Saturday, March 28, 2015

Quiz

11 x 11 = 4
22 x 22 = 16
33 x 33 = ?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :  

Friday, March 27, 2015

Laxmi Narasimha Temple, Nampelli Gutta, Vemulawada.

తెలంగాణా లోని వేములవాడకి దగ్గరలో ఉన్న నాంపల్లి గుట్ట మీద మరొక ఆకర్షణీయ సందర్శనా స్థలం ఉంది. ఇది పైన ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ ఆలయానికి వెళ్ళే దారిలో వచ్చే మలుపు స్థానములో ఉంది. ఇక్కడ విశాలమైన పార్కింగ్ స్థలము ఉంది. కాసింత దూరంలో ఉండగానే కనిపించే ఈ అందమైన నిర్మాణం సందర్శకులను ఆకట్టుకుంటుంది. రూ. 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ కట్టడం కాసింత క్రొత్తగా, అందముగా ఉండి, సరిక్రొత్త అనుభవాన్ని ఇస్తుంది. కాకపోతే నిర్మాణం లోపలికి వచ్చే పర్యాటకుల ఆటవిక చర్యల వల్ల, సిమెంట్, ప్లాస్టర్ చేసిన విగ్రహాలు అన్నీ ద్వంసం అయ్యాయి. అలా కాకుండా ఉండేలా సెక్యూరిటీ పెట్టినా ఆ పాము ఆకార వంకర్లలో అది సాధ్యం అయ్యేలా లేదు.. మంచి నిర్మాణం ఇలా ఆకతాయి చేష్టల వల్ల పాడయిపోతున్నది.. 

ఇప్పుడు ఆ ఆలయం చూద్దాం.. వేముల వాడ నుండి కరీంనగర్ కి వెళ్ళే దారిలో - వేములవాడ నుండి నాలుగు కిలోమీటర్ల దూరములో ఉన్న గుట్ట మీద ఈ నిర్మాణం ఉంది. రాజరాజేశ్వర స్వామివారి దర్శనం కాగానే ఎక్కువగా ఇక్కడికి వెళుతుంటారు. దూరాన నుండి ఇలా కనిపిస్తుంది.. 




ఇలా మీకు అక్కడికి రాగానే కనిపిస్తుంది.. ఇక్కడే వాహనాలని పార్కింగ్ చేసుకోవాలి. లోపలకి వెళ్ళటానికి క్రింద ఫోటోలో ఉన్న గుబురు చెట్టు వద్ద ప్రవేశ ద్వారం ఉంటుంది. దాని గుండా లోపలి వెళ్ళాలి. 


బయట ఇలా నరసింహ స్వామీ వారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహం ఉంటుంది. 


సర్ప కుబుసము కూడా చక్కగా నిర్మించారు, దానికి తగ్గట్లు రంగులు కూడా వేశారు. 


ఇదే ప్రవేశ ద్వారం.. దీనిలోపలి గుండా వెళ్ళాలి. 

లోపలి వెళ్ళగానే ద్వారం వద్ద ఆకతాయిల చేతుల్లో పాడయిన విగ్రహం కనిపిస్తుంది. 


















చివరిగా లక్ష్మీ నరసింహ స్వామీ రూపు. 





Sunday, March 22, 2015

Good Morning - 577


కొన్నిసార్లు నోటితో చెప్పే భావనల కన్నా కళ్ళే ఎక్కువగా చెబుతాయి.. 

అవును.. మనసులో మెదిలే భావాలని నోటితో తేలికగా చెప్పగలుతాం.. కానీ కొన్ని కొన్నిసార్లు అలా వీలు కాదు.. అప్పుడు నోటితో చెప్పలేని భావాలని మన ముఖమే - ఎక్కువగా కళ్ళే చెబుతాయి. ఇలా  చెప్పడమన్నది కేవలం దగ్గరి వ్యక్తులతో మాత్రమే అలా ఎక్కువసార్లు జరుగుతూ ఉంటుంది. దూరపు వ్యక్తులతో - తేలికగా నోటితో చెప్పేస్తూ ఉంటాము. 

మనం చెప్పే భావన  / విషయాన్ని కళ్ళతోటే అందముగా చెప్పొచ్చు. కానీ అలా చెప్పటం అన్నది అందరితో వీలు కాదు. చాలామంది మొహాల్లో - ఈమధ్యకాలములో ముఖకవళికలు దాదాపుగా కనిపించటం అరుదయ్యాయి. సంతోషకర విషయాల్నీ, బాధాకర సంగతుల్నీ ఒకేలా చెప్పేస్తున్నారు. ఎక్కడ హావభావాల్ని చూపిస్తే - నేనెక్కడ దొరికిపోతానో అని ఏమూలనో భయం కాబోలు.. మనసుని ఓపెన్ గా తెరచి ఉంచి మాట్లాడేవాళ్ళు చాలా అరుదయ్యారు. ఇలా ఉండటం మూలానే కావొచ్చు - ముఖాల్లో భావప్రకటన తాలూకు లక్షణాలు ఏవీ కనిపించటం లేదు.. 

