Saturday, August 8, 2009

పిసినారితనం - చేటు

జీవితములో చాలా చిత్రాతి చిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి.. కొన్ని నవ్వు పుట్టిస్తే, మరి కొన్నేమో నవ్వాలో, ఏడవాలో తెలీని సంఘటనలు అనేకం ఉంటాయి.. చాలా మందిలో లోభత్వం ఎలా ఉంటుందో, వారికి జరిగే నష్టాలు ఏమిటో వారు తెలుసుకోరు..

నేను ఇప్పుడు ఇలాంటిదే ప్రత్యక్ష్యముగా చూసిన సంఘటనని మీకు చెబుతాను. మీకూ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అంతా చదివి వారి పట్ల దయ చూపుతారో, జాలి పడతారో, నవ్వుకుంటారో.. మీ ఇష్టం. చిన్న చిన్న విషయాలకు, పిసినారితనం చూపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు మీరూ తెలుసుకుంటారు.

నేను ఇన్కంటాక్స్ (ఆదాయపు పన్ను) ఫైల్ చెయ్యటానికి ఒక చార్టెడ్ అకొంటేంట్ దగ్గరికి వెల్లుతుండేవాడిని. ఎప్పటిలాగానే ఈసారీ వెళ్లాను.. ఫైల్ చేశాను.. వచ్చిన టాక్స్ ని కట్టేసి, నా డాకుమెంట్స్ ని CD లోకి కాపీ చేసుకోవటానికి వెళ్లాను.. నా ఫైల్ ఎక్కడ ఉందో కూడా తెలీకపోతే కంట్రోల్+F పద్దతిలో నా ఫైల్ దొరికించుకొని, కాపీ చేసుకున్నాను.. ఆ తరవాత మా చర్చ కంప్యూటర్ పరిజ్ఞానం మీదకు మళ్ళింది. (వారు నాకంటే ముందుగా కంప్యూటర్ ని నేర్చుకున్నారు, అదీ కోచింగ్ సెంటర్ లో.. వారు నేర్చుకున్నాక రెండు సంవత్సరాలకి నేను నా కంప్యూటర్ మీదే స్వంతముగా నేర్చుకున్నాను.) "మీరు ఏ అంటి వైరస్ సాఫ్టువేరు వాడుతున్నారు" అని. "అవాస్ట్ వాడుతున్నానని" చెప్పాను. వాళ్ల సిస్టమ్ అన్నీ వైరస్ తో ఉన్నాయట. "ఒకసారి మీకు అవాస్ట్ అంటి వైరస్ ఉచితముగా మీకు కాపీ చేసి ఇచ్చానుగా.." అంటే అది ఇన్స్టాల్ చేస్తే లోగా అది ఎక్కడో పడిపోయినదన్నారు. మరి ఇప్పుడు? అని అంటే "మొన్ననే క్విక్ హీల్ అంటివైరాస్ CD కొన్నామండీ 1150-00 రూపాయలు పెట్టి మరీ.. అది ఆ నెట్ కనెక్షన్ ఉన్న ఆ సిస్టమ్ లో మాత్రమే లోడ్ చేసాము.. మిగాతా మూడు సిస్టమ్ లలోకి ఇంకో మూడు అంటివైరాస్ CD లు కొని అందులో ఇన్స్టాల్ చెయ్యాలండీ!.." అన్నారు. నాకైతే నవ్వాలో, ఏడవాలో తెలేట్లేదు.. అలాని ఎందువల్లో ఇప్పుడు డిటైల్డ్ గా చెపుతాను..

వీరి ఆఫీస్ ఒక బంగ్లా పైన మొదటి ఫ్లోర్ లో ఉంటుంది. నాలుగు సిస్టమ్ లు ఉన్నాయి అందులో. ఒకటి బాస్ కి, రెండోది వారి ఆవిడ సిస్టమ్ కి, మిగిలిన రెండూ వారి అసిస్టెంట్ లవి. ఇప్పుడు ఆంటివైరాస్ + నెట్ కనెక్షన్ ఉన్న సిస్టమ్ ఆవిడది. నెట్ అంటే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ అనుకునేరు.. 200 రూపాయలకి 600 గంటల నెట్ వచ్చే 36kbps కనెక్షన్ అది.. ఇక బాస్ ది అధునాతనమైన లేటెస్ట్ వర్షన్ సిస్టమ్ - LED మానిటర్ తో. ఈ సిస్టమ్ కి అంటి వైరస్ అప్ డేట్ లేదు. ఉన్న ఫైల్స్ అన్నీ అందులోనే ఉంటాయి. ఫైనల్ గా జరిగేవి, స్టోర్ చేసేవి ఇందులోనే ఉంటాయి. వర్డ్ ఫైల్ ఫార్మటు లో వీరి ఫైల్స్ ఒక CD లో కూడా బర్న్ చెయ్యరు అదో అనవసర ఖర్చు అని. ఎప్పుడైనా అవసరం వస్తే పాత కాపీలు అసిస్టంట్ లతో తీయించి, వాటిని టైపింగ్ ద్వారా మళ్ళీ సిస్టమ్ లోకి ఎక్కించి.. పెన్ డ్రైవ్ ద్వారా ఇంకో సిస్టమ్ లోకి కాపీ చేసుకుంటారు.. నవ్వొస్తుందా నిజమేనండీ బాబూ! ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది కూడా.. వీరి ఆఫీస్ ఎదురుగా అదే ఫ్లోర్ లో కేవలం మూడంటే మూడే అడుగుల దూరములో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఈ బాస్ సిస్టమ్ ని ఫార్మాట్ చేసింది వీరే.. "ఎక్కడ ఏమి తేడా వచ్చిందో" తెలీదు గాని.. (ఫార్మాట్ చేసిన డబ్బులు వారికి ఇంకా ఇవ్వలేదని వినికిడి) వీరి సిస్టమ్ ఏమైనా ప్రొబ్లెమ్స్ వస్తే, వీరు ఎంతగా పిలిచినా అప్పుడు.. సాయంత్రం.. రేపు.. మళ్ళీ ఫార్మాట్ చెయ్యాలి అంటూ వీరు సమాధానం ఇస్తున్నారట.

