Saturday, March 31, 2012

Spam Box

ఇలాంటి పోస్ట్ వ్రాయడం ఇది రెండో'సారీ'.. మొదటిది Mark as Spam(er) ఎవరో కానీ నా బ్లాగ్ విజిట్ చేస్తూ, కామెంట్ పెట్టేవారు. అప్పట్లో ఒక పోస్ట్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ, దానికే కామెంట్ పెట్టేవారు. ఆ పోస్ట్ పొరపాటున డిలీట్ అయ్యింది. ఇక అప్పటినుండి ఏదో ఒక పోస్ట్ కి కామెంట్ పెట్టడం చేసేవారు. మొదట్లో కామెంట్ మాడరేషన్ పెట్టేవాడిని కాదు. ఆఖరికి అందరూ కామెంట్స్ పెట్టాలని అనానిమస్ (తమ వివరాలు తెలీకుండా కామెంట్ పెట్టాలని అనుకునేవారు) వారు కూడా కామెంట్ పెట్టాలని అలా సెట్టింగ్ పెట్టాను. ఎందుకూ అంటే - కొన్ని అభిప్రాయాలని వారెవరో తెలీకుండా చెప్పాలనుకున్నవి చెబుతారని. అవి చాలా వరకు మంచివే ఉంటాయి. ఉపయోగకరముగా ఉంటాయని అనుకొని అలా చేశాను. 

అయితే చాలామంది అలా అనానిమస్ కామెంట్స్ పెట్టారు. ఒక కామెంట్ తప్ప మిగిలినవన్నీ పబ్లిష్ చేశాను. అందుకే ఇంకా అనానిమస్ కామెంట్ ఆప్షన్ ని ఇంకా కొనసాగించాను. కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాను కూడా. 

అయితే మొదట్లో అర్థం కాని భాషలో వీరు ఒక కామెంట్ పెట్టేసరికి అది మొదట్లో డిలీట్ చేశాను. ఆ తరవాత అలాంటి కామెంట్స్ ఎన్నో వచ్చాయి. అన్నీ అర్థం పర్థం లేని కామెంట్స్ అవి. ఏవేవో లింక్స్ ఉన్నవి అవి. ఇంగ్లీష్, రష్యన్ భాషలో ఉన్నాయి అవి. ఇలా కాదనుకొని కామెంట్ మాడరేషన్ సెట్టింగ్ పెట్టాను. అయినా ఇంకా ఆగటం లేదు. ఇంకా వస్తూనే ఉన్నాయి కూడా. అలాంటి కామెంట్స్ ఎన్నింటినో డిలీట్ చేశాను కూడా. ఈ కామెంట్స్ పోస్టింగ్ అంతా హైదరాబాద్ నుండే - అని రెండుసార్లు రేసేంట్ విజిటర్స్ లో చూశాను. 

ఈ సంవత్సరం జనవరి ఒకటిన నా స్పాం బాక్స్ ఖాళీ చేశాను. ఈ సంవత్సరములో ఎన్ని అలాంటి మెయిల్స్ వస్తాయో చూడాలని అనుకున్నాను. ఈ మూడు నెలల్లో 73 (డెబ్బై మూడు) స్పామ్ కామెంట్స్ వచ్చాయి. ఈ సంవత్సరం చివరివరకూ చూస్తే ఎన్ని వస్తాయో చూడాలి. ఆ విషయం అప్పుడు అప్డేట్ చేస్తాను. 

ఆ కామెంట్స్ అన్నీ అర్థం పర్థం అంటూ ఏమీ ఉండవు. ఏదో, ఏవో ఉంటుంది. ఏదో చూడమనీ, ఫారెక్స్ డీలర్ షిప్ గురించీ ఉంటుంది. ఇంకొన్ని బూతుసైట్ల గురించి ఉంటుంది. మీకు అర్థం కావటానికి ఒక కామెంట్ యొక్క స్క్రీన్ షాట్  (తెరపట్టు) ని చూపిస్తున్నాను. చూడండి. అందులోనే వృత్తం లో చూపిన దాంట్లో ఈ సంవత్సరములో ఎన్ని అలాంటి కామెంట్స్ వచ్చాయో కూడా చూడండి. 


చూశారు కదూ.. మొత్తం డెబ్బై మూడు కామెంట్స్. అన్నీ అలాంటివే. పబ్లిష్ చెయ్యటానికి పనికిరానివి. ఇలాంటివి మీకు వస్తే మీరు చెయ్యాల్సిందల్లా - ఆ కామెంట్ ప్రక్కన గడిలో ఓకే చేసి, క్రిందన ఉన్న స్పామ్ SPAM ని నొక్కండి. 

ఇప్పుడు ఆ కామెంట్ స్పామ్ బాక్స్ లోకి చేరిపోతుంది. ఇకనుండీ అలాంటి / ఆ మెయిల్ ID నుండి ఏమైనా కామెంట్స్ వస్తే - మీరు మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోనవసరం లేకుండా ఆ మెయిల్ ID నుండి వచ్చేవన్నీ ఆ స్పామ్ బాక్స్ లోకి చేరిపోతాయి. ఎప్పుడో మీకు వీలున్నప్పుడు ఆ స్పామ్ బాక్స్ చూసి, పనికిరాని కామెంట్స్ ఉంటే - అన్నింటినీ ఒకేసారి డిలీట్ చెయ్యోచ్చును.  మీకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. 

Friday, March 30, 2012

Blog home page - Upgrade now.

ఇప్పుడు బ్లాగ్ స్పాట్ హోం పేజీ లుక్ మారిపోయింది. నిన్న జిమెయిల్ లుక్ మార్చిన గూగుల్ వాడు, ఇప్పుడు బ్లాగ్ స్పాట్ ని మార్చాడు. ప్రస్తుతం మీ హోం పేజీ నే మార్చాడు. మీ బ్లాగ్ ని మార్చలేదు. ఒకవేళ మీకు మీ బ్లాగ్ హోం పేజీ ఈ క్రొత్త వెర్షన్ లో ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇలా చెయ్యండి. 

ముందుగా మీరు మీ స్వంత బ్లాగ్ హోమ్ పేజీ ఓపెన్ చెయ్యండి.. లేదా www.blogger.com లోనికి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యారా.. ఓకే.! ఇప్పుడు మీ హోమ్ పేజీలో ఈ క్రింద ఫోటోలో చూపినట్లుగా 1 వద్ద చూపినట్లుగా ఉంటే, అక్కడ నొక్కటం ద్వారా మీరు నూతన బ్లాగ్ హోమ్ వెర్షన్ లోనికి వెలుతున్నారన్నమాట. 


అలా నొక్కగానే - మీ బ్లాగ్ నూతన వెర్షన్ లో మీ బ్లాగ్ హోమ్ పేజీ - ఈ దిగువదానిలా ఓపెన్ అవుతుంది. ఇలా అంటే అచ్చు ఇలాగే కాదు.. ఆ నమూనా పద్ధతిలో మీ మీ పోస్ట్స్ బట్టి ఉంటుంది. 


