Tuesday, September 29, 2009

దసరా - శమీ చెట్టు, పాల పిట్ట.ఇది పాల పిట్ట!.. దసరా రోజున ఈ పిట్టను చూడాలి అని నానుడి. కనబడితే అదృష్టం కలిసి వస్తుందని ఆనుకునేవాళ్ళు. నేను చిన్నప్పుడు దసరా రోజున ఊరిబయటకి వెళ్ళితే స్వేచ్ఛగా కనపడేది.. నీకెన్ని కనపడ్డాయి, నాకెన్ని కనపడ్డాయి.. అంటూ ఓ ట్రెండు రోజులదాకా చర్చించుకునేవాళ్ళం. ఆ పిట్ట కనిపిస్తే చప్పట్లు కొట్టి ఇతరులు చూసేలా చేసెడివారు. కనీసం రెండు మూడు పిట్టలైనా చూసేవాళ్ళము. ఇప్పుడు క్రాంక్రీటు కీకారణ్యాలు వచ్చాక ఇలా పంజరాల్లో తప్ప బయట చూడలేము! ఇంకొద్ది రోజులయ్యాక ఇదీ చూస్తామో లేమో!

తెలంగాణా జిల్లాల్లో పాలపిట్టకి ఎంతో ప్రాధాన్యత ఉంది. చూడడానికి పిడికెడు అంతగా ఉండే ఈ పాలపిట్ట సాధారణముగా పొలాల్లో కనపడుతూ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే దసరా రోజున కనపడటం చాలా కష్టం. విజయదశమి రోజున ఈ పిట్ట కనిపిస్తే విజయం సిద్ధిస్తుందని చాలా నమ్మకం. దీనికోసం చిన్నా, పెద్దా అంటూ తేడా లేకుండా చెట్టూ, పుట్టా గాలిస్తారు.. ఈ పిట్ట కనిపిస్తే తాము ధరించిన చెప్పులు వదిలి ఆ పిట్ట వంక చూస్తూ మ్రొక్కుతారు. ఇంత విలువ దీనికేందుకు అంటే - పాండవులు తమ అరణ్య, అజ్ఞాత వాసాలు ముగించుకొని రాజ్యానికి వస్తుండగా ఈ పాలపిట్ట కనపడింది - ట. అప్పటినుండి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం. దసరా రోజున ఒకరికొకరు ఆలింగనం చేసుకొని, జమ్మి ఆకులతో బాటుగా క్రొత్తగా వచ్చిన ధాన్యం కంకులను పెద్దల చేతుల్లో పెట్టి వారికి పాదాభివందనం చేస్తారు. ఆశీస్సులు తీసుకుంటారు. దేవాలయాలను కూడా దర్శిస్తారు..శమీ చెట్టు! చింతచెట్టులాగా ఉంటుంది.. కాని గులాబీ కొమ్మలకు ఉన్నట్లు ముల్లులుతో ఉంటుంది..పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసినప్పుడు విజయదశమి రోజున - ఈ చెట్టుపైనే తమ ఆయుధాలను దాచిపెట్టారు.. అందుకే విజయదశమి రోజున ఈ చెట్టుకి మోకరిల్లటం!.. దసరారోజున ఈ చెట్టు ఆకులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవటం, ఆలింగానాలు చేసుకొని, శుభాకాంక్షలు చెప్పుకోవటం కూడా ఒక సాంప్రదాయం. ఈ ఆకులను "బంగారు ఆకులు" అని కూడా అంటారు. తెలంగాణా జిల్లాల్లో బంగారం గా పిలుచుకుంటారు..

