Monday, February 2, 2009

సప్తపది - గోవుల్లు తెల్లనా..చిత్రం: సప్తపది (1981)
రచన: వేటూరి
సంగీతం: కె.వి.మహదేవన్
గాయకులు: S.P.బాలు, S. జానకి
****************


పల్లవి:

గోవుల్లు తెల్లనా - గోపయ్య నల్లన
గోధూళి ఎర్రనా - ఎందువలన.. // గోవుల్లు తెల్లనా //

చరణం 1:

తెల్లావు కడుపుల్లో - కర్రావులుండవా? ఎందుకుండవ్?
కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా.. ఏమో? (2)
గోపయ్య ఆడున్నా - గోపెమ్మ ఈడున్నా
గోధూళి కుంకుమై - గోపెమ్మకంటదా ఆ పొద్దు పొడిచేనా..
ఈ పొద్దు గడిచేనా.. ఎందువలనా అంటే - అందువలన
ఎందువలనా అంటే - దైవఘటన // గోవుల్లు తెల్లనా //

చరణం 2:

పిల్లన గ్రోవికీ - నిలువెల్ల గాయాలూ.. పాపం!
అల్లన మొవికీ - తాకితే గేయాలూ.. ఆహా!
ఆ మురళి మూగైనా - ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో - ఈ పాట నిండదా?
ఈ కడమి పూసేనా - ఆ కలిమి చూసేనా
ఎందువలన అంటే - అందువలన ఎందువలనా అంటే - దైవఘటన // గోవుల్లు తెల్లనా //

No comments:

Related Posts with Thumbnails