Showing posts with label Mobiles. Show all posts
Showing posts with label Mobiles. Show all posts

Wednesday, May 11, 2016

Add a comment to WhatsApp profile pics

WhatsApp లో ఎవరిదైనా ప్రొఫైల్ ఫోటో ( Profile Pic ) లైక్ చెయ్యటానికి ఏదైనా మార్గం ఉందా ? మీ ప్రొఫైల్ ఫోటో బాగుందని మాటల్లో తెలపడానికి ఇబ్బందిగా ఉంది. దీనికి ఏదైనా మార్గం ఉందా ?

ఉందండీ.. భేషుగ్గా ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. కొన్ని ప్రొఫైల్ ఫొటోస్ అద్భుతముగా ఉంటాయి. వాటిని మెచ్చుకోకుండా ఉండలేం.. అలాని పబ్లిక్ గా చెప్పలేం. వారికి మామూలుగా చెప్పొచ్చు. కానీ వారికి మీరు చెప్పిన కాంప్లిమెంట్స్ యే సందర్భంలోనివీ అంటూ సందేహంలో పడతారు. అదే ఆ ఫోటోని అప్లోడ్ చేస్తూ మీ ఫీలింగ్స్ చెబితే మరింతగా బాగుంటుంది కదూ.. ఓకే.. అదెలాగో ఇప్పుడు నేర్చుకుందాం.

ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్న వాటిల్లోని వారి పేర్లని - వారి ప్రైవసీకి అంతరాయం రావొద్దని ఎడిట్ చేశాను. అలాగే -ఆ ఫోటోని అందుకునే వారి ప్రొఫైల్ ని కాకుండా - ఒక గ్రూప్ ని ఎన్నుకున్నాను. అందుకోనేవారి పేరు మీకు కనిపించాలని వాటిని ఎన్నుకున్నాను. గమనించగలరు. 

ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేసి, అందులోని కాంటాక్ట్స్ లలోని ఒకరి ప్రొఫైల్ ఫోటోని ఎన్నుకుందాం.


పైన 1 వద్ద ఉన్న చెవికి ఉన్న బంగారు ఝుంఖా ఫోటోని ఎన్నుకుందాం. అంటే ఆ ప్రొఫైల్ ఫోటో థంబ్ నైల్ ఫోటో మీద టచ్ చెయ్యండి. 


అప్పుడు పై ఫోటోలోలా 2 లా ఆ ప్రొఫైల్ పిక్ ఓపెన్ అవుతుంది. ఇది మీడియం సైజులో కనిపిస్తుంది. ఈ ఫోటో మీద మళ్ళీ టచ్ చేస్తే అప్పుడు ఆ ఫోటో స్క్రీన్ ఫుల్ సైజ్ లో ( క్రింది ఫోటోలో మాదిరిగా ) తెరచుకుంటుంది.  


ఆ ప్రొఫైల్ ఫోటో మీద - ఆ ఫోటో తమ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్న వారి ప్రొఫైల్ పేరు ఉంటుంది. దాని ప్రక్కన - ప్రక్కకి వంగిన V ఆకారములో ఉండే షేరింగ్ గుర్తు 3 ఉంటుంది. దాన్ని మీరు పై ఫోటోలో చూడవచ్చును. దాన్ని టచ్ చేస్తే మీకు క్రింది ఫోటో మాదిరిగా ఆ ఫోటోని ఎక్కడ షేర్ చెయ్యాలో అని ఫోన్ లోని వివిధ ఆప్షన్స్, ఆప్స్ ని చూపే ఒక మెనూ 4 వస్తుంది. దాన్ని మీరు క్రింది ఫోటోలో చూడవచ్చు. 


ఈ మెనూని కొద్దిగా స్క్రోల్ చేస్తే క్రింది ఫోటో మాదిరిగా కనిపిస్తుంది. అందులో మీ ఫోన్ లోని వివిధ అప్లికేషన్స్, స్టోరేజ్ ఆప్స్ మెనూ మీకు కనిపిస్తాయి. 


అందులో అల్ఫాబెటికల్ ఆర్డర్ లో Alphabetical చివరగా ఉండేది WhatsApp వాట్సప్ 5 వద్ద మీకు కనిపిస్తుంది. ఇక్కడ వాట్సప్ ని టచ్ చేసి, దాన్ని ఓపెన్ చేద్దాం. అలా ఓపెన్ చేసిన వాట్సప్ లో తెలియడానికి వీలుగా ఒక ప్రొఫైల్ కాకుండా - ఒక గ్రూప్ Family ని ఎన్నుకుంటున్నాను. 


అలా ఆ ఫోటో ఓపెన్ చెయ్యగానే -  ఆ ప్రొఫైల్ పిక్ ని ఎడిట్ చెయ్యడానికి మీకు కొన్ని టూల్స్ కనిపిస్తాయి. 7 అందులో మొదటగా - 
డిలీట్ - ఆ ఫోటో నచ్చకుంటే డిలీట్ చేసి, మళ్ళీ మొదటికి వచ్చి, ఇంకో ప్రొఫైల్ ఫోటో ఎన్నుకోవచ్చు. 
క్రాప్ టూల్ - ఈ టూల్ సహాయాన ఆ ప్రొఫైల్ ఫోటోని అవసరం మేరకు కట్ చేసుకోవచ్చు. 
రొటేట్ టూల్ - దీని సహాయాన 90, 180, 270 డిగ్రీలలో వంగి ఉన్న ఫోటోలని తిన్నగా మార్చుకోవచ్చు. 


8 వద్ద ఉన్న Add a caption దగ్గర టచ్ చేస్తే - మీకు కీబోర్డ్ అందుబాటులోకి వస్తుంది. దాన్ని వాడి ఆ ఫోటో గురించి మీ భావనని టైప్ చెయ్యవచ్చు. 


ఇక్కడ నేను ఆ ఫోటో కామెంట్ గా - Super design Jhumkha అని 9 వ్రాశాను. ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకొని, 10 వద్దనున్న పేపర్ రాకెట్ గుర్తు ( Send button ) నొక్కితే చాలు. 


