Wednesday, April 29, 2015

Quiz


40 శత్రుదేశ విమానాల్లో 40% వాటిని కూల్చివేయగా, తిరిగి గమ్యస్థానమునకు వెళ్ళినవి ఎన్ని ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


Sunday, April 26, 2015

Good Morning - 580


ప్రేమిస్తే పోయేదేమీ లేదు..
ప్రేమించిన వారితో తప్ప - 
ప్రపంచముతో దూరముగా ఉండాలనీ, 
తోటివారిని ద్వేషించాలీ అనీ భావన తప్ప.. 
ద్వేషిస్తే వచ్చేదేమీ లేదు - 
మన అనే వారితో దూరం తప్ప. 
మనమే జీవితం అనుకున్న వారికి కన్నీరు తప్ప.. 

అవును.. ప్రేమిస్తే - ప్రేమించిన వారితో తప్ప, మిగిలిన వారందరితో దూరముగా ఉండిపోతాం.. ప్రేమించినవారే ఇక వారి తలపులూ, ధ్యాస, లోకం, ఊపిరి.. అన్నీ అవుతాయి. వారికన్నా ఇక ఈ లోకములో ఇంకేమీ వద్దనిపిస్తుంది. ఇలా ప్రేమలో పడ్డాక - మిగిలిన వారితో కాస్త ఎడబాటుని ప్రదర్శిస్తాం.. మనల్ని ఈ ప్రేమ విషయమై ఏదైనా ప్రశ్నిస్తే వారిని ద్వేషిస్తాం కూడా.. ఇలా చేస్తే మనవారు అనుకున్నవారు దూరమై పోతారు.. మన మంచికి, శ్రేయస్సుని కోరేవారిని అలా దూరం చేసుకున్న వారిమి అవుతాము.. ఫలితముగా వారికి బాధనీ, కన్నీరుని కలిగిస్తాము.. 

Monday, April 20, 2015

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


Monday, April 13, 2015

Good Morning - 579


స్నేహితులంటే - 
సమస్యలని సృష్టించేవారు కాదు.. 
సమస్యలను తొలగించేవారు. 

హా.. నిజమే..! నిజమైన స్నేహితుడు అంటే మన మనసెరిగి, మన ఆలోచనలు గ్రహించి , మనల్ని సన్మార్గములో నడిపిస్తూ, సమస్యలని తొలగిస్తూ, అహర్నిశలూ మన ఉన్నతినీ, ప్రగతినీ, శ్రేయస్సునీ కోరేవాడు. స్నేహితుని ఎదుగుదలని తనదిగా  భావించేవాడు. కానీ, ఈరోజుల్లో అలాంటి స్నేహితులు కరువయ్యారు.. ఎక్కడ చూసినా తమ స్వార్థం చూసుకొనేవారే కనిపిస్తున్నారు.. ఇక వారు సృష్టించే సమస్యలూ అంతా ఇంతా కాదు.. లేనిపోని క్రొత్త చిక్కుల్ని మనకి ఎదురయ్యేలా చూస్తున్నారు కూడా.. అలా క్రొత్త సమస్యలను పుట్టించేవారు ఎక్కడో ఉండరు. మన చుట్టూరా, మన మధ్యలోనే ఉంటూ, ఆత్మీయముగా మెసులుతారు. వారు చేసే కాలక్షేపం, కబుర్లు, చిన్న చిన్న సాయాలూ, పైపైకి ఉండే గొప్పలూ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటివారిని, వారి మాటల్నీ నెత్తిన పెట్టుకొని చూస్తాం.. వీరు చెప్పిన మాటల్ని నమ్ముకుంటూ - జీవితాన కొన్ని విలువైనవి కోల్పోతుంటాము. వాటిని కోల్పోయాక - అలాంటివి మళ్ళీ దొరకక, అలాంటివి ఎందుకు కోల్పోయామా అని బాధపడి, వాటిని తిరిగి పొందాలనుకున్నా - మొహం చెల్లక, ఈగో సమస్యల వల్ల తీరని వ్యదనే మిగిలిపోతుంది. 

