Thursday, August 27, 2015

పొడుపు కథలు - 6


ఎన్నో భాషలను వినిపిస్తుంది. 
కానీ నోరు లేదు.. 
గంట కొట్టి పిలుస్తుంది. 
కానీ చేతుల్లేవు.. ఏమిటదీ..?
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు :


Tuesday, August 25, 2015

ఉల్లి తిప్పలు

మార్కెట్ నుండి ఉల్లి గడ్డలు కొనుక్కొని వచ్చేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు : ( పెరిగిన ఉల్లిధరకు కామెడీగా వ్రాశాను )

1. తోడుగా ఒకరిని వెంటపెట్టుకొని పోవడం. అవసరమైతే ఒక సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేసుకోవాలి. 

2. కొన్న తర్వాత జాగ్రత్తగా సంచి పట్టుకోవడం చాలామంచిది. 

3. ఎవరైన అపరిచిత వ్యక్తి మీ సంచిలోనుంచి ఉల్లిగడ్డ పడిపోయింది అని మీ దృష్టి మరల్చి మీ ఉల్లిగడ్డల సంచి ఎత్తుకపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. 

4. అంగడిలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దు. ఎంత కొంటున్నామో అసలే లీక్ చేయవద్దు.

5. ఉల్లి గడ్డలు కొనడానికి వెళ్ళే ముందు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి..! 

6. ఉల్లిగడ్డలు దారిలో పడి ఉన్నాయని వాటిని అందుకోవడానికి ప్రయత్నించవద్దు.. అలా చేస్తే మీరు దోపిడీకి గురి కావొచ్చును. 

7. మాదగ్గర ఇన్ని కిలోల ఉల్లిగడ్డలు ఉన్నాయని గొప్పలకి చెప్పకండి. ఎవరైనా వింటే - అవి వెంటనే దోపిడీకి గురి కావొచ్చును. 

8. ఇంట్లో వాటిని ఒక CC కెమరా నిఘాలో ఉంచండి. ఎవరైనా దొంగతనం చేస్తే - సాక్ష్యాధారాలతో కేసు పెట్టవచ్చు. 

9. ఎన్ని కిలోల ఉల్లిగడ్డలు కొన్నా - నరదృష్టి తప్పించుకోవడానికి వాటిపైన మిగతా కూరగాయలు, ఆకు కూరలు కప్పండి. 

10. ఎక్కువగా ఒకేసారి ఉల్లిగడ్డలు కొనకండి. అలా చేస్తే మీరు ఇన్కంటాక్స్ వారి నోటీసులని ఎదురుకొనే ప్రమాదం ఉంది. 

11. ఫంక్షన్లలోని వంటకాలు అన్నీ ఉల్లితో చేసినవని - ఆహ్వాన పత్రాల్లో అచ్చు వేయించి, మీ హోదాని చూపండి. 

12. మీ ఇంట్లో ఉల్లిగడ్డలు ఎక్కడ పెట్టారంటూ వచ్చే మెయిల్స్ కి బదులివ్వకండి. ఆనియన్ హ్యాకింగ్ కి గురి కాకండి. 

13. మీ సోషల్ సైట్లలో ఉల్లి గురించి పోస్ట్స్ అసలే వద్దు.. చప్పిడి కూరలతో ఏదో కానిస్తున్నాం స్టేటస్ ఏడవండి.. లేకుంటే మీ ఇంటిపైన బంధు, మిత్రులు (విందు)దాడికి దిగొచ్చు. 

14. వచ్చిన ఫంక్షన్ ఆహ్వానాల్ని తప్పక మన్నించి వెళ్ళిరండి. అక్కడ ఉల్లితో చేసిన వంటకాలు కడుపారా తినేసి రండి. వచ్చేటప్పుడు - రిటర్న్ గిఫ్ట్ గా కిలో ఉల్లిపాయలు దొరికినా అదృష్టమే కదా.. 

15. మా "సురక్షా ఉల్లి కవచ యంత్ర" - అనే టెలి మార్కేట్ కుయుక్తులని నమ్మకండి. వాటిని కట్టుకున్నా మీకు ఉల్లిగడ్డలు దొరక్క పోవచ్చును. 

16. మీరు ఉల్లి కొనడానికి వెళ్ళిన కొట్లో - మీకు తెలిసినవారు ఉంటే - వారు కొని వెళ్ళిపోయాక గానీ ఆ కొట్లోకి వెళ్ళవద్దు. 


