తనికెళ్ళ భరణి చాలా గొప్ప రచయిత, సాహిత్యకారుడూ, సినీ నటుడూ, గొప్ప శివ భక్తుడూ, రంగస్థల నటుడూ.. ఇలా ఎన్నెన్నో పాటవాలు గలవాడు. మొన్న మొన్న అనుకోకుండా భరణి గారి విరచిత "నాలోన శివుడు గలడు.." అనే భక్తి గేయాల సంపుటిని వినడం జరిగింది. ఆహా!ఎంత అత్యద్భుతముగా ఉన్నాయి అవి!.. వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటంత అద్భుతముగా పాడటం జరిగింది. తను ఇంత అద్భుతముగా - చిన్ని చిన్ని పదాలతో, నోటికి తేలికగా పాడుకునేగలిగే ఉండేట్లుగా ఉన్న పదాలతో, పామరులకు సైతం సులభముగా అర్థమయ్యే విధముగా ఉన్న ఈ గేయాన్ని ఒకసారి చూడండి.
మహా శివుడి గురించి - మనల్ని ఒక చిన్నపిల్లాడిని చేసి, ముద్దుగా చేసి "ఇలారా తమ్మీ శివుడంటే .." అన్నట్లుగా చెబుతూ ఈ గేయములో భక్తి, లాలింపూ, కరుణా, వేడుకోలు, విషాదం, విరుపులూ, సునిశిత హాస్యం, చమత్కారం.. ఇలా ఎన్నో, ఎన్నెన్నో. తోడుకున్నవాడికి తోడుకున్నంత. అసలు ఈ పాటని విశ్లేషించే సామర్థ్యం నాకు లేదేమో అనిపిస్తుంది.
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - లోకమ్ములేలగలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - లోకమ్ములేలగలడు
కోరితే శోకమ్ముబాపగలడు ..
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - గంగపైకెత్తగలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - గంగపైకెత్తగలడు
పాపులను తుంగలో తొక్కగలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - కొండపై ఉండగలడు
వరమిచ్చి గుండెలో - పండగలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - ఒక కన్ను తెరవగలడు
ఒద్దంటే రెంటినీ - మూయగలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - సగము పంచీయగలడు
తిక్కతో - అసలు తుంచేయగలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు - మనలోన కలవగలడు
దయతోటి తనలోన కలపగలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన శివుడు గలడు - నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు - నీలోన గల శివుడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు
ఈ పాటను కూడా వినండి. అసలు ఆ చివరి వాక్యం ఉంది చూడండి.. నాటకాలాడగలడు తెరదించి - మూటగట్టేయగలడు అనీ.. అది అన్నింటికన్నా హైలెట్. ఒకే లైనుని, గంభీరముగా, కరుణ తో, దయతో, కాస్త హాస్య స్పూరకముతో, విరుపులూ, చేణుక్కులతో - శంకరా బహరణం లో శంకర శాస్త్రి "అమ్మా" అనే పదాన్ని ఎవరు ఎలా అతారో చేబుతాడుగా.. అలా ఒకే ఒక వాక్యాన్ని ఐదు రసాలలో చెప్పటం ఈ భరణి గారికే చెందుతుంది..
Wednesday, December 8, 2010
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Your blog is just excellent. very good. you have a very good taste.
Shridhar
Post a Comment