Saturday, March 27, 2010

మొదటిసారిగా లాంగ్ డ్రైవ్ 1

నాకసలు లాంగ్ డ్రైవ్ లంటే అసలు తెలీదు.. ఆ మాటంటే వెర్రిమాటని విన్నట్టే వినేవాడిని అంటే అతియోశక్తి కాదు. చేతక్ స్కూటర్ మీద అలా 15-20 కి.మీ దూరం లోని డ్యాముకు వెళ్ళడం మొదలు..అప్పట్లో నేనేనా ఇంత దూరం ( 15 కిమీ) నడిపానా అని హాశ్చర్య పోయేవాడిని. ఆ తరవాత నా ఉన్నతాభ్యాసానికి నా స్నేహితునితో మూడు కాలేజీలలో అప్లై చేయటానికి వెళ్లాను. అదీ నాకు గుర్తున్నదాంట్లో మొదటి లాంగ్ డ్రైవ్.. ప్రొద్దున్నే బయలుదేరి కాలేజీలకు త్వరగా చేరి, అవసరమైన  ఫారములు  నిమ్పిచ్చి,  తరవాత ఇంకో కాలేజీలకి వెళ్ళటం, ఇలా దగ్గరలోని ( మొదటి కాలేజీ 55 కిమీ దూరం, అక్కడి నుండి ఇంకో కాలేజీ 60 కిమీ దూరం ఉంటుంది. అక్కడినుండి ఇంటికి 75 కిమీ ల దూరం, మొత్తం 180 కిమీ దూరం.. ఇంటికి బయలు దేరేసరికే రాత్రయింది.. మధ్యలో - ఎక్కడైనా ఉందామంటే ఎవరూ తెలియదు తప్పదుగా. ఆ రాత్రే తిరిగిరావటానికి నిర్ణయించుకున్నాము. ఆ రాత్రే బయలుదేరాము. ఇప్పుడున్నంతగా సౌకర్యాలు అప్పుడు లేవు. సింగిల్ రోడ్డు లైన్లూ, ఊర్లో అక్కడక్కడా లాండ్ ఫోనులూ అప్పటి దృశ్యం. మేమొచ్చే దారిలో ఒక చిన్న అడవి కూడా ఉంది. రాత్రి పూట వస్తుంటే టూ వీలర్ మీద వస్తున్న వారి తలల మీద కర్రలతో కొట్టి, వారు క్రింద పడ్డాక దోచుకునేవారు. అలా చాలా సంఘటనలు జరిగాయి. ఏమి చెయ్యాలో తెలీదు. ఎక్కడైనా ఉందామంటే ఎవరూ తెలీని పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో తిరిగి ఆ రాత్రే ఇంటికి వచ్చే పరిస్థితుల్లో ఉన్నాము. మా చిన్ని బుర్రలకి అరగంట సమయం తీసుకొని ఆలోచించి, ఏది ఏమైనా జరగనీ అనుకొని ఆ అడవి గుండా రావటానికి డిసైడ్ అయ్యాము. తీరా అడవి దాకా వచ్చాము. ఎవరైనా తోడుగా టూ వీలర్ వాళ్ళు వస్తారేమోనని చూసాం. ఊహు! పోనీ - బస్సో, లారీయో ఉంటే వాళ్ళు వెళుతుంటే మేమూ వాళ్ళ వెంట వెళదామని చూసాము. అంటే వారు మా వెనక వారు వస్తుంటే మేము ముందున.. రాజు వెళుతుంటే వెనక సైన్యం వస్తున్నట్లుగా -(దోపిడీ అయితే బస్సులనీ కూడా చేసేవాళ్ళు. కాకపోతే మాతో బాటు వారినీ దోచుకున్నారు అని కాస్త ఊరట. ;) అంతే!) కాని ఎవరూ రాలేదు.. బస్టాండులో బస్ కోసం చూసాము. కాని ఆఖరి బస్ కూడా వెళ్ళిపోయింది. బస్ స్టాండ్ అంతా నిర్మానుష్యం.

అక్కడ ఒకరిని అడిగితే ఐదు నిముషాల ముందు ఒక బైకు వెళ్ళింది అన్నారు. ఇంకేం! ఆ బైకుని అందుకోవాలని (తోడుకోసం) బండిని పరిగెత్తిన్చాము. మధ్యలోనే ఆ బైక్ ని అందుకున్నాము కూడా. హ్హంమయ్య అంటూ చాలా సెక్యూర్ గా ఫీలయ్యాము. అక్కడే మాతో బాటు మరో మూడు మోటారు సైకిళ్ళూ, ఒక బస్ (అదే ఆఖరి బస్) కనిపించాయి. వాటన్నింటినీ ఓవర్టేక్ చేసి, ముందున ఉన్నాము..  అలా ఆ అడవిని దాటి ఇంటికి వచ్చాము. మా అదృష్టం.. ఆ రాత్రి ఏమీ జరగలేదు.. తరవాత  మెల్లమెల్లగా ధైర్యం వచ్చి, 30 కి.మీ, 100 కి.మీ, 150 కి.మీ ల దూరం పోవటం మొదలెట్టాను.. ప్రొద్దున్నే బయలుదేరి సాయంత్రం లోగా తిరిగివచ్చేయటం. అలా మెల్ల మెల్లగా దైర్యం వచ్చి నేనూ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళే సత్తా ఉందని - కాస్త ఆత్మవిశ్వాసం కలిగింది. ఇదే నా మొదటి లాంగ్ డ్రైవ్ అనే చిన్న అనుభవం. అలా మొదలైన నా లాంగ్ డ్రైవ్ మెల్ల మెల్లగా పరధిని పెంచుకోవాలనుకున్నాను. కాని నా మిత్రులెవరూ ఎవరూ ఆసక్తి చూపలేదు.


ఆ తరవాత చాలా రోజులకి నాకంటే చిన్నవాళ్ళు 18-25 సంవత్సరాల వయస్సు వారు బైకుల మీద గోవా, తిరుపతి.. వెళుతుంటే నాకూ అలా వెళ్ళాలనిపించింది. కానీ అలాంటి ఆసక్తి గల స్నేహితులు నాకు ఎవరూ లేరు. ఆ కల అలాగే మిగిలిపోయింది. ఆ 
తరవాత మా ఫ్రెండ్ గాడు LML select (80kmpl) స్కూటర్ కొన్నాడు. దానిపైన వైజాగ్ వెళ్లి అక్కడ వారం రోజులున్దామని అన్నాడు..ఎలా వెళతాము? ఎక్కడ ఉంటాము? అని భయం వేసినా అన్నిటికీ సరియైన సమాధానాలు చెప్పాడు. అయినా యే మూలో కించిత్ అనుమానం. అది ఇప్పటివరకూ సాధ్యపడలేదు.. నేను రెడీ ఉన్నా. వాడు చెప్పిన లెక్కలు అన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ తరవాత ఒక మ్రొక్కు మొక్కాడు తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లి (రావులపాలెం దగ్గర) కి వస్తానని. నేనూ అక్కడికి అతని వెంట వెళ్ళాలి అనుకున్నాను. ఆ తరవాత అతనివి మాటలే.. అని తేలింది. అదే సమయములో నాకేమో - వస్తానన్న అనుకోవటం వల్లనేనో గాని కష్టాలు మొదలయ్యాయి. ఎన్ని ఇబ్బందులో. అప్పుడు నాకు ఏలినాటి శని దశ. సరిగా కారణం తెలీదు అందువల్లనే కావచ్చు.. ఏది ఏమైనా సరే అక్కడికి వెళ్లాలని ఒక్కడినే APSRTC వారి జెట్ టికెట్ తో వెళ్లి నా పని ముగించుకొచ్చాను. ఎప్పుడూ ఇంత దూరం ఒంటరిగా వెళ్ళని నేను ఈసారి ఈ ప్రపంచం అంటే ఇంతేనా అని చాలా ధైర్యం వచ్చింది. వాడు రాకపోక నాకు చాలా మేలుచేసాడు. అంతా నా మంచికే అనుకున్న నేను - ఆ సంఘటనతో చాలా ధైర్యం వచ్చింది. లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలన్న ఆలోచన అక్కడే మొదలయింది..

Thursday, March 25, 2010

Drive Carefully..

రోడ్డుమీద జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యండి.. లేకుంటే ప్రమాదం అని చెప్పీ, చెప్పీ విసుగోచ్చేసిందేమో.. ఇలా లోతుగా చెబితే అర్థం చేసుకుంటారని ఇలా ప్రకటనలు ఇచ్చారు ఆ అధికారులు.

మీరు ఎంత అజాగ్రత్తగా నైనా డ్రైవ్ చెయ్యండి.. మీ మీద ఆధారపడ్డ వారి జీవితం మాత్రం సాఫీగా గడిచిపోతుంది.. అనే నిగూడార్థములో (మీరు ఆక్సిడెంట్లో పోతే, వచ్చే ఇన్సూరెన్సు డబ్బులతో మీ ఆవిడ క్రొత్తగా పెళ్లి చేసుకుంటుందని కాబోలు)  ఈ ప్రకటనని రూపొందించారు.. గమనించండి..

