Wednesday, November 25, 2009

ఈ-మెయిల్ అడ్రెస్సులు మీకు ఎన్ని ఉన్నాయి?

మనకందరికీ సాధారనముగా ఒకటో, రెండో ఈ-మెయిల్ ID లు ఉంటాయిగా.. ఒకటేమో యాహూనో, ఇంకోటి జి-మెయిలో ఉంటుందిగా!.. అలా కాకుండా ఇంకో మెయిల్ ID కూడా ఉంచేసుకోండి.. ముందు చెప్పిన రెండింటిలోనే మీ అవసరాలని వెల్లదీస్తున్నారా? అయితే కష్టమే!..

ఆ యాహూని, జి-మెయిల్ని మీ పర్సనల్ అవసరాల కోసం, స్నేహితుల కోసం వాడుకోండి.. ఇంకొక మెయిల్ ID ని వీటిలోనే, లేదా వేరే దాంట్లో (రెడిఫ్, వై.. అలాంటివి) తయారు చేసుకోండి.. ఈ మెయిల్ ID ని ఇంటర్నెట్ అవసరాల కోసం వాడుకోండి. అంటే ఏదైనా ఆన్-లైన్ వాటిల్లో మీ మెయిల్ ID, పాస్ వర్డ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దీన్ని వాడుకుంటే మీ యాహూ, జి-మెయిల్ ID లు సురక్షితముగా ఉంటాయి.

ఎలాగంటే: ఏదైనా ఆన్-లైన్ యాడ్ లోనో, గేముల్లోనో, సాప్ట్ వేర్ డౌన్లోడ్ అప్పుడో, ఎందులోనైనా మీరు ఆన్-లైన్ సభ్యత్వం తీసుకుంటున్నప్పుడు ఈ క్రొత్త మెయిల్ / మూడో మెయిల్ ID ఇచ్చారు అనుకోండి. అవతలి వారిని అంతవరకే మీరు హద్దుల్లో ఉంచబోతున్నారన్న మాట! మీరు ఈ మెయిల్ ID ని ఇచ్చిన ఒకవేళ యే బోగస్ సంస్థకి ఇచ్చినా అందులో ఉన్న మెయిల్స్ ని పాస్ వర్డ్ సహాయముతో చూసినా అందులో మన ఫ్రెండ్స్ నుండి వచ్చిన మెయిల్ ID లు, మన పర్సనల్ మెయిల్స్ (ఈ మెయిల్ ID ని మనవారికి ఇవ్వము కనుక) ఏవీ ఉండవు.. కనుక మన మిత్రులకి స్పాం లు, అబద్దపు మెయిల్స్, చెత్త ప్రకటనలూ అన్నీ అందులోనే ఉంటాయి. కాబట్టి మనం సేఫ్ లో ఉంటాము..

ఆ అబద్దపు సంస్థలకి ( అవి అలాంటివని మనకి తెలీవుగా ) జి-మెయిల్, యాహూ ID లు గనుక ఇస్తే ఆ పాస్ వర్డ్ సహాయముతో మన విషయాలన్నింటినీ చూస్తారు.. ఎక్కడైనా దొరికామా.. మన రహస్యాలు కాస్తా విశ్వవ్యాపితం అవుతాయి. జాగ్రత్త!

