Monday, September 30, 2013

Good Morning - 466


ఇంద్రియాలని జయించకుండా భోగమే ప్రధానమని తలచినవాడికి సైతం సంపదలు విరివిరిగా సమకూరినా, అవి అతి వర్షాల వల్ల నదుల్లో చేరిన నీటిలా ఎవరికీ ఉపయోగపడకుండా పోతాయి. ఇంకా ఎక్కువైతే గట్లు తెగి, జలప్రళయం సృష్టించినట్లే, నిగ్రహం లేకుండా ప్రవర్తించేవారికి కలిగే ఫలితాలు, పండే సంపదలు సైతం వినాశానికే దారితీస్తాయి. 

Sunday, September 29, 2013

Good Morning - 465


నేస్తమా!.. అని పలకరించే హృదయం నీకుంటే 
నీ నేస్తానికి చిరకాలం నే తోడుంటా.. 
చిరునవ్వు లాంటి నీ స్నేహం నాకు దేవుడు ఇచ్చిన వరం. 
నీ స్నేహం అంతులేనిది. అతీతమైనది. స్వార్థం లేనిది. 
అలాంటి నీ స్నేహం ఎప్పటికీ, నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ..
ఎప్పటికీ నిన్ను మరచిపోలేని 
" నీ నేస్తం. "Saturday, September 28, 2013

Telugu padaalu design cheyadam ela

[తెలుగుబ్లాగు:22057] Telugu padaalu design cheyadam ela


thelugu paddalanu veru veru design lo vrayadam ela 
అని తెలుగు బ్లాగు గ్రూప్ లో ఒకరు అడిగిన ఈ ప్రశ్నకి నా సమాధానం -


మీరు అడిగినది - తెలుగు పదాలని - ఈ కార్డ్స్ లలో ఫోటోల మీద తెలుగులో ఎలా వ్రాయాలో అని అనుకుంటాను. ఒకవేళ అదే అయితే - ముందుగా మీరు మీ కలన యంత్రం (కంప్యూటర్) లో తెలుగు ఖతులు (ఫాంట్స్) స్థాపితం చేసుకోవాలి. 

మీ సిస్టం లో డిఫాల్ట్ గా - 
విండౌస్ XP లో అయితే - గౌతమి, 
విండౌస్ 7 అయితే - కాలిబ్రి (Calibri) ఖతులు ఉంటాయి. 

ఇంకా తెలుగు ఖతులు కావాలంటే - యూనికోడ్ ఖతులు అయితే - తెలుగు విజయం  http://teluguvijayam.org/fonts.html వారి సైట్ లోనూ (ఇవి ఉచితం), అక్షరమాల .. కి అయితే అను సంస్థ వారి ఖతులు కొనుగోలు చేసి, మీ కలన యంత్రములో స్థాపించుకోవాలి. 

అచ్చంపేట్ రాజ్. 


Friday, September 27, 2013

Good Morning - 464


అనుకోకుండా, అతిచేరువగా - కొన్ని పరిచయాలు జీవితములో శాశ్వతముగా నిలిచిపోతాయి.. అవి ఎంతగా అంటే - కష్టాలలోనైనా, సుఖాల్లోనైనా, బాధల్లోనైనా, సంతోషాల్లోనైనా, లాభాల్లోనైనా, నష్టాల్లోనైనా.. చివరికి - నిజమైనా, అబద్ధమైనా, నిర్భయముగా, నిష్కల్మషంగా, నిర్మొహమాటంగా - చెప్పేస్తూ ఉంటాం. 

ఎందుకిలా? అని ఎవరైనా అడిగితే..? సమాధానం మాత్రం - ఏమో!.. కొందరంటున్నారు " మనిషిలో స్వంతం, బంధం అన్నమాటలకి ఈరోజుల్లో అర్థం లేద" ని.. 

కానీ నేను చెబుతున్నా - స్నేహం అనే పేరుతో అవి మన హృదయాల్లో శాశ్వతముగా మిగిలే ఉంటాయి అనీ.. 

Thursday, September 26, 2013

Good Morning - 463


మెదడుకీ సముద్రానికీ ఒక ఉమ్మడి పోలిక ఉంది. 
ఆ రెండూ నిరంతరం అలజడిని కలిగిస్తూనే ఉంటాయి. 