చూశారు కదూ. నచ్చితే అలాగే కంటిన్యూ అవండి. లేదా మీ పాత వెర్షన్ లోనే మీ హోమ్ పేజీ బాగుంది అనుకుంటే మీరు ఏం చెయ్యాలీ అంటే - 2 వద్ద చూపినట్లుగా సెట్టింగ్స్ బటన్ నొక్కండి. అప్పుడు మీకు ఒక డ్రాప్ మెనూ వస్తుంది. అందులో మీరు 3 వద్ద చూపినట్లుగా Old Blogger Interface అని వస్తుంది. దాన్ని నొక్కితే మీరు మీ పాత హోమ్ పేజీలోని వస్తారు. Thursday, March 29, 2012

లైవ్ కరెంట్ - ఎర్తింగ్

" షాక్ "

ఏమిటబ్బా ఈ ఫ్రిడ్జ్ ఇలా షాక్ కొడుతుందేమిటీ.. అనుకున్నాను. ఆ ఫ్రిడ్జ్ వెనకాల ఎవాపరేట్ బాక్స్ లోని నీరు తీయబోతూ అలా షాక్ కి గురయ్యాను. వెనక ఉన్న లోహపు రేకుని మళ్ళీ త్రాకి చూశాను. జిల్ జిల్ మంటూ ఏదో కదిలినట్లుగా ఉంది. ఇలా కాదు అనుకొని, కరెంట్ టెస్టర్ పెట్టి చూశాను. నిజమే!.. కరెంట్ లైవ్ గా ఉంది. అప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా లేవు.

కొద్దిగా ఎలెక్ట్రికల్ పని వచ్చు కాబట్టి, క్షణములో మామూలుగా అయ్యాను. ఒక్క ఫ్రిడ్జ్ యేనా? లేదా మిగతా అన్ని సామానులా.. అని అన్నింటినీ టెస్టర్ తో పరీక్షించాను. అన్నింట్లో వాటి మొత్తం బాడీకి కరెంట్ లైవ్ గా ఉంది. అన్నింటికీ ఎర్తింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. షాక్ ప్రభావం అంతగా చూపలేకపోయింది.

సాకెట్ లోని ఎర్తింగ్ పాయింట్ వద్ద టెస్ట్ చేశాను. అందులో లైవ్ గా కరెంట్ ఉంది. సో, ఏదో మూడు పిన్నుల ఎలేక్టికల్ పరికరం పాడు అయ్యిందన్న మాట. ఒక్కో ఎలెక్ట్రికల్ వస్తువులను కరెంట్ సాకెట్ లనుండి తొలగిస్తూ, ఎర్తింగ్ పాయింట్ వద్ద చూస్తూ, పోయాను.

ఫ్రిడ్జ్ ని సాకెట్ నుండి తీసేసినా.. అయినా కరెంట్ ఉంది.
వాషింగ్ మెషీన్.. అయినా ఉంది.
హట్ ప్లేట్.. ఉంది.
రైస్ కుక్కర్.. ఉంది..
కంప్యూటర్.. అయినా కరెంట్ ఉంది.
ఇలా ప్రతీ త్రీ పిన్ కరెంట్ ఉపకరణాలనీ తీసేస్తూ వచ్చాను.
అన్నీ అయిపోయాయి.

ఇక టూ పిన్స్ కి వచ్చాను. మూలగా అమాయకముగా ఉన్న టీవీ మీద దృష్టి పోయింది. దాని కనెక్షన్ వైర్ ని సాకెట్ నుండి తీశాను. చిత్రం.. కరెంట్ ఎర్తింగ్ పాయింట్లో కనిపించటం లేదు.

మళ్ళీ యధావిధిగా టీవీ ప్లగ్ పెట్టాను. ఎర్తింగ్ పాయింట్ లో కరెంట్ లేదు. ఇదేదో చిత్రముగా ఉందే అనుకున్నాను.

మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ యధావిధిగా షాక్.

ఇక లాభం లేదని టీవీ ని చెక్ చేశాను. ఎందుకైనా మంచిది అని టీవీ స్టెబిలైజర్ ని చెక్ చేశా. య్యేస్ - అందులోనే ప్రాబ్లెం. స్టెబిలైజర్ కి ఉన్న అవుట్ పుట్ సాకెట్ లోని నెగెటివ్ పాయింట్ లో కూడా లైవ్ గా కరెంట్ వస్తున్నది. ఒఫ్ఫో!..ఇదా సంగతి అనుకుంటూ.. ఎప్పుడో కొన్న, ఎప్పుడూ విప్పని ఆ స్టెబిలైజర్ యొక్క సీల్స్ విప్పి, ఓపెన్ చేశాను.

అందులో బోలెడంత దుమ్ము.. ఆ దుమ్ములోనే ఒక సాలీడు మాత ఎంచక్కా ఫ్లాట్ కట్టుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటున్నది.

ఒక బ్రష్ తో ఆ స్టెబిలైజర్ ని శుభ్రం చేశాను. అప్పుడు ఒక స్క్రూ క్రింద పడింది. ఇది ఎక్కడిదా?.. అని చూశా. అవుట్ పుట్ సాకెట్ లోని నెగెటివ్ పాయింట్ ది ఊడిపోయి, క్రింద పడింది. ప్రాబ్లెం అర్థం అయ్యింది. ఆ పాయింట్లో ఉన్న వైర్ అప్పుడప్పుడు తాకుతూ, తాకక పోయేసరికి అలా అవుతున్నది. ఆ సాకెట్ కి ఆ స్క్రూ బిగించాను. అప్పుడు ఎర్తింగ్ పాయింట్లో కరెంట్ లైవ్ గా రావటం ఆగిపోయింది. ఒక చిన్న స్క్రూ వల్ల ఎంత ప్రమాదం ఏర్పడుతుందో చూడండి. ఎర్తింగ్ కనెక్షన్ ఉండటముతో ఈరోజు ఇంకా ఈపోస్ట్ వ్రాస్తున్నాను. లేకుంటే ............ 

Tuesday, March 27, 2012

టెంపరరీ కనెక్షన్ వైర్

మామిడి తోరణాలు  అనే పోస్ట్ లో ఒక తీగ వాడాను అని చెప్పాగా.. అది నిజానికి ఒక సన్నని ఇనుప తీగ. దాని మీద తెల్లని PVC / ప్లాస్టిక్ తొడుగు ఉంటుంది. ఈ ప్లాస్టిక్ తొడుగు కాసింత గట్టిగానే ఉంటుంది. ఈ తీగ ఎటువైపు అంటే అటు వంగుతుంది.


ఈ వైర్ ని ఎలెక్ట్రికల్ సామానులు అమ్మే దుకాణాలల్లో అమ్ముతుంటారు. నిజానికి ఈ వైర్ ని ఏమని అంటారో నాకూ తెలీదు. నేను మాత్రం టెంపరరీ కనెక్షన్ వైర్ అనే పిలుస్తాను. అప్పటికీ అర్థం కాకుంటే ట్యూబ్ లైట్ లోన కనెక్షన్ కి వాడే వైర్ అని చెబుతుంటాను. అలాని ఎందుకూ అంటే - ఈ వైర్ ని ట్యూబ్ లైట్ లలో కనెక్షన్స్ కోసం ఈ వైర్ నే వాడుతుంటారు. ఇది చుట్టలు చుట్టలుగా దొరుకుతుంది. ఒక చుట్టలో వంద మీటర్లకి పైగా ఉండొచ్చు. ఈ మొత్తం వైర్ చుట్టని మీకు తెలిసిన షాప్ వాడు అయితే ముప్పై రూపాయలకి ఇస్తాడు. ఏమీ తెలీనివాడిలా వెళ్ళి అడిగితే మాత్రం యాభై రూపాయల మీదనే చెబుతాడు.

