Showing posts with label Funny photos. Show all posts
Showing posts with label Funny photos. Show all posts

Tuesday, August 25, 2015

ఉల్లి తిప్పలు

మార్కెట్ నుండి ఉల్లి గడ్డలు కొనుక్కొని వచ్చేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు : ( పెరిగిన ఉల్లిధరకు కామెడీగా వ్రాశాను )

1. తోడుగా ఒకరిని వెంటపెట్టుకొని పోవడం. అవసరమైతే ఒక సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేసుకోవాలి. 

2. కొన్న తర్వాత జాగ్రత్తగా సంచి పట్టుకోవడం చాలామంచిది. 

3. ఎవరైన అపరిచిత వ్యక్తి మీ సంచిలోనుంచి ఉల్లిగడ్డ పడిపోయింది అని మీ దృష్టి మరల్చి మీ ఉల్లిగడ్డల సంచి ఎత్తుకపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. 

4. అంగడిలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దు. ఎంత కొంటున్నామో అసలే లీక్ చేయవద్దు.

5. ఉల్లి గడ్డలు కొనడానికి వెళ్ళే ముందు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి..! 

6. ఉల్లిగడ్డలు దారిలో పడి ఉన్నాయని వాటిని అందుకోవడానికి ప్రయత్నించవద్దు.. అలా చేస్తే మీరు దోపిడీకి గురి కావొచ్చును. 

7. మాదగ్గర ఇన్ని కిలోల ఉల్లిగడ్డలు ఉన్నాయని గొప్పలకి చెప్పకండి. ఎవరైనా వింటే - అవి వెంటనే దోపిడీకి గురి కావొచ్చును. 

8. ఇంట్లో వాటిని ఒక CC కెమరా నిఘాలో ఉంచండి. ఎవరైనా దొంగతనం చేస్తే - సాక్ష్యాధారాలతో కేసు పెట్టవచ్చు. 

9. ఎన్ని కిలోల ఉల్లిగడ్డలు కొన్నా - నరదృష్టి తప్పించుకోవడానికి వాటిపైన మిగతా కూరగాయలు, ఆకు కూరలు కప్పండి. 

10. ఎక్కువగా ఒకేసారి ఉల్లిగడ్డలు కొనకండి. అలా చేస్తే మీరు ఇన్కంటాక్స్ వారి నోటీసులని ఎదురుకొనే ప్రమాదం ఉంది. 

11. ఫంక్షన్లలోని వంటకాలు అన్నీ ఉల్లితో చేసినవని - ఆహ్వాన పత్రాల్లో అచ్చు వేయించి, మీ హోదాని చూపండి. 

12. మీ ఇంట్లో ఉల్లిగడ్డలు ఎక్కడ పెట్టారంటూ వచ్చే మెయిల్స్ కి బదులివ్వకండి. ఆనియన్ హ్యాకింగ్ కి గురి కాకండి. 

13. మీ సోషల్ సైట్లలో ఉల్లి గురించి పోస్ట్స్ అసలే వద్దు.. చప్పిడి కూరలతో ఏదో కానిస్తున్నాం స్టేటస్ ఏడవండి.. లేకుంటే మీ ఇంటిపైన బంధు, మిత్రులు (విందు)దాడికి దిగొచ్చు. 

14. వచ్చిన ఫంక్షన్ ఆహ్వానాల్ని తప్పక మన్నించి వెళ్ళిరండి. అక్కడ ఉల్లితో చేసిన వంటకాలు కడుపారా తినేసి రండి. వచ్చేటప్పుడు - రిటర్న్ గిఫ్ట్ గా కిలో ఉల్లిపాయలు దొరికినా అదృష్టమే కదా.. 

15. మా "సురక్షా ఉల్లి కవచ యంత్ర" - అనే టెలి మార్కేట్ కుయుక్తులని నమ్మకండి. వాటిని కట్టుకున్నా మీకు ఉల్లిగడ్డలు దొరక్క పోవచ్చును. 