Wednesday, September 25, 2013

Good Morning - 462


చీకట్లో అడుగు వెయ్యటానికి ఎప్పుడూ భయపడొద్దు. అలాగే సుగమమైన మార్గం కోసం కూడా అన్వేషించవద్దు. నీకు కనిపించిన దారిలో నీ మనసు మాట వింటూ వెళ్ళిపోవడమే!.. 

చిమ్మచీకట్లో మనకి ఏమీ కనిపించదు.. ఒకదారి చేసుకొని వెళ్ళాలీ అంటే భయపడుతాం. ఎక్కడ గొయ్యి గానీ, ముళ్ళు గానీ, పాములు గానీ.. ఏమి ఉందో చూడకుండా వెళ్ళటానికి భయపడుతాం. అదే వెలుతురులో అయితే చెప్పాల్సిన పనిలేదు. అలాగే మంచి, తేలికైన దారికోసం కూడా అన్వేషించవద్దు. కొద్దిగా కష్టమైనా దారి అయినా మనం వెళ్ళే కొలదీ అదే తేలికైన దారిలా అవుతుంది. ఎందుకంటే మళ్ళీ అదే దారిలో వెనక్కి రాలేం కదా.. మనకి కనిపించిన దారి గుండా, మన అంత:సాక్షి ఎలా చెబితే అలా వింటూ వెళ్లిపోవాలి. 

Tuesday, September 24, 2013

Good Morning - 461మనలోని లోపాలను మనం తెలుసుకోవడం అన్నింటికన్నా పెద్ద చదువు. 

Monday, September 23, 2013

Good Morning - 460


కాలగమనంలో పరిచయం అయిన వ్యక్తులు ఒక్కోసారి చాలాదగ్గర వాళ్ళుగా అనిపిస్తారు. రక్తసంబంధము కంటే ఎక్కువ అనిపిస్తారు.. వాళ్ళు ఎక్కువకాలం మనతో ఉండరు అని తెలుసు. కానీ, మనసులో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.. వాళ్ళ గురించి మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటాము. కానీ, అది మన అవసరం కోసం కాదు. వాళ్ళతో స్నేహం చేసి, వాళ్ళ దగ్గర నుండి ఏదో ఆశించి, స్నేహం చేస్తున్నారు అనుకొంటే నిజముగా అది చాలా బాధాకరమే. జీవితంలో తారసపడే వాళ్ళు అందరూ అంతే అనుకొంటే - వెనకకి తిరిగి చూసుకొంటే మనకంటూ ఎవ్వరూ ఉండరు. అవసరాల కోసం ఎంతకాలం నటించగలుగుతాం..? మొహానికి రంగులు అద్దుకున్న సులభముగా మనసుకి రంగులు అద్దుకోలేము.. మనం బ్రతుకుతున్నది జీవితములో గానీ, రంగస్థలం మీద కాదు. 


Sunday, September 22, 2013

Good Morning - 459


నా కన్నీరు ఎక్కడ నిన్ను కర్తవ్య విముఖుడిని చేస్తుందోనని ఇలా చీకట్లో ఉంది, వీడ్కోలు చెబుతున్నా ప్రియ నేస్తమా.. !

Saturday, September 21, 2013

Good Morning - 458


చాలామంది తమ కాలాన్ని, డబ్బునీ, ఆరోగ్యాన్నీ, గౌరవాన్నీ, ఆఖరికి - వ్యక్తిత్వాన్ని కూడా పరాన్నభుక్కులైన మిత్రుల తేనె మాటల కోసం త్యాగం చేస్తారు. 

మన మిత్రుల్లో చాలామంది మన నిజమైన స్నేహితులు కారు. ఆ విషయం తెలుసుకోక, మనం వారి మీద ఎంతో విలువైన సమయాన్నీ, ఆరోగ్యాన్నీ, మన (ఆత్మ) గౌరవాన్నీ, ఆఖరికి - వ్యక్తిత్వాన్నీ కూడా పరాన్న భుక్కులైన మిత్రుల తీపి పలుకులను విని, వాటిని వినడానికి వదులుకుంటాం. 