Friday, November 20, 2009

మొఖం కడగటం

చిన్నప్పుడు పొద్దున్నే మొఖం (face) కడిగేవాళ్ళం.. (ఇప్పుడు మానివేసామన్నది కాదు ) మేమూ అలాగే కడుగుతాం అంటారా? ఆ.. వస్తున్నా అదే విషయం చెప్పటానికి.. ఇప్పుడు "యేరా బ్రష్ వేసావా.." అని అడుతున్నారు కాని, పాత తరం వాళ్ళని చూడండి. మనం బ్రష్ వేస్తాము గాని, వాళ్లు మొఖం కడుగుతారు. మొఖం కడగటం అంటే పెద్దగా ఏదో ఊహించుకోకండి.. పెద్ద ఖర్చూ ఏమీ లేదు.. కొద్దిగా సమయం ఎక్కువ కేటాయిస్తే సరి.. అంతే!. మామూలుగా ప్రొద్దున మనం బ్రష్ తీసుకొని, దానిపైన కొద్దిగా పేస్టు పెట్టుకొని, బాగా పళ్ళని రుద్ది.. కడిగేస్తాముగా.. అలాగే కాని ఇంకొంచం శ్రమ, సమయం అవసరం ఇందులో. ముందుగా మొఖం ని గోరువెచ్చని, చల్లని నీటితో మొఖం కడిగి, ఆ తరవాత దంత ధావనం - పళ్ళు తోమటం మొదలవుతుంది.. ఆ తరవాత నోరు కడిగేసి శుభ్రముగా చూపుడు వేలితో పళ్ళని మసాజ్ (మర్దన) చేస్తారు. ఇక్కడ పళ్ళనే కాకుండా పంటిని ఆనుకునే చర్మం - అదేనండీ చిగుర్లనీ బాగా రుద్దుతారు. పై వైపునే కాకుండా లోపల వైపున కూడా మసాజ్ జరుగుతుంది.. దీనివలన లాభం ఏమిటంటే మన దంతాలకి, చిగుర్లకీ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దానివలన దంతాలు ఇంకా ఆరోగ్యముగా ఉంటాయి. ఇలా చేయటానికి పట్టే కాలము మహా అంటే 15 సెకన్ల నుండి నిముషము వరకు. మీకు తెలుసా! మనం వాడే టూత్ పేస్టులో ఏమీ రక్షణ పదార్ధం ఉండదు, ఏమీ పనిచెయ్యదు. ఒకవేళ ఉన్నా, ఈ మర్దన అంత మేలు జరగదని పంటి డాక్టర్లూ నిర్ధారించారు. మనకు ఆహారాన్ని జీర్ణము చేసి, మనకు శక్తిని కలుగ జేసే ఈ దంతాలకి ఆపాటి సేవ, సమయం కేటాయించలేమా? మనం ఒక దగ్గర నుండి ఇంత లాభం పొందుతున్నప్పుడు, ప్రతిగా మనమేమీ ఇవ్వలేమా.. (ఈ వాక్యం గురించి త్వరలో రాస్తాను.. అది మీ జీవితాన్ని మారుస్తుందేమో!).. అలా నోటిని కడిగాక, నాలుకనీ కడుగుతారు. ఆ నాలుక మీద ఉన్న తెల్లని పాచిని తీసేస్తారు.. ఆ తరవాత గొంతులో వేళ్ళు పెట్టి ఆడిస్తారు. గొంతులో ఉన్న ఏవైనా కఫం, తట్టుకున్న పదార్థాలు, కడుపులో జీర్ణం కాని ఆహారం.. అంతా బయటకి వచ్చేస్తాయి.. దానివల్ల శరీర క్రియలకి అవి అడ్డం తొలుగుతాయి కాబట్టి లోపలి శరీర భాగాలు రెట్టించిన శక్తితో పనిచేస్తాయి.. ఆ తరవాత ముక్కుని శుభ్రం చేస్తారు. ఒక వేలితో ఒక ముక్కు రంధ్రాన్ని నొక్కిపెట్టి, గాలిని బయటకి వదలటముతో, శ్వాసకి అడ్డం వచ్చే పదార్థాలు బయటకి వచ్చేస్తాయి. తరవాత చల్లని నీటితో కళ్ళనీ, అందులోని మలినాలనీ తొలగిస్తారు.. చివరిగా మొఖం మళ్ళీ కడిగి, అలాగే మెడనీ రుద్ది, కడిగేస్తారు.. ఇదీ మొఖం కడగటమంటే! ఇప్పటికీ పాతతరం వాళ్ళు ఇలా చేయటం ఇంకా మనం చూస్తూనే ఉంటాము.. ఈ బిజీ లైఫ్ ల వల్ల మనకి మనమే ద్రోహం చేసుకుంటున్నాము. పొద్దున్నే ఎవడో వెంబడి పడుతున్నట్లు గబా గబా ముఖం తోమేసి "మమ" అనిపించేస్తున్నాము..

