Showing posts with label 5***** Internet sites. Show all posts
Showing posts with label 5***** Internet sites. Show all posts

Tuesday, August 26, 2014

Orkut - 4 Download Data archive

ర్కుట్ - సోషల్ సైట్ ని మూసేస్తున్నారన్నది మీకందరికీ తెలిసిన విషయమే. అందులోని పోస్ట్స్, మన కామెంట్స్, ఫోటోలకి వచ్చిన కామెంట్స్ నీ, టెస్టిమోనియల్స్, కమ్యూనిటీలలో మనం వ్రాసిన పోస్ట్స్ ని మనం ఎల్లకాలం దాచుకొనే విధముగా ఆర్కుట్ (గూగుల్) వారు ఒక సౌకర్యాన్ని కలిగించారు. దాన్ని ఎలా వాడుకోవాలో మీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఈ విషయాన్ని చాలా ఆలస్యముగా తెలియచేస్తున్నందులకు మన్నించండి. నాకున్న బీజీ జీవితాన అలా అయ్యిందని అర్థం చేసుకోగలరని మనవి. 

క్రింది విధముగా ఆర్కుట్ - సోషల్ సైట్ లో ఖాతాలు ఉన్నవారందరికీ - వారి వారి ప్రోఫైల్స్ లలో మొదటగా కనిపించే విధముగా ఇలా వస్తుంది. ఈ సంవత్సరం 30, సెప్టెంబర్ 2014 వరకూ ఆర్కుట్ ఖాతా  కనిపిస్తుంది. ఆతరవాత ఇక కనిపించదు అని దాని సారాశం. 


మీకు ఒక  ఆర్కుట్ మూసేస్తున్నట్లుగా మెయిల్ వచ్చి ఉండవచ్చును. ఒకవేళ రాకుంటే ఏమీ బాధపడకండి. అందులో ఇచ్చిన ఒక లింక్ ని నొక్కితే ఇలా ఈ పేజి మీకు కనిపిస్తుంది. ఇందులో మీకు కనిపిస్తున్న రెండు లింకుల్లో ఒకటి అంటే Export your photos.. అనే లింక్ ని ఎలా చెయ్యాలో మీకు ముందు పోస్ట్ లో చెప్పాను. ఇప్పుడు మిగిలిన లింక్ అంటే  See your Orkut profile, scraps, testimonials & community to your computer using Google takeout అనే లింక్ ఉంది చూడండీ.. ఆ లింక్ ప్రక్కనే మరొక చల్లని కబురు కూడా చెప్పారు. ఇలా డౌన్లోడ్ చేసుకోవడం అన్నది - సెప్టెంబర్ 2016 వరకూ అన్నది. ఇలా మరో రెండు సంవత్సరాల సమయం ఉందన్నమాట. అయిననూ త్వరపడండి. 


లింక్ ని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఈ క్రింది విధముగా కనిపిస్తుంది. ఇందులో సభ్యుల కోసం కొన్ని సూచనలు ఉన్నాయి. కమ్యూనిటీల ఓనర్స్ కి కొన్ని ముఖ్యమైన సూచనలని అక్కడ ఇచ్చారు. జాగ్రత్తగా చదివి, ఆచరించండి. 

 కౌంట్ నీ, మన పోస్టింగ్స్ నీ ఎలా డిలీట్ చేసుకోవచ్చునో అందులో తెలియ చేశారు. అవన్నీ డిలీట్ ఎందుకూ అంటే - గూగుల్ సర్చ్ లో సర్చ్ చేస్తే - పబ్లిక్ ఆప్షన్ గా ఉన్న పోస్ట్స్ అన్నీ కనపడేలా ఎప్పటినుండో ఉంది. అలా ఇక గూగుల్ సర్చ్ లో కనపడకుండా ఉండాలంటే అలా చేసుకోక తప్పదు. మరిన్ని వివరాలకు క్రింది ఫోటో మీద డబల్ క్లిక్ చేసి, తెలుసుకోగలరు. 


ర్కుట్ లోని మన ఇన్ఫర్మేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే - చేసుకుంటే ఏమేమి వస్తాయో, ఎలా ఉంటుందో, అన్నీ ఇక్కడ విపులముగా ఇచ్చారు. అలా డౌన్లోడ్ చేసుకొనే వాటిల్లో - మన ప్రొఫైల్, మనకి వచ్చిన / పొందిన స్క్రాప్స్, వచ్చిన టెస్టిమోనియల్స్, మన ఫొటోస్, కార్యకలాపాలు.. ఇత్యాదివి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన గూగుల్ వారి టేకవుట్ Take out ఇలా ఈ లింక్ నొక్కితే వస్తుంది.. ( https://www.google.com/settings/takeout ) 

విషయం అంతా మనకి ఒక ZIP (  Joint Photographic Experts Group ) ఫార్మాట్ లో ఒక సింగిల్ ఫైల్ ( సైజుని బట్టి ) వస్తుంది. అందులో వచ్చే ఫైల్స్ అన్నీ HTML ( Hyper Text Markup Language ) ఫార్మాట్ లో ఉంటాయి. అంటే ఆ ఫైల్స్ అన్నీ గూగుల్ క్రోం లాంటి బ్రౌజర్స్ లాంటి వల్లే తెరవగలం / చూడగలం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఫొటోస్ అన్నీ JPEG ఫార్మాట్ లో కనిపిస్తాయి. ఈ ఫార్మాట్ అన్ని సిస్టమ్స్, ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్స్ కీ, ఫోటో ఎడిటర్స్ కీ అన్నివిధాలా అనువుగా ఉంటుంది. కనుక అదీ మంచి అంశమే. 


