Friday, December 30, 2011

Amma avanee - Rajanna

చిత్రం : రాజన్న (2011) 
రచన : శివదత్త 
సంగీతం : ఎం. ఎం. కీరవాణి 
గానం : మాళవిక. 
*******************
పల్లవి : 
అమ్మా .. అవనీ..
అమ్మా అవనీ నేలతల్లీ అని  - ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకనీ // అమ్మా //

అను పల్లవి :
కనిపించిన ఒడిలోనే కనుమూయనీ
మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవనీ // అమ్మా // 

చరణం 1 
తల్లీ నిను తాకితేనే - తనువు పులకరిస్తుంది.
నీ ఎదపై వాలితేనే - మేను పరవశిస్తుంది.
తేట తెలుగు జాణ - కోటి రతనాల వీణ
నీ పదమూలాన నువ్వే - నాకు స్వర్గం కన్న మిన్న // అమ్మా // 

చరణం 2 
నీ బిడ్డల శౌర్య ధైర్య సాహాస గాథలు వింటే
నరనరాలలో రక్తం ఉప్పొంగుతుంది
రిగగ రిగగ రిగ (3)
రిగరి సదప దస.. రిగగ రిపప గడదద పడదద..
సదసద.. సదసద పగపద
పద పద.. పద పద.. (2)
సాస సాస సాస సాస - రీరి
సాస సాస సాస సాస - గాగ
రిగరిస రిగరిస.. రిగరిస రిగరిస
సరి సరిగా రిసగారిసగారిస
రిగరిగ - పా.. గరిసదపా
గాప పద దస - సరి గరిసద
పద దస సరి - రిగ పగారి సారీ గా పా
రిసద పదస రిగ - పా
సరిగా పదస రిగ - పా
గప గారి సరిసద
వీరమాతవమ్మా - రణధీర చరితవమ్మా
పుణ్యభూమివమ్మా
నువ్వు ధన్యచరితవమ్మా
తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా
దేహమైన ప్రాణమైన - కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది - నీకీగలదేదమ్మా // అమ్మా //  

Tuesday, December 20, 2011

Show desktop

సాధారణముగా సిస్టం మీద పని చేసేటప్పుడు, అవసరాలరీత్యా తెరపైన ఎన్నెన్నో పేజీలు ఓపెన్ చేస్తుంటాము కదా.. ఒక్కోసారి మానిటర్ మీద ఉన్న షార్ట్ కట్స్ వాడుకోవటానికి, అన్నీ మినిమైజ్ చేసి, ఆ షార్ట్ కట్ ని వాడి, ఆ మినిమైజ్ చేసిన పేజీలన్నీ మళ్ళీ మాక్సిమైజ్ చేసుకుంటాము కదా.. మీరు వాడుతున్నది Windows 7 అయితే - ఇలా ఒక షార్ట్  కట్ ఆప్షన్ ని వాడుకోండి.

మానిటర్ స్క్రీన్ మీద కుడి క్రింద మూలాన, సిస్టం ట్రే లో మూలాన ఉండే ఒక నిలువు డబ్బా మీద కర్శర్ ని ఉంచగానే ఇలా కనిపిస్తుంది. అలా కనిపించగానే, ఓకే చేస్తే - అందాక ఓపెన్ చేసిన పేజీలన్నీ, మినిమైజ్ అవుతాయి. ఆ షార్ట్ కట్ లింక్ ఓపెన్ చేసుకున్నాక టాస్క్ బార్ మీద ఉన్న బ్రౌజర్ ని నొక్కేస్తే, అందాక మినిమైజ్ చేసినవన్నీ అన్నీ ఓపెన్ అవుతాయి.


లేదా మౌస్ ని వాడి అలా చెయ్యటం ఇష్టం లేకుంటే - సింపుల్ గా మీ కీ బోర్డ్ లోని - కంట్రోల్ బటన్ ప్రక్కన ఉండే విండోస్ బటన్ + D అనే కీ ని రెండింటినీ ఒకేసారి నొక్కండి. అన్నీ మినిమైజ్ అయ్యి, మీ డెస్క్ టాప్ స్క్రీన్ మీద షార్ట్ కట్స్ కనిపిస్తాయి. మళ్ళీ మినిమైజ్ చేసిన పేజీలు అన్నీ రావాలని అనుకుంటే - మళ్ళీ Windows key + D ని నొక్కండి. 
Friday, December 16, 2011

కొత్తిమీర - హోల్ సేల్.