మనకీ ఇలాంటివారు స్నేహితులై ఉన్నప్పుడు వారిని వారిని గుడ్డిగా నమ్మకండి.. మీయొక్క విచక్షణా జ్ఞానాన్ని కాస్త వాడండి. ఇలాంటివారిని కనిపెట్టడం ఎలా అని సందేహం రావొచ్చును.. కొద్ది అనుభవాల మీద ఇలా గుర్తించేలా వస్తుంది. స్నేహంలో అందరూ మనకి అవసరమే.. అందరినీ ఆదరించాలి. సమానముగా స్నేహించాలి. కానీ అది కృతకముగా, ఆర్టిఫిషియల్  గా ఉండనక్కరలేదు. మనస్పూర్తిగా ఉండాలి. మనస్సులో ఉండే స్వచ్ఛత మన చేతల్లో, చేసే పనుల్లో, కళ్ళల్లో కనిపించాలి. ఇలా చూపినా  మనం మోసపోతే అన్న ప్రశ్న కలుగవచ్చును.. అది వాళ్ళ ఖర్మ.. మనం మంచి చెయ్యాలని చూస్తే - వారు చెడు చెయ్యాలని చూసినప్పుడు - వారికి ఇక మన అవసరం లేదనుకోవాలి. ఇక వారిని వారి మానాన వారిని శాశ్వతముగా వదిలెయ్యాలి. ఒకమాటలో చెప్పాలీ అంటే వారు ఈలోకములో లేరు అనుకోనేట్లుగా ఉండాలి. వారు మనల్ని పట్టించుకోవటం లేదు అన్న ఫీలింగ్ నెమ నెమ్మదిగా వారిలో ఏర్పడి, వారిని అతలాకుతలం చేస్తుంది. అప్పటికి వారిలో మార్పు వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ఇలా చెయ్యటంలో ఒప్పా? తప్పా అన్న ప్రశ్నని ప్రక్కన పెడితే - నా దృష్టిలో - ఇప్పటికాలములో అది సరైన నిర్ణయమనే చెప్పుకోవాలి. 

స్నేహం అందరూ చేస్తున్నాం అనుకుంటారు.. ఈరోజుల్లో స్నేహం మీద ఎవరికీ సదభిప్రాయం కూడా లేకుండా పోయింది.. వీడెందుకు అంతగా నాతో ఈమధ్య ఉంటున్నాడు? నాకేమిటి లాభం ? అన్న పాయింట్ మీదే ఆధారపడి ఉంటున్నాయి. స్నేహితుడన్న వాడు ఎదుటివారికి మేలు కలుగచెయ్యకున్నా సరే! కానీ, సమస్యలను సృష్టించకూడదు.. ఒకవేళ తెలిసో, తెలీకో అలాంటి సమస్యలు మన సహచర్యం వల్ల ఏర్పడుతున్నాయీ అంటే - ముందుగా వాటిని వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. అలా చేస్తే స్నేహ బంధం మరింతగా బలపడుతుంది. ఎంత ప్రయత్నించినా ఏర్పడ్డ సమస్యలు ( మన వల్ల ఏర్పడ్డవీ, ఎవరో ఏదేదో చెబితే వచ్చేవీ, అపోహల వల్ల కలిగినవీ  ) దూరం కాకపోతే - స్నేహితుల శ్రేయస్సుకోరి మనమే దూరం అవ్వాలి. అవును.. మనమే దూరం అవ్వాలి. మనసుని కోసేసినంత బాధ కలిగినా - తప్పదు. అలా అయితేనే మనం నిజమైన స్నేహితుడమనిపించుకుంటాం.. ఆ దూరం ఎన్నడూ శాశ్వతం కాదు.. ఎప్పుడో ఒకసారి మళ్ళీ కలుస్తుంది.. అప్పుడు ( మళ్ళీ ) కలిసిన స్నేహం మరింతగా బలంగా దిద్దుకుంటుంది. ( నేనూ - నా స్నేహితుని విషయం లో ఇలాగే చెయ్యాల్సి వచ్చింది. మనసుకి బాధ కలిగినా నా స్నేహితుడు తన జీవితాన చాలా సంతోషముగా, మునపటి కన్నా మరింత అభివృద్ధిలో ఉన్నాడన్న విషయాన్ని దూరాన నుండే చూస్తున్నాను. వాడి ఎదుగుదలని చూసి - నేనే ఎదుగుతున్నాను అన్నంత సంతోషములో నేను ఇప్పుడున్నాను. ఎవరో ఏవేవో ఏర్పరిచిన అపోహల వల్ల అలా దూరం చేసుకున్నా - ఎప్పుడూ వారి శ్రేయస్సునే కోరుకుంటున్నాను.. నాకు అదే చాలా సంతోషాన్ని కలుగచేస్తున్నది. మేము మళ్ళీ కలుస్తామా, లేమా అన్నది కాలానికే ఎరుక ) 

స్నేహితుడు దూరమైనా - దూరములో నుండి - విడిపోయిన స్నేహితుని ఉన్నతిని, అభివృద్ధినీ చూసి, ఆనందించే వాడే అసలైన స్నేహితుడు.. అని నేనెప్పుడూ అనుకుంటాను. 

Tuesday, April 7, 2015

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :


Monday, April 6, 2015

Good Morning - 578

అభిప్రాయ భేదం వేరు - గొడవ వేరు. 
అవతలి వారి అభిప్రాయం కానీ, ప్రవర్తన కానీ, 
పని కానీ నచ్చకపోతే, 
గొడవపడకుండా తన భావాన్ని చెప్పగలగటం ఒక గొప్ప కళ. 

