చిత్రం: నచ్చావులే!.. (2008)
సంగీతం: శేఖర్ చంద్ర
రచన: భాస్కరభట్ల రవికుమార్
కథ, కథనం & దర్శకత్వం: రవిబాబు
గానం: రంజిత్
********************
పల్లవి:
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా.. (2)
ఐ అమ్ సో సారీ బేబీ ఓఓ…. ఐ అమ్ రియల్లీ సారీ బేబీ ఓఓఓ….
ఓహ్ చెలి పొరపాటుకీ గుణపాఠమి ఇకా ఇకా
మౌనమీ ఉరితాడులా విసిరెయ్యకే ఇలా ఇలా // మన్నించవా మాటాడవా //
చరణం 1:
నావల్ల జరిగింది తప్పు నేనేమి చెయ్యాలో చెప్పు
పగపట్టి పామల్లె నువ్వు బుసకొట్టకే
కోపంగా కన్నెర్ర చేసి కారాలు మిరియాలు నూరి
ఏవేవో శాపాలు గట్రా పెట్టేయ్యకే
కాళ్ళ వేల్ల పడ్డా కూడా ఊరుకోవా కుయ్యో మొర్రో అంటూ ఉన్నా
అలక మానవా అందం చందం అన్ని ఉన్న సత్యభామ
పంతం పట్టి వేధించకే నన్ను ఇలా
ఓహ్ చెలీ చిరునవ్వులీ కురిపించవా
హూ హూ రాదని విదిలించకే బెదిరించకే ఇలా హో // మన్నించవా మాటాడవా //
చరణం 2:
అరగుండు చేయించుకుంట - బ్లేడ్ ఎత్తి కోసేసుకుంట
కొరడాతో కొట్టించుకుంటా - క్షమించవే!
కాదంటే గుంజిళ్ళు తీస్తా - ఒంగొంగి దండాలే పెడతా
నూటొక్క టెంకాయ కొడతా - దయ చూపవే
గుండెల్లోన అంతో ఇంతో జాలే లేదా
ఉంటే గింటే ఒక్కసారి కనికరించావా
ఫ్రెండ్ షిప్ అంటే అడపా దడపా గొడవే రాదా
సారీ అన్నా సాధిస్తావీ నీడలా ఓహ్ చెలీ ఎడబాటునే కలిగించకే ఇలా
ఇలా నన్నిలా ఏకాకిలా వదిలేయకే అలా // మన్నించవా మాటాడవా //
No comments:
Post a Comment