చ్చిన టేక్ అవుట్ పేజీ లింక్ ని నొక్కితే ( పైన ఇచ్చాను చూడండి) ఇలా మీకు కనిపిస్తుంది. అప్పుడు ఈ క్రింద ఎర్రని బాణం గుర్తు కనిపిస్తున్న వద్ద Create an archive ని నొక్కండి. 


ప్పుడు ఇలా గూగుల్ వారి సైట్స్ ఓపెన్ అవుతాయి. అందులో ఆర్కుట్ ప్రక్కన ఉన్న గడిలో టిక్ చెయ్యండి. ఆ తరవాత ఓకే చెయ్యండి. అది ఎలాగో ఈ క్రింది ఫోటో మీద డబల్ క్లిక్ చేసి, చూడండి. 


తరవాత ఇలా గూగుల్ వారి ఆర్కుట్ లోని డాటా కాన్ఫిగర్ చేసుకోవటానికి సిద్ధముగా ఉందని ఇలా కనిపిస్తుంది. 


పై ఫోటోలో 1 Google product ప్రక్కన .zip format change అని ఉంటుంది. ఇది మనకి అవసరం లేదు అయినా డిటైల్స్ చెబుతున్నాను. దాని ప్రక్కన ఉన్న Change ని నొక్కితే ఇలా క్రింది విధముగా కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న త్రికోణం కనిపిస్తుంది. ( ఎరుపురంగు బాణం గుర్తు వద్ద చూపాను ) 

లా తెరచుకున్న దానిలో 
.zip 
.tgz 
.tbz 
ఫార్మాట్స్ కనిపిస్తాయి. అంటే మనం ఏదైనా గూగుల్ సైట్ నుండి మనం డాటా డౌన్లోడ్ చేస్తే ఆ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతుంది. 

.tgz ఫార్మాట్ ని ఎంచుకుంటే వాటిని మన కంప్యూటర్ లలో చూడటానికి ఆ అదనపు సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. 


.tbz ఫార్మాట్ ని ఎంచుకుంటే వాటిని మన కంప్యూటర్ లలో చూడటానికి ఆ అదనపు సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది అని ఇక్కడ కూడా గుర్తు చేస్తున్నారు. ( క్రింది ఫోటో )


అందువల్ల .zip ఫార్మాట్ యే బెస్ట్. ఇది అన్ని సిస్టమ్స్ లలో ఉంటుంది. అదనముగా యే సాఫ్ట్ వేర్ అవసరం ఉండదు. మనం డాటా ఆర్కైవ్ 2 GB ( గిగాబైట్స్ ) దాటితే అది చిన్న చిన్న జిప్ ఫైల్స్ లలో మారి డౌన్లోడ్ అవుతుంది అని కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు. 


దంతా అంటే .zip, .tbz, .tgz అంటూ చెప్పింది మీకు విషయ పరిజ్ఞానం కోసమే చెప్పాను. వాటిని సెలెక్ట్ చేసుకోవద్దని చెప్పటానికి అదంతా చెప్పాను. ఇక విషయానికి వస్తే - అలా .zip కనిపించాక ఇప్పుడు మీరు బాణం గుర్తు చూపిన వద్దనున్న  Create an archive  అనే ఎరుపురంగులో ఉన్న బటన్ ని నొక్కండి. 


ప్పుడు ఇలా Download a copy of your data అని ఇలా వస్తుంది. మన డాటా అంతా ప్రిపేర్ అవుతున్నట్లు ఇక్కడ ఒక పట్టీలో కనిపిస్తుంది. ప్రక్కనే ఆకుపచ్చని రంగులో  In progress లో ఉన్నట్లు చూపిస్తుంది. అలా రాకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చి, నొక్కాలి. 


లా ఈక్రింది ఫోటోలో చూపిన మాదిరిగా నీలిరంగులో బార్ మొదలయ్యిందీ అంటే మన డాటా ఆర్కైవ్ అవుతున్నట్లు లెక్క. ఇలా వచ్చాక మీరు సిస్టం కట్టేసి, పనిమీద బయటకి వెళ్ళిపోవచ్చును కూడా.  ఆగిపోతుందన్న భయపడాల్సిన పనిలేదు. ఇంకేదైనా పని చేసుకోవచ్చును కూడా.. 


లా మన డాటా ఆర్కైవ్ గా మారాక మన మెయిల్ బాక్స్ కి ఈ క్రింది విధముగా - మన డాటా ఆర్కైవ్ డౌన్లోడ్ కి సిద్ధముగా ఉన్నట్లు మెయిల్ వస్తుంది.