Saturday, November 14, 2009

Ringa ringa ringa.. (Aarya 2)

చిత్రం  : ఆర్య - 2 (2010)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
పాడినవారు : ప్రియ హేమేష్
రచన : చంద్రబోస్
***********************
పల్లవి:
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగా - రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగారే
పొషు పొషు పరదేశి నేను - ఫారిన్ నుంచి వచ్చేసాను..
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగారే
రోషం ఉన్న కుర్రాళ్ళ కోసం - వాషింగ్టన్ను వదిలేసాను
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగరే
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగరే
ఎయిర్ బస్సు ఎక్కి ఎక్కి రోతే పుట్టి - ఎర్ర బస్సు మీద నాకు మోజే పుట్టి
ఎర్రకోట చేరినాను - చేరినాక ఎదురు చూసినా 

ఎవరి కోసం!
బోడి మూతి ముద్దులంటే బోరే కొట్టి - కోరమీసం కుర్రగాళ్ళ ఆరా పట్టి
బెంగులోరు కెల్లినాను - మంగళూరు కెల్లినాను
బీహారు కెల్లినాను - జైపూరు కెల్లినాను
రాయలోరి సీమకి వచ్చి సెట్ అయ్యాను -

ఓహో మరిక్కడి కుర్రోల్లేం చేసారు?
కడపబాంబు కన్నులతో యేసి - కన్నెకొంప పేల్చేసారు
అమ్మనీ..
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగరే
వేట కత్తి వొంట్లోన దూసి - సిగ్గుగుత్తి తేన్చేసారు
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగరే

వాయించు యెహె..ఇదిగో తెల్లపిల్ల -
అదంతా సరేగాని -అసలు ఈ రింగ రింగ గోలేంటి?
అసలుకేమో నా సొంత పేరు - యాంద్రియానా స్చ్వార్జో రింగ
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగరే
పలకలేక ఈల్లెట్టినారు - ముద్దుపేరు రింగ రింగా..
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగరే
జీన్స్ తీసి కట్టినారు వోని లంగా -
బాబ్డ్ హేరు పెట్టినారు సవరం బాగా
రాయిలాగా ఉన్న నన్ను - రంగసాని చేసినారుగా..
ఇంగ్లీషు మార్చినారు ఎటకారంగా! -
ఇంటి యెనకకి వొచ్చినారు యమకరంగా -
ఒంటిలోని వాటర్ అంతా చెమటలాగ పిండినారు
వొంపులోని అత్తరంత ఆవిరల్లే పీల్చినారు -
వొంపి వొంపి సొంపులన్నీ తాగేసారు

అయిబాబోయ్ తాగేసరా? ఇంకేం చేసారు?
పుట్టుమచ్చలు లేక్కేట్టేసారు - లేని మచ్చలు పుట్టించారు
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగారే
ఉన్న కొలతలు మార్చేసినారు - రాని మడతలు రప్పించారు
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగారే

ఇదిగో ఫారిన్ అమ్మాయి.. ఎలా ఉందేటి మన కుర్రాళ్ళ పవర్?
పంచకట్టు కుర్రాల్లలోని - పంచ్ నాకు తెలిసొచ్చింది
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగారే
ముంతకల్లు లాగించేటొల్ల - స్త్రెంగ్తు నాకు తెగ నచ్చింది
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగారే
నీటి బెడ్ సరసమంటే గర్రు గర్రు -
ములకమంచమంటే ఇంకా కిర్రు కిర్రు
సుర్రుమన్న సీనులన్ని ఫోన్లో ఫ్రెండ్స్ తోటి చెప్పినా

చెప్పిన చెప్పెసావెట్టి?
ఫైవ్ స్టార్ హోటల్ అంటే కచ పిచ -
పంపు సెట్టు మేటర్ ఐతే రచ్చో రచ్చా
అన్నమాట చెప్పగానే -
ఐర్లండు గ్రీన్లాండు, న్యూజిలాండు, నెదర్లాండు, థైలాండు, ఫిన్లాండు..
అన్ని లాండుల పాపలీడ ల్యాండ్ అయ్యారు..