అప్పుడు ఆ ఫ్యామిలీ లో ఆ ఫోటో - మీరు వెలిబుచ్చిన కామెంట్ తో 11 అప్లోడ్ అవుతుంది. క్రొత్త వెర్షన్ వాట్సప్ లో End to end encryption తో చాట్స్, పిక్స్ అందుతాయి కాబట్టి అవి ప్రయాణించే మార్గ మధ్యలో ఎవరూ చూడలేరు(ట). 

వాట్సప్ వాల్ పేపర్స్ 12
మామూలుగా ఉన్న వాట్సప్ బ్యాక్ గ్రౌండ్ ని వాట్సప్ వాల్ పేపర్స్ అనే వాట్సప్ వారి ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని, ఇంస్టాల్ చేసుకోవాలి. ఇది మీ ఇష్టం. వేరుగా ఎందుకు చెప్పాలని ఇందులోనే కలిపేసి, చెప్పాను. 



Monday, May 2, 2016

Mobile codes

చాలా మందికి స్మార్ట్ ఫోన్స్ ఎలా వాడాలో, లోపల ఉన్న అప్లికేషన్స్ ని ఎలా ఉపయోగించాలో తెలుసు. కానీ ఫోన్ ని వాడుకోవడం, ఫోన్ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి ఏ ఏ కోడ్స్ వాడాలో తెలీదు. అలాంటి వారికోసం ఫోన్ కి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి కొన్ని కోడ్స్ సేకరించాను. ఇవి అన్ని ఫోన్స్ కి రాకపోవచ్చు. కొన్ని మాడల్స్ కి, కొన్ని కంపనీలకి సరిపోవచ్చు. లేదా ఆ కోడ్స్ ఇప్పుడు ఫోన్ నవీకరణలో భాగముగా పనిచెయ్యక పోవచ్చు. లేదా మరేదైనా కావచ్చును. ఇవి అన్నీ సేకరించి, వాడాక, నిజమని నిర్ధారించబడలేదు. ఎలా సేకరించినవి - అలాగే ఇక్కడ పోస్ట్ చెయ్యడం జరుగుతున్నది. గమనించగలరు.  

బ్యాటరీకి సంబందించిన వివరాలు -             #*#4636#*#* 
ఫోన్ యూనిట్ IMEI నెంబర్ -                   *#06#
క్రొత్త ఫోన్స్ లలో సర్వీస్ మెనూ -                *#0*# 
కెమరాకు సంబంధించిన పూర్తి సమాచారం - *#*#34971539#*#
మెమొరీ కార్డ్ లోని మీడియా ఫైల్స్ -           *#*#273282*255* 663282*#*#*
వైర్ లెస్ లాన్ టెస్ట్ -                               *#*#232339#*#*
టచ్ స్క్రీన్ టెస్ట్ -                                    *#*#2664#*#* 
వైబ్రేషన్ టెస్ట్ -                                       *#*#0842#*#*
సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ సమాచారం -    *#12580*369#
డయాగ్నోస్టిక్ కాన్ఫిగరేషన్ -                     *#9090# 
ఫోన్ లాక్ స్టేటస్ -                                   *#7465625# 

ఒరిజినల్ సాంసంగ్ ఫోన్స్ లలో వాడే కొన్ని కోడ్స్. ఇవి పనిచెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. 


PDA, CSC, మోడెం సాఫ్ట్వేర్ వర్షన్ చూడటానికి - *#1234# 
జనరల్ టెస్ట్ మోడ్ -                               *#0*#  
సాఫ్ట్వేర్ మరియు హార్డ్ వేర్ వివరాలు -     *#12580369#   
సర్వీస్ మోడ్ -                                      *#197328640#  
ADC చూడటానికి -                              *#0228#  
సిఫరింగ్ ఇన్ఫో -                                     *#32489#  
బ్లూటూత్ అడ్రస్ -                                  *#232337# 
బ్లూటూత్ టెస్ట్ చెయ్యటానికి -                  *#232331#     

Friday, November 16, 2012

Facebook Emoticons

ఫేస్ బుక్ లో చాట్ లలో, స్టేటస్ అప్డేట్స్ లలో కొన్ని గుర్తులని వాడుతాము. వీటినే స్మైలీస్ అని కూడా అంటారు. వీటిల్లో చాలా గుర్తులు ఉన్నాయి.. కొన్ని గుర్తులు క్రొత్తగా జతపరచబడ్డాయి. ఎక్కడైనా మన భావాన్ని చిన్నగా, క్లుప్తముగా, మన భావం సరిగ్గా వచ్చేలా - కొన్ని గుర్తుల కీ లని నొక్కితే చాలు. ఆ గుర్తు అక్కడ వస్తుంది. 

ఉదాహరణకు : స్మైలీ బొమ్మ రావాలంటే :) అంటే చాలు. ఆ స్మైలీ గుర్తు వచ్చేస్తుంది. ఒకప్పుడు ఇలా స్టేటస్ అప్డేట్స్ లలో మాత్రమె వచ్చేది. ఇప్పుడు మనం వ్రాసే కామెంట్స్ లలో కూడా ఇలా స్మైలీస్ పెట్టోచ్చును. 

ఇప్పుడు అలాంటి గుర్తులు అన్నీ ఒకే దగ్గర, మీకు అర్థం అయ్యేలా వీలుగా మూడు వరుసల్లో ఇస్తున్నాను. గమనించండి. ఒక గుర్తుకు ప్రక్కన ఎలా కీ బోర్డ్ మీటలు నొక్కితే ఏమి వస్తుందో, దాని పేరు ఏమిటో చెప్పడం జరిగింది. చూడండి. అవన్నీ ప్రాక్టీస్ చేసి, ఇక విరగదీయండి. 



