ఈ మధ్య ఒక కళాకృతిని తయారు చేశాను. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రిందట మానేసిన ఆ అభిరుచిని ఇప్పుడు ఒకసారి చెయ్యాలని అనిపించింది. చేశాను కూడా. నాకున్న బీజీ జీవితాన, కాసింత వెసులుబాటు చేసుకొని, మరీ చేశాను. అదిప్పుడు మీకోసం చూపిస్తున్నాను. అది ఎలా వచ్చిందో, చూసి చెప్పండి.
ఇదీ చూశారు కదా.. ఎలా ఉందండీ..? ఏదో అలా అలా చేశాను. నిజానికి ఇంతకన్నా బాగా చేయ్యోచ్చును. కానీ సమయం లేదు. ఇంకోసారి చేసేటట్లయితే - ఇంకా బాగా చేసిస్తాను అని చెప్పాను. కానీ తనకి ఇదే బాగా నచ్చేసింది అంట.. తన చెల్లెలు వచ్చి, నాకు ఇలాంటిది, ఇంతకన్నా బాగా చేసివ్వమని అడిగితే - చేసిస్తారా? చూద్దాం అని దాటేశాను. మొత్తానికి తను ఫుల్ ఖుష్.. తను ఊహించినదాని కన్నా చాలా బాగా చేసిచ్చాను - అని ఒక మెచ్చుకోలు. రేపు ఏకాదశి పర్వదినం. కాబట్టి రేపు తను మొదటి పూజ మొదలెడుతుంది. ఆ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను.
ఒకరోజు మా ఆవిడ అడిగింది తులసి కోట క్రొత్తది పెట్టేసుకుందామని.
"అదేమిటీ! ఉంది కదా.. " అన్నానేను.
"హా! ఉంది కానీ - అది నిన్న ఇంటివైపు కోతులు వచ్చాయి. రెండు పెద్ద కోతులు కొట్లాడేసుకొని, ఆ ప్లాస్టిక్ కుండీని క్రింద పడేశాయి. అది బాగా పగిలిపోయింది. ప్రక్కభాగాలు బాగా పగిలిపోయి, అసహ్యముగా కనిపిస్తున్నాయి.. అందుకే క్రొత్తది పెట్టేసుకుందామండీ.."
"ఓహ్!.అవునా.. అలా జరిగిందా..?" అని ఆ పాత కుండీని చూశాను. ఆ ప్లాస్టిక్ కుండీని బాగా ఇష్టపడి, మరీ కొని తెచ్చాను. అది ఆ కోతుల పుణ్యమా అంటూ పగిలిపోయింది.

"మరి ఇప్పుడు ఏం చేద్దాం.." అన్నానేను.
"హా! ఏముందీ క్రొత్తది సిమెంట్ తులసీ కోట అయితే సరిగ్గా ఉంటుంది. కాసింత బరువుగా ఉంటుంది, కాసింత గొప్పగా ఉంటుంది.. అన్నింటికన్నా అలా ఇంటి ముందు అలా పెద్దగా సిమెంట్ కుండీ పెట్టుకొని, అందులో తులసీ చెట్టు పెట్టుకోవటం నాకు చాలా ఇష్టం.. " అన్నదామె.
"ఓకే! సరే!.. రేపు మీ పుట్టింటికి వెళుతున్నావు కదా. అక్కడి నుండి వచ్చాక తెచ్చేసుకుందాం.." అన్నాను. ఓకే! అని -------- వెళ్ళేసి వచ్చింది.

వస్తూ వస్తూ కొన్ని ఫొటోస్ తెచ్చేసింది. మా మామయ్య గారు వాళ్ళకనీ అలాంటి సిమెంట్ కుండీ తీసుకోచ్చేశారు. దానికి రంగులూ, డిజైనులు వేశారు. అక్కడ అది చూసి, కొన్ని ఫొటోస్ తీసుకొచ్చేసింది. ఆ ఫొటోస్ చూశాక మాకూ బాగా నచ్చేసింది. మా మామయ్య వాళ్ళ తులసీకోటని ఒకసారి చూడండి.
