Showing posts with label సినిమా lyrics. Show all posts
Showing posts with label సినిమా lyrics. Show all posts

Friday, December 30, 2011

Amma avanee - Rajanna

చిత్రం : రాజన్న (2011) 
రచన : శివదత్త 
సంగీతం : ఎం. ఎం. కీరవాణి 
గానం : మాళవిక. 
*******************
పల్లవి : 
అమ్మా .. అవనీ..
అమ్మా అవనీ నేలతల్లీ అని  - ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకనీ // అమ్మా //

అను పల్లవి :
కనిపించిన ఒడిలోనే కనుమూయనీ
మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవనీ // అమ్మా // 

చరణం 1 
తల్లీ నిను తాకితేనే - తనువు పులకరిస్తుంది.
నీ ఎదపై వాలితేనే - మేను పరవశిస్తుంది.
తేట తెలుగు జాణ - కోటి రతనాల వీణ
నీ పదమూలాన నువ్వే - నాకు స్వర్గం కన్న మిన్న // అమ్మా // 

చరణం 2 
నీ బిడ్డల శౌర్య ధైర్య సాహాస గాథలు వింటే
నరనరాలలో రక్తం ఉప్పొంగుతుంది
రిగగ రిగగ రిగ (3)
రిగరి సదప దస.. రిగగ రిపప గడదద పడదద..
సదసద.. సదసద పగపద
పద పద.. పద పద.. (2)
సాస సాస సాస సాస - రీరి
సాస సాస సాస సాస - గాగ
రిగరిస రిగరిస.. రిగరిస రిగరిస
సరి సరిగా రిసగారిసగారిస
రిగరిగ - పా.. గరిసదపా
గాప పద దస - సరి గరిసద
పద దస సరి - రిగ పగారి సారీ గా పా
రిసద పదస రిగ - పా
సరిగా పదస రిగ - పా
గప గారి సరిసద
వీరమాతవమ్మా - రణధీర చరితవమ్మా
పుణ్యభూమివమ్మా
నువ్వు ధన్యచరితవమ్మా
తల్లి కొరకు చేసే ఆ త్యాగమెంతదైనా
దేహమైన ప్రాణమైన - కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది - నీకీగలదేదమ్మా // అమ్మా //  

Saturday, November 19, 2011

Himaseemallo hallo - Annayya

చిత్రం : అన్నయ్య (2000) 
రచన  : వేటూరి 
సంగీతం : మణిశర్మ 
గానం : హరిహరన్, హరిణి.
*************

పల్లవి :  

హిమసీమల్లో హల్లో - యమగా ఉంది ఒళ్లో
మునిమాపుల్లో ఎల్లో - మురిపాలా లోయల్లో
చలి చలిగా తొలి బలిగా - ఈడే ధారపోశా
చలిమిడిగా కలివిడిగా - అందాలార బోశా
పలకలూరి రామచిలుక పలుకగానే // హిమసీమల్లో హల్లో // 

చరణం 1 : 

సో సో కాని సోయగమా - ప్రియ శోభనమా
సుఖ వీణ మీటుదమా
వా వా అంటే వందనమా - అభివందనమా
వయసంత నందనమా
మొహమాటమైన నవమోహనం - చెలగాటమైన తొలి సంగమం
మది రగిలే హిమ మహిమ .. ఓ
అది అడిగే మగతనమా నీదే రావా
పడుచు పంచదార చిలుక పలుకగనే  // హిమసీమల్లో హల్లో //

చరణం 2 :

మా మా అంటే మాధవుడే - జత మానవుడే
పడనీడు ఎండా పొడి
సా సా అంటే సావిరహే - బహు శాఖలహే
నడిజాము జాతరలే
వాటేసుకుంటే వాత్సాయనం - పరువాల గుళ్ళో పారాయణం
రవి కనని రచన సుమా .. ఓ
సుమతులకే సుమ శరమా - నీవే ప్రేమా
పెదవి ప్రేమ లేఖ లిపిని చదవగనే  // హిమసీమల్లో హల్లో // 

Saturday, October 29, 2011

Nenante - Oosaravelli

చిత్రం : ఊసరవెల్లి (2011) 
రచన : రామజోగయ్య శాస్త్రి. 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ 
గానం : అద్నాన్ సామి.

