చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) 
రచన: దాశరధి 
సంగీతం: S.రాజేశ్వర రావు 
గానం: P.సుశీల 
************** 
పల్లవి: 
వినిపించని రాగాలే 
కనిపించని అందాలే 
అలలై మదినే కలచే 
కలలో ఎవరో పిలిచే // వినిపించని రాగాలే..// 
చరణం 1: 
తొలిచూపులు నాలోనే - వెలిగించే దీపాలే (2) 
చిగురించిన కోరికలే - చిలికించెను తాపాలే 
వలచే మనసే మనసు.. // వినిపించని రాగాలే..// 
చరణం 2: వలపే వసంతములా - పులకించి పూచినది (2) 
చెలరేగిన తెమ్మరలే - గిలిగింతలు రేపినవి 
విరిసే వయసే వయసు.. //  వినిపించని రాగాలే..// 
చరణం 3: 
వికసించెను నా వయసే - మురిపించు ఈ సొగసే (2) 
విరితేనెల వెన్నెలలో - కొరతేదో 
కనిపించే ఎదలో ఎవరో మెరిసే.. //వినిపించని //
Sunday, February 8, 2009
Subscribe to:
Post Comments (Atom)
 
 
 
 
 
 
 
 
 
 

 
No comments:
Post a Comment