Wednesday, March 24, 2010

కామెంట్స్ కి కృతజ్ఞతలు

ATM మెషీన్ వద్ద మిమ్మల్ని దోచుకుంటున్నారా? అన్న టపా తీసేసాను.. నాకూ అది సరిగ్గా తెలీదు & నేనెప్పుడూ ప్రయత్నించలేదు..  అని కూడా ఆ పోస్టులోనే చెప్పాను.. నిజానికి ఆ టపా నాకూ నమ్మబుద్ది కాలేదు.. అది నిజమని నాకూ నమ్మకం లేదు. పోనీ తెలుసుకుందామని నాకు తెలిసిన బాంక్ అధికారులని కూడా ఫోన్ లో సంప్రదించాను.. ఊహు.. వారికీ తెలీదట! పోనీ నేనే అలా ట్రై చేద్దామని అనిపించింది. కాని ఒకవేళ నిజమైతే.. అనవసరముగా పోలీసులతో ఎందుకు గొడవ అని ఊరుకున్నాను... కాని మనసులో అనుమానం పెనుభూతమయ్యింది.. నిజమా..? అని. చాట్ లో ఇద్దరినీ అడిగాను.. వాళ్ళకీ తెలీదట!

ఇక లాభం లేదని బ్లాగులో పెడితే ఎవరైనా చూసి చెబుతారని అనుకున్నాను.. కానీ యాభై మంది విజిటర్స్ వచ్చారు కాని ఒక్కరూ అనలేదు. ఈ రోజు బిజీ ఉన్ననూ చాలాసార్లు నా బ్లాగుకి వచ్చాను.. ఎవరైనా కామెంట్స్ వ్రాసేరేమో చూద్దామని. మధ్యాహ్నం ఒకతను వ్రాసాడు - ఇది అబద్దమని. అలాంటి ఇంకో కామెంట్ వస్తే పోస్ట్ తీసేద్దామని ఎదురుచూసాను. తీరా ఇంకో రెండు కామెంట్స్ అలా వచ్చాయి - పోస్ట్ తీసేసాను.. కారణం:

ఒకదాని గురించి ఆశ వదులుకునేముందు చివరివరకూ ప్రయత్నించడం నా లక్షణం. తరవాత బాధ అయినా " చివరివరకూ ప్రయత్నించాను.." అన్న తృప్తి మిగులుతుందని. మనం చెప్పిన విషయం ప్రతి ఒక్కటీ సరియైనది ఉండకపోవచ్చు. చాలా సంవత్సరాల క్రిందట రామర్ పిళ్ళై అని ఒక మేధావి ఆకులనుండి పెట్రోలు తీస్తాను అన్నాడు. మీడియా ఒహొ అని ఊదరగోట్టింది. చివరికి సైంటిస్టు ల సభలో దొరికిపోయాడు.- ఇక్కడా అంతే! చిన్ని విషయమే అని నిర్లక్ష్యం చేయబుద్ది కాక.. ఇలా బ్లాగులో పెడితే సమాధానం దొరుకుతుందని ప్రొద్దున్నే పెట్టాను. తప్పైతే వెంటనే సమాధానం దొరుకుతుందని. సమాధానం దొరికింది. వందా యాభై మందికి పైగా చదివారు కాని ముగ్గురు (కమల్ గారు 12:19 pm కి, ఇంకొకరు 8:42 pmకి, మరొకరు 9:01pm కి చెప్పారు ) మాత్రమే అది తప్పని చెప్పారు.. వీరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.. ఇక మిగిలినవారు  మనవాళ్ళు తప్పుని తప్పు అని చెప్పడం చాలా మరిచారు.. నిత్య జీవితములో చెబితే ఏమైనా కష్టాలు ఉంటాయేమో గాని, ఇక్కడ చెబితే తప్పేమిటి.. పైగా మంచి పనే చేస్తున్నారుగా..  అందుకే ఇలా వ్రాయటానికి వీలుగా Anonymous సెట్టింగ్ నేను పెట్టింది.

Tuesday, March 23, 2010

బ్లాగులను నిర్వహిస్తున్నవారికి చిన్న సలహాలు

బ్లాగులను మీరు నిర్వహిస్తున్నారా? అలా నిర్వహిస్తున్నవారికి నా అనుభవాల చిన్న సలహాలు:

 • విజిటర్ల సంఖ్య లేదా మీ బ్లాగు వీక్షకుల సంఖ్య అంటూ విడ్జెట్ ని పెట్టుకున్నాక దాన్ని ఎప్పుడూ మార్చకండి. అంటే పైన హెడర్ ని వీక్షకులు, అతిధులు, సందర్శకులూ, Guests.. అంటూ మార్చడానికి ప్రయత్నించకండి. అలా మారిస్తే మీ బ్లాగు కౌంటర్ మళ్ళీ మొదటినుండి మొదలవుతుంది. అంటే "00000000" నుండి మొదలు అన్న మాట. ఈ విషయం తెలీక ఒకసారి మధ్యలో నేను మారుద్దామని ప్రయత్నిస్తే.. అప్పటివరకూ ఉన్న ఐదువేల కౌంటర్ మళ్ళీ మొదటినుండి మొదలెట్టాల్సివచ్చింది.
 • అలాగే మీ  బ్లాగు పోస్టు క్రింద చదువరుల అభిప్రాయం తెలుసుకోవటానికి Reactions అంటూ పెట్టుకోండి. ఒకవేళ అలా పెట్టుకుంటే అందులో ఏమేమి పదాలు ఉండాలో ముందే నిర్ణయించి పెట్టుకోండి. మధ్యలో మారిస్తే, అంతకు ముందు ఎవరైనా వోటింగ్ చేసి ఉంటే అవన్నీ "0" గా మారిపోతాయి. (ఈ పోస్టు వ్రాయడానికి గల కారణమూ ఇదే.. ప్రపంచవ్యాప్తముగా  నా బ్లాగుని చూస్తున్నారుగా.. తెలుగులో ఉంటే అందరికీ అర్థం కాదేమోనని దాన్ని ఇంగ్లీషులో పెడితే వోటింగ్ ప్రతిస్పందన బాగుంటుందని, అలా  ఎక్కువమంది  వోటింగులో  పాల్గొంటే మరింత ప్రోత్సాహకరముగా ఉంటుందీ, నేను  పెట్టే   పోస్టుల మీద అభిప్రాయమూ నాకు తెలుస్తుందనీ, ఇంకా మంచి టపాలు పెట్టోచ్చనీ , స్పూర్తిగా ఉంటుందని.. కొద్దిసేపు  క్రిందట  Fair, Good, Very Good అని మారిస్తే అన్నీ "0" కి మారాయి. మార్చకముందు ఒక్కో పోస్టుకి 5-9 వరకూ వోట్లు పడ్డాయి.. అవన్నీ ఇప్పుడు గోవిందా.. గోవిందా..)
 • ఏ ఏ దేశాలనుండి ఎంతమంది చూస్తున్నారు అనే విడ్జెట్ పెట్టుకుంటే అదీ అంతే.. మొదటే హెడర్ ని ఎన్నుకోవాలి.. మధ్యలో మారిస్తే అదీ ... గోవిందా గోవిందా.. నేను ఒకసారి మార్చి - నాలుగు వేల పేజి వ్యూస్ కౌంటర్ పోగొట్టుకున్నాను.

ఇవి తప్ప మిగతావి మార్చిననూ ఏమీ కాదు.నాకు అనుభవములోకి వచ్చినవి పైవి మూడు మాత్రమే! ఇంకేమైనా వస్తే వెంటనే మీకు తెలియజేస్తాను.  (క్రొత్త) బ్లాగు సోదర, సోదరీమణులు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోగలరు.

Monday, March 22, 2010

హాయ్ బావా.. కోపమా..!

ఇప్పుడు మీకో తమాషా అయిన మొబైల్ రింగ్ టోన్ మీకు అందిస్తాను.. ఇది ఒకరివద్దనుండి సేకరించాను. చాలా ఫన్నీగా ఉంటుంది.. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ లో రింగ్ టోన్ గా పెట్టుకోండి. ఆ రింగ్ టోన్ ని వింటున్నప్పుడు భ్రుకుటిని ముడుస్తారు.. తరవాత దిక్కులు చూస్తారు.. నన్నేనా అని అనుకుంటారు.. తరవాత బుంగమూతి పెట్టి అలుగుతారు. చివర్లో - ఇది బాగుంది. ఎవరో కాని బాగా చేసారు.. అని మనసారా నవ్వేసి ఇంకోసారి వినటానికి ఆసక్తి చూపిస్తారు.. వెంటనే రింగ్ టోన్ గా పెట్టేసుకుంటారు కూడా!!

ఇలా డౌన్లోడ్ కాకుండా వినిపిద్దామని అనుకున్నాను కాని - అంత సాంకేతిక నైపుణ్యం నాకు లేదు. ఈ-స్నిప్ ద్వారా పెట్టొచ్చు అని అన్నారు కాని కానీ సరిగా తెలీదు. తెలుసుకున్నాక.. మీకు ఇక్కడే వినిపిస్తాను. అంతవరకూ డౌన్లోడ్ మీద ఆధారపడక తప్పదేమో!!