Monday, November 5, 2012

Facebook in smart phone

మీ స్మార్ట్ ఫోన్ లో ఫేస్ బుక్ రావాలనుకుంటున్నారా?.. ఇలా ఓపెన్ చేసుకోవటం చాలా ఈజీ. అదెలాగో ఇప్పుడు చెబుతాను. ఈ వివరణలు అన్నీ - క్రొత్తగా ఆన్లైన్ వాడకందారుల కోసం పోస్ట్ చేస్తున్నాను. మొదట్లో - అంటే ఐదేళ్ళ క్రితం నాకు ఈ అంతర్జాలం గురించి తెలీనప్పుడు - చాలా ఇబ్బంది పడ్డాను. నాలాంటి కష్టం మన తెలుగువారికి రావద్దని కాసింత ప్రయాస తీసుకొని, చెప్పటం. 

ముందుగా మీరు మీ ఫోన్ యూనిట్ లో మెనూ లోకి వెళ్ళండి. కాసింత పాతతరం ఫోన్ యూనిట్ అయితే - నేరుగా Internet అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. కాసింత నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. అప్పుడు అక్కడ వచ్చిన అడ్రస్ బార్ మీద లేదా గూగుల్ సర్చ్ బార్ మీద - www.facebook.com అని టైప్ చేసి, ఎంటర్ కొట్టండి. నెమ్మదిగా ఆ పేస్ బుక్ తెరచుకుంటుంది. 

ఇలా చాలా నెమ్మదిగా ఓపెన్ అవుతుంది. కొన్నింట్లో అయితే అస్సలు ఓపెన్ కావు. కారణాలు ఏమిటంటే - నెట్వర్క్ ప్రొవైడర్ (అంటే - మొబైల్ సిమ్ కంపనీ వారు) అలా మొబైల్ లో ఇంటర్నెట్ చూడటానికి ఆ ఫోన్ లో బ్యాలన్స్ కనీసమొత్తం (Rs. 100 లేదా 150) అయినా ఉండాలి. ఈ బ్యాలన్స్ అనేది నెట్వర్క్ ప్రొవైడర్ ని బట్టి ఉంటుంది. 

మరొక కారణం ఏమిటీ అంటే - ఫోన్ యూనిట్ ప్రాసెసర్ చాలా తక్కువ వేగముతో ఉన్నది అయి ఉంటుంది. ఇలా తక్కువ వేగం తో ప్రాసెసర్ ఉన్న ఫోన్ తో మొబైల్ లో అంతర్జాలం ని చూడటం చాలా కష్టమే!. చూసేబదులు ఊరుకోవటమే ఉత్తమం. ఇలాంటి తక్కువ స్పీడ్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ లో మొబైల్ కేమరాతో తీసిన ఫొటోస్ చూడటానికే (అవి తెరచుకోవటానికే) అయ్యే నెమ్మదనంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఉన్న ఫోన్ యూనిట్ లో అంతర్జాలం చూడటం ప్రయాసే అవుతుంది. చూడకుండా ఊరుకోవటమే ఉత్తమం.. ఇప్పుడు 1 GB ప్రాసెసర్ ఉంటున్నది కాబట్టి చాలా నయం. 

ఇక ఫోన్ RAM. ఇది ఆ పాత ఫోనుల్లోచాలా తక్కువగా ర్యాం ఉంటుంది. ఒకటి, రెండు కన్నా ఎక్కువ అప్లికేషన్స్ ఓపెన్ చెయ్యలేం. కేమరాతో తీసిన ఫోటోలని చూస్తూ, వెంట వెంటనే చూస్తుంటే - అంత త్వరగా ఆ ఫోన్ లో ఫొటోస్ ఓపెన్ కాకుంటే - అది ఆ ర్యాం తక్కువ చలువే. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత తొందర తొందరగా మన పని పూర్తవుతుంది. 

ఇక ఫోన్ కి వచ్చే నెట్ స్పీడ్ కూడా కీలకమే. సర్వర్ మీద వత్తిడి బాగా ఉన్నప్పుడు నెమ్మదిగా, అంతర్జాలం తెరచుకుంటుంది. ఆ ఫోన్ మెమొరీ, టెంపరరీ ఫైల్స్, తెరచి ఉంచిన ఫైల్స్ / అప్లికేషన్స్, అప్డేట్స్... కూడా అంతర్జాలం ని మొబైల్ లో చూడటానికి కీలకమైనవే. ఇవన్నీ కొన్ని సందర్భాలల్లో బాగా నెమ్మదిగా పనిచేసేలా చేస్తాయి. (అవన్నీ చెప్పుకోవచ్చును కానీ చాలా పెద్దగా అవుతుందని ముగించేశాను)

పై ఇబ్బందుల్లో చాలా భాగం స్మార్ట్ ఫోన్ లలో ఉండవు. కాసింత ఎక్కువ వేగముతో అంతర్జాలాన్ని చూస్తాము. 

ఇప్పుడు అంతర్జాలములో సైట్స్ ని ఎలా చూడొచ్చో చూద్దాం. ఇక్కడ ఉదాహరణకి ఫేస్బుక్ ని చూద్దాం. మీ స్మార్ట్ మొబైల్ నుండి మెనూ లోకి వెళ్లి, అందులో ఉన్న Internet ఆప్షన్ వాడి, తెరచిన అడ్రెస్ బార్ లో సైట్ పేరు కొట్టేస్తే సరి. మీకు ఆ సైట్ నేరుగా తెరచుకుంటుంది. ఇదిగో ఇలా..


అలా కాకుండా ఏదైనా బ్రౌజర్ ని (ఉదా : ఒపేరా మినీ - దీని సింబల్ ఎరుపు రంగు O మాదిరిగా ఉంటుంది) ఇన్స్టాల్ చేసుకొని, ఆ బ్రోజర్ ని తెరచి, అందులో సైట్ అడ్రెస్ టైపు చేసి అలా ఓపెన్ చేసుకోవచ్చును. 