ఆ మెయిల్ ని ఓపెన్ చేస్తే ఇలా వచ్చిన ఆర్కైవ్ ని వారు ఇచ్చిన తేదీలలోగా ఎన్నిసార్లైనా డౌన్లోడ్ చేసుకోవచ్చును. 

అలాగే కంటిన్యూ అయ్యి, ఓపికగా ఎదురు చూసిన వారికి, ఇలా - ఈ క్రింది విధముగా కనిపిస్తుంది. ఇక్కడ మన డాటా సైజు ఎంతో, అది ఎప్పటివరకు అలా ఆర్కైవ్ గా ఉంటుందో, ఎంతకాలములో డౌన్లోడ్ చేసుకోవచ్చో సవివరాలు ఇక్కడ కనిపిస్తాయి. క్రిందన నీలిరంగులో  Download  అని బటన్ కనిపిస్తుంది. అలాగే ఫైల్ పేరు కూడా కనిపిస్తుంది. సాధారణముగా ఈ ఫైల్ పేరు మన ఈ మెయిల్ ఐడి పేరే ఉంటుంది. ( ఇక్కడ ఈ మెయిల్ ఐడి ని  ఆరెంజ్ రంగు డబ్బాతో తీసివేయడం జరిగింది


లా డౌన్లోడ్ ని నొక్కగానే మన గూగుల్ పాస్ వర్డ్ ని మళ్ళీ అడుగుతుంది. స్వంత సిస్టం అయితేనే ఆ పాస్ వర్డ్ ని మళ్ళీ టైపు చెయ్యటం మంచిది. లేకుంటే ఆ డాటా అంతా ఆ సిస్టంలో అలాగే ఉండిపోతుంది. వేరేవారు చూసే వీలు ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏమిటో కూడా కనిపిస్తుంది. ( నేను దాన్ని కనిపించకుండా చేశాను )


ళ్ళీ ముందులా వస్తుంది. అప్పుడు  Download  బటన్ ని మళ్ళీ నొక్కాలి. 


లా మీ డాటా మీ సిస్టం లోకి డౌన్లోడ్ అవుతుంది. ఇలా చేసుకోవటం అన్నది మీ సిస్టం అయితే మంచిది. అందులోని ఫొటోస్, మీ స్క్రాప్స్... వేరేవారి కంట పడవు. డౌన్లోడ్ కాలం అన్నది మీ సిస్టం కాన్ఫిగరేషన్ ని బట్టి, ముఖ్యముగా మీ నెట్ కనెక్షన్ స్పీడ్ ని బట్టీ ఉంటుంది. పగలు కన్నా - రాత్రి పూట పొద్దుపోయాక ఇలా డౌన్లోడ్ పెట్టుకుంటే మరింత వేగముగా డౌన్లోడ్ జరిగిపోతుంది. అలా చేస్తే - నాకైతే 158.9 MB డాటాకి ఆరు నిమిషాలు డౌన్లోడ్ పూర్తవటానికి సమయం పట్టింది. 


డౌన్లోడ్ అయ్యాక గూగుల్ క్రోం లో ఇలా కనిపిస్తుంది. 


డిఫాల్ట్ డౌన్లోడ్ పాత్ అయిన Downloads ని ఓపెన్ చేస్తే అక్కడ ఇలా మన మెయిల్ ఐడి పేరుతో ఒక జిప్ ఫోల్డర్ కనిపిస్తుంది. 

Zip folder

జిప్ ఫోల్డర్ ని అన్ జిప్ చెయ్యాలి. అంటే అన్ జిప్ సాఫ్ట్వేర్ వాడి ఇలా ఓపెన్ చెయ్యాలి. అంటే అందులోని ఫైల్స్ ని ఎక్ష్ ట్రాక్ట్ చెయ్యాలన్నమాట. 

Extract files

ప్పుడు ఇలా వస్తుంది. 

Extracting files
లా వచ్చిన ఆర్కైవ్ డాటా అన్ జిప్ Unzip అవటం మొదలవుతుంది. 

Unzip


లా అప్పుడు మామూలుగా  చూడటానికి వీలుగా ఒక ఫోల్డర్ వస్తుంది. 
ఫోల్డర్ తెరిస్తే మీకు ఇలా కనిపిస్తాయి. 


అందులోని ఫొటోస్ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తే మీ మీ అకౌంట్స్ లలో ఉన్న ఫొటోస్ కనిపిస్తాయి. 

     
ఇలా తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను. 

ఇక్కడ మీకు కొన్ని సూచనలు. 

1. నెట్ కనెక్షన్ స్పీడ్ బాగున్నప్పుడు ఇలా డాటా ఆర్కైవ్, డాటా డౌన్లోడ్ పెట్టేసుకోండి. 

2. మీ డాటా కనెక్షన్ లిమిట్ నీ ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. 

3. రాత్రి పూట - అదీ బాగా పొద్దుపోయాక డౌన్లోడ్ చేస్తే, ఆ సమయంలో డాటా కనెక్షన్ మీద ట్రాఫిక్ వత్తిడి ఉండదు కాబట్టి,  బాగా త్వరగా మీ పని ముగుస్తుంది. 

