Wednesday, February 11, 2009

Vaana - Eduta nilichndi choodu...



చిత్రం: వాన
సంగీతం: కమలాకర్
గానం: కార్తీక్
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
*********************
పల్లవి:
ఎదుట నిలిచింది చూడు - జలతారు వెన్నెలేమో..
ఎదను తడిపింది నేడు - చినుకంటి చిన్నదేమో..
మైమరచిపోయా మాయలో -
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా.. // ఎదుట నిలిచింది చూడు //

చరణం 1:
నిజంలాంటి ఈ స్వప్నం - ఎలా పట్టి ఆపాలీ
కలే ఐతే ఆ నిజం - ఎలా తట్టుకోవాలి
ఔనో కాదో అడగకంది - నా మౌనం..
చెలివో, శిలవో తెలియకుంది - నీ రూపం..
చెలిమి బంధమల్లుకుందే - జన్మ ఖైదులా // ఎదుట నిలిచింది చూడు //

చరణం 2:
నిన్నే చేరుకోలేక - ఎటెళ్ళిందొ నా లేఖ
వినేవారు లేక - విసుక్కుంది నా కేక
నీదో కాదో రాసున్న - చిరునామా
ఉందో, లేదో ఆ చోట - నా ప్రేమ
వరంలాంటి శాపమేదో - సొంతమైందిలా //ఎదుట నిలిచింది చూడు //

No comments:

Related Posts with Thumbnails