పాండవులు - ఆయుధాలు అనే కథనే కాకుండా ఇంకో కథ కూడా ఉంది. అదేమిటంటే - పూర్వకాలములో కౌత్సకుడు అనే విద్యార్థి వరతంతు అనే అనే గురువు వద్ద అన్ని విద్యలూ నేర్చుకుంటాడు. చివర్లో గురుదక్షిణ ఇస్తానని పట్టుపడతాడు. వద్దు వద్దు అని ఎంత చెప్పినా ఆ విద్యార్థి వినకపోవటముతో, అలా గయితే నాకు 14 కోట్ల బంగారు నాణేలు గురుదక్షిణగా ఇవ్వమంటాడు ఆ గురువు. ఆందుకోసం అతడు అయోధ్య రాజు శ్రీరాముని పూర్వికుడైన రఘురాజు ని సంప్రదిస్తాడు. ఆ రాజు వద్దకూడా అంత డబ్బు లేక ఆ రాజు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాడు. ఆ ఇంద్రుడు కుబేరుడి వద్దకి పంపుతాడు. అప్పుడు ఆ కుబేరుడు అయోధ్యలోని శమీవృక్షం నుండి బంగారు నాణేలని కురిపిస్తాడు. వాటిలోంచి గురుదక్షిణ ఇవ్వగా మిగిలిన నాణేలని ప్రజలకి, ఈ శుక్ల దశమి రోజున ఆ కౌత్సకుడు పంచేస్తాడు. అందుకే ఆ ఆకులని దాచుకుంటే సంపద వృద్ధి చెందుతుందని అనే నమ్మకం స్థిరపడిపోయింది.

Wednesday, September 23, 2009

హలో కి బదులుగా..

అలెగ్జాండర్ గ్రాహంబెల్ కనిపెట్టిన టెలిఫోన్ వెన్నెన్నో వయ్యారాలు పోతూ ఏనాడో అరచేతిలో ఒదిగిపోయింది.. ఈ నానో యుగములో - అంతకన్నా మరింతచిన్నగా అవబోతున్నది.. మనలో చాలామందికి టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి.. వాటిని ప్రతిదినమూ వాడుతున్నాము కూడా.. ఫోన్ లేని జీవితాన్ని ఊహించడానికే కష్టము.. ఇంతగా మనతో మమేకము అయిపోయిన ఈ ఫోన్ వాడకములో మీకు మరిన్ని మెలకువలు ఇప్పుడు చెప్పబోతున్నాను.. అందులో మీకిష్ట మైన వాటిని ఆచరించుకోవచ్చును..

1. మీ ఫోనులో ఎక్కువ నంబర్లు పట్టేలా ఉన్న (మొబైల్) ఫోన్ ని వాడండి. క్రొత్తగా వచ్చే ఫోన్ లలో ఉండే మెమొరీ లో ఒక వేయి ఫోన్ నంబర్లు వరకూ ఫీడ్ చేసుకోవచ్చును. ఇలాని సౌకర్యం కల ఫోన్ లతో మనం చేయవలసిన ఫోన్ నంబర్లు / కావలిసిన నంబర్లు అన్నీ మనవద్దె ఉంటాయి.

2. మనకి కావలసిన ముఖ్యమైన ఫోన్ నంబర్లని సిమ్ కార్డులో కాపీ చేసుకోవాలి. ఎప్పుడైనా వేరే ఫోన్ యూనిట్ వాడితే ఈ సిమ్ వేసినప్పుడు వెంటనే ఈ ముఖ్యమైన నంబర్లు అందుబాటులో ఉంటాయి.

3. సిమ్ కార్డు లోని నంబర్లు అన్నీ కాపీ చేసుకున్నామని నిర్లక్ష్యం వద్దు. ఒకవేళ మన ఖర్మకాలి సిమ్ బ్లాక్ అయితే ఇబ్బంది. ఎందుకైనా మంచిది - ఒక డైరీలో ఫోన్నంబర్లు అన్నింటిని వ్రాసుకోవడం మంచిది.

4. సిమ్ ఫోన్ బుక్ లోని నంబర్లు అన్నీ ఫోన్ లోని మెమరీ కార్డులోకి కాపీ చేసి.. తరవాత కంప్యూటర్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోకి USB డాటా కేబుల్ ద్వారా కాపీ చేసి భద్రపరచుకోవాలి. ఎపుడైనా మీ ఫోన్ పోతే.. క్రొత్త ఫోన్ కొన్నప్పుడు అన్ని నంబర్లు లనీ మళ్ళీ కష్టపడి టైపు చేయకుండా, సింపుల్గా ఈ ఫోల్డర్ నుండి USB ద్వారా కాపీ చేసుకుంటే చాలు. (ఫోల్డర్ ; మెమరీ కార్డు ; ఫోన్ బుక్ ; సిమ్ కార్డు). కొన్ని మొబైల్ సంస్థలు మీ సిమ్ లోని నంబర్లు అన్నీ కాపీ చేసి భద్రపరిచే సౌకర్యాన్ని కల్పించాయి, కాని నెలకు 30 రూపాయల చేతి చమురు వదిలిపోతుంది. నెలకే అంత అయితే సంవత్సరానికి 360 రూపాయలే! వామ్మో!! అంత అవసరమా!

