Showing posts with label Social Networking Sites. Show all posts
Showing posts with label Social Networking Sites. Show all posts

Monday, September 5, 2016

All page notifications from Facebook

ఫేస్ బుక్ లోని పేజీల లోని పోస్ట్స్ అన్నీ మీకు కనిపించటం లేదా? 

ఆ పేజీల పోస్ట్స్ లలో కొన్ని మిస్ అవుతున్నారా?? 

ఆయా పేజీలలో పబ్లిష్ చెయ్యగానే వెంటనే వాటిని చూడాలని అనుకుంటున్నారా??? 

వీటన్నింటికీ మీ సమాధానం అవును అయితే ఈ క్రింది విధముగా చెయ్యండి.

  • - పేజీ కవర్ ఫోటో క్రిందన LIKE బటన్ క్లిక్ చేసి, ప్రక్కన ఉన్న త్రికోణాన్ని నొక్కితే ఒక మెనూ వస్తుంది. 
  • - అందులో Notifications క్రిందన ఉన్న All On ని క్లిక్ చెయ్యండి. ( ఫోటోలో నీలిరంగులో, ఎర్రని బాణం గుర్తువద్ద చూపెట్టబడినది) 
  • - ఇక మీదట పబ్లిష్ చేసిన ప్రతి పోస్ట్ తాలూకు నోటిఫికేషన్ మీ అకౌంట్ కి వస్తుంది. 



Sunday, July 10, 2016

Facebook Friend request - Mark as Spam

సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ Facebook లో మనకి ఎందరెందరో స్నేహితులు అవుతుంటారు. మనకి స్నేహితులు కావాలీ అంటే మన ఫేస్ బుక్ అకౌంట్ శుభ్రముగా, మంచి పోస్ట్స్ తో కూడి ఉండాలి. అప్పుడు మనతో స్నేహానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆ వివరాలు ఏమిటో తరవాత చెప్పుకుందాం.. అంతలోగా ఎవరైనా మనకి స్నేహితులు అవటానికి మాటిమాటికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ ( ఆ రిక్వెస్ట్ ని ఒప్పుకోక రిజెక్ట్ చేస్తే ) విసుగు తెప్పిస్తుంటారు. ఇక వారంతే అనుకొని చాలామంది వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఒప్పుకోవడమో, లేక అలాగే అట్టి పెట్టడం చెయ్యటమో చేస్తారు. వచ్చిన ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని అలాగే అట్టి పెట్టేస్తే - మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ పెట్టలేడు సరికదా - ఇంకో లాభం ఏమిటంటే మనకు ఒక ఫాలోవర్ దొరుకుతాడు. అలా చేస్తే ఆ ఫాలోవర్ లిస్టు పెరిగి - " అబ్బో వీరికి ఇంత ఫాలోయింగ్ ఉందా?.." అని ఈర్ష్యగా ఫీలవుతుంటాం.. 

ఒక్కోసారి వద్దనుకున్నవారు మాటి మాటికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే - వారిని బ్యాన్ BAN చెయ్యకుండా - వారి వద్దనుండి ఫ్రెండ్ రిక్వెస్ట్స్ వద్దనుకుంటే ఇలా చెయ్యండి. 

చ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని తీరుబాటుగా పరిశీలించండి. వారు ప్రొఫైల్ వివరాలు - వారి కవర్ ఫోటో క్రిందన ఉన్న - About అబౌట్ లో చూడండి. ఏమైనా వివరాలు ఉన్నాయా అనీ.. 

తరవాత వారి ఫ్రెండ్ లిస్టులో ఉన్నవారిని చూడండి. ( చెత్త ప్రొఫైల్స్, అశ్లీల దృశ్యాల ప్రొఫైల్ పిక్స్ గల తన మిత్రులు ఎవరైనా ఉన్నారేమో చూడండి. ) 

టైం లైన్ లోని పోస్ట్స్ ని గమనించండి. వాటి ఫ్రీక్వెంట్స్ Freequents, వాటిలోని సత్తానీ, ( వచ్చిన లైక్స్ ని పట్టించుకోకండి. అమ్మాయిల పోస్ట్స్ కి అవి ఎక్కువగానే ఉంటాయవి ) వాటికి వచ్చిన కామెంట్స్, ఆ కామెంట్స్ కి వారిచ్చిన రిప్లైస్ Replies ని గమనించండి. 

వారి ఫోటో ఆల్బమ్స్ ని పరిశీలించండి. 

చివరిగా వారు లైక్ చేసిన పేజెస్ Pages ని ఒకసారి సింహావలోకం చెయ్యండి. అందులో వారు చేసిన లైక్ చేసిన పేజెస్ - వారి ప్రస్తుత మనస్తత్వాన్ని చూపిస్తాయి. 

అప్పుడు వద్దనుకున్న ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ వారు - ఇక వారి వద్ద నుండి మళ్ళీ రిక్వెస్ట్స్ రావొద్దు అనుకుంటే ఇలా ఈ క్రింది ఫోటోలో చూపినట్లు చెయ్యండి. 

1. వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఒప్పుకోకుండా Delete  చెయ్యండి.  
2. అప్పుడు ప్రొఫైల్ కవర్ ఫోటో మీద - రిక్వెస్ట్ రిమూవ్డ్ Request Removed అని కనిపిస్తుంది. దాని ప్రక్కనే మార్క్ ఆజ్ స్పాం Mark as spam అని వస్తుంది. మీరు దాన్ని గనుక నొక్కితే ( ఇక్కడ - If you tick 'Mark as Spam', this person will not be able to send you any more friend requests ) చాలు. వారింక మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పెట్టలేరు. 






Friday, March 4, 2016

నన్ను మీ పేజీకి అడ్మిన్ గా చెయ్యరూ..

ఫేస్ బుక్ లోని ఒక పేజికి నేను అడ్మిన్ ని. కొంతకాలం క్రిందట ఒక మెస్సేజ్ - "నన్ను అడ్మిన్ గా చెయ్యండి. నేనూ ఈ పేజీని మరింత బాగా మైంటైన్ చేస్తానూ.." అని. ఎవరు పంపారు అని చూశా. ఒక అబ్బాయి.

హ్మ్!.. ఓకే. కానీ అడ్మిన్ అన్నాక అడ్మిన్స్ గా ఉన్నవారందరి మనస్తత్వాలు బాగా కలిస్తేనే ఆ పేజీ నిర్వహణ బాగుంటుంది. ముక్కూ, మొహం తెలీని - ముఖ్యముగా వారెలా మైంటైన్ చేస్తారో తెలీనప్పుడు - కీలకమైన అడ్మిన్ పోస్ట్ ఎలా ఇవ్వగలం? ఒకవేళ ఇచ్చినా వారు అడ్మిన్ అయ్యాక - ఒక మంచి శుభ ముహూర్తంలో మనల్ని అడ్మిన్ పోస్ట్ నుండి తీసేసి, ఆ పేజీకి రాకుండా బ్లాక్ చెయ్యవచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో " పేజిపోట్లు " బయటకు రాకుండా కాలగర్భంలో కలసిపోయాయి. ( ఇలాంటివి రాకుండా ఉండాలంటే వారికి మేనేజర్ పోస్ట్ ఇవ్వాలి.. అది తరవాత చెప్పుకుందాం ) అందాకా పేజీని నిర్వహించి, బాగా పాపులారిటీ సంపాదించాక - చిన్న తప్పుతో - అప్పటిదాకా పడిన శ్రమని అప్పనముగా మరొకరికి ఇవ్వడం జరుగుతుంది. విత్తనం వేసి, మొక్కగా పెంచి, వృక్షముగా మారి ఫలాలను ఇచ్చేసమయంలో ఆ చెట్టే వేరొకరు ఆక్రమించుకుంటే ఎలా బాధగా ఉంటుందో - ఇదీ అలాగే ఉంటుంది. 

ఎందుకైనా మంచిది అని - మీరు నిర్వహిస్తున్న పేజీ లింక్ ఇవ్వండి. అది చూశాక - మీ నిర్వహణ తీరు చూశాక, అప్పుడు నిర్ణయిస్తామని చెప్పాను. తను నిర్వహిస్తున్న పేజీ లింక్ ఇచ్చాడు. ఆ లింక్ ద్వారా ఆ పేజీని తెరిచాను. అంతలోపే ఇంకో టాబ్ లో అతని పేరు మీదున్న ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశాను. మరొక టాబ్ లో గూగుల్ లో అతని పేరు మీద మరేమైనా ప్రోఫైల్స్ ఉన్నాయో అని వెదికాను. కానీ లేవు.

అతని ప్రొఫైల్ లో సరిగా వివరాలు లేవు. ఆ ప్రొఫైల్ అంతా ప్రైవేట్ గానే ఉంది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, ఫ్రెండ్ అయ్యాకనే తన అకౌంట్ లోని పోస్ట్స్ ని చూసేలా సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే అతను తన గురించి పబ్లిక్ గా ఏమీ  తెలీకుండా జాగ్రత్తగా ఉన్నాడన్నమాట. ఓకే.!

అతనిచ్చిన లింక్ ద్వారా తను నిర్వహిస్తున్న పేజీని తెరిచా.. షాక్.. ఆ పేజీలో అన్నీ ఈకార్డ్స్ యే. అవీ ఒక ప్రఖ్యాత తెలుగు ఈకార్డ్ రచయిత చేసినవి. తను అవి ఫోటోషాప్ ద్వారా చేస్తుంటారు. నా పేజీలో కొన్ని స్వయంగా వేశారు కూడా. తన పేజీ ప్రకటన వరకూ క్రాప్ చేసి, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి పేరుకీ, ఆ ఈకార్డ్స్ మీదున్న క్రియేటర్ పేరు కలవడం లేదు. తన పేరు వేరు. క్షణంలోనే అర్థమయ్యింది.. ఇది ఆ రచయిత పేరు మీద ఫేక్ పేజీ అనీ. ( నా పేజీ పేరు మీద కూడా మరో ఆరు పేజీలు తెరవబడ్డాయి. బాగా ఆదరణ పొందిన వాటికి ఈ బాధలు తప్పవేమో.. )

తనని అడిగాను - ఈ ఈకార్డ్స్ అన్నీ మీరే చేసి, పోస్ట్ చేశారా ? అని. అందులకు అతడు - అవును నేనే చేశాను.. అని చెప్పాడు. ఎంతగా అబద్ధం చెప్పాడు.