ఇక అలా కాకుండా ఇంకోరకముగా - తేలికగా ఒక సైట్ వద్దకి నేరుగా వెళ్ళాలీ అంటే - ఆ సైట్ అప్ App (Application = ముద్దుగా App) ని మన మొబైల్ లో ఆడ్ చేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

ఉదాహరణకి మనం ఫేస్ బుక్ ని మనం తరచుగా మొబైల్ లో చూడాలని అనుకున్నట్లయితే - మీరు ఆ ఆప్ ని మీ మొబైల్ మెనూ లో పెట్టేసుకోవటం బెస్ట్. (Internet లో బుక్ మార్క్ లాగా పెట్టేసుకోవచ్చును.. కానీ ఇంకో రెండు మూడు స్టెప్స్ ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. ఈ ఆప్ వల్ల - పని తొందరగా, నేరుగా వెళ్ళొచ్చును). దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మొబైల్స్ కొన్నిట్లో నేరుగా అలా ఇన్స్టాల్ అయి వస్తున్నాయి. ఇంకొన్ని వాటిల్లో మనమే అలా ఆడ్ చేసుకోవాలి. 

ఇలా ఆడ్ చేసుకోవాలీ అంటే - మీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి, అక్కడ సర్చ్ బార్ 1 లో Facebook Mobile అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. అప్పుడు ఈ క్రింద ఉన్న సైట్ ని ఎన్నుకొని ఓకే చేస్తే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు 2 వద్ద చూపినట్లు Get the App ని నొక్కండి. 


ఇప్పుడు ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. 
అక్కడ 3 వద్ద మీ దేశం పేరూ, ISD కోడ్ ని, డ్రాప్ మెనూ వాడి ఎన్నుకోవాలి. 
దాని క్రింద ఉన్న మరో బ్లాంక్ 4 లో మన ఫోన్ నంబర్ ని వ్రాయాలి. 
అప్పుడు 5 వద్ద నున్న Send Link to my mobile ని నొక్కాలి. 


అంతే!.. ఆ ఆప్ లింక్ ఒక SMS రూపములో మీ మొబైల్ కి ఇలా వస్తుంది. 


ఆ SMS ని ఓపెన్ చెయ్యండి. 


ఆ లింక్ మీద ఓపెన్ చేస్తే ఇలా 


దాన్ని ఓకే చేస్తే - 


ఇక్కడ Install Now ని నొక్కితే సరి. అప్పుడు దాని ద్వారా ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చును. ఈ అప్లికేషన్ దానంతట అదే ఇన్స్టాల్ అవుతుంది. 

ఒకవేళ ఇదంతా ఇబ్బందిగా ఉంటే - మీరు ఈ లింక్ లోకి నేరుగా వెళ్ళండి. ఫేస్ బుక్ ఆప్ ని నొక్కి నేరుగా వెళ్ళొచ్చును. 




Tuesday, October 30, 2012

Smart mobile

క్రొత్తగా స్మార్ట్ ఫోన్ తీసుకున్నాను. మంచిరోజు, ముహూర్తం చూసి ఆ ఫోన్ వాడటం మొదలెట్టాను. అంతా సంతోషం.. ఉంటే ఈ పోస్ట్ వ్రాసేవాడినే కాదు. అలా వాడటం మొదలెట్టానా? అంతా బాగుంది.. కానీ ఒక చిన్న పొరబాటు వల్ల కూసింత టెన్షన్. ఆ పొరబాటు కొంత నాదీ, ఆపరేటర్ దీ ఇంకొంత.

ఆ ఫోన్ లో రెండు సిమ్ములు వేయాలి. ఆ రెండు సిమ్ములూ వేసి ఆ యూనిట్ ని ఆన్ చేశాను. ఆ సిమ్ము లలో ఒకటి - ప్రైవేట్ కంపనీ సిమ్. రెండోది ప్రభుత్వరంగ సంస్థది. అలా ఆన్ చేశానో లేదో, ఈ ప్రైవేట్ కంపనీ సిమ్ దానంతట అదే నెట్ వాడుకొని సెట్టింగ్స్ ని డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకుంది. నాకు ఇంకో సిమ్ నుండి సెట్టింగ్స్ కావాలి. నేను వాడాలనుకున్నదీ ఆ సిమ్ నెట్ వర్క్ నే!

ఆ రెండో సిమ్ సెట్టింగ్స్ ఎన్నిసార్లు డిలీట్ చేసినా పోవటం లేదు. ఈ మొదటి సిమ్ సెట్టింగ్స్ ని ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసినా లాభం లేదు. ఈ మొదటి సిమ్ నుండి నెట్ వాడుకోవాలని నా ఆలోచన. కారణం : ఆ మొదటి సిమ్ములో బ్యాలన్స్ Rs. 4,400 ఉన్నాయి. మూడు సంవత్సరాల క్రిందట ఆ బ్యాలన్స్ Rs. 9,450 గా ఉంది. అంతగా ఉండటానికి గల కారణం - సంవత్సరానికి కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయి. అప్పుడు మనం వేసుకున్న అమౌంట్ కి కొంత అదనముగా బ్యాలన్స్ వస్తుంది. సంవత్సర కాలానికి ఒకేసారి అలా బ్యాలన్స్ వేసుకుంటే - చాలా ఎక్కువగా లాభం ఉంటుంది. అందుకే నా మొబైల్ బ్యాలన్స్ అలా తొమ్మిది వేలు చిల్లరగా మిగిలిపోయింది. ఈ మూడు సంవత్సరాలుగా ఆ బ్యాలన్స్ ని ఎస్పైరీ డేట్ పొడిగించుకుంటూ వాడుతున్నాను. ఆ మొత్తాన్ని తగ్గించాలని నా ఆలోచన.

ఈ మధ్యలో రెండుసార్లు నా మొబైల్ పోయినా, బ్యాలన్స్ ఫార్వర్డ్ అయ్యింది. ఈ బ్యాలన్స్ చూసి, అందరూ నా ఫోన్ వాడి, ఉన్న బ్యాలన్స్ తగ్గిస్తున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందని, ఇప్పుడు నేనే బ్యాలన్స్ తగ్గిద్దామని డిసైడ్ అయ్యాను.