మొన్న వేరే పని మీద అలా వెళ్ళేసి, అటునుండి అటే కూరగాయల మార్కెట్ కి ఉదయాన్నే వెళ్లాను. అలా కూరగాయలు కొంటున్న ప్రక్కనే కొద్దిమంది గుంపుగా బేరాలు సాగిస్తుంటే యధాలాపముగా విన్నాను. " ఇంకో కట్ట కూడా వేసేయ్.. మూడు ఇచ్చేసేయ్.. " అని అంటున్నారు. ఏమిటా అని చూశాను.

అక్కడ ఒకతను లుంగీలో కొత్తిమీర కట్టలు పట్టుకోచ్చేసి, దాన్ని నేల మీద పెట్టి, మార్కెట్లో అమ్ముతున్నాడు. పంట పండించినట్లున్నాడు. ఒక్కో కట్ట లావుగా ఉంది. అక్కడికి వచ్చి బేరం చేస్తున్నవారు ఆ మార్కెట్ లో రెగ్యులర్ గా కూరగాయలు అమ్మేవారు. " రెండు కట్టలు కాదు మూడు ఇచ్చేసేయ్.. కిలోకి అంతే వస్తాయి.. రోజూ మేము అమ్ముతాము కదా.. మాకు తెలీదా.. కావాలంటే తూచుదాం.." అని వాళ్ళల్లో ఎవరో అంటే అందరూ సై అన్నారు. అలా వాటిని తూచే సరికి కిలోకి మూడు కట్టలు వచ్చాయి. అది ఇక ఫిక్స్ అయ్యింది. 

నాకూ ఇంట్రెస్ట్ అనిపించి ఎలా కిలో అడిగితే - నన్ను చూసి, ఒక్కళ్ళూ మాట్లాడలేదు. వినియోగదారుడిని అనుకొన్నారులా ఉంది. ఆ అమ్మేవాడినీ అడిగా. ఊహు! చెప్పనే లేదు. అంతా మౌనం. బయట ఆ కట్ట 12 - 16 రూపాయలకి అమ్ముతారు. ఇతడి వద్ద పది రూపాయలకి కి వచ్చినా - రెండు రూపాయల మిగులు లాభం. అలానుకొని ఆగాను. నేను వెళ్ళిపోతానేమో అని చూశారు. ఊహు! దీని అంతు చూద్దామని పట్టుదలగా ఆగాను. 

ఇక లాభం లేదని వారిలో ఒకరు మూడు కిలోలు కొన్నారు. డబ్బులు ఇచ్చేదాకా మౌనం వహించాను. కట్టలు వేసి, తూచి, సంచిలో పెట్టుకోవటం అంతా కావాలనే నెమ్మదిగా చేస్తున్నారు. అయినా ఓపికగా ఎదురుచూశాను. మెల్లగా చేతి సంచి తీసి, అటు తిరిగి డబ్బులు లెక్కపెట్టి, మడిచి మరీ అతడికి ఇచ్చింది. అతను ఇదంతా గమనించక యధాలాపముగా లెక్కపెట్టుకున్నాడు. అప్పుడు అతనితో లెక్కపెట్టాను. 

అవి ముప్ఫై రూపాయలు. 
అంటే మూడు కిలోలు = ముప్పై రూపాయలు.. కిలో పది రూపాయలు

బాప్రే!.. ఇంత చవక బేరం ఎక్కడ దొరుకుతుంది. నాలుగైదు పోచలు ఇచ్చి, అది ఐదు రూపాయలు అంటూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. అలా వారి దృష్టిలో - ఒక్కో కట్ట ఎంత లేదన్నా 30 - 35 రూపాయలు విలువ అన్నమాట. కిలోకి ఎంతలేదన్నా వంద రూపాయలు. అంటే - పిచ్చ లాభాలు అన్నమాట. 

ఇంకా ఆగలేదు.. నేనూ రెండు కిలోలు కొన్నాను. ఇరవై రూపాయలు ఇచ్చేసి బయటపడ్డాను. ఇంటికి వచ్చేశాక శ్రీమతి - " ఏమిటండీ!.. ఇంతగా కొత్తిమీర తెచ్చారు.." అంటే జరిగినదంతా చెప్పాను. తరవాత ఏమి చెయ్యాలో కూడా చెప్పాను. ఆ ప్రకారముగా తనూ చేసింది. 

