్ 5 వద్ద మీకు కనిపిస్తుంది. ఇక్కడ వాట్సప్ ని టచ్ చేసి, దాన్ని ఓపెన్ చేద్దాం. అలా ఓపెన్ చేసిన వాట్సప్ లో తెలియడానికి వీలుగా ఒక ప్రొఫైల్ కాకుండా - ఒక గ్రూప్ Family ని ఎన్నుకుంటున్నాను.
అలా ఆ ఫోటో ఓపెన్ చెయ్యగానే - ఆ ప్రొఫైల్ పిక్ ని ఎడిట్ చెయ్యడానికి మీకు కొన్ని టూల్స్ కనిపిస్తాయి. 7 అందులో మొదటగా -
డిలీట్ - ఆ ఫోటో నచ్చకుంటే డిలీట్ చేసి, మళ్ళీ మొదటికి వచ్చి, ఇంకో ప్రొఫైల్ ఫోటో ఎన్నుకోవచ్చు.
క్రాప్ టూల్ - ఈ టూల్ సహాయాన ఆ ప్రొఫైల్ ఫోటోని అవసరం మేరకు కట్ చేసుకోవచ్చు.
రొటేట్ టూల్ - దీని సహాయాన 90, 180, 270 డిగ్రీలలో వంగి ఉన్న ఫోటోలని తిన్నగా మార్చుకోవచ్చు.
8 వద్ద ఉన్న Add a caption దగ్గర టచ్ చేస్తే - మీకు కీబోర్డ్ అందుబాటులోకి వస్తుంది. దాన్ని వాడి ఆ ఫోటో గురించి మీ భావనని టైప్ చెయ్యవచ్చు.
ఇక్కడ నేను ఆ ఫోటో కామెంట్ గా - Super design Jhumkha అని 9 వ్రాశాను. ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకొని, 10 వద్దనున్న పేపర్ రాకెట్ గుర్తు ( Send button ) నొక్కితే చాలు.
అప్పుడు ఆ ఫ్యామిలీ లో ఆ ఫోటో - మీరు వెలిబుచ్చిన కామెంట్ తో 11 అప్లోడ్ అవుతుంది. క్రొత్త వెర్షన్ వాట్సప్ లో End to end encryption తో చాట్స్, పిక్స్ అందుతాయి కాబట్టి అవి ప్రయాణించే మార్గ మధ్యలో ఎవరూ చూడలేరు(ట).
వాట్సప్ వాల్ పేపర్స్ 12 :
మామూలుగా ఉన్న వాట్సప్ బ్యాక్ గ్రౌండ్ ని వాట్సప్ వాల్ పేపర్స్ అనే వాట్సప్ వారి ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని, ఇంస్టాల్ చేసుకోవాలి. ఇది మీ ఇష్టం. వేరుగా ఎందుకు చెప్పాలని ఇందులోనే కలిపేసి, చెప్పాను.
Monday, May 2, 2016
Mobile codes
చాలా మందికి స్మార్ట్ ఫోన్స్ ఎలా వాడాలో, లోపల ఉన్న అప్లికేషన్స్ ని ఎలా ఉపయోగించాలో తెలుసు. కానీ ఫోన్ ని వాడుకోవడం, ఫోన్ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి ఏ ఏ కోడ్స్ వాడాలో తెలీదు. అలాంటి వారికోసం ఫోన్ కి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి కొన్ని కోడ్స్ సేకరించాను. ఇవి అన్ని ఫోన్స్ కి రాకపోవచ్చు. కొన్ని మాడల్స్ కి, కొన్ని కంపనీలకి సరిపోవచ్చు. లేదా ఆ కోడ్స్ ఇప్పుడు ఫోన్ నవీకరణలో భాగముగా పనిచెయ్యక పోవచ్చు. లేదా మరేదైనా కావచ్చును. ఇవి అన్నీ సేకరించి, వాడాక, నిజమని నిర్ధారించబడలేదు. ఎలా సేకరించినవి - అలాగే ఇక్కడ పోస్ట్ చెయ్యడం జరుగుతున్నది. గమనించగలరు.
బ్యాటరీకి సంబందించిన వివరాలు - #*#4636#*#*
ఫోన్ యూనిట్ IMEI నెంబర్ - *#06#
క్రొత్త ఫోన్స్ లలో సర్వీస్ మెనూ - *#0*#
కెమరాకు సంబంధించిన పూర్తి సమాచారం - *#*#34971539#*#
మెమొరీ కార్డ్ లోని మీడియా ఫైల్స్ - *#*#273282*255* 663282*#*#*
వైర్ లెస్ లాన్ టెస్ట్ - *#*#232339#*#*
టచ్ స్క్రీన్ టెస్ట్ - *#*#2664#*#*
వైబ్రేషన్ టెస్ట్ - *#*#0842#*#*
సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ సమాచారం - *#12580*369#
డయాగ్నోస్టిక్ కాన్ఫిగరేషన్ - *#9090#
ఫోన్ లాక్ స్టేటస్ - *#7465625#
ఒరిజినల్ సాంసంగ్ ఫోన్స్ లలో వాడే కొన్ని కోడ్స్. ఇవి పనిచెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు.
బ్యాటరీకి సంబందించిన వివరాలు - #*#4636#*#*
ఫోన్ యూనిట్ IMEI నెంబర్ - *#06#
క్రొత్త ఫోన్స్ లలో సర్వీస్ మెనూ - *#0*#
కెమరాకు సంబంధించిన పూర్తి సమాచారం - *#*#34971539#*#
మెమొరీ కార్డ్ లోని మీడియా ఫైల్స్ - *#*#273282*255* 663282*#*#*
వైర్ లెస్ లాన్ టెస్ట్ - *#*#232339#*#*
టచ్ స్క్రీన్ టెస్ట్ - *#*#2664#*#*
వైబ్రేషన్ టెస్ట్ - *#*#0842#*#*
సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ సమాచారం - *#12580*369#
డయాగ్నోస్టిక్ కాన్ఫిగరేషన్ - *#9090#
ఫోన్ లాక్ స్టేటస్ - *#7465625#
ఒరిజినల్ సాంసంగ్ ఫోన్స్ లలో వాడే కొన్ని కోడ్స్. ఇవి పనిచెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు.
