Saturday, February 7, 2009

సిరివెన్నెల - ఈ గాలీ ఈ నేలా ఈ వూరు..



చిత్రం: సిరివెన్నెల (1987)
గాయకులు: S.P.బాలు
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: K.V. మహాదేవన్
******************


పల్లవి:

ఈ గాలీ ఈ నేలా ఈ వూరు - సెలయేరు
ఈ గాలీ ఈ నేలా ఈ వూరు - సెలయేరు
నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు
నన్నుగన్న నా వాళ్ళూ ఆ నా కళ్ళ లోగిళ్ళు  // ఈ గాలీ ఈ నేలా //


చరణం 1:

చిన్నారి గోరువంక కూసేను ఆ వంక
నా వ్రాత తెలిశాక వచ్చేను నా వంక (2)
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక (2)
ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను - నింగి దాక (2) // ఈ గాలీ ఈ నేలా //


చరణం 2:

ఏనాడు ఈ శిల్పి కన్నాడో ఈ కళనూ
ఏ ఉలితో ఈ శిలపై నిల్పాడో ఈ కళనూ (2)
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ గగనూ (2)
ఈ రాలే జవరాలై ఇక నాట్యాలాడేను (2).. 

No comments:

Related Posts with Thumbnails