ఇక అసలు కథలోకి వద్దాం. ఆ రెండో సిమ్ సెట్టింగ్స్ డిలీట్ అవక, మాటిమాటికీ ఆ సెట్టింగ్స్ అడిగి.. కష్టమర్ కేర్ వారితో కూడా విసిగిచ్చుకున్నాను. పాపం.! :(

పోనీ ఫార్మాట్ చేద్దామని అనుకున్నా (ఇదే చెయ్యాలి కానీ రెండో దారి ఏదైనా ఉందా అని ఆగాను) కష్టపడి అందులో ఫీడ్ చేసిన డాటా అంతా పోతుంది. ఆ ఇబ్బంది వల్లనే ఆగాను. నాకు తెలిసిన అన్ని దారులలో ప్రయత్నించినా ఇక ఏ దారీ కనిపించలేదు. ఇక ఫార్మాట్ చేయడానికి రెడీ అయ్యాను.

ముందుగా ఫోన్ లోని నంబర్స్ అన్నీ మెమొరీ కార్డ్ లోకి కాపీ చేశాను. ఆ తర్వాత ఆ మెమొరీ కార్డ్, రెండు సిమ్ములనీ తీసేసి, ఆ ఫోన్ కంపనీ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కోడ్ వాడి, ఫార్మాట్ చేశాను. ఓకే అయ్యింది. ఆ తరవాత ఒక సిమ్ , మెమొరీ కార్డ్ పెట్టేసి, మళ్ళీ యధావిధిగా అన్నీ సిద్ధం చేసుకొని, వాడుతున్నాను.

ఇందులో నేను గమనించిన విషయాలు ఏమిటంటే : 

1. మీరు ఏ సిమ్ము నుండి మీ ఫోన్లో మీరు ఆన్లైన్ కి వెళ్దామని అనుకుంటున్నారో - ఆ సిమ్ ని మొదటగా 1 వ సిమ్ స్లాట్ లో పెట్టేసి, GPRS సెట్టింగ్స్ (వెంటనే రాకుంటే కష్టమర్ కేర్ వాళ్ళని అడిగి) మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి.

2. ఆ తరవాతనే రెండో సిమ్ వేసుకోవాలి.

3. ఒకవేళ రెండో సిమ్ లోని GPRS సెట్టింగ్స్ మీ మొబైల్ లో ఇన్స్టాల్ అయితే, డాటాని మెమొరీ కార్డ్ లోకి బదిలీ చేశాక, ఆ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి, ఆ సిమ్ములూ, మెమొరీ కార్డ్ తీసేసి, (మళ్ళీ బ్యాటరీ పెట్టి) అ ఫోన్ కంపనీ రిస్టోర్ సెట్టింగ్స్ వాడి, మీరు కొన్నప్పుడు ఎలా ఆ ఫోన్ ఉంటుందో అలా చేసుకోవాలి.

4. ఆ తరవాత ఆ సిమ్ డాటా, మెమొరీ కార్డ్ లోని డాటా ఆ ఫోన్ లోకి కాపీ చేసుకోవాలి.

5. సిమ్ లోని నంబర్స్ అన్నీ ఫోన్ మెమొరీ లోకి కాపీ చేసుకోవాలి. (సిమ్ మెమొరీ, ఫోన్ మెమొరీ, మెమొరీ కార్డ్ మెమొరీ ఈ మూడు వేరు వేరు అని గుర్తుపెట్టుకోవాలి)

6. సిమ్ లలోని నంబర్స్ ని ఫోన్ మెమొరీ లోకి కాపీ చేసుకున్నాక - మీరు మీ ఫోన్ లోని కాంటాక్ట్స్ ని తెరచి చూస్తే, ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ పెట్టుకోవాలి.

7. ఇలా ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ కనిపించేలా పెట్టేసుకొని, వాటిని ఒక్కొక్కటీ నంబర్ ని ఎడిట్ చేసుకోవాలి. వారి గురించిన డాటా కూడా అక్కడే పెట్టేసుకోవచ్చును. వారి డిజిటల్ ఫోటోని వారి కాంటాక్ట్ కి పెట్టేసుకుంటే, వారు ఫోన్ చేసినప్పుడు వారి ఫోటో, పేరూ కనిపించి, తేలికగా వారిని గుర్తుపడతాము. ఇలా కేవలం ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ కి మాత్రమే చేయవచ్చును. సిమ్ లోని నంబర్స్ కి ఇలా చెయ్యరాదు.

8. అలాగే ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ కి వారు కాల్ చేసినప్పుడు, వచ్చే రింగ్ టోన్ కి ప్రత్యేకమైన రింగ్ టోన్ ఇస్తే, వారు కాల్ చేసినప్పుడు వచ్చే రింగ్ టోన్ బట్టి, ఆ కాల్ ఎవరిదో దూరం నుండే విని గుర్తు పట్టవచ్చు.

9. మొబైల్ కంపనీ వారు కూడా రెండు సిమ్ముల నుండి ఇలా ఆన్ లైన్ వాడుకునేలా చేస్తే మరీ బాగుండేది. నా ఫోన్ కి  ఒక సిమ్ నుండి మాత్రమే ఆన్లైన్ లోకి వచ్చేలా ఉంది. ప్యాకెట్ డాటా కనెక్షన్ కేవలం ఒక సిమ్ కి మాత్రమే పనిచేస్తుంది.

10. మీ ఫోన్ బుక్ లోని కాంటాక్ట్స్ ని వేరొక మెమొరీ కార్డ్ (1GB, 2GB సైజు మెమొరీ కార్డ్స్ ఇప్పుడు చాలా చవక) లోకి కాపీ చేసుకోండి. ప్రతినెల మొదటి తారీకున అలా మీ స్మార్ట్ ఫోన్ నుండి అలా కాపీ చేసుకుంటే - డాటా కోల్పోరు.

Sunday, October 30, 2011

Mobile Key pad

మొన్న మొబైల్ లో బ్యాలన్స్ వేయిద్దామని వెళ్లాను. అక్కడ అంతకు ముందే ఒకతను తన ఫోన్ రిపేర్ కోసం వచ్చాడు. ఆ ఫోన్ క్రొత్తగా ఉంది.. కానీ బాగా వాడాడు కాబట్టి దాని కీ ప్యాడ్ బాగా అరిగిపోయి, నంబర్స్ ఏవి ఏవో కనిపించకుండా పోయాయి. అది ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాడు. నిజానికి అది చాలా చిన్న ప్రాబ్లెం. ఎలా సాల్వ్ చేస్తారు?.. ఎంత చార్జ్ చేస్తారో అని అని - నా ఫోన్ లో బ్యాలన్స్ వచ్చేవరకు అన్నట్లు ఆగాను.