ఈ రింగ్ టోన్ డౌన్లోడ్ :   హాయ్ బావా..!! 
సైజు:                     102 .38 KB 
టైప్:                     amr ఫైల్
రింగ్ టోన్ సమయం:  1 నిముషము 5 సెకనులు

Sunday, March 21, 2010

పాస్ వర్డ్ రక్షణ

పాస్ వర్డ్ రక్షణ:

మనం చాలా వెబ్ సైట్లలోకి వెళ్ళినప్పుడు లాగిన్ అవటానికి రిజిస్టర్ చేసుకోమని అడుగుతారు. మనం మన మెయిల్ ID తో, మన పాస్ వర్డ్ తో ఎంటర్ అయి.. ఆ అకౌంట్ ని తెరుస్తాము. ఆ తర్వాత ఆ సైటుని, ఆ పాస్ వర్డ్ సంగతీ మరిచిపోతాము. ఇది మనలో చాలా మందికి జరిగే అనుభవమే! ఇలా ప్రతివారూ ఇలా లాగిన్ అవటానికి వాడిన పాస్ వర్డ్ ని గుర్తుపెట్టుకోవటానికి ఒక చిన్ని సహాయం మీకు చేయదలచుకున్నాను.

ఇప్పుడు మీరు క్రొత్తగా ఏదైనా పాస్వర్డ్ గా గుర్తుపెట్టుకొని, దాన్ని మీరు ఆయా సైట్ల లోకి వెల్లుటకి వాడదలచుకుంటే ముందుగా మీరు అందులో వాడబోయే మెయిల్ ID క్రొత్తది ఏర్పాటు చేసినా సరే! లేదా మీరు వాడుతున్న మెయిల్ ID గానీ ఇచ్చినా సరే... కాని మీరు ఆ మెయిల్ ID కి ఉన్న పాస్ వర్డ్ మాత్రం అక్కడ ఎట్టిపరిస్థితిలోనూ వాడకూడదు. పాస్ వర్డ్ మాత్రం మార్చాలి. అంటే పాస్ వర్డ్ ని మాత్రం క్రొత్తగా పెట్టాలి. మరచిపోయి పాతదే వాడారా.. మీ మెయిల్ బాక్స్ వారిచేతిలో ఉందన్నమాటే! అంటే అప్పుడు వారు
 • మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న మీ పర్సనల్స్ చూడొచ్చు,
 • ఫోటోలు కాపీ చేసుకోవచ్చు.
 • మీ బాంక్ అక్కౌంట్ వివరాలు అందులో ఏమైనా ఉంటే అదీ చూడొచ్చు.
 • మీ రహస్యాలన్నీ విశ్వవ్యాప్తం చేయొచ్చు.  
 • ఇంకా మీరు గిట్టకుంటే - మీ మెయిల్ బాక్స్ లోని అన్ని మెయిల్లూ, కాంటాక్ట్ ID లూ డిలీట్ చేసేయొచ్చు..
 • మీ మెయిల్ ID తో అందరికీ చెడ్డ బూతు బొమ్మలు పంపొచ్చు...
మీరు క్రొత్త పాస్ వర్డ్ లని ఎలా తయారుచేసి, ఎలా గుర్తుంచుకోవాలో ఇప్పుడు కొన్ని చిట్కాలు:

"నాకు ఇద్దరు అన్నయ్యలు: శేఖర్ మరియు రాజ్" (I have 2 brothers: Shekhar and Raj) అనే ఉందనుకోండి. ఇప్పుడు ఈ వాక్యములోని మొదటి అక్షరాలని ఉపయోగించి, పాస్వర్డ్ తయారు చేద్దామా? అలా చేస్తే Ih2b:S&R అని వస్తుంది కదూ.. ఈ పాస్వర్డ్ కనీసం ఊహించగలమా.. ఎవరెంత ఆలోచించినా కాస్త కూడా తెలుసుకోలేము. ఒకవేళ ఇది తెలిసినా కేపిటల్, స్మాల్ లెటర్స్ టైప్ చేయక పోతే సైటు ఓపెన్ కాదు. అలా అలోచించి చేసినా మధ్యలో వాడిన : , & లని అసలు ఊహించలేరు.
ఇలాంటిదే ఇంకోటి: Bouncing tigers have every right to ice-cream: Bther2I-C.

నాకు తెలిసీ ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానము వల్ల
 • ఆరు అక్షరాల పాస్వర్డ్ ని రెండున్నర గంటల్లో, 
 • ఏడు అక్షరాల పాస్వర్డ్ ని వారం రోజుల్లో,
 • ఎనిమిది అక్షరాల పాస్వర్డ్ ని మూడున్నర సంవత్సరాలలో 
తెలుసుకోగలము -అట.. అదీ పాస్వర్డ్ బ్రేకర్ల సహాయముతో. అందుకే ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి.
మీ మెయిల్ ID వ్రాసాక పాస్వర్డ్ లో మీ స్వంత వివరాలు మాత్రం అసలు ఉంచకండి. అంటే మీ పొడవూ, మీరుండే వీధి పేరు, మీ ఊరిపేరు, మీ ఫోన్ నంబరు, లేదా మీ ఇంటి లాండ్ ఫోన్ నంబరూ, మీ తల్లితండ్రుల పేర్లూ, మీ తోబుట్టువుల పేర్లూ..  అలాంటివేవీ ఉంచకండి. మీ మిత్రులు వాటిని తేలికగా ఊహించగలరు. అలాగే ఒక వాక్యములోని మొదటి అక్షరాలన్నీ స్మాల్ లెటర్స్ వి ఎంచుకోవద్దు. ఉదాహరణకి: I like eating a mango with ice cream అని ఉందనుకోండి ఇప్పుడు పాస్వర్డ్ గా ileamwic గా అవుతుంది. ఇలాంటివీ మంచిది కాదు.

ఇప్పుడు మీరు చేయాల్సినవీ, చేయకూడనివి ::  
Do:
 • పెద్దా చిన్న అక్షరాలు కలిపి, సింబల్స్ సంఖ్యలూ కలిపిగానో, లేదా ఇవన్నీ కలిపిగానో పాస్వర్డ్ చేసుకుంటే మరీ మంచిది.
 • పాస్ వర్డ్ పెద్దగా ఉంటేనే మంచిది. కనీసం ఆరు అక్షరాల కన్నా పెద్దగా ఉండాలి. 
 • మీ పాస్వర్డ్ ని కనీసం అరవై రోజులకి ఒకసారి మార్చండి. ఉన్న పాస్వర్డ్ నే గుర్తుంచుకునేలా క్రొద్దిగా మార్చండి. అంటే పెద్ద అక్షరాలు చిన్నవిగానో, చిన్నవి పెద్దవిగానో, మొత్తం పదాన్నే తిరగేసి వ్రాయటమో.. ఇలాగన్న మాట! 
 • మీ పాస్వర్డ్ లోని కొన్నింటిని నైనా కాపీ మరియు పేస్ట్ పద్దతిలో ఎంటర్ చేస్తే - కీ లాగర్స్ అనే మీరు పాస్వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు నొక్కే కీ స్ట్రోక్స్ అప్లికేషన్ ని తప్పించుకోవచ్చు. కీ లాగర్స్ చేసే పని ఏమిటంటే - మీరు నొక్కే ప్రతి కీ తాలూకు వివరాలు అన్నీ అవతలివారికి నెట్ ద్వారా అందిస్తాయి. ఈ కీ లాగర్స్ JPEG ఫోటో బొమ్మల రూపములో గానీ, టెంపరరీ ఫైల్స్ లో గానీ మీ సిస్టంలో తిష్ట వేసుకొని కూర్చుంటాయి.    
Don't:

 • పదాలుగానీ, వాక్యాలు కానీ, మీకు సంబంధించిన అంకెలుగానీ వాడకూడదు. పుట్టినరోజులనీ, మీ ఫోన్ నంబర్లనీ వాడితే తేలికగా మీ పాస్వర్డ్ ని గుర్తుపట్టవచ్చు. 
 • మీ పాస్వర్డ్ మేనేజ్ లిస్టులో కూడా వ్రాయకండి. అందునా కంప్యూటర్ లో ఉన్న ఏ పేజిలోనైనా అసలే వ్రాయకూడదు.
 • అన్ని సైట్ల లాగిన్ కోసమని ఒకే పాస్వర్డ్ ని వాడకండి.. ముఖ్యముగా మీ సున్నితమైన వ్యక్తిగత సంబంధమైన సైట్లలో గాని, ఆర్ధిక లావాదేవి సైట్లలో గాని అసలే వాడకండి.
 • మీ పాస్వర్డ్ ని ఎవరికీ చెప్పకండి. వారికి ఏ విధముగానూ తెలియనివ్వకండి.  
 • ఏదైనా వెబ్సైట్లలో మీ మెయిల్ ID కి పాస్వర్డ్ ఇమ్మన్నప్పుడు వేరేది ఏదైనా పెట్టండి. పర్సనల్ పాస్వర్డ్ మాత్రం ఎవరికీ ఇవ్వకండి.

Friday, March 19, 2010

Friends to Support - రక్తనిధి

మీకు ఉపయోగపడే సైటు గురించి ఇప్పుడు చెబుతాను.

మీకు తెలిసినవారో, మీ మిత్రులో, లేదా బంధువులో.. అనారోగ్యకారణాల వల్లనో, లేక ప్రమాదవశాత్తుగానో హాస్పిటల్లో ఉండి, సమయానికి రక్తం కావలసివస్తే మీరు ఏమి చేస్తారు.. వెంటనే బ్లడ్ బాంక్ కి వెళతారు.. పనిలో పనిగా మిత్రులకీ ఈ విషయం చెప్పి ఆ గ్రూప్ రక్తం గల వారు ఎవరైనా ఉన్నారో తెలుసుకుంటారు.. ఇదంతా చాలా ఆందోళనతో, అధిక ప్రయాసతోనో, చాలా కష్టముతో మీరు చేసే ఉంటారు. వీరే మీరు ఉంటున్న ప్రదేశములో కాక వేరే రాష్ట్రములోనో, వేరే ఊరిలోనో ఉంటే?.. అప్పుడేలాగా!! అలాంటి ఇబ్బందులన్నింటిని తోలిగిపోయేలా ఇప్పుడు మీకు ఇంతకన్నా సులభమైన మార్గం చెబుతాను.