16. మీరు ఉల్లి కొనడానికి వెళ్ళిన కొట్లో - మీకు తెలిసినవారు ఉంటే - వారు కొని వెళ్ళిపోయాక గానీ ఆ కొట్లోకి వెళ్ళవద్దు. 


Wednesday, November 28, 2012

ఒక కోడి ఆవేదన ;)


Thursday, September 15, 2011

ఇదేమిటో చెప్పుకోండి చూద్దాం.



పైన ఉన్న ఫోటోని మరొక్కసారి బాగా చూడండి. డబల్ క్లిక్ నొక్కి బాగా చూడండి. చూశారా.. ఓకే. ఇప్పుడు అది ఏమని అనుకుంటున్నారు?.. ఒక చిన్న ట్రే లాంటి దాంట్లో, రెండు నట్టుల మధ్య ఒక చిన్న సర్క్యూట్ బోర్డ్, ఏదో కనెక్టర్ కి అటాచ్ చేశారని అనుకుంటున్నారా...? ఓకే. మీరు కాస్త సరిగ్గానే ఊహించారు.. మార్కెట్లో ఈ మొత్తం యూనిట్ ని ఏమంటారో తెలుసునా?.. 
..

..
జవాబు తట్టడం లేదు కదా.. 
..

..

..

.. 
ఆలోచించారా..?
..

..

..
ఆగండాగండి.. ఇక చాలులెండి.. మరీ చించేసేలా ఉన్నారు.. 
..
ఓకే. నేనే చెబుతాను. అది - 

ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్

షాక్ అయ్యారా?.. నిజమే!.. మీలాగే నేనూ అయ్యాను. లోపల ఇలా ఉంటుందా అని మరీ హాస్చర్య పడిపోయారా? నిజానికి ఇలా ఉండదు. వేరేలా ఉంటుంది. లోపల మొబైల్ ఫోన్ లో పట్టే మామూలు  మైక్రో SD కార్డ్ ని అందులో ఉంచి దాన్ని హార్డ్ డిస్క్ లా భ్రమింపచేసి, అమ్మేస్తున్నారు. అందులో ఉన్నది మెమొరీ కార్డ్ కాబట్టి ఎన్నిసార్లు అయినా వాడవచ్చును. ఒకవేళ వారంటీ లోగా పాడయితే? 

హా! ఏముంది?.. దాన్ని విప్పేసి, ఇంకో మెమోరీకార్డ్ పెట్టి, ప్యాక్ చేసి, రెండురోజుల తరవాత డెలివరీ చేస్తారు. (అలాని ఎందుకూ అంటే - అడిగిన వెంటనే రిపేర్ చేసి ఇస్తే, ఆ వ్యాపార సంస్థ మీద నమ్మకం ఉండదు. కాస్త సమయం తీసుకొని చేసిస్తే, బాగా నమ్మకం కుదురుతుంది. నమ్మకున్నా, నవ్వుకున్నా సరే - ఇది మాత్రం నిజం. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇది నిజమని మీరే ఒప్పుకుంటారు) 

కాని మార్కెట్లో ఉన్న మోసాలకి ఒక ఋజువుగా ఇది మీకు చూపిస్తున్నాను..  అన్ని కంపనీలు ఇలా చేస్తాయని కాదు. ఈ మధ్య పేరులేని కంపనీలు తామరతంపరగా ఇలా చేస్తున్నాయి. ఇక్కడ వాదనలు అనవసరం.. మీకు వర్క్ అవుతుందా, లేదా అని దబాయిస్తారు. అప్పుడు మనం ఏమీ అనలేము.. 

అందులోని మెమొరీ కార్డ్ ని ఎలా మారుస్తారు అంటే - ముందుగా ఒక మామూలు పెన్ డ్రైవ్ ని విప్పేస్తారు. అలా విప్పేసిన పెన్ డ్రైవ్ ఇలా ఉంటుంది. 


