Showing posts with label Introduction. Show all posts
Showing posts with label Introduction. Show all posts

Monday, February 8, 2010

కృతజ్ఞతలు

మొన్న నా బాగుని దర్శించిన ఒక బ్లాగరు పేజిలో కనిపించిన లింక్ ని నొక్కి, నా బ్లాగును IndiBlogger గ్రూప్ లో చేర్చుకోమన్నాను.. వారికి - అలా చేర్చుకోవటానికి కొన్ని (8) నియమనిబంధనలు ఉన్నాయట. వాటి లింక్ పంపితే చూసాను.. బాగున్నాయి.. OK .

సరేలే! పోనీయండి.

నేనేమీ రేగులర్గా బ్లాగులోకి ఉండాలని రాలేదు.. బహుశా ఈ సంవత్సరం చివరివరకు మైంటైన్ చేస్తాను. ఆ తరవాత వీలున్నప్పుడు.. అని అనుకున్నాను. అందుకే నేను వ్రాయాల్సినవి చాలా టపాలు ఉన్నాయి. అవన్నీ త్వరలోనే వ్రాసేయాలి.. అయినా నేను చెప్పాలనుకున్నవి చెప్పటానికి నేను బ్లాగుని పెట్టాను. చెప్పాల్సింది చెబుతాను.. వారి మెయిల్ చూసాక వెంటనే, సింపుల్గా " Thankyou verymuch for REJECTING of my request.." అని ప్రత్యుత్తరం పంపాను. ఎందుకలా పంపానంటే - ఇప్పటికే రెండు, మూడు రోజులు ఎదురుచూసాను. మన ప్రభుత్వాల నుండి వచ్చే రిప్లై లాగా లేటుగా ప్రతి జవాబు వస్తుందేమో, ఎంతగా ఎదురుచూడాలో అనుకున్నాను. కాని తొందరగానే ప్రత్యుత్తరం పంపారు. అందుకే కృతజ్ఞతలు చెప్పుకోవాలని అలా రిప్లై పంపాను. అంతేగాని అదేమీ దుందుడుకు చర్య కాదని సవినయముగా తెలియచేసుకుంటున్నాను.

Monday, January 18, 2010

నేను - ఈ బ్లాగు ఎందుకోసం అంటే!

నా ఆలోచనలూ, అభిప్రాయాల్ని పంచుకోవాలన్న తలంపుతో ఈ బ్లాగ్ లోకి వచ్చాను.. చాలా రోజుల క్రిందటే బ్లాగును తెరచిననూ పనుల వత్తిడిలో సరిగా నిర్వహించలేకపోయాను. (ఇప్పుడూ సరిగా నిర్వహించలేకపోతున్నాను.) ఇందులో ఏమి రాసుకోవాలో తెలీక ఆర్భాటముగా మొదలెట్టిన నేను అంతలోగానే జావ కారిపోయాను. ఒక సోషల్ సైట్ లో ఒక కమ్యునిటీ లో నా స్నేహితురాలు చేరిందని నేనూ సభ్యుడనై, సరదాగా సినిమా పాటలు రాసేవాడిని. నేను అందులో సభ్యుడను కాకముందు అస్తవ్యస్తముగా ఉన్న ఆ కమ్యూనిటీ చాలా నీటుగా మారింది. అందులో ఇప్పటికీ ఎక్కువగా నా ప్రభావమే కనపడుతుంది. తరవాత ఆ కమ్యూనిటీ ఓనర్ ఆసక్తి చూపక పోవడముతో అందులోంచి నేను రాసిన పాటలతో బయటకివచ్చాను. అవన్నీ వృధా కాకుండా అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశ్యముతో ఈ బ్లాగులో పోస్ట్ చేసాను. ఇదీ నేను ఈ బ్లాగు పెట్టడానికి గల మొదటి కారణము. తరవాత మళ్ళీ కారణాలు మారాయి.