లాండయ్యరా! మరి మేమేం చెయ్యాలి?
హాండు మీద హాన్డేసేయ్యండీ - లాండు కబ్జా చేసేయ్యండీ..
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగరే
హాండు మీద హాండ్ ఎసేస్తమే - లాండు కబ్జా చేసేస్తామే
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగరే
రింగ రింగ రింగ రింగ - రింగ రింగ రింగా రింగరే..

Friday, November 13, 2009

గత జ్ఞాపకాల తీపి గురుతులు

చాలా రోజులకి నేను బ్లాగ్ కి వచ్చాను కదూ! ఈ మధ్య ఓ మంచి పని చేశాను.. అందులోనే చాలా బిజీగా ఉండిపోయాను.. ఇంకా ఆ పని నెల రోజులు పట్టేలా ఉంది.. అదేమిటో, దాని కథాకమామీషు ఇప్పుడు చెబుతాను.

నా మిత్రులు దార్ల వేణు శ్రీకాంత్ యొక్క బ్లాగ్ చూసాను.. అందులోని హెడ్డింగ్ లైను "నా జ్ఞాపకాలని నేను మరచిపోకముందే పదిలపరచుకోవాలి.." చాలాకాలం వెంటాడింది.. నా బ్లాగ్ లోనే "మీ పిల్లలకి మీరే ఇవ్వగలిగే అందమైన కానుక. " అని ఒకటుంది చూడండి.. అందులో కొనసాగింపుగా చివర్లో రాసాను చూడండీ! - ఇంకా ఎలా దీన్ని అద్భుతముగా ఇవ్వాలో అని ఆలోచిస్తున్నా అని..

ఆ మధ్య ఇల్లు సర్దుతుంటుంటే పాతవి నెగటివ్ లు కనిపించాయి.. వాటిని డిజిటల్ కి మార్చవచ్చా? అని తెలుసుకున్నాను. మారుస్తారుట.. ఇంకేం! రెండు, మూడు చోట్ల అడిగాను.. కావని, తెలియదని అన్నారు.. ఇలా కాదని గూగుల్ వాడి సహాయముతో అంతర్జాలం లో వెదికితే ఆ మిషన్ నాలుగువేల డాలర్లు ఉంది.. అంటే ఓ ఇరవై వేలు.. మళ్ళీ ఎవరు చేస్తారని వెదుకులాట.. కూకటపల్లి లో ఒకడు దొరికాడు.. కాని వందకి ఒక రీలు / నెగెటివ్ స్ట్రిప్ అన్నాడు.. రేటు తగ్గదని చెప్పాడు.. ఇంకా వేరే వాడికోసం వెదుకులాట! చివరికి మా బంధువులతో వేదికిస్తే ఓ చోట  ఒక షాప్ అతను చేస్తాను అన్నాడు. ఎన్ని ఉన్నాయని అంటే ఓ ఇరవై రీళ్ళు అన్నాను. రీలుకి వందచేప్పి ఆఖరికి అరవై కి ఫిక్స్ అయ్యాడు. ఇంటికి వచ్చి వెదికితే మొత్తం రీళ్ళు - ముప్పై రెండున్నాయి. మళ్ళీ బేరం చేశా.. ఆఖరికి నలభై ఐదుకి సెటిల్ అయ్యింది.. అంటే పద్నాగువందల నలభై రూపాయలు.. ఈబేరం వల్ల పదిహేడువందల అరవై రూపాయలు మిగులు..