5. మొబ్లె షాపులలో మీకు బాగా తెలిసిన షాపులోకి వెళ్లి పాతది పడేసిన సిమ్ కానీ, యాక్టివేషన్ కాకుండానే గడువు ముగిసిన సిమ్ (అమ్మకుండా మిగిలినది) అడిగి తీసుకోండి. దాన్ని మీ మొబైల్ లో వేస్తే "sim rejected" అని వస్తుంది. ఆ విషయం పట్టించుకోకుండా ఫోన్ బుక్ ఓపెన్ చేసి, ఫోన్ బుక్ లోని పేర్లన్నీ ఆ సిమ్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఆ తరవాత ఆ సిమ్ ని భద్రముగా దాచుకోవచ్చు. ఎప్పుడైనా క్రొత్త ఫోన్ కొంటే ఈ సిమ్ వేసి పేర్లన్నీ ఫోన్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఇది చాలా తేలికగా ఉంది కదూ!

6. ఫోన్ రింగ్ అవగానే వెంటనే ఫోన్ ఎత్తకండి. అది ఏ నంబర్ నుండి వచ్చిందో చూడటం, రెండు , మూడు రింగులయ్యాక ఫోన్ ఎత్తడం కూడా అలవాటు చేసుకోండి. ఏదైనా అర్జెంట్ / మీరు ఎదురుచూస్తున్న కాల్ అయితే పరవాలేదు కాని నంబర్ చూసాక రెసీవ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఫోన్ చేస్తున్నది ఎవరో, కారణం ఏమి ఉంటుందో కాస్త అంచనాకి రావచ్చును అంతలోగా.. మీరు ఇబ్బందితో ఏదైనా నిర్ణయం తీసుకోవలసివస్తే ఈ రెండు, మూడు రింగుల కాలాయాపన కారణం చూపి "నేను మీటింగ్ లో ఉన్నాను.. బయట ఉన్నాను.. ఒక అర్జెంట్ విషయమై వేరే సార్ తో.. " అంటూ ఏవో సాకులు చెప్పి తప్పించుకోవచ్చు..

7. ఫోన్ రింగ్ అవగానే ఎవరు కాల్ చేస్తున్నారో చూసి వారి పేరు ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి వారెవరో తెసుకొని "హలో" అని అనకుండా డైరెక్ట్ గా వారి పేరుతో వారిని పలకరించండి. ఉదాహరణకి సుబ్బారావ్ మీకు ఫోన్ చేసినట్లయితే - హలో అని అనకుండా "చెప్పండి సుబ్బారావు గారూ! మీరు చాలా కాలము తరవాత ఫోన్ చేసారు! ఏమిటీ సంగతీ!.." అంటూ వారి యోగక్షేమాలు గురించి మాట్లాడండి. అవతలి వ్యక్తి డంగై పోతాడు.. "ఇతను నన్నూ, ఇంతగా నా పేరు గుర్తుంచుకున్నాడా.. " కించిత్ హాశ్చర్య పడిపోతాడు కూడా! మిమ్మల్ని ఇంకా అభిమానిస్తాడు. చాలా మందికి వారికి ఇష్టమైన పిలుపు ఏమిటంటే - వారిని గుర్తుంచుకొని పేరుతో పిలవడం..

8. యోగ క్షేమాలు ఎక్కువగా అడగవద్దు! ఒకటి, రెండు ముక్కల్లో విషయం తేల్చేయ్యాలి చాలామంది తమ విషయాలు చాలా పర్సనల్ గా ఫీల్ అవుతారు.. వారు చెబితేనే వింటేనే బాగుంటుంది. గుచ్చి గుచ్చి అడిగితే మళ్ళీ మనకి ఫోన్ చెయ్యలేక పోవచ్చు..