4. ఆర్కుట్ స్క్రాప్స్ ఒక్కో లింక్ కీ పది స్క్రాప్స్ వస్తాయి. అందులో ఫొటోస్, కామెంట్స్ కూడా ఉంటాయి. బాగున్నవాటిని అట్టే పెట్టేసుకోండి. బాగోలేనివి, వివాదాస్పదమైనవి శాశ్వతముగా డిలీట్ చేసెయ్యండి. వాటిని చూసుకొని బాధ పడటం మంచిది కాదు. కొన్నింటిని నిర్దయగా కాలగర్భములో కలిపేసేయ్యాలి. అలా అయితేనే భవిష్యత్తు జీవనములో హాయిగా ఉంటాం.. 

5. చివరి వరకూ ఆగకండి. అందరూ ఒకేసారి ప్రయత్నిస్తే - సర్వర్ క్రాష్ అయ్యి, పనిచెయ్యక పోవచ్చును. అప్పుడు శాశ్వతముగా మీ జ్ఞాపకాలు కోల్పోవాల్సి రావచ్చును. 

6. ఆర్కుట్ అకౌంట్ లో మీరు ఇప్పుడు ఆక్టివ్ గా ఉంటున్న సోషల్ సైట్ అడ్రెస్ మరియు అందులోని మీ ప్రొఫైల్ లింక్ మీ స్నేహితుల వారికి అందించండి. అందరికీ కనపడేలా మీ స్క్రాప్ లో వ్రాసి, పబ్లిక్ / ఫ్రెండ్స్ కి కనపడేలా సెట్టింగ్స్ పెట్టి పోస్ట్ చెయ్యండి. 

7. కొన్ని స్క్రాప్స్, పోస్ట్స్, ఫొటోస్ డౌన్లోడ్ లో మిస్ అవుతుండ వచ్చును. అందుకని వాటిని స్క్రీన్ షాట్స్ ద్వారా కాపీ చేసుకోగలరు. 

Wednesday, July 23, 2014

Orkut 2

http://achampetraj.blogspot.in/2014/07/orkut.html తరవాయి..

ఆర్కుట్ సోషల్ సైట్ వారు మనకొక అద్భుత అవకాశాన్ని ఇచ్చారు. ఆ సైట్ లో మనం వ్రాసిన, పోస్ట్ చేసిన, కామెంట్ చేసిన వాటన్నింటినీ అచ్చు అలాగే - అంటే మనం అక్కడ పాల్గొన్నప్పుడు ఎలా అక్కడ కనిపించిందో, అచ్చు అలాగే మనకి కనిపించేలా, మళ్ళీ మళ్ళీ మనం వ్రాసినదీ చూసుకొనేలా ఏర్పాటు చేశారు.

నమ్మశక్యముగా లేదు కదూ.. కానీ అది నిజమే. ఎలాగూ సైట్ మూసేస్తున్నాం కదా.. ఇక అందులోని సభ్యుల భావాలు, జ్ఞాపకాలని అలా కాలగర్భములో కలిపేయకుండా, డౌన్లోడ్ చేసుకొనే ఆప్షన్ ఇవ్వడం వల్ల ఆ సైట్ బాధ్యాయుతముగా ప్రవర్తించిందనే చెప్పాలి. అందులకు వారిని అభినందిస్తున్నాను.

ఇలా చెయ్యడం నాకు ఎంతగానో నచ్చేసింది. ఎంతగానో కష్టపడి క్రియేట్ చేసిన ( కాపీ పేస్ట్ చేసినవీ ) వాటన్నింటినీ పొందటం ఒకరకముగా అదృష్టమనే చెప్పాలి. బాగా నచ్చిన వాటన్నింటినీ కాపీ చేసుకోవాలంటే ఎంత కష్టం ? కాపీ చెయ్యాలనుకున్నా ఎలా చెయ్యాలో చాలామందికి తెలీదు. అందరూ టెక్నో సావీలు కారు కదా.. సాంకేతికముగా అందరూ ఫుల్ పర్ఫెక్ట్ అయి ఉండరు కదా..

స్క్రీన్ షాట్స్ తీసుకొని భధ్రపరచుకోవాలనుకున్నా, అదెలా చెయ్యాలో కూడా తెలీదు. ఒకవేళ చెయ్యటం వచ్చినా - మానిటర్ సైజు బాగుండాలి. వాటన్నింటినీ అలా చేసుకొనే ఓపిక ఉండాలి. అలా ఎంతమందికి ఉన్నది అన్నది లెక్కిస్తే సమాధానం దొరకకపోవచ్చును.

అందమైన, వెలకట్టలేని అనుభూతులని ఇచ్చిన ఆర్కుట్ వారే - కాస్త పెద్దమనసు చేసుకొని, వాటన్నింటినీ ఒక ఫోల్డర్ గా డౌన్ లోడ్ ఆప్షన్ గా ఇవ్వటం చాలా మంచి ఐడియా. యే సభ్యుల వల్ల తమ సైట్ ప్రఖ్యాతి చెందిందో, వారి ఋణాన్ని తిరిగి చెల్లించేసుకోవడం అన్నది ఇలాగ కూడా కావచ్చన్నది - నా అభిప్రాయం.

