Friday, February 6, 2009

7/G బృందావన్ కాలనీ - తలచి తలచి చూస్తే తరలి..


చిత్రం: 7/G బృందావన్ కాలనీ (2004)
రచన: A.M. రత్నం
గానం: శ్రేయా ఘోషాల్
సంగీతం: యువన్ శంకర్ రాజా
******************


పల్లవి:

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ...
నీలో నన్ను చూసుకొంటినీ
తెరచి చూసి చదువు వేళ
కాలి పోయే లేఖ రాశా
నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ...
నీలో నన్ను చూసుకుంటిని

చరణం 1:

కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కథనిపుడు
రాలిపోయిన పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలచుకోనును దారులు ఎపుడు
పగిలిపోయిన గాజుల అందమా
అరచేత వేడిని రేపే చెలియ చేయి
నీ చేత ఒడిలో వాలి
కథలను చెప్ప రాసి పెట్టలేదు
తొలి స్వప్నం కానులే ప్రియతమా..
కనులు తెరువుమా

చరణం 2:

మధురమైన మాటలు ఎన్నో కలసిపోవు
నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా
చెరిగిపోని చూపులు అన్నీ
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా
వెంటవచ్చు నీడబింబం
వచ్చి వచ్చిపోవు కళ్ళముందు
సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
ఒకసారి కాదురా ప్రియతమా - ఎపుడు పిలిచినా.... // తలచి తలచి //

1 comment:

Anonymous said...

ఈ పాటని విన్నప్పుడల్లా, దాదాపుగా నాకు ఏడుపు వచ్చేస్తుంది..

Related Posts with Thumbnails