9. మన దగ్గర ఎంత విలువైన ఫోన్ యూనిట్ ఉందని కాదు.. మనం దాన్ని ఎంతగా వాడుకుంటున్నామని చూడాలి. అంటే వేలకి వేలు పోసి High-end యూనిట్ కొనుక్కొని, అందులోని ఫీచర్స్ అర్థం కాక, ఎలా వాడాలో, జీవితములో వాడని వాటికి డబ్బులు పెట్టి కొనడం తెలివైన పని అనిపించుకోదు. ఉదాహరణకి: నాకు తెలిసిన ఒకతను 16 వేలు పెట్టి ఒక ఫోన్ కొన్నాడు. కాని అతడికి SMS పంపడం కూడా రాదు. 3.2 మేగాపిక్సేల్ కెమరాని కూడా వాడటం చాలా అరుదు. ఇక GPRS / ఇంటర్నెట్ అనేవి కలలో కూడా వాడడు. ఇలాంటివాడికి అంతటి ఫోన్ దండగే అనిపిస్తుంది కదూ! ఫోన్ యూనిట్ ని ఒక హోదా చిహ్నముగా భావించేవారిని చూసి నవ్వుకోండి. వాళ్లింకా పాత రాతి యుగములోనే ఉన్నందులకు జాలిపడండి. కాస్త పెట్టుబడి పెట్టి ఎక్కువగా లాభం పొందేవారిని చూసి నేర్చుకొనడములో సిగ్గుపడాల్సిన పనేమీ లేదు..

10. ప్రతి ఫోనులో కాల్ హిస్టరీ అంటూ ఉంటుంది. ఏ రోజున, ఏ సమయములో, ఎక్కడికి ఫోన్ చేసారో అందులో ఎప్పటికి అప్పుడు చేరుతూనే ఉంటుంది. అదికాకుండా మనకి వచ్చిన Missed calls, Recieved calls, Dailled calls ఇవి ఒక్కోదానికి 20 నంబర్లు వరకూ ఆడ్ అవుతాయి. 21 వస్తే మొదటిది ఆటోమాటిక్గా డిలిట్ అవుతుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు ఇప్పుడు చెబుతాను. ప్రతి రోజూ రాత్రి / మీకు వీలున్నప్పుడు ఈ లిస్టు అంతా చెక్ చేసుకోండి. అవతలివారు ఎప్పుడు, ఎందుకు కాల్ చేసారో తిరిగి ఒకసారి గుర్తుచేసుకోండి.. దాన్ని విశ్లేషించుకోండి.. అలా ఎవరు చేసారు, 
ఎందుకు చేసాడు, 
ఎప్పుడు చేసాడు, 
ఏమి అడిగాడు, 
నేనేమి చెప్పాను.. 
నేను అప్పుడు ఇంకా ఎలా మాట్లాడితే ఇంకా బాగుండేది?.. అని. ఇలా చేస్తే మానవ సంభంధాల విషయాల్లో మీరు బాగా ఎదుగుతారు. ఇంకో విషయం: ఆ కాల్ ఇక అవసరం లేదు అన్నప్పుడు డిలిట్ చేసేయండి. లేక అవతలివారికి ఏదైనా పని చెప్పి అది ఇంకా పెండింగ్ లో ఉంటే ఆ దేటైల్స్ ని అలాగే ఉంచేయండి. మళ్ళీ కాల్ చేసినప్పుడు ఆ సమయం, తేదీని వారికి చెప్పి గుర్తు చేయవచ్చు. అవతలి వ్యక్తితో ఆ పని ముగిసిన తరవాత డిలిట్ చెయ్యండి.

