Monday, September 25, 2017

Good Morning - 670


సృష్టిలో అత్యంత తీయనైన అనుబంధం స్నేహం. 
తీపినే కాదు చెడుని కూడా పంచుకొనేది స్నేహం. 
సంతోషంలో నీతో చేతులు కలిపి, 
బాధలో నిన్ను తన చేతుల్లోకి తీసుకొని.. 
నిన్ను బాధ్యతలనుండి మరలిపోకుండా 
నీవెంటే ఉంటూ నిన్ను వెన్ను తట్టి నడిపించేది - స్నేహం. 

అవును... ఈలోకములో చాలా మధురమైనది వాటిల్లో ఈ స్నేహం కూడా ఒకటి. నిజమైన స్నేహంలో  - మన జీవితాన ఉండే తీపినే కాదు.. చేదుని కూడా పంచుకుంటుంది.నీ సంతోషములో  పాలు పంచుకుంటూ, బాధల్లో నీకు అండగా ఉంటూ, నీవు నిర్వర్తించాల్సిన బాధ్యతలను వెంటే ఉండి గుర్తు చేస్తూ, అందులో అండగా, సహాయకారిగా ఉంటూ - నీ కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ముందుకు నడిపించేదే స్నేహం.. 

ఇలాంటి స్నేహం నాకు లభించినదని చెప్పడానికి నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను.. 
Saturday, September 23, 2017

Good Morning - 669


రేపటి దినం ఎంత అందమైనదో ఈరోజు అంతకన్నా అద్భుతమైన రోజు.. 
అనుక్షణం ఆనందించు. ఆస్వాదించు.. Wednesday, September 20, 2017

Good Morning - 668


నాకు అన్నీ ఉన్న జీవితం వద్దు.. 
ఆనందమైన జీవితం చాలు.. Friday, September 15, 2017

Good Morning - 667


మీరంతట మీరుగా సొంత నియమాలు రూపొందించుకోండి. 
వాటిని పాటించండి. 
అలా కాకుండా ఆ నియమాలను బ్రేక్ చెయ్యటానికి ప్రయత్నించకండి. 
చదువుకి, ఉద్యోగములో ఎదుగుదలకు సంబంధించిన ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వండి. కాలాన్ని వృధా చెయ్యకండి. Wednesday, September 13, 2017

Quiz


Which tank will be full first
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 2

రెండవ ట్యాంక్ నుండి మూడవ ట్యాంక్ కి వెళ్ళే దారి మూసుకొని ఉంది కాబట్టి రెండవ ట్యాంక్ ఏ మొదటగా నిండుతుంది. 


Sunday, September 10, 2017

Good Morning - 666


ఉత్తేజ పరిచే జీవిత చరిత్రలని తెలుసుకోండి. మిమ్మల్ని ఆకట్టుకున్న వాక్యాలను పేపర్ పై  వ్రాసి, మీకు కనిపించేలా గోడకు అతకండి. వాటిని చదివినప్పుడల్లా మీలో క్రొత్త శక్తి వస్తుంది. Friday, September 8, 2017

Koodali Aggregator

ఇందాక నా బ్లాగ్ తెరచి, అప్రూవ్ చెయ్యాల్సిన కామెంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని తెరిచా.. ఒక కామెంట్ అప్రూవ్ చెయ్యడానికి రెడీగా ఉంది. అందులో నా బ్లాగ్ ని కూడలి.క్లబ్ నందు కలిపారని ఉంది.

కూడలి.క్లబ్ అనేది బ్లాగర్ అగ్రిగేటర్.. అంటే - అగ్రిగేటర్ అనేది ఒక వెబ్సైట్ లా గానీ, ఒక ప్రోగ్రాం లా గానీ ఉండి, వివిధ బ్లాగుల పోస్ట్స్ ని వెనువెంటనే ఒకేచోట సమాహారముగా చూపిస్తూ, లేదా ఆయా బ్లాగుల లింకులను ఒకేచోట చూపించేది - అని అర్థం. ఇందులో చేరితే, లేదా మన బ్లాగ్ ని వీటిల్లో చేరిస్తే మనం మన బ్లాగుల్లో వేసే పోస్ట్స్ లింక్స్ అన్నీ అందులో చేరుతాయన్నమాట. ఆయా పోస్ట్స్ తాలూకు మొదటి రెండులైన్స్ నీ చూపిస్తూ, మీ పేరునీ లింక్ గా చూపిస్తుంది. దాన్ని నొక్కితే ఆయా బ్లాగ్స్ కి నేరుగా వెళ్ళొచ్చు. నా బ్లాగ్ అభివృద్ధిలో భాగం పంచుకోబోతున్న కూడలి.క్లబ్ వారికి చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఆ అగ్రిగేటర్ లింక్ : http://koodali.club/ 