My Uncle's Tulasi kota. |
అలాగే లేదా వీలైతే అంతకన్నా బాగా తులసికోట చెయ్యాలని అనుకున్నాము. మా ఆవిడా మద్దతు ఇచ్చింది. ఇక నేను రెట్టించిన ఉత్సాహముతో రంగం లోకి దిగాను.. ఆహా!.. ఇద్దరమూ దూకాము.!
నిజానికి తనకి ఏమీ రాదు.. ఆ కోటకి ఒక్క పూజ చేసుకోవటం తప్పించి. మొత్తం రెడీ చెయ్యాల్సిన బాధ్యత అంతా నాదే. ముంతాజ్ బేగం కోసం షాజాహాన్ తాజ్మహల్ కట్టించాడు. నేను ఆ మాత్రం ఆ రేంజ్ లో మహల్ కాకున్నా ఈ తులసి కోటని ఆమెకి నచ్చేలా చేసివ్వాలని అనుకున్నాను. నాకు వచ్చిన టాలెంట్స్ అన్నీ నా అక్షయ తూణీరం నుండి బయటకు తీయాల్సివచ్చింది.

మొదటగా ఆ సిమెంట్ కుండీలు అమ్మే వారి వద్దకి వెళ్లాం. అక్కడున్న కుండీలని చూశాం. ఇలా కోతుల వల్ల ఉన్న ఇబ్బంది చెప్పేసి, ప్రక్కన గట్టిగా కట్టేసేందుకు నాలుగు కొండీలు పెట్టమని చెప్పాను. ఇలా పెట్టాడు. ఇది జేయే వైర్ తో బిగిస్తే మరీ బాగుంటుంది. గట్టిగా నిలబడుతుంది.
ఆ కుండీని, నూటా యాభై రూపాయలు అని చెప్పాడు. ఓకే చేశాను. సరే! రెండు రోజుల్లో చేసి, ఇస్తామని చెప్పారు వారు. సరే! అని వారు చెప్పిన రోజున, బండి మీద వెళ్ళేసి, తెచ్చేసుకున్నాము. ఆటో ఖర్చు యాభై మిగిలింది కదా అనీ, ఆ యాభై ని ఈ కుండీ అలంకరణకి వాడుతాను అని చెప్పాను.
ఆరోజు సాయంత్రం అంతా ఆ కుండీకి అంటుకొని ఉన్న సిమెంట్ ని ఒక స్క్రూ డ్రైవర్ తో గీకేశాను. ఇప్పుడు ఇంకాస్త అందముగా కనిపించింది. మరుసటిరోజున ఆ కుండీ కోసం అనీ, అప్పుడు మిగిలిన యాభై రూపాయలతో అరకేజీ గ్రే కలర్ లప్పం డబ్బా, అది పూయటానికి రెండు అంగుళాల వెడల్పు గల ఒక రేకు ముక్కా కొన్నాను. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రిందట లప్పం పనిని హ్యాబీగా నేర్చుకున్నాను. అది ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది.
రెండు రాత్రుల్లో లప్పం పూసి, ఆరబెట్టాను. అది ఆరిపోయి, గట్టి పడ్డాక, అప్పుడు 260 నంబర్ వెట్ అండ్ డ్రై ఎమేరీ పేపర్ ని ఒక మగ్ నీళ్ళల్లో ముంచుతూ, ఆ లప్పంని రుద్దాను. అప్పుడు చాలా నున్నగా వస్తుంది. అలా అంతా రుద్దేసి, మళ్ళీ ఎక్కడైనా గుంటలు కనిపిస్తే, అక్కడ మళ్ళీ లప్పం నింపాను. మళ్ళీ గరుకు కాగితంతో రుద్దేసి, పెయింట్ చెయ్యటానికి రెడీ చేశాను. ఇది అవటానికి నాలుగు రాత్రులు గడిచిపోయాయి. నాకున్న బీజీ షెడ్యూల్ లో కాసింత సమయం మిగిలేదే అప్పుడే కదా!..