PDA, CSC, మోడెం సాఫ్ట్వేర్ వర్షన్ చూడటానికి - *#1234#
జనరల్ టెస్ట్ మోడ్ - *#0*#
సాఫ్ట్వేర్ మరియు హార్డ్ వేర్ వివరాలు - *#12580369#
సర్వీస్ మోడ్ - *#197328640#
ADC చూడటానికి - *#0228#
సిఫరింగ్ ఇన్ఫో - *#32489#
బ్లూటూత్ అడ్రస్ - *#232337#
బ్లూటూత్ టెస్ట్ చెయ్యటానికి - *#232331#
జనరల్ టెస్ట్ మోడ్ - *#0*#
సాఫ్ట్వేర్ మరియు హార్డ్ వేర్ వివరాలు - *#12580369#
సర్వీస్ మోడ్ - *#197328640#
ADC చూడటానికి - *#0228#
సిఫరింగ్ ఇన్ఫో - *#32489#
బ్లూటూత్ అడ్రస్ - *#232337#
బ్లూటూత్ టెస్ట్ చెయ్యటానికి - *#232331#
Wednesday, August 12, 2015
[తెలుగుబ్లాగు:22292] pasting problem
[తెలుగుబ్లాగు:22292] pasting problem typed matter in lekhini is not pasted on word document. what to do? కి నేనిచ్చిన సమాధానం :
( అక్కడ ఇచ్చిన సమాధానానికి కన్నా కాస్త వివరంగా ఇక్కడ చెబుతున్నాను. )
( అక్కడ ఇచ్చిన సమాధానానికి కన్నా కాస్త వివరంగా ఇక్కడ చెబుతున్నాను. )
ముందుగా మీరు లేఖిని సైట్ లోకి వెళ్ళి, తెరవండి. అందులో పైన గడిలో రోమన్ ఇంగ్లీష్ లో anTE ilA టైపింగ్ చేసుకోవాలి. అలా చేస్తూ ఉంటే డిఫాల్ట్ సెట్టింగ్ బట్టి వెనువెంటనే తెలుగులోకి మారుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఆ క్రిందన ఉన్న గడిలో వచ్చిన తెలుగు పదాలు - సరియైన పదాలు - అచ్చుతప్పులూ, భావం సరియైనవేనా నిర్ధారించుకోండి. అలా గమనిస్తూ టైపింగ్ చేస్తూ వెళ్ళండి.
అలా కొద్దికొద్దిగా టైప్ చేస్తూ కాపీ చేసుకుంటూ వెళ్ళండి. ఒక పేరా కాగానే దాన్ని మీ మౌస్ సహాయన క్రింద గడిలో ఉన్న తెలుగులోకి మారిన విషయాన్ని మార్కింగ్ చెయ్యండి. అలా చేసినప్పుడు ఆ విషయం అంతా నీలిరంగులోకి మారుతుంది. ( క్రింది ఫోటో చూడండి ). అప్పుడు మీ కీ బోర్డ్ న ఉన్న Control + C అనే రెండు మీటల్ని ఒకేసారి నొక్కితే ఆ విషయం అంతా కాపీ అవుతుంది.
ఇప్పుడు మీ సిస్టం న ఉన్న Microsoft వారి word pad తెరవండి. అందులో ఉన్న పేజీ మీద ఒకసారి మీ మౌస్ ని క్లిక్ చెయ్యండి. అలా చేశాక - ఇప్పుడు Control + V అనే రెండు మీటల సహాయాన ఒక్కసారిగా నొక్కితే ఆ కాపీ చేసిన విషయం అంతా అక్కడ పేస్ట్ అవుతుంది. ( క్రిందన ఉన్న ఫోటో చూడండి )
అపుడు ఆ వర్డ్ ప్యాడ్ ని సేవ్ చేసుకుంటే సరి. అంతే!
Friday, May 1, 2015
Orkut లోని Ortist ని వాడి బొమ్మలు గీయటం.
ఆర్కుట్ అనే సోషల్ నెట్వర్క్ సైట్ ని మూసేశారని మీకు తెలిసిన విషయమే..అందులో కొన్ని బొమ్మలని వేశాను.. Ortist అనే అప్లికేషన్ తో, మౌస్ ని కదుపుతూ వాడుతూ బొమ్మలని గీసుకోవచ్చును. ఇలా వేసుకున్న వాటిని ప్లే ( Play ) చేస్తే - ఎలా వేశామో అలా ఒక వీడియోగా కనిపిస్తుంది. ఓహో! ఇలా వేశారు, అలా వేస్తే ఈ బొమ్మ వస్తుంది.. అని తెలుసుకొనేలా ఉంటుంది - ఈ పద్ధతి. అప్పట్లో ఇలా చాలానే చిత్రాలు వేశాను. క్రొత్తలో కాబట్టి ఇందులో బాగా మమేకమైపోయాను. అలాగీసుకున్న ఒక అసంపూర్తి చిత్రాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను.
ఆర్కుట్ లోని నా క్రియేషన్స్ కాలగర్భములో కలసిపోకుండా, ఇలా నా బ్లాగులో దాచుకొనే ఒక చిన్న ప్రయత్నం ఇది. ఇలా గీసుకున్న చిత్రాల్లో ఇదొక్కటే దాచుకున్నాను.. మరెన్నో చిత్రాలు అలా కాలగర్భములో కలసిపోయాయి.. ప్చ్!.
