చిత్రం: మాతృదేవోభవ (1993)
రచన: వేటూరి
సంగీతం: M.M. కీరవాణి
గానం: M.M. కీరవాణి
*******************
పల్లవి:
రాలిపోయే పూవ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే
లోకమేన్నాడో చీకటాయేలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికి మా చిలుక పాడకు నిన్నటి నీ రాగం // రాలిపోయే //
చరణం 1:
చెదిరింది నీ గూడు గాలిగా
చిలకగోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు
కన్నీటి దీపాలు కాగా ఆ..
తనవాడు తారల్లో చేరగా
మనసు మాంగల్యాలు జారగ
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతపు నీవై
వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై
ఆశలకై హారతివై // రాలిపోయే //
చరణం 2:
అనుబంధమంటేనే అప్పులే
కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంతరాగాల చేమంతులే వాడిపోయే ఆ..
తనరంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలు కొండెక్కి పోయే
పగిలే ఆకాశం నీవై
జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై
తీగ తెగే వీణియవై // రాలిపోయే //
1 comment:
ఇది రాసిన కవికి పాదాభివందనాలు :)
Post a Comment