Friday, September 20, 2013

Good Morning - 457


నీకున్న దాని పట్ల సంతృప్తిని పొందు. 
అప్పుడు అంతకు మించి పొందుతావు. 
లేనిదాన్ని గురించి, ఎప్పుడూ చింతించకు. 
ఉన్నదాన్ని కూడా కోల్పోతావు.. 

మన వద్ద ఆస్థులే గానీ, సంపద గానీ, మరేదైనా గానీ అది ఎంతైనా ఉండనీ.. అందరికన్నా తక్కువగానే ఉండనీ, నాకు తగినంత ఉందని సంతృప్తిగా ఉండు. అలా ఉంటే భవిష్యత్తులో అంతకు మించి పొందుతావు. అలాగే నీ వద్ద లేనిదాన్ని గురించి, ఎప్పుడూ చింతించకు. ఆ బాధలో నీ వద్ద ఉన్నదాన్నే కాదు, నీలో ఉన్న సంతోషాన్నీ, తృప్తినీ కోల్పోతావు. 

Thursday, September 19, 2013

Good Morning - 456


ఒకరిని అనడం చాలా తేలిక, కానీ దానికి అవతలివారు కౌంటర్ ఇస్తే - తట్టుకోగలిగే శక్తి ఉంటేనే అనడం నేర్చుకోండి. 

ఒకరిని నిందించడం, వెక్కిరించడం, బాధపెట్టడం, చులకనగా చూడటం, సూటిపోటి మాటలు అనడం చాలా తేలిక. ఎందుకో గానీ, మనకి కారణం లేకుండానే ఒక్కోసారి ఎదుటివారిని అనడం చేస్తుంటాం - వారు ఏమీ అనకున్నా సరే..! మనం అన్నదానికి వారు మౌనముగా ఉండి, ప్రతిస్పందన అంటూ ఏమీ చూపకపోతే, ఫరవాలేదు. కానీ, అవతలివారు మనం అన్నదానికి ప్రతిగా కౌంటర్ వంటి మాటలు మాట్లాడారే అనుకోండి. ఆ ప్రతిస్పందన మాటలు కాసింత కటువుగా, హేళనగా, వక్రముగా, తిరుగులేని సమాధానముతో, సూటిగా, చాలా పదునుగా ఉంటాయి. అలా వచ్చిన స్పందనని మీరు ముందే ఊహించగలగాలి. వాటిని తట్టుకోనగలిగి ఉండగలిగితే, మనం అనడం చెయ్యాలి. లేకుంటే మానసికముగా చాలానే దెబ్బ తినాల్సి వస్తుంది. 

ఆ మాటలు తిరుగులేనివిగా ఉంటే - ఆ సమయములో మీరొక్కరే ఉంటే కాసేపట్లోనే తట్టుకుంటారు. కానీ " మొగుడు కొట్టినందులకు కాదు కానీ, తోటి కోడలు నవ్వినందులకు.. " అన్న చందాన, ఆ సమయాన మీరు నలుగురిలో ఉన్నప్పుడు ఇలా ప్రతిస్పందన వస్తే - మీరు మీ మీ మనస్థత్వ స్థాయిని బట్టి, బా...గా దెబ్బతింటారు. దాని నుండి కోలుకోవడానికి  చాలానే సమయం పడుతుంది. మరచిపోవడానికి ఒక్కోసారి జీవితకాలం పట్టొచ్చు. తస్మాత్ జాగ్రత్త!. 

" నేనేదో ఇలా అంటే - ఇంతగా అంటావా?.."  అని అనబోతే, 
" ఆ అనడం కూడా ఎందుకు ? నేను నిన్నేమైనా అన్నానా ? నీ జోలికి వచ్చానా ? రానప్పుడు - నా మానాన నేను ఉన్నప్పుడు, నా జోలికి వచ్చి ఏమైనా అంటే  - నేను ఊరుకోను.. "  అంటే ఏమీ మాట్లాడలేక పోతాం. చేష్టలుడిగిపోతాం. 

Wednesday, September 18, 2013

Good Morning - 455


మూర్ఖుని మనసు రంజింప చెయ్యటం ఎవరి వల్లా కాదు. 