ఇక ఇలా కాదనుకొని, ఇంకో ట్యాబ్ లో - గూగుల్ లో ఒక కవిత / భావన ని కాపీ చేసి, ఈ కవితను ఈ కార్డ్ గా చేసి, వెంటనే నాకు పంపండి అని అడిగాను. దానికి అతడు " ఇప్పుడు నేను పెళ్ళిలో ఉన్నాను.. దగ్గరలో సిస్టం లేదు. రెండు రోజుల్లో చేసి పంపిస్తాను.." అన్నాడు. సరే! అలాగే కానివ్వండి. టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పాను.. ఇప్పటికి నెల రోజులయింది. కానీ చెప్పిన కవిత ఈకార్డ్ లేదు, ఆ అబ్బాయి జాడ కూడా లేదు. ఇలా ఉంటాయి. కాపీరాయుళ్ళ లీలలు.

ఇదంతా ఎందుకు చెప్పానూ అంటే - మీరూ ఒక ఆదరణ పొందిన ఫేస్ బుక్ పేజీ నిర్వహిస్తున్నట్లైతే - కాసింత జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలియచెయ్యడానికి. గుడ్డిగా నమ్మెయ్యకూడదని..


Monday, October 5, 2015

నా ఆన్లైన్ బిజినెస్ ఆలోచన

హ్మ్!.. రోజులన్నీ మామూలుగా గడిచిపోతున్నాయి. రోజువారీ కార్యక్రమాలు సాగిపోతూ..నే ఉన్నాయి. కానీ, ఏదో కొట్టొచ్చినట్లు వెలతి. ఏమిటా అదీ - అని ఎన్నేన్నోసార్లు నాలో నేను తొంగి చూసుకున్నాను.. ఏదో దొరికీ దొరకనట్లు, అస్పష్టముగా కనిపిస్తున్నది. అదేమిటీ? లిప్తకాలం అర్థమైనట్లు, ఆ తర్వాత ఇందాక ఏదో అగుపించిందే అని ఆలోచనలో పడటం.. ఏమై ఉంటుంది? ఇలా ఏళ్లకు ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. ఎవరితో అంతగా కలవలేక పోతున్నాను.. " జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది.." అన్నట్లుగా ఉంది. మూడు, నాలుగు ఏళ్లుగా ఈ మథనం. అలాని గడిచిన జీవితాన వెనక్కి చూస్తే - అప్పటికన్నా ఇప్పుడే చాలా నయం, బాగున్నాను అనిపిస్తుంది. చాలా విజయవంతమైన జీవితాన్ని, ఆనందాన్నీ పొందుతున్నాను నేను. అన్నీ ఉన్నాయి కానీ... అన్నట్లు ఏదో తెలీని లోటు.. నా చుట్టూ ఉన్నవారికి - ప్రేరణగా నా జీవితాన్ని మలిచాను. నా కష్టానికీ, శ్రమకీ, నైపుణ్యానికీ కాస్త గుర్తింపు రావటం మొదలెట్టింది. నా టాలెంట్ చుట్టుప్రక్కల వారిని ఆకట్టుకుంది. కానీ అది చాలదు.. చాలామందికన్నా నేను సక్సెస్ లో ఉన్నా, ఇంకా దాహం తీరటం లేదు.. ఏదో సాధించాలన్న ఆత్రం, ఆశయం, పట్టుదలా నాలో రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. నాలోని కళాకారుడికి దాహం తీరటం లేదు..

రోజు రోజుకీ సరిక్రొత్త ఆలోచనలు.. ఒకటి తరవాత ఒకటిగా ఎన్నెన్నో ఆలోచనలు. అన్నీ చెయ్యాలనిపిస్తుంది. అవన్నీ కొద్ది నైపుణ్యముతో కూడుకున్నవి అయినా - స్థాయి తక్కువగా ఉండటం వల్ల - ( స్థాయి అంటే ప్రజల దృష్టిలో సామాజిక స్థాయి అన్నమాట ) వాటిని స్వయంగా నేర్చుకున్నా - బయటకి ఎక్కడా ప్రయత్నించలేదు. ఆ పనులు నాకు వస్తాయని కూడా ఎవరికీ తెలీదు. వాటికి ఒక గుర్తింపు తీసుకురావాలన్నది నాకు ఆలోచన వచ్చింది.. ఏమి చేస్తే బాగుంటుంది ? అన్న మేధో మథనం (? :P) మొదలయ్యింది.

అపుడే ఆన్లైన్ బిజినెస్ గురించి విన్నాను.. విన్నాక - అది ఎలా ఉంటుందో కొన్ని పేరెన్నిక సైట్లనీ గమనించాను. వాటి పోస్టింగ్స్ నీ, వాటి వివరాల గురించీ, వాటిని ఎలా పంపిస్తారు - ట్రాన్స్ కషన్స్ Transactions ఎలానో ఒంటరిగా వివరాలు సేకరిస్తూ పోసాగాను. అలా పెద్ద సైట్లే కాకుండా చిన్న చిన్న సైట్లూ చూడటం మొదలెట్టాను.. అన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయి. అమ్మే వస్తువులు, సైట్ లే అవుట్స్ మాత్రమే కాస్త విభిన్నం. అంతే!.. హ్మ్! ఇదేదో బాగుందే అని ప్రాథమికంగా నిర్దారణ లోకి వచ్చాను. ఇక మరింతగా తెలుసుకోవట మొదలెట్టాను.

ఈ ఆన్లైన్ సైట్స్ అన్నవి రకరకాల వస్తువుల్నీ, సేవల్నీ అందిస్తున్నాయి. వాటి వాటి పరిమితుల మేరా అవి వ్యాపారాన్ని చేస్తున్నాయి. వ్యాపార అమ్మకాల సంస్థలని ముఖ్యముగా మూడు రకాలుగా విభజించ వచ్చును. అవి :
1. తాము ఆ వస్తువులని తయారుచేసి, అమ్మేవి. 
2. ఇతరులు చేసినవి అమ్మేవి. 
3. ఇతరులతో వస్తువులని చేయించి, అమ్మేవి. ( Entrepreneurship )

దాదాపుగా ఎక్కువ ఆన్లైన్ వ్యాపార సంస్థలు ఈ మూడింటిలో ఏదో ఒక వర్గానికి చెందినవి ఉన్నాయని నా అభిప్రాయం. నేను చేయబోయే ఆన్లైన్ వ్యాపార సంస్థ కూడా ఈమూడింటిలో ఏదో ఒక దానికి చెందినదై ఉంటుంది. ( చివరిగా ఈ మూడింటినీ కలిపి చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను ) హా! అవును. అదే విషయం చెప్పాలనే ఈ పోస్ట్.

అలాగే ఈ సంస్థలు విజయం కావాలంటే ఏమి చెయ్యాలో కూడా ఆలోచించాను. ఈ ఆన్లైన్ లో లేనివీ, నాకు అందుబాటులో ఉన్నవీ, నేను చేసేవీ, ఇతరులతో చేయించేవీ, వేరేవారి దగ్గర కొని, తిరిగి అమ్మేవీ.. ఇలా నాకు అందుబాటులోని సేవలు ఏమిటో ఆలోచించసాగాను. కొన్ని వస్తువులు మదికి తట్టాయి. కొరియర్ సంస్థలతో లింక్ అప్ Link-up కావాలి.. అదింకా పెండింగ్ లో ఉంది.

సైటు నిర్మాణం, నిర్వహణ అన్నది తరవాత చెయ్యాలని అనుకుంటున్నా.. ముందైతే ఉచిత సర్వీసుల్ని విరివిగా వాడుకోవాల్సిందే. అందుకు నా ఫేస్ బుక్ అకౌంట్ నీ, ఈ బ్లాగ్ నీ వాడుకోక తప్పేలా లేదు.. అది తరవాత సంగతి.

నేను పెట్టే / అమ్మే వస్తువుల గురించి ఆన్లైన్లో వెదికాను. హ్మ్. దాదాపుగా లేవు. కొన్ని ఉన్నా అంతంత మాత్రమే!.. వర్క్ బాగోలేదు. ఒక వస్తువు చూశా.. అ పోస్ట్ పెట్టి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది. చాలా చిన్న సైజులో ఉన్నా ( దాదాపు అంగుళములో సగం ) బాగానే అమ్మకాలు ఉన్నాయి. వర్క్ అంత బాగా లేదు.. స్మూత్ గా లేదు.. లోకల్ గా అయితే తక్కువ ధరలోనే దొరుకుతుంది. ఎంతైనా ఆన్లైన్ క్రేజ్ ఉందిగా. దాని వల్ల వినియోగదారులూ బాగానే ఉన్నారు కూడా. ఆ వస్తువుకు దాదాపు 1800+ అమ్మకాలు ఉన్నాయి. ఆ వస్తువు రేటూ బాగా ఉంది కూడా. ఆ రేటులో కొరియర్ సేవల రేటు బాగా ఉంటుంది. ఎందుకంటే మనకి వినియోగ దారులు ప్రపంచ అంతటా నుండి ఉంటారు. వారి దాకా పంపాలంటే కొరియర్ చార్జీలు బాగానే ఉంటాయ్. దాన్ని తగ్గించలేము. కొన్ని తప్పవు. ఒక్కో వస్తువుకి వంద రూపాయలు లాభం వేసుకున్నా ఆ వస్తువుకి రూ. 1,80,000 ( 1800 x 100 ) లాభం వస్తుంది. చాలా బాగుంది కదూ.. ఇక నేనూ ఒక సైట్ పెట్టాలని ఫిక్స్ అయ్యా..