ఈ డౌన్ లోడ్ ఆప్షన్ లేకుంటే - జీవితాన జరిగిన కొన్ని మధుర క్షణాలని మనసు పొరల్లోనే దాచుకోకుండా ఇలా మన కంప్యూటర్ లలో దాచుకొని, అప్పుడప్పుడు ఫోటో ఆల్బమ్ లా చూసుకోనేలా వీలు కల్పించడం చాలా చాలా మంచి ఆలోచన. ఇందులకు ఆ ఆర్కుట్ ( గూగుల్ ) వారికి నేను ఎంతగానో ఋణపడి ఉంటాను.

ఇక ఆ ఆర్కుట్ ప్రొఫైల్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో త్వరలోనే వివరముగా చెబుతాను. అంతవరకూ వేచి చూడండి.

ఇంకా వుంది. 

Saturday, July 19, 2014

Orkut

ఆర్కుట్ 

ఈ ఆర్కుట్ అనే సోషల్ మీడియా సైట్ ఒకప్పుడు ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ సైట్ క్రియేట్ చేసిన Orkut Büyükkökten దూరం అయిన తన గర్ల్ ఫ్రెండ్ ని తిరిగి పొందాలనుకొని, ఏర్పరిచిన ఈ సైట్ అందరినీ ఆకర్షించింది.  ఎందరెందరో ఈ సైట్ లో చేరారు. తమ తమ అనుభూతులనీ, భావాలనీ, భావోద్వేగాలనీ ప్రకటించుకున్నారు, పంచుకున్నారు కూడా. ఫేస్ బుక్ రాకతో ఆర్కుట్ ప్రాభవం తగ్గిపోయింది. అప్పుడూ ఇప్పుడూ ఆర్కుట్ సైట్ యొక్క వీక్షకులు ఆయా దేశాల వారిగా ఇలా ఉంది. 

నా మటుకు మాత్రం నేను ఈ సైట్ లో చాలా ఆలస్యముగా మొదలెట్టాను. 2008 లో ఈ సైట్ లోకి నా బంధు మితృల చలవ వల్ల అడుగుపెట్టాను. వారికోసం వచ్చిన నాకు ఈ సైట్ చాలా బాగా నచ్చేసింది. ఆ తరవాత ఎన్నెన్నో సైట్స్ వచ్చినా నాకు ఒకే ఒక సైట్ లో సభ్యత్వం ఉండాలని ( నాకున్న అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకూడదని ) దానిలోనే కొనసాగి, దాని ప్రాభవం తగ్గిపోయే వరకూ ( 2012 చివరి వరకూ ) ఉండిపోయాను. 

ఈ ఆర్కుట్ లో నాకు అనేకానేక అనుభవాలు. ఆన్లైన్ స్నేహాల ప్రపంచములో ఓనమాలు నేర్చుకుంటూ వెళ్ళిన నాకు - ఇదే బ్లాగ్ లో ఆన్లైన్ స్నేహాల గురించి వివరముగా వ్రాయటానికి ప్రేరణ, విషయం, సమాచారం, భావోద్వేగాలు, అనుభూతులు అన్నీ అక్కడ అనుభవాలే. ఎన్నెన్నో తీయని జ్ఞాపకాలు. అవన్నీ చెప్పాలంటే పోస్ట్స్ మీద పోస్ట్స్ వేసుకుంటూ వెళ్ళినా ఇంకా మిగిలే ఉంటాయవి. క్లుప్తముగా చెప్పాలీ అంటే - ఆ సైట్ లో చేరిక వల్ల నేను ఎంతో ఆనందాన్ని, అనుభూతులనీ, మధుర జ్ఞాపకాలనీ, చక్కని పరిచయాలనీ, నావాళ్ళు అని చెప్పుకోదగ్గ చక్కని స్నేహితుల్నీ, స్నేహితురాళ్ళనీ  పొందాను. ఎవరికేలా కనిపించినా నామటుకు మాత్రం నాకు అద్భుతమైన జ్ఞాపకాలు మిగిపోయాయి. అంటే ఆ సైట్లో చేరి నేను విజయం సాధించి, గొప్పనైన చక్కని జ్ఞాపకాలని మూటగట్టుకున్నానన్నమాట. ఇంతకన్నా విజయం ఏముంటుంది? నా జీవితాన చక్కని అనుభూతులు శాశ్వతాన మిగిలిపోయిన సమయం అది. ఇందులకు ఆ ఆర్కుట్ కి ఎంతగానో ఋణపడిపోయాను. ఆ ఋణాన్ని ఎలా తీర్చుకోగలనో !! అది ఈ జన్మకి తీర్చుకోనేమో.. 

