Showing posts with label తెలుగులో టైపు చెయ్యడం - పాఠాలు. Show all posts
Showing posts with label తెలుగులో టైపు చెయ్యడం - పాఠాలు. Show all posts

Sunday, October 28, 2018

[తెలుగుబ్లాగు:22573] "స్వాతంత్ర్యము" వగైరా... పదాలు

[తెలుగుబ్లాగు:22573] "స్వాతంత్ర్యము" వగైరా... పదాలు 

Sunday, July 29, 2018

[తెలుగుబ్లాగు:22491] mlaana పదాన్ని లెఖినిలో వ్రాయడమెలా?

mlaana పదాన్ని లెఖినిలో  వ్రాయడమెలా?

మీరడిగిన mlaana అనే పదాన్ని లేఖినిలో తెలుగులో ఎలా వ్రాయాలి అని అడిగారు కదా.. అలాగే టైపు చేస్తే ఈ క్రింది - మొదటి తెరపట్టు లాగా వచ్చిందని అనుకుంటున్నాను. ( జూమ్ చేసి ఎర్రని గదుల్లో పెద్దగా అందరికీ కనిపించేలా చేశాను ) కొన్ని కాంబినేషన్ పదాలు టైపింగ్ లో ఇబ్బంది పెడుతాయి. 




ఇలాంటి కాంబినేషన్ పదాలని & కీ తో ( కీ బోర్డ్ లో shift + & ) వాడితే మీకొచ్చిన ఇబ్బందిని తేలికగా తొలగించుకోవచ్చును. అది ఎలాగో ఈ క్రిందన చూడండి. 




Thursday, October 5, 2017

[తెలుగుబ్లాగు:22483] కి నా జవాబు

[తెలుగుబ్లాగు:22483] BhutEbhya&@H  ani koditE భుతేభ్యః Ya vattu last lo vasthondi Bha prakkana raavadaaniki nenu emi cheyyali? అనే ప్రశ్నకు నేనిచ్చిన జవాబు : 

మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు కావలసిన పదాన్ని తెలుగులో చూపించారు. అది చూస్తే - మీకు కావలసిన పదం (  భుతేభ్యః  ) మీకు వచ్చేసినట్లుగా కనిపిస్తున్నది. అలా వచ్చాక కూడా మీరు అలా ఎలా టైప్ చెయ్యాలో మళ్ళీ అడిగినట్లుగా తికమకగా ఉంది. అయిననూ మీకు సమాధానంగా ఈక్రింది తెరపట్టుని చూపిస్తున్నాను. అందులో మీకు పరిష్కారం కనిపించవచ్చు. 

గూగుల్ తెలుగు లిప్యంతరములో : 


లేఖిని లో : 


ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు నాకు ఏర్పడిన ఇబ్బందులను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇలాంటి ప్రశ్నలను ఇకమీదట అడిగే ఈ బ్లాగర్స్ గ్రూప్ సభ్యులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. 

1. మీరు టైప్ చెయ్యాలనుకుంటున్న పదం ని టైప్ చెయ్యడం రాకపోతే - దాన్ని ఒక పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి మెయిల్ తో బాటుగా పంపండి. దాన్ని చూశాక ఎలా దాన్ని టైప్ చెయ్యాలో చెప్పడం ఇతర సభ్యులకు తేలికగా ఉంటుంది. 

2. మీరు అడుగుతున్న పదం ఎలా టైపు చెయ్యాలన్నది - ఇంస్క్రిప్ట్, లేఖిని..... లాంటి సైట్లలోనా లేక గూగుల్ వారి లిప్యంతరం లోనా అన్నది కూడా తెలియచెయ్యండి. ఇది ఎందుకంటే ఈ రెండింటిలో కాస్త వేరుగా టైప్ చెయ్యాల్సి ఉంటుంది. పైన ఉన్న తెరపట్లలో ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. చాలామంది ఇక్కడే అయోమయానికి గురి అవుతారు. మీరు ఇంస్క్రిప్ట్ లో టైప్ చెయ్యాలని అనుకొని అది ( ఇంస్క్రిప్ట్ అని ) ప్రస్తావించకుండా అడిగితే - సభ్యులు లిప్యంతరం లో గనుక మీకు సమాధానం ఇస్తే - అది మీకు సరియైన పరిష్కారంగా తోచదు. అందువల్ల మీరు ఎందులో టైపింగ్ చేస్తున్నారో  తప్పనిసరిగా చెప్పాలన్నది గుర్తుపెట్టుకోవాలి. 

3. మీరు టైప్ చేస్తున్నప్పుడు వచ్చిన తప్పుడు పదాన్ని - ఎలా వస్తున్నదో గ్రూప్ లోని ఇతర సభ్యులకు చూపించడానికి - దాన్ని స్క్రీన్ షాట్ ( తెరపట్టు ) తీసి, పోస్ట్ చెయ్యండి. మీ సమస్య ఏమిటో తోటి బ్లాగర్స్ కి బాగా అర్థం అవుతుంది. 

- అచ్చంపేట్ రాజ్  



Saturday, August 26, 2017

ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు - 3

P H D - పీ ఎచ్ డీ =  పరిశోధక పట్టా 
National Knowledge Commission - నేషనల్ నాలెడ్జ్ కమీషన్ = జాతీయ విజ్ఞాన సంఘం 
N B A - ఎన్ బి ఎ ( జా మ సం ) =  జాతీయ మదింపు సంఘం 
N A C - ఎన్ ఎ సి ( జా మ గు మం ) =  జాతీయ మదింపు, గుర్తింపు మండలి 
R U S A - ఆర్ యు ఎస్ ఎ =  రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాన్ 
Meta Universities - మెటా యూనివర్సీటీస్ =  భిన్నత్వ విశ్వవిద్యాలయాలు 
Skill Development Centers - స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ =  నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు 
Marks - మార్క్స్ =  గుణాలు 
Grades - గ్రేడ్స్ =  శ్రేణులు 
Pyramid - పిరమిడ్ =  త్రిభుజాకార నిర్మాణం 
Task Force - టాస్క్ ఫోర్స్  =  లక్ష్య సాధన బృందం 
G P S - జీ పీ ఎస్ =  భూస్థాన వ్యవస్థ 
C C Cameras - సి సి కేమరాస్ =  రహస్య ఛాయా గ్రాహకాలు 
Martial Arts - మార్షల్ ఆర్ట్స్ =  ఆత్మరక్షణ విద్యలు 
Seat Belt - సీట్ బెల్ట్ =  నడికట్టు 
Lubricants - లూబ్రికంట్ =  కందెన / స్నేహకం 
Tablets - ట్యాబ్లెట్ =  మాత్ర  
Capsule - క్యాప్సుల్ =  గుళిక 
Polytechnic Diploma - పాలిటెక్నిక్ డిప్లొమో =  బహుళ సాంకేతిక విద్యా యోగ్యతాపత్రం 
Abkari Constables - అబ్కారీ కానిస్టేబుల్స్ =  మద్యశాఖ భటులు 
Bio Metric - బయో మెట్రిక్ =  జీవ భౌతిక కొలమానం 
Computer - కంప్యూటర్ =  విగణిత 
National Public Register (N P R) - నేషనల్ పబ్లిక్ రిజిస్టర్ =  జాతీయ జనాభా నమోదు పుస్తకం 
Unique Identification Authority of India - U I D A I - యూ ఐ డి ఎ ఐ =  భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ 
Smart Card - స్మార్ట్ కార్డ్ =  సూక్ష్మ సమాచార పత్రం 
Banks - బ్యాంక్స్ =  ధనాగారాలు 
Camera - కెమరా =  ఛాయాగ్రాహకం 
Global Positioning System - G P S - జీ పీ ఎస్ =  భూస్థాన వ్యవస్థ 