మనం ఆత్మీయులతో కొన్ని భావనలని పంచుకుంటాం.. అందులో కొన్ని విషయాలని మనం మన నోటితో చెప్పలేకపోతాం.. కారణాలు ఏవైనా సరే - అది సున్నితమైన విషయమే కావొచ్చును, ఆ విషయాన్ని నోటితో ఎలా చెప్పగలం అన్న మీమాంస వల్లనే కావొచ్చును.. అప్పుడే ఆ భావాన్ని కళ్ళ ద్వారా చూపిస్తాం / చెబుతాం. ముందే చెప్పినట్లుగా - కేవలం దగ్గరి వాళ్ళ విషయంలో కాబట్టి మనసుతో కలిపి, దాన్ని కళ్ళతో ఆ భావాన్ని ప్రకటిస్తుంటాం.. మన మనసెరిగినవారూ, ఆత్మీయులు కాబట్టి మన కళ్ళల్లోని ఆ భావాన్ని ఇట్టే పసిగట్టేస్తారు.. అర్థం చేసుకుంటారు. అదే దూరపు వ్యక్తులు కళ్ళల్లోని భావనని పట్టించుకోరు. ముఖంలోని భావం కోసం తరచి తరచి చూస్తారు. 

ఇలా కళ్ళలోని భావాన్ని తెలుసుకోవడం అన్నది ఒక ఎత్తయితే, మనసులోని భావాన్ని నేరుగా తెలుసుకోవడం అన్నది ఇలాంటి విషయాల్లో పరాకాష్ట. ఇది ఆత్మీయ బంధాలల్లో ( స్నేహం, ప్రేమ, కుటుంబ.... ) జరుగుతూ ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా నేనీలా తెలుసుకుంటున్నాను.. కొద్దిమందితో వారిలో ఒకడినై కలిసిపోతున్నందులకు అలా కావొచ్చును.. :P 

Friday, March 20, 2015

Ugadi Greetings


నూతన తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు.. 

Sunday, March 15, 2015

Quiz

ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి.. 
1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 x 0 + 1 = ?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


Sunday, March 8, 2015

Women's day Greetings


మహిళలందరికీ 
ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 

Wednesday, March 4, 2015

Quiz


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

Tuesday, March 3, 2015

Quiz

ఈ క్రింది పటంలోని ప్రశ్నకి సమాధానం చెప్పండి. 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 7 
అసలు ఈ ప్రశ్న అడగటంలోనే చిన్న తప్పు ఉంది. మూడవ లైనులో ఉన్న కాఫీ కప్పు మరియు మట్టిముంత మధ్యలో ఉన్న + ( ప్లస్ ) గుర్తు బదులు - ( మైనస్ ) గుర్తు ఉండి ఉంటే - సమాధానం తేలికగా కనుక్కోగలం. కానీ నాకు సేకరణలో అలాగే కనిపిస్తే - అలానే పోస్ట్ చేశాను. అలా మార్చి రేపు పోస్ట్ చేస్తాను. 

సమాధానం కనుక్కోవడం ఎలా అంటే - లాజికల్ గా ఆలోచించాలి. ఇందులో పెద్దగా కష్టపడేదేమీ లేదు. కనుక్కోవడానికి ఉపయోగపడే క్లూ కూడా మొదటి లైనులోనే ఉంది. 

మూడు ఇత్తడి ముంతలు విలువ 9 అయితే ఒక్కోదాని విలువ ( 9 / 3 = 3 ) 3 అవుతుంది.  
ఇప్పుడు ఇత్తడి ముంత ( 3 ) + కాఫీ కప్పు = 13 అయితే ( 13 - 3 ) = కాఫీ కప్పు విలువ 10 అవుతుంది. 
ఇప్పుడు కాఫీ కప్పు ( 10 ) +  ( తప్పు ఇక్కడే జరిగింది ) మట్టి ముంత = 4 అయితే 10 - 4 = ఆ మట్టిముంత విలువ -6 ( 10 - -6 = 4 )
ఇప్పుడు ఆఖరి లైనులో ఉన్న మట్టిముంత ( -6 ) + ఇత్తడి ముంత ( 3 ) + కాఫీ కప్పు ( 10 ) = 
= -6 + 3 + 10
= -6 + 13
= 7 జవాబు వస్తుంది. 
ఒక చిన్న తప్పు లెక్కని క్రొత్త సమాధానం వచ్చేలా చేస్తుందో చూడండి. రేపు ఇదే ప్రశ్నని కొద్దిగా మార్చి ( + దగ్గర - ) పెట్టితే ఏమవుతుందో చూద్దాం.  


Related Posts with Thumbnails