అలాంటిది ఒక్కసారిగా ఇలా నా హోం పేజీ మీద కనిపించేసరికి షాక్ అయ్యాను. ఎక్కడో చిన్న బాధ. నా చుట్టూ ఉన్న సమాజానికి కాకుండా ఈ ప్రపంచములో ఎవరికీ తెలీకుండా ఉన్న నాకు అన్నీ అందించి, నన్ను ఈ లోకానికి పరిచయం చేసి, కాస్తో కూస్తో నాకంటూ ఒక ఆస్థిత్వం కలిగించిన ఆ సైట్ మూసేస్తున్నాం.. అని స్టేటస్ మెస్సేజ్ చూసి విచారానికి లోనయ్యాను. ఏదో ఆప్త మిత్రుడినీ కోల్పోతున్న భావన అది. 


ఆస్థిత్వం కోల్పోయినవన్నీ ఏదో ఒకప్పుడు కాలగర్భములో కలిసిపోక తప్పదు. పోలిక సరికాదేమో గానీ, నాకైతే ఎందుకో ఇది వ్రాస్తున్నప్పుడు టైటానిక్ సినిమాలోని జాక్ రోజ్ లు చివరిసారిగా విడిపోయే దృశ్యం కన్నుల ముందు మెదిలింది. పోల్చి చూస్తే మీకు నవ్వు రావోచ్చునేమో గానీ నా భావన అది. ఆ రోజ్ పాత్ర లా నాదనిపిస్తుంది ఇప్పుడు. ఆ జాక్ ( లియనార్డో డికాప్రియో ) సముద్ర గర్భములో కలిసిపోయే ఆ సందర్భాన్ని మరోమారు గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. కొన్నింటిని - అందునా మనసుకి నచ్చినవి దూరం అవుతుంటే - ఏమీ చెయ్యలేని నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు అలాకాకుండా మరెలా ఉండగలం. బయటవారి భావొద్వేగం మరొకరికి వింతగా, పిచ్చిపనిలా తోచవచ్చు.. కానీ వారికోసమని మన భావోద్వేగాల్ని ఎలా ఆపుకోగలం. అందునా - మనకి ఆప్తుని విషయములో ? 



ఇంకా వుంది.. ఈ లింక్ లో చూడండి..

Saturday, June 14, 2014

పేజీల Manage Selections

ఫేస్ బుక్ లో పేజ్ లది ఒక ప్రత్యేక స్థానం. ఎన్నెన్నో రకాల పేజెస్ ఉన్నాయి. కారణం ఈ పేజెస్ ని మొదలు పెట్టడం, నిర్వహించడం గ్రూప్స్ కన్నా చా--లా సులువు. అలాగే ఆ పేజీలని లైక్ చేసిన వారు ఆ పేజీలలో ఉన్న విషయాన్ని తేలికగా  చూసేలా ఆ పేజీ లే అవుట్ ఉంటుంది. కావున చాలామంది క్రొత్తగా ఏదైనా ఒక విషయం గురించి తెలియచెయ్యాలన్నా ముందుగా ప్రారంభించేది ఈ పేజెస్ ని. ఈ పేజెస్ ని నిర్వహించేవారు ఈ ఫేస్ బుక్ లో సభ్యత్వం ఉన్నవారే నిర్వహిస్తారు. ఫేస్ బుక్ అకౌంట్ ఉన్న ప్రతివారూ ఏదో ఒక పేజీలో సభ్యులు అవటం చాలా చాలా సాధారణ విషయం. ఈ పేజెస్ గురించి మరిన్ని విషయాలు మళ్ళీ ఎప్పుడైనా చెబుతాను. 

ఇప్పుడు మీకు లే అవుట్ లోని ఒక భాగాన్ని గురించి చెబుతాను. నిజానికి అంత ముఖ్యమైన విషయం కాదు కానీ పేజీ వీక్షకులకి కాస్త ఈజీగా ఉండేలా కొన్ని టూల్స్ ని వారికి అందుబాటులో ఉంచవచ్చును. ఇలా చెయ్యడం వల్ల పేజీని చూడటానికి అందముగా, సౌకర్యవంతముగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ఒకసారి మీరు నిర్వహిస్తున్న పేజీలకి సరిచూసుకుంటే సరిపోతుంది. 

06 జూన్ 2014 న ఫేస్ బుక్ లోని అన్ని పేజీల  లేఅవుట్స్ ని ఫేస్ బుక్ వారు మార్చారు. పది రోజుల ముందుగా అన్ని పేజీల అడ్మిన్ లకీ - ఆ పేజీ టైం లైన్ మీద కనిపించేలా ఇలా ఈ క్రింద కనిపించే సూచనని పెట్టారు. ముందుగా తమ తమ పేజీలని అప్డేట్ చేసుకున్నారు కొందరు. చేసుకోని పేజీలన్నింటినీ ఆరో తేదీన ఆటోమేటిక్ గా అప్డేట్ చేశారు. అందులో కొన్ని సెట్టింగ్స్ ఒక్కొక్కటీ మీకు నా వీలు వెంబడి చెబుతాను. ఇప్పుడు పేజీలో ఎడమ ప్రక్కన కనిపించే About me, Friends, Post to page... వీటి లే అవుట్ సెట్టింగ్ గురించి చెబుతాను. 