Sunday, August 20, 2017

టైపు చేసినప్పుడు కింద బాక్సులో ఆప్షన్లు వస్తున్నవి. అట్లా రాకుండా చేయటం ఎట్లా?

[తెలుగుబ్లాగు:22383] టైపు చేసినప్పుడు కింద బాక్సులో ఆప్షన్లు వస్తున్నవి. అట్లా రాకుండా చేయటం ఎట్లా? 

అనే ప్రశ్నకు నేనిచ్చిన సమాధానం..

టైపు చేసినప్పుడు కింద బాక్సులో ఆప్షన్లు వస్తున్నవి. అట్లా రాకుండా చేయటం ఎట్లా? అని అడిగారు కదా.. అలా రావటం అన్నది మామూలే.. మన టైపింగ్ సౌలభ్యం కోసం అలా వస్తుంటాయి. నిజానికి అలా రావటం చాలా ఉపయోగకరముగా ఉంటుంది కూడా. మరింత వివరముగా చెప్పాలీ అంటే - యూనికోడ్ లో మనం వ్రాసే టైపింగ్ వల్ల ఒక పదం వ్రాయబోతే మరొక పదం వస్తుంది. ఇలా రావటం అన్నది మనం టైపింగ్ చేసే పదానికి డిఫాల్ట్ గా ఉన్న పదమే మొదటగా కనిపిస్తుంది. అంటే మనం టైపు చేసినది సరియైనది అయితే అది మొదటగా కనిపిస్తుంది. అది ఒకే అనుకుంటే వెంటనే స్పేస్ బార్స్ నొక్కి, మరొక పదాన్ని వ్రాసుకుంటూ వెళతాం.. ఇలా వ్రాసుకుంటూ వెళుతున్నప్పుడు - ఒక్కోసారి మనం అనుకున్న పదాలు అక్కడ రావు. ఎలా టైపు చేసినా సరే.. ఇంస్క్రిప్ట్ లో మాదిరిగా యూనికోడ్ లో మరింత మెరుగ్గా టైప్ చెయ్యటానికి అవకాశం లేదు. అందువల్ల ఈ ఆప్షన్స్ తప్పనిసరి అవుతుంది. అవి రాకుండా మనం అనుకున్న పదాలతో విషయాన్ని టైప్ చెయ్యటం కాస్త కష్టమే. అచ్చుతప్పులు రాకుండా సరైన కీలను వాడి పదాలను టైపింగ్ చెయ్యటం అందరికీ సాధ్యం కాదు కదా.. 

అంతెందుకు.. పైన ఈ పోస్ట్ లో వల్ల అనే పదాన్ని ఎర్రని రంగులో పెట్టాను. ఆ పదాన్ని వ్రాయటం అస్సలు వీలు కాలేదు. రెండు మూడు సార్లు టైప్ చేసినా వాళ్ళ అనే పదం మొదటగా వచ్చింది. 


అంటే పదమే డిఫాల్ట్ గా సెట్ అయ్యి ఉందన్నమాట. చివరికి ఆప్షన్స్ లోని పదమే ఎన్నుకొని.. ముందుకు సాగాను. ఆ ఆప్షన్ లేకుంటే వాళ్ళ అనే వచ్చి, వారి యొక్క అనే అనే అర్థం వచ్చేది. సో, ఆప్షన్ ఉండటమే మంచిదన్నది నా అభిప్రాయం. అందరికీ అర్థం కావాలని చాలా పెద్దగా చెప్పా.. మన్నించండి. 



Wednesday, August 16, 2017

ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు - 2

దైనందిక జీవితములో వాడే ఆంగ్ల పదాలకు సమాన తెలుగు పదాలు ఏమిటో కొన్ని వార్తా పత్రికల నుండి సేకరించాను. వాటన్నింటినీ ఇక్కడ మీకు తెలియచేస్తున్నాను. ఇలాంటి ప్రయత్నం ఇంతకు ముందు ఒకసారి ( https://achampetraj.blogspot.in/2015/05/blog-post.html ) చేశాను. ఇప్పుడు మరొక సేకరణ.. మీకోసం.

Optical Fiber - ఆప్టికల్ ఫైబర్              =  దృశ్యా తంత్రులు
Signals - సిగ్నల్స్                                =  సంకేతాలు
Power - పవర్                                     =  శక్తి
Smart city - స్మార్ట్ సీటీ                        =  అందమైన నగరం
CEO - సీ ఈ వో                                    =  ముఖ్య కార్య నిర్వహణాధికారి
Self Declaration - సెల్ఫ్ డిక్లరేషన్        =  స్వీయ ధృవీకరణం
Technical Development - టెక్నికల్ డెవలప్మెంట్ =  సాంకేతిక అభివృద్ధి
Skill Development - స్కిల్ డెవలప్మెంట్ =  నైపుణ్యాభివృద్ధి
Green Revolution - గ్రీన్ రెవల్యూషన్    =  హరిత విప్లవం
Communication skill - కమ్యూనికేషన్ స్కిల్ =  భావ ప్రసరణ నైపుణ్యం
Logical ability - లాజికల్ ఎబిలిటీ         =  తర్క జ్ఞానం
Computer - కంప్యూటర్                       =  సంగకణం
Mobile phone - మొబైల్ ఫోన్              =  చరవాణి
Artificial Intelligence - ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ =  కృతిమ బౌద్ధికత
Word generator - వర్డ్ జెనరేటర్          =  పద జనకం
Spell Checker - స్పెల్ చెకర్                 =  గుణింత పరిష్కరిణి
Converter =  కన్వర్టర్                          =  లిపి పరివర్తకం
Unicode - యూనికోడ్                          =  విశ్వ సంకేత ఖతి


Thursday, February 9, 2017

లేఖినిలో సున్నాని టైప్ చెయ్యడం

[తెలుగుబ్లాగు:22437] వత్తు ప్రక్కన సున్నా టైపు చేయడం కుదరటం లేదు, సహాయం చేయగలరు.