ఇలా గీసుకున్న ఇంకొన్ని చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిని ఇక పోస్ట్ చెయ్యలేను.. కారణం : ఆ సోషల్ సైట్ ని మూసేసారని ముందే మీకు తెలియచేశాను. వాటిని ఈ బ్లాగులో సేవ్ చేసుకోవటం మరిచాను. ఇలా కంప్యూటర్ మౌస్ వాడి గీసుకున్న చిత్రాలని అందరికీ చూపించుకోవటంలో ఆ తృప్తియే వేరు.. ఇప్పుడు ఆ అప్లికేషన్ మిగతావాటిల్లో ఉందో, లేదో నాకు అంతగా తెలీదు. నాకు మిగిలిన ఏకైక Ortist స్కెచ్ ఇదొక్కటే. ఈ క్రిందున్న వీడియోని ప్లే చెయ్యండి. ఎలా గీశానో మీకూ తెలుస్తుంది. క్రిందన కుడి మూలగా Speed అనే స్లైడ్ అడ్జస్ట్ బటన్ ఉంటుంది. దాన్ని ముందుకూ, వెనక్కి జరుపుకొని కావలసిన వేగములో ఆ వీడియోని చూడవచ్చును.
దీన్ని నేను 19 - ఫిబ్రవరి - 2009 న 5:55:34 A.M కి గీయటం పూర్తిచేసి, పోస్ట్ చేశాను. ఇప్పుడైతే మరింత బాగా గీసేవాడిని.. ఇది శివరాత్రికి నా మిత్రులకు - శుభాకాంక్షలు తెలియచెయ్యటానికి ఈ ప్రయత్నం చేశాను.. కానీ సమయం చిక్కకనో, మరే కారణం వల్లనో ఇంకా బాగా వెయ్యటానికి ప్రయత్నించలేకపోయా..
Wednesday, May 28, 2014
difference between the app and mobile website

difference between the app and mobile website pl
మొబైల్ ఆప్ కీ, మొబైల్ వెబ్సైట్ కీ మధ్య చాలా తేడా ఉంది. వెబ్సైట్ అనేది ఒక కంపనీ యొక్క వివరాలు, అది అందిస్తున్న అన్నిరకాల సేవలూ, ఏవైతే అందరికీ తెలియాలని అనుకుంటున్నారో అవన్నీ తెలియ చెయ్యటానికి ఏర్పరిచేదే వెబ్సైటు. ఉదాహరణకి : నోకియా, సాంసంగ్ కంపనీల వెబ్సైట్స్.
ఆప్ అంటే అప్లికేషన్ కి సంక్షిప్త రూపం. అప్లికేషన్ వలన ఒక నిర్దిష్టమైన పనిని / సేవలని మనం పొందవచ్చును. అది ఒక విషయం మీద అపరిమిత సేవని పొందేందుకై ఏర్పరిచిన సాఫ్ట్వేర్ ప్రోగ్రాం. దీనివలన మనం ఆ ఆప్ ని ఏ పనికోసం తయారు చేశారో, ఆ పనిని సులభముగా ఆ ఆప్ ని వాడి పొందుతాం. ఉదాహరణగా : వీడియో ప్లేయర్ ఆప్. దీనివలన వీడియోలని మనం ప్లే చేసుకొని చూడగలుతాం. కానీ వేరేవాటికోసం వాడలేము.
Wednesday, March 26, 2014
పాటలు టైపు చేసేటపుడు | / గీతలు ఎలా ?
[తెలుగుబ్లా గు:22246] పాటలు టైపు చేసేటపుడు
చరణం తరువాత మళ్ళీ పాటని కొద్దిగా లైను చివరలో ఒక అక్షరం వ్రాసి అక్షరం మొదట్లో చివరన రెండు గీతలను అమర్చడానికి నాకు రావటం లేదు. దయచేసి తెలుపగలరు.
సినిమా పాటలు బ్లాగుల్లో గానీ, మరేచోట వ్రాస్తున్నప్పుడు - పల్లవి, చరణాల చివర మళ్ళీ పల్లవి మొదలవుతుంది. ఇలా మళ్ళీ పల్లవి మొదలవుతుంది అని సూచనగా వాటి చివరన - పల్లవిలోని మొదటి పదాన్ని - అక్కడ వ్రాస్తారు. దీన్ని తేలికగా గుర్తించేందుకై ఆ పద భాగాన్ని ఇటు రెండు, అటు రెండు - వంగిన గీతలు లేదా నిలువు గీతల చూపిస్తారు. అంటే అక్కడ ఆ పల్లవి మళ్ళీ మొదలవుతుంది అనే సూచనగా. ఈ గీతలు / లేదా | గా ఉంటాయి. ఉదాహరణకు : అత్తారింటికి దారేది సినిమాలోని పాట " నిను చూడగానే చిట్టి గుండె గట్టిగానే.. " అనే పాటనే ఉదాహరణగా తీసుకొంటే - చివరలో
// నిను చూడగానే //
|| నిను చూడగానే ||
అని వ్రాస్తారు. అలా చూడగానే మనకి ఓహో.. మళ్ళీ పల్లవి ఇక్కడ మొదలవుతుంది అని గ్రహించేస్తాం. మామూలుగా చేతి ద్వారా తేలికగానే వ్రాయవచ్చును. కానీ కంప్యూటర్లో టైపింగ్ చేసేటప్పుడు - మొదట్లో ఎలా వీటిని వ్రాస్తారు ? అన్న మీమాంస మొదలవుతుంది. నిజానికి ఇది చా__లా చిన్న సమస్య. కీ బోర్డులో ఏమేమి కీలు / సంజ్ఞలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలనగా చూస్తే అన్నీ తెలిసిపోతాయి.
కంప్యూటర్ కీ బోర్డులో ఈ గుర్తులను / | సూచించేందుకై ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. సాధారణముగా వీటిని కుడివైపున / కుడిచేతి వ్రేళ్ళ క్రిందకు వచ్చే కీలలో మీరు వీటిని తేలికగా గుర్తించవచ్చును. ఎలా అంటే - Enter కీ చుట్టూ ఈ మీటలను తేలికగా కనుగొనగలం. ఈ క్రింది ఫోటోలో మీరు గమనించవచ్చును.