Sunday, August 23, 2015

How to see blog photos in bigger

బ్లాగుల్లోని ఫోటోలు ఎలా పెద్దగా చూడాలో ఇంతకు ముందు ఒకసారి ఒక టపా పెట్టాను. అది అక్టోబర్ 15, 2011 సంవత్సరములో పెట్టాను. ( Link: http://achampetraj.blogspot.in/2011/10/blog-post_15.html ) ఇప్పుడు సాంకేతికముగా కొద్దిగా మారింది. ఇపుడు ఎలా చూడాలో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను.. 

మీరు పెద్దగా చూడాలీ అనుకుంటున్న బ్లాగ్ లోని ఫోటోల మీద నేరుగా మౌస్ కుడి క్లిక్ ని నొక్కితే ఇలా ఒక మెనూ వస్తుంది.  అందులో Open image in new tab అని ఉంటుంది. దాన్ని ఓకే / క్లిక్ చెయ్యండి. 


అప్పుడు మీరు తెరచిన గూగుల్ క్రోం బ్రౌజర్ ట్యాబ్ ప్రక్కనే మరో ట్యాబ్ తెరచుకుంటుంది. అందులో హెడ్ లైన్ గా - ఆ ఫోటో యొక్క ఒరిజినల్ ట్యాగ్ పేరు కనిపిస్తుంది. అంటే ఆ ఫోటో ని తీసేటప్పుడు డిఫాల్ట్ గా ఏ పేరుతో / సంఖ్యతో సేవ్ చెయ్యబడి, స్టోర్ అవుతుందో ఆ పేరుతో ఆ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ( ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ ఫోని అలాగే సిస్టం లోకి ఎక్కించి, ఆతరవాత అలాగే బ్లాగ్ లోకి ఎక్కిస్తేనే ఇలా వస్తుంది. సిస్టం లోకి ఎక్కించాక ఆ ఫోటో పేరుని మారిస్తే - ఆ మార్చిన పేరుతోనే ఆ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అని గమనించగలరు. ) ఆ క్రొత్తగా తెరచుకున్న ట్యాబ్ ని ఈ క్రింది ఫోటోలో చూడవచ్చును. IMG_5275JPG (400x300) అని ఉంది. 


IMG_5275JPG (400x300) అంటే - 
IMG = ఇమేజ్. 
5275 = ఆ ఫోటో తీసినప్పుడు కెమరాలో డిఫాల్ట్ గా ఏర్పడే అ ఫోటో సీరియల్ నంబర్. 
(400x300) = అంటే ఆ ఫోటో రిజల్యూషన్ అన్నమాట. అంటే 400 పిక్సెళ్ళ పొడవూ 300 పిక్సల్స్ వెడల్పూ గల ఫోటో - పెద్దగా చూడటానికి తెరవబడింది అని అర్థం. ఈ సంఖ్యలు ఎంత ఎక్కువగా ఉంటే అంత క్లారిటీ / నాణ్యత గల ఫోటో చూస్తాం అన్నమాట. పైన చెప్పిన అంకెల్లో ఆ ఫోటో తెరవబడింది అంటే - చాలా చిన్న సైజు అని అర్థం. 

నిజానికి అలా ఓపెన్ చేస్తే - ఆ సైజులోనే తెరవబడుతాయి. మరి పెద్దగా చూడాలంటే ఎలా? 

మీరు ఏ ఫోటో పెద్దగా చూడాలనుకుంటున్నారో - ఆ బ్లాగు ఫోటో ని డబల్ క్లిక్ Double click ద్వారా ఓపెన్ చెయ్యండి. 
అలా వచ్చిన ఫోటో మీద - మౌస్ కుడి క్లిక్ Right click ని నొక్కండి. అప్పుడు వచ్చిన మెనూ లో Open image in new tab అనే దాన్ని నొక్కండి / OK  చెయ్యండి. ( క్రింది ఫోటోలోని మెనూలో నీలి రంగులో చూపెట్టినది )


అలా క్లిక్ చెయ్యగానే - ఇందాక తెరచిన ట్యాబ్ ప్రక్కనే మరో ట్యాబ్ తెరచుకుంటుంది. అది IMG_5275JPG(1600x1200) అనే పేరుతో తెరచుకుంటుంది. ఆ పేరులోని డిటైల్స్ ఏమిటో మళ్ళీ మీకు వివరించనవసరం లేదనుకుంటాను. ఇప్పుడు ఆ ఫోటో 1600x1200 పిక్సెల్స్ సైజులో తెరచుకుంటుంది. 