ఆ తరవాత ఒక సోషల్ సైట్ లోన, నా ఫోటో ఆల్బం లోన ఫొటోస్ ఏమి పెట్టాలో తెలీక నెట్లో సేకరించిన ఫొటోస్, నా మిత్రులు, నేను సభ్యత్వం తీసుకున్న గ్రూపులూ పంపే ఫోటోలతో అందులో పెట్టేవాడిని.. మొదట్లో వాటిని చూసి మొఖం చిట్లించుకున్నవారు ఇప్పుడు వాటిని క్రమం తప్పకుండా చూస్తున్నారు. కొంతమందికి ఫొటోస్ నచ్చి వారికీ పంపమంటే మొదట్లో పంపాను.. కాని రాను రానూ అలాంటి విన్నపాలు మరీ ఎక్కువయ్యాయి. అందరికీ పంపటం చాలా కష్టమయ్యింది. చివరికి వారందరినీ కాదనలేక నా బ్లాగులో పెడితే ఎలా అన్న ఆలోచనతో "photo album" అన్న లేబుల్ కింద మొదటి ఫోటో పెట్టి కొద్దిగా స్టొరీ రాసాను ఫోటో .. తరవాత చాలా రోజుల వరకూ పట్టించుకోలేదు.

మొన్న మొన్నటి వరకూ అలా వదిలేశాక నా మెయిల్ బాక్స్ కడిగేద్దామని చూసాను.. అప్పటికే అందులో చాట్లూ, ఫోటోలతో చాలా వరకు మెయిల్ బాక్స్ నిండిపోయాయి. అలానే ఉంచేస్తే మెయిల్ బాక్స్ ఫుల్ అని ఎర్రర్ వస్తుందని (నిజానికి వస్తుందా నాకూతెలీదు.. వస్తుందంట) అవన్నీ డెలీట్ చేద్దామంటే అన్నీ అలాగే ఉన్చేసుకోవాలనిపించింది. కొన్నేమో కావాలన్న వారికీ మెయిల్ చేద్దామని అనుకున్నాను. అలా ఎన్ని చేయను?.. చేయగలను?. నాకూ అవసరమే కదా అని మధ్యేమార్గముగా నా బ్లాగులో పెడితే అన్న ఆలోచన వచ్చింది... .... ....

ఎస్!!! నిజమే మంచి ఆలోచన.
1. మనమేమీ డబ్బులకోసమని పెట్టడం లేదుగా! అలా పెట్టడం వల్ల నాకొచ్చే లాభం ఏమీలేదు.


2. మిత్రులకందరికీ పోస్ట్ చెయ్యలేను. వారికీ అవసరం ఉంటే ఇక్కడనుండి డౌన్లోడ్ చేసుకుంటారు.


3. నా మెయిల్ బాక్స్ లో వట్టిగా ఎన్నిరోజులని దాచుకుంటాను.? పంచుకుంటే పోయేదేమీ లేదుగా!!


4. అందులోంచి బాగున్నవీ, అందరికీ ఉపయోగపదేటివీ, కాపీ రైట్ లేనివి చూసి ఇక్కడ పెడుతున్నాను.


5. ఉచితముగా యే లాభాపేక్షలేకుండా అన్నిటినీ పెడుతున్నాను.


6. ఎక్కడ  పొందినవి అక్కడే కొంచెం వదలాలి అన్నది - నా అభిమతం.


7. నా మెయిల్ బాక్స్ లన్నీ నిండు గర్భిణీ లా ఉన్నవి కాస్త తేలిక అవుతాయి.


8. అందులో నుంచి తీసి ఇందులో పెడితే నా మెయిల్ బాక్స్ తేలిక అవుతుంది. మరియు నలుగురికీ ఉపయోగపడొచ్చు.


9. ఎవరికీ ఇష్టమున్నవి వారు డౌన్లోడ్ చేసుకుంటారు.


10. నేనైనా ఇవే కావాలనుకుంటే మెయిల్ బాక్స్ లో వెదుక్కోవాల్సివస్తున్నది. ఇలా పెడితే ఈజీగా మళ్ళీ చూసుకుంటున్నాను.


11. నాకు ఇవి పంపించిన వారు యే లాభాపేక్ష లేకుండా పంపినప్పుడు నేను ఎలా ఎందుకు లాభం చూసుకోవాలి?


12. నా మెయిల్ బాక్స్ లిమిట్ వచ్చాక డిలీట్ చేసే బదులు అలా రాకముందే ఖాళీగా ఉంచితే బాగుంటుంది కదా!


13. ఆ తరవాత వచ్చే మెయిల్స్ కి తగిన జాగా ఉంటుందిగా.


14. ఇక ఫోటోలమీద నా బ్లాగు పేరు సంగతి. నా బ్లాగునుండి మీరు అది డౌన్లోడ్ చేసుకున్న గుర్తుగా అలా ఉంచుతున్నాను. కాని వాటి మీద అంటే ఆ ఫోటోల మీద నాకు ఇలాంటి హక్కులు, కాపీ రైట్స్ గాని లేవని మీకు సహృదయముతో విన్నవించుకుంటున్నాను.