ఉదహరణకు 'చేయడం' లో సున్నా సులువగా టైపు చేయవచ్చు కాని 'సెల్వం' లో మత్రం వత్తు ప్రక్కన ఉన్న యెడల ఎలా టైపు చేయాలో తెలియడం లేదు. దయచేసి సహాయం చేయ మనవి. 

ధన్యవాదములు 

పై సందేహానికి నా సమాధానం..

మీరు తెలిపిన సందేహంలో " చేయడం, తెలియడం, సహాయం.. " వాటిని చాలా తేలికగా టైప్ చేసిన మీకు - చాలా మామూలుగా టైప్ చేస్తే వచ్చే selvam సెల్వం పేరు టైపు చెయ్యడంలో ఇబ్బందిగా ఉంటున్నది అంటే ఆశ్చర్యముగా ఉంది. వీవెన్ గారు మీ సందేహానికి సమాధానం ఇచ్చినా, లేఖిని వాడుక మీకు క్రొత్తగా భావించి, కాస్త పెద్దగా, వివరంగా చెప్పాలనిపించి ఈ రిప్లై ఇస్తున్నాను.. అంతేగానీ మరోలా భావించకండి. ఈ క్రింది లేఖిని తెరపట్టులో ఎర్రని వృత్తం లో చూపినది ( M ) - పదం ప్రక్కన సున్నా రావటానికి వాడే కీ. కీ బోర్డ్ మీదున్న M కీ ని వాడి మీరు అలా పదాల చివర సున్నాని వచ్చేలా చెయ్యవచ్చును. 
టైప్ చేసిన పదాలు, వచ్చిన తెలుగు పదాలని వాటి ప్రక్కనే పెద్దగా జూమ్ చేసి, బాణాల గుర్తులతో చూపించాను.. గమనించగలరు. 


అలా వత్తు ప్రక్కన సున్నా రావటానికి M మీటని వాడితే సరి. అలాంటి మరికొన్ని పదాలు ఎలా వ్రాయాలో మీకు తెలియడానికి మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నాను. వాటిని అభ్యాసం చెయ్యండి. 
diTTam = దిట్టం, 
prEmaikyam = ప్రేమైక్యం, 
gAndharvam = గాంధర్వం, 
Arghyam = ఆర్ఘ్యం, 
kAryam = కార్యం, 
divyam = దివ్యం, 
pAnchajanyam = పాంచజన్యం.    
chEyaDam = చేయడం, 
tinaDam = తినడం, 
sahAyam = సహాయం, 
aDagaTam = అడగటం, 
kOpam = కోపం, 
SAntam = శాంతం, 
teliyaDam = తెలియడం, 
cheppaTam = చెప్పటం, 
vinaDam = వినడం..... ఇలా చాలానే ఉన్నాయి. 




Friday, October 7, 2016

[తెలుగుబ్లాగు:22403] గుణింతపు గుర్తులనే టైపు చెయ్యడం...

లేఖిని ఉపయోగించి యూనీకోడ్ లో కేవలం గుణింతపు గుర్తులనే టైపు చెయ్యడం వీలవుతుందా?

లేదంటే మార్గం ఏమిటి?

లేఖిని ఉపయోగించి లెక్కల్లో వాడే గుర్తులను టైపు చెయ్యవచ్చును. మామూలుగానే లేఖినిని తెరచి, పై గడిలో మనం ఇంగ్లీష్ ఫోనెటిక్ లో టైపింగ్ చేస్తుంటే, క్రిందన ఉన్న గడిలో తెలుగులో వెనువెంటనే తెలుగులో మారి వస్తుంది. ఆ ఉపకరణంలో కుడిప్రక్కన ఏ ఇంగ్లీష్ / కీ బోర్డ్ అక్షరాన్ని నొక్కితే - ఏ తెలుగు అక్షరం వస్తుందో తెలిపే పట్టిక కూడా ఉంది.  మీరు సామాన్య గణితపు గుర్తులు అనగా + - x / లని వాడదలచుకున్నారు. లేఖినిలో కూడా మామూలుగానే నేరుగా టైపు చేసుకోవచ్చు. కానీ మీకు గుణింతపు గుర్తు x వాడకంలోనే మీకు సమస్య ఎదురుకావొచ్చును. 

లేఖినిలో పై గడిలో నంబర్ కీ బోర్డ్ గుణింతపు గుర్తు అయిన * ( స్టార్ / పువ్వులా ఉండే గుర్తుతో ఉంటుంది ) ని నేరుగా టైపు చేస్తే, అదే గుర్తు క్రిందన ఉన్న గడిలో వస్తుంది. కానీ అది సరియైన గుర్తు కాదనుకొని మనం x ని ( ఇది కీ బోర్డ్ ఆంగ్ల అక్షరాలలో ఎక్స్ X గుర్తు ) వాడటానికి ప్రయత్నించినప్పుడే ఈ సమస్య గమనిస్తాం.. పై గడిలో ఈ x అని టైపు చేసినప్పుడు క్రిందన గడిలో  క్ష్ అని వస్తుంది. మిగతా + - / కీ లను వాడితే అచ్చు అలాగే క్రింద గడిలో వస్తాయి. ఈ సమస్యని తేలికగా తప్పించటానికి ఈ విధముగా చెయ్యండి. 



మీరు x గుర్తుని లేఖినిలో వాడేటప్పుడు చిన్న x వాడకుండా పెద్ద X ( Shift + X ) ని వాడండి. క్రిందన ఉన్న గడిలో కూడా అలాగే పెద్ద X వస్తుంది. అంతే.. మీ ఇబ్బంది తొలగిపోతుంది. 


Thursday, August 18, 2016

How to type in Telugu?

[తెలుగుబ్లాగు:22383] Sir ,How to type in Telugu? I am very much interested to know. Pls guide me. 


తెలుగులో టైపింగ్ చెయ్యటానికి మీరు చూపిన ఆసక్తికి కృతజ్ఞతలు. తెలుగులో టైపింగ్ చేయుటకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అందులో ఎక్కువగా వాడేటివి - 

1. నేరుగా తెలుగు టైపింగ్ చెయ్యటం, 
2. ఫోనెటిక్ ఇంగ్లీష్ లో టైపింగ్ చేస్తుంటే నేరుగా తెలుగులో టైప్ అవటం, 
3. కొన్ని సైట్లలో ఒక గడిలో టైప్ చేస్తుంటే మరొక గడిలో వచ్చిన తెలుగుని కాపీ చేసుకొని అవసరమున్న చోట పేస్ట్ చేసుకోవడం.. 