ఇక బాధాకరమైన విషయం చెప్పాలీ అంటే - నా బ్లాగ్ అభివృద్ధిలో / ప్రఖ్యాతిలో గూగుల్ వాటా తరవాత కూడలి దే ప్రముఖస్థానం. అందులో చేరాక నా బ్లాగ్ విశ్వవ్యాప్తముగా త్వరగా చేరుకోవటం మొదలయ్యింది. నా బ్లాగ్ కి వచ్చే పేజీ వ్యూస్ లలో ఆగ్ర తాంబూలం మాత్రం - ఈ కూడలి మరియు మాలిక అగ్రిగేటర్స్ దే.. గత కొంతకాలముగా నా బ్లాగ్ హోం పేజీలో ఉండే స్టాటిస్టిక్స్ Statistics విభాగములో ట్రాఫిక్ సోర్సెస్ Traffic Sources నందు చూస్తే - ఈ కూడలి వారి నుండి ఎలాంటి బ్లాగ్ ట్రాఫిక్ వివరాలు కనిపించటం లేదు.


అలా ఎందుకు జరిగిందో తెలీదు. ఎవరిని అడగాలో కూడా తెలీదు.. తెలుగు బ్లాగర్స్ గ్రూప్ లో ఏమైనా అప్డేట్ ఉందేమో అని చూశా.. ఏమీ కనిపించలేదు. ఆ తరవాత ఆ సైటు కి నేరుగా వెళ్లి చూశా.. ఇలాగ ఒక మెసేజ్ కనిపించింది.


అలా కనిపించింది. స్పష్టమైన కారణం అక్కడ కనిపించకున్నా నాకు వచ్చిన పోస్ట్ కామెంట్ వల్ల కారణం ఇదా అని తెలుసుకున్నాను. అలాంటి కూడలి అగ్రిగేటర్ అస్తమించారని తెలిసి, బాధవేసింది... ఈ విషయం నిజమా కాదా అని తెలుసుకోవటానికి నాకు మరే మార్గమూ కనిపించట్లేదు.. ఈ వార్త ఎంతవరకూ నిజమో కూడా తెలీదు. కేవలం ఆ పోస్ట్ కామెంట్ మాత్రమే ఆధారం. ఇదంతా ఇక్కడ ప్రస్తావించటం ఎందుకూ అంటే - నా బ్లాగ్ అభివృద్ధిలో ఆ సైట్ యొక్క పాత్ర చాలా ఉంది. ఇలాంటి సమయాల్లో కూడా తనని ఒకసారి కూడా గుర్తుచేసుకోకపోతే నా అంత కృతఘ్నుడు మరొకడు ఉండడు. 

తనని మొదటిసారిగా హైదరాబాద్ లో జరిగిన తెలుగు బ్లాగర్స్ మీటింగ్ లో కలిశాను. ( https://achampetraj.blogspot.in/2012/12/bloggers-meeting-2012.html ) అప్పుడే తొలిసారి పరిచయం. సన్నగా, పొడుగ్గా ఉన్న అతను తనని తాను వీవెన్ గా పరిచయం చేసుకున్నారు. అదే తొలిసారిగా, కడసారిగా చూడటం. అప్పటికే తను ప్రత్యక్ష పరిచయం లేకున్నా - అంతర్జాలములో తను తెలుగు బ్లాగర్స్ గ్రూప్ కీ, తెలుగు టైపింగ్ వ్యాప్తికీ, వీకీపీడియా లో తెలుగు వ్యాసాలు పెరగాలన్న తలంపుతో - చాలా ప్రయత్నాలు ఒంటరిగా చేసి, అమోఘమైన విజయం సాధించారు. తెలుగులో ఉన్న " వీవెనుడి టెక్నికులు " అనే బ్లాగ్ - బ్లాగ్ ప్రారంభించిన తొలినాళ్ళలో చాలా బ్లాగర్స్ కి పెద్దబాల శిక్ష అని అనడంలో ఏమాత్రం సందేహం పడక్కరలేదు. అంతర్జాలములో తెలుగుని అచ్చురూపములో పెంపొందించేందుకు మరికొందరితో కలసి చాలా శ్రమించారు. కానీ ఎక్కడా నేను ఇదంతా చేశాను అని ప్రకటించుకోని నిగర్వి ఆయన. చాలామంది వాడే " లేఖిని " ( www.lekhini.org ) అనే తెలుగు టైపింగ్ టూల్ నీ అందుబాటులోకి తీసుకవచ్చిందీ ఆయనే. అంతర్జాలములో తెలుగు భాషకి ఎనలేని సేవ చేశారు.