దినపత్రికల్లో ముఖ్యముగా ఈనాడు వసుంధర లో - కొందరి ఆన్లైన్ బిజినెస్ చేసేవారిని పరిచయం చేస్తూ, వారి అనుభవాలనూ, ఇబ్బందులూ, వాటిని ఎలా ఎదురుకున్నారో అన్నీ వివరముగా చెప్పారు / చెబుతున్నారు కూడా. అవి బాగా ప్రేరణని ఇచ్చాయి. వాటన్నింటిలో కామన్ గా ఉన్నా విషయం ఏమిటంటే - మొదట్లో చాలా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఒక్కో ఇబ్బందినీ ఎంత తక్కువ కాలములో, ఎంత సమర్థవంతముగా ఎదురుకున్నావో అనే దానిపైన ఆ సైట్ జీవితకాలం ఆధారపడి ఉంటుంది. అలాగే మొదటి వినియోగదారులూ, వారి కామెంట్స్, రేటింగ్స్ ఆ సైట్స్ కి చాలా ముఖ్యం. అక్కడ సక్సెస్ అయితే - ఇక అంతా నల్లేరు నడకనే.. ఇక అన్నింటి సక్సెస్ ఇంటర్వూ లలో ఉన్న మరో కామన్ పాయింట్ ఏమిటంటే - ఫేస్ బుక్ లో పేజీ. అదీ అమ్మకాలల్లో ప్రధాన సమాచారానికీ, వినియోగదారులకు అందుబాటులో ఉంటూ, మన వస్తువులని ఈ ప్రపంచములో అందరికీ తెలియ చేస్తుంది. పైగా ఈ పేజీ నిర్వహణ చాలా సులభమే. ఉచితముగా నిర్వహించుకోగలిగే ఈ పేజీ అనేది - ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ఫేస్ బుక్ వినియోగదారులను మనకు చేరువ చేస్తుంది. ఈ ముఖ్య విషయాన్ని తెలియచేసిన ఈనాడు వారికీ, అందులో ఇంటర్యూలు ఇచ్చిన ఆన్లైన్ వ్యాపార విక్రేతలకూ కృతజ్ఞతలు. నేనూ ఒక పేజీ ఓపెన్ చెయ్యాలి అనుకున్నాను.

ఫేస్ బుక్ లో పేజీలంటే నాకు క్రోత్తేమీ కాదు.. వాటి నిర్వహణలో చాలా అనుభవమే ఉంది. నా నిర్వహణలో కొన్ని పేజీలు ఉన్నాయి. వెంటనే ఒక పేజీ తెరవవచ్చు. కానీ.. ఈ ఆన్లైన్ బిజినెస్ పేజీలు ఎలా ఉంటాయో తెలీదు.. అవి ఎలా ఉంటాయో చూశాకనే పేజీ తెరవాలని అనుకున్నాను. రోజులో నాకంటూ మిగిలే కొద్దిపాటి సమయంలో - వీలున్నప్పుడల్లా పేజీలని గమనించడం మొదలెట్టాను.. అలా చాలానే ఉన్నాయి పేజీలు. వీటిని వెదకాలంటే చాలా ఓపిక, సమయం.. అవసరం. ఇలా అయితే పని కాదని వాటి మూలాల నుండి వెదకడం మొదలెట్టాను. మూలాలు అంటే - ఒక్కో పేజీని తెరవాలంటే వాటిని తెరిచేటప్పుడే ఒక ప్రత్యేకమైన వర్గాల Specifications క్రిందకు చేర్చాలి. మళ్ళీ అందులో విభాగాలు ఉంటాయి. అలా వాటిని సెర్చ్ బాక్స్ లో టైపు చేసి, వెదికా.. చాలానే పేజీలు చూశా.. అప్పుడే నన్ను ఆశ్చర్యం, మిక్కిలి ఆనందంలో ముంచేసిన విషయమూ జరిగింది. అదిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

అలా ఒక పేజీ ఓపెన్ చేసినప్పుడు - అందులోని ఒక పోస్ట్ కి ఒకరు తన కామెంట్ చాలా బాగా చేశారు. చాలా అద్భుతముగా ఉంది. అలా వ్రాయాలి కామెంట్స్ అనుకున్నాను. ఎవరా వ్రాసింది అంటూ వారి ప్రొఫైల్ ని ఓపెన్ చేశాను. వారి పోస్ట్స్, టైం లైన్, అప్లోడ్ చేసిన ఫొటోస్, వారి ఫ్రెండ్స్, లైక్స్... ఇలా అన్నీ చూస్తూ పోయాను. చివరిగా తను ఇతర పేజీల మీద వ్రాసిన రివ్యూస్ Reviews కూడా చూశాను. అందులో ఒకటి సాంపుల్ గా Sample చూద్దాం.. ఎలా రివ్యూ వ్రాశారో అనీ. ఆ రివ్యూ ని చదివా.. బాగా ఆసక్తిగా అనిపించింది. వెంటనే ఆ ప్రొఫైల్ నుండి ఆ పేజీలోకి వెళ్లాను.

ఆ పేజీని క్రొత్తగా జేవేల్లెరి స్టోర్ Jewellery Store విభాగం క్రింద ఏర్పాటు చేశారు. ఆ పేజీ లైక్స్ మూడువందల కన్నా తక్కువే ఉన్నాయప్పుడు. తక్కువ ఖర్చుతో, మగువల అందాలను మరింతగా ద్విగుణీకృతం చెయ్యటానికి, వారి కోసం అనీ చేసిన ఫ్యాషన్ జేవెల్లరీ అది. ఆ పేజీ మీద అంతగా రివ్యూ వ్రాసే పాయింట్ ఏముందా? అనుకుంటూ ఆ పేజీ జల్లెడ పట్టాను. ఆ పేజీ ఓపెన్ అయినప్పటి నుండీ అన్ని పోస్ట్స్ చూసుకుంటూ వచ్చాను. వ్యూయర్స్ కామెంట్స్ కూడా చదువుకుంటూ వచ్చాను. ఎప్పటికప్పుడు వాటికి ఆ పేజీ స్వంతదారుడు ( అడ్మిన్ Admin ) జవాబులు ఇస్తూ వెళుతున్నాడు.. అలా కొన్ని కామెంట్స్ చూశాక, ఈ కామెంట్స్ శైలి ఎక్కడో చూశానే అనిపించింది. మరింత ఆసక్తిగా ఆ కామెంట్స్ ని వెదికి చూశాను. ఎస్.. అవును.. నాకు బాగా సుపరిచితమైన శైలి అది. కొన్ని సంవత్సరాల అనుభవమైన శైలి అది. ఆ కామెంట్స్ వ్రాసిన వారి ప్రొఫైల్స్ చూశాక నా అనుమానం దాదాపుగా నిజమయింది. అలాగే వెదుక్కుంటూ వెళ్ళా. ఒక దగ్గర ఆ పేజీ అడ్మిన్ ఎవరో, ఆ వస్తువులను ఎవరు ఎలా చేసి అలా అమ్మకానికి పెట్టిందీ తెలిసింది. వారు ఎవరో కాదు.. నా మాజీ స్నేహితుడే.. నేను దూరం చేసుకున్నానే అని చెప్పా కదా.. ఆ స్నేహితుడే. చాలా సంతోషముగా ఫీలయ్యాను. ఏదో కోల్పోయినది మళ్ళీ పొందాను అన్నభావన..

తనకి అంత టాలెంట్ ఉందని నాకూ తెలీదు.. చాలా బాగా చేశాడు. డిజైన్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటీ ఒక్కో వెరైటీగా చేశాడు. చాలా పేజీలో ఉన్నట్లు ఒకటే చేసి చాలా కలర్స్ లలో పెట్టలేదు. ఎన్నెన్నో వైవిధ్యాలు. ఇప్పుడే ఆర్డర్ ఇవ్వాలనిపించేంతగా బాగున్నాయి. తన పట్టుదల నాకు నాకు తెలుసు. ఆ రంగంలో తన అభిరుచీ తెలుసు. కనుకనే బాగా రిచ్ గా ఆ డిజైన్స్ వచ్చాయి. తన శ్రమ వాటిల్లో బాగా కనిపిస్తుంది. తనకి ఇలా చేయవస్తుందని నాకు ఊహామాత్రమైన తెలీదు. ఏమిటీ ? నా మాజీ స్నేహితుడని ఇంతగా అభినందిస్తూ వ్రాస్తున్నాను అనుకుంటున్నారా?.. అదేమీ లేదు.. నిజంగానే చెబుతున్నా.. తనేమిటో నాకు బాగా తెలుసు.. తన జీవితాన ఇదో గొప్ప మలుపు కూడా.. నేను దూరమున్నా / దూరమైనా - తన కోసం ఈమాత్రమైనా పుషప్ Push-up ఇవ్వాలి కదా.. (మాజీ) స్నేహితునిగా నా కనీస ధర్మం అది. దూరముగా ఉన్నా స్నేహితుడి శ్రేయస్సుని కోరుకోవాలి.

అలాని తన పేజీలో లోపాలు అన్నవి లేవని కాదు.. చిన్నవే అవి. సెక్షన్స్ వారిగా (అంటే ప్రత్యేక ఆల్బమ్స్ వారిగా) వాటిలోకి మారిస్తే మరింతగా అందముగా ఉండేది. " అభినందనలే పబ్లిక్ గా చెప్పాలి. విమర్శలు అన్నవి అంతరంగికముగా / ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి.. అలా అయితేనే స్నేహం చాలా బాగుంటుంది.. " అన్న విషయం తెలుసు.

అందుకే పర్సనల్ మెస్సేజ్ పెట్టి, అభినందనలు చెప్పాను. చెప్పొద్దూ అనుకుంటూనే బిలేటేడ్ విషెస్ చెప్పా.. మూడోరోజుకి - THANK YOU అన్న చిన్న మెసేజ్..  నాకు తెలుసు.. అన్నిరోజుల సమయం అవుతుందనీ. తన గురించి బాగా తెలుసు కాబట్టి. చాలా ఆనందం వేసింది. ఆ మాట చిన్నదే కావొచ్చు. అతడు నాతో మాట్లాడాడు అన్న ఫీలింగ్ చాలా సంతోషాన్ని కలుగజేసింది. అది చాలు..