మీ వాళ్ళు ఎవరైనా, ఎక్కడైనా, ఏ రాష్ట్రములోనో, ఏ పట్టణములో, ఏ జిల్లాలోనో, ఏ గ్రూపైనా సరే.. ఇలా అలా రక్తం కావలసిన పరిస్థితుల్లో ఉంటే - మీరు   www.friends2support.org  కి క్లిక్ చేసి లోనికి వెళ్ళండి. మీకు ఇలా కనిపిస్తుందీ సైటు.

ఇందులోకి వెళ్ళాక పైన ఉన్న (కుడిచేతివైపు మూలన) అంటే -

ఇలా ఉందిగా.. అందులో మీకు కావలసిన

 • రక్తము గ్రూపు,

 • రక్త గ్రహీత ఇప్పుడున్న రాష్ట్రము,

 • జిల్లా,

 • పట్టణము 
ఎంచుకొని క్రింద ఉన్న SUBMIT ని నొక్కండి. అప్పుడు మీకు కావలసిన వివరాలు అంటే రక్త దాతపెరూ, ఫోన్ నంబర్ వస్తుంది. ఇక మీ ఆప్తులు ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడ్డట్లే..  ఇంకా నమ్మకం అనిపించటం లేదా.. ఉదాహరణకి నాకు B పాజిటివ్ (B+) రక్త గ్రూపు కావాలనుకొని ఇందులో ఎంటర్ చేసి SUBMIT నొక్కాను. ఇప్పుడు చూడండి.

(పేర్లూ, ఫోన్ నంబర్లు నేను కావాలని ఎడిట్ చేసాను. వారి ప్రైవసీకి ఇబ్బంది రావద్దోని..)
చాలా బాగుంది కదూ ఈ సైటు.. మీరూ ఇందులో చేరి రక్తదానాన్ని ప్రోత్సాహించండి. ఈ సైటు యొక్క టాగ్ లైన్ లాగా -
where strangers become friends 
నిజమే కదూ...

Thursday, March 18, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 11

ఇప్పుడు ఇంగ్లీష్ పదాలని తెలుగులో వ్రాయడం గురించి చెబుతాను.

అన్నింటికన్నా కష్టమైనది అంటే ఇదే! - అని అనుకుంటారు కాని ప్రయత్నిస్తే సులభముగానే ఉంటుంది. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. అసలు ఎలా వ్రాయాలో తెలిసేది కాదు. ఎవరిని అడగాలో తెలీదు.. ఎలా వ్రాయాలో తెలీదు.. చెప్పేవారూ లేరు.. నా బ్లాగుని చాలా కాలం క్రిందటే పెట్టినా ఏమీ వ్రాయక వదిలేసాను - గల కారణాలలో ఇదీ ఒకటి. (వ్యవహారిక) తెలుగు భాషలో చాలా ఇంగ్లీష్ పదాలు కలిసిపోయాయి. వాటిని కాకుండా తెలుగులో వ్రాయాలంటే ఎవరికీ అర్థం కాదు.

ఉదాహరణకి :
బస్టాప్ ని అలా వ్రాయాలంటే షట్చక్ర వాహన నిలుపు స్థలం అనీ,
కంప్యూటర్ ని కలన యంత్రం అనీ,
లింకు ని లంకె అనీ,
ఇంటర్నెట్ ని అంతర్జాలం అనీ,
ఫాంట్ లనీ ఖతులు అనీ, 
స్క్రీన్ షాట్ ని తెరపట్టు అని
(నిజానికి అవన్నీ సరియైనవే - అలా వ్రాస్తే చాలా మంది అర్థం చేసుకోరేమో)

ఇలా ఒక్కసారిగా తెలుగులో వ్రాయలేము. అలా వ్రాసిననూ చాలా మంది ఇష్టపడక పోవచ్చు. అంతెందుకూ.. వ్రాయుట అని వ్రాయాలి నిజానికి. చాలామంది రాయుట అనే వ్రాస్తారు. అది తప్పు. వ్రాసినప్పుడు మాత్రం వ్రాయుట అని వ్రాసినా అనాల్సినప్పుడు రాయుట అనే అంటాము. ఇలాంటి విషయాలమీద తరవాత చర్చిద్దాం! ఇప్పడు ఇంగ్లీష్ పదాల గురించి మాట్లాడుకుందాం!

నాకు తెలిసీ ఈ ఇంగ్లీషు పదాలని 4 భాగాలుగా వర్గీకరించవచ్చును.
 1. తప్పకుండా ఇంగ్లీషులోనే టైప్ చేయాల్సినవి.
 2. పదం టైప్ చేసాక స్పేస్ నొక్కడం వల్ల మారే తెలుగులోకి మారే పదాలు.
 3. పదం టైప్ చేసాక బాక్ స్పేస్ నొక్కి ఆ వచ్చే మెనూలో సరియైన పదం ఎంచుకోవడం వల్ల మారే తెలుగులోకి మారే పదాలు.
 4. పదాన్ని ముక్కలు ముక్కలుగా టైప్ చేసి బాక్ స్పేస్ తో వాటిని కలపడం
ఇవీ ప్రస్తుతం నాకు గుర్తున్నంత వరకూ వచ్చినవి. వీటిలో ఒక్కొక్కదాని గురించి వివరముగా తెలుసుకుందాము.

తప్పకుండా ఇంగ్లీషులోనే టైప్ చేయాల్సినవి.

నాకు తెలిసీ ఇందులో చాలా చాలా కొన్నే పదాలు వస్తాయి. ఇలాంటి పదాలు ఇప్పుడైతే నాకైతే అగుపించలేదు. ఒకసారి ఒక పదం టైప్ చేయటం రాలేదు.. ఆ పదమేమిటో నాకు గుర్తులేదు. (ఇలా పాఠాలు చెబుతానని అనుకోలేదు.. అందుకే గుర్తుపెట్టుకోలేదు) ఏమైనా అలాంటి పదాలు వస్తే ఇందులోనే మళ్ళీ ఎడిట్ చేసి వ్రాస్తాను. అంతవరకూ ఈ భాగాన్ని వదిలేద్దాము.

Wednesday, March 17, 2010

ఆన్ లైన్ మోసాలు

ఆన్ లైన్ మోసాలు అంటే వినడమే గాని చూడని వారికి - ఒక ఋజువు చూపదలచుకున్నాను.

చాలా మంది బ్యాంకు వ్యవహారాలూ కూడా ఇప్పుడు ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. ఒక్కోసారి వారు సైటు ఎందులో ఉన్నామో చూడక లాగిన్ అవుతారు. అడ్రెస్ బార్ లోని బ్యాంక్ పేరు తనిఖీ చేయక ఎంచక్కా వినియోగదారులు అందులోకి తమ తమ యూజర్ ఐడి, పాస్ వర్డ్ లతో ఎంటర్ అవగానే తమ తమ విలువైన సమాచారము ఆ అగంతకులకి స్వయముగా అందించినట్లవుతుంది. ఈ క్రింది స్క్రీన్ షాట్ (తెరపట్టు) ని నిశితముగా గమనించండి.


ఇలా చూడక లాగిన్ అవుతే మీ డబ్బులన్నీ
గోవిందా.. గోవిందా!!


Saturday, March 13, 2010

ఏజంట్లు చెప్పే క్రొత్త పాలసీలు - ఒక పరిష్కారం.

మార్చి నెల చివరికి వచ్చేస్తుందిగా! అలాగే ఆర్ధిక సంవత్సరం ముగియబోతున్నది కదూ.. మీరు ఉద్యోగులై గానీ, వ్యాపారస్తులైతే ఈపాటికి నేను చెప్పబోయే విషయం మీకు అనుభవం లోనికి రావచ్చును.. "సార్! మేడం! ఒక్క పాలసీ.. చాలా బాగుంటుంది.. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.. రిటర్న్స్ కూడా బాగున్నాయి. ఒక్క సారి వినండి సార్.. " అని. మీరు టెంప్ట్ అయి అతడికో పాలసీ చేసి, ఆతర్వాత రెగ్యులర్ గా ప్రీమియాలు కట్టలేక, లాప్స్ అవటమో.. లేక పాలసీ సరెండర్ చెయ్యటమో జరిగుతుంది. నేనిప్పుడు చెప్పేది మీరు పాలసీలు చెయ్యడం గురించి కాదు. అది మీ ఇష్టం. చెప్పబోయేది పాలసీ ప్రీమియం ఎలా తగ్గించుకోవచ్చో చెబుతున్నాను.

మనకు ఏజంట్లు చెప్పే క్రొత్త పాలసీలు - అలాంటివే చాలా భీమా సంస్థలు ఆ వెంటనే ప్రారంభించి ఉంటాయి. అన్ని సంస్థలకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవటం చాలా ప్రయాసకి గురి అవుతాము. అందుకే ఈ ఇబ్బంది తొలగించుకోవటానికి ఒక చిట్కా ఉంది. అదే http://www.policybazaar.com/ అనే సైటు.. అందులో ఎంటర్ అవ్వండి. మీకు ఎలాంటి పాలసీ కావాలో ( హెల్త్, లైఫ్, కార్, హోం..) ఎన్నుకొని అందులోకి వెళ్ళండి. ఇదే ఆ సైటు.