ఫోన్ విప్పేసి, వెనకాల ఉన్న ప్యానెల్ తొలగించి, బ్యాటరీ మరియు సిమ్ కార్డులని తీసేసి, వాటికి ఉన్న చిన్నని, సన్నని స్క్రూస్ తీసేస్తే, ముందున ఉన్న కీ బోర్డ్ ప్యానెల్ ఫ్రేం ఓపెన్ అవుతుంది. క్రొత్తది కీ ప్యాడ్ ఎక్కించి, మళ్ళీ బిగిస్తే సరి. ఈమాత్రం దానికి ఎలా రిపేరింగ్ చార్జెస్ ఉంటాయో చూద్దామని ఆగాను.

ఆ షాప్ వాడు ఆ ఫోన్ ని చూసి కీ ప్యాడ్ మార్చాలి. మొత్తం నూటాఎనభై రూపాయలు అవుతుంది అని చెప్పాడు. అబ్బా అంతనా?.. అని నేను షాక్ లో ఉన్నాను. ఆ ఫోన్ యజమాని బేరం మొదలెట్టాడు. చివరికి నూటా అరవై కి బేరం కుదిరింది. ఇక నేను బయటకి వచ్చాను. బయట మొబైల్ ఫోన్ షాపుల్లో కేవలం పది, పదిహేను రూపాయలు ఉండే ఆ కీ ప్యాడ్ అంత ధర చెప్పటం మరీ షాకింగ్ గా ఉంది. కంప్యూటర్ కీ బోర్డ్ యే నూటా యాభై రూపాయలకి దొరుకుతున్నది.. అంత చిన్న దానికి అంత రేటా?

కొన్ని విషయాలు కాసింత జాగ్రత్తగా ఉంటే - చాలా అనవసర ఖర్చులు తగ్గించుకోవచ్చును. 

Wednesday, September 14, 2011

Photos Recovery



Bindu said... 


మెమొరి కార్డ్ లో ఉన్నవి డెలెట్ అయినప్పుడూ తిరిగి వాటిని ఎలా రికవరి చేసుకోవాలో ఆ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను అన్నారు.. కాని దాని గురించి ఇంతవరకు పోస్ట్ రాయలేదు, ఇది మీకు న్యాయమేనా చెప్పండి??? ఆ పోస్ట్ కోసం ఎదిరి చుస్తున్నాను.. దయచేసి తొందరగా ఆ పోస్ట్ రాయగలరు.
ధన్యవాదములు.......

Thursday, August 26, 2010

మెమొరీ కార్డ్ - మొబైల్ సెంటర్ - 1

మనలో చాలా మందికి మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు కదూ.. దానిలోని మెమొరీ కార్డులో పాటలూ, ఫొటోస్ వేసుకొని, వాటిని చూస్తూ, వింటూ ఆనందిస్తారు కదూ.. మనమే కాదు, చాలామంది ఈ మొబైల్స్ సెంటర్స్ కి వెళ్లి అందులోని  కంప్యూటర్ ద్వారా ఈ మెమొరీ కార్డ్ లోనికి పాటలూ, ఫొటోస్, వీడియోలూ.. వేసుకుంటూ ఉంటారు. తిరిగి ఆ మెమొరీ కార్డ్ ని మీ మొబైల్ ఫోన్ లోకి పెట్టేసుకొని ప్లే చేసుకొని, ఆనందిస్తూ ఉంటారు కదూ.. మొదట్లో నేనూ అలాగే చేసేవాడిని.. అందులోని కొంత చాకచాక్యమూ, నేర్పరితనమూ, మోసమూ... చూసి మళ్ళీ ఆ మొబైల్ సెంటర్లలో ఆ పనికోసం అడుగు పెట్టలేదు. అలా ఎందుకో ఇప్పడు మీకు చెబుతాను.

మీరు మీ మెమొరీ కార్డు తీసుకొని వారివద్దకి వెళ్లి - పాటలు / వీడియోలూ / ఫొటోస్.. నింపమని అడుగుతే, సరే అని అంటారు. ఆ మెమొరీకార్డ్ ని ఇమ్మని అడుగుతారు. మీరు మీ ఫోన్ మెమొరీకార్డ్ ని తీసిస్తారు. ఆ మీ మెమొరీకార్డ్ ని ఒక మెమొరీకార్డ్ రీడర్ లోన అమర్చి, సిస్టంకి అమర్చుతాడు.. అప్పుడు అది ఆటో రన్ ద్వారా ప్లే అవుతుంది. అంటే - ముందుగా ఒక మెనూ వస్తుంది. ఆ వచ్చిన మెనూలో ఈ ఫోటో లో చూపినట్లుగా Copy pictures to a folder on my computer అనే ఆప్షన్ ఎన్నుకొని, Always do this selected action అన్న వద్ద క్లిక్ చేస్తాడు. ఇలా ముందుగానే సెట్ చేసుకొని ఉంటాడు. అలా చేస్తే మీరిచ్చిన మేమోరీకార్డు లోని మీ ఫొటోస్, మీ వీడియోలూ, ఇంకా మీరు దాచుకున్న మీ పర్సనల్ ఫైల్స్ అన్నీ అతడి కంప్యూటర్లోకి వెళ్లి ఒక ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. అంటే మీ కార్డులోనివీ అలాగే ఉండి.. ఒక కాపీ అతడి సిస్టం లోనికి చేరుకొని భద్రముగా ఉంటుందన్న మాట. (అందరూ అలా చేస్తారని చెప్పటం లేదు.)


