Tuesday, February 10, 2009

Aanandam - Chiki chiki cham chiki...


చిత్రం: ఆనందం (2000)
దర్శకత్వం: శ్రీను వైట్ల
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: టిప్పు
*************


పల్లవి:

చికి చికి చం చికి చం చం చం - ప్రతి నిమిషం ఆనందం
చికి చికి చం చికి చం చం చం - మనసంతా ఆనందం
రంగుల లోకం అందించే - ఆహ్వానం ఆనందం
ఆశల జండా యెగరేసే - స్వాతంత్ర్యం ఆనందం // చికి చికి చం చికి చం //

చరణం 1:

ఊరించే ఊహల్లో - ఉరెగడమే ఆనందం
కవ్వించే కలకోసం - వేటాడమే ఆనందం
అలలలై ఎగసే ఆనందం - అలుపే తెలియని ఆనందం
ఎదురేమున్న ఎవరేమన్న - దూసుకుపోతూ ఉంటే ఆనందం.. ఆనందం // చికి చికి చం చికి చం //

చరణం 2:

ప్రతి అందం మనకోసం - అనుకోవడమే ఆనందం
రుచి చూద్దాం అనుకుంటే - చేదైన అది ఆనందం
ప్రేమించడమే ఆనందం - ఫెయిలవ్వడమొక ఆనందం
కలలే కంటూ నిజమనుకుంటూ - గడిపే కాలం యెంతో ఆనందం // చికి చికి చం చికి చం //

No comments:

Related Posts with Thumbnails