ఒకసారి బ్లాగర్స్ మీటింగ్ లో నేను తనని కలిసాను అని అన్నానుగా.. అప్పుడు ప్రతి బ్లాగర్ తన గురించి చెబుతూ - తాను అంతర్జాలములో ఏమేమి చేస్తున్నారో చెప్పాల్సిందిగా కోరినప్పుడు - నా వంతు వచ్చినప్పుడు నేను లేచి - నా బ్లాగ్ గురించీ, తెలుగు టైపింగ్ గురించీ, తెలుగు వీకీపీడియాలో ఉన్న కంటెంట్ ని తప్పొప్పులు సరిదిద్దడం, క్రొత్తగా మరింత విషయాన్ని చేర్చడం గురించి నేను చెప్పినప్పుడు తను నన్ను కరతాళ ధ్వనులతో మెచ్చుకున్న సందర్భం ఇప్పటికీ నాకు గుర్తుంది. చివరిగా సభ అధ్యక్షోపన్యాసం ఇస్తూ - అంతర్జాలములో తెలుగు వ్యాప్తికి మీకు తోచిన సలహాలు, సూచనలు ఇవ్వమని కోరితే నేనూ కొన్ని చెప్పా.. కానీ అవి ఆదరణకు నోచుకోలేదు. అప్పుడే నాకు మదిలో మెలిగిన ఒక ఐడియా ని నా బ్లాగ్ ద్వారా మొదలెట్టాను. నా బ్లాగ్ లో తెలుగు టైపింగ్ ని ఎలా వ్రాయాలో పాఠాలు మొదలెట్టాను. ఇవి " తెలుగులో టైపింగ్ చెయ్యడం ఎలా? - పాఠాలు " ( https://achampetraj.blogspot.in/search/label/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B1%81%20%E0%B0%9A%E0%B1%86%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A1%E0%B0%82%20-%20%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 ) అనే లేబుల్ క్రిందన కనిపిస్తాయి. ఈ పాఠాలకు  ప్రేరణ అంతా తానే...


తన ప్రయత్నాల వల్ల తెలుగు బ్లాగ్స్ ఎంతో ఖ్యాతిని పొందాయి. నా బ్లాగ్ కూడా తను చేసిన సహాయం వల్ల చాలామందికి చేరువైంది. తరవాత ఆయన ఆబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఎన్నో సమావేశాలు నిర్వహించినా - నాకు సమయం కుదరక వెళ్ళలేకపోయా..

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.


Wednesday, September 6, 2017

Good Morning - 665


కాలం - స్థిరంగా ఉండకుండా ఎప్పుడూ కదిలిపోతూనే ఉంటుంది. నిన్నటి బికారి నేడు ఈలోకంలో అత్యంత సంపన్నుడు కావొచ్చును. నేటి కోటీశ్వరుడు రేపు బిచ్చగాడిలా మారిపోవచ్చును. నిన్న, నేడు, రేపు ఎలాంటి పరిణామాలైనా కలిగించవచ్చు. మనిషి విజ్ఞతతో ఈ మూడు కాలాలను సద్వినియోగం చేసుకొని, జీవితాన్ని నిలబెట్టుకోవాలి. కాలాన్ని వృధా చేసి, చేతులు కాల్చుకోకూడదు.. Monday, September 4, 2017

Good Morning - 664


జీవితములో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు.. 
చెట్టు ఆకులు రాలిన ప్రతిసారీ క్రొత్త ఆకులు చిగురిస్తాయి. Related Posts with Thumbnails