ఇలాంటి వైర్ మీకూ పరిచయం అయ్యే ఉంటుంది. క్రొత్తగా ఎలెక్ట్రికల్ సంబంధమైన వస్తువు కొంటే, ఆ పరికరానికి వచ్చిన వైర్ ని ఒకదగ్గరగా ముడి వెయ్యటానికి చిన్నని, నల్లని వైర్ ముక్క మీకు కనిపిస్తుంది. నల్లని ప్లాస్టిక్ తొడుగు ఉన్న సన్నని తీగ అది. అది విప్పితేనే - వైర్ కార్డ్ ని పెద్దగా విప్పటానికి వీలవుతుంది.  ఇదీ అలాంటిదే. కానీ పైన ఉన్న ప్లాస్టిక్ రంగు మాత్రం వేరు. ఇది తెలుపు, అవి నలుపు. అంతే తేడా..

నేను మొదట్లో ట్యూబ్ లైట్స్ రిపేరింగ్ కోసమని తెచ్చుకోనేవాడిని. ఆ తరవాత తరవాత మిగతా పనులకీ వాడటం మొదలెట్టాను. చాలా తక్కువ ధరకి వస్తుంది కదా అనీ, బోలెడంత ఉంది కదా అనీ కావచ్చును చాలాపనులకి వాడుతుంటాను. అబ్బో! ఆ లిస్టు చెబుతుంటే చాలానే ఉంది. ఆ వైర్ తో చేసే కొన్ని పనులు :

* క్రొత్త వైర్ కనెక్షన్స్ కోసం, 
* తాత్కాలిక (తక్కువ వాటేజీ) ఎలెక్ట్రికల్ కనెక్షన్స్ కోసం, 
* కనెక్షన్స్ సాకేట్స్ నుండి పరికరాల వరకూ వ్రేలాడుతున్న వైర్స్ ని చిన్నగా, దగ్గరగా ముడి వెయ్యటానికి, 
* మొక్కల కొమ్మలు అటూ ఇటూ పోకుండా ఉండటానికి, 
* ఇళ్ళల్లో వాడే చీపురు పుల్లలు విడిపోకుండా గట్టిగా కలిపి ఉంచటానికీ, 
* ప్లాస్టిక్ కవర్స్ లలో వస్తువులు వేశాక, మడిచి ముడి వెయ్యటానికి, 
* పండుగల రోజున పూలదండలు గ్రుచ్చటానికి, 
* టెంపరరీగా కర్టెన్స్ ని కట్టుకోవటానికి, 
* పార్టీ సమయాల్లో అలంకరణ కోసం, 
* చిన్న చిన్న బల్బుల శ్రేణులని కలపటానికి, 
* ఏవైనా చిన్న చిన్న వస్తువులకి కట్టి, వాటిని మేకులకి తగిలించటానికి, 
* ఎక్కడ జనపనార త్రాడు, ప్లాస్టిక్ త్రాడు వాడటానికి ఫ్యాషన్ లుక్ గా అనిపించదో అక్కడ, 
* బెలూన్స్ లలో గాలి ఊదాక ముడివేయ్యటానికీ, 
* వ్రేలాడే ప్లాస్టిక్ కుండీలని కట్టుకోవటానికీ, 
* తాత్కాలికముగా ప్లాస్టిక్ సంచుల మూటలు కట్టుకోవటానికీ, 


... ... ఇలా చాలానే ఉన్నాయి. మీ ఓపిక. మీ ఆలోచన.

ఇవన్నీ వింటుంటే సిల్లీగా ఉంటుంది. కానీ ఒకదానికి కోసం తయారు కాబడిన వస్తువు మరోపనికి చాలా బాగా పనికి వస్తుంది అన్నదానికి ఇది చక్కని ఉదాహరణ.  

Sunday, March 25, 2012

మామిడి తోరణాలు

ఈ ఉగాదికి గుమ్మానికి, దేవుడి గదికీ మామిడి తోరణాలు కట్టాను. ఎప్పటిలా ఉదయమే మార్కెట్ కి వెళ్ళి, పూలు కొన్నాను. పండుగల రోజున నాడే ఈ పూల ధర భగ్గుమన్నట్లుగా ఉంటుంది. అయినా తప్పదు కదా..! అలా ఒక కిలో పూలు తీసుకోచ్చేశాను.

ఎప్పటిలా మామూలుగా ఒక దండలా దారానికి గుచ్చేద్దాం అనుకున్న వాడిని, ఈసారి కాస్త ప్రత్యేకముగా చేద్దామనిపించింది. సరే! అని దారానికి ఆ పూలు ఆగవు. నాలుగైదు వరుసలు పెడితే గానీ ఆ పూల బరువుని దారం ఆపదు. అన్ని వరుసలు పెడితే సూదికి కన్నం సరిపోదు. ఇలా కాదనుకొని, ఇంట్లో - టెంపరరీ కనెక్షన్స్ కోసం వాడే ఎలెక్ట్రికల్ వైర్ ని తీసుకున్నాను. 

సన్నని ఒక ఇనుప తీగ మీద తెల్లగా ప్లాస్టిక్ / PVC పూత ఉన్న వైరు ఇది. (దీని గురించి వివరాలకోసం ప్రత్యేకముగా వేరే పోస్ట్ త్వరలో పెడతాను) ఎటు పడితే అటు సులభముగా వంగుతుంది. గట్టిగా కూడా ఉంటుంది. మామూలు సుతిలీ (జనపనార త్రాడు), ప్లాస్టిక్ వైర కన్నా దీన్ని వాడటం చాలా సులభం కూడా. ముందు ఆ వైర్ మీద అరంగుళం పైన ప్లాస్టిక్ పొర తీసేసి, ఆ వచ్చిన ఇనుప తీగకి అలాగే పూలు గుచ్చటం మొదలెట్టాను. అలా తొందరగా పని ముగించాను. 


అలా పూల తోరణాలని ఈసారి సంప్రదాయముగా ఎప్పటిలా కాకుండా ఈసారి క్రొత్తగా చెయ్యాలనిపించి, చేశాను. అలా ఆ తీగకి గుచ్చేసి, ఇంటి గుమ్మాలకి అలంకరించాను. అలా మూడు రకాలుగా చేశాను.  ఇక్కడ మాత్రం రెండు రకాలని మాత్రమే పరిచయం చేస్తున్నాను, మూడో అలంకరణని మాత్రం పరిచయం చెయ్యలేకపోతున్నాను. వీటిని చూసి అవి ఎలా ఉన్నాయో చెప్పండి. బాగున్నాయా..? 