ఇప్పుడు ఆ ట్యాబ్ ని తెరిస్తే ఇలా కనిపిస్తుంది.. అంటే ఆ ఫోటో మొత్తం ఇలా కనిపిస్తుంది. 


ఆ ఫోటో మీద మౌస్ కర్సర్ని పెడితే కర్సర్ యొక్క బాణం గుర్తు మాయమై - భూతద్దం Magnifier symbol లో మైనస్ Minus - గుర్తు కనిపిస్తుంది. అప్పుడు మీకు ఆ ఫోటో కొద్దిగా జూం చేసినట్లుగా పెద్దగా కనిపిస్తుంది. ఈ క్రింది ఫోటోలో ఆ మార్పుని గమనించవచ్చు. ప్రక్కన, క్రిందా  సైడ్ బార్స్ కూడా గమనించవచ్చు. 


ఆ ఫోటో మీద కర్సర్ ని పెడితే మైనస్ గుర్తుతో వస్తుంది అని చెప్పానుగా.. ఆ కర్సర్ని మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ / ఓకే చేస్తే ఆ ఫోటో పెద్దగా అవుతుంది. అప్పుడు ఆ ఫోటోలో ప్రతి డిటైల్ నీ క్షుణ్ణంగా చూడవచ్చును. ప్రక్కన ఉన్న సైడ్ బార్స్ జరుపుకుంటూ ఆ ఫోటోలోని ప్రతి వివరాన్నీ చూడవచ్చు. ఇలా చూస్తే ఫొటోస్ మరింత ఆసక్తిగా కనిపిస్తాయి. కొన్ని వస్తువుల ఫొటోస్ ఇలా మీరు చూసినట్లయితే మరింతగా వివరముగా తెలుసుకుంటారు. ఇలా చేసి, చాలా వివరాలు నేను తెలుసుకున్నాను. 
Friday, August 21, 2015

టిక్.. టిక్.. టిక్..


  ఇదేమిటో తెలుసా? 
దీని తాలూకు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా ? 

నేను చిన్నప్పుడు దీన్ని తొలిసారిగా చూసాను. ఒక స్నేహితునితో ఆటల్లో ఉన్నప్పుడు - తను తన రెండు చేతుల్నీ వెనక పెట్టుకొని, టిక్ టిక్ మంటూ శబ్దం చేసేసరికి - ఆ చుట్టూ ఉన్న మిగతా పిల్లలూ, నేనూ ఒహటే ఇదయ్యాం.. ఈ శబ్దం ఎక్కడి నుండీ అనీ..ఆ శబ్దం ఆగిపోయింది. కాసేపటి తరవాత మళ్ళీ మొదలు. ఆ పిల్లాడు ఈసారి నిక్కరు జేబులో దీన్ని పెట్టుకొని టిక్ టిక్మనిపించసాగాడు. ఈసారి శబ్దాన్ని చాలాసేపు వాయించేసరికి - చేతి కదలిక వల్ల కదులుతున్న నిక్కరు వల్ల అందులోనించే అని గమనించి, వాడి జేబులోంచి, బయటకు తీయించాం. అప్పుడే నేను తొలిసారిగా చూసాను. 

చాలా చిన్నదిగా, అరచేతిలో చిన్నగా ఇమిడిపోయే విధంగా ఉండే ఈ ఇనుప వస్తువు మమ్మల్ని చాలా ఆకర్షించింది. అందరమూ తలా కాసేపు వాయించాం. ఆ తరవాత అవి ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకొని, డబ్బులు తీసుకొని అక్కడికి పరుగులు తీశాం. అప్పట్లో అది పది పైసలకు ఒకటి. వీటిని ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుస్తారు అనుకుంటా.. ఒకచోట " కప్ప " అని పిలుస్తారు ట. 