మూర్ఖులు వారి వారి లోకములోనే - బావిలో కప్పలా ఉంటూ, తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్న చందాన ఉంటారు. ఇలాంటి వారి మనస్సుని ఆకట్టుకోవాలంటే ఎవరి తరమూ కాదు. వారి సృష్టించిన బ్రహ్మ దేవుడి తరమూ కాదు. అలా చెయ్యాలని చూస్తే అనవసర కాలాయాపనకి గురి అవుతుంటాం. 

Tuesday, September 17, 2013

Good Morning - 454


మన జీవితములో మనం తీసుకొనే ప్రతి మంచి నిర్ణయమూ మన ధైర్యం నుండి పుట్టుకొచ్చిందే..! అలాగే మనం తీసుకొన్న - ప్రతి తప్పుడు నిర్ణయమూ మన మనసు చెప్పింది సరిగా వినకపోవడం వల్ల తీసుకొన్నది. 

Monday, September 16, 2013

Good Morning - 453


ప్రయత్నించు - పరిశ్రమించు. 

ప్రయత్నించు అంటే చెయ్యటానికి ఉద్యుక్తుడివి అవటం. పరిశ్రమించటం అంటే మనం ఎంచుకున్న పనిలో గానీ, లక్ష్యాన్ని చేరుకోవటములో శ్రమించటం. మన జీవితాల్లో అన్ని విషయాల్లో ఎదగటానికి క్రొత్త విషయాలనీ, ఎదగటానికి ఉపయోగపడే మెట్లనీ ఎప్పటికప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మన లక్ష్యాలని చేరుకోవటానికి పరిశ్రమించాలి. అప్పుడే మన ఏకైక జీవితానికి సార్థకత. ఏకైక అని ఎందుకు అన్నానూ అంటే అందరికీ ఉండేది ఒకే ఒక జీవితం. మనం ఏమి చేసినా, చేసుకున్నా, చేయించుకున్నా - ఈ జీవితం లోనే కానిచ్చేసేయ్యాలి. ఇంకో జీవితములో మిగిలినవి చేస్తానూ అనుకుంటే - అస్సలు కుదరదు. 

Sunday, September 15, 2013

Good Morning - 452


వాదనల వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. వాటికి దూరముగా ఉండండి. 

అవును. అభిప్రాయాల భేదాల వల్లనే గానీ, ఏదైనా సంఘటనలో గానీ, మరే సందర్భములో గానీ వాదనలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాదనలు మాటలతో మొదలయ్యి, గొంతు పెరుగుతూ చివరకి - ఒక్కోసారి చేయి చేసుకోవటాలూ జరుగుతుంటాయి. వాదన పెంచుకోవటం మూలాన అంతవరకూ ఎదుటి వారి మీద ఉన్న అభిమానం, ఆత్మీయత, అనురాగం కొద్దిగా తగ్గుతాయి. ఇద్దరే ఉండి, వాదన పెట్టుకుంటే ఫరవాలేదు. అది కాసేపట్లోనే సమసి పోతుంది. కానీ ఒక సమూహములో ఉన్నప్పుడు - వాదన జరిగితే, అందరి ముందూ తమదే సరియైనది చూపించటానికి సర్వ శక్తులూ ఒడ్డుతారు. అప్పుడు వాదనలో పస లేనివారు ఎదుటివారిలోని శారీరక, మానసిక లోపాల్ని అందరి ముందూ బయటపెడుతూ తూలనాడుతారు. ఫలితముగా అభిజ్యాతాలు ( ego) దెబ్బతిని, ఇదివరకట్లా సఖ్యతగా ఉండలేక పోతారు. 

అందుకే వాదనలు వచ్చినప్పుడు - నేను ఇలా అనుకుంటున్నాను అని క్లుప్తముగా కొద్దిమాట్లల్లో చెప్పాల్సింది చెప్పేసి ఊరుకోండి. ఆ తరవాత దాని మీద చర్చ జరిగినా పాలు పంచుకోకండి. పాలు పంచుకొంటే - అందులో కలుగజేసుకుంటే - ఆ విషయం చిలికి, చిలికి పెద్దది కావొచ్చును. ముఖ్యముగా రాజకీయ, సామాజిక, సినీ విషయాల్లో వాదనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలా మాట్లాడుకొనే ఇరవై ఏళ్ళ స్నేహాన్ని - కేవలం అరగంట ఈ విషయాలు మాట్లాడుకొని, ఇప్పటికీ మొఖం చూసుకోకుండా దూరం చేసుకున్న నా మిత్రులని చూశాక, నేనూ వాదన పెట్టుకోవటం మానేసుకున్నాను. 

