Wednesday, February 11, 2009

Chandamaama - Bugge bangaramaa..



చిత్రం: చందమామ (2007)
రచన: పెద్దాడ మూర్తి
సంగీతం: K.M. రాధాకృష్ణన్
గాయకులు: రాజేష్
సాకీ గాయకులు: K.M. రాధాకృష్ణన్
రెండో బిజియం గాయకులు: కారుణ్య
**********************

సాకీ:
పచ్చిపాలా యవ్వనాల గువ్వలాట..
పంచుకుంటే రాతిరంతా.. జాతరంటా..

పల్లవి:
బుగ్గే బంగారమా - సిగ్గే సింగారమా అగ్గే రాజేసేనమ్మా
ఒళ్ళే వయ్యారమా - నవ్వే మందారమా
నన్నే కాజేసెనమ్మా పట్టు చీరల్లో చందమామ
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాన
కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మా // బుగ్గే బంగారమా //

చరణం 1:
ఎదురే నిలిచే అధర మధుర దరహాసం ఎదురై పిలిచే
చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం చెలికే స్వంతం..
వసంతంవరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకూ కలలో జరిగే... విహారం
పుష్యమాసాన మంచు నీవో భోగిమంటల్లో వేడి నీవో
పూలగందాల గాలి నీవో పాల నురుగుల్లో తీపి నీవో.. // బుగ్గే బంగారమా //

నాగమల్లి పూలతోన నంచుకున్న ముద్దులారా
సందెగాలి కొత్తగానే ఆరుబయట ఎన్నేలింట
సర్దుకున్న కన్నెజంట సద్దులాయెరొ
నారుమల్లి తోటకాడ నాయుడోరి ఎంకిపాట // నాగమల్లి //

చరణం 2:
ఎదలో జరిగే విరహ సెగల వనవాసం బదులే అడిగే
మొదటి వలపు అభిషేకం వధువై బిడియం ఒదిగే సమయం..
ఎప్పుడో.. జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం జరిగే సరసం.. ఎప్పుడో అన్ని పూవుల్లో ఆమె నవ్వే..
అన్ని రంగుల్లో ఆమె రూపే..
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే..
నన్ను మొత్తంగా మాయ చేసే.. // బుగ్గే బంగారమా //

No comments:

Related Posts with Thumbnails