11. చాలామంది రాత్రిన పడుకునే ముందు ఫోన్ బ్యాటరీ చార్జింగ్ కి పెట్టి పడుకుంటారు! దానివలన బ్యాటరీ మన్నిక కాలం తక్కువ అవుతుంది. ఇలా చేయక పొద్దున్నే లేవగానే మీరు చార్జింగ్ కి పెట్టి, మిగతా కార్యక్రమాలు జరుపుకుంటే.. అంతలోగా చార్జింగ్ అయిపోతుంది. (ఇక్కడ మొబైల్ తయారీ కంపెనీల వారికి ఓ చిన్న సూచన: చార్జింగ్ పూర్తికాగానే చార్జింగ్ అయినట్లు రింగ్ అవుతే చాలా బాగుంటుంది.. దీనికి కొద్దిగా సాఫ్టువేరు మారిస్తే సరి..)

12. చార్జర్ లలో మొబైల్ తో ఇచ్చే అన్ని చార్జర్ లూ సరియైనవి ఉండవు. చాలా చార్జర్స్ 150mA, 300mA ఉంటాయి. కాని 500mA, 800mA చాలా ఫాస్టుగా చార్జింగ్ జరిగిపోతుంది. ఈ 800mA చార్జర్ ఒక మొబైల్ ఫోన్ బ్యాటరీని 40 నిముషాల్లో ఫుల్ చార్జింగ్ ని చేస్తుంది.

13. మీది ఫోన్ ఏదున్నా, చార్జర్ ఏదున్నా chengeover charger pins అంటూ మొబైల్ షాపుల్లో దొరుకుతాయి. అది ఒకటి కొనుక్కొని జేబులో వేసుకొని ఉంచుకుంటే ఎక్కడైనా చార్జింగ్ చేసుకోవచ్చు..

14. ఎవరైనా కొత్తవాళ్ళు ఫోన్ చేస్తే, వారితో మాట్లాడాక వారు మనతో మళ్ళీ ఫోన్ చేస్తారని అనిపిస్తే, ఆ నంబర్ ని సేవ్ చెయ్యండి. వారి పేరు లేదా వృత్తి లేదా ఊరు లేదా పని.. వీలయితే వారి ఫోటో తీసి, ఆ ఫోటోని ఈ నంబర్ కి కలిపితే.. ఆ నంబర్ గల వ్యక్తి మనకి ఫోన్ చేసినప్పుడు మొబైల్ స్క్రీన్ పైన తన ఫోటో వస్తుంది. అప్పడు ఈజీగా తనని గుర్తించవచ్చు..

15. మనం ఎప్పుడూ ఫోన్ చేసే నంబర్లని స్పీడ్ డయల్ లో పెట్టుకోవాలి. ఇందులో కీ బోర్డ్ లోని 2 - 9 వరకు నంబర్లని ఈ స్పీడ్ డయల్ నంబర్లు గా పెట్టుకోవచ్చు. ఉదాహరణకి 5వ నంబర్ ని ఇంటివారికి ఎన్నుకొని ఉంటే - ఈ 5వ నంబర్ ని నొక్కి, తరవాత డయల్ కీ నొక్కితే సరి.. వారికి ఫోన్ కలుస్తుంది. మొత్తం నంబర్ టైపు చేయాల్సిన అవసరం లేకుండా తేలికగా లైను కలుస్తుందికదూ!!!! .. 

last updated on 5-October-2009 10:00am.

Tuesday, September 22, 2009

Nee navvu cheppindi naatho.. Antham


చిత్రం: అంతం (1990)
సంగీతం: R.D.బర్మన్
గానం: S.P.బాలు
*************
పల్లవి:
నీ నవ్వు చెప్పింది నాతో - నేనెవ్వరో ఏమిటో!
నీ నీడ చూపింది నాలో - ఇన్నాళ్ళ లోటేమిటో.. (2)
ఓ ఓ ల ల లా లా - ఓ ఓ ల ల లా లా....

చరణం 1:
నాకై చాచిన నీ చేతిలో - చదివాను నా నిన్ననీ (2)
నాతో సాగిన నీ అడుగులో - చూసాను మన రేపునీ
పంచేందుకే ఒకరు లేని - బతుకెంత బరువో అనీ
ఏ తోడుకి నోచుకోని - నడకేంతో అలుపో అనీ..