**************
పల్లవి : 

నేనంటే నాకు చా లానే ఇష్టం - నువ్వంటే ఇంకా ఇష్టం 
ఎచోటైనా ఉన్నా నీకోసం - నా ప్రేమ పేరు నీలాకాశం 
చెక్కిళ్ళు ఎరుపయ్యే సూరీడు చూపైన - నా చేయి దాటందే నిను తాకదే చెలి 
ఎక్కిళ్ళు రప్పించే ఏ చిన్ని కలతైనా - నా కన్ను తప్పించి 
నను చేరదే చెలి చెలి చెలీ // నేనంటే నాకు // 

చరణం 1 :

వీచే గాలీ నేను పోటీ పడుతుంటాం - పీల్చే శ్వాసై నిన్ను చేరేలా?
నేలా నేనూ రోజూ సర్డుకపోతుంటాము - రాణీ పాదాలు తలమోసేలా
పూలన్నీ నీ సొంతం - ముళ్ళన్నీ నాకోసం 
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా - ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం 
నీ నవ్వుకై నేను రంగు మార్చనా // నేనంటే నాకు // 

చరణం 2 :

చేదు బాధలేని లోకం నేనవుతా - నీతో పాటై అందులో ఉంటా 
ఆటా పాటా ఆడే బొమ్మై నేనుంటా - నీ సంతోషం పూచీ నాదంటా 
చిన్నారి పాపలకూ చిన్నారి ఎవరంటే - నీవంక చూపిస్తా అదుగో అనీ 
ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే - టకాలని చెప్పేస్తా నీతో - ప్రేమనీ.. // నేనంటే నాకు // 

Sunday, October 23, 2011

Nidurinche - Mutyala muggu.

చిత్రం : ముత్యాల ముగ్గు (1975) 
రచన : గుంటూరు శేషేంద్ర శర్మ (ఏకైక సినీ గీత రచన) 
సంగీతం : కే,వి. మహాదేవన్ 
గానం : పి. సుశీల. 
**************

పల్లవి : 

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.
కన్నుల్లో నీరు తుడిచి, కమ్మటి కల ఇచ్చింది. // నిదురించే తోట // 

చరణం 1 : 

రమ్యంగా కుటీరాన - రంగవల్లులల్లింది.
దీనురాలి గూటిలోన - దీనముగా వెలిగింది.
రమ్యంగా కుటీరాన - రంగవల్లులల్లింది.
దీనురాలి గూటిలోన - దీనముగా వెలిగింది
శూన్యమైన వేణువులో - ఒక స్వరం కలిపి నిలిపింది
శూన్యమైన వేణువులో - ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకురాలు అడవికి ఒక - ఆమని దయ చేసింది. // నిదురించే తోట // 

చరణం 2 : 

విఫలమైన నా కోర్కెలు - వ్రేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి - అంతలో పోయాయి.
విఫలమైన నా కోర్కెలు - వ్రేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి - అంతలో పోయాయి.
కొమ్మల్లో పక్షుల్లారా - గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న - నావను ఆపండి
రేవు బావురుమంటోందనీ - నావకి చెప్పండి. నావకి చెప్పండి..

Saturday, October 22, 2011

Nihaarika - Oosaravelli

చిత్రం : ఊసరవెళ్ళి (2011)
రచన : అనంత శ్రీరామ్, 

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్,
గానం : విజయ్ ప్రకాష్, నేహా భాసిన్ 

************** 
పల్లవి : 


నీహారికా నీహారికా -  నువ్వే నా దారిక నా దారిక 
నిహారిక హారిక నిహారిక నువ్వే నే-నిక 
నిహారిక నిహారిక - నువ్వే నా కోరిక నా కోరికా 
నిహారిక నిహారిక నువ్వయ్యానిక 
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటోంది నా ప్రాణమే 
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటోంది నా హృదయమే 



నీహారికా నీహారికా -  నువ్వే నా దారిక నా దారిక 
నిహారిక హారిక నిహారిక నువ్వే నే-నిక 
నిహారిక నిహారిక - నువ్వే నా కోరిక నా కోరికా 
నిహారిక నిహారిక నువ్వయ్యానిక 
నీపై ఇష్టమెంతుందో మాటే చెప్పలేను - నిన్నే ఇష్టపడ్డానంతే నిహారిక నిహారిక నువ్వయ్యానిక 
నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను. 
నాతో ఎప్పుడూ ఉంటానంటే - చాలంతే // ఓ నీహారికా నీహారికా // 


చరణం 1:


రెండు రెప్పలు మూత పడవుగా - నువ్వు దగ్గరుంటే 
రెండు పెదవులు తెరచుకోవుగా - నువ్వు దూరమైతే 
రెండు చేతులు ఊరుకోవుగా - నువ్వు పక్కనుంటే 
రెండు అడుగులు వెయ్యలేనుగా - నువ్వు అందనంటే  
ఇద్దరోక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక - రెండు అన్నమాటెందుకో 
ఒక్కసారి నా చెంత కొచ్చినావు నిన్నింక - వదులుకోను చేయ్యందుకో // నిహారిక నిహారిక // 