ఇత్యాది పద్ధతులున్నాయి. మరిన్ని పద్ధతులకి ఈ క్రింది లింక్స్ చూడండి. 
తెలుగు టైపింగ్ ఉపకరణాల కోసం : http://etelugu.org/typing-telugu
యూనికోడ్ లో తెలుగు టైపింగ్ కోసం : ఈ బ్లాగు లోని తెలుగుని యూనికోడ్ లో ఎలా వ్రాయడమో తెలిపే పాఠాలు తెలుగు టైపింగ్ పాఠాలు 





Monday, August 15, 2016

Google fonts in Photoshop

[తెలుగుబ్లాగు:22383] టైపింగ్ 
nenu photoshop 7.0 vaduchunnanu. google telugu fonts install chesukunnanu kani photoshop lo kochen mark lu paduthunnayi. naku sahayamu cheyyagaluru 


ఫోటోషాప్ లో అనూ ఫాంట్స్ చక్కగా పనిచేస్తాయి. గూగుల్ తెలుగు ఫాంట్స్ వాడితే అలాగే ?????? లా కనిపిస్తాయి. కారణమేమిటంటే  - గూగుల్ తెలుగు ఫాంట్స్ - యూనికోడ్ టైప్ కి సంబంధించినవి. అనూ, ఆపిల్, ఇంస్క్రిప్ట్.. లాంటి టైపింగ్ ఉపకరణాలు వాడితే అనూ ఫాంట్స్ ఆ ఫోటోషాప్ లో భేషుగ్గా అగుపిస్తాయి. ఇక్కడ - ఈ టైపింగ్ పద్దతులు, ఫాంట్స్ వేరువేరు అని అర్థమవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అంతా ఈజీనే.. ఇది కొద్దిగా తికమకగా ఉన్నా - మీకొచ్చిన సమస్య చాలా చిన్నది. మీరు ఇలా ?????.. గా వస్తుందని అన్నారు కదా.. అదే టైపింగ్ ని మార్కింగ్ ద్వారా కాపీ చేసుకొని, MS Paint లేదా పవర్ పాయింట్ లో వాడితే శుభ్రముగా గూగుల్ ఫాంట్స్ లో మీరు పేస్ట్ చేసిన విషయమంతా కనిపిస్తుంది. కావాలంటే చెక్ చేసి చూడండి. 

Wednesday, July 27, 2016

[తెలుగుబ్లాగు:22376] యూనికోడ్ లో ౠ Roo in Unicode

దయచేసి తెలుగులో అవగ్రహం ऽ యూనికోడ్ లో టైపింగ్ ఎలా చేయాలో తెలుపగలరా?
అలాగే RU దీర్ఘ ఋకారాంతం టైపింగ్ ఎలా చేయాలో తెలుపగలరా? అనే ప్రశ్నకు నా సమాధానం.. 



మీరడిగిన సందేహానికి - యూనికోడ్ లో తప్పక సమాధానం ఉంది. కాకపోతే యూనికోడ్ లోని తెలుగుని - పద్యాల వంటి వాటికి అంతగా నాకు అవసరం లేకపోవడం వల్ల నేనెన్నడూ ఉపయోగించలేదు.. ఇప్పుడు మీకోసమని ప్రయత్నించాను. ఈ యూనికోడ్ ని ఆపిల్ తరహాలోనో, మరే ఇతర క్రొత్త పద్ధతిలోనో టైపింగ్ చేసుకోవచ్చేలా సులభమైన పద్ధతిని తెలుసుకున్నాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే : యూనికోడ్ తెలుగు తప్ప మరే ఇతర పద్ధతుల్లో (ఆపిల్, ఇంస్క్రిప్ట్ పద్ధతులు) నేనెప్పుడూ వాడలేదు. అంటే అవి ఎందులోనో తక్కువ అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు.. అలాని అనిపించినట్లు ఉంటే క్షమించాలి. నేను మొదటగా నేర్చుకున్నదీ యూనికోడ్ ఫోనెటిక్ టైపింగే. అదే అలవాటయిపోయి దాన్నే ఇంకా వాడుతూనే ఉన్నాను. నాకున్న తెలుగు టైపింగ్ అవసరాలు యూనికోడ్ ( ఫోనెటిక్ Phonetic ) లో తీరిపోతున్నాయి కాబట్టి ఆ ఇతర పద్ధతుల్లోకి గత పదేళ్లుగా ఎన్నడూ వెళ్ళలేదు.. (ఈమధ్యే MS paint అవసరాలకోసం వెళ్లాలనిపిస్తున్నది.)

నేను ఇప్పుడు చెబుతున్న ఈ క్రొత్త పద్ధతిని వాడి, అలా కూడా ఎలా టైపింగ్ చేసుకోవచ్చునో అందరికీ తెలియచేయగలరు. ఇది కాస్త పెద్దగా అయిననూ, ఇక్కడే మీకు చెబుతున్నాను. గ్రూప్ లోని మిగతా వారికి కూడా ఉపయోగపడుతుందని.. 

# ముందుగా మీరు గూగుల్ ట్రాన్స్లిటరేషన్ సాఫ్ట్వేర్ ని ఈ లింక్ https://www.google.com/inputtools/windows/  నుండి డౌన్లోడ్ చేసి, మీ సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోండి. 

# మీ సిస్టం లో అది ఇన్స్టాల్ అయ్యాక - సిస్టం ట్రే లో - సమయం / తేదీ ప్రక్కగా EN అని కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే ఆ సాఫ్ట్ వేర్ మీ సిస్టంలో ఇన్ స్టాల్ అయ్యిందని అర్థం. ఈ క్రింది ఫోటోలో  ఎర్ర వృత్తంలో చూపినట్లుగా EN అని కనిపిస్తున్నది. 



# ఇప్పుడు ఆ EN ని నొక్కితే మీరు కోరుకున్న భాషని (తెలుగు) ఎన్నుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది. అందులో క్రిందన ఉన్న తెలుగుని క్లిక్ చేసి, ఎంచుకోండి. అప్పుడు సిస్టం ట్రే లో EN స్థానాన TE ( పటంలో 1 ) మారుతుంది. ఇలా వస్తే - తెలుగులో  టైపు చేసుకోవడానికి మీ కీబోర్డ్ సిద్ధముగా ఉందని అర్థం. 


