Saturday, February 7, 2009

గీతాంజలి - జల్లంత కవ్వింత కావాలిలే..



చిత్రం: గీతాంజలి
గానం: చిత్ర
రచన: వేటూరి
సంగీతం: ఇళయరాజా
****************


పల్లవి:

జల్లంత కవ్వింత కావాలిలే - ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు - దుడుకుతనము నిలువదు
తొలకరి.. మెరుపులా..
ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ
మెచ్చిందిలే - ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే (2) // జల్లంత కవ్వింత //


చరణం 1:

వాగులూ వంకలు జలజల - చిలిపిగా పిలిచినా
గాలులూ వానలు చిటపట - చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో - తనువు దాగదూ
అదేమి తాకిడో కొండచాటు కొండమల్లె - లేనివంక
ముద్దులాడి వెళ్ళదాయె కళ్ళులేని దేవుడెందుకో మరి // జల్లంత కవ్వింత //


చరణం 2:

సందెలో రంగులే నొసటిపై తిలకమే - నిలుపగా తెలిపె
నీ మనసులే - తెలియని తపనలే తెలుపగ వానదీవుడే
కళ్ళాపి జల్లగ - వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని - తెలుసుకున్న
కొత్తపాట పుట్టుకొచ్చె ఎవరికొసమో // జల్లంత కవ్వింత //

No comments:

Related Posts with Thumbnails