Monday, February 2, 2009

మిస్సమ్మ - బృందావనమది అందరిదీ..



చిత్రం: మిస్సమ్మ (1955)
రచన: పింగళి
సంగీతం: S. రాజేశ్వర రావు
గాయకులు: A.M. రాజా, P. సుశీల
****************
పల్లవి:


బృందావనమది అందరిది
గోవిందుడు అందరి వాడేలే (2)
ఎందుకె రాధ ఈసునసూయలు
అందములందరి ఆనందములే (2) // బృందావనమది //

చరణం 1:


పిల్లన గ్రోవిని పిలుపులు వింటె
ఉల్లము ఝల్లున పొంగదటే (2)
రాగములో అనురాగము చిందిన
జగమే ఊయల ఊగదటే.. (2) // బృందావనమది //

చరణం 2:


రాసక్రీడల రమణుని గాంచిన
ఆశలు మోసులు వేయవటే (2)
ఎందుకె రాధ ఈసునసూయలు
అందములందరి ఆనందములే // బృందావనమది //

No comments:

Related Posts with Thumbnails