రీలు రూపములోని మధుర జ్ఞాపకాలని డిజిటల్ రూపములోనికి మార్చి ఇచ్చాడు.. ఒక్కో ఫోటో 1800*౧౨౦౦ రిజల్యూషన్, 500-600KB ల సైజులో సిడి రూపములోనికి మార్చి మూడు రోజుల్లో ఇచ్చాడు. ముందు జాగ్రత్తగా మూడు CD లలో చేసిచ్చాడు.. వాటిని సిస్టమ్ లోనికి ఎక్కించాను.. రెండు, మూడు రోజులుగా నా గత జ్ఞాపకాలని ఒక్కొక్కటీ చూస్తూ చాలా ఆనందించాను, విశ్లేషించుకున్నాను.. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.. ఇంకా నయం! వాటిని ఇంకా అలాగే వదిలేస్తే తేమ వచ్చి నేగేటివ్స్ పాడయ్యిపోయేవి అన్నీ! కాని నా అదృష్టం వల్ల రెండు రీళ్ళు మాత్రమే తేమ వల్ల పాడయ్యాయి.. ప్రస్తుతం ఆ ఫోటోల ప్రోపెర్టీస్ లోనికి వెళ్లి ఆ రీలు నంబరూ, ఆ ఫోటో సీరియల్ నంబరూ, యే గ్రూపుకి చెందిందో ఆ గ్రూపు పేరూ, ఆ ఫోటోలోని వారి పేర్లూ, సందర్భమూ, తేదీ, సమయం అన్నీ రాస్తున్నాను.. ఇప్పటివరకూ మూడింటికి అలా రాసాను.. ఇంకా చాలా మిగిలే ఉన్నాయి.. ఇవన్నీ ముగిసాక మళ్ళీ నాఫొటోలు - నా ఫోల్డరు లోనికి, పిల్లలవి - పిల్లల ఫోల్డరు లోనికి సార్టింగు చెయ్యాలి.. మొత్తానికి నా పిల్లలు పెద్దవారయ్యాక నేను పడిన శ్రమ ఏమిటో వారికి తెలియాలనుకుంటున్నాను.

ఆ ఫోటోల వివరాలు రాస్తున్నపుడు ఎంత కష్టం అవుతున్నదో! ఎందుకో దీన్ని కష్టం అనాలనిపించటం లేదు! ఇష్టముతో కూడిన సుఖమైన కష్టం అనిపిస్తున్నది ఇప్పుడు!.. అప్పుడు వారెవరు, వారి పేరు, ఊరు, భందుత్వం.. యే ఫంక్షన్లో అలా కలిసారు, ఎందుకు.. ఆ ఫోటోలో మిగతా ఉన్నవారి పేర్లూ... అన్నీ ఆ ఫోటో ప్రోపెర్టీస్ కామెంట్స్ లో రాస్తున్నాను.. రేపు ఈ ఫోటోలు వేరే వారి దగ్గరికి చేరినా వారికి ఆ ఫోటోలో ఉన్నా సంగతి అంతా అందులో కనపడాలని నా చిన్ని ప్రయత్నం. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఇదేనేమో! నా పిల్లలకి ధీరుభాయి అంబాని లాగా ఏమీ ఇచ్చినా, ఇవ్వకున్నా ఇచ్చినది మాత్రం గొప్పగా ఇవ్వాలనుకుంటున్నాను..

Karigelogaa ee kshanam.. (Aarya 2)


చిత్రం: ఆర్య -2 (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
రచన: వనమాలి
పాడిన వారు: కునాల్ గుంజనవాలా, మేఘ
****************
పల్లవి:
కరిగే లోగా ఈ క్షణం.. గడిపెయ్యాలి ఈ జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..
అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా..
గడిచే నిమిషం గాయమై.. ప్రతి గాయం ఒక గమ్యమై..
ఆ గమ్యంని గుర్తుగా నిలిచే నా ప్రేమ..

కరిగేలోగా ఈ క్షణం.. గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా.. కనులైపోయే సాగరం..
అలలై పొంగే జ్ఞాపకం.. కలలే జారే కన్నీరే చేరగా..


చరణం     1:
పరుగులు తీస్తూ అలసిన నది నేను..
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను..
నిదురను దాటీ నడిచిన ఓ కల నేను..
ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను..
నా ప్రేమే నేస్తం అయ్యిందా.. ఓ
నా సగమేదో ప్రశ్నగా మారిందా.. ఓ
నేడు బంధానికి పేరుందా.. ఓ
ఉంటే విడదేసే వీలుందా ఓ.. //కరిగే లోగా ఈ క్షణం //

చరణం 2:
అడిగినవన్నీ కాదని పంచిస్తూనే..
మరు నిముషంలో అలిగే పసివాడివిలే..
నీ పెదవులపై వాడని నవ్వుల పూవే..
నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ ..
నా బాధంతటి అందంగా ఉందే ఓ..
ఈ క్షణం ఈ నూరెల్లవుతాను అంటే ఓ..
మరుజన్మే క్షణమైనా చాలంతే ఓ.. // కరిగే లోగా ఈ క్షణం //

Monday, November 9, 2009

పాదాభివందనం

పాదాభివందనం ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయింది.