Friday, March 23, 2012

మధ్యవర్తి - కమీషన్

మొన్న నా మిత్రుని షాప్ కి రద్దీ లేని సమయాన వెళ్ళి, పిచ్చాపాటీగా కబుర్లాడుతూ కూర్చున్నాను.. ఇంతలో ఒకతను ఆదరాబాదరాగా వచ్చాడు. ఆయన్ని చూడగానే నా మిత్రుడు నవ్వుతూ పలకరించాడు.. "ఆవో సేట్.. ఆప్ కైసే హై.." (రండి సేట్ గారూ.. మీరెలా ఉన్నారు) అంటూ. నన్ను చూసి ఎవరు అని కళ్ళతో సైగ చేస్తూ తనని అడిగాడు. దానికి మా మిత్రుడు - నా ఫ్రెండ్ అన్నాడు.

నాకూ అతనికి మధ్యగా కూర్చున్నాడు. బంగారం ధర ఎంతుంది? అడుగుతూ అక్కడ డెస్క్ మీద ఉన్న కాలుక్యులేటర్ తీసుకొని, ఏదో నొక్కాడు. అది అతనికి చూపించాడు. నా మిత్రుడు "అబ్బా! అంతనా.. కష్టం సేట్." అన్నాడు. "నీకెందుకయ్యా!. వారిని ఒప్పించి ఆర్డర్ ఇచ్చేలా చేయిస్తాను.." అన్నాడు. దానికి నా మిత్రుడు అన్యమనస్కముగానే ఓకే అన్నాడు. అలా ఒప్పుకుంటున్న సమయములోనే, ఆ షాప్ లోకి బిలబిలమంటూ కొద్దిమంది లోపలి వచ్చేశారు. అంటే ఆయన కాస్త కొన్ని అడుగుల ముందుగా ఆ షాప్ లోకి వచ్చేశాడన్న మాట. 

ఆ సేట్, నా మిత్రుడూ వాళ్ళని సాదరముగా లోపలి ఆహ్వానించి, కాసిన్ని కుశల ప్రశ్నలు అయ్యాక, నగల డిజైనుల వరకూ వచ్చారు. నా మిత్రుడు అవన్నీ చూపిస్తూ, రకరకాల కేటలాగులు చూపించాడు. అలాగే వాటి గురించిన వివరాలు చెప్పసాగాడు. గంటా గంటన్నర వరకూ అలాగే సాగింది. నేను వారిని గమనిస్తూ పోయాను. ఆ వచ్చిన సేట్ సమయం దొరికినప్పుడల్లా నా మిత్రుని గురించి డప్పు వేస్తూ, ఎంత బాగా చేయిస్తాడో, ఎంత నమ్మకముగా ఆభరణాలు చేయిస్తాడో చెబుతున్నాడు. మధ్య మధ్య వారినీ కాసింత ఎక్కువ ధర పెట్టేలా మానసికముగా ఒప్పిస్తున్నాడు. 

నా మిత్రుడు అప్పుడప్పుడు నాకేసి చూస్తూ, వారిని గమనించు అన్నట్లు సైగ చేస్తున్నాడు. మొత్తానికి వారికి కావాల్సిన నగల సెలక్షన్స్ అన్నీ అయ్యాయి. బిల్లింగ్ కూడా అయ్యింది. కొన్నింటికి డెలివరీ డేట్ చెప్పాడు. అందరూ నా మిత్రుని వద్ద నుండి వీడుకోలు తీసుకున్నారు. 

ఆ తరవాత నా మిత్రుడు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని (తాను చూపించినవన్నీ అక్కడే ఉన్నాయా? ఏమైనా మాయం అయ్యాయా? అనీ) ఓకే చేసుకున్నాక, అప్పుడు అన్నీ లోపలికి సర్డుకోసాగాడు. నా మిత్రుని మొహములో ఆనందం. మంచి బేరం తగిలిందని కావచ్చును. 

"ఏమిట్రా అంత సంతోషం..?" అన్నాను నేను. 

"హా!.. అవునురా.. ఈరోజు మంచి ప్రాఫిట్ వచ్చింది. ఆ సేట్ వచ్చి అడిగాడు గుర్తుందా..? నిజానికి అతను అడిగింది కమీషన్. ఆ వెంట వచ్చింది తనకి బాగా తెలిసిన బంధువులు అంట. ఈ ఆర్డర్ ఇప్పించినందులకు ఆయనకీ కాసింత వాటా కావాలిట. అందుకే అలా.. " అంటున్నప్పుడే ఆ సేట్ మళ్ళీ వచ్చాడు. 

మా వాడు కొన్ని డబ్బులు లెక్కపెట్టి ఆయన చేతిలో ఉంచాడు. ఆయన లేక్కపెట్టుకొని, "ఇంతేనా.." అన్నాడు.. మా వాడు ఇంకో వంద నోటు ఇచ్చాడు. మోహం మీద సంతృప్తిగా నవ్వు మొఖం పెట్టుకొని, వస్తాను బాబూ.. అంటూ వెళ్ళిపోయాడు. నిజానికి అది చాలా మొత్తమే.! మధ్య తరగతివాడు ఒకరోజు హాయిగా, యమ దర్జాగా బ్రతకగలిగే డబ్బు అది. ఈ మధ్యవర్తిత్వం బిజినెస్ బాగుంది. 

మా మిత్రుడు మళ్ళీ నాతో మాట్లాడటం మొదలేడుతూ "ఇలా అన్ని బిజినెస్ లలో ఉన్నాయి.." అన్నాడు.

"అవునా.. దగ్గరివారి దగ్గర ఆయన అలా తీసుకోవటం నాకు నచ్చలేదు.." అన్నాను నేను. 

"నిజం చెప్పాలీ అంటే - ఈ మధ్యవర్తిత్వం వాళ్ళు వస్తే మాకు కాసింత హ్యాపీ. మేము కొద్దిగా వివరిస్తే చాలు. మిగతా అంతా వారే చెప్పేస్తారు. వచ్చినవారు ఆటా.. ఇటా అన్న సందేహములో ఉన్నప్పుడు, వారే ఒప్పిస్తారు. అలా మాకు లాభం. వారికి ఇచ్చే మొత్తం కూడా ఆ వచ్చినవారి బిల్ లోనుండే "ఎక్కడో అడ్జస్ట్"  చేసి, ఇచ్చేయ్యడమే. మా జేబులనుండి తీసివ్వటం అంటూ మీ ఉండదు. పైపెచ్చు పనిలో పనిగా ఈ మధ్యవర్తికి తెలీకుండా ఇంకాస్త నోక్కేస్తాం. అది ఈయనికి తెలిసినా - తేలుకుట్టిన దొంగలా నోరు మెదపడు. పైపెచ్చు మాకూ ఇంకొంత ఎక్కువ లాభం. అలా ఈరోజు ఆయనికి ఇచ్చినదానికన్నా రెట్టింపు మొత్తం నాకు అదనపు ఆదాయం.." అన్నాడు. 

"హవునా.. నీ పనే హాయిగా ఉంది. అసలు వచ్చే లాభం కన్నా, ఇంకా అదనపు ఆదాయం.. యే సాఫ్ట్వేరూ ఉద్యోగీ పనికి రాడు.." అన్నాను. 