అందులోకి ఎంటర్ అవ్వండి. మీకు యే రకమైన భీమా కావాలో ఎన్నుకోండి. ఉదాహరణకి జీవిత భీమా లోకి వెళ్లామే అనుకోండి. ఇలా వస్తుంది ఆ పేజి.


ఇందులో వివరాలు ఇవ్వండి. ఇస్తే వెంటపడి ఇబ్బంది కలిగిస్తారు అనుకుంటే మీ బంధువుల పేర్లతో, ఎంటర్ అవండి. ఇక ఇక మీకు కావలసిన పాలసీకి గురించిన వివరాలు ఎంటర్ చెయ్యండి.. అప్పుడు ఒక పట్టికలో అదే రకము పాలసీకి - అన్ని సంస్థల ప్రీమియాలు ఎంతెంత ఉన్నాయో పట్టిక వస్తుంది.. అప్పుడు మీరు యే సంస్థ తక్కువ ప్రీమియం వసూలు చేస్తుందో దాన్ని ఎంచుకోవచ్చు.  అప్పుడు ఆ సంస్థ కి ఫోన్ చేసి ఏజంటుని పంపమని చెప్పండి. 

ఇక్కడ ఒక చిన్న విన్నపం: మీరు యే పాలసీ చేయబోతున్నా, ముందుగా ఒక  టర్మ్ పాలసీని  తప్పక  తీసుకోండి. ప్రీమియం తక్కువ, ఏమైనా జరిగితే ఆదాయం ఎక్కువ. ఆర్ధిక ఇబ్బందులు  ఎప్పటికైనా తప్పవు. అప్పుడు ఇదే అవసరం వస్తుంది. ఇది నేను అనే మాట కాదు.. అనుభవజ్ఞులు చెప్పే మాట.

Ee Hrudayam - Ye maya chesave!

చిత్రం : యే మాయ చేసావే! (2010)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీత రచన: అనంత శ్రీరాం (ఇంగ్లీష్ రాప్ లిరిక్స్: బ్లేజ్)
పాడినవారు: విజయ ప్రకాష్, సుజానే, బ్లేజ్
*************************
పల్లవి:
ఈ హృదయం కరిగించి వెల్లకే - నా మరో హృదయం అది నిన్ను వదలదే
ఊ.. హోసంనః ..హోసంనః ..ఊ..
ఊ.. హోసంనః ..హోసంనః ..ఊ..

ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా - ఈ గుండెకేమవ్వలా
హో.. నిన్నకాక మొన్న వచ్చి యే మాయ చేసావే - పిల్లి మొగ్గలేసిందిలా
హోసంనః.. గాలుల్లో నీ వాసనా
హోసంనః.. పువ్వుల్లో నిను చూసినా
ఏ సందు మారిన.. ఈ తంతు మారున
నావల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా..
హోసంనః.. ఊపిర్నే వదిలేస్తున్నా
హోసంనః.. ఊహల్లో జీవిస్తున్నా
హోసంనః.. ఊపిరినే వదిలేస్తున్నా..
హోసంనః..

Everybody wanna know what we like a we like a..
I really wanna be here with you..
Is that enough to say that we are made for each other..
is not that is hosannah.. true
Hosannah..be there when you are calling i will be there..
Hosannah..be the life the whole life i will share..
I never wanna be the same..
Its time to re arrange..I take a step you take a step and me calling out to you..
హెల్లోఓ...హెల్లోఓ ... హెల్లోఓ ..ఓఓఒ. హోసంనః
హోసానః .. హ.. ఆ..
హో.. సాహ్నా .. హో..
హో..ఓ...ఓ.. ఓ.. హో.. హో హో
హో హో హో.. ఊ.. హో ...

చరణం  1:
రంగు రంగు చినుకులున్న మేఘనివై - నువ్వు నింగిలోనే వున్నావుగా
ఆ తేనెగింజ పళ్ళున్న కొమ్మల్లె పైపైనే - అందకుండా ఉంటావుగా
హోసంనః.. ఆ.. మబ్బు వానవ్వదా
హోసంనః.. ఆ.. కొమ్మ తేనివ్వదా
నా చెంత చేరవ.. ఈ చింత తీర్చవా..
ఏమంత నేను నీకు అంత కాని వాణ్ణి కానుగా
హెల్లోఓ...హెల్లోఓ ... హెల్లోఓ ..ఓఓఒ.
హోసంనః..

హో.. సాహ్నా.. ఆయువునే  వదిలేస్తున్నా
హో.. సాహ్నా..ఆశల్లో  జీవిస్తున్నా
హోసంనః... ఆయువునే వదిలేస్తున్నా
హో..సాహ్నా.

ఈ హృదయం కరిగించి వెల్లకే - నా మరో హృదయం అది నిన్ను వదలదే
ఈ హృదయం కరిగించి వెల్లకే - నా మరో హృదయం అది నిన్ను వదలదే

Friday, March 12, 2010

ఏ మాయ చేసావే! - హీరోయిన్ స్వరం.

"ఏం మాయ చేసావే" ఇప్పుడు ఆంద్ర దేశములో ఓ.. అంటూ ఊదరగొట్టుతున్న సినిమా అని ఇటు పబ్లిక్కూ, అటు మీడియా ఒకటే హొరు. ఆ సినిమాలో నాకు నచ్చినదేమిటంటే - చాలా ఉన్నాయి. వాటన్నింటికన్నా నాకు నచ్చినదీ, మన తెలుగు రంగములో క్రొత్తగా చూపింది ఏమిటంటే - హీరోయిన్ స్వరం.
 

ఈ సినిమాలో హీరోయిన్ మాట్లాడుతుంటే కొద్దిగా మగ గొంతులో ఉన్నట్లుంది, కాస్త ముద్దు, ముద్దుగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇలాంటి గొంతుని హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పటానికి నిర్ణయించినందులకి ఈ సినిమా డైరెక్టర్ అయిన గౌతం మీనన్ ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. హిందీలో రాణీ ముఖర్జీ గారిదీ కూడా ఒక ప్రత్యేకమైన స్వరం. వందమందిలో ఆ గొంతుని కలిపినా తేలికగా గుర్తుపట్టొచ్చు. మొదట్లో ఆమె స్వరం నాకు నచ్చలా! తినగ తినగ వేము తియ్యగా నుండు.. అన్నట్లు రాణీ ముఖర్జీ గారి గొంతు కూడా బాగా నచ్చింది. ఆ తరవాత ఈమెదే!.. (ఈ పాత్రకి డబ్బింగ్ చెప్పిన ఆమెదే). ఇక ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలంటే మాత్రం ఈ "యే మాయ చేసావే" లోని హీరోయిన్ గొంతుక కన్నా "సూర్య సన్ అఫ్ కృష్ణన్" లో సమీరా రెడ్డి కి వాడిన స్వరం నాకు ఇంకా బాగా నచ్చింది. ఆ స్వరం లోని హస్కీనేస్ ఇంకా మరచిపోలేక పోతున్నాను. చూస్తుంటే.. క్షమించాలి - వింటుంటే రెండు స్వరాలూ ఒకేలా ఉన్నాయనిపిస్తుంది, కాని సూర్య సన్ అఫ్ కృష్ణన్ లోని సమీరా కి వాడిన స్వరం మాత్రం దీనికన్నా నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాలకీ దర్శకుడు గౌతం మీనన్ నే!! ఈ స్వరం కలిగి, డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ - చిన్మయి గారికి నా ప్రత్యేక అభినందనలు.ఎలాగూ స్వరం టాపిక్ వచ్చిందిగా.. నేను చిన్నప్పుడు విన్న హస్కీ వాయిస్ ని ఇంకా మరచిపోలేక పోతున్నాను. అదేవరిదంటే స్వర్గీయ సిల్క్ స్మిత @ విజయలక్ష్మి ది. "వసంత కోకిల" సినిమాలో ఆమె స్వంతముగా డబ్బింగ్ చెప్పిందని అప్పట్లో విన్నాను. ఆ స్వరం చాలా పెక్యూలియర్ గా ఉంటుంది. త్రాగకున్నా త్రాగినంతగా మత్తు తెప్పించేస్తుంది ఆ స్వరముతో..

Thursday, March 11, 2010

Swase swaramai - Ye maaya chesaave!