Good Morning - 451


మంచి నిర్ణయముతో, ధైర్యముగా ప్రయత్నాన్ని కొనసాగించు.. నువ్వు నీ లక్ష్యాన్ని తప్పక చేరుకుంటావు. 

మనకంటూ మంచి ఆలోచనతో - ఒక చక్కని నిర్ణయం తీసుకొని, తద్వారా ఒక నిర్దుష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ధైర్యముగా ముందుకు కొనసాగాలి. అప్పుడే మనం ఆ లక్ష్యాన్ని తప్పక చేరుకుంటాము. 

Friday, September 13, 2013

Good Morning - 450


భగవంతుడు మన నుండి ఆశించేది కానుకలు. 
తల్లితండ్రులు మన నుండి ఆశించేది వేడుకలు.. 
కానీ 
ఏమీ ఆశించకుండా నిరంతరం మన గురించి కలలు కనేది మాత్రం - స్నేహితులు. 


Thursday, September 12, 2013

Good morning - 449


ప్రపంచం మనకు విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ ఆనందించండి. వాటికి సమాధానాల గురించి ఆలోచించకండి. అవి ఎప్పుడూ మారుతుంటాయి. 

ఈ ప్రపంచం లోని వ్యక్తులూ, సమాజం, పరిస్థితులూ... మనకెన్నో సవాళ్ళను ఎదురుగా పెడుతుంది. వాటిని ఏమాత్రం భయపడక, ఎదురుకుంటూ - అందులోనే ఆనందించడం నేర్చుకోండి. వాటి సమాధానాల కోసం ఆలోచించకండి. ఆ సమాధానాల లోనే మీ పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. ఆ సమాధానాలు కూడా ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. ఈరోజు ఒకటి అనుకున్న సమాధానం రేపు మరోకటి కావచ్చును. ఎల్లుండి వేరొకటి అయి ఉండవచ్చును. అవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. కావున వాటి మీద దృష్టి పెట్టకండి. 

Wednesday, September 11, 2013

Good Morning - 448


నీ సమస్యని బయటకి చెప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే కొంతమంది మాత్రమే నీ పట్ల సానుభూతి చూపించి, సాయం చేస్తారు. మిగతావారంతా నువ్వు చెప్పేదాన్ని చిలువలు, వలువలు చేసి, పుకార్లుగా ప్రచారం చేస్తారు. 

మన సమస్యలని సాధారణముగా ప్రక్కింటి వారికో, మిత్రులకో, ఆఫీస్ కొలీగ్స్ కో, కాసింత ఓదార్పు చూపిన వారికో - వారిని గ్రుడ్డిగా నమ్మేసి, అన్నీ ( చాలావరకు బయటకి తెలీనివే ) ఏకరువు పెడుతుంటాం. అవతలివారు మీరు చెప్పిన విషయాల్ని ఎంతవరకు అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకొని, ఎలా మనకి చక్కని దిశా నిర్దేశం చెయ్యగలరు? ఎంతవరకు మన విషయాల్ని గోప్యముగా ఉంచగలరు.. అన్న విషయాల్ని విస్మరించి, చెప్పేస్తాం. ఇలా మీరు చెప్పిన విషయాల్ని విన్న వారిలో కొద్దిమంది మాత్రమే - మీ పట్ల నిజమైన సానుభూతి చూపి, మనసా వాచా మీకు తగిన సహాయం చెయ్యగలరు. వీరు మీకు నిజమైన ఆపద్భాందవుల్లాంటి వారు. 