ఇక నా పేజీ త్వరలోనే మొదలెట్టాలి. కాసింత సమయాన్ని వెచ్చించాలి. ఆన్లైన్ బిజినెస్ రుచి కూడా చవి చూడాలి. ఎందరో అద్భుత విజయాలను సాధిస్తున్నారు.. నేను ఆ మాత్రం సాధించాలేనా? చూడాలి.. కాలమే తెలుస్తుంది. పేజీ తెరిచాక మళ్ళీ ఇక్కడే అప్డేట్ చేస్తాను.. 


Friday, May 1, 2015

Orkut లోని Ortist ని వాడి బొమ్మలు గీయటం.

ఆర్కుట్ అనే సోషల్ నెట్వర్క్ సైట్ ని మూసేశారని మీకు తెలిసిన విషయమే..అందులో కొన్ని బొమ్మలని వేశాను.. Ortist అనే అప్లికేషన్ తో, మౌస్ ని కదుపుతూ వాడుతూ బొమ్మలని గీసుకోవచ్చును. ఇలా వేసుకున్న వాటిని ప్లే ( Play ) చేస్తే - ఎలా వేశామో అలా ఒక వీడియోగా కనిపిస్తుంది. ఓహో! ఇలా వేశారు, అలా వేస్తే ఈ బొమ్మ వస్తుంది.. అని తెలుసుకొనేలా ఉంటుంది - ఈ పద్ధతి. అప్పట్లో ఇలా చాలానే చిత్రాలు వేశాను. క్రొత్తలో కాబట్టి ఇందులో బాగా మమేకమైపోయాను. అలాగీసుకున్న ఒక అసంపూర్తి చిత్రాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. 

ఆర్కుట్ లోని నా క్రియేషన్స్ కాలగర్భములో కలసిపోకుండా, ఇలా నా బ్లాగులో దాచుకొనే ఒక చిన్న ప్రయత్నం ఇది. ఇలా గీసుకున్న చిత్రాల్లో ఇదొక్కటే దాచుకున్నాను.. మరెన్నో చిత్రాలు అలా కాలగర్భములో కలసిపోయాయి.. ప్చ్!. 

ఇలా గీసుకున్న ఇంకొన్ని చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిని ఇక పోస్ట్ చెయ్యలేను.. కారణం : ఆ సోషల్ సైట్ ని మూసేసారని ముందే మీకు తెలియచేశాను. వాటిని ఈ బ్లాగులో సేవ్ చేసుకోవటం మరిచాను. ఇలా కంప్యూటర్ మౌస్ వాడి గీసుకున్న చిత్రాలని అందరికీ చూపించుకోవటంలో ఆ తృప్తియే వేరు.. ఇప్పుడు ఆ అప్లికేషన్ మిగతావాటిల్లో ఉందో, లేదో నాకు అంతగా తెలీదు. నాకు మిగిలిన ఏకైక Ortist స్కెచ్ ఇదొక్కటే. ఈ క్రిందున్న వీడియోని ప్లే చెయ్యండి. ఎలా గీశానో మీకూ తెలుస్తుంది. క్రిందన కుడి మూలగా Speed అనే స్లైడ్ అడ్జస్ట్ బటన్ ఉంటుంది. దాన్ని ముందుకూ, వెనక్కి జరుపుకొని కావలసిన వేగములో ఆ వీడియోని చూడవచ్చును. 

దీన్ని నేను 19 - ఫిబ్రవరి - 20095:55:34 A.M కి గీయటం పూర్తిచేసి, పోస్ట్ చేశాను. ఇప్పుడైతే మరింత బాగా గీసేవాడిని.. ఇది శివరాత్రికి నా మిత్రులకు - శుభాకాంక్షలు తెలియచెయ్యటానికి ఈ ప్రయత్నం చేశాను.. కానీ సమయం చిక్కకనో, మరే కారణం వల్లనో ఇంకా బాగా వెయ్యటానికి ప్రయత్నించలేకపోయా.. 




Wednesday, February 18, 2015

జీవితం అంటే -

నేనీమధ్య ఒక చిన్న కథ చదివా.. చివరివరకూ ఏమిటా అన్నది అర్థం కాలేదు.. తరవాత బాగా నచ్చేసింది. ఈ కథని ఎవరు వ్రాశారో ( రచయిత / రచయిత్రి ) గానీ నాకు చాలా బాగా నచ్చేసింది. అచ్చు తప్పులు సరిచేసి, కాస్త కథని కొద్ది వివరముగా మళ్ళీ వ్రాసుకున్నాను ఇలా. 

జీవితం అంటే -
*****************
ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది " నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు. గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు. వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు), మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.

తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి, ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా - అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.

అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి, వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.

నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది " ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది. కాఫీ డికాషన్ వచ్చింది.. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. "

అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,
" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడినీటినీ చవిచూశాయి. కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా? మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి. చితికిపోయే గుడ్డు గట్టిపడింది. గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి, నీటిరంగునే మార్చింది.. అవునా..!!

ఇప్పుడు చెప్పు..
వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?
మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )
గట్టిపడిపోతావా..?
పరిస్థితులను మారుస్తావా...?
ఇక్కడ నీదే ఎంపిక, దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.

ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు. దానిబదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది.. " నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.." కృతజ్ఞతాభావంతో అంది. 


Tuesday, December 23, 2014

Photo album upload tips

మీరు మీ ఫేస్ బుక్ అకౌంట్ లో ఏదైనా ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారా ? అయితే ఈ క్రింది సూచనలని పాటించండి. ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. కానీ క్రొత్తగా వాడుతున్న వారికీ, ఎలా చెయ్యాలో తెలీని వారికి ఈ టపా.. 

మీ ఫేస్ బుక్ టైం లైన్ లో కవర్ ఫోటో క్రింద ఆల్బమ్స్ Albums అనే టూల్ ఉంటుంది. దాన్ని నొక్కితే, మీ ప్రొఫైల్ లో ఏమేమి ఫొటోస్ ఉన్నాయో తెలుస్తుంది. అలా ఓపెన్ చెయ్యగానే పైన క్రియేట్ ఆల్బం / ఆడ్ వీడియో ( Create Album / Add video ) అని వుంటుంది. ఇందులో ఉన్న క్రియేట్ ఆల్బం ని నొక్కితే - మీరు మీ అకౌంట్ లో క్రొత్తగా ఒక ఆల్బం పెడుతున్నారని, దానికోసం తగిన విధముగా వివిధ ఆప్షన్స్ కల మెనూ వస్తుంది. అది ఈ క్రింది విధముగా ఉంటుంది. 


1. క్రియేట్ ఆల్బం Create album ని నొక్కగానే మీకు ఇలా వస్తుంది. అలా నొక్కినప్పుడు - మీరు ఏ ఫోటో ఆల్బం అప్లోడ్ చెయ్యబోతున్నారో - అందులోని ఒక ఫోటో ని ముందుగా సెలెక్ట్ చేసుకొని, ఓకే చెయ్యాలి. అప్పుడే ఈ ఆల్బం తయారవటానికి తగిన ప్రాసెస్ జరగటానికి ముందుకు వెళుతుంది. ఈ ఎన్నిక చేసుకున్న ఫోటో ఆ ఆల్బం లోని విషయాన్నంతా ఆ ఒక్క ఫోటోలో అగుపించేలా ఉన్నది అయితే మరీ మంచిది. ఉదాహరణకి అంటే - ఏదైనా దేవాలయం ఆల్బం అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటే ఆ ఆలయం పూర్తి ఫోటో ఒకటి అలా అప్లోడ్ చేస్తే చాలు. ఈ ఫోటోనే ఆ ఆల్బం కి కవర్ ఫోటోగా మారుతుంది. కనుక ఆ ఫోటోనే ఆల్బం కవర్ ఫోటో Album Cover Photo అని అంటారు. ఈ ఫోటో ని కవర్ ఫోటో కాకుండా వేరే మరొకటి కూడా - మనకిష్టం ఉన్నప్పుడు మార్చుకోవచ్చును. ఒక ఆల్బం లో ఫొటోలు అప్లోడ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినవే అప్లోడ్ చేస్తే - ఆ ఫోటో ఆల్బం చూడటానికి బాగుంటుంది. 

2. వద్ద నున్న High Quality ని నొక్కండి. అంటే ప్రక్కన ఉన్న గడిలో నొక్కితే టిక్ మార్క్ వస్తుంది. అలా చేస్తే - మీరు అప్లోడ్ చేసే ఫోటోలు మరింత నాణ్యముగా అప్లోడ్ అవుతాయి. ఆ ఫోటోల క్లారిటీ మంత బాగుండి, వీక్షకుల మదిని మరింతగా ఆకట్టుకుంటాయి. ఇలా చెయ్యడం అనేది - మీ ఫోటోగ్రఫీకి చెందినవీ, పెళ్లి, ఏదైనా ఫంక్షన్స్ ఫోటోలకి వాడితే బాగుంటుంది. ఆ ఫోటోలని చిన్నగా మామూలుగా - వాటి మీద డబల్ క్లిక్ చేసి, ఓపెన్ చేసినప్పుడు కన్నా, ఆ ఫోటో మూలన ఉన్న డబల్ ఆరో Double arrow గుర్తుని వాడి, వాటిని పెద్దగా చేసి చూస్తే - మరింత అందముగా కనిపిస్తాయి. నిజానికి ఇలా పెద్దగా చేసి, చూస్తే పెళ్లి, పర్యాటక.. ఫొటోస్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయని చాలామందికి తెలీదు. ఎవరివైనా అలా చేసి చూడండి. తేడా, ఫీల్ Feel ఏమిటో మీకే తెలుస్తుంది. ఇలా టిక్ చెయ్యటం ఆల్బం అప్లోడ్ అయ్యే ముందుగా చెయ్యాలి. 