అవును.. ఈ లోకములో ఏదైనా ఒక విషయం మీద ఎవరికీ వారిని తమ అభిప్రాయం చెప్పమన్నప్పుడు - ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. అందరూ ఒకేలా స్పందించాలన్న రూలేమీ లేదు.. ఎవరి అభిప్రాయం వారిది. ఆ అభిప్రాయం నచ్చకపోతే చిన్నగా నవ్వేసి ఊరుకోండి.. లేదా మౌనముగా ఉండిపోండి.. లేదా సున్నితముగా ఎందుకు నచ్చలేదో చెప్పండి ( అలా చెప్పటం అన్నది తిరిగి వారు ఆ విషయం మీద చర్చకి తెర ఎత్తేలా చెయ్యకూడదు  ) సినిమాలు, రాజకీయాల విషయాలు జోలికి అస్సలు వెళ్ళకండి. వేరే యే విషయాల మీద అయినా మాట్లాడండి. ఆ రెండు విషయాల్లో అభిప్రాయాల భేదాలు తప్పనిసరిగా వస్తాయి. ఎదుటివారి ముందు తాము తక్కువ కావొద్దని, తామే నెగ్గాలని లేనిపోని వాదనలతో ప్రయత్నిస్తారు. అప్పుడే గొడవ మొదలవుతుంది. ఇటు సమయం, అటు అంతదాకా ఆ ఆ స్నేహ బంధాల మీద వెచ్చించిన సమయం, డబ్బూ, చేసిన మేళ్లూ.. అన్నీ గోవిందా - గోవిందా.. ( ఇలా అయ్యే నా ఇద్దరి మిత్రుల వాగ్వాదం పదిహేనేళ్ళ ఎడబాటుకి గురి చేసింది. అది ఇంకా ఇప్పటికీ అలాగే దూరముగానే కొనసాగుతున్నది కూడా.. ) 

అభిప్రాయాన్ని అభిప్రాయం గానే తీసుకోండి. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండాలన్న రూలేమీ లేదు కూడా. వారి అభిప్రాయం వారిది అని ఊరుకోండి. దాన్ని విభేదించినప్పుడే గొడవగా మారుతుంది. అలా మారాక ఎవరి ఈగో వారిది ఉంటుంది. ఫలితముగా ఎవరితో అంతగా సఖ్యతగా ఉండలేనంతగా మారిపోతారు. ఉన్న జీవితమే అరవై ఏళ్లుగా భావిస్తే - అందులో  మొదటి ఇరవై ఏమీ తెలీకుండానే వెళ్ళిపోతాయి. చివరి ఇరవై ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటాం.. మధ్యలోని బంగారం లాంటి కాలాన్ని కాసేపు నోరు మూసుకుంటే వెళ్ళిపోయే ఇబ్బందికర  అభిప్రాయ భేద కాలాన్ని - చేజేతులారా పాడుచేసుకొని జీవితకాలం బాధపడేలా చేసుకోవడం అంత సమంజసమైన పని అనిపించుకోదు. అప్పుడప్పుడు లేదా రోజూ ఎదురయ్యే వారితో అలా చేసుకోవటం అన్నది మరీ మూర్ఖత్వం నా దృష్టిలో. అవును.. వారు అలా చేసుకుంటే పక్కా పిచ్చోళ్ళే అని నేను అనుకుంటాను. కానీ ఆ సమయాన అర్థం కాదు.. జీవితం కొనసాగి, ఒక దశకి వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. అంతదాకా మనం చేసిన పని గొప్ప హీరో వర్షిప్ గానే భావిస్తాం.. తెలిశాక గానీ అప్పుడు ఆరోజు అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని అనుకోం.. అందుకే దయచేసి - ఏ అభిప్రాయ భేదాన్నీ గొడవ వరకు తీసుక రాకండి. వచ్చేట్లు అనిపిస్తే - ఏదో ఒక వంక పెట్టుకొని, అక్కడినుండి దూరముగా జరిగిపోండి.

ఏదైనా నచ్చకపోతే సున్నితముగా చెప్పండి. అది ఎలా ఉండాలీ అంటే - అది చెప్పాక మీ ఇద్దరిమధ్య బందం మరింతగా బాగుంటుంది అనుకుంటేనే.. లేకుంటే అస్సలే వద్దు. ఆ ఆర్టు ( కళ ) మీలో ఉంటే చెయ్యండి. లేకుంటే మీకు సంబంధించిన విషయం కాదని ఊరుకోండి. 

చివరిగా ఒక మాట : మనుష్యులూ మనుష్యులూ మనసు విప్పి మాట్లాడుకోలేని ఈరోజుల్లో - అభిప్రాయ భేదాల వల్ల బంధాలు దూరం చేసుకోవడం అంత మంచిది కాదు.. ఎంతమందితో మనం " సరిగా " ఉంటే - జీవితాన అంత సక్సెస్ ఫుల్ మనిషిగా అవుతాం.. ఇది మాత్రం నమ్మలేని నిజం.. 

Related Posts with Thumbnails