ఇంతకీ అదేమిటీ అంటే - రెండు కట్టలు మేము ఉంచేసుకొని, మా చుట్టూ ప్రక్కల వారికి సమముగా పంచేశాం.. ఎందుకూ ఇది అని అడిగినవారికి కొత్తిమీర పచ్చడి చేసుకోండి.. అని మా సమాధానం. 

Wednesday, December 14, 2011

New version Orkut

సోషల్ సైట్స్ లలో ఒకటి అయిన " ఆర్కుట్ " లో చాలామంది ఇంకా పాత వర్షన్ యే వాడుతున్నారు. చాలామందికి నూతన వెర్షన్ ఆర్కుట్  వాడటం అంతగా తెలిసి లేదనుకుంటాను. నాకున్న మిత్రులలో 51.90 % మంది ఇంకా పాత వెర్షన్ ఆర్కుట్ ని వాడుతున్నారు. ఎందుకో ఒకసారి ఇలా ఎంతమంది పాత వర్షన్ వాడుతున్నారో చెకప్ చేద్దామని చూస్తే - ఇంకా అంత శాతం మిత్రులు పాతవర్షన్ లోనే ఉన్నారు. వారి తెలిసో తెలీకో, వేరే కారణాల వల్ల వారు అలా ఉండొచ్చును. ఇలా చూడటం చాలా ఈజీ.. మీ మీ నూతన వెర్షన్ ఆర్కుట్ ఖాతాలలోకి వెళ్ళేసి, కుడి మూలన ఉన్న బాణం గుర్తు చూపిన వద్ద నున్న Old version ని నొక్కితే మీకు, ఆ పాత వర్షన్ ని వాడుతున్న మీ మిత్రులు ఎవరో తెలుస్తుంది. అలా వాడుతున్న మిత్రులు అదే పట్టీలో కనిపించే - New version ఆర్కుట్ లింక్ నొక్కితే, వెంటనే నూతన ఆర్కుట్ వెర్షన్ కి   మారుతారు.


తమకి వచ్చిన స్క్రాప్స్ నీ, ఫోటో కామెంట్స్ నీ, ఎవరెవరు ఏయే అప్డేట్స్ చేశారో, మనమేమి అప్డేట్స్ చేశామో.. చూసుకోవటానికి నూతన ఆర్కుట్ వర్షన్ కన్నా పాతదే బాగుంటుంది. కానీ పాత ఆర్కుట్ వెర్షన్ కన్నా నూతన ఆర్కుట్  వెర్షన్ ని మీరు అలవాటు చేసుకోవాలి. మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండొచ్చును. పాత వెర్షన్ ని ఒకసారి చూసుకొని, నూతన వెర్షన్ కి వచ్చి పని చేసుకోండి. 

ఒక్కసారిగా మారాలి అంటే ఎవరికైనా ఇబ్బందే.. కానీ నూతన ఆర్కుట్ యే అన్ని విధాల అనుకూలముగా అనుకూలముగా ఉంటుంది. ఎప్పుడూ అదే వాడటానికి ప్రయత్నించండి. ఇప్పుడు చాలామంది ఆర్కుట్ ని వదిలేసి, వేరే వేరే సామాజిక సైట్లలోకి వెళుతున్నారు. కానీ ఇంకా తమ తమ అక్కౌంట్స్ అందులో ఉంచినవారు ఈ సూచనని పాటిస్తే కాస్త - క్రొత్తగా, అనుకూలముగా, ఆసక్తికరముగా ఉంటుంది. అందరివీ ఒకేసారి, ఒకేదగ్గర, ఏమేమి అప్డేట్ చేశారో చూడోచ్చును. అందుకే నూతన వెర్షన్ వాడమని చెప్పేది. చాలా ఈజీగా మీ పని అయిపోతుంది. 

ఒకవేళ మీరు ఎక్కడి వరకు చూశారో గుర్తు పెట్టుకొని, అక్కడి నుండి మళ్ళీ చూసుకుంటూ ఇందులో సులభముగా  చెయ్యవచ్చును. 

ఇప్పుడు ఉన్న సభ్యులని నిలుపుకోవటానికి అన్నట్లు కావచ్చును. వారానికి రెండు, మూడు ఆర్కుట్ పద్ధతులు మారుస్తున్నారు. అవి ఏమిటో ముందు ముందు తెలియచేస్తాను. 

Sunday, December 11, 2011

నా సైకిల్ ఏదీ?..

