చిత్రం: జీవిత చక్రం (1971)
రచన: ఆరుద్ర
సంగీతం: శంకర్ - జై కిషన్
గానం: ఘంటసాల
*********************
పల్లవి:
సుడిగాలిలోన దీపం - కడవరకు వెలుగునా (2)
సుడిగాలిలోన దీపం...
చరణం 1:
లోకాన పన్నీరు జల్లేవులే
నీకేమో కన్నీరు మిగిలిందిలే
పెరవారి గాయాలు మాన్పేవులే
నీలోన పెనుగాయ మానేనులే (2)
అనగారిపోవు ఆశ నీవల్లనే పలికే.. // సుడిగాలిలోన //
చరణం 2:
ఒక కన్ను నవ్వేటివేళలో
ఒక కన్ను చెమరించసాగునా..
ఒక చోట రాగాలు వికసించునా
ఒక చోట హృదయాలు ద్రవియించునా (2)
ఎనలేని ప్రాణదానం ఎద బాధ తీర్చునా.. // సుడిగాలిలోన //
చరణం 3:
కల్లోల పవనాలు చెలరేగునా
గరళాల జడివాన కురిపించునా
అనుకోని చీకట్లు తెలవారునా
ఆనంద కిరణాలు ఉదయించునా (2)
విధికేమో లీల అయినా మది బరువు మోయునా.. // సుడిగాలిలోన //
No comments:
Post a Comment