చిత్రం: ఏ మాయ చేసావే! (2010)
సంగీతం: ఏ.ఆర్.రహమాన్
గీత రచన: అనంత శ్రీరాం
పాడినవారు: కార్తీక్ (వివేక్ అగర్వాల్ తో కలసి)
***********************
పల్లవి:
శ్వాసే స్వరమై - సరదాలే పంచే
సరిగమవై - వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా - నడిపించే అడుగై రా
ననుచేరే నాతో రా - ఓ

శ్వాసే స్వరమై - సరదాలే పంచే
సరిగమవై - వెంటనే రా వెలుగై రా
నిజమయ్యే కలవై రా - నడిపించే అడుగై రా
ననుచేరే నాతో రా - ఓ

శ్వాసే స్వరమై - సరదాలే పంచే
సరిగమవై - వెంటనే రా వెలుగై రా

చరణం 1:
వయసే నిన్నే వలచి - వసంతమున కోకిలై
తియ్యంగ కూసీ - ఈ శిశిరం లోన
మూగబోయి నన్నే - చూస్తుందే జాలేసి
ఏమో ఏమూలుందో చిగురించే క్షణమే
వెంటనే రా వెలుగై రా - నిజమయ్యే కలవై రా
నడిపించే అడుగై రా - ననుచేరి నాతో రా

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 10

ఇప్పుడు మీకు కొద్ది కొద్దిగా తెలుగులో టైపింగ్ చెయ్యటమెలాగో వచ్చిందన్న మాట! లేఖిని, బరహా లో వలె కేపిటల్ అక్షరాలు (అప్పెర్ కేజ్ అక్షరాలు), స్మాల్ లెటర్స్ (లోయర్ కేజ్ అక్షరాలు) ఇందులో వ్రాయడం ఉండదు. అన్నీ చిన్న అక్షరాలలోనే టైపింగ్ చెయ్యటం జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు జరిగిన పాఠాలలో అలాగే చెప్పాను. మళ్ళీ ఒకసారి చూడండి.  మీకు ఈ తేడా స్పష్టముగా తెలియాలంటే ఈ క్రింది ఉదాహరణ చూడండి.:

ఇప్పుడు మనం ఒక పదాన్ని లేఖిని లేదా బరహా లో వ్రాద్దాం. ఆ తరవాత దాన్ని గూగుల్ లిప్యంతరము లో వ్రాద్దాము. మాయా, బ్లాగులో, ఆషాడమాసం అన్న ఈ మూడు పదాలు తీసుకున్నామే అనుకుందాము. వీటిని ముందుగా బర్హాలోనో, లేఖిని లో ఇలా వ్రాస్తాము..

మాయా = mAyA
బ్లాగులో = blAgulO
ఆషాడమాసంAshADamAsaM 

అని అలా పెద్దా చిన్న అక్షరాలని వాడుతూ ఇంగ్లీషులో వ్రాస్తాము కదా.. ఇప్పడు గూగుల్ లిప్యంతరాన్ని వాడి పదాలని ఎలా తెలుగులో వ్రాయగలమో చెబుతాను.

మాయాmaayaa 
బ్లాగులో =  blaagulo  
ఆషాడమాసంaashaadamaasam    

ఇలా వ్రాయవచ్చును. మీకిక్కడ ఒక విషయం చెప్పదలచుకున్నాను.. మీరు వాడుతున్న లేఖిని, బరహా.. లని నేను తక్కువ చూపు చూసి, వాటిని వాడకండీ, అవి వాడితే తలనొప్పులు.. అని ఏమీ చెప్పటం లేదు. అది మీ ఇష్టం. కాదనను. ఎవరికీ ఏది బాగుంటే అదే వాడండి. మిమ్మల్ని ఇదే వాడండి అని ప్రాధేయపడటం లేదు. గూగుల్ వాడి లిప్యంతరము వాడితే / వాడమని మీతో చెబితే నాకేమీ కమీషను గానీ, మరే ఇతర ప్రోత్సాహకాలు గానీ నాకు రావని మీకు సహృదయముతో విన్నవించుకుంటున్నాను.

మరి ఇదంతా ఎందుకు అని మీరడిగితే ఒక స్నేహితురాలు నాకు తెలుగు టైపింగ్ నేర్పించరా? అని (గోముగా) అడిగితే దగ్గరుండి(!!) నేర్పించలేక ఇలా ఆమెకి పాఠాలు చెప్పాల్సివస్తున్నది. అలాగే పనిలో పనిగా మీకూ ఈ విషయములో సాయం చేద్దామని, నా బ్లాగులో వ్రాస్తే ఆమెకీ, అందరికీ ఉపయోగపడుతుందని.. అలాని ఇక్కడ వ్రాయటం. అంతే!! నేను తెలుగు పండితున్నీ కాను. అలాగే సాఫ్ట్వేర్ రంగానికీ చెందిన వాడిని కూడా కాను.. ఓ సాధారణ అంతర్జాల వీక్షకుడిని.. అంతే! దైవానుగ్రహం వల్ల ఈ టైపింగ్ ని స్వంతముగా నేర్చుకొని, మీకు చెప్పటం. నా బ్లాగు హెడర్ లో చెప్పినట్లు "నా జీవిత పాఠాలు నాతోనే ముగిసిపోకుండా, మీకూ పనిచేస్తాయన్న ఉద్దేశ్యముతో ఈ బ్లాగ్ ని మీకోసం రాయడం. ఏఒక్కరికైనా ఈ బ్లాగ్ లోని సమాచారం ఉపయోగపడిందంటే - ఈ బ్లాగ్ లక్ష్యం నెరవేరినట్లే.." అంతే! అలాని నేనేదో పెద్ద సహాయం చేస్తున్నానని గొప్పలు చెప్పుకోవటం లేదు. అలనాడు - లంకకి శ్రీ రాముడు వారధి కట్టినప్పుడు.. తనవంతు సహాయం చేసిన ఉడుత లాగా నా సహాయమూ అంతే!..

ఎవరైనా ఈ పాఠాలు చదివి "ఏకలవ్యుడిలా" వారి వారి నైపుణ్యాన్ని పెంచుకుంటే, నాకేమీ మీ చేతి వ్రేళ్ళని గురుదక్షిణగా అడగను అని మరీ మరీ విన్నవించుకుంటున్నాను. కాకపోతే - (ఆ! కాకపోతే!!- త్వరగా చెప్పూ..సస్పెన్సు ఎందుకూ - అని అంటున్నారా? ) OK!! ఒక చిన్న స్క్రాపు రాయండి చాలు. మీవల్ల తెలుగుని ఇంకా బాగా వ్రాయగలుగుతున్నాను అని. బస్! అంతే!! నాకొక అదో తుత్తి..

ఇక వచ్చే క్లాసుల్లో ఇంగ్లీషు పదాలని తెలుగులో ఎలా వ్రాయాలో చెబుతాను.

Wednesday, March 10, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 9

ఇప్పుడు మీరు రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు అక్షరాల పదాలని మీరు నేర్చుకొనే ఉండొచ్చు.. వాటిని ఇంకా క్రొత్తపదాలతో ఇంకా అభ్యాసం చెయ్యండి. బాగా వేగముగా వ్రాసేలా తయారవుతారు. ఇప్పుడు అలాంటి పదాలను ఉపయోగించి మీకు వాక్యాలు ఎలా వ్రాయాలో నేర్పిస్తాను ఇందులో.. ఇక్కడ చెబుతున్న వాక్యాలన్నీ రోమన్ ఇంగ్లీష్ లో టైపు చేసాక, స్పేసు బార్ ని నొక్కగానే వచ్చే తెలుగు పదాలతో ఇక్కడ మీకు తెలియజేస్తాను.

raamudu manchi baaludu = రాముడు  మంచి  బాలుడు.

neevekkada unnaavu? =  నీవెక్కడ ఉన్నావు?

aavida alaa enduku unnadi? =  ఆవిడ అలా ఎందుకు ఉన్నది? 

neevu ninna baagaane unnaavugaa! = నీవు నిన్న బాగానే ఉన్నావుగా! 

anthalone emayyindi? =  అంతలోనే ఏమయ్యింది?

meeru chaalaa manchivaaru..  =  మీరు చాలా మంచివారు..
  
meeru kramam thappakundaa blaaguki vasthaaru = మీరు క్రమం తప్పకుండా బ్లాగుకి వస్తారు

meeru baagaa vraayagalaru = మీరు బాగా వ్రాయగలరు

bhojanam chesaaraa? =  భోజనం చేసారా?

monna nenu ooriki vellaanu =  మొన్న నేను ఊరికి వెళ్లాను

meeru ninna pettukunna topee baagundi =  మీరు నిన్న పెట్టుకున్న టోపీ బాగుంది

nenu yadhaavidhigaa maa intiki vellaanu =  నేను యధావిధిగా మా ఇంటికి వెళ్లాను

anthalo maa mitrudu okaru vachhaaru =  అంతలో మా మిత్రుడు ఒకరు వచ్చారు

meeru emi chesthuntaaru? = మీరు ఏమి చేస్తుంటారు?

appudemi jarigindo telusaa? =  అప్పుడేమి జరిగిందో తెలుసా?