దాని క్రిందన ఉన్న Changing date నోక్కకండి. అలా చేస్తే - ఆ ఫోటో ఆల్బం తీసిన డేట్ కానీ, మరేదైనా తేదీ కానీ మార్చుకొనే వీలు ఉంటుంది. ఇలా మారిస్తే ఆ తేదీకి ఆ ఫోటో ఆల్బం పోస్ట్ చేసిన వారు అవుతారు. ఉదాహరణకి ఈరోజు పోస్ట్ చేస్తూ -  అలా నొక్కి వేరే తేదీ ఎంచుకుంటే ( నవంబర్ 1 అనుకుందాం )  ఆ తేదీకి ఆ ఆల్బం మారిపోతుంది. అంటే మీ టైం లైన్లో పైన కనపడాల్సిన పోస్ట్ లోపల ఎక్కడో నవంబర్ నెల టైం లైన్ లో పోస్ట్ అవుతుంది. అది మీ ఫ్రెండ్స్, ఇతరులు మీ ఆల్బమ్స్ ఏమున్నాయా అని చూస్తే కానీ - ఆల్బం ఉన్నట్లు తెలుసుకోలేరు. అందుకే జాగ్రత్త అన్నాను. 

3. ఈపాటికి ఆల్బం కవర్ ఫోటో అప్లోడ్ అయి ( అవుతూ ) ఉంటుంది. అప్పుడే మిగిలిన ఫొటోస్ అప్లోడ్ చెయ్యటానికి 3 వద్దనున్న Add More Photos అనే టూల్ ని నొక్కండి. ఇప్పుడు ఆ అప్లోడ్ చెయ్యాల్సిన ఆల్బం తెరచుకొని, అందులోని మిగిలిన ఫొటోస్ ని ఎంచుకొని, ఓకే చేస్తే - ఆ ఫొటోస్ ఒకదాని వెనక మరొకటి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అప్లోడ్ అవుతున్న ఫొటోస్ అన్నీ ఒక్కొక్కటిగా ఎంతవరకు అప్లోడ్ అయ్యాయో నీలిరంగులో ఉన్న ప్రాసెస్ లైన్ వల్ల తేలికగా తెలుసుకోవచ్చు. ఇలా అప్లోడ్ అవుతున్న సమయాన మిగతా సెట్టింగ్స్ పెట్టేసుకోండి. ఇలా అప్లోడ్ చెయ్యటానికి ముందుగా మీ డాటా ప్లాన్ ని చెక్ చేసుకోండి. 6 మెగా పిక్సెల్ డిజిటల్ కేమరాతో ఫొటోస్ అయితే ఒక్కొక్కటీ ( సెట్టింగ్స్ బట్టి ) మామూలుగా 3.0 నుండి 5.5 MB సైజులో ఉంటాయి. ఎడిట్ చేస్తే మరింతగా పెరగవచ్చును. ( ఇలా చేసిన ఒక ఫోటో ఈమధ్యే చూశాను - అది 70 MB సైజులో ఉంది. నిజం. నేనే నమ్మలేక పోయాను ) ఇప్పుడు వస్తున్నవి 16, 20 మెగా పిక్సెల్స్ లలో వస్తున్నవి. వీటి వల్ల తీసే ఫొటోస్ - ఇంకా పెద్ద సైజు రెజల్యూషన్ ల్లో ఉంటాయి. డాటా, అప్లోడ్ సమయాన్నీ, మీ సమయాన్ని, డబ్బునీ ఇవి బాగా తినేస్తాయి. ఇలా కాకుండా ఉండటానికి మరో పద్ధతి ఉంది. ఫోటో సైజుని ( రెజల్యూషన్ ని ) బాగా తగ్గించాలి. ఇది ఎలా చెయ్యాలో మరో టపాలో నేర్చుకుందాం.. 

4. Order by date taken అనేది - ఆ ఆల్బం లోకి చాలా రోజుల నుండి తీసిన ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నట్లయితే ( లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పటి ఫొటోస్ లాంటివి ) ఇది వాడితే - ఆ ఫోటో తీసిన సమయాన్ని బట్టి లేదా ఫోటో క్రమసంఖ్య వల్లనే గానీ వరుసగా అప్లోడ్ అవుతాయి. 

5. వద్ద నున్న Untitled Album వద్ద - ఆ ఆల్బం కి తగిన పేరు పెట్టాలి. ( టైప్ చెయ్యాలి ) అలా చేస్తే ఆ ఆల్బం ఫలానా దానికి చెందినదని తేలికగా తెలుసుకోవచ్చు. ఫలానా ఆల్బంలో అని చెప్పటానికి తేలికగా ఉంటుంది. ఇది ఇంగ్లీష్ లో ఉంటే బాగుంటుంది. 

6. ఇక్కడ మీకు Say something about this album అని కనిపిస్తుంది. అక్కడ నొక్కితే - ఆ అక్షరాలూ మాయమైపోయి, వ్రాయటానికి ఒక బాక్స్ లా మారిపోతుంది. అందులో ఆ ఫోటో ఆల్బం ఫోటోల సందర్భం, సమయం, ఎక్కడ జరిగినదీ.. ఇలాంటి విషయాలన్నీ క్లుప్తముగా వ్రాయాలి. ఆ ఆల్బం తాలూకు ఒక Info సమాచారం మాదిరిగా ఉంటుంది. 

7. ఇక్కడ మీకు మరో ఆప్షన్ - Where were these taken అని కనిపిస్తుంది. అందులో ఆ ఫొటోస్ ని ఎక్కడ తీశారో, ఆ ప్రదేశం పేరుని టైపు చేస్తే డ్రాప్ మెనూలో ఆ ప్రదేశం పేరులా ఉన్నవి వస్తాయి. అందులోంచి సరియైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఇలా ఎన్నుకొన్న ప్రదేశం పేరు - ప్రతి ఫోటోకి - ఫోటో డిస్క్రిప్షణ్ గా Photo description అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక్కదగ్గర వ్రాస్తే చాలు.. ప్రతి ఫోటోకీ అలా తీసిన ప్రదేశం వ్రాయాల్సిన అవసరం ఉండదు.. ఏ ఒక్క ఫోటో ఓపెన్ చేసినా ఆ ఫోటో వివరణలో ఆ ప్రదేశం పేరు కనిపిస్తుంది. 

8. ఇక్కడ కనిపిస్తున్న Public వద్ద నున్న త్రికోణాన్ని నొక్కితే డ్రాప్ మెనూ వస్తుంది. అందులో ఇలా ఉంటాయి. 


Public, Friends, Only Me, Custom తో బాటు Close Friends, Hyderabad Area అని కనిపిస్తాయి. 

Public అనేది ఫేస్ బుక్ లోని అందరూ ఆ ఫొటోస్ ని చూడటానికి వీలు కల్పించడం అన్నమాట. 

Friends అన్నది - మీకు అక్కడ స్నేహితులుగా ఉన్నవారే చూడటానికి అర్హులుగా చెయ్యడం. అంటే మీ ప్రొఫైల్ లోని స్నేహితులు మాత్రమే ఆ ఫొటోస్ చూడగలరు. 

Only Me అనేది ఎన్నుకుంటే ఆ ఆల్బం ని మీరు మాత్రమే - మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి, చూడగలరు అన్నమాట. 

Custom అంటే ఎవరినైన ప్రత్యేకముగా -ఎన్నుకున్న కొద్దిమంది స్నేహితులకూ, కొంతమంది ఫేస్ బుక్ లో లేని వారికి ఈమెయిల్ అడ్రెస్ వల్ల గానీ ఈ సెట్టింగ్ వల్ల వారికి మాత్రమే ఆ ఫోటో ఆల్బం చూపించగలం. ఇలా ప్రత్యేకమైనవీ, పర్సనల్ వీ, సున్నితమైన ఫొటోస్ నీ దగ్గరి వారికి చూపించుకోవచ్చు. ఇలా ఒక ఆప్షన్ ఉందని చాలామందికి తెలీదు. అది తెలీక ఫొటోస్ ని బహిరంగముగా అప్లోడ్ చేస్తుంటారు. 

ఇవే కాకుండా ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. క్లోజ్ ఫ్రెండ్స్ Close friends అనే ఆప్షన్ ఎంచుకుంటే - ఫేస్ బుక్ లో మనం ఎంచుకున్న దగ్గరి స్నేహితులు ఈ ఫోటో ఆల్బం చూడటానికి అర్హత లభిస్తుంది. 

ఇక ఉంటున్న ప్రదేశం బట్టి కూడా - ఆ ప్రదేశం లోని వారు మాత్రమే చూడగలిగేటట్లు చేసుకోవచ్చును. అంటే హైదరాబాద్ అని ఎంచుకుంటే - ప్రొఫైల్ లో హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్న వారు మాత్రమే చూస్తారన్న మాట. ఇది వాడకం తక్కువ. 

9. ఇక ఆఖరున మిగిలింది Post అన్నది. దీన్ని నొక్కితే ఆల్బం అప్లోడ్ అయ్యాక - ఆ ఆల్బం ఎంచుకున్న సెట్టింగ్స్ లతో  మన టైం లైన్ మీద ప్రత్యక్షమవుతుంది. 

ఇలా ఈ విధమైన సెట్టింగ్స్ పెట్టుకుంటే మన ఫోటో ఆల్బం, అందులోని ఫోటోలు ఎవరు చూడాలో వారే చూస్తారు. దాని వలన మనకూ హాయిగా ఉంటుంది. నిజానికి ఇంత ఆలోచన అందరికీ ఉండదు... ముఖ్యముగా మహిళలకి. ఈ పోస్ట్ లోని జాగ్రత్తలన్నీ వారికి ఉపయోగపడాలనే వ్రాయటం జరిగింది. 

Tuesday, August 26, 2014

Orkut - 4 Download Data archive

ర్కుట్ - సోషల్ సైట్ ని మూసేస్తున్నారన్నది మీకందరికీ తెలిసిన విషయమే. అందులోని పోస్ట్స్, మన కామెంట్స్, ఫోటోలకి వచ్చిన కామెంట్స్ నీ, టెస్టిమోనియల్స్, కమ్యూనిటీలలో మనం వ్రాసిన పోస్ట్స్ ని మనం ఎల్లకాలం దాచుకొనే విధముగా ఆర్కుట్ (గూగుల్) వారు ఒక సౌకర్యాన్ని కలిగించారు. దాన్ని ఎలా వాడుకోవాలో మీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఈ విషయాన్ని చాలా ఆలస్యముగా తెలియచేస్తున్నందులకు మన్నించండి. నాకున్న బీజీ జీవితాన అలా అయ్యిందని అర్థం చేసుకోగలరని మనవి. 