15.ఒక సోషల్ సైట్ లో నా ఆల్బం ఫొటోలకి డిమాండ్ ఉన్న దృష్ట్యా ఇక్కడ పెడితే బాగుంటుందన్న దృష్టితో పెట్టాను. చాలా మందికి నచ్చాయి.


16. ఇంగ్లీషులో పెట్టినవి తెలుగులోకి మార్చలేక అని కాదు..అలా మార్చి ఆ క్రెడిట్ అంతా నాదే అని గొప్ప చెప్పుకోవచ్చు. అలా మార్చి పెట్టి నేను.. సంతోషముగా ఉండలేను. ఇంగ్లీషులోని మూలము బాగా అర్థవంతముగా ఉంది కదా.. నేను మార్చటం ఎందుకూ.. క్షమించాలి.


17. ఒకరకముగా చెప్పాలంటే నావన్నీ.. ఇక్కడ ఓపెన్ గా దాచుకోవడం లాంటిది.ఇంకా ఈ సంవత్సరములోన నా బ్లాగుని నా పాఠాలతో (lessons) పూర్తిగా నింపాలి.

ఇవన్నీ చదివాక మీకేమైనా ఆక్షేపణలు, సూచనలు, సలహాలు, విమర్శలూ, తొలగింపు సూచనలూ తెలియ చేయాలనుకుంటే కామెంట్స్ (వాఖ్యలు) వ్రాయండి. అందరూ కామెంట్స్ వ్రాయడానికి వీలుగా anonymous వారికీ వీలుగా సెట్టింగులు పెట్టాను.

Friday, October 31, 2008

Introduction

    నమస్కారములు,

    నా పేజి చూస్తున్నందులకు/చదువుతున్నందుకు మీకు నా కృతజ్ఞతలు..



    నేను నా జీవితంలో ఎన్నో ఎగుడు, దిగుల్లని చూసాను. ఇంకా చూస్తూనే ఉన్నాను. ఫలితంగా ఎన్నో విషయాలు తెలిసాయి/తెలుస్తూనే ఉన్నాయి. ఇందులో దాదాపుగా అన్నీ నేను చవిచూసినవే.. "ఇన్ని" అనుభవాలను పొందానుగా! ఇవ్వన్నీ నా "స్వంతం" అనుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే నాకంటూ ఒక బ్లాగ్ పేజీని తయారుచేసి.. అందులో చిన్నవీ, పెద్దవీ, అవసరమా, కాదా ఆలోచన లేకుండా అన్నీ (చెత్త, చెదారం) విషయాలు మీముందున్చాలని, అనుకొని బ్లాగ్ పేజిని తయారు చేస్తున్నాను.

    మనము సాధారణంగా మనకెవరైనా మంచి మాటలు చెబితే - "చాలు! నాకు తెలుసులే!! "అంటూ అడ్డు తగులుతాము - అవతలివారు మనకు మేలు కోరి, సాహసం చేసి మరీ చెప్పినా.. మనమూ ఒక మంచి విషయం చెప్పాలని వారితో చెబితే ... మనతో సంభందాలు అన్నీ తెంచుకుంటారు.. 

    ఒక నెల క్రితం మధు (ఒరిస్సా) అనే ఒక అమ్మాయి ఓ ఫ్రెండ్ నా సోషల్ సైట్ పేజిలో చూసి.. ప్రొఫైల్ నచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే ఒకే అంది తను.. ఆ వెంటనే తన మొబైల్ నెంబర్ ఇచ్చింది - నా స్క్రాప్ గా. నేను - అలా మొబైల్ నెంబర్ స్క్రాప్ లో రాస్తే ఎలా? ఈ-మెయిల్ చేస్తే బాగుండేది గదా.. నీకే ఇబ్బంది కదా! అని - అంటే ఆమె , ఆమె ఫ్రెండ్ లు నా పేజి లోనుండి "కట్" అయ్యారు.. ఆఖరికి వారి స్క్రాప్ లు కూడా తీసేసారు.. ఆఫ్కోర్స్ నాకేమి బాధగా లేదు! ఫ్రెండ్ గా చెబితే వినక పోతే మనమేమి చేస్తాము.. నేనూ కూడా అంతేలే! (నిజం ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి కదూ). మనకు తెలుసన్నది నిజంగా ఆచరణలోకి వచ్చేటప్పటికి పరిస్థితి ఎదురుతిరిగితే అయ్యో అని అనుకుంటాము. కాని మన ఓటమిని అంగీకరించము. అదే మనిషి నైజమ్. "అయ్యో! అప్పుడే వినకపోతిమి కదా!.. సమయము, డబ్బు, శ్రమ.. అన్నీ వృధా అయ్యాయి కదా!.." అని తీరికగా చింతిస్తాము - అప్పుడలా చేయకపోతే చాలా బాగుందేడిది- అని ప్రతి ఒక్కరూ జీవితములో ఒక్కసారైనా అనుకొని ఉండవచ్చు. 