చాలా కీ బోర్డుల్లో ఈ రెండు సంజ్ఞలు ఇతర సంజ్ఞలతో కలిసి ఉంటాయి. కీ అమరికలను బట్టి షిఫ్ట్ ( Shift ) కీ వాడి ఉపయోగించాల్సి ఉంటుంది.
1 గుర్తు వద్ద చూపించిన | సంజ్ఞని ఆంగ్లములో పైప్ ( Pipe ) అంటారు. ఇది నిలువు గీత ఆకారములో ఉంటుంది. దీన్ని కీ బోర్డ్ అమరికను బట్టి షిఫ్ట్ కీ వాడి, నొక్కాల్సి ఉంటుంది. ఇది చాలా కీ బోర్డుల్లో ఉండకపోవచ్చును. కారణం ఎక్కువగా ఉపయోగములో లేకపోవడం వల్లనేమో కావొచ్చును.
2 గుర్తు వద్ద చూపిన / సంజ్ఞని ఆంగ్లములో స్లాష్ ( Slash ) అంటారు. ఇది కాస్త వాలుగా ఉండే గీత. కుడివైపుకి వాలి ఉంటుంది. సాధారణముగా షిఫ్ట్ కీ వాడకుండానే నేరుగా వాడుకోవచ్చును. ఇది కీ బోర్డులో రెండు చోట్ల ఉంటుంది.
ఒకటేమో ఎంటర్ బటన్ వద్ద,
రెండోది : నంబర్ కీల వద్ద.
నంబర్ కీల వద్ద దీన్ని అంకెలను భాగించటానికి (Divide) ఎక్కువగా వాడుతుంటారు.
పై రెండింటినీ అలా వాడుకోవచ్చును.
Saturday, October 12, 2013
బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నప్పుడు సేవ్ అవ్వటంలేదు.
[తెలుగుబ్లా గు:22082] కి నా సమాధానం.
బ్లాగ్ మిత్రులారా!
నమస్కారం.బ్లాగులో ఏదైనా ఒక టపా పోస్ట్ చేస్తున్నప్పుడు సేవ్ ( Save ) అవక, అంతరాయం ఏర్పడింది అని హెచ్చరిక వస్తుంది. అంటే ఇలా క్రింది రూపంలో మనకు కనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు అందాక మనం వ్రాసిన పోస్ట్ - ఆ బ్లాగ్ లో పబ్లిష్ కాలేదు అని అర్థం. అంటే ఇంకా డ్రాఫ్ట్ ( తయారీ ) లోనే ఉందని అర్థం. మనం వ్రాసిన భావజాలం ఇంకా జాగ్రత్త చెయ్యబడలేదు అని అర్థం చేసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు కాసింత జాగ్రత్తగా ఉండాలి కూడా.
ఇలా వచ్చిందీ అంటే - నాకు తెలిసీ కొన్ని కారణాలు ఉన్నాయి.
1. మనం పోస్ట్ చెయ్యాలీ అనుకున్న టపాలో వీడియో, ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు - అవి సగం వరకూ అప్లోడ్ అయినప్పుడు
2. బ్లాగర్ సర్వర్ బీజీగా ఉండటం మూలాన అలా జరగవచ్చు.
3. మన ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ - తగినంతగా ఉండక, డ్రాప్ అయి ఉండొచ్చును. ఇలా నెట్ వేగం సరిపోనంతగా లేనప్పుడు కూడా టపా పబ్లిష్ కాదు.
పైన చిత్రం లో చూపినట్లుగా - బ్లాగ్ లో టపా పబ్లిష్ చేయబోతున్నప్పుడు మీకు అలా వచ్చినట్లయితే, ఆ నీలిరంగు బాణం గుర్తు వద్ద చూపినట్లుగా, Ignore warning మీద మౌస్ కర్సర్ ఉంచి, నొక్కితే ఆ అంతరాయం సూచన పోతుంది. అప్పుడు మళ్ళీ మీరు Save గానీ, Publish అనే బొత్తామును గానీ నొక్కి సేవ్ / పబ్లిష్ చేసుకోవచ్చును. అప్పటికీ అలాగే వస్తుంటే మీరు మళ్ళీ ఆ అంతరాయ సూచనని తొలగించి, సేవ్ / పబ్లిష్ నొక్కుతూ వెళ్లాల్సిందే.
రండు, మూడు సార్లు ఇలాగే జరిగితే - అప్పుడు మీరు మీ టపా ని మళ్ళీ ఒకసారి ప్రూఫ్ చెయ్యండి. ఎక్కడో ఒకదగ్గర ఏదైనా టైపు గానీ, స్పేస్ గానీ పెట్టి మళ్ళీ పబ్లిష్ చెయ్యండి. ఒక్కోసారి ఇలా కూడా యాదృచ్చికంగా వర్కౌట్ అవుతుంది.
రండు, మూడు సార్లు ఇలాగే జరిగితే - అప్పుడు మీరు మీ టపా ని మళ్ళీ ఒకసారి ప్రూఫ్ చెయ్యండి. ఎక్కడో ఒకదగ్గర ఏదైనా టైపు గానీ, స్పేస్ గానీ పెట్టి మళ్ళీ పబ్లిష్ చెయ్యండి. ఒక్కోసారి ఇలా కూడా యాదృచ్చికంగా వర్కౌట్ అవుతుంది.
అలాగే మాటి మాటికీ రావటం, లేదా పవర్ పోవడం వల్లనో, మరే కారణం వల్లనో ఇలా సేవ్ గానీ, పబ్లిష్ గానీ చేసుకోలేనప్పుడు - అప్పటిదాకా మనం వ్రాసిన టపా లో ఎంతవరకు ఆటో సేవ్ ( Auto save ) పద్ధతిలో సేవ్ అయ్యిందో, అంతవరకే సేవ్ అవుతుంది. మిగతా అంతా కోల్పోయినట్లే. ఇలా జరిగితే - సేవ్ కాని విషయం మీకు గుర్తుంటే ఫరవాలేదు. మళ్ళీ టైప్ చేసుకోవచ్చు. లేకుంటే అంతే సంగతులు.
