చిత్రం: ఆనంద్ (2004)
రచన: వేటూరి
సంగీతం: k.m. రాధా కృష్ణన్
గానం: శ్రేయా ఘోషాల్
****************
పల్లవి:
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా.. గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా.. (2)
కళ్ళల్లోన పొంగుతున్న బాధలేన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా? గాలివాన లాలి పాడేస్తారా?
చరణం 1:
పిల్లపాపలా వాన బుల్లి పడవలా వాన చదువు
బాధనే తీర్చి సెలవులిచ్చినా వాన గాలివాన
కబాడ్డీ వేడి వేడి పకోడీ ఈడు జోడు డి డి డి డి
తోడుండాలి ఓ లేడి ఇంద్రధనుస్సులో
తళుకుమనే ఎన్ని రంగులో ఇంటి సొగసులే
తడిసినవి నీటి కొంగులో శ్రావణమాసాలా
జలతరంగం జీవనరాగాలకిది ఓ మృదంగం కళ్ళల్లోన & వచ్చే వచ్చే
చరణం 2:
కోరి వచ్చిన ఈ వాన గోరువేచ్చనై నాలోన
ముగ్గులా సిగ్గు ముసిరేస్తే ముద్దులాంటిదే
మురిపాలా మెరిసే మెరిసే అందాలు
తడిసే తడిసే పరువాలు గాలివానల పందిళ్ళు
కౌగిలింతల పెళ్ళిళ్ళు నెమలి ఈకలో
ఉలికి పడే ఎవరి కన్నులో చినుకు చాటున
చిటికెలతో ఎదురుచూపులో
నల్లని మేఘాల మేరుపందం
తీరని దాహాలా వలపు పందెం కళ్ళలోన & వచ్చే వచ్చే
No comments:
Post a Comment