maadi chaalaa anuraagam, aathmeeyatha bandham = మాది చాలా అనురాగం, ఆత్మీయత బంధం

monna maa bujjigaadu jaari paddaadu = మొన్న మా బుజ్జిగాడు జారి పడ్డాడు

ninna naaku oka uttharam vachhindi = నిన్న నాకు ఒక ఉత్తరం వచ్చింది

meeru madyapaanam cheyatam maaniveyaali = మీరు మద్యపానం చేయటం మానివేయాలి

anthalone aa nirnayam teesukunnaanu =  అంతలోనే  ఆ నిర్ణయం తీసుకున్నాను  

andaroo nannu choodadaaniki vachhaaru = అందరూ నన్ను చూడడానికి వచ్చారు

aa ammaayi chaalaa baagundi = ఆ అమ్మాయి చాలా బాగుంది

shamshaabaad vimaanaashrayaaniki vellaamu = శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళాము

naaku antharjaalam nundi manchi mitrulu dorikaaru = నాకు అంతర్జాలం నుండి మంచి మిత్రులు దొరికారు

ee blaagu chaalaa chaalaa baagaa nachhindi = ఈ బ్లాగు చాలా చాలా బాగా నచ్చింది

nenu ippudu telugulo vraayatam nerchukuntunnaanu = నేను ఇప్పుడు తెలుగులో వ్రాయటం నేర్చుకుంటున్నాను

andaroo antaare gaani cheyaru = అందరూ అంటారు గాని చేయరు

eppudochhaamannadi kaadu annayyaa = ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా

manchivaariki eppudoo manche jaruguthundi = మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది

anthaa mana manchike = అంతా మన మంచికే

naannaa nenu ninna naaninaanu = నాన్నా నేను నిన్న నానినాను

kaakeeka kaakiki kaaka kukkakaa = కాకీక కాకికి కాక కుక్కకా

nakkakee, naagalokaaniki antha thedaa = నక్కకీ, నాగలోకానికి అంత తేడా

meeru baagunnaarani anukuntunnaanu = మీరు బాగున్నారని అనుకుంటున్నాను

aa ammaayi chaalaa baagundi = ఆ అమ్మాయి చాలా బాగుంది

ee blaagulo ilaantivi baagaa chepputhunnaaru = ఈ  బ్లాగులో ఇలాంటివి బాగా చెప్పుతున్నారు

eeroju oka manchi vishayam nerchukunnaanu =  ఈరోజు ఒక మంచి విషయం నేర్చుకున్నాను

meeru chaalaa goppavaaru = మీరు చాలా గొప్పవారు

mee shakthi meeku teliyadu = మీ శక్తి మీకు తెలియదు

raamudu, seetha iddaroo aadarsha bhaaryaabharthalu = రాముడు, సీత ఇద్దరూ ఆదర్శ భార్యాభర్తలు

aa baabu entha muddosthunnaado! = ఆ బాబు ఎంత ముద్దోస్తున్నాడో!

meeru baaga vraasthunnaaru =  మీరు బాగా వ్రాస్తున్నారు

andamaina vasanthakaalam idi =  అందమైన వసంతకాలం ఇది

evaroo puttinchaka pothe maatalelaa pudathaayi? = ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయి?

brundaavana mana andaridee =  బృందావన మన అందరిదీ

adigo! alladigo sree harivaasamoo! =  అదిగో! అల్లదిగో శ్రీ హరివాసమూ!

nee gnaapakaalu inkaa naa madilo unnaayi =  నీ జ్ఞాపకాలు ఇంకా నా మదిలో ఉన్నాయి

neevalaa nisthejamugaa undaku = నీవలా నిస్తేజముగా ఉండకు

manishi annaaka nerchukuntoo undaali = మనిషి అన్నాక నేర్చుకుంటూ ఉండాలి

manaki vachhinadi itharulaki panchaali = మనకి వచ్చినది ఇతరులకి పంచాలి


...ఇలా ఇన్నెన్నో వాక్యాలు వ్రాయోచ్చును. మీరు కాసింత వీలు చూసుకొని అబ్యాసం చేస్తే మీరూ బాగా తెలుగులో వ్రాయగలరు. వచ్చే క్లాసులో ఇంగ్లీష్ పదాలని తెలుగులో ఎలా వ్రాయాలో చెబుతాను. సరేనా!..

Tuesday, March 9, 2010

మైక్రో సాఫ్ట్ వారి భారతీయ భాషల పనిముట్టు

మైక్రో సాఫ్ట్ వారి భారతీయ భాషల పనిముట్టు (Indic Language Input Tool) ను ప్రత్యేకముగా భారతీయ భాషల కోసం విడుదల చేసారు. మీరు ఈ లంకె ద్వారా దిగుమతి చేసుకొని, మీ కలనయంత్రములో ( కంప్యూటర్ లో ) స్థాపితం చేసుకోగలరు.
లంకె :  http://specials.msn.co.in/ilit/Telugu.aspx     


మురిపాల గోపాల రారా కృష్ణా.. శ్రీ గురువాయురప్పా..

ఇప్పుడు మీకు ఒక ఒక చిన్నిపాప మరియు కోరస్ పాడిన చిన్ని భక్తి గీతం కానుకగా అందిస్తాను. దాన్ని మీరు మీ మొబైల్ కి రింగ్ టోన్ గా పెట్టుకోండి. చాలా బాగుంటుంది.

పాటపేరు :              "మురిపాల గోపాల రారా కృష్ణా.. శ్రీ గురువాయురప్పా.."
పాట టైపు :             MPEG ఆడియో లేయర్ 3
బిట్రేట్ :                   256 Kbps
విడుదల సంవత్సరం :  2002 
పాడినవారు :            కృష్ణదాస్ & కోరస్
పాట సైజు :                2. 26 MB
పాట సమయము  :    1 నిముషం, 14 సెకనులు

రింగ్ టోన్ లింకు:   "మురిపాల గోపాల రారా కృష్ణా!.."      

బాగుంటే చెప్పండి.. మరిన్నింటిని మీకు ఇవ్వటానికి సంతోషిస్తాను.           

Monday, March 8, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 8

తెలుగు లోని ఐదు, ఆరు అక్షరాల పదాలు :
ఇప్పుడు తెలుగు లోని ఐదు, ఆరు అక్షరాల పదాలు ఎలా వ్రాయాలో చెబుతాను..

మెచ్చుకోండి = mechhukondi
అభిప్రాయము = abhipraayamu
మెతుకుసీమ = methukuseema
కుశలమేనా? = kushalamenaa?
సంధ్యాసమయం = sandhyaasamayam
పరమాన్నాలు = paramaannaalu
ఆకలికేక = aakalikeka
శుభసాయంత్రం = shubhasaayantram
శుభోదయం = shubhodayam
ఎలావున్నావు? = elaavunnaavu?
సరియైనది = sariyainadi
ఎమీబాలేదు = emeebaaledu
అలకానంద = alakaananda
అమెరికాలో = amerikaalo
ఆస్ట్రేలియాలో = aastreliyaalo
ఆమనికోయిల = aamanikoyila
చదువుతున్నాడు = chaduvuthunnaadu
వ్రాయుచున్నాడు = vraayuchunnaadu
బాల్యస్నేహితుడు = baalyasnehithudu
అమావాస్యరాత్రిలో = amaavaasyaraatrilo
దురదగుండు = duradagundu
ఆకలిరాజ్యం = aakaliraajyam
విశ్వామిత్రుడు = vishwaamitrudu
విశ్వాసపాత్రుడు = vishwaasapaatrudu
ప్రేమలోనిమాదుర్యము = premalonimaadhuryamu
నిశిరాత్రిలో = nishiraatrilo
వెధవరోగం = vedhavarogam
రాయలసీమ = raayalaseema
ఆంధ్రప్రదేశ్ = aandhrapradesh
హైదరాబాద్ = hyderabad
సికిందరాబాద్ = sikindarabad
సికింద్రాబాద్ = sikindraabaad
పున్నమిచంద్రుడు = punnamichandrudu
ధైర్యవంతుడు = dhairyavanthudu
గుణవంతుడు = gunavanthudu
కళ్యాణచక్రవర్తి = kalyaanachakravarthi
సంధ్యాచీకటి = sandhyaacheekati
సినిమానటి = sinimaanati
కూచిపూడిలో = koochipoodilo
ఎవరికీచేందని = evarikeechendani
మౌనాలాపన = mounaalaapana
గాత్రపరీక్ష = gaatrapareeksha
శీలపరీక్ష = sheelapareeksha
ఆశ్చర్యాన్నీ = aashcharyaannee
ప్రాచీనభాష = praacheenabhaasha
ఎదురుచూస్తున్నాము = eduruchoosthunnaamu  
సాహిత్యాభిమానులందరూ = saahityaabhimaanulandaroo 
భీష్మేకాదశి = bheeshmaekaadashi
మానవసంబందాల్లోంచి  = maanavasambandhaallonchi
సాహిత్యసంపద = saahityasampada
ప్రాణాలర్పించిన = praanaalarpinchina 
మార్గశిరమాసములో = maargashiramaasamulo
జ్ఞానస్వరూపుడు = gnaanaswaroopudu 
జాతీయరహదారి = jaateeyarahadaari 
వానప్రస్థాశ్రమం = vaanaprasthaashramam 

ఇలా ఎన్నో, ఎన్నెన్నో వ్రాయచ్చును. ఇవన్నీ పదాలు వ్రాసాక స్పేస్ నొక్కగానే మారేటివి. మీరు అభ్యాసం చేయండి. ఏమైనా పదాలు రాకున్నచో ఈ ఫోరం లో రోమన్ ఇంగ్లీషులో వ్రాయండి - చెబుతాను. చాలా పదాలు వ్రాయచ్చును..అన్నది గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు అతి ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవలసింది ఏమిటంటే - మనం పదాన్ని ఎలా పలుకుతామో అలాగే వ్రాయాలి అప్పుడే సర్రిగ్గా వ్రాయగలం. అంటే ఫోనెటిక్ లో లాగా అన్నమాట! ఇక ముందు అంతా ఫోనెటిక్ లోనే వ్రాయాల్సి ఉంటుంది. బాగా గమనించగలరు.

గొప్పవారు ఏమన్నారంటే..

చాలా గొప్పవారు ఏమన్నారో విందామా!!.. అయితే వినండి. 