చరణం 2:
నల్లని నీ కనుపాపలలో - ఉదయాలు కనిపించనీ (2)
వెన్నెల పేరే వినిపించనీ - నడిరేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వు - ఇలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన - తొలి ముగ్గు పెడుతుందనీ..

చరణం 3:
ఏనాడైతే ఈ జీవితం - రెట్టింపు బరువెక్కునో.. (2)
తనువూ మనసూ చెరి సగమని - పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం - సంపూర్ణ మైయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం - పొందేటి బంధాలతో..
ఓ ఓ ల ల లా లా... ఓ ఓ ల ల లా లా

నీ నవ్వు చెప్పింది నాతో - నేనెవ్వరో ఏమిటో!
నీ నీడ చూపింది నాలో - ఇన్నాళ్ళ.. లోటేమిటో..!!

Monday, September 21, 2009

క్రొత్త చెప్పులు, మన్నిక - ఒక ఐడియా.

ఇకనుండీ విషయ పరిచయం నుండి సుత్తి కొట్టక అసలు విషయం కి వద్దామని అనుకుంటున్నాను!

ఎందుకంటే కొంత ఇంట్రో అవ్వాలి - క్రొత్త చెప్పులు, మన్నిక, నిర్వహణ, మెళకువలూ.. ఇవన్నీ చెప్పి బోరు కొట్టకుండా నేరుగా నేను చెప్పాలనుకున్న విషయానికి వస్తాను. (మన్నించాలి.. ఇలా దీర్ఘముగా చెపితే బోరూ, టైపు చెయ్యటానికి శ్రమా, కాల ప్రయాస.. నిరీక్షణలు తప్పుతాయని అనిపించి, దీనివలన క్రొత్త టపాలు తొందరగా పెట్టవచ్చనీ నా ఆశ.)

సాధారణముగా మన పాదరక్షణ కోసమనీ వందల్లో ఖర్చు చేసి, మన పాదాలకి రక్షణనే కాకుండా అందానిచ్చే, సరియైన సైజులో పాదరక్షలని మనము కొంటూ ఉంటాముగా.. అంత ఇష్టపడి కొన్న చెప్పులు సహజముగానే ఎక్కువ కాలము మన్నికని ఇవ్వాలని అనుకుంటాముగా.. ఆ చెప్పుల వెల కన్నా ఇంకో పది రూపాయలు కేటాయించుకోండి. కొన్న చెప్పులతో బాటుగా దారిలో "సూపర్ గ్లూ" పాకేట్లు రెండు కొనండి. [pidilite కంపనీ వారి Feviquick Rs. 5/- లవి రెండు కొంటె సరిపోతుంది.. ఎకనామీ కావాలంటే కాస్త పెద్ద ప్యాక్ ఒకటి కొనండి. సాంకేతిక నామం: Cyanoacrylate adhesive ]

ఇంటికి వచ్చేసారా.. ఇక ఈ పద్ధతులని అనుసరించండి:

1. మీ క్రొత్త చెప్పులను వాటి బాక్స్ నుండి బయటకి తీయండి.

2. Feviquick ప్యాకెట్ ని విప్పి, వాడుటకై రంధ్రమును చేసి సిద్ధముగా ఉంచుకోండి.

3. దీన్ని మీ క్రొత్త చెప్పుల జాయింట్ల వద్ద ఒక్కో చుక్కగా పోయండి. (బేస్ మరియు కప్పుల జాయింట్ల వద్ద)

4. ఇలా రెండు చెప్పులకీ / జతకీ పోయండి..

5. ఒకటి, రెండు నిముషాలు ఆరనివ్వండి ( చలికాలము అయితే ఇంకా ఆలస్యము అవుతుందని గుర్తుపెట్టుకోండి)

6. బాగాఆరిపోయాక ఇంకేం మీ క్రొత్త చెప్పులను శుభ్రముగా వాడుకోండి.