"హా! అలా ఎప్పుడూ రాదు. ఎప్పుడో ఒకసారి ఇలా. అంతే!. అయినా ఈ పబ్లిక్ పిచ్చోళ్ళు. వారికి అన్నీ తెలిసినా మారరు. మారితే వారే లాభపడుతారు. అయినా అంతే!. మారరు. ఇప్పుడు డైరెక్ట్ గా వస్తే నాకు వచ్చిన అదనపు ఆదాయం + ఆ మధ్యవర్తికి ఇచ్చిన మొత్తం వారికి మిగిలేటివి కదా.. అయినా జనాలు స్వంతముగా కొనుక్కోవడం ఎలాగో ఇంకా తెలుసుకోరు.. అలా మారితే చాలామందికి చాలానే మిగులుతుంది.." అన్నాడు.

నిజమే!. చాలామంది మారరు. ఇతరులని మధ్యవర్తులుగా పెట్టేసుకొని, చాలా దెబ్బ తినేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. ఇద్దరు కలిసి ఒక డీల్ కుదుర్చుకుంటే - ఆ ఇద్దరూ లాభపడాలి. లేదా ఒక్కరైనా (ఎక్కువ) లాభం పడాలి. అనవసరముగా మధ్యన ఉన్న మూడో వ్యక్తికి ఎందుకు పెట్టాలి? అని ఆలోచించరు. ఇలా ఒక్క బిజినెస్ లలోనే కాక, చాలా విషయాల్లో వర్తిస్తుంది. 

ఉదాహరణకి ఇన్స్యూరెన్స్ పాలసీలలో(ఆన్లైన్ పాలసీలు మరో మార్గం), ఇంటి అమ్మటం, కొనటం (స్థానిక దినపత్రికలలో తక్కువ ఖర్చుకి ప్రకటన చేసి, బ్రోకర్ ని దూరం చెయ్యటం ద్వారా ఇరువురు లాభ పడటం.), వాహనం అమ్మటం, కొనడం, ఆస్థుల పంపకాలు.. ఇలా చాలానే ఉన్నాయి.  

Thursday, March 22, 2012

Wednesday, March 21, 2012

Tuesday, March 20, 2012

Monday, March 19, 2012

Sunday, March 18, 2012

(No) Chat please..

మొన్న సోషల్ సైట్లో ఒకతను ఆడ్ రిక్వెస్ట్ పెట్టాడు. అలాగే చాట్ కి కూడా.. సరే అని అతని గురించి వివరాలు చూసాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఫోటో కూడా ఉంది. నా ఫ్రెండ్స్ లిస్టు లోకి ఆడ్ చేశాను. ఆడ్ చేసిన మరుక్షణమే, ఎంతోసేపటి నుండి ఆ అవకాశం ఎదురుచూస్తున్నట్లు చాట్ కి వచ్చాడు.

సరే! అని నా పనులన్నీ ప్రక్కన పెట్టి చాట్ మొదలెట్టాను. మొదటి నుండీ తన ప్రశ్నలే. తను అడగటమే! నేను జవాబు ఇవ్వాల్సిందే. మామూలుగా నన్ను ఏమైనా ప్రశ్నలు అడిగితే వారినీ అడిగితే, నేనూ వారివీ అడుగుతాను. అది సహజమే కదా.. కానీ ఇక్కడ నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం లేదు. ఒకటివెంట మరొకటి అన్నట్లు బుల్లెట్లలా ప్రశ్నల వర్షం. అయినా ఓపికగా జవాబివ్వసాగాను.

నిజానికి అతను అప్పుడే పరిచయం. అయినా ఎంతో చనువుగా డిటైల్స్ అడగటం మొదలెట్టాడు. మూడు ప్రశ్నల తరవాత జెనరల్ ప్రశ్నల నుండి పర్సనల్ విషయాల మీద (కుటుంబం, ఉద్యోగం, ఆస్తులూ..) అడగటం మొదలెట్టాడు. "అవన్నీ అవసరమా.." అన్నాను.

అయినా మానక, అలాగే అడగటం మొదలెట్టాడు. ఎందుకో అనుమానం వచ్చి, ఇంకో టాబ్ ఓపెన్ చేసి, అతని ప్రొఫైల్ ఓపెన్ చేసి, అతని ఆల్బం లోని షేర్ చేసిన (ఉన్న) ఒకేఒక ఫోటో చూస్తూ "ఇతను ఎక్కడైనా, ఎప్పుడైనా పరిచయమా?.." అని ఆలోచించసాగాను.

"అవన్నీ మీకు అనవసరం.. మీరు ఫ్రెండ్ గా ఆడ్ అయ్యారే ఇప్పుడు. అంత లోతుగా నా వివరాలు మీకు అవసరమా?.." అడిగాను.

"ఫ్రెండ్ అన్నాక ఆమాత్రం తెలుసుకోవాలి కదా!.. ఒకరి వివరాలు ఒకరు తెలుసుకోవాలి కదా.. అయితే మీకు ఫ్రెండ్షిప్ మీద నమ్మకం లేదు. జస్ట్ టైం పాస్ అన్నమాట. మీ గురించి నేను ఏదో గొప్పగా ఊహించుకున్నాను.. " అన్నాడు.

ఇదే అదను అనుకొని వెంటనే అతని గురించి ప్రశ్నలు వేశాను. వాటికి రెండు నిమిషాలైనా జవాబు లేదు. అంతలోగా అతని ఫోటోని పరిశీలనగా చూశాను.

అతను ఇందాక నేను వేసిన నా ప్రశ్నలకి జవాబు ఇవ్వక - ఇంకా నా డిటైల్స్ అడగటం మొదలెట్టాడు.

నేను అడిగిన ప్రశ్నలకి జవాబు గురించి అడిగాను. "వాటికి జవాబు ఇస్తాను. నమ్మకం ఉండాలి.. " అని అతని సమాధానం. కానీ అతని గురించి అతడు ఒక్క విషయమూ చెప్పలేదు.

"చూడు బాస్! స్నేహం అని అంటావ్..!! నమ్మకం అనీ అంటావ్..!!! నావే అన్నీ డిటైల్స్ ఆడుగుతున్నారు. అదీ CBI ఎంక్వయిరీ చేసినట్లు, అన్నీ పర్సనల్ విషయాలు అడుగుతున్నారు. మీవి మాత్రం అడిగినా చెప్పటం లేదు. ఇప్పటికే ఈ ప్రశ్నని రెండుసార్లు అడిగాను. ఇప్పుడు మూడోసారీ గుర్తుచేస్తున్నాను. అయినా జవాబు లేదు. ఇక నేను మిమ్మల్ని ఎలా నమ్మేది?. ఏమి చూసి నా విషయాలు మీతో చెప్పాలి?. నాకు అంత అవసరం లేదు.." అన్నాను.

"అంటే మీకు ఫ్రెండ్షిప్ మీద నమ్మకం లేదు.. అందుకే సరిగా చెప్పటం లేదు (?) అసలు మీదే ఫేక్ ప్రొఫైల్.. అందుకే చెప్పటానికి భయం. లేకపోతే చెప్పేవారు కదా.." అని అతను అన్నాడు.

అప్పటికే దాదాపు పది ప్రశ్నలకి సమాధానం ఇచ్చాను. కానీ నా ప్రశ్నలకి ఒక్క సమాధానం కూడా లేదు. చివరిగా నేనే "మీరు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయా?.." అని అడిగా. "కాదు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి" అని చెప్పాడు.