Saturday, March 6, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 7

నాలుగు అక్షరాల పదాలు :

ఇప్పుడు నాలుగు అక్షరాల పదాలు:

బాగున్నారా? = baagunnaaraa?
మంచివారు = manchivaaru
తెలంగాణా = telangaanaa
తిరుపతి = tirupati, thirupathi
అన్నవరం = annavaram
ఆశ్వయుజం = aashwayujam
భాద్రపదం = bhaadrapadam
ప్రభాకర్ = prabhaakar
సుమధుర = sumadhura
పిచ్చివాడు = pichhivaadu
పడుతున్న = paduthunna
పాడుతున్న = paaduthunna
శ్లాఘనీయం = shlaaghaneeyam
పోవాలని = povalani
ఆశిస్తాను = aashisthaanu
అవతలి = avathali
అవుతుంది = avuthundi
చేద్దామంటే = cheddaamante
అనుకుంటారు = anukuntaaru
శ్రీకృష్ణుడు = sreekrushnudu, srikrishnudu
వెధవలా = vedhavalaa
అర్జునుడు = arjunudu
అనురాగం = anuraagam
అందమైన = andamaina
గాలిపటం = gaalipatam
కాగితాలు = kaagithaalu
పొద్దున్నుంచి = poddunnunchi
కష్టపడి = kashtapadi
ఎగరేస్తే = egareste
పుటుక్కున = putukkuna
చేసిస్తాలే =chesisthaale
పోయిందని = poyindani
దగ్గరకు = daggaraku
కన్నీరని = kanneerani
చూసుకుంటే = choosukunte
కనిపించి = kanipinchi
బాధనంతా = baadhananthaa
తొడపాశం = todapaasham
బాధించాయి = baadhinchaayi
వచ్చేసిన = vachhesina
చూడగానే = choodagaane
ఊరుకోండి = oorukondi, voorukondi
అన్నయ్యలు = annayyalu
అక్కయ్యలు = akkayyalu
అమ్మమ్మలు = ammammalu
తాతయ్యలు = taatayyalu, thaathayyalu
పెదనాన్న = pedanaanna
ఆసుపత్రి = aasupatri
ఆవేదన = aavedana
ఒంటరిగా = ontarigaa
ఆకాశము = aakaashamu
ఉరుకుల = urukula
పరుగుల = parugula
వచ్చేశావు = vachhesaavu
జీవితాన్ని = jeevithaanni

ఇలా నాలుగక్షరాల తెలుగుపదాలు.. మీరు అభ్యసించండి. ఇంకొన్ని పదాలు రేపటి క్లాసులో చెప్పుకుందాం..

Wednesday, March 3, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 6

తెలుగు మూడక్షరాల పదాలు:

ఇప్పుడు తెలుగులో మూడు అక్షరాల పదాలు ఎలా వ్రాయాలో ఇప్పుడు చెబుతాను.. ముందుగా రోమన్ ఇంగ్లీష్ లో వ్రాసాక స్పేస్ బార్ నొక్కితే వచ్చే పదాలు:

ఇప్పుడు = ippudu
తెలుగు = telugu, thelugu
పదాలు = padaalu
వ్రాయాలో = vraayaalo
రాయాలో = raayaalo
ముందుగా = mundugaa
నొక్కితే = nokkithe
దేనికి? = deniki?
చెయ్యండి = cheyyandi
తిన్నారా? = thinnaaraa?
చేసారా = chesaraa
చేశారా = cheshaaraa
కమ్మగా = kammagaa
చెయ్యండి = cheyyandi
చెయ్యని = cheyyani
బాగున్నా = baagunnaa
ఉన్నారు = unnaaru
మీకిలా = meekilaa (మీకు+ఇలా)
కిటికీ = kitikee
తలుపు = talupu 
తలంపు = thalampu, talampu
మిక్కిలి = mikkili
కూతురు = koothuru
కోడలు = kodalu
కన్నీరు = kanneeru
మున్నీరు = munneeru
గవ్వలు = gavvalu
మువ్వలు = muvvalu
ముస్తాబు = mustaabu
అత్తమ్మ = atthamma
మామయ్య = maamayya
కొడుకు = koduku
అందము = andamu
చక్షువు = chakshuvu
ఉదరం = udaram
కడుపు = kadupu
మిక్కిలి = mikkili
కాటుక = kaatuka
అమ్మాయి = ammaayi
అబ్బాయి = abbayi
సముద్రం = samudram
తెనాలి = tenaali
అఘోరా = aghoraa
అభ్యాసం = abhyaasam
పరీక్ష = pareeksha
ఏమండీ = emandee
జాగ్రత్త = jaagrattha
ప్రదీప్ = pradeep
జలజ = jalaja
కవిత = kavitha
మేస్టారూ = mestaaroo
అసహ్యం = asahyam
అనూహ్యం = anoohyam
మైథిలి = maithili
రాముడు = raamudu
రుబాచి = rubaachi
జీవితం = jeevitham
ఉంటాయి = untaayi 
ప్రపంచం = prapancham 
అసలు = asalu
మనిషి = manishi 
కష్టాలు = kashtaalu
మంచిది = manchidi
కన్నీళ్లు = kanneellu
పెద్దలు = peddalu 
ఒక్కటే = okkate
దృష్టిలో = drushtilo
ప్రకృతి = prakruthi
ఈడుస్తూ = eedusthoo
బ్రతుకు = brathuku
చక్రాలు = chakraalu
కోరిక = korika
ఇల్లిల్లూ = illilloo
వికాసం = vikaasam 
స్వభాష = swabhaasha
తెలుగు = telugu
పాపము = paapamu

.. ఇలాంటివి అభ్యాసం చెయ్యండి. ఇంకో దానిలో తెలుగులో నాలుగు అక్షరాల పదాలను ఎలా వ్రాయాలో చెబుతాను.

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 5

రెండక్షరాల పదాలు:
సాధారణముగా కొన్ని పదాలు నేను చెప్పినట్లుగా రాసేస్తే సరి.. చాలావరకు ఆ పదం రాసాక స్పేస్ బార్ నొక్కిన తరవాత ఆ పదం మీద క్లిక్ చేస్తే open అయ్యే బాక్స్ లో సరియైన పదాన్ని ఎంచుకొని ఆ పదం మీద క్లిక్ చేస్తే ఆ పదం స్క్రాప్ లోకి వచ్చేస్తుంది.. ఇప్పుడు కొన్ని (తెలుగు లోని) సాధారణ పదాలు - రోమన్ ఇంగ్లీషులో వ్రాసి స్పేస్ నొక్కగానే మారేటివి రెండు అక్షరాల పదాలు చెబుతాను.. వాటిని ఎలా వ్రాయాలో చూడండి.

ఎలా = elaa
ఇలా = ilaa
కల = kala
కలా? = kalaa?
నీవు = neevu
నీవూ = neevoo
మీరు = meeru
మీరూ = meeroo
వారు = vaaru
వారూ = vaaroo
పదం = padam
పాదం = paadam
మాట = maata
కాకి = kaaki
పీత = peeta
అమ్మ = amma
అన్న = anna
అక్క = akka
చెల్లి = chelli
చెల్లీ = chellee
తాత = thaatha
తాతా = thaathaa
ఆట = aata
పేట = peta
పువ్వు = puvvu
పూవు = poovu
నక్క = nakka
కుక్క = kukka
గారు = gaaru
ఏమి = emi
రాకు = raaku
దాచు = daachu
కొన్ని = konni
సరి = sari
చేస్తే = cheste
బార్ = baar
మీద = meeda
రెండు = rendu
మూడు = moodu
ఐదు = idu
ఆరు = aaru
ఏడు = edu, yedu
పది = padi
చాలా = chaalaa
ఇంకా = inkaa
పాట = paata
జడ = jada
నిన్న = ninna
మిమ్ము = mimmu
మిన్ను = minnu
కన్ను = kannu
జున్ను = junnu
నోటి = noti
మట్టి = matti
పాము = paamu
చేయి = cheyi
వ్రేలు = vrelu
తన్ను = tannu
చిత్రం = chitram
బావ = baava
భావ = bhaava
చామ = chaama
భీమా = bheema
జింక = jinka
పాప = paapa
మేక = meka
టపా = tapaa
లింకు = linku
లింక్ = link
అందం = andam
భావం = bhaavam
బ్లాగు = blaagu
బ్లాగ్ = blaag

...ఇలా చాలా పదాలు వ్రాయవచ్చు.. ఇవన్నీ రోమన్ ఇంగ్లీష్ లో రాసి స్పేస్ నొక్కగానే మారినవి. మీరు ఈ పదాలని ఒక్కసారి ఎలా వ్రాసానో బాగా గమనించి అభ్యాసం చేయండి. ఏమైనా వ్రాయరాక పోతే వ్రాయండి. చెబుతాను. దీనితర్వాత మీకు మూడు అక్షరాల పదాలు నేర్పిస్తాను.

Monday, March 1, 2010

Rajamakutam - Sadiseyko gali..

చిత్రం: రాజమకుటం (1960)
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: మాస్టర్ వేణు
గానం: పి. లీల
****************
పల్లవి:
ఆ.. ఆ.. ఆ..
సడి సేయకో గాలి.. సడి సేయబోకే
సడి సేయకో గాలి.. సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే! సడిసేయకే..

చరణం 1:
రత్నపీఠికలేని రారాజు నా స్వామి
మణి కిరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే.. సడిసేయకే!

చరణం 2:
ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే.. సడిసేయకే

చరణం 3:
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవన పూని విసిరి పోరాదే

సడి సేయకో గాలి సడి సేయబోకే
బడలి, ఒడిలో రాజు పవ్వళించేనే!
సడి సేయకో గాలి... ఆ.. ఆ.. ఊ..ఊ..
Related Posts with Thumbnails