ఇలా అయితే మీ చెప్పులు రెట్టింపు కాలము మన్నికని ఇస్తాయి. మగువల చెప్పులకైతే ఇది చాలా ఉత్తమమైన ఆలోచన. వారి నూడుల్ స్త్రాపుల్లాంటి పట్టీలకి మరింత ధృడత్వాన్ని ఇది ఇస్తుంది. మగవారి షూ లకైననూ ఇది సరియైన ఎంపిక. దారిలో తెగిన చెప్పులకి, తగిన రిపేర్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది..(ఈ పోస్ట్ రాసాక రెండురోజులకి నేను హైదరాబాద్ లోన ఆటోలో వెళ్ళాల్సివచ్చింది. అక్కడ ఆటో మాట్లాడుకొని పోతుండగా - దారిలో ఇలా ఒక తెగిన చెప్పు వద్దే పెట్రోల్ కని ఆపాడు. నేను రాయటమేమిటి? రెండురోజులకే ఇలా ఫోటో పెట్టుకోవటానికి తెగిన చెప్పు కనపడటమేమిటి? అంతా విచిత్రముగా ఉంది.. ముందు అతుకు ఊడింది కాబట్టి అలా వదిలి వెళ్లిపోయారు.. అప్పటికైనా దాన్ని లోపలికి నెట్టి ఒక చుక్క "సూపర్ గ్లూ" వేస్తే శుభ్రముగా వాడుకోవచ్చుగా.. 100-150 రూపాయలు మిగిలిపోయేవిగా..)

Saturday, September 19, 2009

ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల...
ఇప్పుడు నేను రాస్తున్న గేయ రచన సినిమా పాట కాదు.. భారతదేశము లోని ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా అయిన కరీంనగర్ లోని గోదావరిఖని పట్టణంలో ఉంటున్న "మధుప్రియ" అనే చిన్నారి తనకు తానుగా రాసుకొని, పాడిన పాట ఇది. ఈ పాటలోని అర్థము మనల్ని జీవితకాలం వెంటాడుతుందా! అన్నట్లుగా ఉంటుంది అనడములో ఏమాత్రం అతియోశక్తి లేదు. ఈ పాట పాడిన పాప గొంతులోని జీర, పిచ్, హై పిచ్నెస్.. మనల్ని ఈ పాటని అంత తొందరగా మరచిపోనీయవు..

గేయ రచన:
ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా..
ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా
నీవు దిగులు చెందకమ్మా..

చరణం 1:
అష్టమిలొ పుట్టాననీ అమ్మా జెష్టదాన్నంటున్నరా
ఈ పాడు లోకములొ అమ్మా హీనంగ చూస్తున్నరా
ఆడదని అంటున్నరా అమ్మా పాడు అని తిడుతున్నరా
అష్టమిలొ పుట్టిన క్రిష్ణుడ్నేమో దేవుడని అంటున్నరా
నన్నేమో పాడుదని తిడుతున్నరా..
//ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా//

చరణం 2:
పలక బలపం బట్టి అమ్మా బడికీ పోతుంటే
ఆడపిల్లయినందుకు అమ్మా సదువెందుకంటున్నరా
సదువెందుకంటున్నరా అమ్మా సందెందుకంటున్నరా
సదువుల తల్లీ సరస్వతి ఆడదె కదమ్మా
నాకేమో సదువెందుకంటున్నరా
//ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా//

చరణం 3:
ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా
లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తాననీ
కడుపులోనె ఆడబిడ్డంటె అమ్మా కరగదీస్తున్నరా
ఆడబిడలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది
రేపేమో జగతికి మార్గమేదీ

ఆడపిల్లనమ్మా నే ఆడపిల్లన్నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా..
బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా.. బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా..

Friday, September 18, 2009

Tolisaari mimmalni - Srivariki premalekha


చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం: రమేష్ నాయుడు.
పాడిన వారు: S. జానకి.
రచన: వేటూరి సుందర రామమూర్తి.
అభినయం: నరేష్, పూర్ణిమ
****************
సాకీ:
శ్రీమన్ మహారాజ - మార్తాండ తేజా
త్రియానంద భోజా - మీ శ్రీచరణాంభోజములకు
ప్రేమతో నమస్కరించి.. మిము వరించి..
మీ గురించి ఎన్నో కలలు గన్న - కన్నె బంగారూ
భయముతో.. భక్తితో - అనురక్తితో
సాయంగల విన్నపములూ!
సంధ్యారాగం చంద్రహారతి - పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి - పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన..