చరణం 2 : 


నువ్వు ఎంతగా తప్పు చేసినా - ఒప్పులాగే ఉందీ 
నువ్వు ఎంతగా హద్దు దాటినా - ముద్దుగానే ఉందీ 
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తీయతీయగుందీ
నువ్వు ఎంతగా బెట్టు చూపినా - హాయిగానే ఉందీ 
జీవితానికీవేళ చివరిరోజు అన్నట్లూ - మాటలాడుకున్నాముగా 
ఎన్ని మాటలౌతున్నా క్రొత్త మాటలింకేన్నో- గుర్తుకోచ్చేనే వింతగా // నీహారికా నీహారికా // 

Friday, September 30, 2011

Enduke ilaa.. - Sambaram


చిత్రం : సంబరం (2003)
రచన : సిరివెన్నెల
సంగీతం, గానం : ఆర్.పి.పట్నాయక్ 
**************


పల్లవి : 

ఎందుకే ఇలా గుండె లోపలా - ఇంత మంట రేపుతావు అందని కలా 
అన్ని వైపులా అల్లుకోకిలా - ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా 
వెంటాడుతూ వేధించాలా - మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా - జ్ఞాపకమై రగిలించాలా 
మరుపన్నదే రానీయవా - దయలేని స్నేహమా // ఎందుకే ఇలా //

చరణం 1 : 

తప్పదని నిను తప్పుకుని వెతకాలి కొత్త దారి 
నిప్పులతో మది నింపుకుని బతకాలి బాటసారి 
జంటగా చితిమంటగా - గతమంత వెంట ఉందిగా 
ఒంటిగా నను ఎన్నడూ వదిలుండనందిగా 
నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి 
ఉందో లేదో ఈ లోకంలో - నీకే తెలియాలి // ఎందుకే ఇలా // 

చరణం 2 : 


ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా 
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక 
జన్మలో నువు లేవని ఇకనైన నన్ను నమ్మని 
నిన్నలో వదిలేయనీ ఇన్నాళ్ల ఆశని 
చెంతేవున్నా సొంతం కావని నిందించేకన్నా 
నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా // ఎందుకే ఇలా // 

Monday, July 25, 2011

Manchupula chandrama - Tajmahal



చిత్రం : తాజ్‌మహల్ (1995), 
రచన : చంద్రబోస్ 
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ, 
గానం : బాలు, చిత్ర 
**************

పల్లవి : 

మంచు కొండల్లోన చంద్రమా - చందనాలు చల్లిపో
మెచ్చి మేలుకున్న బంధమా - అందమంతా అల్లుకో
మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో- మధురమీ సంగమం
కొత్త దాహంలో వింతమోహంలో - మనదిలే సంబరం
పల్లవించుతున్న ప్రణయమా - మళ్లీ మళ్లీ వచ్చిపో
విన్నవించుకున్న పరువమా - వెన్నముద్దులిచ్చిపో
కొంటె రాగంలో జంట గానంలో - వలపుకే వందనం


చరణం 1 :

ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చి - ఆడిపాడి పేద గుండె తట్టు తట్టు తట్టు తట్టు
నింగి రాలిపోని నేల తూలిపోని విడిపోని - ప్రేమగూడు కట్టి కట్టి కట్టి కట్టి
తోడై నువ్వుంటే నీడై నేనుంటా - లోకం నువ్వంటా ఏకంకమ్మంటా
వలచి మరుజన్మలో గెలిచి నిను చేరనా - యుగము క్షణమై సదా జగము మరిపించనా
వెయ్యేళ్లు వర్ధిల్లు కరగని చెరగని - తరగని ప్రేమలలో // మంచుపూల //  


చరణం 2 : 

వెన్నెలమ్మ మొన్న కూనలమ్మ - నిన్న కన్నె వన్నెలన్నీ చూసే గుచ్చి గుచ్చి గుచ్చి గుచ్చి
గున్నమావి కొమ్మ సన్నజాజి రెమ్మ - ముచ్చటాడే నిన్ను నన్ను మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి
చిందే సింగారం సిగ్గే సింధూరం - పొందే వైభోగం నాదే ఈ భాగ్యం
కలయికల కావ్యమై కలలు చిగురించెనా - శ్రుతిలయల సూత్రమై ప్రియుని జత కోరనా
ఏడేడు లోకాల ఎల్లలు దాటిన - అల్లరి ప్రేమలలో  // మంచుపూల // 

