Showing posts with label Good Morning. Show all posts
Showing posts with label Good Morning. Show all posts

Saturday, May 2, 2020

Good Morning - 776


ప్రతి గమ్యాన్ని చేరుకోవడంలోనూ 
"నేను కష్టపడుతున్నాను.." అనే ఫీలింగ్ 
ఉన్నవాడు జీవితంలో నెంబర్ వన్ కాలేడు..





Thursday, April 30, 2020

Good Morning - 775


మీ అంతట మీరుగా ఎదగాలి. 
ఎవరూ మీకు బోధించలేరు. 
మీ అంతరాత్మకు మించిన గురువు మరెవరూ లేరు. 







Wednesday, April 29, 2020

Good Morning - 773


ప్రపంచములో లెక్కలేనన్ని పుస్తకాలు ఉన్నాయి. 
జీవితకాలంలో మనకున్న సమయం తక్కువ. 
అందువల్ల అవసరమైనవి ఒంట పట్టించుకోవడమే జ్ఞానం. 








Wednesday, October 30, 2019

Good Morning - 774


మన ఆలోచనలు ఎపుడూ గొప్పగా ఉండాలి. వాటి వ్యక్తీకరణ మాత్రం తేలికగా అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. 







Sunday, August 18, 2019

Good Morning - 772


గొప్ప శక్తి అనేది గొప్ప బాధ్యత నుండి పుడుతుంది. 




Thursday, August 15, 2019

Good Morning - 771


జీవితాన్ని ఆనందముగా గడపాలి. 
అదే సమయంలో పదిమందికీ ఉపయోగపడే మంచి పనిని చెయ్యాలి. 




Monday, August 12, 2019

Good Morning - 770


ఎవరైనా నవ్వితే నీవల్ల నవ్వాలి కానీ నిన్ను చూసి, నవ్వకూడదు. 
ఎవరైనా ఏడిస్తే నీకోసం ఏడవాలి గానీ నీవల్ల ఏడవకూడదు. 






Wednesday, July 24, 2019

Good Morning - 769


మనస్పూర్థిగా పని చెయ్యని వారు - 
జీవితాన విజయం సాధించలేరు. 




Friday, July 12, 2019

Good Morning - 768



నీ తప్పు లేకున్నా, నిన్ను బాధ పెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోనేంత శక్తి లేకున్నపుడు - కాలమే నీ బదులు వారిని శిక్షిస్తుంది. 

Wednesday, May 15, 2019

Good Morning - 767


డబ్బు పోతే - ఫర్వాలేదు, 
ఆరోగ్యం చెడితే - ఇబ్బంది. 
కానీ నైతిక విలువలు కోల్పోతే - అన్నీ కోల్పోయినట్లే.. !! 




Friday, May 10, 2019

Good Morning - 766


మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు.. 
కానీ ఏ పని చెయ్యకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము. 





Thursday, May 9, 2019

Good Morning - 765


మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని పంచుకోవానికి ఒక నిండు హృదయం కావాలి. 
మనం బాధపడుతున్నప్పుడు మనం వాలడానికి ఒక భుజం కావాలి. 
అప్పుడే జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. 





Sunday, May 5, 2019

Good Morning - 764


మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చును., కానీ ఏ పని చెయ్యకుండా ఆనందాన్ని పొందలేము. 

అవును.. మనం రోజువారీ చేసే పనుల్లో ఆనందం ఉండకపోవచ్చు.. కారణం - చేసిన పనిని పదేపదే చేస్తుండటం వల్ల ఒక విధమైన నిర్వేదనకి గురి కావొచ్చు.. దానివల్ల చేస్తున్న పని పట్ల అంతగా అంకితభావం చూపెట్టలెం. పలితంగా ఆ పనిలో ఆనందం అంతగా దొరకకపోవచ్చు. కానీ - ఆ పనే అని కాదు.. అసలు ఏ పనీ చెయ్యకుండా సోమరిగా ఉంటూ ఆనందాన్ని పొందగలుగుతాం అనుకోవడం వెర్రి భ్రమ. 



Thursday, May 2, 2019

Good Morning - 763


ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కోకుండా జీవితంలో గెలుపొందినవారు ఏ ఒక్కరూ లేరు. 




Tuesday, April 30, 2019

Good Morning - 762


ఇతరులకు మనం మేలు చేసి, దానిని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు.. 
మనకు మేలు చేసినవారిని ఎప్పుడు మరచిపోవద్దు. 








Monday, April 29, 2019

Good Morning - 761


ఎప్పుడూ బాధపడుతుంటే - బ్రతుకు భయపెడుతుంది.. 
అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే - జీవితం తలవంచుతుంది. 





Sunday, April 28, 2019

Good Morning - 760


కొన్నిసార్లు మనం పరిస్థితులకి తలొగ్గాల్సి వస్తుంది. 
అంత మాత్రాన లొంగిపోయినట్లు కాదు.. 



Monday, April 15, 2019

Good Morning - 759


విజేత అంటే - ఏ రంగంలోనైనా అత్యంత క్లిష్ట పరిస్థుతులను ఎదుర్కొని నిలబడ్డవాడు. 




Sunday, April 14, 2019

Good Morning - 758


ఒక చిన్ని చిరునవ్వు ఎందరినో మీ స్నేహితులని చేస్తుంది. 
కానీ క్షణికమైన కోపం ఎందరినో శత్రువులని ఇస్తుంది. 
కనుక మీ విలువైన జీవితాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చిరునవ్వుతో ఆస్వాదించండి.  

అవును.. మన మొహం మీదున్న చిన్న చిరునవ్వు ఎదుటివారిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. క్రొత్తవారు కూడా మనకు స్నేహితులయ్యేలా చిరునవ్వు చేస్తుంది. కానీ కోపం మాత్రం మనకి ఎందరినో శత్రువులని ఇస్తుంది. ఫలితంగా మనకి మనం అనేకానేక చిక్కులను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకే మన  విలువైన ఈ జీవితాన్ని - ఆనందముతో సాగిపోయేలా - చిరునవ్వు ముఖంతో పలకరించండి. ఈ చిన్ని చర్య వలన జీవితం మరెంతో అందముగా, ఆనందముగా, అద్భుతంగా ఉంటుంది. 




Sunday, March 31, 2019

Good Morning - 757


ప్రేమ విశ్వజననీనమైంది. 
అదొక అద్భుత భావన. 
అమృతధార. 
రెండు హృదయాలు ఒకటై ఆలపించే సుమనోహర రాగం. 



Related Posts with Thumbnails