పల్లవి:
తొలిసారి మిమ్మల్ని చూసింది - మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ
జో అచ్యుతానంద జో జో - ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా - జో జో

చరణం 1:
నిదుర పోని కనుపాపలకు - జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న - ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా.. ఈ ప్రేమ లేఖ! //తొలిసారి మిమ్మల్ని//

చరణం 2:
ఏ తల్లి కుమారులో - తెలియదు గాని
ఎంతటి సుకుమారులో - తెలుసు నాకూ
ఎంతటి మగధీరులో - తెలియలేదు గాని
నా మనసును దోచిన - చోరులు మీరూ
వలచి వచ్చిన వనితను - చులకన చేయక
తప్పులుంటే మన్నించి - ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండీ.. చప్పున బదులివ్వండి! //తొలిసారి మిమ్మల్ని //

చరణం 3:
తలలోన తురుముకున్న - తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో - మంటలు రేపే.. ఆహ్! అబ్బా!!
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి - మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే.. ఆహ్! ఆహ్!!
మీ జతనే కోరుకుని లతలాగా - అల్లుకునే
నాకు మీరు మనసిస్తే - ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండీ.. ఇప్పుడే బదులివ్వండి! // తొలిసారి మిమ్మల్ని//

Tuesday, September 15, 2009

Thota ramudu - O bangaru rangula chilukaa


చిత్రం: తోట రాముడు.
అభినయం చేసినవారు: చలం, ---.
************************
పల్లవి:
ఓ బంగరు రంగుల చిలకా పలకవే వే..
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ!
నా మీద ప్రేమే ఉందనీ - నా పైన అలకే లేదనీ
ఈ ఈ ఓ అల్లరి చూపుల రాజా పలకవా..

ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ..
నా మీద ప్రేమే ఉందనీ - నాపైన అలకే లేదనీ..

చరణం 1:
పంజరాన్ని దాటుకునీ - బంధనాలు తెంచుకునీ
నీ కోసం వచ్చా ఆశతో..
మేడలోని చిలకమ్మా - మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే.. నీ చేరువలో,
నీ చేతులలో - పులకించేటందుకే.. //ఓ బంగరు రంగుల చిలకా//

చరణం 2:
సన్నజాజి తీగుంది - తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే..
కొంటె తుమ్మెదొచ్చింది - జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే..
ఈ కొండల్లో, ఈ కోనల్లో - మనకెదురే లేదులే లే లే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా -
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ - నా పైన అలకే లేదనీ

Saturday, September 12, 2009

Aaru - Chudodde nanu chudodde


చిత్రం: ఆరు (2005)
రచన: చంద్రబోస్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: టిప్పు, సుమంగళి
అభినయించిన వారు: త్రిష, సూర్య.
***************
పల్లవి:


చూడోద్దె నను చూడోద్దె - చురకత్తిలాగా నను చూడద్దె
వేల్లోద్దె వదిలేల్లోద్దె - మది గూడు దాటి వేదిలేల్లోద్దె
అప్పుడు పంచిన నీ మనసే - అప్పని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దె // చూడోద్దె //

చరణం 1 :


వద్దు వద్దంటూ నేనున్న - వయసే గిల్లింది నువ్వేగా
పో పో పోమ్మంటూ నేనున్న - పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న హృదయాన్ని - లాగింది నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికి - రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం నువ్వై నిలిచావే // చూడోద్దె //

చరణం 2:


వద్దు వద్దంటూ నువ్వున్నా - వలపే పుట్టింది
నీపైనా కాదు కాదంటూ నువ్వున్నా - కడలే పొంగింది
నాలోన కన్నీళ్ళ తీరంలో - పడవల్లె నిలిచున్నా
సుడి గుండాల శ్రుతిలయలో - వెలుగే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో - మెరుపే కలుగునులే
ఒంటిగ తిరిగిన ఇద్దరిలో - ప్రేమే పెరుగునులే // చూడోద్దె //
Related Posts with Thumbnails