క్రింది విధముగా ఆర్కుట్ - సోషల్ సైట్ లో ఖాతాలు ఉన్నవారందరికీ - వారి వారి ప్రోఫైల్స్ లలో మొదటగా కనిపించే విధముగా ఇలా వస్తుంది. ఈ సంవత్సరం 30, సెప్టెంబర్ 2014 వరకూ ఆర్కుట్ ఖాతా  కనిపిస్తుంది. ఆతరవాత ఇక కనిపించదు అని దాని సారాశం. 


మీకు ఒక  ఆర్కుట్ మూసేస్తున్నట్లుగా మెయిల్ వచ్చి ఉండవచ్చును. ఒకవేళ రాకుంటే ఏమీ బాధపడకండి. అందులో ఇచ్చిన ఒక లింక్ ని నొక్కితే ఇలా ఈ పేజి మీకు కనిపిస్తుంది. ఇందులో మీకు కనిపిస్తున్న రెండు లింకుల్లో ఒకటి అంటే Export your photos.. అనే లింక్ ని ఎలా చెయ్యాలో మీకు ముందు పోస్ట్ లో చెప్పాను. ఇప్పుడు మిగిలిన లింక్ అంటే  See your Orkut profile, scraps, testimonials & community to your computer using Google takeout అనే లింక్ ఉంది చూడండీ.. ఆ లింక్ ప్రక్కనే మరొక చల్లని కబురు కూడా చెప్పారు. ఇలా డౌన్లోడ్ చేసుకోవడం అన్నది - సెప్టెంబర్ 2016 వరకూ అన్నది. ఇలా మరో రెండు సంవత్సరాల సమయం ఉందన్నమాట. అయిననూ త్వరపడండి. 


లింక్ ని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఈ క్రింది విధముగా కనిపిస్తుంది. ఇందులో సభ్యుల కోసం కొన్ని సూచనలు ఉన్నాయి. కమ్యూనిటీల ఓనర్స్ కి కొన్ని ముఖ్యమైన సూచనలని అక్కడ ఇచ్చారు. జాగ్రత్తగా చదివి, ఆచరించండి. 

 కౌంట్ నీ, మన పోస్టింగ్స్ నీ ఎలా డిలీట్ చేసుకోవచ్చునో అందులో తెలియ చేశారు. అవన్నీ డిలీట్ ఎందుకూ అంటే - గూగుల్ సర్చ్ లో సర్చ్ చేస్తే - పబ్లిక్ ఆప్షన్ గా ఉన్న పోస్ట్స్ అన్నీ కనపడేలా ఎప్పటినుండో ఉంది. అలా ఇక గూగుల్ సర్చ్ లో కనపడకుండా ఉండాలంటే అలా చేసుకోక తప్పదు. మరిన్ని వివరాలకు క్రింది ఫోటో మీద డబల్ క్లిక్ చేసి, తెలుసుకోగలరు. 


ర్కుట్ లోని మన ఇన్ఫర్మేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే - చేసుకుంటే ఏమేమి వస్తాయో, ఎలా ఉంటుందో, అన్నీ ఇక్కడ విపులముగా ఇచ్చారు. అలా డౌన్లోడ్ చేసుకొనే వాటిల్లో - మన ప్రొఫైల్, మనకి వచ్చిన / పొందిన స్క్రాప్స్, వచ్చిన టెస్టిమోనియల్స్, మన ఫొటోస్, కార్యకలాపాలు.. ఇత్యాదివి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన గూగుల్ వారి టేకవుట్ Take out ఇలా ఈ లింక్ నొక్కితే వస్తుంది.. ( https://www.google.com/settings/takeout ) 

విషయం అంతా మనకి ఒక ZIP (  Joint Photographic Experts Group ) ఫార్మాట్ లో ఒక సింగిల్ ఫైల్ ( సైజుని బట్టి ) వస్తుంది. అందులో వచ్చే ఫైల్స్ అన్నీ HTML ( Hyper Text Markup Language ) ఫార్మాట్ లో ఉంటాయి. అంటే ఆ ఫైల్స్ అన్నీ గూగుల్ క్రోం లాంటి బ్రౌజర్స్ లాంటి వల్లే తెరవగలం / చూడగలం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఫొటోస్ అన్నీ JPEG ఫార్మాట్ లో కనిపిస్తాయి. ఈ ఫార్మాట్ అన్ని సిస్టమ్స్, ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్స్ కీ, ఫోటో ఎడిటర్స్ కీ అన్నివిధాలా అనువుగా ఉంటుంది. కనుక అదీ మంచి అంశమే. 


చ్చిన టేక్ అవుట్ పేజీ లింక్ ని నొక్కితే ( పైన ఇచ్చాను చూడండి) ఇలా మీకు కనిపిస్తుంది. అప్పుడు ఈ క్రింద ఎర్రని బాణం గుర్తు కనిపిస్తున్న వద్ద Create an archive ని నొక్కండి. 


ప్పుడు ఇలా గూగుల్ వారి సైట్స్ ఓపెన్ అవుతాయి. అందులో ఆర్కుట్ ప్రక్కన ఉన్న గడిలో టిక్ చెయ్యండి. ఆ తరవాత ఓకే చెయ్యండి. అది ఎలాగో ఈ క్రింది ఫోటో మీద డబల్ క్లిక్ చేసి, చూడండి. 


తరవాత ఇలా గూగుల్ వారి ఆర్కుట్ లోని డాటా కాన్ఫిగర్ చేసుకోవటానికి సిద్ధముగా ఉందని ఇలా కనిపిస్తుంది. 


పై ఫోటోలో 1 Google product ప్రక్కన .zip format change అని ఉంటుంది. ఇది మనకి అవసరం లేదు అయినా డిటైల్స్ చెబుతున్నాను. దాని ప్రక్కన ఉన్న Change ని నొక్కితే ఇలా క్రింది విధముగా కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న త్రికోణం కనిపిస్తుంది. ( ఎరుపురంగు బాణం గుర్తు వద్ద చూపాను ) 

లా తెరచుకున్న దానిలో 
.zip 
.tgz 
.tbz 
ఫార్మాట్స్ కనిపిస్తాయి. అంటే మనం ఏదైనా గూగుల్ సైట్ నుండి మనం డాటా డౌన్లోడ్ చేస్తే ఆ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతుంది. 

.tgz ఫార్మాట్ ని ఎంచుకుంటే వాటిని మన కంప్యూటర్ లలో చూడటానికి ఆ అదనపు సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. 


.tbz ఫార్మాట్ ని ఎంచుకుంటే వాటిని మన కంప్యూటర్ లలో చూడటానికి ఆ అదనపు సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది అని ఇక్కడ కూడా గుర్తు చేస్తున్నారు. ( క్రింది ఫోటో )


అందువల్ల .zip ఫార్మాట్ యే బెస్ట్. ఇది అన్ని సిస్టమ్స్ లలో ఉంటుంది. అదనముగా యే సాఫ్ట్ వేర్ అవసరం ఉండదు. మనం డాటా ఆర్కైవ్ 2 GB ( గిగాబైట్స్ ) దాటితే అది చిన్న చిన్న జిప్ ఫైల్స్ లలో మారి డౌన్లోడ్ అవుతుంది అని కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు. 


దంతా అంటే .zip, .tbz, .tgz అంటూ చెప్పింది మీకు విషయ పరిజ్ఞానం కోసమే చెప్పాను. వాటిని సెలెక్ట్ చేసుకోవద్దని చెప్పటానికి అదంతా చెప్పాను. ఇక విషయానికి వస్తే - అలా .zip కనిపించాక ఇప్పుడు మీరు బాణం గుర్తు చూపిన వద్దనున్న  Create an archive  అనే ఎరుపురంగులో ఉన్న బటన్ ని నొక్కండి. 


ప్పుడు ఇలా Download a copy of your data అని ఇలా వస్తుంది. మన డాటా అంతా ప్రిపేర్ అవుతున్నట్లు ఇక్కడ ఒక పట్టీలో కనిపిస్తుంది. ప్రక్కనే ఆకుపచ్చని రంగులో  In progress లో ఉన్నట్లు చూపిస్తుంది. అలా రాకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చి, నొక్కాలి. 


లా ఈక్రింది ఫోటోలో చూపిన మాదిరిగా నీలిరంగులో బార్ మొదలయ్యిందీ అంటే మన డాటా ఆర్కైవ్ అవుతున్నట్లు లెక్క. ఇలా వచ్చాక మీరు సిస్టం కట్టేసి, పనిమీద బయటకి వెళ్ళిపోవచ్చును కూడా.  ఆగిపోతుందన్న భయపడాల్సిన పనిలేదు. ఇంకేదైనా పని చేసుకోవచ్చును కూడా.. 


లా మన డాటా ఆర్కైవ్ గా మారాక మన మెయిల్ బాక్స్ కి ఈ క్రింది విధముగా - మన డాటా ఆర్కైవ్ డౌన్లోడ్ కి సిద్ధముగా ఉన్నట్లు మెయిల్ వస్తుంది.


ఆ మెయిల్ ని ఓపెన్ చేస్తే ఇలా వచ్చిన ఆర్కైవ్ ని వారు ఇచ్చిన తేదీలలోగా ఎన్నిసార్లైనా డౌన్లోడ్ చేసుకోవచ్చును. 