ఇలా ఉన్న ఆ పెన్ డ్రైవ్ లోని ఆ సర్క్యూట్ బోర్డ్ ఇంకోవైపున ఇలా ఉంటుంది. 


ఇదే భాగాన్ని ఆ హార్డ్ డిస్క్ లో పెట్టేస్తారు. ఇంతే!.. చాలా సింపుల్. ఈ ఫోటోలో మీరు మెమొరీ కార్డ్ స్లాట్ నీ, అందులో అమర్చిన మెమొరీ కార్డ్ నీ చూడండి. ఇదే భాగాన్ని ఆ ఎక్స్టర్నల్ డిస్క్ లో చూడవచ్చును. 


Tuesday, September 13, 2011

తెల్లని కాకి

కాకులందు తెల్లని కాకులు వేరయా.. 


Wednesday, August 24, 2011

ఒకప్పటి టీవీ కలర్ ఫోటో

సాంకేతిక విప్లవం దినదిన ప్రవృద్ధి చెందుతుండగా, ఇటు ప్రజలకి ఒకప్పుడు విలాస వస్తువులు అనేవి - ఇప్పుడు కనీస అవసరాలుగా మారిపోయిన వేళ - ఒకప్పటి రోజులు చిత్రాతి చిత్రముగా తోస్తాయి. అదో మరపురాని అనుభవాలు ఇప్పటి కాలం వారికి నవ్వులాటగా అనిపిస్తుంది. అలాంటి ఒక ఉదాహరణ చెబుతాను. 

ఒకప్పుడు టీవీ అంటే చాలా గొప్ప. వేయి ఇండ్లు ఉన్న ఊర్లలో కూడా ఒకప్పుడు రెండు, మూడు టీవీల కన్నా ఎక్కువగా ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో ఆ టీవీనే తాకాలి అంటేనే - నాలుగైదు సార్లు రెక్కీ చేసి మరీ త్రాకేవారు. "నేను ఈరోజు టీవీ ముట్టుకున్నానురోయ్.." "నీ మొహం.. ఈరోజు టీవీ సిచ్చు ఒత్తి నేనే ఆన్ చేశాను తెలుసా.. నాదే గ్రేటు రా.." అని గొప్పగా చెప్పెరోజులవి. అప్పుడు అలా ఆ టీవీతో కలర్ ఫోటో తీసుకోవటం గొప్పగా ఉండేది.. అలాంటి ఒక ఫోటో చూడండి. 


హ హ్హా హ్హ.. అప్పుడు అప్పటివారు ఈ ఫోటో చూస్తే - సంభ్రముగా చూసేడివారు. ఇప్పటివారు నవ్వుకుంటారు. 

Friday, July 29, 2011

ఒక చిన్ని కథ

మీకు ఒక చిన్ని కథ చెబుతాను.. శ్రద్ధగా వినండి. 

సరేనా?..

అయితే ఓకే. 
.
.
.

ఒక రాజ్యములో ఒక రాజు ఉండేవాడు..


అలాగే ఒక రాణీ కూడా ఉండేది. 

.
ఒకరోజు ఏమయింది అంటే - 
ఇద్దరూ చనిపోయారు..
.
.
అంతే! కథ ముగిసింది. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

క్రింద ఇంకా ఏమి వెదుకుతున్నారు.. వారి శవాలా?.. 
చెప్పాగా కథ అయిపొయింది అనీ.

Monday, July 25, 2011

Creative Lunch box

మీ పిల్లల లంచ్ బాక్స్ లని ఎలా అందముగా - అమర్చి పెట్టవచ్చో, చూడండి. అలాంటి ఆహార పదార్థ అమరికలలో కొన్ని ఫొటోస్ మీకోసం.. 



