ఇలా సేవ్ కానప్పుడు, మీకు పవర్ పోతుంది అని గానీ, లేదా ఏదైనా పని ఉంది ప్రక్కకి వెళ్ళాల్సిన అవసరం గనుక ఉంటే - మీరు వ్రాసిన దాంట్లో ఆటో సేవ్ కాని విషయాన్ని - ఉజ్జాయింపుగా అంచనా వేసి, కర్సర్ తో మార్క్ చేసుకొని, నోట్ ప్యాడ్ లో గానీ, ఎక్సెల్ ఫైల్ లో గానీ, మీ సోషల్ సైట్ లో ( ప్రవైట్ ఆప్షన్ లో ) గానీ, మీ జీమెయిల్ లోని Compose లో క్రొత్త మెయిల్ గా సేవ్ చేసుకోవాలి. పైన చెప్పిన సమస్యలు తోలిగాక, కాపీ - పేస్ట్ పద్ధతిలో పూర్తి చేసుకొని, అంతా మళ్ళీ సేవ్ చేసుకోవచ్చును.
ఇక్కడ మరో విషయం గమనించాల్సిందేమిటీ అంటే - ఇలా కాపీ పేస్ట్ చేస్తే - జిమెయిల్ లో మెసేజ్ బాడీలో చేసుకొంటే - టపాలోని విషయమే కాకుండా, ఫొటోస్ కూడా కాపీ పేస్ట్ లో వచ్చేస్తాయి. కానీ బ్లాగర్, జిమెయిల్ రెండూ గూగుల్ వారివే కాబట్టి, ఈ సందర్భాల్లో అంతగా వర్కౌట్ కాదు. ఫేస్ బుక్ సర్వర్లలో ఇలాంటి సమస్య ఉండదు. అక్కడ మితృలకి ఇబ్బంది కాకుండా - ప్రైవేట్ గా స్టేటస్ మెస్సేజ్ గా పోస్ట్ చేసుకోవడం మీకు తెలిస్తే, అలా కూడా చేసుకోవచ్చును. అయినా ఇంత దూరం వరకూ మీకు అవసరం రాదు. ఇలా జరగటం చాలా అరుదుగా ఉంటుంది. విషయ పరిజ్ఞానం క్రింద ఇది చెప్పాను. అంతే!.
ఇక్కడ మరో విషయం గమనించాల్సిందేమిటీ అంటే - ఇలా కాపీ పేస్ట్ చేస్తే - జిమెయిల్ లో మెసేజ్ బాడీలో చేసుకొంటే - టపాలోని విషయమే కాకుండా, ఫొటోస్ కూడా కాపీ పేస్ట్ లో వచ్చేస్తాయి. కానీ బ్లాగర్, జిమెయిల్ రెండూ గూగుల్ వారివే కాబట్టి, ఈ సందర్భాల్లో అంతగా వర్కౌట్ కాదు. ఫేస్ బుక్ సర్వర్లలో ఇలాంటి సమస్య ఉండదు. అక్కడ మితృలకి ఇబ్బంది కాకుండా - ప్రైవేట్ గా స్టేటస్ మెస్సేజ్ గా పోస్ట్ చేసుకోవడం మీకు తెలిస్తే, అలా కూడా చేసుకోవచ్చును. అయినా ఇంత దూరం వరకూ మీకు అవసరం రాదు. ఇలా జరగటం చాలా అరుదుగా ఉంటుంది. విషయ పరిజ్ఞానం క్రింద ఇది చెప్పాను. అంతే!.
Sunday, May 19, 2013
Your comment will be visible after approval
ప్రశ్న : [తెలుగుబ్లా గు:21116] నేను ఒక బ్లాగ్ లో కామెంట్ పొస్ట్ చెద్దమని ఎంత ప్రయత్నించినా నా కామెంట్ పోస్ట్ కాకుండా - Your comment will be visible after approval అని వస్తుంది, ఎందుకు అలా వస్తుంది, ఆ బ్లాగ్ లో కామెంట్ పోస్ట్ చేయాలి అంటే ఎలా? ప్లీస్.......... దయచేసి ఎవరైనా నా సమస్యని తిర్చగలరూ. ప్లీస్.......
జవాబు : మీరు ఆ బ్లాగ్ లో కామెంట్ వ్రాసి, పోస్ట్ చేస్తే, అలా Your comment will be visible after approval అని ఎందుకు వచ్చిందీ అంటే - మీరు వ్రాసిన కామెంట్ ఆ బ్లాగ్ లో ప్రచురించటానికి / ప్రదర్శించటానికి అర్హత ఉందొ లేదో అని చూడటానికి ఒక విధమైన సెట్టింగ్. ఇది ఆ బ్లాగ్ ఓనర్స్ కి మాత్రమే ఉంటుంది. ఎవరైనా కామెంట్ పెడితే ఆ బ్లాగ్ ఓనర్స్ వద్దకి వెళుతుంది. మీ కామెంట్ పబ్లిష్ చెయ్యటానికి అర్హముగా ఉంటే, పబ్లిష్ ని నొక్కి, తమ బ్లాగ్ లో కనబడేలా చేస్తారు. ఒకరకముగా చెప్పాలంటే - కామెంట్ సెన్సారింగ్ లాంటిది ఈ ఆప్షన్.
జవాబు : మీరు ఆ బ్లాగ్ లో కామెంట్ వ్రాసి, పోస్ట్ చేస్తే, అలా Your comment will be visible after approval అని ఎందుకు వచ్చిందీ అంటే - మీరు వ్రాసిన కామెంట్ ఆ బ్లాగ్ లో ప్రచురించటానికి / ప్రదర్శించటానికి అర్హత ఉందొ లేదో అని చూడటానికి ఒక విధమైన సెట్టింగ్. ఇది ఆ బ్లాగ్ ఓనర్స్ కి మాత్రమే ఉంటుంది. ఎవరైనా కామెంట్ పెడితే ఆ బ్లాగ్ ఓనర్స్ వద్దకి వెళుతుంది. మీ కామెంట్ పబ్లిష్ చెయ్యటానికి అర్హముగా ఉంటే, పబ్లిష్ ని నొక్కి, తమ బ్లాగ్ లో కనబడేలా చేస్తారు. ఒకరకముగా చెప్పాలంటే - కామెంట్ సెన్సారింగ్ లాంటిది ఈ ఆప్షన్.