నిన్న బ్యాంక్ వద్ద పని ఉండి వెళ్లాను. లోపలి వెళ్ళి వస్తుండగా నా బైక్ వద్ద - అడ్డుగా నల్లని గీతల పసుపు టీ షర్టు , జీన్ ప్యాంట్ లో ఉన్న ఒకడు తచ్చాడుతున్నాడు. నేను రావటం చూసి, కాస్త దూరముగా జరిగి, నన్నే చూస్తున్నాడు. "ఏంట్రా! వీడిని చూస్తుంటే కాస్త తేడాగా ఉంది.." అనుకున్నాను.

నా బైక్ తీస్తున్నాను. ఒకసారి కనుకొలకుల నుండి అతడిని చూస్తూనే ఉన్నాను. నన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఇక బైక్ కిక్ కొడుతాను అన్నప్పుడు - అతడిని  - ఏమిటీ - అన్నట్లు చూశాను. ఏమైనా మాట్లాడాలా? అన్నట్లు. అతను దగ్గరికి వచ్చాడు. "నా సైకిల్ కనిపించటం లేదు.." అన్నాడు. 

"ఆ ఎదురుగా కొన్ని ఉన్నాయి కదా!.. అందులో లేదా..?" అన్నాను. అక్కడ మరికొన్ని మామూలు సైకిళ్ళు, హీరో హోండా మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. 

"లేదు.. ఇందాక ఇక్కడే పార్క్ చేసి, లోపలి వెళ్లాను. వచ్చేసరికి నా సైకిల్ లేదు.." అన్నాడు. 

"ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది కదా.. అక్కడికి వెళ్ళి ఇక కంప్లైంట్ ఇవ్వు.. అయినా నీ సైకిల్ దొరికేది నమ్మకం తక్కువ. సైకిల్ కొన్న బిల్ ఉందా?.." అన్నాను. 

"ఉంది. ఇంటివద్ద ఉంది.." అన్నాడు. 

"ఓకే! ఇంకేం అది తీసుకొని కంప్లైంట్ వ్రాసివ్వు.." అనగానే అటు ప్రక్కకి వెళ్ళిపోసాగాడు. 

"ఎందుకైనా మంచిది.. కాస్త ఖర్చు బాగానే వస్తుంది.." అనగానే ఆగిపోయాడు. "అసలు సైకిల్ తెచ్చావా? రంగూ, రూపూ ఎలా ఉందో ఐడియా ఉందా?.." అని అన్నాను. 

"ఉందన్నా!.. తెచ్చాను.. ఇదిగో సైకిల్ తాళం.. "అని అప్పటిదాకా మూసి ఉంచిన కుడిచేతి గుప్పిట విప్పాడు. 

షాక్.. షాక్.. షాక్..!!

ఒకే ఒక సెకనులో పరిస్థితి అర్థం అయ్యింది. కాసింత భయం వేస్తున్న నాకు, అతడితో ఓకే.. అనేసి, బండి కిక్ కొట్టేసి, స్టార్ట్ చేసుకొని అక్కడినుండి, వచ్చేశాను. ఒకసారి అద్దములో వెనక్కి చూశాను. అతను అక్కడి నుండి ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాడు. 

ఇంతకీ వాడు గుప్పిట విప్పి చూపినది  సైకిల్ తాళం కాదు. దాదాపు మూడు అంగుళాల పొడవున్న హీరో హోండా మోటార్ సైకిల్ తాళం. ఏదో ఒక తాళం తీసుకవచ్చేసి, ఆ తాళం యే బండికి వస్తుందో పెట్టి చూసి, ఒకవేళ అది సరిపోయినట్లయితే - ఆ బండిని దర్జాగా - స్వంత వాహనదారుడిలా స్టార్ట్ చేసుకొని, తీసుకెళ్ళుతాడు అన్నమాట. నా టైం బాగుంది కాబట్టి కాసింతలో మిస్ అయ్యాను. హీరో హోండా బళ్ళు ఎక్కువగా చోరీకి గురి కావటం అనేది కూడా తొందరగా అమ్ముకోవచ్చును, మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ, కాసింత ఈజీగా తాళం తీయోచ్చును.. ట. 

Tuesday, December 6, 2011

ఫంక్షన్ లలో ప్లాస్టిక్ గ్లాసులు.

