Monday, January 18, 2016

Good Morning - 599


ఒక్కసారి నవ్వుతూ చూడు - ఈ ప్రపంచములో ఉండే అందాలన్నీ నీ స్వంతమవుతాయి. తడిసిన కనురెప్పలతో చూడు.. అద్దం కూడా మసకబారిపోతుంది. 


Tuesday, January 12, 2016

మినరల్ వాటర్ లో వెండి..

మీరు మీ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకుంటామూ అనుకంటే - ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ అందించబోతున్నాను. దాన్ని మీరు ఆచరించండి. దాని వల్ల మీరు మరింత ఆరోగ్యముగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఇది నిజమా కాదా అనే చర్చ నేను తీయడం లేదు.. నేను ఈ పద్ధతిని గత ఏడెనిమిది సంవత్సరాలుగా విధిగా పాటిస్తున్నాను కనుక - మీకూ మంచి చెయ్యగలదని అనుకుంటున్నాను. నమ్మకం ఉన్నవారు ఆచరించండి. 

ఈరోజుల్లో అందరూ దాదాపుగా మినరల్ వాటర్ అంటూ బబుల్స్ లలో నింపి వచ్చే ప్యాకేజ్డ్ నీటినే అందరూ వాడుతున్నారు. రివర్స్ ఆస్మోసిస్ ప్రక్రియ ద్వారా నీటిని శుభ్రం చేసి, ప్యాకింగ్ చేసి, మన వద్దకి పంపిన ఆ నీరు కొన్ని గంటల తరవాత ఆ నీరు క్షయకరణం కావడం మొదలెడుతుంది. ఆ నీరు మరింత శుద్ధిగా ఉండాలంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు చెప్పబోతున్నాను. 

ఆ నీటి బబుల్ ని పెట్టే క్రింది డబ్బాలోని నీళ్ళలో - ఒక వెండి రేకుని వెయ్యండి. వెండికి గల శక్తుల్లో - నీటిలో ఉన్న బ్యాక్టీరియాని చంపే గుణం కూడా ఉందంట. ఒకప్పుడు ఈ మినరల్ వాటర్ / ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ డబ్బాలు లేని కాలములో - యాత్రలకు వెళుతూ లోపల వెండి పూత పూసిన మరచెంబులను తీస్కెల్లె వారట. ఓడల మీద వెళ్ళే వారు పెద్ద పీపాల్లో నీటిని పట్టి, వాటిల్లో వెండి నాణేలని వేసుకొని, ఆ నీటిని వాడేవారట. ఈ విషయం తెలుసుకున్నాక నేనూ ఆ ప్రయోగాన్ని చెయ్యాలని అనుకున్నాను. 

కొద్దిగా వెండిని తీసుకొని, సన్నగా రేకులాగా చేయించాను. ఇలా రేకులా ఎందుకంటే నీటికి ఎక్కువ వైశాల్యములో ఆ వెండి రేకు తగులుతుందని. క్రింది డబ్బా మూతిలో పట్టే విధముగా చేసి, అందులోకి అలా రెండు రేకుల్ని జారవిడిచాను. ఆ తరవాత నీటిని నింపి, వాడుకోవడం మొదలెట్టాను. 

ఇప్పటికీ అలాగే ఆ డబ్బాలో ఆ వెండి రేకులు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతివారం వాటిని శుభ్రముగా కడిగి, మళ్ళీ వాటిని ఆ నీటి డబ్బాలో వేసుకొని ఆ నీటిని వాడుకోవడమే. 

మరి ఏమైనా మార్పు జరిగిందా ? అంటే ఏమి చెప్పగలను. నేనేమీ శాస్త్రవేత్తని కాను. కానీ గమనించిన విషయం ఒకటుంది. గత ఇన్ని సంవత్సర కాలములో మా ఆరోగ్యాలకి డోకా లేదు.. హాయిగా ఉన్నాం. పెద్దవాళ్ళం మాకు రెసిస్టన్స్ పవర్ వల్ల అలా ఉండొచ్చు. కానీ పిల్లలకు అంతగా ఉండదు కదా.. వారూ ఈ నీటినే త్రాగుతారు. వారి ఆరోగ్యాలూ చాలా చాలా బాగున్నాయి. ఈ నూతన సంవత్సర కానుకగా - మీకు ఈ విషయాన్ని పరిచయం చేస్తున్నాను. నమ్మినవారు ఈ సూచనని పాటించండి. 

ఇదే ప్రయోగాన్ని రాగి రేకులతో చేశాను. కానీ ప్యాకేజ్డ్ నీటిలో ఉండే రసాయనాల వల్ల తరచుగా ఆ రాగిరేకు మీద ఆకుపచ్చని రంగులో మలికి / త్రుప్పు / గార పట్టుతున్నది. దాన్ని శుభ్రం చెయ్యడం కాసింత కష్టమైనపనే.. 


Friday, January 8, 2016

Quz

12+12 = 9 
25 + 25 = 49
18 +18 =81 
29 + 29 = ?

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer : 


Monday, January 4, 2016

Good Morning - 598


నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ. తాపాలెక్కువ. షరతులూ ఎక్కువే.. వాటిని అర్థం చేసుకున్న వారికన్నా తట్టుకోలేక విడిపోయి వెళ్ళిపోయే వారే ఎక్కువ.. 

అవును కదూ..! నిజమైన ప్రేమ అన్నాక - అందులో ఎదుటివారిది అంటే తనవారిది ప్రతీది నాకే చెందాలి. అవన్నీ నా స్వంతమన్న భావన బలీయముగా ఉంటుంది. ఫలితముగా ఎదుటివారి మీద కోపతాపాలు చూపిస్తారు. నీవు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అంటూ ఎన్నెన్నో షరతులనూ విధిస్తుంటారు. కానీ అవన్నీ అవతలివారికి విసుగ్గా ఉన్నా, కేవలం వీరి ప్రేమ మీద వల్ల పాటిస్తుంటారు ( అలాని నటిస్తుంటారు ). ఇలాకాకుండా వారి ప్రేమని అర్థం చేసుకొని, వారి మీద గౌరవంతో వారు చెప్పిన షరతులను పాటించేవారు చాలా కొద్దిమంది ఉంటారు. కానీ మిగతా వారందరూ తాము ప్రేమించిన వారిని - ఈ షరతులూ, కోపాలూ, తాపాలు తట్టుకోలేక విడిపోయి, దూరముగా ఉంటారు. ఇలా ఉండటం కేవలం ప్రేమలోనే కాదు - స్నేహాలలోనూ జరుగుతుంది. Related Posts with Thumbnails