ఇప్పుడు మీరు అలా మీ మెమొరీ కార్డ్ ఇవ్వగానే,మిమ్మల్ని మాటల్లో పెట్టి, అతడు అలా సిస్టం కి పెట్టి, ఇలా మెనూ బాక్స్ రాగానే వెంటనే OK నొక్కేస్తాడు.. ఇదంతా చెయ్యటానికి ఐదు, పది సెకన్ల కన్నా మించి సమయం తీసుకోదు.. అంతా మీరు గమనించేసేలోగా అయిపోతుంది. అప్పుడు ఆ మెమొరీ కార్డ్ లోని డాటా "అంతా" అతడి సిస్టం లోనికి చేరుకోవటం ప్రారంభం అవుతుంది. ఇప్పడు అతడు మీతో తీరిగ్గా ముచ్చట మొదలెడుతాడు - ఇందులో ఏమేమి వేద్దాం అని. మీరు ఎటో ఆలోచిస్తూ, అందులో ఎమేమి ఉండాలో, మీకు ఏమేమి కావాలో అన్నీ వివరముగా చెబుతూ ఉంటారు. మీరు అలా చెప్పేలోగానే అందులోకి కాపీ అయిపోతుంది. ఇప్పుడు అతడు రిఫ్రెష్ చేస్తాడు అతడి సిస్టమ్ ని. 

ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీ మెమొరీకార్డ్ లోకి చేరుస్తూ ఉంటాడు.. అన్నీ ఒక ఫోల్డర్ లోకి వేసి, దాన్ని ఆ మెమొరీ కార్డు లోకి, సిస్టం సహాయముతో ఎక్కించేస్తాడు. అలా ఆ మెమొరీకార్డ్ లో డాటా పూర్తిగా నిండగానే, సిస్టం నుండి దాని డిటాచ్ చేసి, ఆ కార్డుని, మీ ఫోన్ లోకి అమర్చి, ప్లే చేసి చూపిస్తాడు. మీరు ఆ సంతోషములో వాటిని తన్మయత్వము లో ఉండి అసలు విషయాన్ని మరచిపోతారు. అతడు అడిగిన డబ్బులు ఇచ్చేసి బయటకి వచ్చేస్తారు.

ఇలా మీరు వెళ్ళిపోయాక, లేదా తన షాప్ కట్టేసే వేళ, లేదా ఎవరూ లేని సమయాన - తన సిస్టం లోకి కాపీ చేసుకున్న మీ మెమొరీ కార్డ్ లోని డాటాని పరిశీలిస్తాడు.. మీ దాంట్లోని పాటలు ఉంటే తన సిస్టం లోని పాటల ఫోల్డర్ లోకి వేసుకుంటాడు. వీడియోలు ఉంటే వీడియోల ఫోల్డర్ లోకి... అలా వేసుకుంటాడు. ఇక్కడే అసలైన తిరకాసు ఉంది. మీ కార్డులో ఏమైనా రహస్యమైన బెడ్ రూం వీడియోలూ, ఫొటోస్ గాని ఉండి ఉంటే, లేదా అలా కార్డ్ ఇచ్చిన వారు అమ్మాయి ఆయితే - అమ్మాయిల ఫొటోస్ గనుకే ఉంటే ఇక వారికి పండగే పండగ. అక్కడి నుండి యే యూ ట్యూబ్ కో, పోర్న్ సైటులోనో, లేదా ఏదైనా అప్లోడ్ సైటులో గాని చేరుస్తారు. ఇక అలా విశ్వరూపమే.. విశ్వవ్యాప్తమే. అలాంటి మూడు ఫొటోస్ మీకు చూపిస్తున్నాను చూడండి.




(పై ఫోటోలూ మూడూ అలాగా నెట్లో పెట్టినవే!..చాలా ఫొటోస్, వీడియోలు అలా నెట్లోకి ఎక్కినవే అని వినికిడి.!! నాకే ఏదోలా అనిపించి అన్నీ కనపడకుండా దాచేసి, క్లారిటీ (బ్లర్) కూడా తగ్గించేశాను.. మొదటి ఫోటో ఏదో సరదాగా వారు చూడనప్పుడు తీసుకున్నారు అనుకుందాం. ఆ రెండో ఫోటో - కావాలనే అలా పిట్ట గోడ మీద కూర్చొని దిగారు. ఇక ఈ మూడో ఫోటో చూడండి. ఈ ప్రేమికులు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని - అంటే వెనక బ్యాక్ గ్రౌండ్ కనిపించనీయకుండా కర్టేన్స్ వేసి మరీ సెల్ఫ్ ఫోటోగ్రఫీ చేసుకున్నారు. అంతగా జాగ్రత్తలు తీసుకున్నవారు - ఈఫోటో ని ఎలా బయటకి పంపించారో నాకు అర్థం కాలేదు. అన్నింటిలో నాకు కామన్ గా అనిపించినది ఏమిటంటే - అలాంటి ఫోటోలలో నెట్ లోకి ఎక్కేవి చాలా వరకు ఆడవారి ఫొటోస్. వారితో ఉన్న మగవారి ముఖాలు కనపడటం చాలా అరుదు. భార్యలో, ప్రియురాల్లో, స్నేహితులో, సన్నిహితులో.. ఇలా వీరే బలి అవుతున్నారు. పైశాచిక ఆనందం ఆ మగవారిది. మానసిక క్లేశం ఈ ఆడవారిది. ఇదంతా నా బ్లాగు రేటింగ్స్ కోసం చెప్పటం లేదు. ఆడవారు ఈ విషయాన్ని కాస్త గమనించ గలరు - అని హెచ్చరించటం అంతే. )

కొసమెరుపు: మీరు అనుకోవచ్చు.. మా కార్డుని అంతా డిలీట్ చేసి ఇస్తానుగా.. ఎలా చూస్తాడు.. అని అడగవచ్చు. టెక్నాలజీ రెండువైపులా పదనున్న కత్తి. దాన్ని వాడే బుద్ధిని బట్టి ఉంటుంది. నెట్లో ఉచితముగా దొరికే ఒక సాఫ్ట్వేర్ ని (పేరు చెప్పను) ఉపయోగించి అలా డెలీట్ చేసిన మెమొరీ కార్డ్ లోని సమాచారం అంతా యధాతతముగా తిరిగి తీయవచ్చును. దీనికి పట్టే కాలము రెండు నుండి ఐదు నిముషాల సమయం అంతే! నా ఫ్రెండ్ నమ్మకపోతే - వాడి కళ్ళముందే అలా తీసి చూపాను నేను. తన ఫొటోస్ డెలీట్ అయ్యాయి అని అంటేనూ.. కాసేపట్లో మళ్ళీ తీసిచ్చాను. 