# అలా తెరచినప్పుడు ( చిత్రములో 2 ) లా ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది. అందులోని బాణం గుర్తుమీద కర్సర్ ని ఉంచితే అది మూవ్ Move గుర్తు చూపిస్తుంది. రెండవదైన తె మీద కర్సర్ తో నొక్కితే - వచ్చే ఆప్షన్ వల్ల English కూ, తెలుగుకీ వెనువెంటనే మారవచ్చును. 

# మూడవదైన కీబోర్డ్ గుర్తు ( చిత్రములో 3 ) మీద నొక్కితే - ఇప్పుడు మీకు అవసరమయ్యే ఒక తెలుగు అక్షరాల టూల్ బాక్స్ తెరచుకుంటుంది. దీని లోని అచ్చులూ, హల్లులూ, గుణింతాల వల్ల కొన్ని ప్రత్యేక అక్షరాలూ, పదాలు వ్రాయవచ్చును. దీనితోనే మీరు కావాలనుకున్న అక్షరాలని ( నేరుగా ) పొందవచ్చును. 

# చిత్రములో 4 వద్ద నున్న నాలుగు చతురస్రాల గుర్తుని నొక్కితే ( ఇది డిఫాల్ట్ గా ఉంటుంది ) ఆ ప్రత్యేక తెలుగు అక్షరాల టూల్ బాక్స్ తెరచుకుంటుంది. ఇందులోనే మీకు కావలసిన  ఇక్కడే దొరుకుతుంది. ఇందాక టైప్ చేసిన ఆ అక్షరం - ఆ బాక్స్ లో దిగువ కుడి మూలన ( చిత్రములో ) ఉంది. దాన్ని మౌస్ కర్సర్ సహాయన నొక్కితే ఆ అక్షరం నేరుగా మీకు లభిస్తుంది. అలాగే నేను ఇక్కడ ఇందాక వాడాను. 

# అదే కాకుండా ఇంకో రకముగా కూడా ఆ బాక్స్ ని వాడి ఆ  ని నేరుగా పొందొచ్చు. ఎలా అంటే : ఆ బాక్స్ లోని  ( బాక్స్ లో నాలుగవ లైనులోని ఆరవ అక్షరం ) ని అలా ఎంచుకున్నాక, అదే బాక్స్ లోని ( ఐదవ లైనులో చివరన ఉన్న) కొమ్ముని మళ్ళీ ఎంచుకుంటే, ఇప్పుడు వచ్చిన అక్షరం బు అవుతుంది. ఇప్పుడు దీనికి ఆ బాక్స్ లోని ( ఆరవ లైనులోని మొదటి దాన్ని అంటే ) కొమ్ము దీర్ఘాన్ని దీనికి జత చేస్తే - ఇప్పుడు మీకు కావలసిన  ని యూనికోడ్ లోనే పొందవచ్చును. ఇలా ప్రయత్నిస్తే బహుశా అన్ని అక్షరాలూ పొందొచ్చు - అని అనుకుంటున్నాను. 

# ఇదే ౠ కి మరో కొమ్ముని కూడా జత చెయ్యవచ్చు - ఇది ఎందుకు చెబుతున్నానూ అంటే - ఇది ఎంత యూజర్ ఫ్రెండ్లీ కీ బోర్డ్ User friendly key board అని చూపెట్టటానికి. రుజువుగా ఇదిగో..  బుుుు ఇలా కూడా వ్రాయవచ్చును. ఇప్పుడైనా నమ్మగలరా? 

# చిత్రములో 5 వద్ద చూపినట్లుగా కీ బోర్డ్ గుర్తుని మౌస్ కర్సర్ సహాయాన నొక్కితే ఆపిల్, ఇంస్క్రిప్ట్ కీబోర్డ్ లాంటిది తెరచుకుంటుంది. యూనికోడ్ లో దీన్ని నేనెప్పుడూ వాడలేదు. కనుక దీని గురించి నాకు అంతగా తెలీదు. కారణం - పద్యాల తెలుగులో వ్రాసేందుకు నాకెప్పుడూ అవసరం ఏర్పడలేదు కాబట్టి. ఎవరికైనా ఉపయోగపడుతుందని ఆ కీబోర్డ్ చిత్రం కూడా ఇక్కడ చూపిస్తున్నాను. 



ఇక మీ సందేహాలు తీరాయని నేను అనుకుంటున్నాను  

తాజా కలం :: పైన పోస్ట్ లో వ్రాసిన ప్రతి తెలుగు అక్షరమూ గూగుల్ వారి యూనికోడ్ ని ఉపయోగించి వ్రాసినదే అని గమనించగలరు. 


Friday, February 12, 2016

[తెలుగుబ్లాగు:22336] కి నేనిచ్చిన సమాధానం.

Vruthavam yelaga pettali.

udaharanaku :- Naa Maatrubhasha telugu. indulo Maatrubhasha ra ki vruthvam raavali antye yela type cheyyali.

teliyacheppagalaru. 

పై ప్రశ్నకి నేనిచ్చిన సమాధానం : 

వృత్వం ఎలా పెట్టాలో అడిగారు కదూ.. 
మీరు అడిగినది ఇన్ స్క్రిప్ట్ లోనా లేక గూగుల్ ట్రాన్స్లిటరేషన్ లోనా తెలియచెయ్యలేదు. ఇన్ స్క్రిప్ట్ అయితే నాకు తెలీదు.. గూగుల్ ట్రాన్స్లిటరేషన్ లో అయితే నేరుగా టైపింగ్ లో రాదు. పదాన్ని పూర్తిగా టైప్ చేస్తూ ఉండగా వచ్చే పదకోశంలో సరియైన పదాన్ని ఎంపిక  చేసుకోవాలి. 

ఉదాహరణకు : maatrutvam మాతృత్వం 
Inline images 1

maatrubhaasha మాతృభాష 
Inline images 2

kru కృ 
Inline images 3

vru వృ 
Inline images 5

truna తృణ 
Inline images 6

Wednesday, August 12, 2015

[తెలుగుబ్లాగు:22292] pasting problem

[తెలుగుబ్లాగు:22292] pasting problem  typed matter in lekhini is not pasted on word document. what to do? కి నేనిచ్చిన సమాధానం :                        
( అక్కడ ఇచ్చిన సమాధానానికి కన్నా కాస్త వివరంగా ఇక్కడ చెబుతున్నాను. )

 ముందుగా మీరు లేఖిని సైట్ లోకి వెళ్ళి, తెరవండి. అందులో పైన గడిలో రోమన్ ఇంగ్లీష్ లో anTE ilA టైపింగ్ చేసుకోవాలి. అలా చేస్తూ ఉంటే డిఫాల్ట్ సెట్టింగ్ బట్టి వెనువెంటనే తెలుగులోకి మారుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఆ క్రిందన ఉన్న గడిలో వచ్చిన తెలుగు పదాలు - సరియైన పదాలు - అచ్చుతప్పులూ, భావం సరియైనవేనా నిర్ధారించుకోండి. అలా గమనిస్తూ టైపింగ్ చేస్తూ వెళ్ళండి. 