Tuesday, July 12, 2011

ఈ పక్షికి ఎంత కుళ్ళు

ఈ ఫోటోలోని జంటని చూడండి.. టైటానిక్ సినిమాలోని - కేట్ మరియు డికాప్రియో లెవల్లో ఎంత స్టైల్ గా ఉన్నారో!. అలా వారిలాగే అలా ఫోటో దిగుదాం అనుకుంటే - అనుకోని ఉత్పాతం లాగా - ఆ సీగల్ పక్షి వచ్చి ఆ అమ్మడి మొఖం మీద గుద్దేసింది. అప్పుడే కెమరా క్లిక్మంది.. ఇదొక మధురాతి అనుభవముగా మిగిలిపోయింది వారికి. కాదా మరి? అలా దిగేటప్పుడు అలా పక్షిని పిలిచి రమ్మన్నా రాదుగా.. ఆ పక్షికి - ఆ జంట అలా ఫోటో దిగటానికి నిలబడితే బాగా కుళ్ళులా ఉన్నట్లుంది.. హ అహహా హ్హ..


Thursday, June 16, 2011

మన నాయకుల అవినీతి చిట్టా.

మన నాయకుల అవినీతి గురించి చిట్టా వ్రాస్తే - ఇంతలావు గ్రంధం అవుతుందేమో!.. 



Saturday, June 19, 2010

వాతావరణ కార్యక్రమం

It is JUST FOR FUNNY.. Don't be take serious..

యూరప్, అమెరికా దేశాలలో అంతగా వర్షాలు పడతాయి.. కాని ఈ సౌదీ అరేబియా ప్రాంతములో వర్షాలు ఎందుకు పడటం లేదో కారణం తెలుసా.. భూమధ్య రేఖా, ఎడారి, పొడిగాలులూ అంటూ ఏవో సైన్సు పేర్లు చెప్పకండి.. అవి అందరికీ తెలుసు. ఈ క్రింది టీవీ వాతావరణ కార్యక్రమాలని చూస్తుండండి. మీకే సమాధానం దొరుకుతుంది. - అని ఒక ఔత్సాహికుడు చెప్పాడు..












Thursday, March 25, 2010

Drive Carefully..

రోడ్డుమీద జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యండి.. లేకుంటే ప్రమాదం అని చెప్పీ, చెప్పీ విసుగోచ్చేసిందేమో.. ఇలా లోతుగా చెబితే అర్థం చేసుకుంటారని ఇలా ప్రకటనలు ఇచ్చారు ఆ అధికారులు.

మీరు ఎంత అజాగ్రత్తగా నైనా డ్రైవ్ చెయ్యండి.. మీ మీద ఆధారపడ్డ వారి జీవితం మాత్రం సాఫీగా గడిచిపోతుంది.. అనే నిగూడార్థములో (మీరు ఆక్సిడెంట్లో పోతే, వచ్చే ఇన్సూరెన్సు డబ్బులతో మీ ఆవిడ క్రొత్తగా పెళ్లి చేసుకుంటుందని కాబోలు)  ఈ ప్రకటనని రూపొందించారు.. గమనించండి..

Friday, January 29, 2010

Blobfish

ఈ రోజు ఉదయం లభించిన అరుదైన చేప = బ్లాబ్ ఫిష్ అణు జలచరం ఫోటో ఇది. ఇదేదో మాంసం ముద్దలా ఉన్ననూ ఇది ఒక చేప.. ఏదో తోలుబొమ్మలాట లోని వింత బొమ్మ కాదు.. నిజం చేప!! కేవలం అడుగు పొడుగుండే చేప ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ మహా సముద్రాలలో రెండువేల అడుగుల క్రిందన మాత్రమే ఉంటుంది. వేగముగా అంతరించిపోతున్న జీవచరాల లిస్టులో ఉన్న ఇది ల్యాబ్ స్టర్ లనీ, ఎండ్రకాయలను మాత్రమే తింటుంది.

Related Posts with Thumbnails