అలాగే కంటిన్యూ అయ్యి, ఓపికగా ఎదురు చూసిన వారికి, ఇలా - ఈ క్రింది విధముగా కనిపిస్తుంది. ఇక్కడ మన డాటా సైజు ఎంతో, అది ఎప్పటివరకు అలా ఆర్కైవ్ గా ఉంటుందో, ఎంతకాలములో డౌన్లోడ్ చేసుకోవచ్చో సవివరాలు ఇక్కడ కనిపిస్తాయి. క్రిందన నీలిరంగులో  Download  అని బటన్ కనిపిస్తుంది. అలాగే ఫైల్ పేరు కూడా కనిపిస్తుంది. సాధారణముగా ఈ ఫైల్ పేరు మన ఈ మెయిల్ ఐడి పేరే ఉంటుంది. ( ఇక్కడ ఈ మెయిల్ ఐడి ని  ఆరెంజ్ రంగు డబ్బాతో తీసివేయడం జరిగింది


లా డౌన్లోడ్ ని నొక్కగానే మన గూగుల్ పాస్ వర్డ్ ని మళ్ళీ అడుగుతుంది. స్వంత సిస్టం అయితేనే ఆ పాస్ వర్డ్ ని మళ్ళీ టైపు చెయ్యటం మంచిది. లేకుంటే ఆ డాటా అంతా ఆ సిస్టంలో అలాగే ఉండిపోతుంది. వేరేవారు చూసే వీలు ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏమిటో కూడా కనిపిస్తుంది. ( నేను దాన్ని కనిపించకుండా చేశాను )


ళ్ళీ ముందులా వస్తుంది. అప్పుడు  Download  బటన్ ని మళ్ళీ నొక్కాలి. 


లా మీ డాటా మీ సిస్టం లోకి డౌన్లోడ్ అవుతుంది. ఇలా చేసుకోవటం అన్నది మీ సిస్టం అయితే మంచిది. అందులోని ఫొటోస్, మీ స్క్రాప్స్... వేరేవారి కంట పడవు. డౌన్లోడ్ కాలం అన్నది మీ సిస్టం కాన్ఫిగరేషన్ ని బట్టి, ముఖ్యముగా మీ నెట్ కనెక్షన్ స్పీడ్ ని బట్టీ ఉంటుంది. పగలు కన్నా - రాత్రి పూట పొద్దుపోయాక ఇలా డౌన్లోడ్ పెట్టుకుంటే మరింత వేగముగా డౌన్లోడ్ జరిగిపోతుంది. అలా చేస్తే - నాకైతే 158.9 MB డాటాకి ఆరు నిమిషాలు డౌన్లోడ్ పూర్తవటానికి సమయం పట్టింది. 


డౌన్లోడ్ అయ్యాక గూగుల్ క్రోం లో ఇలా కనిపిస్తుంది. 


డిఫాల్ట్ డౌన్లోడ్ పాత్ అయిన Downloads ని ఓపెన్ చేస్తే అక్కడ ఇలా మన మెయిల్ ఐడి పేరుతో ఒక జిప్ ఫోల్డర్ కనిపిస్తుంది. 

Zip folder

జిప్ ఫోల్డర్ ని అన్ జిప్ చెయ్యాలి. అంటే అన్ జిప్ సాఫ్ట్వేర్ వాడి ఇలా ఓపెన్ చెయ్యాలి. అంటే అందులోని ఫైల్స్ ని ఎక్ష్ ట్రాక్ట్ చెయ్యాలన్నమాట. 

Extract files

ప్పుడు ఇలా వస్తుంది. 

Extracting files
లా వచ్చిన ఆర్కైవ్ డాటా అన్ జిప్ Unzip అవటం మొదలవుతుంది. 

Unzip


లా అప్పుడు మామూలుగా  చూడటానికి వీలుగా ఒక ఫోల్డర్ వస్తుంది. 
ఫోల్డర్ తెరిస్తే మీకు ఇలా కనిపిస్తాయి. 


అందులోని ఫొటోస్ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తే మీ మీ అకౌంట్స్ లలో ఉన్న ఫొటోస్ కనిపిస్తాయి. 

     
ఇలా తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను. 

ఇక్కడ మీకు కొన్ని సూచనలు. 

1. నెట్ కనెక్షన్ స్పీడ్ బాగున్నప్పుడు ఇలా డాటా ఆర్కైవ్, డాటా డౌన్లోడ్ పెట్టేసుకోండి. 

2. మీ డాటా కనెక్షన్ లిమిట్ నీ ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. 

3. రాత్రి పూట - అదీ బాగా పొద్దుపోయాక డౌన్లోడ్ చేస్తే, ఆ సమయంలో డాటా కనెక్షన్ మీద ట్రాఫిక్ వత్తిడి ఉండదు కాబట్టి,  బాగా త్వరగా మీ పని ముగుస్తుంది. 

4. ఆర్కుట్ స్క్రాప్స్ ఒక్కో లింక్ కీ పది స్క్రాప్స్ వస్తాయి. అందులో ఫొటోస్, కామెంట్స్ కూడా ఉంటాయి. బాగున్నవాటిని అట్టే పెట్టేసుకోండి. బాగోలేనివి, వివాదాస్పదమైనవి శాశ్వతముగా డిలీట్ చేసెయ్యండి. వాటిని చూసుకొని బాధ పడటం మంచిది కాదు. కొన్నింటిని నిర్దయగా కాలగర్భములో కలిపేసేయ్యాలి. అలా అయితేనే భవిష్యత్తు జీవనములో హాయిగా ఉంటాం.. 

5. చివరి వరకూ ఆగకండి. అందరూ ఒకేసారి ప్రయత్నిస్తే - సర్వర్ క్రాష్ అయ్యి, పనిచెయ్యక పోవచ్చును. అప్పుడు శాశ్వతముగా మీ జ్ఞాపకాలు కోల్పోవాల్సి రావచ్చును. 

6. ఆర్కుట్ అకౌంట్ లో మీరు ఇప్పుడు ఆక్టివ్ గా ఉంటున్న సోషల్ సైట్ అడ్రెస్ మరియు అందులోని మీ ప్రొఫైల్ లింక్ మీ స్నేహితుల వారికి అందించండి. అందరికీ కనపడేలా మీ స్క్రాప్ లో వ్రాసి, పబ్లిక్ / ఫ్రెండ్స్ కి కనపడేలా సెట్టింగ్స్ పెట్టి పోస్ట్ చెయ్యండి. 

7. కొన్ని స్క్రాప్స్, పోస్ట్స్, ఫొటోస్ డౌన్లోడ్ లో మిస్ అవుతుండ వచ్చును. అందుకని వాటిని స్క్రీన్ షాట్స్ ద్వారా కాపీ చేసుకోగలరు. 

Saturday, July 26, 2014

Orkut 3 - Orkut albums export to google+

http://achampetraj.blogspot.in/2014/07/orkut-2.html తరవాయి భాగం..

తమ సోషల్ సైట్ మూసివేస్తున్నట్లు ఆర్కుట్ వారు ( గూగుల్ ) సభ్యులందరికీ మెయిల్ పెట్టారు అని విన్నాను. ఈ విషయం నా సోషల్ సైట్ మిత్రుడు మంజు చెప్పగా విన్నాను. అస్సలు మూసివేస్తున్నారు అనే విషయమూ వినడమూ కూడా అప్పుడే. వినగానే షాక్ అయ్యాను. తనే అన్నాడు - వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చనీ.. సరే చూద్దాం  అన్నాను.

నా మెయిల్ బాక్స్ చెక్ చేశాను. అలాంటి మెస్సేజ్ ఏదీ లేదు. మరి కొద్దిరోజులు ఎదురు చూశా.. ఊహు. రాలేదు. ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలీదు. నా స్నేహితురాలు తనకి వచ్చిన మెయిల్ ని నాకు ఫార్వర్డ్ చేస్తే, అది చూసి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకొని, అలా నా ప్రొఫైల్ అంతా డౌన్లోడ్ చేసుకున్నాను. తనకి ధన్యవాదములు.

ఇప్పుడు మీకు - మీరు కూడా మీ మీ ఆర్కుట్ అకౌంట్ ని ఎలా ఆర్కైవ్ గా మార్చుకొని, ఒక ఫోల్డర్ లా మీ కంప్యూటర్ లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చెబుతున్నాను. వాటిని మీరు శ్రద్ధగా అనుసరించండి.


ఆర్కుట్ కి వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైనదని ఆ సైట్ వారి ప్రకటన. 

ఇందులో సభ్యులకి కొన్ని సూచనలు ఇంగ్లీష్ లో ఇచ్చారు. 

సెప్టెంబర్ 30, 2014 న ఆ సైట్ ని మూసేస్తున్నామని చెప్పారు. అంతలోగా ఆ సైట్లోకి ప్రవేశం, అందులోని ఆటలు ఆడుకోవడం, పోస్ట్స్ వెయ్యడం... అంతా ఎప్పటిలా మామూలుగానే చేసుకోవచ్చును. గూగుల్ వారి Google+ లోకి ఈ ఆర్కుట్ లోని ఫోటో ఆల్బమ్స్ అన్నీ ఎక్స్ పోర్ట్ ( కాపీ లా ) చేసుకోవచ్చును. అలాగే మన ఆర్కుట్ ప్రొఫైల్, స్క్రాప్స్, టెస్టిమోనియాల్, కమ్యూనిటీ లలో వేసిన పోస్ట్స్ లాంటివన్నీ గూగుల్ టేక్ అవుట్ ని వాడి మన కంప్యూటర్ లలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఇలా సెప్టెంబర్ 30, 2014 వరకు మాత్రమే చేసుకో వీలు ఉంది. ఆ తరవాత ఇక వీలు కాదు. ఈ విషయాన్ని సభ్యులు బాగా గుర్తు పెట్టుకోవాలి. 