అలా కొద్దికొద్దిగా టైప్ చేస్తూ కాపీ చేసుకుంటూ వెళ్ళండి. ఒక పేరా కాగానే దాన్ని మీ మౌస్ సహాయన క్రింద గడిలో ఉన్న తెలుగులోకి మారిన విషయాన్ని మార్కింగ్ చెయ్యండి. అలా చేసినప్పుడు ఆ విషయం అంతా నీలిరంగులోకి మారుతుంది. ( క్రింది ఫోటో చూడండి ). అప్పుడు మీ కీ బోర్డ్ న ఉన్న Control + C అనే రెండు మీటల్ని ఒకేసారి నొక్కితే ఆ విషయం అంతా కాపీ అవుతుంది. 


ఇప్పుడు మీ సిస్టం న ఉన్న Microsoft వారి word pad తెరవండి. అందులో ఉన్న పేజీ మీద ఒకసారి మీ మౌస్ ని క్లిక్ చెయ్యండి. అలా చేశాక - ఇప్పుడు Control + V అనే రెండు మీటల సహాయాన ఒక్కసారిగా నొక్కితే ఆ కాపీ చేసిన విషయం అంతా అక్కడ పేస్ట్ అవుతుంది. ( క్రిందన ఉన్న ఫోటో చూడండి )  


అపుడు ఆ వర్డ్ ప్యాడ్ ని సేవ్ చేసుకుంటే సరి. అంతే!

                           
                           
                                 
                               

Wednesday, May 13, 2015

ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు

ఈ మధ్య తెలుగు దినపత్రికల్లో - ఆంగ్ల పదాలకు బదులుగా తెలుగు పదాలని వాడుతూ తెలుగు భాషని నలుదిశలా విస్తరించటానికి, అలాగే తెలుగు భాషపట్ల ఆసక్తినీ కలుగ చేస్తున్నాయి. ఇలా ఇంగ్లీష్ పదాలకు బదులుగా తెలుగు పదాల ప్రయోగం కొంత క్రొత్తగా, వింతగా ఉన్నా వాడుకలోకి వచ్చాక అది మామూలు పదమైపోతుంది. అలాంటి కొన్ని పదాల సేకరణని ఇక్కడ ఇస్తున్నాను. వీలువెంట మళ్ళీ క్రొత్తపదాల చేర్పు ఉంటుందని తెలియచేసుకుంటున్నాను..

Internet -- అంతర్జాలం 
Cellphone -- సంచారవాణి
Air hostess -- గగనసఖి
Browser -- విహారిణి
Gel -- జిగురు ద్రవం 

Wrong direction -- అపసవ్య దిశ
Refund -- వాపసు చేయటం
Contract workers -- ఒప్పంద కార్మికులు / ఉద్యోగులు
No frills -- శూన్య మొత్తం
Information Technology -- సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం 

Outsource -- పొరుగు సేవ
Lubricant -- కందెన
(Dinner) Menu -- (విందు) జాబితా
Mass copying -- మూక చూచిరాత 
Value added services -- విలువ జత చేరిన సేవలు 

Non-convertible debentures -- మార్పిడికి వీలు లేని రుణ పత్రాలు 
BPO (Business process outsourcing) -- వ్యాపార పొరుగు సేవలు 
Board -- నామసూచిక 
Fonts -- ఖతులు 
User name -- వినియోగ నామము 

Password -- సంకేత నామము
Sign board -- నామసూచిక 
Single Window -- ఏక గవాక్షం 
Tablets -- గుళికలు 
Font -- ఖతి 

Account -- ఖాతా 
Touch Screen -- తాకిడి తెర. 
Circle Inspector -- వలయాధికారి / పోలీసు అధికారి 
Add -- చేర్చు 
Eduction officer -- విద్యాధికారి 

Regularization -- క్రమబద్ధీకరణ  
Transformer -- నియంత్రిక 
Contractor -- గుత్తేదారు 
Fire Engine -- అగ్నిమాపక శకటం 
Disturbances -- అవాంతరాలు 

Age Limit -- వయోపరిమితి 
File -- దస్త్రం 
Astronaut -- వ్యోమగామి 



Saturday, August 23, 2014

Telugu in G mail body

[తెలుగుబ్లాగు:22293] ప్రశ్నకి సమాధానంగా నేనిచ్చిన జవాబు: 

మీరు అంటున్నది జీ మెయిల్ లో తెలుగులో వ్రాయటం అన్నది అనుకుంటాను. జీ మెయిల్ లో ఒకప్పుడు తెలుగులో వ్రాయుటకు ఒక పనిముట్టు అని టూల్ బార్ లో ఉండేది. జీ మెయిల్ నవీకరణలో ఆ పనిముట్టు తొలగిపోయింది. ఇప్పుడు  క్రొత్తగా వేరే పద్ధతిలో ఇస్థున్నారు. మీరు చెయ్యాల్సిందల్లా - ఈ క్రింది తెరపట్టులో చూపిన విధముగా అనుసరించండి. అప్పుడు మీరూ జీ మెయిల్ లో తెలుగులో వ్రాయుటకి సౌలభ్యముగా ఉంటుంది. 

 
1. వద్ద ఉన్న చక్రం గుర్తు ( సెట్టింగ్స్ గుర్తుని ) నొక్కండి. 

2అప్పుడు తెరచిన సెట్టింగ్స్ పేజీలో పైన టూల్ బార్ లో ఉన్న ( 2 ) General డిఫాల్ట్ గా తెరవబడి ఉంటుంది. 

3వద్ద నున్న Enable Input tools ప్రక్కనున్న గదిలో మౌస్ తో టిక్ చెయ్యండి. 

4ఆ లైనుకు చివర ఉన్న Edit tools లంకెని నొక్కండి. అప్పుడు మీకు ఒక భాషల పనిముట్లు గల మెనూ వస్తుంది. ఎడమన ఉన్న గడిలోంచి, కుడి గడిలోకి మీరు ఎంచుకున్న భాషని ( ఉదాహరణ : తెలుగు ) మౌస్ సహాయాన డ్రాగ్ చెయ్యండి. క్రిందన  Save  నొక్కండి. 

5. ఇప్పుడు మీరు సెట్టింగ్స్ చిహ్నం ప్రక్కన  ( 5 ) అనే భాషా పనిముట్టు కనిపిస్తుంది. దాన్ని నొక్కి, ilaa roman telugulo vraasthoo unte - padam padaaniki venuventane తెలుగులోకి మారుతుంది. అలా వ్రాస్తూ స్పేస్ బార్ నొక్కగానే - అక్కడ తెలుగు ఫాంట్ లో మీరు వ్రాసినది వస్తుంది. 