పుట్ పాత్ మీద, రోడ్డు వారగా ఒక ముసలతను పాత ఇనుప వస్తువులను, కొద్దిపాటి విక్రయ సామాను, రిపేరు చేసే సామానుని ఒక త్రుప్పు పట్టిన ట్రంక్ డబ్బాలో తెచ్చుకొని, జీవనోపాధి గడిపేవాడు. మాసిన, చినిగిన బట్టలతో, నెరసిన తలతో, చిన్నని తెల్లని గడ్డంతో తను ఉండేవాడు. ఆయన ఎక్కువగా గొడుగులనీ, టార్చి లైట్లనీ బాగుచేసేవాడు. చిన్న చిన్న తాళం కప్పలూ, స్టీలు సామాను అమ్ముకొనేవాడు. అతని వద్దనే ఈ టిక్ టిక్ మనే సాధనమూ దొరికేది. తను వీటిని చేసేవాడు కాదు.. ఎక్కడి నుండో కొనుక్కవచ్చి, అక్కడ అమ్మేవాడు. ఏదైనా ఒకటి సరిగ్గా శబ్దం చెయ్యలేక పోతే - దాన్ని విప్పి, సరిచేసి ఇచ్చేవాడు. 

చిన్న ఇనుప రేకుని మధ్యలో చెంచా లా వంచి, ఒకవైపు నుండి ఆ మధ్యలోనికి వచ్చేలా ఒక స్టీలు రేకు ముక్కని జత చేసేవారు. నిజానికి ఇది చాలా సింపుల్, అమోఘమైన పరికరమిది. ఆ రేకు ముక్కని బొటనవ్రేలుతో అదిమితే ఆ టిక్ టిక్ శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుందో - నాకు ఇప్పటికీ అదో పెద్ద మిస్టరీయే మరి. 

అక్కడ అప్పుడు వాటిని కొన్నాం.. విరివిగా వాడాం.. ఆ తరవాత ఆ మోజు పోయింది. మళ్ళీ కొద్ది రోజులకి - ఏదైనా ఆటల్లో గెలిచినప్పుడు చప్పట్లకి బదులుగా దాన్ని వాడేవాళ్ళం. అదో మురిపెం మాది. అప్పట్లో ఆటలకి వెళ్ళేటప్పుడు జేబుల్లో వేసుకొని వెళ్ళే తప్పనిసరి ఆటవస్తువు అది. 

Wednesday, August 19, 2015

నాగపంచమి శుభాకాంక్షలు.

మీకూ, 
మీ మిత్రులకూ, 
తోటి బ్లాగర్ లకూ, 
మీ కుటుంబ సభ్యులకూ.. 
నాగపంచమి శుభాకాంక్షలు. 

Tuesday, August 18, 2015

ఒప్పుల కుప్పా.. ఒయ్యారి భామా!

ఒప్పుల కుప్పా.. ఒయ్యారి భామా! 
మినపా పపు - మెంతీ పిండి 
తాటి బెల్లం - తవ్వెడు నేయి 
గుప్పెడు తింటే - కులుకూ లాడి 
నడుమూ గట్టె - నామాటే చిట్టీ 
దూదూ పుల్ల - దురాయ్ పుల్ల 
చూడాకుండా - జాడా తీయ్ 
ఊదకుండా - పుల్లా తీయ్ 
దాగుడు మూత - దండా కోర్ 
పిల్లీ వచ్చే - ఎలుకా భద్రం 
ఎక్కడి దొంగాలక్కన్నే - గప్ చిప్..! 

చిన్నప్పుడు చదువుకున్న ఒక చిట్టి పాట.. 

Monday, August 17, 2015

Good Morning - 588

నేనూ మా నాన్న - ప్రతీ పరీక్ష ఫలితం తరవాత..


పరీక్షా ఫలితాల సమయాన ప్రతివారికీ అదో టెన్షన్.. వ్రాసిన పరీక్ష ఫలితం ఎలా ఉంటుందో అనీ.. బాగా చదివి వ్రాసిన వారికి - మంచి మార్కులూ / ర్యాంక్ / గరదు వస్తుందో, లేదో అని టెన్షన్. మామూలుగా వ్రాసినవారూ, చీటీలు చూసి వ్రాసినవారూ, కాపీ కొట్టినవారూ  మాత్రం ఫలితాల రోజున మామూలుగా ఉండరు.. మార్కులు ఎలా వస్తాయో అనీ, వాటిని చూసి, తలితండ్రులు ఏమంటారో అనీ.. అదో టెన్షన్.. మార్కులు తక్కువ వచ్చాయన్న బాధ కన్నా, నాన్నగారు ఎలా క్లాస్ పీకుతారు అన్న విషయమే బాగా గుబులు రేపుతుంది. బాగా చదవని ప్రతీ విద్యార్థికీ ఇదొక అనుభవమే.. ఆ సమయాన వారికి - వార నాన్నగారు ఒక పోలీస్ అధికారిగా, తాము ఏదో నేరం చేసి, ఇంటరాగేషన్ చేయించుకుంటున్న ఖైదీల్లా భావిస్తుంటారు.. అదొక మరుపురాని జ్ఞాపకం. మనలో చాలామందికి అనుభవమే.. 