ఆ తరవాత ఆ కుండీకి - లైట్ బూడిద రంగు ఎనామిల్ పెయింట్ ఉంటే, బేస్ కోట్ గా వేశాను. అది ఆరాక మళ్ళీ రెండోసారి వేశాను.
అది ఆరాక, అప్పుడు గోల్డెన్ ఎల్లో ఎనామిల్ పెయింట్ 100 ml. తెచ్చేసి, ఒక కోటింగ్ ఆరాక, ఇంకోటి అంటూ రెండుసార్లు వేశాను.. ఇప్పుడు ఒక రూపానికి వచ్చింది. ఇక డిజైన్స్ వెయ్యటమే మిగిలింది. అసలైన పని ఇక్కడే మొదలయ్యింది. రెండు రంగులు వచ్చేలా వేశాను.
ఇంట్లో కొన్ని, చుట్టు ప్రక్కల ఇళ్ళల్లో చమ్కీలు ఉన్నాయి అంటే అవి తెచ్చేసి ఫేవిక్విక్ తో ఆ కుండీకి అతికాను. చాలా గట్టిగా అతుకున్నాయి. వెనకటికి రాజులు కోటకి మణులూ, మాణిక్యాలు అతికినట్లుగా అనిపించాయి. నా పేరూ రాజ్ యే కదా. అందుకే బాగా కుదిరింది అనుకున్నాను. నాకు నేనే శభాష్ అనుకున్నాను. ( మీరు కూడా అనడం మరచిపోవద్దు! ) అలా ఆ తులసీ కోటకి - డ్రేసేస్ కుట్టేటప్పుడు మిగిలిన పెద్ద సైజులో ఉన్న చమ్కీలూ, చిన్నబిళ్ళలు అతికాను. చాలా కష్టమైనా బాగా వచ్చేశాయి అవి. అలా కుట్టాక మిగిలినవి వాడుకున్నాను అని కూడా ఆనందం వేసింది. ఇదిగో ఇలా వేశాను.
ఇంకా వేద్దాం అనుకుంటే, చమ్కీలు సరిపోయేలా లేవు. ఏమి చేద్దాం! అని ఆలోచించాను. మామూలుగా పెయింట్ తో డిజైనులు, ముగ్గులు, పూలు వేద్దామని అనుకున్నాను. కానీ ఏదైనా క్రొత్తగా చెయ్యాలని అనుకున్నాను. నాకు వచ్చిన ఇంకో కళ - పేపర్ తో స్టెన్సిల్స్ చెయ్యటం. ఇంకేం. అవి కట్ చేసి, వాటితో డిజైన్స్ వెయ్యాలని అనుకున్నాను. ఇంకేం! ఆ పనీ మొదలెట్టాను.
ముందుగా ఒక పేపర్ ని మూడు మడతలుగా పెట్టి, స్టెన్సిల్ చెయ్యటం మొదలెట్టాను. మూడు ఎందుకూ అంటే - ఒకటి పాడయ్యినా, స్పేర్ లో ఇంకో రెండు ఉంటాయనీ.. ఎప్పుడూ అలాగే ఒకటి, రెండు అదనముగా చేస్తాను. అలా కొన్ని డిజైన్స్ చేశాను. అందులో ఒకటి శాంపిల్ గా..

ఇలా బ్లేడుతో అలా స్టెన్సిల్ లా చేశాక, ఒక స్పాంజ్ ముక్కతో, ఎనామిల్ రంగు తీసుకొని అద్దాలి. అలా అద్దాను కూడా..