ఒక పరిశీలన కోసం ఇక్కడ ఒక ఉదాహరణని మీకు చూపిస్తున్నాను.. గమనించండి. 





Saturday, September 28, 2013

Telugu padaalu design cheyadam ela

[తెలుగుబ్లాగు:22057] Telugu padaalu design cheyadam ela


thelugu paddalanu veru veru design lo vrayadam ela 
అని తెలుగు బ్లాగు గ్రూప్ లో ఒకరు అడిగిన ఈ ప్రశ్నకి నా సమాధానం -


మీరు అడిగినది - తెలుగు పదాలని - ఈ కార్డ్స్ లలో ఫోటోల మీద తెలుగులో ఎలా వ్రాయాలో అని అనుకుంటాను. ఒకవేళ అదే అయితే - ముందుగా మీరు మీ కలన యంత్రం (కంప్యూటర్) లో తెలుగు ఖతులు (ఫాంట్స్) స్థాపితం చేసుకోవాలి. 

మీ సిస్టం లో డిఫాల్ట్ గా - 
విండౌస్ XP లో అయితే - గౌతమి, 
విండౌస్ 7 అయితే - కాలిబ్రి (Calibri) ఖతులు ఉంటాయి. 

ఇంకా తెలుగు ఖతులు కావాలంటే - యూనికోడ్ ఖతులు అయితే - తెలుగు విజయం  http://teluguvijayam.org/fonts.html వారి సైట్ లోనూ (ఇవి ఉచితం), అక్షరమాల .. కి అయితే అను సంస్థ వారి ఖతులు కొనుగోలు చేసి, మీ కలన యంత్రములో స్థాపించుకోవాలి. 

అచ్చంపేట్ రాజ్. 


Wednesday, April 4, 2012

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా - 13

ఇప్పుడు కొన్ని ఆంగ్ల పదాలని టైప్ చెయ్యటం ఎలాగో చూద్దాం. ఈ ఇంగ్లీష్ పదాలని టైప్ చెయ్యటం కాసింత కష్టమే. అయినా ఈక్రింద వివరించినట్లుగా టైప్ చేస్తే చాలా మామూలుగా, వేగముగా టైప్ చేసుకోవచ్చును. ఈ పద్ధతి గూగుల్ వారి ట్రాన్స్లిటరేషన్ పద్ధతి లో వ్రాయట గురించి చెబుతున్నాను. గమనించుకోగలరు.

English word = అలా టైప్ చేస్తే తెలుగులో వచ్చేది = టైప్ చెయ్యాల్సిన పద్ధతి = తెలుగులో వచ్చేది.

type = టైపు = typ టైప్
half = హాల్ఫ్ = haaf హాఫ్
testimonial = తెస్తిమోనిఅల్ = testi + moniyal = టెస్టి + మొనియాల్ (సేపరేటుగా టైప్ చేసి, కలపాలి)
reciepes = రేసిఎపెస్ = reseeps = రేసీప్స్
mutton = ముట్టన్ = matan = మటన్
pickles = పిచ్క్లేస్ = pikils = పికిల్స్
confusing = కాంఫుసింగ్ = kanfujing = కన్ఫుజింగ్
verification = వేరిఫికాతిఒన్ = verifikeshan = వెరిఫికేషన్
aquariums = అకుఅరిఉమ్స్ = akveriyams = అక్వేరియంస్
invitation = ఇంవితతిఒన్ = inviteshan = ఇన్విటేషన్
calculator = కాల్సులతోర్ = kaalculeter = కాల్కులేటర్ 

Saturday, May 8, 2010

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా - 12

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా లో ఇప్పుడు అతి ముఖ్యమైన పాఠం నేర్పబోతున్నాను. ఇది ఎప్పుడో చెప్పేది కాని.. నేను అనుకున్న పదాలు చాలావరకి గూగుల్ వాడు మార్చేశాడు. అంటే ఇలా టైప్ చేసి స్పేస్ నొక్కితే వచ్చేవి అనుకొని చెప్పే పదాలు అన్నీ.. అలా రావటం లేదు.  ఫేస్బుక్, యాహూ ధాటికి ఈ మధ్య కొద్దిగా వెనకబడ్డ గూగుల్ తన స్థానాన్ని నిలబెట్టుకోవటానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఎంతగా మారుస్తున్నాడూ అంటే రోజుకు కనీసం ఒకటైనా మారుతున్నది. గూగుల్ యొక్క జి మెయిల్, చాట్, ఆర్కుట్, ఆర్కుట్ లోని చాట్, బ్లాగర్... ఇలా అన్నింట్లోనూ చాలా చాలా మార్పులు వచ్చాయి. ఏవో ఒకటి, రెండు మినహా నిజానికి ఇవన్నీ చాలా తేలిక పద్దతులు. అలా మార్చిన వాటిల్లో నా ఎంచుకున్న పదాలు కూడా ఉన్నాయి. వాటిని ఓదగ్గర వ్రాసుకున్నాను కాని.. వాటిని పేస్ట్ చేసే సమయములో చెక్ చేసుకుంటే రావటం లేదు. మామూలుగాఎలా వ్రాస్తామో అలాగే వ్రాస్తే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పెట్టబోయే పదాలని కూడా ఎంత కాలము పనికివస్తాయో తెలీదు. అయినా తప్పదుగా.. అందుకే ఇలా కంటిన్యూ చేస్తున్నాను.

ఇందులో మీకు ముఖ్యమైన సూత్రం ఏమిటంటే: తెలుగు పదాలు టైపింగ్ లో రాకుంటే ఎలా మాట్లాడుతామో అలాగే వ్రాయండి. అప్పుడు స్పేస్ నొక్కితే తెలుగు లోకి వస్తుంది.