Saturday, August 15, 2015

పొడుపు కథలు - 5

నడుస్తుంది కానీ కాళ్ళు లేవు, 
ఏడుస్తుంది కానీ కళ్ళు లేవు, 
ఏమిటదీ..?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
విడుపు : 


Thursday, August 13, 2015

August 15 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


15 ఆగస్ట్ - 
భారతీయులందరికీ 
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 

Wednesday, August 12, 2015

[తెలుగుబ్లాగు:22292] pasting problem

[తెలుగుబ్లాగు:22292] pasting problem  typed matter in lekhini is not pasted on word document. what to do? కి నేనిచ్చిన సమాధానం :                        
( అక్కడ ఇచ్చిన సమాధానానికి కన్నా కాస్త వివరంగా ఇక్కడ చెబుతున్నాను. )

 ముందుగా మీరు లేఖిని సైట్ లోకి వెళ్ళి, తెరవండి. అందులో పైన గడిలో రోమన్ ఇంగ్లీష్ లో anTE ilA టైపింగ్ చేసుకోవాలి. అలా చేస్తూ ఉంటే డిఫాల్ట్ సెట్టింగ్ బట్టి వెనువెంటనే తెలుగులోకి మారుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఆ క్రిందన ఉన్న గడిలో వచ్చిన తెలుగు పదాలు - సరియైన పదాలు - అచ్చుతప్పులూ, భావం సరియైనవేనా నిర్ధారించుకోండి. అలా గమనిస్తూ టైపింగ్ చేస్తూ వెళ్ళండి. 


అలా కొద్దికొద్దిగా టైప్ చేస్తూ కాపీ చేసుకుంటూ వెళ్ళండి. ఒక పేరా కాగానే దాన్ని మీ మౌస్ సహాయన క్రింద గడిలో ఉన్న తెలుగులోకి మారిన విషయాన్ని మార్కింగ్ చెయ్యండి. అలా చేసినప్పుడు ఆ విషయం అంతా నీలిరంగులోకి మారుతుంది. ( క్రింది ఫోటో చూడండి ). అప్పుడు మీ కీ బోర్డ్ న ఉన్న Control + C అనే రెండు మీటల్ని ఒకేసారి నొక్కితే ఆ విషయం అంతా కాపీ అవుతుంది. 


ఇప్పుడు మీ సిస్టం న ఉన్న Microsoft వారి word pad తెరవండి. అందులో ఉన్న పేజీ మీద ఒకసారి మీ మౌస్ ని క్లిక్ చెయ్యండి. అలా చేశాక - ఇప్పుడు Control + V అనే రెండు మీటల సహాయాన ఒక్కసారిగా నొక్కితే ఆ కాపీ చేసిన విషయం అంతా అక్కడ పేస్ట్ అవుతుంది. ( క్రిందన ఉన్న ఫోటో చూడండి )  


అపుడు ఆ వర్డ్ ప్యాడ్ ని సేవ్ చేసుకుంటే సరి. అంతే!

                           
                           
                                 
                               

Tuesday, August 11, 2015

My creation : Tray

నేను చేసిన ట్రే - ఇందులో చిన్న చిన్న వస్తువులని దేనికి దానికి విడిగా పెట్టుకోవచ్చును. ఒక ప్లైవుడ్ చెక్క మీద టేకు పట్టీలని సన్నని మేకులతో, జిగురుతో బిగించి, మధ్య మధ్యన చిన్న చిన్న ముక్కలతో కలుపుతూ, ఇలా తయారు చేశాను.. కేవలం ఒక్కరోజులో చేశాను. సరియైన సామాను ఉంటే కొద్ది గంటల్లో చేసుకోవచ్చు. ఖర్చు కేవలం Rs. 100 లోపే.. ఒక్కో చిన్న గడి 2" x 2" అంగుళాలు ఉంటుంది. 