మామూలుగా అయితే ఇక్కడితోనే అయిపోయేది. కానీ ఇంకా బాగా చెయ్యాలి అనుకొని ఆలోచిస్తుంటే - నూతన సంవత్సర ముగ్గులకోసం తెచ్చిన జరీ పౌడర్ ప్యాకెట్స్ కనిపించాయి. పది రూపాయలకి ఒకటి. రాణీ పింక్, బ్లూయీష్ గ్రీన్ రంగులో ఉన్న జరీ పౌడర్స్ ఉన్నాయి. వాటిని చూడగానే ఒక ఆలోచన వచ్చి, వెంటనే అలా చేసి చూశాను. ఏమీ లేదండీ.. పెళ్ళిపత్రికలమీద చమ్కీ పౌడర్ తో గ్రాఫిక్ డిజైన్స్ ఉంటాయి కదా..! అలాగే ఇదీనూ. అలా స్పాంజ్ తో అద్దాక, వచ్చిన డిజైన్ మీద ఆ జరీ పౌడర్ వేసి, అద్దాను. ఆ తరవాత సన్నని వెంట్రుకల బ్రష్ తో తుడిచేశా / లేదా గాలి ఊదినా సరే. పెయింట్ వద్ద ఆ చమ్కీ పౌడర్ అతుక్కొని, మిగిలిన ఆ జరీ పౌడర్ వచ్చేస్తుంది. అప్పుడు ఇలా కనిపిస్తుంది.
అలా అన్ని డిజైన్స్ వేశాను.. రంగులూ అద్దాను. ఆ తరవాత అంతా ఓకే చేసి, అందులో మన్ను నింపేసి, కృష్ణ తులసి మొక్కని నాటాము. ఆ మొక్క రంగూ, ఘాటూ నాకు చాలా బాగా నచ్చేస్తుంది. అన్ని వైపుల నుండి ఫొటోస్ కూడా చూసిపెట్టండి. పెద్దగా చూడటానికి ఈ అన్ని ఫోటోల మీద డబల్ క్లిక్ చెయ్యండి. చాలా పెద్దగా, క్లారిటీగా కనిపిస్తాయి.
Tulasi kota - Right Side |
Tulasi kota - Left side. |
Shubh - Laabh |
Tulasi kota - Side, Front angle. |
Front Base |
ఇదీ చూశారు కదా.. ఎలా ఉందండీ..? ఏదో అలా అలా చేశాను. నిజానికి ఇంతకన్నా బాగా చేయ్యోచ్చును. కానీ సమయం లేదు. ఇంకోసారి చేసేటట్లయితే - ఇంకా బాగా చేసిస్తాను అని చెప్పాను. కానీ తనకి ఇదే బాగా నచ్చేసింది అంట.. తన చెల్లెలు వచ్చి, నాకు ఇలాంటిది, ఇంతకన్నా బాగా చేసివ్వమని అడిగితే - చేసిస్తారా? చూద్దాం అని దాటేశాను. మొత్తానికి తను ఫుల్ ఖుష్.. తను ఊహించినదాని కన్నా చాలా బాగా చేసిచ్చాను - అని ఒక మెచ్చుకోలు. రేపు ఏకాదశి పర్వదినం. కాబట్టి రేపు తను మొదటి పూజ మొదలెడుతుంది. ఆ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను.
ఈ కోట చేస్తుండగా - మా ఇంటి పాలవాడి కన్ను పడింది. మీరు ఇంటికి తాళం వేసుకొని వెళ్ళితే, నేనొచ్చి ఇది తీసుకొని, ఆటోలో వేసుకొని, మా ఇంటివద్ద పెట్టేసుకుంటాను.. అని అన్నాడు. ఏమో చూడాలి. ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉంటాను.
తాజా కలము :
నిన్న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభించాము.. ఇలా కోతులు పడేయ్యకుండా తీగలతో కట్టేసి, పూజ చేసి, ప్రారంభించాము. ఇందులో - మామూలు తులసీ, కృష్ణ తులసి మొక్కలు పెట్టాం.