ఇప్పుడు  కొన్ని ఉదాహరణలు చెబుతున్నాను.. చూడండి: 
Register = రిజిస్టర్  = Rijistar / rijishtar = రిజిస్టర్ (చూశారా.. అప్పుడు రాదనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేస్తున్నది.)
available = అవైలబ్లె = availabul = అవైలబుల్
month = మొంత్ = manth = మంత్
promote = ప్రోమోతే = pramot = ప్రమోట్
donate = దొనతె = donet = డొనేట్
update = ఉప్దతె = apdet = అప్డేట్
visitors = విసితొర్స్ = vijitars = విజిటర్స్
mechine = మేచినే = meshin = మెషీన్
Browse = బ్రౌసె = brous = బ్రౌస్
Enable = ఎనబ్లె = Enebul = ఎనేబుల్
Exersizes = ఏక్షెర్సిజెస్ = Eksarsaijulu = ఎక్సర్సైజులు
Specials = స్పెసిఅల్స్ = Speshals = స్పెషల్స్
Surprise = సుర్ప్రిసె = Sarpraij = సర్ప్రైజ్
presentation = ప్రెసెన్తతిఒన్ = prajenteshan = ప్రజెంటేషన్
speciality = స్పెసిఅలితి = speshaalitee = స్పెషాలిటీ
verification = వెరిఫికతిఒన్ = Verifikeshan = వెరిఫికేషన్
perfectionist = పెర్ఫెక్తిఒనిస్త = parfekshanist = పర్ఫెక్షనిస్ట్
fashion = ఫషిఒన్ = faashan / fyaashan = ఫాషన్ / ఫ్యాషన్

చూశారా.. ఇలాంటివి చాలానే ఉన్నాయి.. ఇలాగే మాట్లాడుతున్నప్పుడు ఎలా పలుకుతామో అలా వ్రాయాలి.

Tuesday, April 13, 2010

బ్లాగుని తెలుగులో వ్రాయాలనుకుంటే..

బ్లాగుని తెలుగులో వ్రాయాలనుకుంటే మీరు ఇలా చెయ్యండి.

ముందుగా మీ బ్లాగుని తెరచి, Settings ని నొక్కండి. అందులో క్రింది వైపున Global Settings 1ఇలా ఉంటుంది..


2. ఇందులో ఉన్న మొదటిది: select post editor :: ఇందులో మీరు మొదటిది అయిన Updated editor ని ఎన్నుకోండి. ఇది  Old editor కన్నా బాగుంటుంది. 

ఇక రెండోది అయిన Enable Transliteration :  మొదటి గడిలో Enable 3 ఎంచుకొని, రెండో గడిలో Telugu 4 ని ఎంచుకోండి. ఆతర్వాత Save Settingsని నొక్కండి. 

ఇక ఇప్పుడు బ్లాగు హోం పేజి తెరచి, అందులోని ఇలా ఉన్న టూల్ బార్ లో 



 అన్న అక్షరం వద్ద ఉన్న చిన్న త్రికోణాన్ని నొక్కండి. అప్పుడు ఇలా వస్తుంది. 


ఇందులో తెలుగు ని ఎంచుకొని వ్రాసేసేయండి. ఇక akkada ilaa roman engleeshulo vraasthoo spes baar nokkagaane తెలుగులోకి మారుతుంది.. 

మీకు శుభం కలుగు గాక!

Thursday, March 18, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 11

ఇప్పుడు ఇంగ్లీష్ పదాలని తెలుగులో వ్రాయడం గురించి చెబుతాను.

అన్నింటికన్నా కష్టమైనది అంటే ఇదే! - అని అనుకుంటారు కాని ప్రయత్నిస్తే సులభముగానే ఉంటుంది. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. అసలు ఎలా వ్రాయాలో తెలిసేది కాదు. ఎవరిని అడగాలో తెలీదు.. ఎలా వ్రాయాలో తెలీదు.. చెప్పేవారూ లేరు.. నా బ్లాగుని చాలా కాలం క్రిందటే పెట్టినా ఏమీ వ్రాయక వదిలేసాను - గల కారణాలలో ఇదీ ఒకటి. (వ్యవహారిక) తెలుగు భాషలో చాలా ఇంగ్లీష్ పదాలు కలిసిపోయాయి. వాటిని కాకుండా తెలుగులో వ్రాయాలంటే ఎవరికీ అర్థం కాదు.

ఉదాహరణకి :
బస్టాప్ ని అలా వ్రాయాలంటే షట్చక్ర వాహన నిలుపు స్థలం అనీ,
కంప్యూటర్ ని కలన యంత్రం అనీ,
లింకు ని లంకె అనీ,
ఇంటర్నెట్ ని అంతర్జాలం అనీ,
ఫాంట్ లనీ ఖతులు అనీ, 
స్క్రీన్ షాట్ ని తెరపట్టు అని
(నిజానికి అవన్నీ సరియైనవే - అలా వ్రాస్తే చాలా మంది అర్థం చేసుకోరేమో)

ఇలా ఒక్కసారిగా తెలుగులో వ్రాయలేము. అలా వ్రాసిననూ చాలా మంది ఇష్టపడక పోవచ్చు. అంతెందుకూ.. వ్రాయుట అని వ్రాయాలి నిజానికి. చాలామంది రాయుట అనే వ్రాస్తారు. అది తప్పు. వ్రాసినప్పుడు మాత్రం వ్రాయుట అని వ్రాసినా అనాల్సినప్పుడు రాయుట అనే అంటాము. ఇలాంటి విషయాలమీద తరవాత చర్చిద్దాం! ఇప్పడు ఇంగ్లీష్ పదాల గురించి మాట్లాడుకుందాం!

నాకు తెలిసీ ఈ ఇంగ్లీషు పదాలని 4 భాగాలుగా వర్గీకరించవచ్చును.
  1. తప్పకుండా ఇంగ్లీషులోనే టైప్ చేయాల్సినవి.
  2. పదం టైప్ చేసాక స్పేస్ నొక్కడం వల్ల మారే తెలుగులోకి మారే పదాలు.
  3. పదం టైప్ చేసాక బాక్ స్పేస్ నొక్కి ఆ వచ్చే మెనూలో సరియైన పదం ఎంచుకోవడం వల్ల మారే తెలుగులోకి మారే పదాలు.
  4. పదాన్ని ముక్కలు ముక్కలుగా టైప్ చేసి బాక్ స్పేస్ తో వాటిని కలపడం
ఇవీ ప్రస్తుతం నాకు గుర్తున్నంత వరకూ వచ్చినవి. వీటిలో ఒక్కొక్కదాని గురించి వివరముగా తెలుసుకుందాము.

తప్పకుండా ఇంగ్లీషులోనే టైప్ చేయాల్సినవి.

నాకు తెలిసీ ఇందులో చాలా చాలా కొన్నే పదాలు వస్తాయి. ఇలాంటి పదాలు ఇప్పుడైతే నాకైతే అగుపించలేదు. ఒకసారి ఒక పదం టైప్ చేయటం రాలేదు.. ఆ పదమేమిటో నాకు గుర్తులేదు. (ఇలా పాఠాలు చెబుతానని అనుకోలేదు.. అందుకే గుర్తుపెట్టుకోలేదు) ఏమైనా అలాంటి పదాలు వస్తే ఇందులోనే మళ్ళీ ఎడిట్ చేసి వ్రాస్తాను. అంతవరకూ ఈ భాగాన్ని వదిలేద్దాము.
Related Posts with Thumbnails