"నాకు కాసింత పని ఉంది.. మళ్ళీ కలుద్దాం.. నైస్ మీటింగ్ టూ యూ.. హావ్ ఏ నైస్ డే.." అని చెప్పి ఆ చాట్ క్లోజ్ చేశాను.

అప్పుడు - ఇందాక ఇంకో ట్యాబ్ లో ఓపెన్ చేసిన అతని ఆల్బం లోని ఫోటో కనిపించింది. అప్పుడే నా బుర్రలో మెరిసింది. అతనెవరో తెలిసింది. మళ్ళీ పరిశీలనగా చూశాను. నిజమే!.. అవే పోలికలు. " య్యెస్.. ఐ గాట్ ఇట్.." అనుకున్నాను. కానీ అందులో సంతోషం లేదు. కాసింత వెగటు, అసహ్యం, కోపముతో "ఛీ!! ఇతనా?.." అనుకున్నాను.

నా ఫ్రెండ్స్ లిస్టు నుండి అతన్ని వెంటనే తొలగించాను. అలాగే బ్లాక్ కూడా చేశాను.

అతను.. ఒకప్పుడు మామూలుగా నాకు సోషల్ సైట్ లో పరిచయం అయ్యి, ఆ తరవాత తన ఆన్లైన్ లోనే తన "అసలు రూపం" చూపి, నా వెంట పడ్డాడు. అతని "విషయం" తెలిసి అతన్ని నా ఫ్రెండ్ లిస్టు నుండి తొలగించాను. మళ్ళీ ఇంకో ప్రొఫైల్ పెట్టేసుకొని మళ్ళీ వెంటపడటం. సోషల్ సైట్లలో ఆడవారికే కాదు.. మగవారు ఫొటోస్ పెట్టుకుంటే వారికీ స్వజాతి నుండి "వెంటపడటం.." లాంటి బాధలు ఉంటాయని చదువుకునే రోజుల్లో వినేవాడిని.. కానీ ఈ ఆన్లైన్ కి వచ్చాక ప్రత్యక్షముగా చూస్తున్నాను. "ఈ (e) బాధల" నుండి నాకు విముక్తి ఎప్పుడ్రా దేవుడోయ్..!!

Saturday, March 17, 2012

Unfriends in Facebook

మీ ఫేస్ బుక్ సోషల్ సైట్ అకౌంట్ లోని మిత్రులతో హాయిగా ప్రతిరోజూ ముచ్చట్లు, మీ భావజాలాన్ని పంచుకుంటూ ఆనందముగా ఉంటున్నారా..! అలాంటిది ఒకరోజు ఉదయాన మీరు మీ ఫేస్ బుక్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యినప్పుడు, ఎప్పుడూ ఉండే స్నేహితుల సంఖ్య కొద్దిగా తగ్గినట్లుగా అనిపిస్తున్నదా..? ఖంగారు పడి, మీరు మీ స్నేహితుల లిస్టు మీద క్లిక్ చేసి, ఒక్కరినీ గుర్తు తెచ్చేసుకుంటూ, మీ లిస్టులో ఉన్నారా? వెళ్లిపోయారా? అని వెదుకుతున్నారా.. ?

నిజానికి అలా వెదకటం చాలా కష్టముగా ఉంటుంది కదూ.. "జై ఫేస్ బుక్.." అంటే వెంటనే ఆ వెళ్ళిపోయిన మిత్రుడు(రాలు) ఎవరో తెలిసేలా ఉంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచన వచ్చిందా..? అయితే వెంటనే ఈ పద్ధతి ఫాలో అయిపోండి.


1. సర్చ్ బార్ 1 లో Unfriends అని టైపు చెయ్యండి. 

2. 2 వద్ద సర్చ్ బటన్ ని నొక్కండి. 

3. ఇలా Unfriends అనే అప్లికేషన్ వస్తుంది. దాని మీద నొక్కి, ఆ అప్లికేషన్ 3 ను మీ ప్రొఫైల్ కి ఆడ్ చేసెయ్యండి. 

ఇప్పుడు మీ హోం పేజీలోన ఆ అప్లికేషన్ ని - మీ ఫ్రెండ్ ఎవరైనా మీ లిస్టు నుండి వెళ్లిపోయారా అని సందేహం వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూడండి. తేలికగా తెలుసుకోవచ్చును. 

కానీ కొన్ని ముఖ్య సూచనలు. : 

అప్లికేషన్ ఒకరు మన ఫ్రెండ్స్ లిస్టు నుండి వెళ్ళిపోయినప్పుడు ఉపయోగిస్తే - ఒకసారికి మాత్రమే వారెవరో చూపిస్తుంది. రెండోసారి ఓపెన్ చేస్తే - ఏమీ చూపించదు. 

వెళ్ళేవారు మనం నచ్చక వెళ్ళిపోతారు. అంత మాత్రాన కక్ష సాధింపు ధోరిణి ప్రదర్శించి, వారిని ఏదో చెయ్యటానికి ప్రయత్నించకండి. అసలు వారెవరో తెలీదు అన్నట్లు ఉండిపొండి. 

అప్లికేషన్ ని అతి తక్కువసార్లు వాడటం నేర్చుకోండి. 

క్కోసారి ఈ అప్లికేషన్ చాలా తప్పుగా కూడా చూపిస్తుంది. ఒక పెద్ద ఆఫీసర్ నా లిస్టు నుండి ఐదుసార్లు,(ఈ విషయమై ఒక పోస్ట్ కూడా పెట్టాను అప్పట్లో.. తనని తీసేద్దాం అనుకున్నా. నిజానికి అది ఇప్పుడు తెలిసింది - ఆ సోషల్ సైట్ టెక్నికల్ ప్రాబ్లెం.. ఈ లింక్ ని నొక్కండి ) ఒక టీవీ సంస్థలో పనిచేసే అబ్బాయి ఇవాల్టి వరకూ నాలుగుసార్లూ నా లిస్టు నుండి వెళ్ళిపోయారు అని చూపెట్టింది. నిజముగానే వెళ్ళిపోతే వారు మళ్ళీ నాకు ఆడ్ రిక్వెస్ట్ పెట్టాలి కదా.. అలాంటిదేమీ లేకుండానే నా లిస్టు లో ఉన్నారు. ఇలా నిన్న కూడా జరిగింది. అది అలా జరగటం ఒక వింతగా ఉంది కూడా. ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే - తొందరపడి, ఎవరితో ఏమీ పోట్లాడక, కాసింత ఓర్పుని ప్రదర్శించండి. 

అప్లికేషన్ ని మీకు పరిచయం చెయ్యటానికి మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. కానీ ఇది వాడి, అనవసరముగా అలా వెళ్ళిపోయినవారెవరో కనుక్కొని, మానసిక వేదన పడి, లేనిపోని చిక్కుల్లో పడకూడదని హెచ్చరిస్తూ, విన్నవించుకుంటున్నాను.  