 అందుకే తస్మాత్ జాగ్రత్త.. ఒకసారి మీ చేతినుండి జారిందా -
ఆపటం మీ తరం కాదని గుర్తుపెట్టుకోండి!!.

Sunday, April 18, 2010

నోకియా ఫోన్ కోడ్స్

మీరు నోకియా ఫోన్ వాడుతున్నారా? అయితే కొన్ని మొబైల్ ఫోన్ సాఫ్ట్వేర్ కోడ్స్ ఇప్పుడు మీకు చెబుతాను. 

1. *#0000 # అని మొబైల్ ఫోన్లో టైప్ చేస్తే ఆ  ఫోన్ మోడల్ వెర్షన్ ఏమిటో తెలుస్తుంది. అంటే ఆ మోడల్ ఎన్నో తరం లోనిది, ఆ సాఫ్ట్వేర్ ఎప్పటిదో ఆ తేదీ.. అన్నది మీకు తెలుస్తుంది.

2. *#06#  అని టైప్ చేస్తే మీ మొబైల్ తాలూకు IMIE నంబర్ తెలుస్తుంది. IMIE అంటే International Mobile Equipment Identity అని అర్థం. ప్రతి మోటారు వాహనానికి బాడీ నంబర్, చాసిస్ నంబర్ అంటూ ఎలా ఉంటుందో అలాగే మొబైల్ పరికరానికి కూడా అలాగే ఉంటుంది. ఇది ఎందుకంటే మనం చేసే ప్రతి కాల్ ఈ నంబర్ ని జత చేసుకుంటూ అవతలివారికి వెళుతుంది. ఆపరేటర్స్ కి మాత్రం తెలుస్తుంది. - మీరు మీ మొబైల్ నంబర్తో కాల్ చేసినప్పుడు, సిమ్ నంబర్తో బాటూ మొబైల్ యూనిట్  IMIE వారివద్ద  రిజిస్టర్ అవుతుంది.

3. *#92702689# ఈ నంబర్ నొక్కితే మీ మొబైల్ యూనిట్ యొక్క తయారు తేదీ, IMEI నంబరూ, రిపైర్స్ ఏమైనా ఉన్నాయో ఆ వివరాలు, ఆ మొబైల్ ని ఎన్ని గంటలు వాడామో (అంటే ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ ) ఆ వివరాలు తెలిపే లైఫ్ టైమర్ కూడా ఉంటుంది. లైఫ్ టైమర్ ని మార్చడం వీలుకాదు. కొండకచోట సాఫ్ట్వేర్ కీ తెలిసినవారు మారుస్తారు.

4. *#7370#  ఈ కోడ్ నొక్కితే మీ ఫోన్ ఫాక్టరీ సెట్టింగులలోకి వెళుతుంది. అంటే ఆ ఫోన్ తయారు చేరుసాక మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే మీ సిమ్ లోని నంబర్లతో బాటూ మీ మెస్సేజ్ బాక్స్ , కాల్ డిటైల్స్ అన్నీ డెలీట్ అవుతాయి.. మీరు మార్చుకున్న సెట్టింగులన్నీ అన్నీ పోయి - మీరు కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా మారిపోతుంది.

5. 12345 ఇది కూడా పైన లాగానే పని చేస్తుంది. దీన్ని మనం సెట్టింగులలోకి వెళ్లి, restore factory settings అన్న దాంట్లోకి వెళ్ళితే కోడ్ అడుగుతుంది. ఈ నంబర్ ని నొక్కితే మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే  మారిపోతుంది.  అలాగే  కాల్  టైమర్స్ ని కూడా 00:00.00 గా చేసుకోవచ్చు. బయట ఫోన్ ఎంత దుమ్ముగా ఉన్ననూ లోపల కాల్ టైమర్స్ లాగ్ చూస్తే క్రోత్తఫోన్ లా ఏదో కొద్ది గంటలు మాత్రమే వాడాము అన్నట్లు చూపించుకోవచ్చు. దీన్ని ఇంకో రకముగా కూడా వాడొచ్చు. ఎలా అంటే: ప్రతినెల మొదటి తారీఖున ఇలా అన్నీ జీరోలు చేసుకుంటే.. నెల చివరి రోజున మనం ఎన్ని నిముషాలు డయల్ కాల్స్   చేసాము, ఎన్ని నిముషాల ఇన్కమింగ్ కాల్స్ విన్నాము, మొత్తం ఎన్ని నిముషాలపాటు చెవిదగ్గర ఉంచుకున్నమో తెలుస్తుంది.

6. *(కాల్ బటన్)3 ఈ మూడు బటన్స్ ని ఒత్తిపట్టుకొని, మీ మోబిల్ స్విచ్ ఆన్ చేస్తే మీ మొబైల్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ మళ్ళీ కొత్తగా మారుతుంది. అంటే ఫాక్టరీ సెట్టింగ్స్, ఫోన్ మెమొరీ ని పూర్తిగా క్రొత్తగా ఫార్మాట్ చేస్తుంది. ఈ పద్ధతి వైరస్ అంటిన ఫోన్లకి చాలా అనువైనది.

7. *#3370#  ఈ కోడ్ నొక్కితే రెండు సిమ్ లు వాడుతున్నట్లయితే స్వాప్ చేసుకోవచ్చు. అంటే సిమ్ 1 లో ఉన్నది సిమ్ 2 లోకి, అలాగే సిమ్ 2 లో ఉన్నది సిమ్ 1 లోకి  మారుతుందన్నమాట. ఇది అన్ని మొబైల్స్ లో ఉండదు. కొన్నింట్లోనే ఉంటుంది.
Related Posts with Thumbnails