Tuesday, February 10, 2009

వ్యక్తిత్వ వికాసం

1. జీవితం ఓ నిండుమేఘములా ఉండాలనుకోవడం సరికాదు..! అడ్డంకుల ఉరుములూ, సవాళ్ళ పిడుగులూ, సవాల చినుకులూ.. నిర్దయగా మన మీద పడతాయి. అంత మాత్రానికే కుంగిపోవాలా? కుంగిపోవాల్సిన అవసరం లేదు.. మన జీవితానికి మనమే రూపకర్తలం.. 

2. భవిష్యత్తు కాన్వాస్ ని - అద్భుత చిత్రముగా మలచుకోవడమా.. లేక పిచ్చిగీతల పాలుజేయడమా అన్నది మన చేతిలోనే ఉన్నది.. 

3. ఇనుప కండలు, ఉక్కు నరాలు బిగించి - ఎదురుపడే సమస్యలను దూదిపింజల్లా ఊదేయండి. వాన వెలిసాక హరివిల్లు వచ్చినంత సుందరముగా.. సహనముతో, సాహాసంతో విజయపథములో సాగిపొండి..
  4. మనము అంటే మన ఆలోచనలే!. అవే మనల్ని రూపొందించాయి. మాటలకన్న అవే ముందుంటాయి.. జీవిస్తాయి.. నడిపిస్తాయి.. 

  5. భయమే మృత్యువు. భయం - పాపం, నరకం, పెడత్రోవలోని జీవితం.. ప్రపంచములోని అన్ని వ్యతిరేక భావనలూ అందులోనించే జనిస్తాయి. 

  6. అనుభవము ఏకైక గురువు.. మనము ఎన్నైనా మాట్లాడవచ్చు.. హేతుబద్దముగా తర్కించుకోవచ్చును. కాని - అనుభవంలోనుంచే చూస్తేనే.. ఆ విషయం బోధపడుతుంది. 

  7. సింహం అంత నిర్భయతత్వము, పువ్వు లాంటి మృదుత్వము.. మన పనిలో ఈ రెండూ కావాలి. 

  8. మనల్ని అజ్ఞానంలోకి నెట్టేదెవరు? అవునూ! ఎవరూ..? - మనమే! అరచేతులతో కళ్లు మూసుకొని " అయ్యో చీకట్లో ఉన్నాం.." అని అనుకుంటాము. 

  9. ఒక ఆలోచనని స్వీకరించు. అదే ప్రధానముగా జీవించు. దాని గురించే ఆలోచించు.. కలలు కను.. ఊపిరిగా భావించు.. నీ మనసు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతిభాగమూ ఆ ఆలోచనతోనే నిండిపోనీ.. అదే విజయానికి రహదారి. 

  10. ఎక్కడికి విసిరితే అక్కడే అంటుకపోయే లక్షణం బంకమన్నుకి ఉంటుంది. మన ఆలోచనలూ అలాగే ఉండాలి. ఏ పనిని చేస్తే ఆ పనిమీదే మనసు లగ్నం కావాలి. 

  11. స్వచ్చత, సహనం, కాపాడుకోవడం.. ఈ మూడూ విజయానికి అత్యంత అవసరం. ప్రేమ వీటికన్నా - అత్యున్నతం. 

  12. ఎవరినీ తీసిపారేయ్యోద్దు! చులకన చెయ్యొద్దు.. వీలైతే చేయందించు! లేదా- చేతులు జోడించు.. వారి తోవలో వాళ్ళని వెళ్ళనీ.. 

  13. ఏ సమస్యా ఎదురుకానిరోజు - నీవు తప్పు దారిలో నడుస్తున్నట్లు లెక్క. ఒకసారి నిన్ను నీవు సమీక్షించుకో.. 

  14. ఒక సరియైన వ్యక్తిని కలుసుకునేముందు - పది మంది అనామకులని "విధి" పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి వద్దే ఆగిపోయేవాడు - అనామకుడుగానే మిగిలిపోతాడు. 

  15. నేడు - రేపటికి "నిన్న" అవుతుంది. నిన్నటి గురించి రేపు బాధపడకుండా ఉండాలంటే - "నేడు" కూడా బాగుండాలి. 

  16. మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్ - DEAD END. "ఇక అంతే - అయిపోయింది, ఇంకేమీ లేదు" అన్నచోట ఆగిపోకు. పక్కకి తిరుగు.. మరో దారి కనపడుతుంది. 

  17. నిన్నేవడైనా తప్పు పట్టాడంటే - నువ్వు తప్పు చేస్తున్నావని కాదు. నీవు చేస్తున్న పని - వాడికి నచ్చలేదన్నమాట. 

  18. ఓడిపోయేవాడు - ఒక్కసారే ఓడిపోతాడు. గెలిచేవాడు - తొంభై తొమ్మిదిసార్లు ఓడిపోతాడు - వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి. 

  19. నిన్నటి నుండి పాఠాన్ని గ్రహించి, రేపటి గురించి కలలు కంటూ ఈరోజుని ఆనందించు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు!.. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలాకాని పక్షములో నీ ఆనందానికి అడ్డువచ్చేవారిని నీ దినచర్యనుంచి తొలగించు. రాజీపడి మాత్రం బ్రతక్కు.. 

  20. దెబ్బ తిన్న చోటే నిలబడితే గాయం మానదు. అదే వేరే చోటకి మారితే - కలిగే కొత్త స్నేహితులతో మనసు తాలూకు గాయం మానొచ్చు..

   3 comments:

   Sri said...

   "నిన్నటి నుండి పాఠాన్ని గ్రహించి, రేపటి గురించి కలలు కంటూ ఈరోజుని ఆనందించు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు!.. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలాకాని పక్షములో నీ ఆనందానికి అడ్డువచ్చేవారిని నీ దినచర్యనుంచి తొలగించు. రాజీపడి మాత్రం బ్రతక్కు" ఇది బాగా నచ్చి౦ది రాజ్ గారు..కాని అలా రాజీ పడటానికి కూడా ధైర్య౦కావలనిపిస్తుది..
   మిగిలిన అన్ని పాయి౦ట్లు చాలా బావున్నాయి..

   praveen said...

   nenu chala nerchu kunna nu thanks for givin this comment

   nagenndra said...

   Chala baga rasarandi meeru anduko ado oka pani cheyalani post pone chesukuntu vastunna e message chadivina taravatha am cheyali la cheyali anedi aradam ayyindi...thanxs sir ituvantivi marinni rayalani manasarakorukuntunnanu .....

   Related Posts with Thumbnails