Thursday, February 21, 2013
[తెలుగుబ్లాగు:21985] సమాధానం
అందరికి నమస్కారం
నాకు ఒక చిన్న డౌటు, అదిఏమిటంటే నేను ఒక బ్లాగు క్రియేట్ చేశాను అయితే గూగుల్‌లో సెర్చి కొడితే నా బ్లాగు అడ్రసు కనిపించటంలేదు. దానికి నేను ఏమి చేయాలి.తేలియజేయగలరు. [తెలుగుబ్లా గు:21985] కి నేను ఇచ్చిన సమాధానం.
నాకు ఒక చిన్న డౌటు, అదిఏమిటంటే నేను ఒక బ్లాగు క్రియేట్ చేశాను అయితే గూగుల్‌లో సెర్చి కొడితే నా బ్లాగు అడ్రసు కనిపించటంలేదు. దానికి నేను ఏమి చేయాలి.తేలియజేయగలరు. [తెలుగుబ్లా
క్రొత్తగా బ్లాగ్ తెరచిన వాళ్ళందరికీ ఎదురుక్కొనే సాధారణ సమస్య ఇది. ముందుగా మీకు - కొత్త బ్లాగ్ ప్రారంభించిన సందర్భముగా మీకు అభినందనలు. ఇది చాలా చిన్న సమస్య. మీరు ఈ క్రింది పద్ధతుల ద్వారా మీయొక్క సమస్యని తేలికగా తొలగించుకోవచ్చును.
ముందుగా మీరు మీ బ్లాగ్ హోం పేజీ ఓపెన్ చెయ్యండి. ఇది తెరవటానికి మీరు www.blogger.com అనే లింక్ నొక్కి గానీ, అడ్రెస్ బార్ లో ఓపెన్ చేస్తే - నేరుగా మీ బ్లాగ్ హోం పేజీ తెరచుకుంటుంది. అప్పుడు మీరు ఇలా కుడివైపున ఉన్న More options (ఇది - మౌస్ కర్సర్ దాని మీద పెడితే అలా More options అని కనిపిస్తుంది. క్రింది ఫోటోలో ఆకుపచ్చ బాణం గుర్తుతో చూపబడిన స్థానములో ఉంటుంది) ప్రక్కన ఉన్న చిన్న గడిలోని త్రికోణాన్ని నొక్కితే, ఇలా క్రింది ఫోటోలో మాదిరిగా డ్రాప్ మెనూ తెరచుకుంటుంది. అందులో Over view, Posts... ... ఇలా ఉండి, చివరిలో Settings అని ఉంటుంది. ఫోటో సరిగా కనపడక పోతే - ఆ ఫోటో మీద డబల్ క్లిక్ చెయ్యండి.
పైన ఫోటోలో నీలి రంగు బాణం గుర్తుతో చూపిన వద్ద Settings ని నొక్కితే, మీకు ఇలా సెట్టింగ్స్ పేజీ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు 2 వద్ద నున్న Settings ని నొక్కితే, ఆ సెట్టింగ్స్ లోని, బేసిక్ అనే మొదటి విభాగం 1 మీకు కనిపిస్తుంది.
అలాగే 3 వద్ద నున్న Edit ని నొక్కండి.
అలా తెరచుకున్న ఆ బేసిక్ సెట్టింగ్స్ లలో 4 వద్దన ఉన్న Add your blog to our listings అన్న చోట Yes అనే ఆప్షన్ వద్ద " క్లిక్ " చెయ్యాలి. ఇలా చేస్తే గూగుల్ వారి బ్లాగుల లిస్టు లోకి మీ బ్లాగ్ ని చేర్చుతున్నారన్న మాట.
అలాగే 5 వద్ద నున్న Let search engines find your blog అన్న చోట కూడా Yes అనే ఆప్షన్ వద్ద " క్లిక్ " చెయ్యాలి. ఇక్కడ అలా చేస్తే - మీరు కోరుకుంటున్నట్లుగా - మీ బ్లాగ్ గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి - మీ బ్లాగ్ పేరు టైపు చేసి, వెదికితే - దొరుకుతుంది.
( ఇలా ఈ ఆప్షన్ ఉండటం ఎందుకూ అంటే - కొన్ని బ్లాగ్స్ పర్సనల్ పని మీద కూడా ఉంటాయి. అవి కొందరికే కనిపించేలా చెయ్యాలి అనుకుంటే అలా పబ్లిక్ గా సర్చింగ్ లోకి రాకూడదు. అందుకే అలా ఈ ఆప్షన్. ఉదాహరణకి : మీ కుటుంబాలలో పెళ్లి చూపులు, ఎంగేజ్ మెంట్, లగ్నపత్రిక, ఉపనయనము, పెళ్లి, రిసెప్షన్ లాంటివి ఇక్కడ పోస్ట్ చేసుకొని, కొందరికే ఆ ఆ బ్లాగ్ లింక్ ఇచ్చి, కనిపించేలా చేసుకోవచ్చును. అలా ఒక పాతిక మెయిల్ అడ్రెస్స్ ల వారికే ఈ సదుపాయం ఉంటుంది. అలాంటివారికి వారి బ్లాగ్ సర్చింగ్ లో కనిపించకూడదు కదా.. ఇలా పెళ్లి అనే కాదు.. ఒక ప్రత్యేకమైన పనికోసం కూడా చేసుకోవచ్చును. కానీ ఈ సెట్టింగ్స్ ఎలా చెయ్యాలో తెలీక, ఇప్పుడు అందరూ సోషల్ సైట్లలో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నారు. ఇది జెనరల్ నాలెడ్జి కోసం చెబుతున్నాను. ఇది మీకు అవసరం పడదు )
అలా మీరు అక్కడ Yes ఆప్షన్స్ ఎన్నుకున్నాక, 6 వద్దనున్న Save changes ని నొక్కండి. అంతే! కొంత సమయం తరవాత మీ బ్లాగ్ పేరుని సర్చ్ చేసి, వెదుక్కోవచ్చును.