Friday, March 16, 2012

Thursday, March 15, 2012

Wednesday, March 14, 2012

Monday, March 12, 2012

చింతపండు

మొన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు క్రొత్త చింతపండు కనిపించింది. చింతపండు అనగానే దాని పులుపు రుచి గుర్తుకువచ్చి, మీ అందరి నోట్లో నీరు ఊరుతుండవచ్చును. ఈ చింతపండు తో చేసే రసం మనకెందరికో మిక్కిలి ప్రీతిపాత్రమైనది. చాలామందికి ఈ చింతపండుతో చేసే రసం, సాంబార్, పప్పుచారు, పులిహోర, చేపల పులుసు.. (ఇవన్నీ గుర్తు చేసి మిమ్మల్నందర్నీ బాధపెట్టాను - నన్ను మన్నించండి) అంటే చాలా ఇష్టం. ఓకే.. ఓకే.. ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం.

అలా మార్కెట్ కి వెళ్ళిన నేను - చింతపండు కనిపించగానే రానున్న ఉగాదికీ, దైనందిక అవసరాలకీ ఇదుకిలోల చింతపండు తీసుకోవటానికి వెళ్లాను. మొదట ఒక అమ్మేవాడి వద్దకి వెళ్ళి అడిగాను. అతడి వద్ద చింతపండు మీద ఉండే పెంకు లాంటిది తీసేసి, సగం వరకూ నార తీసేసి, లోపల ఉన్న గింజలు పూర్తిగా తీసేసి, రెండు రెక్కలుగా విప్పదీసి, అమ్మేస్తున్నారు. ధర ఇంతా అని అడిగితే, " కిలో - అరవై " చెప్పాడు. బేరం చేస్తే " యాభై ఐదు " చెప్పాడు.

తన ప్రక్కనే ఉన్న ఇంకో చింతపండు అమ్మే ఆమె దగ్గరికి వెళ్లాను. ఆమె దగ్గర చింతపండు పైన పెంకు దాదాపుగా తీసేసి, రెండు రెక్కలుగా విప్పదీయకుండానే, గింజలతో సహా నారతో కలిపి (క్రింద ఫోటో) అమ్మేస్తున్నది. ధర ఎంతా అని అడిగితే " కిలో - ఇరవై " అని చెప్పింది ఆవిడ. అంటే మొదట అతను చెప్పిన దానిలో మూడోవంతు ధర. (60 : 20)

ఒక ఆలోచన వచ్చి, " ఒకవేళ ఈ పైన పెంకూ, నారా, లోపల గింజలూ.. తీసేస్తే కిలోకి ఎంత తరుగు వస్తుంది? ఒక పావుకిలో ఉంటుందా? " అని ఆమెని అడిగాను. ఆమె నవ్వి, " అంత వస్తుందా బాబూ..! కిలోకి మహా అంటే సౌ గ్రామ్ (ఒక వంద గ్రాములు) అలా తుట్టి / తరుగు (Wastage) వస్తే గొప్ప.. " అని చెప్పింది.

అవునా! అని హాస్చర్యపడిపోయాను. అంటే ఇంకో వంద గ్రాములు నష్టం వేసుకుంటే ఆ వచ్చే రెండు రూపాయలు (20 Rs. Kg * 10% = 2 Rs.) కలుపుకున్నా ఇరవైరెండు రూపాయలు అవుతుంది. పోనీ - ఇంకో మూడు రూపాయలు తరుగు వేసుకున్నా ఇరవై ఐదుకన్నా మించదు. అంటే మొదట చెప్పిన అరవై రూపాయలతో పోలిస్తే - చాలా చవక అని అర్థం అయ్యింది. సూపర్ మార్కెట్లో మేలిమి ఫ్లవర్ రకం చింతపండు ప్రతి కిలోకి 140 - 180 Rs. గా ఉంది. దానితో పోలిస్తే ఆ చింతపండు ఆవిడ చెప్పిన రేటు చాలా చా.....లా చవక. (ఇది ఇంకా చవక సూపర్ మార్కెట్లో ధరలో 10% ధర ఆధారం చూడండి : http://m.sakshi.com/Sakshi/Visakhapatnam/13254684)

అయినా చింతపండుని ఎక్కువగా అంటే 99 % వాటి నుండి రసం తీసుకోవటానికి ఉపయోగిస్తాం. ఇంకా పిక్కలూ, గింజలూ, నారతో ఉంది ఉంటే - నానబెట్టి, ఆతరవాత చేతిలోకి తీసుకొని, పిసికి రసం తీయుటకి చాలా అనువుగా ఉంటుందని ఆవిడ చెప్పింది. ఇదీ ప్లస్ పాయింటే అనుకొని అక్కడే ఐదు కిలోలు చింతపండు తీసుకున్నాను.


Sunday, March 11, 2012

Saturday, March 10, 2012

Friday, March 9, 2012

Online Insurance - a tip.

ఇది మార్చ్ నెల. ఈ నెలలో ఇన్స్యూరన్స్ వారి హడావిడి కూడా ఎక్కువే ఉంటుంది. ఈపాలసీ తీసుకోండి.. ఆ పాలసీ తీసుకోండీ అనీ. ఇక్కడే మీకు ఒక చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను..

ఆ పాలసీ గురించి అంతా వినండి. 

మరిన్ని వివరాలకు ఆన్ లైన్ లో వెదకండి. 

అలా వెదికాక, అలాంటి పాలసీ ఇంకో ఇన్స్యూరన్స్ కంపనీలో ఉందేమో చూడండి. 

ఆ రెండింటి పాలసీలకి తేడాలు ఏమిటో సమగ్రముగా ఆలోచించండి. 

కావలిస్తే ఆ సంస్థ టోల్ ఫ్రీ నంబర్ కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. 

చివరగా - మీకు ఆ పాలసీ నచ్చితే, ఆన్లైన్ లో పాలసీ చేసి, మీ ప్రీమియాన్ని చెక్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కట్టేయ్యండి. 

ఇలా ఆన్లైన్ లో పాలసీ చేసి, ప్రీమియం కడితే - మీరు కట్టే ప్రీమియం లో దాదాపు 35% వరకూ మిగులుతుంది. అవును. నిజమే!.. ఆ 35% లో మీరు సాంప్రదాయకముగా ఏజెంట్ వద్ద చేసే పాలసీ లో 15% వరకూ ఉంటుంది. ఇంకో 10% ఆపై ఏజెంట్ కీ, మరో 5% డెవెలప్మెంట్ అధికారికీ ఉంటుందని విన్నాను. ఇది ఒక ఏజెంట్ చెప్పాడు. (నిజమెంతో తెలీదు) మిగతా మిగిలిన మొత్తం ఆఫీస్ ఖర్చులకి కేటాయిస్తారు. 