సినీ రంగములో, ముఖ్యముగా పాటల రంగములో ఇది మరీను.. నిజానికి ఇలా చేయటం మంచిదేనా.. అని అడిగితే నామటుకు నేను ఏమాత్రం సమర్థించను.. నాకు తెలిసినదేమిటంటే - మనం పూజలవల్లనో, దానాల వల్లనో, చేసే ఉపకారము వల్లనో.. పొందిన పుణ్యము మనలో ఉండిపోతుంది. అది ఆ వ్యక్తి ఆత్మలో ఇమిడిపోతుంది. మీకు స్వర్గం - నరకం, పుణ్యం - పాపం అన్న మాటల్లో నమ్మకం ఉందా?.. ఉంటే మనం చనిపోయాక ఈ జన్మలో చేసిన పొరపాట్లకి "అక్కడ" ఫలితం అనుభవించాలి.. అక్కడ ఈ పుణ్యం, పాపం అవసరం అని ఏమైనా నమ్మకాలు మీకు గనుక ఉంటే పాదాభివందనములు చేయాల్సిన అవసరం లేదు.. నా ఎంపిక మాత్రం చేయవద్దనే అంటాను.

దీనివలన:
# మీ ఆత్మాభిమానాన్ని కొంత కోల్పోవాల్సివస్తుంది..

# అవతలి వారి మనసులో మీరంటే కొద్దిగా అనుమానం, చులకన ఏర్పడుతుంది. వీడేంట్రా! మరీ ఇంతగా కాళ్ళు మొక్కుతున్నాడు.. నాతో వాడికి ఏమి "పని" ఉందో? అనే అనుమానం.

# వీడొకడు.. ప్రతివాడి కాళ్ళు పట్టుకుంటాడు.. అనే చులకన భావం అవతలి వాళ్ళలో రావటం.

# గుంపులో ఉన్నప్పుడు మీరు మొక్కారని, మీ తోటివారు కూడా మేము అలా చేయకపోతే ఆ వ్యక్తి మనసులో అగౌరవ స్థానం పొందుతామేమోనని, వారూ పాదాభివందనాలు చేయటం - ఓ రివాజు లా మారుతుంది.

# అప్పటివరకూ మీరు ఏమైనా పుణ్య కార్యక్రమాలు చేసి, ఏమైనా పుణ్యం అంటూ ఏదైనా సంపాదించుకుంటే అది అవతలివారికి ఉత్తి పుణ్యానికే వారి ధారపోయటం.. అంటే కష్టం మనది.. తేలికగా కొట్టేయడం వారి వంతు.

# వారేమీ మిమ్మల్ని బలవంతముగా కాళ్ళు మొక్కించికోవటం లేదుగా.. మనంతటమనముగా ఆ పనిని చేస్తున్నాముగా.. అంటే మనంతట మనముగా అవతలి వ్యక్తికి లోంగిపోతున్నాము. ఇక ఇప్పుడు అలా చెయ్యాలో చేయవద్దో ఆలోచించుకోవటం ఇక మీ వంతు..

Tuesday, November 3, 2009

కల్తీ నివారణలో మన వంతు..

ఆమధ్య నా మోటారు సైకిల్ కి 2T ఆయిల్ తక్కువైతే కొనుగోలు చెయ్యటానికి దగ్గరలో ఉన్న ఆయిల్ కొట్టుకి వెళ్లాను.. ఆ కొట్టువాడు నన్ను గుర్తుపట్టి బాగా పలకరించాడు..

నా అవసరమేమిటో చెప్పాను.. 2T ఆయిల్ 2 స్ట్రోకుల బండికి తప్పనిసరి. లోపలినుంచి కాస్ట్రాల్ 2T ఆయిల్ డబ్బా తీసుకొచ్చాడు.. మడ్డిగా, మురికిగా ఉన్న ఆ డబ్బాని బట్టతో తుడిచి మరీ ముందుపెట్టాడు. కస్టమర్ రిసీవింగ్ చాలా బాగా బాగుంది అనుకుంటూ రేటెంతో అడిగాను.. "అన్నయ్యా! బయట వారికైతే MRP మీకే కనుక 5రూపాయలు తక్కువియ్యండి.." అంటూ ఎనిమిది రూపాయలు తక్కువ తీసుకున్నాడు..