Thursday, January 3, 2013
Spam comments
Mark as Spam, ఇంకొకటి Spam Box అనే పోస్ట్స్ లలో ఈ పనికిమాలిన, వృధా కామెంట్స్ గురించి చెప్పాను. అసలు ఆ కామెంట్స్ వల్ల లాభం ఏమీ ఉండదు అనీ. ఆ కామెంట్స్ పోస్ట్స్ చేస్తున్నవారికీ ఇంకా అలసట రానట్లుంది. ఇంకా అలా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. కానీ అవన్నీ ఆటోమేటిక్ గా స్పాం బాక్స్ లోకి వెళ్లిపోతున్నాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వేరే విధముగా పోస్ట్ చేస్తూనే ఉన్నారు.
ఒక పోస్ట్ (Spam box) లో చెప్పినట్లు - 2012 జనవరి ఒకటిన ఆ స్పాం బాక్స్ మొత్తం శుభ్రం చేశాను. ఈ 2012 లో ఎన్ని స్పాం మెసేజెస్ వస్తాయో చూద్దామని. అలాగే ఆ విషయం మీకు చెబుదామని. ఇప్పుడు ఆ విషయమే చెప్పబోతున్నాను.
ఈ 2012 లో నాకు వచ్చిన స్పాం కామెంట్స్ మొత్తం - 311. ఎలాంటి కామెంట్స్ యో ఈ ఫోటో మీద డబల్ క్లిక్ చేసి చూడండి. అవన్నీ స్పాం బాక్స్ లో భద్రముగా ఉన్నాయి. అవన్నీ తీసేస్తున్నాను.. ఏమీ పనీపాట లేకుండా ఇలా జనాలని ఇబ్బంది పెట్టే ఇలాంటి చదువుకున్న అడ్డ గాడిదల్ని కోసి, ఉప్పూ, కారం వేసి రుద్దాలి.
ఒక పోస్ట్ (Spam box) లో చెప్పినట్లు - 2012 జనవరి ఒకటిన ఆ స్పాం బాక్స్ మొత్తం శుభ్రం చేశాను. ఈ 2012 లో ఎన్ని స్పాం మెసేజెస్ వస్తాయో చూద్దామని. అలాగే ఆ విషయం మీకు చెబుదామని. ఇప్పుడు ఆ విషయమే చెప్పబోతున్నాను.
ఈ 2012 లో నాకు వచ్చిన స్పాం కామెంట్స్ మొత్తం - 311. ఎలాంటి కామెంట్స్ యో ఈ ఫోటో మీద డబల్ క్లిక్ చేసి చూడండి. అవన్నీ స్పాం బాక్స్ లో భద్రముగా ఉన్నాయి. అవన్నీ తీసేస్తున్నాను.. ఏమీ పనీపాట లేకుండా ఇలా జనాలని ఇబ్బంది పెట్టే ఇలాంటి చదువుకున్న అడ్డ గాడిదల్ని కోసి, ఉప్పూ, కారం వేసి రుద్దాలి.
Monday, November 5, 2012
Facebook in smart phone
మీ స్మార్ట్ ఫోన్ లో ఫేస్ బుక్ రావాలనుకుంటున్నారా?.. ఇలా ఓపెన్ చేసుకోవటం చాలా ఈజీ. అదెలాగో ఇప్పుడు చెబుతాను. ఈ వివరణలు అన్నీ - క్రొత్తగా ఆన్లైన్ వాడకందారుల కోసం పోస్ట్ చేస్తున్నాను. మొదట్లో - అంటే ఐదేళ్ళ క్రితం నాకు ఈ అంతర్జాలం గురించి తెలీనప్పుడు - చాలా ఇబ్బంది పడ్డాను. నాలాంటి కష్టం మన తెలుగువారికి రావద్దని కాసింత ప్రయాస తీసుకొని, చెప్పటం.
ముందుగా మీరు మీ ఫోన్ యూనిట్ లో మెనూ లోకి వెళ్ళండి. కాసింత పాతతరం ఫోన్ యూనిట్ అయితే - నేరుగా Internet అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. కాసింత నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. అప్పుడు అక్కడ వచ్చిన అడ్రస్ బార్ మీద లేదా గూగుల్ సర్చ్ బార్ మీద - www.facebook.com అని టైప్ చేసి, ఎంటర్ కొట్టండి. నెమ్మదిగా ఆ పేస్ బుక్ తెరచుకుంటుంది.
ఇలా చాలా నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. కొన్నింట్లో అయితే అస్సలు ఓపెన్ కావు. కారణాలు ఏమిటంటే - నెట్వర్క్ ప్రొవైడర్ (అంటే - మొబైల్ సిమ్ కంపనీ వారు) అలా మొబైల్ లో ఇంటర్నెట్ చూడటానికి ఆ ఫోన్ లో బ్యాలన్స్ కనీసమొత్తం (Rs. 100 లేదా 150) అయినా ఉండాలి. ఈ బ్యాలన్స్ అనేది నెట్వర్క్ ప్రొవైడర్ ని బట్టి ఉంటుంది.
మరొక కారణం ఏమిటీ అంటే - ఫోన్ యూనిట్ ప్రాసెసర్ చాలా తక్కువ వేగముతో ఉన్నది అయి ఉంటుంది. ఇలా తక్కువ వేగం తో ప్రాసెసర్ ఉన్న ఫోన్ తో మొబైల్ లో అంతర్జాలం ని చూడటం చాలా కష్టమే!. చూసేబదులు ఊరుకోవటమే ఉత్తమం. ఇలాంటి తక్కువ స్పీడ్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ లో మొబైల్ కేమరాతో తీసిన ఫొటోస్ చూడటానికే (అవి తెరచుకోవటానికే) అయ్యే నెమ్మదనంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఉన్న ఫోన్ యూనిట్ లో అంతర్జాలం చూడటం ప్రయాసే అవుతుంది. చూడకుండా ఊరుకోవటమే ఉత్తమం.. ఇప్పుడు 1 GB ప్రాసెసర్ ఉంటున్నది కాబట్టి చాలా నయం.