మొన్న ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాను.. భోజనాల వద్ద - దాహం వేసి మంచినీటి గ్లాస్ ఇచ్చే సెక్షన్ వద్దకి వచ్చాను. అప్పటికే గ్లాసులు అయిపోయాయి. అక్కడ పనిచేసే ఇద్దరు అబ్బాయిలలో ఒకతను - అప్పుడే ప్లాస్టిక్ గ్లాసులు ప్యాకెట్ విప్పి, ఒక నీటి డ్రమ్ములో ఆ గ్లాసులని వేస్తుంటే - ఇంకో అబ్బాయి, ఆ నీటిని నింపి పెడుతున్నాడు.

ఎంతగా అప్పుడే విప్పి పెట్టినా, తయారీ అప్పుడే - ఎంతో కొంత " ప్లాస్టిక్ డస్ట్" ఉండి తీరుతుంది.. అది ఏమీ కడగక, అలాగే నీరు నింపటం, వాటినే ఆబగా త్రాగటం జరుగుతున్నది. కొందరైతే - ఒక గ్లాసు నీటిని త్రాగాక, దాన్ని పారేసి, ఇంకో ప్లాస్టిక్ గ్లాసు తీసుకొని త్రాగటం.. ఇలా నాలుగైదు గ్లాసులు త్రాగటం జరుగుతున్నాయి. అక్కడే అలా జరిగింది అని కాదు.. ఎక్కడైనా యే శుభకార్యాలలో అయినా - ఇంతే కదా..

వెనకటికి స్టీల్ గ్లాసుల్లో నీరు పెట్టేవారు. ప్రజల్లో సివిక్ సెన్స్ లేకపోవటముతో, నోట్లో పెట్టుకొని త్రాగేవారు కాబట్టి, హై జీన్ పర్పస్ కోసం ఈ ప్లాస్టిక్ గ్లాసులు వాడటం మొదలెట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ వాడటమే! పెద్ద సిటీ అనే కాదు.. చిన్న చిన్న పల్లెటూర్లలోనూ అంతే!.

ప్లాస్టిక్ ని తగ్గిద్దాం తగ్గిద్దాం అనడం ఏమిటో గానీ, ఇంకా ఎక్కువ మొత్తములో వాడటం జరిగిపోతూనే ఉంది..

నామటుకు నేను మాత్రం ఇలాంటి కార్యక్రమాలలో మాత్రం, శుభ్రముగా ఒక గ్లాస్ తీసుకొని, అందులోని ప్లాస్టిక్ డస్ట్ పోయేలా కడుక్కొని, ఎన్నిసార్లు అయినా ఆ గ్లాస్ ని మాత్రమే త్రాగునీరుకి వాడుకుంటాను.. అలా వాడి ప్లాస్టిక్ డస్ట్ నా వంట్లోకి చేరకుండా కాసింత జాగ్రత్తగా ఉంటాను. ఈ పద్ధతి - మీకు నచ్చితే మీరూ పాటించండి. 

Sunday, December 4, 2011

మోకాళ్ళ లోతు - ఇండియా

ఇది నా చిన్నప్పటి స్నేహితుడి అనుభవం.. అతనే చెప్పాడు నాకు.

ఇప్పుడు అంటే పబ్లిక్ తెలివి మీరారు కానీ, అప్పట్లో అంతా అమాయకులే!.. ఏది చెప్పినా నమ్మయ్యడమే!.. అది  నిజమా కాదా! అని కూడా ఆలోచించరు. అలాంటి కాలములో నా మిత్రుడు హై స్కూల్ చదివేవాడు. అప్పట్లో తనకి ఒక మిత్రుడు ఉండేవాడు.. అతను వీడితో ఒకసారి - "కన్యాకుమారి వెళ్ళాక హిందూ మహా సముద్రములో మోకాళ్ళ అంత దూరం లోపలికి వెళ్ళి, వెనక్కి చూస్తే - భారదేశం అంతా కాశ్మీర్, హిమాలయాలతో సహా కనిపిస్తుంది.. "అన్నాడుట. మనోడికి ఎప్పుడు కన్యా కుమారికి వెళ్దామా! ఎప్పుడు ఇండియా అంతా చూస్తానా!.. అని ఒక కోరిక బాగా నాటుక పోయింది.

ఎవరైనా కన్యాకుమారి వైపు కి వెళ్ళి వస్తే - సముద్రములోకి మోకాళ్ళ అంత లోతుకి వెళ్ళి వెనక్కి చూశారా అని (పిచ్చిగా) అడిగేవాడు.. ఇదంతా తప్పని, ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అర్థం చేసుకొన్నాడు. ఇప్పటికీ ఆ సంఘటన చెప్పి, నవ్విస్తూ ఉంటాడు.
Related Posts with Thumbnails