ఈ చార్టెడ్ అకౌంటెంట్ తన కస్టమర్ల వద్ద ఇంకంటాక్స్ ఫైలింగ్ కోసం ఒక్కొక్కరి వద్ద కనీసం వేయి రూపాయలు వసూలు చేస్తాడు. పెద్ద ఆదాయం ఉన్నవారికైతే ఇంకా ఎక్కువ చార్జీ.. ఇలాంటి వారు ఫార్మాట్ చేసిన డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు. ఇప్పుడేమైయింది.? నన్నూ అడిగారు.. ఎలా చెయ్యాలా అని? ఈ పిసినారి కి నేనేమీ చెప్పలేదు కావాలనే!

మీకు ఈ సంఘటనలో మీరు అర్థం చేసుకోవాల్సిన / ఆకళింపు చేసుకోవలసిన విషయాలేమిటో / నీతి ఏమిటో ఇప్పుడు చూద్దాం..

* ఎదురుగా మూడంటే మూడే అడుగుల దూరములో ఉన్నవారినే సరిగా పట్టించుకోవటం లేదు, ఇక మనల్ని ఇంకేం పట్టించుకుంటారు?

* చిన్న విషయాలకీ /చేసిన సేవలకి తగిన కర్టెసీ (టీ, కాఫీ, కూల్ డ్రింక్..) ఇద్దామన్న లౌక్యం లేనివాళ్ళకి మనం సేవలు అందించడం వృధా ప్రయాస.

* సేవలు చేయించుకున్నాక వారి సేవలకి తగిన ప్రతిఫలం ఇచ్చేస్తే, మళ్ళీ మనకెప్పుడు సమస్యలు వచ్చినా వెంటనే వస్తారుకదా..

* అంటివైరస్ 150 రూపాయలు (ఫార్మాట్ కి ) ఇచ్చేస్తే సరిపోయేదిగా.. వీరు టాక్స్ ప్రాబ్లంలతో వారి వద్దకి వెడితే వారూ ఉచితముగా సేవలు అందించరుగా..? (ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న). మనం పొందిన సేవలకి తృణమో, ఫణమో ఇవ్వాలని ఇస్తే వారికి ఋణపడి ఉండముగా.. (ఇది ఎలానో ఇంకోసారి చెబుతాను - పూర్వ కాలములో పెద్దలు ఇలా ఆచరించేవాళ్ళు)

* కొద్దిపాటి డబ్బులకి కక్కుర్తిపడి వారి మనసులను గెలుచుకోవడములో విఫలం అయ్యారు. రేపు వీరి ఆఫీస్ లో ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా అవసరం ఉంటేనూ, దొంగలు పడ్డా.. . వారు చూసి చూడనట్లు ఉన్నా చెప్పలేం..

* కంప్యూటర్ కోచింగ్ సెంటర్ కాబట్టి నెట్ ఎలాగూ ఉంటుంది. ఉంది కూడా.. ఒక "యాభై రూపాయలు" మనది కావంటే అవాస్ట్ .. మొదలైన ఉచిత అంటివైరస్ సాప్ట్ వేర్స్ అప్-డేట్ గా మన సిస్టమ్ లో వారే లోడ్ చేసేవారుగా.. అలాగే ఎంచక్కా ఫైల్స్ సర్ది ఉంచేవారుగా..

* ఒక అంటివైరస్ CD కొన్నారు. కాని అది ఆఫీసు లోని అన్ని సిస్టమ్ లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్న కనీస జ్ఞానం లేనప్పుడు.. ఆ విషయం తెలిసి, మనకి చెప్పి , మేలు చేసే వారితో పోట్లాడటం భావ్యమా?

* దగ్గరలోని వారు కాబట్టి 200 రూపాయలతో సిస్టం ఫార్మాట్, అంటివైరస్ అప్ డేట్, మ్యూజిక్ ప్లేయర్స్, ఫైర్ వాల్స్, ఆపరేటింగ్ సాఫ్టు వేర్ అప్ డేట్.. ఇలా అన్నీ వారే చూసెడివారుగా..

* అన్నింటికన్నా మరో ముఖ్య విషయం: కేవలం చిల్లర డబ్బులకోసం / మిగులుతాయని ప్రయత్నిస్తే నోట్లే పోతున్నాయి ఇక్కడ.. వెనకటికి ఇలాంటి పరిస్థితిని ఒక్కమాటలో ఇలా అంటారు: "ముందునుంచి చీమ నైనా పోనీయరు గాని ఏనుగులు పోతుంటే పట్టించుకోరు ఇలాంటివారు" అని. ఇది వీరి విషయములో అక్షరాలా నిజం. 


updated on 10 august-2009
Related Posts with Thumbnails