చిత్రం: రోజా (1992)
రచన: రాజశ్రీ
సంగీతం: A.R. రెహమాన్
గానం: S.P.బాలు
హమ్మింగ్స్: సుజాత
**************
పల్లవి:
ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ.. ఆ నా చెలి రోజావే
నాలో ఉన్నవే నిన్నే తలచేనే నేడే (2)
కళ్ళల్లో నీవే - కన్నీటా నీవే కనుమూస్తే నీవే -
ఎదలో నిండేవే కనిపించవో - అందించవో తోడు! // నా చెలి రోజావే //
చరణం 1:
గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంటా..
నీవు లేకపోతే బతుకు దండగంటా
కనిపించవో అందించవో తోడు // నా చెలి రోజావే // ఆ ఆ ఆ .. ఆ ఆ
చరణం 2:
చెలియ చెంతలేదులే చల్లగాలి ఆగిపో
మమత దూరమాయనే చందమామ దాగిపో
కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడులేదు గగనమా చుక్కలాగ రాలిపో
మనసులోని మాట ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడు // నా చెలి రోజావే //
No comments:
Post a Comment