చిత్రం: నచ్చావులే!.. (2008)
గాయకులు: దీపు, హర్షిక
సంగీతం: శేఖర్ చంద్ర
రచన: భాస్కరభట్ల రవి కుమార్
కథ, మాటలు & దర్శకత్వం: రవిబాబు
***********************
పల్లవి:
ఒహో.. నేస్తమా.. ఒహో.. నేస్తమా..నేస్తమా..
ఒహోహో..నేస్తమా నేస్తమా..
ఓహ్ మై డియర్ నేస్తమా..నేస్తమా..
కొత్త కొత్త నేస్తమా!!.. (2)
రోజుకొక్క ప్లేసులోన - వూసులాడుకుందాం
పిచ్చి పిచ్చి మాటలెన్నో - చెప్పుకుందాం
చిన్ని చిన్ని గొడవలోస్తే - తిట్టి కొట్టుకుందాం
అంతలోనే జోకులేసి - నవ్వుకుందాం.. // ఒహో.. నేస్తమా.. //
చరణం 1:
నాన్న జేబులో - ఓ నోటు లేపుదాం
రెండు స్ట్రాలతో - ఓ డ్రింకు తాగుదాం
కదులుతుండగా - బస్సెక్కి దూకుదాం
మరింత క్లోజుగా - మోవ్ అవుదాం
ట్రీట్ ఇచ్చుకుందాం - వీకెండ్స్ లో
గిఫ్టులు ఇచ్చుకుందాం - మన మీటింగ్స్ లో
ఇలా ఎప్పుడూ - మనం ఫ్రెండ్స్ లా - ఉండేలాగా
దేవుడ్ని- వరము అడుగుదాం // ఒహో.. నేస్తమా.. //
చరణం 2:
బైక్ ఎక్కుదాం - బిజీ గా తిరుగుదాం
రంగు రంగుల - లోకాన్ని వెతుకుదాం
అప్పుడప్పుడు - అప్పు ఇచ్చుకుందాం
తీర్చాల్సినపుడు - తప్పించుకుందాం
డోంట్ సే సారీ - ఫ్రెండ్షిప్ లో
థాంకులు లేవే - మన మధ్యలో
నువ్వో అక్షరం - నేనో అక్షరం..
కలిపితేనే స్నేహమనే కొత్త అర్ధం.. // ఒహో.. నేస్తమా.. //
No comments:
Post a Comment