ఇక్కడ మా తులసి కోట ప్రారంభించి, ఉత్తర ద్వార దర్శనం కోసం గుడికి వెళ్ళాం. అక్కడ విపరీతమైన జనం. దర్శనం చేసుకొని బయటకి వచ్చేటప్పుడు అక్కడ షిరిడీలో బాబా పూజకి వాడే తులసి చెట్టు కనిపించింది. ఆలయ పంతులుని అడిగి, మొక్క తెచ్చేసుకున్నాము. గుడికి వెళ్ళినందులకు మాకు ఇది అనుకోని అదృష్టం ఎదురైనది అని అనుకోవాలి. మొత్తానికి మూడు రకాల తులసీ మొక్కలని, నాటాము. అన్నీ ఎంచక్కా నాటుకున్నాయి.
తాజా కలము :
నిన్న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభించాము.. ఇలా కోతులు పడేయ్యకుండా తీగలతో కట్టేసి, పూజ చేసి, ప్రారంభించాము. ఇందులో - మామూలు తులసీ, కృష్ణ తులసి మొక్కలు పెట్టాం.
at Morning.. |
at Evening. |
13 comments:
శభాష్! శభాష్! శభాష్! అండీ,
బాగా అలంకరించారు. నేను పసుపు రంగు వర్కర్స్ తో వేయించి డిజైన్స్ వేశాను కానీ, మీరు రంగు రంగుల నగలతో అలంకరించారే, ఆ అద్భుతమైన ఆలోచన నాకు రాలేదు.
చాలా బాగుంది. అభినందనలు.
చాలా అద్భుతంగా తయారు చేసారు. తాజ్మహల్ కన్నా విలువైన కానుక.
చెలి అడిగితే కాదన్న వాడు యెవ్వడు !? అయినా ఈ అయిడియాలు ఎలా తడతాయి మీకు? అసూయగా ఉందండీ!!!
వనజ గారూ!.. చాలా కృతజ్ఞతలు అండీ.. ఏదో అలా అలా ఆలోచనలు వస్తాయి. ఇంకా చాలా ఐడియాలు ఉన్నాయండీ!.. వీలును బట్టి పోస్ట్ చేస్తూ పోతుంటాను.
మందాకినీ గారూ!. మీ కామెంట్ కి కృతజ్ఞతలు. అలా ఐడియాలు ఒకరిని చూసి ఒకరికి వస్తూనే ఉంటాయండీ. అంతెందుకూ.. ఈ పోస్ట్ చూసి, మరిన్ని ఐడియాలతో ఇంకా బాగా చెయ్యగలరు. సాఫ్ట్వేర్ ఒక్కటే కానీ వెర్షన్స్ ఎన్నెన్నో అన్నట్లు. ఏమో! వచ్చేసారి మీరు నాకన్నా బాగా చెయ్యగలరేమో! ముందుగా ఆల్ ద బెస్ట్.
bapu geesina bommala undi andi..
Mundu ga miku Happy new year..
కృతజ్ఞతలు.. అలాగే మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
chala chala chala bavundadndi..even nenu kuda ilantivi chestu vuntanu..kakapote ma pillalu chala chinna vallu.so,vallato busy..e photos chala helpful ga vunayi..thank u so much.
maha
నచ్చినందులకు కృతజ్ఞుడిని.
chaala bagundi Raj garu, Keep it up.
ధన్యవాదములు..
తప్పకుండా
Hi,
Really great work by you! you have inspired us and with your inspiration i prepared a Tulasi kota in my style.I am living abroad so this became an instant hit..
Hi Raj garu,
Mee Tulasi Kota creativity mammalni chaala inspire chesindi.Nenu Abroad lo untaanu, so ilantivi ikkada assalu dorakavu.Naaku avaialble aina vaatitho oka tulasi kota ni taayaru chesanu..adi insatnt hit ayyinidi..Thanks for your inspiration:-)
Padmini gaaroo..
Nenu chesina thulasi kota valla meeru prerana pondi meeroka kota chesukunnaarani telisikoni, chalaa santhoshamugaa undi. Koddigaa shramisthe chaalu.. ennenno kalaakhandaalu chesukovachhunu, thatdwaaraa anduleni aanandaanni ponduthaam.
Any how.. mee comment ki dhanyavaadamulu.
Post a Comment