ఆహా! ఎంత మంచివాడురా ఇతను అనుకుంటూ.. ఇంటికొచ్చి నా బండిలో ఆ 2T ఆయిల్ పోసాను. కాస్ట్రాల్ కంపనీది కనుక ఆ ఆయిల్ ఎలా ఉందో చూడలేదు.. జస్ట్ నమ్మకంతో ఆ పని చేశాను.. ( ఇంటి వద్దే పోసుకోవటం ఎందుకంటే - ఆ బండిలో 700 మీ.లీ. మాత్రమే పోయాలి. ఎక్కువ పోస్తే కారిపోతుంది. ఇంకో 300 మిలీ అలాగే ఉంచుతాను. బండిలోనిది అయిపోగానే ఇది పోస్తాను. ) కొద్దిరోజుల తరవాత బండిలోని ఆయిల్ అయిపోతే మిగిలినది పోస్తుంటే గమనించాను.. ఆ బండి డబ్బాలో నల్లని మెత్తటి మడ్డి.. ఇదేక్కడిదా అని ఆలోచించాను కాని ఏమీ తట్టలా.. మిగతాది పోసాక ఆ ఆయిల్ డబ్బా లోపలికి చూసాను.. సన్నటి నల్లని మడ్డి.

కాస్ట్రాల్ కంపెనీ వాళ్లు ఇలా భాద్యత లేకుండా ప్యాకింగ్ చేస్తున్నారా అనుకుంటూ నా దైనందిక కార్యక్రమాల్లో మునిగిపోయాను. ఆ తరవాత పది రోజులకి అనుకుంటా - ఓ మాంచి పాఠం నేర్చుకున్నాను.. ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తున్నప్పుడు నా బండి దుకాణం పెట్టేసింది. దారిలో గుట్టలలో నా బండి పిస్టిన్ పట్టుకుంది.. కదలనని మొరాయించింది.. గేరులలో వేసినప్పుడు వెనక టైరు ఇంచైనా జరగటం లేదు. కిక్కు రాడ్డూ డిటోనే! చేసేది లేక బండిని అలా నెట్టుకుంటూ సమీపములోని ఒక గ్రామానికి తీసుకొచ్చాను. రాత్రికి అక్కడే బండిని వదిలేసి, తెల్లారి మెకానిక్ ని పంపాను.. అతను బండి పిస్టిన్ పట్టుకుందని, అది మార్చాలనీ... అంటే మార్పించాను చేసేదేమిలేక.

నాలుగువేల రూపాయల ఖర్చు అయాక .. చివరిగా అతడిని అడిగాను అలా ఎందుకయ్యిందని.. అతను "పిస్టిన్ కి వచ్చే ఆయిల్ అందక పిస్టిన్ పట్టుకుంది.." చెప్పాడు. షాక్ అయ్యాను.. అంటే ఆ నల్లని మడ్డి ఆయిల్ పైపులో అడ్డం వచ్చి ఇబ్బంది పెట్టింది. ఆ షాప్ వాడి మర్యాద ఏమో గాని నాకు మాత్రం నాలుగు వేల చేతి చమురు వదిలింది..

ఇలా ఎందుకయిందని డిటెక్టివ్ లెవల్లో పరిశోధన మొదలెట్టాను. ఆ కాస్ట్రాల్ డబ్బాని పరిశీలించాను. డబ్బా మీద ప్యాకింగ్ నంబర్లూ, మూత మీద ఉన్న ప్యాకింగ్ నంబర్లూ తేడా ఉండి, మాచ్ కాలేదు.. అంటే - ఎప్పుడో ఎక్కడో ఒరిజినల్ ఖాళీ డబ్బాని సేకరించి పాత వాడిన ఆయిల్ కి కొద్దిగా రంగు కలిపి మళ్ళీ ప్యాకింగ్ చేసారన్నమాట! అదీ సంగతి..