పేజీ టైం లైన్ లో బాగా ఎడమ వైపున ఉండి, మొదటగా కనిపించేది - People. ఇందులో - ఆ పేజీని లైక్ చేసి, ఆ పేజీని ఫాలో అయ్యే మన స్నేహితులు ఎవరైనా ఉంటే - ఇక్కడ ఇక్కడ వారి వారి ప్రొఫైల్ ఫోటోలు థంబ్ నైల్ చిత్రాల రూపములో కనిపిస్తాయి. ఆ పేజీలలో మన ఫేస్ బుక్ మిత్రులు ఎవరున్నారో, ఎందరున్నారో తేలికగా తెలుసుకోవచ్చును. 

ఇలా పీపుల్, అబౌట్ మీ... లాంటి హెడ్డింగ్స్ గల బూడిద రంగు ( Gray Colour ) మీద ఉన్న కుడి వైపుకు చూస్తున్న బాణం గుర్తు వద్ద మౌస్ కర్సర్ ని ఉంచితే - ఒక పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది. ఇలా కనిపించటం కేవలం ఆ పేజీ అడ్మిన్ లకి మాత్రమే. వీక్షకులకీ, లైక్ చేసిన వారికీ, ఫాలో అయ్యే వారికీ కనిపించదు. ఆ గుర్తుని Manage అని అంటారు. అది ఎలా ఉంటుందో ఈ క్రింది ఫోటోలో చూడవచ్చును. 


Manage ని కర్సర్ తో నొక్కితే అప్పుడు మీకు చిన్నగా  Manage Selections అంటూ ఒక విండో కనిపిస్తుంది. అప్పుడు దాన్ని కర్సర్ తో నొక్కాలి. 


అలా నొక్కాక - ఈ క్రింది విధముగా మీకు ఒక మెనూ కనిపిస్తుంది. అదే ఆ పేజీ Manage Selections సెట్టింగ్స్ పట్టిక. ఇందులో మీకు 1, 2 అని ఎర్రని అంకెలతో చూపెట్టిన  People, About ని డ్రాగ్ చెయ్యలేం. అంటే పైకీ, క్రిందకీ మౌస్ లోని ఓకే క్లిక్ ( ఎడమ క్లిక్ ) ని వాడి, మూవ్ టూల్ తో జరపలేము. అవి అలాగే ఫిక్స్ అయి ఉంటాయి. 

ఇక ఎర్రని వృత్తములో చూపబడిన Photos, Posts to page, Reviews, Notes... ఇలాంటివన్నీ పైకీ, క్రిందకి మనకి నచ్చిన తీరులో మౌస్ ఎడమ క్లిక్ ని నొక్కి పట్టి, డ్రాగ్ చేస్తూ, మనకి నచ్చిన క్రమములో పెట్టుకోవచ్చును. అలా చేసిన పిదప క్రిందన ఉన్న Save   ని నొక్కితే అవన్నీ మనం పెట్టుకున్న క్రమంలోనే ఉండిపోతాయి. ఇలా సెట్టింగ్స్ చెయ్యటం ఆయా పేజీల అడ్మిన్ ( నిర్వాహకులకి ) మాత్రమే వీలవుతాయి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. 



Thursday, September 6, 2012

Facebook - Social Protection

Facebook లో ఇప్పుడు ఒక క్రొత్త అప్లికేషన్ జత చేశారు. మీరు మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ లో మీరు పెట్టే ఫొటోస్ ని మీ మిత్రులు గానీ, ఇతరులు గానీ కాపీ చేసుకోకుండా, కనీసం స్క్రీన్ షాట్ ద్వారా కూడా కాపీ చేసుకో వీలులేకుండా చేసేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని ఆ McAfee సంస్థ వారు చెబుతున్నారు. మీకు ఫేస్ బుక్ ప్రొఫైల్ గనుక ఉంటే - ఈ అప్లికేషన్ ని వాడి, మీరు అప్లోడ్ చేసే మీ ఫొటోస్ ని ఎవరూ కాపీ చేసుకోకుండా చూసుకోగలరు. 

ఈ అప్లికేషన్ కేవలం - Internet Explorer 8 ఆ తరవాత బ్రోజర్ మరియు Mozilla Firefox నందు మాత్రమే పనిచేస్తుంది. కనుక మీరు ఆయా బ్రౌజర్స్ ని ఓపెన్ చేసి, అందులో ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మరొక ముఖ్య అంశం - మీ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ - Windows 7 ఉండాలి. XP ఉన్నా ఏమీ కాదు కానీ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ని అప్డేట్ వెర్షన్ (సర్వీస్ ప్యాక్ 3) ఉండాలి. 

ముందుగా మీరు మీ ఫేస్ బుక్ అకౌంట్ ని పై రెండింటిలో ఏదైనా ఒక బ్రౌజర్ లో ఓపెన్ చెయ్యండి. ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను. 

1. మీ ఫేస్ బుక్ అకౌంట్ ఒపేన్ చెయ్యండి. 
2. సర్చ్ బార్ నందు Social Protection అని టైప్ చేసి, సర్చ్ నొక్కండి. 
3. అందులో వచ్చే McAfee Social Protection ని ఎన్నుకోండి. 

