Sunday, February 8, 2009

Manchi manishi - Anthagaa nanu chudaku

చిత్రం: మంచిమనిషి (1964)
రచన: C. నారాయణ రెడ్డి
సంగీతం: S.రాజేశ్వర రావు, T. చలపతి రావు
గానం: ఘంటసాల, P.సుశీల
*******************
పల్లవి:
అంతగా నను చూడకు.. ష్.. మాటాడకు
అంతగా నను చూడకు..
వింతగా గురి చూడకు - వేటాడకు హొయ్ - || అంతగా నను చూడకు ||

చరణం 1:
చలి చలి గాలూ వీచెను సన్నని మంటలు లేచెను
చలి చలి గాలూ వీచెను సన్నని మంటలు లేచెను
తలపులే కవ్వించెను వలపుల వీణలు తేలించెను హొయ్ || అంతగా నను || 

చరణం 2:
జిలిబీ ఊహలు రేగెను నా చేతులు నీకై సాగెను
జిలిబీ ఊహలు రేగెను నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను పదునౌ చూపులు బాధించెను హొయ్ || అంతగా నను ||

చరణం 3:
వాలుగ నన్నే చూడనీ కలకాలం నీలో దాగనీ
వాలుగ నన్నే చూడనీ కలకాలం నీలో దాగనీ
నవ్వులే పండించనీ పువ్వుల సంకెల బిగించని హొయ్ || అంతగా నను ||

No comments:

Related Posts with Thumbnails