Tuesday, July 5, 2011

Ayi ayi sree ranga sayee - Pelli pusthakam

చిత్రం : పెళ్లిపుస్తకం (1991)
మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత : ముళ్లపూడి వెంకటరమణ 
రచన : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల
**************** 
 పల్లవి :
ఆయి ఆయి శ్రీ రంగశాయి - ఆయి ఆయి శ్రీ రంగశాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి - మా పెద్ద పాపాయి ఆపదలు కాయి // ఆయి //
ఏదీకాని వేళ ఎడద ఉయ్యాల - ఏదీకాని వేళ ఎడద ఉయ్యాల
కోరి జో కొట్టింది కుసుమ సిరిబాల  // ఆయి //

చరణం 1: 

అజ్ఞాతవాసాన అతివ పాంచాలి - ఆరళ్లు భీమన్న దూరమ్ము సేయు
ఆవేశ పడరాదు అలసిపోరాదు - అభిమానమే చాలు అణుచుకొన మేలు // ఆయి //

చరణం 2: 


నిద్ర కన్యకలొచ్చి నిలచి దీవిస్తే - భద్ర కన్యకలేమో పలుకు తథాస్తు // అయి //
మాగన్నులోనైన మరచిపో కక్ష - సిరి కనుల నిద్దురకు శ్రీరామరక్ష // అయి //

Tuesday, June 21, 2011

Oh vanaa padithe - Merupukalalu


చిత్రం : మెరుపుకలలు (1997)
గాయకులు :సుజాత, మలేషియా వాసుదేవన్ 
సంగీతం : ఏ. ఆర్. రెహమాన్
***************
సాకీ :

ఓహ్ వానా పడితే ఆ కొండా కోనా హాయి
పల్లవి :

ఓహ్ వానా పడితే ఆ కొండా కోనా హాయి
పూలోచ్చి పలికే సంపంగి భావాలోయి..
ఓహ్ వానా పడితే ఆ కొండా కోనా హాయి
పూలోచ్చి పలికే సంపంగి భావాలోయి..
ఊ - కోయిలకే కుక్కుక్కు ఎద హోరే కాంభోజి
సంగీతమంటేనే హాయి హాయీ..
నదిలోన లేహరి లాలి పసిమువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటేనే పుట్టే హాయీ..
జగమంత సాగే గీతాలే పడుచు ఖవ్వాలి
సాగింది నాలో సస్సారి గమ పదనిస్సారీ.. // ఓహ్ వానా పడితే //

చరణం 1: 

రాతిరోచ్చిందో రాగాలే తెచ్చిందో - టిక్ టిక్ అంటాది గోడల్లో
దూర పయనంలో రైలు పరుగుల్లో ఛుక్ ఛుక్ ఛుక్ గీతాలే చలో
సంగీతిక ఈ సంగీతికా - సంగీతిక ఈ సంగీతికా
మధుర సంగీత సుధా
పాపల్ని తానే పెంచి పాడే తల్లి పాటే హాయి - మమతాను రాగాలు కదా.
హిల్కొరే హిల్కొరే - హిల్కొరే హిల్కొరే
మంగళారే మంగళారే ధోరి ధోరి భయ్యా
హిల్కొరే హిల్కొరే - హిల్కొరే హిల్కొరే
ఝాన్గలారే ఝాంగలారే ధుని రాగే దయ్యా // ఓహ్ వానా పడితే //

చరణం 2:

నీలారం అడుగుల్లో అల్లార్చే రెక్కల్లో - ఫట్ ఫట్ సంగీతాలే వినూ
గోవుళ్ళ చిందుల్లో కొలువున్న మాలచ్చి ఎట్టా పాడిందో వినూ
సంగీతికా ఈ సంగీతికా - సంగీతికా ఈ సంగీతికా
జీవన సంగీత సుధా
వర్షించే వాన జల్లు వర్ణాలన్నీ గానాలేలే
ధరణి చిటికేసే వినూ
హిల్కొరే హిల్కొరే - హిల్కొరే హిల్కొరే
మంగళారే మంగళారే ధోరి ధోరి భయ్యా
హిల్కొరే హిల్కొరే - హిల్కొరే హిల్కొరే
ఝంగ్ లారే ఝంగ్ లారే ధుని రాగే దయ్యా // ఓహ్ వానా పడితే // 

హిల్కొరే హిల్కొరే - హిల్కొరే హిల్కొరే
హిల్కొరే ఏ ఏ ఏ.. 
హిల్కొరే 

Monday, June 20, 2011

Tellavaare vachhe teliyaka - Chiranjeevulu


చిత్రం : చిరంజీవులు (1956)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం : ఘంటసాల
గానం : పి.లీల
*************
పల్లవి :

తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్లీ పరుండేవు లేరా.. మళ్లీ పరుండేవు లేరా
మళ్లీ పరుండేవు మసలుతూ ఉండేవు
మళ్లీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింక లేరా
మారాము చాలింక లేరా // తెల్లవారవచ్చె తెలియక నా సామి //


చరణం 1:

కలకలమని పక్షిగణములు చెదిరేను - కల్యాణ గుణధామ లేరా (2)
తరుణులందరు దధి చిలికే వేళాయె - దైవరాయ నిదుర లేరా (2)
దైవరాయ నిదుర లేరా

చరణం 2:

నల్లనయ్య రారా నను కన్నవాడా - బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా (2)
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా // తెల్లవారే వచ్చే తెలియక // 

Sunday, June 19, 2011

O nannaa nee manase venna - Dharmadatha





పితృ దినోత్సవ శుభాకాంక్షలతో..