ఈ ముప్పై శాతాన్ని ఇటు మీకు కాక, అటు ఆ ఇన్స్యూరన్స్ వారికీ కాకుండా మధ్యలో ఉన్నవారికి వెళుతుంది. అలా కాకుండా మీరు ఆన్లైన్ లో పాలసీ చేస్తే ఆ మొత్తం మీకే మిగిలిపోతుంది. మీరు చివరికి పొందేదానికన్నా ఈ మధ్యలోని వారి వాటానే ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తున్నది కదా.. ఇటు మీకూ, అటు ఆ ఇన్స్యూరన్స్ సంస్థకి కాకుండా మధ్యలోని వారికి వాటా పంచటం అవసరమా..? పాలసీ మొదట్లో అంటే ఓకే! పరిచయం చేశారు, సంస్థలోకి జాయిన్ చేశారు, ప్రీమియం కట్టేలా చేశారు.. ఇలాంటి కారణాల వల్ల ఓకే అనుకుందాం. ఆ తరవాత మీరు కట్టే ప్రతి ప్రీమియం లో వారికి వాటా ఇవ్వటం భావ్యమా?.. ఆ తరవాత వారి అవసరం అంతగా ఉండదు కూడా. అయినా వారికి కమీషన్లు ఇవ్వక తప్పదు కదా.. సరిగ్గా ఈ ఆలోచన వల్లే ఈ ఆన్లైన్ పాలసీలు వచ్చాయి. ఇందులో ఈ ఖర్చులు అంటూ ఏమే ఉండవు కనుక, అది వినియోగదారునికి మిగులుగా - ప్రీమియం తగ్గింపు చేస్తారు.  ఉదాహరణకి : మీరు రెండు లక్షల పాలసీ చేస్తే అరవై వేలు మిగులుతాయి. ఇంట్లోకి చాలా ఉపయోగపడే మొత్తం అది. కనుక ఈసారి పాలసీ చేసే ముందు, ఒకసారి ఆన్లైన్ లో ఒకసారి ప్రయత్నించి చూడండి.

ఇదంతా పాలసీ ఏజెంట్ల మీద ద్వేషముతో, వాళ్ళేదో మన దగ్గర నుండి అప్పనముగా తీసేసుకుంటున్నారని, వ్యక్తిగత కారణాల వల్లనో చెప్పాలని మాత్రం కాదు. ఒక ఉపయోగకర సమాచారం చెప్పాలని. అంతే!. 

Thursday, March 8, 2012

Wednesday, March 7, 2012

1,000,000 GBP

ఇలా మీకు మీ మొబైల్ కి మెస్సేజ్ వచ్చిందా..? దాన్ని చూసి ఎగిరి గంతేశారా?.. అయితే ఆ గంతులు వెయ్యటం ఆపండి. మీ నంబర్ కి ఉత్తి పుణ్యాన్నే పది లక్షల (1,000,000 GBP) బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్స్ రావు. మన భారత కరెన్సీ లోకి  మారిస్తే - 7,86,60,962.00 రూపాయలు అవుతుంది. ఈ ఏడు కోట్ల, ఎనభై ఆరు లక్షల రూపాయలు ఎవరైనా ఎందుకు ఇస్తారు... అవును ఎందుకు ఇస్తారు?.. 


ఎందుకు ఇస్తారంటే - అదొక ఎర. తేలికగా డబ్బు సంపాదించాలన్న ఆశ ఉన్నవారు ఇలాంటివాటికి బలయి పోతుంటారు. ఇలాంటి వాటికి రిప్లై ఇచ్చి, వారు అడిగినవన్నీ ఇస్తారు. 

హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక చిన్న పట్టణం లో మోటార్ వాహనాల టైర్స్ కి పంక్చర్స్ వేసుకుంటూ, జీవనం కొనసాగించే ఒకతనికి ఇలాంటి మెస్సేజ్ వచ్చింది. ఆనందముతో ఉబ్బి తబ్బిబ్బుయ్యాడు. ఆలోచించి, రిప్లై ఇచ్చాడు. వెంటనే అక్కడి నుండి జవాబు. "..డబ్బు పంపే ప్రాసెస్ ఖర్చుల కోసం అనీ INR 29, 600 ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ లో వేయమని చెబితే, అతను అలాగే చేశాడు.. ఆ తరవాత మళ్ళీ కొంత డబ్బులు (ఈసారి INR యాభై వేలకి పైగా) పంపమని మెస్సేజ్. ఇక మోసం అర్థం అయ్యింది. ఆ అకౌంట్ ఎక్కడ అని ఆరా తీస్తే - జమ్మూ కాశ్మీర్ లోని అకౌంట్ అది. నిండా మునిగాను అని అర్థం అయ్యి, లబోదిబోమని అన్నాడు. 

అందుకే ఇలాంటివాటికి రిప్లై ఇచ్చి, ఇటు డబ్బూ పోయి, అటు మానసిక వేదనతో బతుకును డీలా చేయవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. 

Tuesday, March 6, 2012

Monday, March 5, 2012

పూజా మందిరం.

ఈమధ్య ఒకరి గృహప్రవేశానికి వెళ్లాను. చాలా ఆధునికముగా కట్టుకున్నారు. ఆ ఇంట్లో నాకు మరింతగా నచ్చిన విషయం ఏమిటంటే - పూజా గది. పాలరాయితో కట్టించిన ఈ పూజా గది చాలా బాగుంది. రాజస్థానీ కళాకారులు చేసిన ఈ పూజామందిరం చూడముచ్చటగా, అందముగా, ఆకర్షణీయముగా ఉంది. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. వివరముగా చూడాలని అనుకుంటే ఫోటో మీద డబల్ క్లిక్ చెయ్యండి. మరింత వివరముగా చూడాలనుకుంటే - డౌన్లోడ్ చేసుకొని, జూమ్ చేసి చూడండి. నూతనముగా పూజామందిరం కట్టించుకునేవారికి కాసింత ఇన్ఫోగా ఉండాలని ఈ పోస్ట్ పెడుతున్నాను.


Sunday, March 4, 2012

Saturday, March 3, 2012

Ticker on Facebook.

మీ ఫేస్ బుక్ అకౌంట్ నుండి మీ మితృల పేజీల్లోకి వెళ్ళకుండా - మీ పేజీ నుండే మీ ఫ్రెండ్స్ లిస్టు లోని మీ మిత్రులందరూ - ఏమేమి లైక్ చేస్తున్నారు, ఏయే ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారు, వెతికి కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి అన్ని అప్డేట్స్ మీ హోం పేజీ నుండే చూడాలని అనుకుంటున్నారా?..  అయితే ఓకే!. అది చాలా ఈజీ.. ఈ క్రింది పద్ధతులని పాటించండి. 

1. ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చెయ్యండి. అక్కడ Facebook ని నొక్కండి. అక్కడ ఉన్న 1 వద్ద చూపిన వద్ద నున్న గుర్తు వద్ద కర్సర్ ని ఉంచి, నొక్కండి. 


2. ఇప్పుడు 2 వద్ద కనిపించేలా మారుతుంది టిక్కర్. ఆ టిక్కర్ బాక్స్ లో మీ స్నేహితులు చేస్తున్న అప్డేట్స్ అన్నీ అందులో కనిపిస్తుంటాయి.. కాస్త ఆలస్యముగా. మీ స్నేహితులు ఏమేమి చేస్తున్నారో, అక్కడ ఒక్క వాక్యములో కనిపిస్తుంది. ఆ లైన్ మీద మీ మౌస్ కర్సర్ చేతి గుర్తుని 3 లా ఉంచితే, కాస్త ప్రక్కగా ఒక విండో ఓపెన్ 4 లా ఓపెన్ అవుతుంది. అందులో ఏమేమి అప్డేట్ చేశారో తెలుసుకోవచ్చును. అక్కడే 5 వద్ద తన స్నేహితుల కామెంట్స్, లైక్స్ చూడవచ్చును. అలాగే మీ కామెంట్ కూడా అక్కడే పోస్ట్ చేయ్యోచ్చును కూడా.. 


Friday, March 2, 2012

Thursday, March 1, 2012

Related Posts with Thumbnails