    అప్పుడలా ఉన్నా నేను (కొద్దిగా) మారాను.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా మిత్రులను, శ్రేయోభిలాషులను, ముఖ్యముగా ఆ సమస్యను అంతకు మునుపే ఎదుర్కున్న వారిని సలహాలు మాత్రమే అడిగి, నా స్వంత నిర్ణయం తీసుకున్తున్నానిప్పుడు.. ఫలితముగా నా జీవితము చాల మారింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది- ఈ పనేదో ఊహ వచ్చినప్పటినుండి చేస్తే ఈ పాటికి నా జీవితం తీర్చిదిద్దినట్లుగా ఉండేది.. 

    నాకే ఇంత లాభం అనిపించినప్పుడు మిగతావారి సంగతి? తర్వాత చాలామందికి పరిష్కార మార్గాలు చెప్పి, నిర్ణయం మాత్రం వారినే తీసుకోమంటున్నాను. ఎందుకంటే వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఫలితం వారే అనుభవిస్తారు కాబట్టి. ఫలానా వారి మాటలు వినీ నా జీవితం ఇలా తగలబడింది - అని అనుకోకుండా ఉంటారని. చాలా మందికి మేలు చేసాయి - అది చిన్నదో, పెద్దదో.. మొత్తానికి వారి జీవితానికి మేలు కలిగిందన్న చిన్న సం+తృప్తి . పెద్ద పరిష్కారమైతే ఏదో అనుకోవచ్చును కాని చిన్న దానికి కూడా లైఫ్ బాగుపడుతుందా? అంటే నేను మాత్రం ఎందుకు బాగుపడదు? అని అంటాను. మన నిజ జీవితములో మనము ఉపయోగించే చాలా వస్తువులు చిన్న చిన్న పరిష్కార మార్గల్లోనే..ఆలోచన ధోరణి నుంచే ఆవిష్కరించబడ్డాయి. ఉదాహరణకు ప్రయానించీటప్పుడు మ్యూజిక్ వినాలన్న సమస్యకు జవాబుగా వాక్ మాన్, ఐ-పాడ్ తయారయ్యాయిగా. ఇక్కడ శ్రమ ఎంత ఉన్ననూ- సైజు చిన్నగా, తక్కువ ఖరీదు, ఎక్కువ సామర్థ్యం.. మొదలగునవి అన్నీ చిన్న చిన్న పరిష్కారమార్గాలే ఆ సమస్యలకు జవాబు చెప్పాయి. 

    ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే మనకు చిన్నగా ఉన్నా సమస్యలు వేరొకరికి పెద్దగానే ఉంటాయి.. మొదట్లో నాకైతే కంప్యూటర్ మౌస్ ను డబుల్ క్లిక్ చేయవచ్చేది కాదు.. నేడు చాలా తేలిక. .... అందుకే చిన్న చిన్న విషయాలనుంచి పెద్ద పెద్ద విషయాలు అన్నీ చెప్పాలనీ అనుకుంటున్నాను.. అందులో మీకు నచ్చిన విషయాలు శుభ్రముగా ఆచరణలో వాడుకోవచ్చును. నేను చెప్పే విషయాలనుండి మీరేమైనా లబ్ది పొందితే - ఈ బ్లాగ్ లక్ష్యం నెరవేరినట్టే..

    నా జీవితంలో నాకు ఎన్నో అనుభవములు చవి చూపించిన తల్లి తండ్రులకూ, గురువులకూ, మిత్రులకూ, బంధువులకూ, శత్రువులకూ, అజ్ఞాత వ్యక్తులకూ.. మరెందరికో ఋణపడిఉంటాను..



    Related Posts with Thumbnails