దీనికి విరుగుడు ఏమిటా అని ఆలోచించితే సులభమైన పరిష్కారం దొరికింది.. చాలా మంది కల్తీ దారులకి ఆ వస్తువులను మాత్రమే కల్తీ చేస్తారు కాని దాని ప్యాకింగ్ ని కూడా క్రొత్తగా చేయటానికి ఇష్టపడరు. నా విషయములో కూడా అలాగే జరిగింది. లోపల ఆయిల్ మాత్రం మార్చి, పైన డబ్బా మాత్రం అలాగే ఉంచారు. ఇలా చేయకుండా మళ్ళీ ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే చాలా సింపుల్.. ఆ ఖాళీ డబ్బాలు పడేసే ముందు వాటికి దబ్బడం తోనో, లేదా వాడియైన మొలతో - ఒక రంధ్రం చేస్తే సరి.. ఆ డబ్బాని ఎవరూ వాడలేరు.. ఇది కేవలం ఇలా ఆయిల్ డబ్బాలకే కాకుండా పౌడర్ డబ్బాలకీ, నీళ్ళ కానులకీ, మందుల డబ్బాలకీ, బ్రాండెడ్ వస్తువుల పెట్టలకీ చేస్తే మరీ బావుంటుంది.. మీరు అలా చేస్తారని ఆశిస్తున్నాను..

Sunday, November 1, 2009

కాడ మల్లి


ఈ పక్కన ఫోటోలో కనిపిస్తున్నదే కాడ మల్లి చెట్టు. దీన్ని పున్నాగ పూలు, ఖేచరీ మల్లి అనికూడా అంటారు. ఖేచరి అంటే తాంత్రిక పూజల్లోని పదం. నాలుకను బాగా బయటకి చాపిన దానికన్నా ఇంకా ఎక్కువ బయటకి చాపితే ఎలా కనపడుతుందో (కుక్క నాలిక లాగా) - ఈ పూల కాడ కూడా అలా పొడుగ్గా ఉంటుందని ఆ పేరు వచ్చిందని నా చిన్నప్పటి జ్ఞాపకం. అసలు ఆ పూవే నా చిన్నప్పటి జ్ఞాపకం.

నేను నా హై స్కూల్ చదువు చదివేటప్పుడు నేను చదివే స్కూల్ చాలా ఊరిబయట ఉండెడిది. బహుశా 3 కి.మీ.ల దూరం. రోజూ నడుచుకుంటూ వెళ్ళేవాడిని. స్కూల్ కి ఇవతల ఈ చెట్టు ఉండెడిది. చలికాలంలో పొద్దున్నే స్కూల్ కి వెళ్ళేవాడిని. ఆ చెట్టు చుట్టూరా ఆ పూలు పడి ఉండేవి. పోనీ ఎక్కి తెంపుదామంటే చాలా పొడవుగా ఉండెడిది. ఆ పూలని ఏరేడివాల్లము. మా పూల ఏరటం ని చూసి ఆ చెట్టుకూ తమాషాగా అనిపించేదిదో గాని, గాలికి ఒక్కో పూవునూ కిందకి వదిలేసేది. ఆ పూలని గాలిలో అందుకోవాలని ఎంతగానో కష్టపడేవాళ్ళం.. మిగతా పిల్లలూ పోటీకి రావటముతో చిన్న, చిన్న పేచీలు వచ్చెడివి.. స్కూల్ బెల్ వినపడగానే అవన్నీ వదిలేసి తుర్రుమని పరిగెత్తడం.. నిజముగా ఆవో మధుర క్షణాలు.. ఇప్పుడు రహదారి విస్తరణలో ఆ చెట్టుని కొట్టేసారు.. కాని నా స్మృతిలోంచి ఎవరూ కొట్టేయలేదు.. నిజానికి ఇన్ని రోజులకి ఇది గుర్తుకువచ్చిందంటే కారణం - నా స్నేహితురాలు. తన ఫోటోలలో ఈ ఫోటో కనపడి.. ... గుర్తుకొచ్చింది.
Related Posts with Thumbnails