ఇక ఫోన్ RAM. ఇది ఆ పాత ఫోనుల్లోచాలా తక్కువగా ర్యాం ఉంటుంది. ఒకటి, రెండు కన్నా ఎక్కువ అప్లికేషన్స్ ఓపెన్ చెయ్యలేం. కేమరాతో తీసిన ఫోటోలని చూస్తూ, వెంట వెంటనే చూస్తుంటే - అంత త్వరగా ఆ ఫోన్ లో ఫొటోస్ ఓపెన్ కాకుంటే - అది ఆ ర్యాం తక్కువ చలువే. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత తొందర తొందరగా మన పని పూర్తవుతుంది.
ఇక ఫోన్ కి వచ్చే నెట్ స్పీడ్ కూడా కీలకమే. సర్వర్ మీద వత్తిడి బాగా ఉన్నప్పుడు నెమ్మదిగా, అంతర్జాలం తెరచుకుంటుంది. ఆ ఫోన్ మెమొరీ, టెంపరరీ ఫైల్స్, తెరచి ఉంచిన ఫైల్స్ / అప్లికేషన్స్, అప్డేట్స్... కూడా అంతర్జాలం ని మొబైల్ లో చూడటానికి కీలకమైనవే. ఇవన్నీ కొన్ని సందర్భాలల్లో బాగా నెమ్మదిగా పనిచేసేలా చేస్తాయి. (అవన్నీ చెప్పుకోవచ్చును కానీ చాలా పెద్దగా అవుతుందని ముగించేశాను)
పై ఇబ్బందుల్లో చాలా భాగం స్మార్ట్ ఫోన్ లలో ఉండవు. కాసింత ఎక్కువ వేగముతో అంతర్జాలాన్ని చూస్తాము.
ఇప్పుడు అంతర్జాలములో సైట్స్ ని ఎలా చూడొచ్చో చూద్దాం. ఇక్కడ ఉదాహరణకి ఫేస్బుక్ ని చూద్దాం. మీ స్మార్ట్ మొబైల్ నుండి మెనూ లోకి వెళ్లి, అందులో ఉన్న Internet ఆప్షన్ వాడి, తెరచిన అడ్రెస్ బార్ లో సైట్ పేరు కొట్టేస్తే సరి. మీకు ఆ సైట్ నేరుగా తెరచుకుంటుంది. ఇదిగో ఇలా..
అలా కాకుండా ఏదైనా బ్రౌజర్ ని (ఉదా : ఒపేరా మినీ - దీని సింబల్ ఎరుపు రంగు O మాదిరిగా ఉంటుంది) ఇన్స్టాల్ చేసుకొని, ఆ బ్రోజర్ ని తెరచి, అందులో సైట్ అడ్రెస్ టైపు చేసి అలా ఓపెన్ చేసుకోవచ్చును.
ఇక అలా కాకుండా ఇంకోరకముగా - తేలికగా ఒక సైట్ వద్దకి నేరుగా వెళ్ళాలీ అంటే - ఆ సైట్ అప్ App (Application = ముద్దుగా App) ని మన మొబైల్ లో ఆడ్ చేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఉదాహరణకి మనం ఫేస్ బుక్ ని మనం తరచుగా మొబైల్ లో చూడాలని అనుకున్నట్లయితే - మీరు ఆ ఆప్ ని మీ మొబైల్ మెనూ లో పెట్టేసుకోవటం బెస్ట్. (Internet లో బుక్ మార్క్ లాగా పెట్టేసుకోవచ్చును.. కానీ ఇంకో రెండు మూడు స్టెప్స్ ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. ఈ ఆప్ వల్ల - పని తొందరగా, నేరుగా వెళ్ళొచ్చును). దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మొబైల్స్ కొన్నిట్లో నేరుగా అలా ఇన్స్టాల్ అయి వస్తున్నాయి. ఇంకొన్ని వాటిల్లో మనమే అలా ఆడ్ చేసుకోవాలి.
ఇలా ఆడ్ చేసుకోవాలీ అంటే - మీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, అక్కడ సర్చ్ బార్ 1 లో Facebook Mobile అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. అప్పుడు ఈ క్రింద ఉన్న సైట్ ని ఎన్నుకొని ఓకే చేస్తే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు 2 వద్ద చూపినట్లు Get the App ని నొక్కండి.
ఇప్పుడు ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది.
అక్కడ 3 వద్ద మీ దేశం పేరూ, ISD కోడ్ ని, డ్రాప్ మెనూ వాడి ఎన్నుకోవాలి.
దాని క్రింద ఉన్న మరో బ్లాంక్ 4 లో మన ఫోన్ నంబర్ ని వ్రాయాలి.
అప్పుడు 5 వద్ద నున్న Send Link to my mobile ని నొక్కాలి.
అంతే!.. ఆ ఆప్ లింక్ ఒక SMS రూపములో మీ మొబైల్ కి ఇలా వస్తుంది.
ఆ SMS ని ఓపెన్ చెయ్యండి.
ఆ లింక్ మీద ఓపెన్ చేస్తే ఇలా
దాన్ని ఓకే చేస్తే -
ఇక్కడ Install Now ని నొక్కితే సరి. అప్పుడు దాని ద్వారా ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చును. ఈ అప్లికేషన్ దానంతట అదే ఇన్స్టాల్ అవుతుంది.
ఒకవేళ ఇదంతా ఇబ్బందిగా ఉంటే - మీరు ఈ లింక్ లోకి నేరుగా వెళ్ళండి. ఫేస్ బుక్ ఆప్ ని నొక్కి నేరుగా వెళ్ళొచ్చును.
Subscribe to:
Posts (Atom)