ఇవన్నీ చేసుకోవడం ఎందుకో పాత టపాల్లో చెప్పాను.. జస్ట్ నన్ను నేను క్రొత్తగా తయారుచేసుకోవాలని అంతే!.. కొన్ని క్రొత్త పనులూ, అభిరుచులూ పెంచుకోవాలనీ.. క్రొత్త విజయాలని పొందాలనీ.. 

ఫోటోలని పెద్దగా చూడటానికి డబల్ క్లిక్ చెయ్యండి. ( ఇంకా పెద్దగా ఎలా చూడాలో త్వరలోనే పోస్ట్ పెడతాను )Monday, August 10, 2015

Sri Rukmini, Satybhama sahitha Venugopala swamy temple, Sirsingandla

ప్రయాణాల్లో ఒక్కోసారి అంతగా ప్రాచుర్యం పొందని ఆలయాలకు వెలుతుంటాం. వాటి ఫోటోలు అనుకోకుండా తీసుకుంటాం.. అలాగే నేనూ ఈమధ్య ఒక ఆలయానికి వెళ్లాను. ఓ చిన్న మారుమూల పల్లెటూర్లో ఉన్న శ్రీ రామ ఆలయానికి అనుకోకుండా వెళ్ళాను. వాటి విశేషాలను చూశాను. మామూలుగా ఉన్న చిన్న ఆలయం. కానీ ఏదో సంథింగ్ స్పెషల్ గా ఉన్నట్లు అనిపించింది. ఆ ఆలయ విశేషాలు ఆన్లైన్లో పెడితే, ఎవరికైనా ఎప్పుడైనా అవసరమున్నప్పుడు - ఆ విశేషాలు ఉపయోగపడతాయని అనిపించి, పెడుతున్నాను. నాకంటూ ఉన్న పోటో కలెక్షన్ ని ఇలా తీర్చుకుంటున్నాను. 

తెలంగాణా లోని మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణానికి దగ్గరలో ఉన్న సిరిసినగండ్ల అనే ఊరికి అనుకోకుండా వెళ్ళాను. అక్కడ ఉన్న శ్రీ రుక్మిణి, సత్యభామ సహిత వేణుగోపాల స్వామీ Sri Rukmini, Satybhama sahitha Venugopala swamy temple, Sirsingandla, Near Siddipet, Telangaana ఆలయానికి వెళ్ళాను. 

చాలా పాతనైనదీ, అక్కడ ఇలా ఒక ఆలయం ఉన్నదనీ చుట్టుప్రక్కల చాలామందికి తెలీదు కూడా. క్రొత్తగా అయ్యవారు పూజారిగా రావటం మూలాన మరుగున పడ్డ ఈ ఆలయం - జీర్ణోద్ధారణ జరిగి, కొద్ది కొద్దిగా అభివృద్ధిలోకి రావటం జరిగింది. నా ఫోటో కలెక్షన్ దాహాన్ని తీర్చుకోవడానికి / దాచుకోవటానికి ఈ టపా.. 

ఈ ఫోటోలు అన్నీ మొబైల్ కెమరాతో  తీశా. నాణ్యత లోపించినందులకు మన్నించండి. చాలా ఫోటోలు  అడ్డముగా 90 డిగ్రీలలో అప్లోడ్ అయ్యాయి. కెమరాలో ఆటో రొటేషన్ మోడ్  లో పెట్టి ఫోటో తీసినందులకు అనుకుంటా.. మామూలుగా ఫోటో చూస్తే సరిగ్గానే ఉంది. అప్లోడ్ చేస్తే తిరిగి ఉంటున్నాయి. వాటిని సరి చెయ్యడం చా కష్టముగా ఉండి, ఎలా ఉన్నాయో అలాగే అప్లోడ్ చేస్తున్నాను. ఈ అసౌకర్యానికి మన్నించండి. బ్లాగుల్లో ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు - ఫోటో రొటేషన్ కీలని పెట్టాలని ఇంతకు ముందే ఒకసారి పోస్ట్ పెట్టాను కూడా.. లింక్ : http://achampetraj.blogspot.in/2015/06/we-want-rotate-keys-in-blog-tools.html


ఆలయ పూజారి 


పై ఫోటో లోనిది - ఆలయానికి ఆనుకొని ఉన్న కళ్యాణ మండపం. ఇవి చెదలు / చీమలు పెట్టిన పుట్టలు. Related Posts with Thumbnails