 

అప్పుడు ఇలా ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. 

ఇప్పుడు ఆ 4 వద్ద Download Now ని నొక్కాలి.

డౌన్లోడ్ అయ్యాక ఆ వచ్చే డైలాగ్ బాక్స్ లో Run ని నొక్కి ఆ అప్లికేషన్ ప్రోగ్రాం ని రన్ చెయ్యాలి. 


అలా ఓపెన్ అయ్యాక ఇప్పుడు 6 వద్ద నున్న Install ని నొక్కాలి. 


ఇప్పుడు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది. 


అప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు Agree వద్ద ఓకే చేసి, Next 7 నొక్కండి. 


ఇప్పుడు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది. 


ఇలా ఇన్స్టాల్ అయినట్లు విండో వస్తుంది. 


ఇప్పుడు మీ బ్రౌజర్ మళ్ళీ ఓపెన్ చెయ్యండి. అంతే! 



Sunday, September 2, 2012

తెలుగు బ్లాగర్స్ గ్రూప్

ఈ ప్రపంచములో వ్యక్తులకీ, వృత్తులవారికీ, కళాకారులకీ ఎన్నో సంఘాలు, ఫోరమ్స్ ఉన్నాయి. మరి బ్లాగింగ్ చేసేవారికి? అలాంటివి ఉన్నాయా? లేవా?? అని ఆలోచిస్తున్నారా?..

లేకేం! భేషుగ్గా ఉంది. తెలుగు బ్లాగర్స్ (Telugu bloggers) గ్రూప్. ఇది గూగుల్ గ్రూప్స్ వారిలోని భాగము. క్రొత్తగా బ్లాగ్ మొదలెట్టినవారికి, బ్లాగ్ నడిపిస్తున్నవారికి - బ్లాగ్ నిర్వహణలో ఏమైనా సందేహాలు వస్తే - ఎవరిని అడగాలి? ఎలా అడగాలి..? ఎవరు తీర్చగలరు? అన్న ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. మీకు ఏమైనా సమాచారం కావాలన్నా, ఏదైనా బ్లాగ్ నిర్వహణా ఇబ్బందులు, సందేహాలు ఉంటే, ఇక్కడ ఉన్న సభ్యుల గ్రూప్ లో అడిగితే (పోస్ట్ చేస్తే), అందులో సభ్యుల వద్ద నుండి మీకు సమాధానాలు వస్తాయి. 

చాలామంది పాత బ్లాగర్స్ కి ఈ విషయం తెలిసియున్నా, క్రొత్తగా బ్లాగింగ్ మొదలెడినవారికీ, తెలీనివారికీ తెలియచెప్పటానికే ఈ టపా. 

ఈ గ్రూప్ లో మొదట్లో అనుకోకుండా ఏదో లింక్ పట్టుకొని, ఆ గ్రూప్ లో చేరాను. అప్పుడు ఆ గ్రూప్ లో 13,000+ సీరియల్ పోస్ట్ జరుగుతున్నది. (మనకి వచ్చే మెయిల్స్ కి ఆ సీరియల్ నంబర్ ఉంటుంది. ఏమైనా మెయిల్స్ అందకుంటే ఆ వరుస తప్పామా, లేదా అని అలా చెక్ చేసుకోవచ్చును.) ఈ గ్రూప్ అవసరమా అనుకున్నాను. కానీ చాలా ఉపయోగపడే గ్రూప్ తెలుసుకొని కొనసాగుతున్నాను. నేను అందులో అడిగిన సందేహాలకన్నా - నేను ఇచ్చిన జవాబులే ఎక్కువ. ఇలా చెప్పుకోవటం గొప్పగా ఫీలవటం లేదు. నాకు తోచినంతలో ఏదో ఉడుతాభక్తిగా బ్లాగర్స్ కి సేవ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. అక్కడ ఎంతోమంది లబ్ధ ప్రతిష్టులూ మీ సందేహాలకి సమాధానాలు అందచేస్తారు. 

గూగుల్ వారి గ్రూప్ అయిన ఇక్కడ మీకు ప్రస్తుతం 4825+ టాపిక్ / సందేహాల మీద సభ్యులు ఇచ్చిన సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. మీరు ఇక్కడ సభ్యులయితే - మీ మెయిల్ ID కి మెయిల్స్ వస్తుంటాయి. 

Wednesday, September 14, 2011

Photos Recovery



Bindu said... 


మెమొరి కార్డ్ లో ఉన్నవి డెలెట్ అయినప్పుడూ తిరిగి వాటిని ఎలా రికవరి చేసుకోవాలో ఆ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను అన్నారు.. కాని దాని గురించి ఇంతవరకు పోస్ట్ రాయలేదు, ఇది మీకు న్యాయమేనా చెప్పండి??? ఆ పోస్ట్ కోసం ఎదిరి చుస్తున్నాను.. దయచేసి తొందరగా ఆ పోస్ట్ రాయగలరు.
ధన్యవాదములు.......
Related Posts with Thumbnails