30, సెప్టెంబర్ 2014 తరవాత ఏమవుతుంది ? అనే సందేహం / కుతూహలం ఉంటే దానికీ అక్కడ సమాధానం ఇచ్చారు. 
ఆ రోజు తరవాత నుండీ ఆర్కుట్ లోకి లాగిన్ అవలేము. అంటే మన ప్రొఫైల్ ని మనం చేరుకోలేం.. ఆ లాగిన్ ఆప్షన్ తీసేస్తారు. మన అకౌంట్ లోకి ఇక వెళ్ళలేం. ఇక మన ప్రొఫైల్ కనిపించదన్నమాట. అలాగే మన ఫోటో ఆల్బమ్స్ ని గూగుల్+ ( గూగుల్ ప్లస్ ) లోకి మార్పిడి / కాపీ / ఎక్స్ పోర్ట్ చేసుకోలేమన్నమాట. వాటిని కాపీ చేసుకోలేక పోతే ఇక ఆ ఫొటో ఆల్బమ్స్ ని ఎన్నడూ చూడలేం. అలాగే ఆ సైట్ లోని ఆటలు గానీ, అప్లికేషన్స్ నీ ఎన్నడూ వాడుకోలేము. కమ్యూనిటీలలోని పోస్టింగ్స్ మాత్రం అలాగే కమ్యూనిటీ ఆర్కైవ్ గా ఉండిపోతాయి. కేవలం చూడగలిగేలా ఉండిపోతాయి. ఇక్కడ పబ్లిక్ కమ్యూనిటీ సెట్టింగ్స్ ఉన్నవి మాత్రమే అందరికీ కనిపిస్తాయి ఇక. 

సో, మీకు ఆర్కుట్ అకౌంట్ ఉంటే ఇకనైనా త్వరపడండి. 

మీరు మీ అకౌంట్ ని కాపీ చేసుకోవాలీ అంటే ఇలా చెయ్యండి. 

 క్రింది ఫోటోలోని 1 వద్ద చూపినట్లుగా - ముందుగా మీరు ఒక టాబ్ లో - మీ గూగుల్+ అకౌంట్ లో సైన్ ఇన్ అవ్వండి. ( మీ గూగుల్+ అకౌంట్ మెయిల్ ఐడీ & పాస్ వర్డ్ సహాయన సైన్ ఇన్ అవ్వండి ) లేదా ఈ లింక్ నొక్కండి  

ఆ గూగుల్+ అకౌంట్ ఉండటం తప్పనిసరి. ఆర్కుట్ ఖాతాలోని ఫోటోలూ, ఫోటో ఆల్బమ్స్ ని కాపీ / ఎక్స్ పోర్ట్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితముగా గూగుల్+ అకౌంట్ ఉండి తీరాలి. లేకుంటే డౌన్లోడ్ వీలు కాదు. గూగుల్ + అకౌంట్ మీకు గనుక లేకపోతే మీరు తగు వివరాలను ఇచ్చి, వెంటనే క్రియేట్ చేసుకోండి. ఓకే.. 

ఇప్పుడు మీరు మీ గూగుల్ ఖాతాని తెరచి, సైన్ ఇన్ అయ్యారు. ( ఫోటో ఆల్బమ్స్ డౌన్ అయ్యే వరకూ అలాగే సైన్ ఇన్ అయ్యి ఉండాలి ) 


ఇప్పుడు 2 వద్ద నున్న ఈ లింక్ ని నొక్కండి. లింక్ : 

ఇది నొక్కగానే మీకు ఇలా క్రింద చూపబడిన చిత్రం లోని మాదిరిగా పేజి ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్నవన్నీ మీరు - మీ ఆర్కుట్ లో అప్లోడ్ చేసిన ఫొటోస్ ( ఫోటో ఆల్బమ్స్ ) అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే ఆల్బమ్స్ అన్నీ నావి. 


అలా ఆల్బమ్స్ అన్నీ కనిపించాక - ఈ క్రింది ఫోటోలో వృత్తాకారములో చూపినట్లుగా, Select all వద్ద మౌస్ తో క్లిక్ చెయ్యాలి. 


అప్పుడు అక్కడ ఉన్న ఆల్బమ్స్ అన్నీ ఎర్రని రంగులో ఉన్న చదరపు బార్డర్ గల గడులుతో కనిపిస్తాయి. ( క్రింది ఫోటో చూడండి ) అలా ఎర్రని డబ్బాలతో మీ ఆల్బమ్స్ కనిపిస్తే అవి అన్నీ సెలెక్ట్ అయినట్లు గా అనుకోవాలి. 

ఇక్కడ అన్నీ కాకుండా కొన్ని లేదా, ఒక్కొక్క ఆల్బమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అన్నీ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి పద్ధతి. ఎలా అంటే - తరవాత తీరుబాటుగా అన్నీ చూసుకొని, పనికి రావని అనుకుంటే ఆయా ఆల్బమ్స్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఇలా కాపీ చేసుకుంటే డిస్క్ స్పేస్ కీ, డౌన్ లోడ్ కీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.. అంతా ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.  గడువు ముగిసాక ఆల్బమ్స్ కావాలంటే కుదరదు కాబట్టి ఇలా మీకు సూచన చేస్తున్నాను. 

ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే : ఈ ఫోటో ఆల్బమ్స్ అన్నీ Visible to you అనే ఆల్బం సెట్టింగ్ లో గూగుల్+ లో సేవ్ అవుతాయి. అంటే మిత్రులూ, వీక్షకులకీ, ఎవరికీ కనిపించక కేవలం మనకి మాత్రమే కనిపించేలా అక్కడికి ఎక్స్ పోర్ట్ అవుతాయి. కాబట్టి, అన్నీ స్వేచ్చగా అక్కడికి అప్లోడ్ చేసుకోమని సలహా ఇస్తున్నాను. 


ఇప్పుడు ఈ క్రింది చిత్రములో కుడివైపు మూలన కనిపిస్తున్న  Import Selected  అన్న ఎరుపు రంగులో ఉన్న బటన్ 5 ని నొక్కాలి. 


అలా నొక్కిన వెంటనే మీకు ఇలా క్రిందన ఫోటోలో మాదిరిగా కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్న ఆల్బమ్స్ అన్నింటి మీద  Waiting  అని గోధుమ రంగులో కనిపిస్తుంది. అంటే అవి ఎక్స్ పోర్ట్ అవటానికి క్యూలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి.  

ఒక్కో ఆల్బమ్ అలా ఎక్స్ పోర్ట్ అవటానికి కొద్ది క్షణాలు మాత్రమే పడుతుంది. నాకైతే 100 ఫోటోలు ఉన్న ఆల్బమ్ ఒక్కంటికి 5 ( ఐదు ) సెకనుల సమయం పట్టింది. మొత్తం ఆల్బమ్స్ అన్నీ అవటానికి ( దాదాపు 49 ఆల్బమ్స్ ) 6 నిమిషాల సమయం తీసుకున్నది అంతే.. 


ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఒకటుంది. ఆ ఆల్బమ్స్ అన్నీ క్రింద నున్న ఆల్బమ్స్ నుండి అప్లోడ్ అవటం మొదలవుతాయి. అంటే చివరలో ఉన్న ఆల్బమ్ - మొదటగా గూగుల్+ కి అప్లోడ్ అవటం మొదలవుతుందన్న మాట. గూగుల్+  కి అప్లోడ్ అయిన ఆల్బమ్ మీద ఆకుపచ్చని రంగులో   Uploaded   అని వస్తుంది. అప్లోడ్ అవుతున్న వాటి మీద నీలిరంగులో ఆ ఆల్బం ఎంతవరకు కాపీ చెయ్యబడిందో ( అప్లోడ్ స్టేటస్ Upload Status ) చూపిస్తుంది. ఇది ఎలా అన్నది ఈ క్రింది ఫోటోలో చూడవచ్చును. 


ఇలా అన్నీ అప్లోడ్ అయ్యాక - ఈ క్రింది విధముగా పసుపు రంగులో Done అని వస్తుంది. అలాగే మీ ఆల్బమ్స్ అన్నీ ఇంపోర్ట్ చెయ్యబడి, అవన్నీ మీకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ లో ఉన్నాయని మెస్సేజ్ కనిపిస్తుంది. అలాగే అక్కడి నుండే ఆ గూగుల్+ లోకి క్రొత్తగా అప్లోడ్ అయిన అల్బుమ్స్ ని నేరుగా చేరుకోవటానికి లింక్ కూడా అక్కడే కనిపిస్తుంది. దాన్ని నొక్కి ఒకసారి మీ అకౌంట్ లోని క్రొత్తగా అప్లోడ్ అయిన ఆల్బమ్స్ ని  చెక్ చేసుకోవచ్చును. 


ఆ మెసేజ్ ఇలా, ఈ క్రింది విధముగా ఉంటుంది. 


ఇలా అప్లోడ్ చేసుకొనేటప్పుడు - కొన్ని ఆల్బమ్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అప్లోడ్ అవక, Error ని చూపిస్తాయి. ఆయా ఆల్బమ్స్ మీద ఎర్రర్ అని వస్తుంది. అప్పుడు గాభరా పడాల్సిన అవసరం లేదు. ఈ క్రింద ఒక ఆల్బమ్ అలాగే అయ్యింది చూడండి. 


అప్పుడు మళ్ళీ ఆల్బమ్ ని సెలెక్ట్ చేసి, ఎరుపు రంగు బార్డర్ గడి వచ్చేలా చేసి, Import Select దాని మీద నొక్కాలి. అప్పుడు అవి మళ్ళీ అప్లోడ్ అవుతాయి. 


ఇలా మీ ఆర్కుట్ లోని ఫొటోస్ ని గూగుల్+ లోకి ఎక్స్ పోర్ట్ చేసుకున్నాక, మీ ప్రొఫైల్ లోని కామెంట్స్, టెస్టిమొనియల్స్ ... అన్నీ ఎలా కాపీ చేసుకోవాలో ఇంకొక దానిలో తెలుసుకుందాం. 

ఇలా చెయ్యటం అనేది - మీ స్వంత కంప్యూటర్ లోనైనా గానీ , నెట్ సెంటర్ లో ఉన్న సిస్టం లో అయినా చేసుకోవచ్చును. కాకపోతే నెట్ సెంటర్ లో ఉన్న సిస్టం లోకి డౌన్ లోడ్ చెయ్యటం మాత్రం వద్దు. అలా చేస్తే మీకే చాలా ఇబ్బంది. సో, మీ స్వంత సిస్టం లోన ఇలా చెయ్యటం చాలా మంచిది. 


Related Posts with Thumbnails