చిత్రం : ధర్మదాత (1970)
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.చలపతిరావు
గానం : ఘంటసాల, జయదేవ్, పి.సుశీల
****************

పల్లవి :

ఓ నాన్నా - ఓ నాన్నా..
ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్నా - అది ఎంతో మిన్న
ఓ నాన్నాఓనాన్నా..

చరణం 1:

ముళ్ళబాటలో - నీవు నడిచావు
పూలతోటలో - మమ్ము నడిపావు
ముళ్ళబాటలో - నీవు నడిచావు
పూలతోటలో - మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు - దాచి ఉంచావు  // ఓ నాన్న! నీ మనసే వెన్న //

చరణం 2 :

పుట్టింది అమ్మ - కడుపులోనైనా
పాలు పట్టింది - నీ చేతిలోన
పుట్టింది అమ్మ - కడుపులోనైనా 
పాలు పట్టింది - నీ చేతిలోన
ఊగింది - ఉయ్యాలలోనైనా
ఊగింది - ఉయ్యాలలోనైనా
నేను దాగింది - నీ చల్లని ఒడిలోన
చల్లని ఒడిలోన // ఓ నాన్న! నీ మనసే వెన్న //

చరణం 3:

ఉన్ననాడు - ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి - సాచనన్నావు
ఉన్ననాడు ఏమి - దాచుకున్నావు
లేనినాడు చేయి - సాచనన్నావు
నీ రాచ గుణమే - మా మూలధనము
నీ రాచ గుణమే - మా మూలధనము
నీవే మాపాలి దైవము // ఓ నాన్న! నీ మనసే వెన్న // 

Friday, June 17, 2011

Vasudhaaraa - Badrinath




చిత్రం : బద్రినాథ్ (2011) 
రచన : చంద్రబోస్ 
పాడినవారు : శ్వేతాపండిత్, యం. యం కీరవాణి. 
సంగీతం : యం. యం కీరవాణి
********************
పల్లవి :

వసుధార వసుధార..
పొంగి పొంగి పోతోంది జలధార - వైభవంగా వస్తుంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార - వైభవంగా వస్తుంది వసుధార
ఆధార నా ప్రేమకాధారం అవుతుంటే..
ఆకాశ మేఘాల ఆశీసులవుతుంటే..
వాన జల్లుతో - వంతేనేయగా
వెండి పూలతో దండ లేయగ
వయసే నదిలా, వరదై నదిలా 

వసుధార వసుధార // పొంగి పొంగి పోతోంది జలధార // 


చరణం 1:
నింగి నీలల రాగం వినగానే
మేళ వేణువు మౌనం కరిగే
నీలో నాలో అభిమనమై

నీకు నాకు అభిషేకమై
మన మానస వీధుల్లో కురిసేనే

వసుధార వసుధార // పొంగి పొంగి పోతోంది జలధార //
చరణం 2:

నీటి లేఖల భావం - చదివానే
నీటి రాతలు కావి - చెలిమే
అంతేలేని చిగురింతలై

సంతోషాల - చెమరింతలై
తడి ఆశల - అక్షతలై మెరిసేనే

వసుధార వసుధార // పొంగి పొంగి పోతోంది జలధార // 

Tuesday, May 31, 2011

Jeevitha chakram - Kanti chupu chebuthundi

చిత్రం : జీవితచక్రం (1971)
రచన : ఆరుద్ర
సంగీతం : శంకర్-జైకిషన్
గానం : ఘంటసాల
**************
పల్లవి :

కంటిచూపు చెపుతోంది - కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
ఆశలు దాచకు.. ఆశలు దాచకు // కంటిచూపు //

చరణం 1 :

ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె - ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే - అండ కోరుకుంటాయి ఆ... హా..
అందమైన మగవాడు - పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు - ఓ పిల్లా
స్నేహము చేయవా - స్నేహము చేయవా // కంటిచూపు //

చరణం 2 :

కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంక - రామచిలక జోడు గూడె
కొమ్మమీద గోరువంకా - రామచిలకా
ముద్దుపెట్టుకున్నాయి ఆ.. హా..
మెత్తనైన మనసు నీది - కొత్త చిగురు వేసింది
మత్తులోన మునిగింది - ఓ పిల్లా
మైకము పెంచుకో - మైకము పెంచుకో // కంటిచూపు //

చరణం 3 :

చెప్పలేని వింత వింత అనుభవాలు - విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూచె
చెప్పలేని వింత వింత అనుభవాలూ
ఎదురుచూస్తున్నాయి ఆ.. హాహ్హ హ్హా..
నువ్వు నన్ను చేరాలి - నేను మనసు ఇవ్వాలి
ఎడము లేక ఉండాలి - ఓ పిల్లా
వస్తావా? మురిపిస్తావా? - వస్తావా? మురిపిస్తావా?  // కంటిచూపు //

Monday, May 30, 2011

Rangam - Ee Manchullo


చిత్రం : రంగం (2011)
గానం : శ్రీరాం పార్థ సారథి, బాంబే జయశ్రీ
రచన : వనమాలి 
సంగీతం : హరీస్ జైరాజ్
**************

ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ - ఆల్ ఈజ్ గానా బి ఆల్రైట్
ఓహ్ ఐ విల్ బి దేర్ - ఐ విల్ బి దేర్ ఫర్ యు 
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ 
ఫ్రోజెన్ ఇన్ లవ్ - లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్ 
అరౌండ్ నౌ 

పల్లవి :

ఈ  మంచుల్లో, ప్రేమంచుల్లో - ఎన్నెన్నో సంగతులూ
నీరెండల్లో ఈ గుండెల్లో - ఎన్నెన్నో సందడులూ
కవ్వించే చీకటి - కన్నుల్లో ఈ తడి 
ఇవ్వాలే వీడేనులే - ఉండుండి ఊహలు
ఈ పిల్ల గాలులు - నిన్నే పిలిచేనులే // ఈ  మంచుల్లో ప్రేమంచుల్లో //

చరణం 1:

కనులకు జతగా - వలపుల కథనే
కలలుగా కొసరనా
గల గల పలికే - పెదవుల కోసమే
కబురునై నిలవనా
నేడిలా మది విరిసేను ప్రేమలో
తేనెలే పెదవోలికేను జంటలో
కలయికలో // ఈ  మంచుల్లో ప్రేమంచుల్లో //

ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ - ఆల్ ఈజ్ గోన్నా బి ఆల్రైట్
ఓహ్! ఐ విల్ బి దేర్ - ఓహ్ ఐ విల్ బె దేర్
ఐ విల్ బి దేర్ ఫర్ యు
ఎవేరీ థింగ్ ఈజ్ చిల్డ్ నౌ - ఫ్రోజన్ ఇన్ లవ్
లెట్స్ వార్మ్ అండ్ క్లోజ్ - అరౌండ్ నౌ

చరణం 2:

మనసుని దాటి - మనసుని మీటి
నిలిచేనే మమతలు
ఒకపరి జననం - ఒకపరి మరణం
నిలువునా తోలిచేలే
యవ్వనం మనసుకి - తొలి మోహనం
చుంబనం వయసుకి - ఒక వాయనం
అనుదినమూ // ఈ  మంచుల్లో ప్రేమంచుల్లో //

Saturday, May 28, 2011

Mr Perfect - Chali chaliga allindi


చిత్రం : Mr.పర్‌ఫెక్ట్ (2011)
గానం : శ్రేయా ఘోషాల్
రచన : అనంత శ్రీరాం.
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
**************** 

పల్లవి :

ఓ చలి చలిగ అల్లింది - గిలి గిలిగ గిల్లింది
నీ వైపే మళ్ళింది - మనసు 
చిటపట చిందేస్తుంది - అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది - వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని - ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి - పోతున్నాయీ
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు - ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయీ
నువ్వు నాతోనే ఉన్నట్టు - నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు - నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు - ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు // చలి చలిగా //

చరణం 1:

గొడవలతో మొదలై - తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే - నీది నాది
తలపులు వేరైనా - కలవని తీరైనా
బలపడి పోతుందే - ఉండేకొద్దీ
లోయలోకి - పడిపోతున్నట్టు
ఆకాశం పైకీ - వెళుతున్నట్టు
తారలన్ని - తారసపడినట్టు
అనిపిస్తుందే నాకు - ఏమైనట్టు
నువ్వు నాతోనే ఉన్నట్టు - నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు - ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు - నా లోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు - ఏవో కలలు

చరణం 2:

నీపై కోపాన్నీ అందరి ముందైనా
బెదురే లేకుండా - తెలిపే నేను
నీపై ఇష్టాన్నీ నేరుగ - నీకైనా
తెలపాలనుకుంటే - తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ - గుర్తొస్తుంటే
నన్ను నేనే - చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు - పడుతూ ఉంటే
నువ్వు నాతోనే ఉన్నట్టు - నానీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు - నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు - ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు .

Friday, May 27, 2011

Rangam - Enduko emo thulli


చిత్రం : రంగం (2011)
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : ఆలాప్ రాజు 
అడిషనల్ వాయిస్ : ప్రశాంతిని, బృందం 
రాప్ - రచన : శ్రీ చరణ్, ఎంసీ జేస్జ్
****************

పల్లవి :

ఎందుకో ఏమో - తుళ్లి తిరిగెను మనసే 
పిచ్చి పరుగులు తీసే - వెల్లి విరిసెను వయసే
ఎందుకో ఏమో - గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే - పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
రేపో దరి కనని దరి - కనని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం

ఎందుకో ఏమో కంట మెరుపులు - మెరిసే
చేరి దూరమయ్యే వరసే - రేయి కలలుగ విరిసే
ఎందుకో ఏమో - రెక్కలెదలకు మొలిచే
చిన్ని గుండెనేదో తొలిచే - ఒంటరిగా నను విడిచే
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
రేపో దరి కానని తీరం - దరి కానని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
నువ్వునేను ఒక యంత్రమా - కాలం నడిపే ఓ మహిమ ప్రేమ
ఊ హు ఊహు..

చరణం 1: 

ముద్దులిడిన ఊపిరి సెగలు
తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే
నిన్ను విడిచి పరుగెడుతున్నా
సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే
అలా నన్ను రమ్మన్నావా అల్లాడి పోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే

ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెళ్లి విరిసేను వయసే..
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు కోర్చే పొంగి పొరలేను ఆశే..
నువ్వు నేను ఒక యంత్రమా
కాలం నడిపే ఓ మహిమ ప్రేమా
లెట్స్ గో.. వావ్ వావ్
నీ గల్లె తెలుగమ్మాయి ఎందుకో ఏమో
దే లుక్ సో ఫ్లై
మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పా
ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన

ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగలా సింగలా
నాటీ లుక్కులిచ్చే ఈవేళ
లేడీ లుక్ లైక్ ఎ సింగలా సింగలా
నన్ను చుట్టుముట్టే వెన్నెల 
 
ప్లేయ్డ్ లుక్ లైక్ ఎ సింగలా సింగలా
నాటీ లుక్కులిచ్చే ఈవేళ
లేడీ లుక్ లైక్ ఎ సింగలా సింగలా
నన్ను చుట్టుముట్టే వెన్నెల

చరణం 2:

నిలవనీక నిను తెగ వెతికే
కనులకిన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినబడుతున్నా
వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా
కన్నులనే పొందానో
కలే కల్లలయ్యే వేళ కన్నీరైపోతానో
నీడనే దోచే పాపే నేనో

ఏమో (ఆల్‌రైట్) తుళ్లి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెళ్లి విరిసెను వయసే
ఓహో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం

రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
రేపో దరి కానని తీరం - దరి కానని తీరం
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
 
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
రేపో దరి కానని తీరం - దరి కానని తీరం
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
ఏదో గజిబిజిగా గజిబిజిగా - కనిపించే రూపం
 
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
రేపో దరి కానని తీరం - దరి కానని తీరం
రోజూ తడబడుతూ వెలిగే - ఈ ఉదయం
ఏమో.. ఏమో.. ఏమో..

Saturday, May 21, 2011

Aakasham braddalina - Mr. Perfect.



చిత్రం : Mr. పర్ పెక్ట్ (2011) 
గాయకులు : సాగర్, మేఘ 
రచన : అనంత శ్రీరాం
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
******************
పల్లవి :

ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన - మోగుతోంది నిన్ను కలిసాక
మేఘాలే గుద్దుకున్న - లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక
రై రై రై రైడ్ చేసెయ్ - రాకెట్ లా మనసునీ
సై సై సై సైడ్ చేసెయ్ - సిగ్నల్స్ తో ఏం పని
ఇక హైవేలైన వన్‌వేలైనా - కదలదే బండి తేరేబినా - // ఆకాశం బద్దలైన //

చరణం 1:

పార్టీలా ఉంది నీతోటి ప్రతి క్షణం - ఎందుకంటే చెప్పలేను కారణం
టేస్టీగా ఉంది నువ్ చెప్పే ప్రతి పదం - బాగుందబ్బ మాటల్లోన ముంచడం
రోల్ ఎన్ కోస్టర్ ఎంతున్నా - ఈ థ్రిల్ ఇస్తుందా జానా,
నీతో పాటు తిరిగేస్తుంటే  - జోరే తగ్గేనా
కార్టూన్ ఛానెల్ లోనైనా - ఈ ఫన్ ఉందా బోలోనా
నీతోపాటూ గడిపేస్తుంటే టైమే - తెలిసేనా
ఇక సల్సాలైన సాంబాలైనా - కదలదే ఒళ్ళు తేరేబినా // ఆకాశం బద్దలైన // 

చరణం 2:

ఆన్‌లైన్‌లో నువ్ హై అంటే నా మది - క్లౌడ్ నైన్ లోకి నను తోస్తది
ఆఫ్‌లైన్‌లో నువ్వు ఉన్నావంటే మది - కోల్‌మైన్‌లోకి దూరేస్తది
ఏప్లేస్ఐనా గ్రీటింగ్‌కార్డ్‌లా కనిపిస్తుందే జానా - నాతో పాటు ఈ ఫీలింగు నీకూ కొత్తేనా
ఏరోజైనా వాలెంటైన్స్‌డే అనిపిస్తుందేమైనా - నాతో పాటూ అడుగేస్తుంటే నీకూ అంతేనా
ఇక డేటింగ్ అయిన ఫైటింగ్ అయినా - గడవదే రోజు తేరేబినా // ఆకాశం బద్దలైన // 

Aggipulla laanti - Mr. Perfect.


చిత్రం : Mr. పర్ఫెక్ట్. (2011)
గాయకులు : గోపికా పూర్ణిమ.
రచన : రామజోగయ్య శాస్త్రి
సంగీతం  : దేవిశ్రీ ప్రసాద్.
***************** 
అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల - నేను
నన్ను చిన్న చూపు చూస్తే - ఊరుకోనూ
ఎందులోనూ నీకు నేను - తీసిపోనూ
నా సంగతేంటో తెలుసుకోవా - పోను పోనూ
అచ్చమయిన పల్లె రాణిపిల్ల - నేనూ
పచ్చి పైర గాలి పీల్చి - పెరిగినానూ
ఏరికోరి గిల్లికజ్జా - పెట్టుకోనూ
నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేనూ.. హొయ్ హొయ్ హొయ్

హే సూటు బూటు స్టైలు - సుందరా
లేనిపోని డాబు - మానరా
ఈఊరిలో పైచేయి - నాదిరా
నా గొప్ప నువ్ ఒప్పుకో  - తప్పులేదురా
రేవులోని తాడిచెట్టులా నీ - ఎక్కువేమిటో
ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేలదించుకో.. ఓయ్..

Friday, May 20, 2011

Merise tharala - Sirivennela


చిత్రం : సిరివెన్నెల (1987)
రచన : చేంబోలు సీతారామశాస్త్రి (సిరివెన్నెల)
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
********************

పల్లవి :

మెరిసే తారలదేరూపం - విరిసే పూవులదేరూపం
అది నా కంటికి శూన్యం..
మనసున కొలువై మమతల నెలవై - వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం.. - గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం - అపురూపం // మనసున కొలువై //

చరణం 1 :

ఎవరి రాకతో గళమున పాటల - ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను - ఎలకోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి - తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై - నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం - గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం - అపురూపం // మనసున కొలువై //

చరణం 2 :

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా - గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి - ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవననాదం పలికిన నీవే.. - నా ప్రాణ స్పందన
నీకే నా - హృదయ నివేదన // మనసున కొలువై // 

Tuesday, May 17, 2011

Pavana guna rama hare - Bhaktha pothana


చిత్రం : భక్త పోతన (1942)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం, గానం : నాగయ్య.
*****************

పల్లవి :

పావన గుణ రామా హరే - పావన గుణ రామా హరే
రామా హరే // పావన గుణ //
పరమ దయా నిలయా హరే - పరమ దయా నిలయా హరే // పావన గుణ //

చరణం 1:

మాయా మానుష రూపా - మాయాతీతా మంగళ దాతా
మాయా మానుష రూపా - మాయాతీతా మంగళ దాతా
వేదాంత వధూ హృదయ విహారా - వేదాంత వధూ హృదయ విహారా
వేదమయా పరమానంద రూపా - వేదమయా పరమానంద రూపా // పావన గుణ //

చరణం 2:

కరుణారసభర నయనా - దరహాస మనోహర వదనా
కరుణారసభర నయనా - దరహాస మనోహర వదనా
నవతులసీదళ మాలాభరణా - నవతులసీదళ మాలాభరణా
నానా జీవన నాటక కారణ - నానా జీవన నాటక కారణ // పావన గుణ // 







Related Posts with Thumbnails