అలా కాకుండా మీరు చెప్పిన విషయాల్ని చిలవలు వలవలు చేసి, మీ చుట్టూ ఉన్న వారితో ( మీ శత్రువులతో కూడా ) ఆ విషయాలకి మరింత ఊహాశక్తి జోడించి, మసాలాలు అద్ది  పంచుకొనే వారు నిస్సందేహముగా మీకు కీడు చేస్తున్న వారే. ఇలాంటి వారి సహచర్యాన్ని మీరు ఎంత దూరముగా ఉంటే అంత మంచిది. 

Tuesday, September 10, 2013

Good Morning - 447


ఈ ప్రపంచములో " ప్రతివాడూ తోటివారికి సాయం చెయ్యాలి.." అని నీతులు చెబుతాడు. కానీ సాయం చెయ్యడు. నీతి కథలు ఉండేది తోటివారికి చెప్పేందుకే.. మనం పాటించేందుకు కాదు.. అన్నట్లు ఈ లోకం ఉంది. 

Monday, September 9, 2013

Good Morning - 446


అవమానించిన వారిని, అనుమానించిన వారినీ క్షమించవచ్చును. కానీ నమ్మించి, మోసం చేసిన నమ్మక ద్రోహిని ఎప్పటికీ క్షమించరాదు.

మనల్ని మాటలతో, చేష్టలతో అవమానించి, బాధ పెట్టిన వారిని, అలాగే మనం సరిగ్గా ఉన్నా, చేసే ప్రతి పనినీ అనుమానంతో చూసే వారినీ క్షమించవచ్చును. కానీ, నమ్మించుకునేలా చేసి, వారి పబ్బం గడవగానే, మనల్ని మోసం చేసే నమ్మకద్రోహి పట్ల ఎన్నడూ క్షమాగుణముతో ఉండరాదు. అలా ఉంటే - అంతకన్నా బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. 

Sunday, September 8, 2013

Good Morning - 445


జీవితంలో మనకు ఎవ్వరు తోడు ఉన్నా, లేకపోయినా, ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నా సరే - మన ఆత్మ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు.
నవ్వే జనం, హేళన చేసే వ్యక్తులు, మాటలతో మనల్ని బలహీన పరిచే వారు చాలామంది. వారి మాటలకు క్రుంగి పోతే ఎలా..? నీకంటూ గుర్తింపు ఉంచుకో మిత్రమా..! 

అవును.. మనతో మన జీవితాన ఎవరైనా తోడుగా ఉండనీ, ఉండకపోనీ - మనం ఏకాకులమై గానీ ఉండనీ.. మన ఆస్తులు అన్నీ కోల్పోయి, కట్టుబట్టలతో ఉండనీ.. అలాంటన్నప్పుడే మన లోని ఆత్మ విశ్వాసాన్ని మాత్రం వదులుకోవద్దు. మరింత ధృడంగా చేసుకోవాలి. ఎవరెవరో ఏదో ఏదో అంటుంటారు. సహాయ నిరాకరణ చేస్తుంటారు. మనం చేసే పనిలో - పనిని పాడు చేసేలా ప్రయత్నిస్తుంటారు. ఇతరులతో కూడి - మనల్ని అవహేళన చేస్తూ, మన మీద చెప్పుకొని, నవ్వుతుంటారు. మీ మీద ఏదేదో అపవాదులు వేస్తూ ఆనందం పొందుతుంటారు. నీకేమాత్రం సంబంధం లేని, నీ అభివృద్ధిలోకి ఏమాత్రం తోడ్పడని వీరి మాటలని నమ్మి క్రుంగిపోతే ఎలా ? అందుకే ఆత్మ విశ్వాసాన్ని కోల్పోక - మరింత ధృడముగా మారి పరిస్థితులకి ఎదురునిలవాలి. 


Saturday, September 7, 2013

Good Morning - 444


ప్రతిరోజు కూడా ఇదే మన చివరిరోజు అన్నట్లు బ్రతకాలి. 
అవతలివాళ్ళు గతంలో మనల్ని బాధపెట్టి ఉన్నా, అది గుర్తులేనట్లుగానే వారిని ప్రేమించు.. 
ఎవరూ వినట్లేదు అన్నట్లుగానే ఆలపించు. 
ఎవరూ చూడటం లేదు అన్నట్లుగానే నర్తించు. 
అప్పుడే నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా అనుభవించగలవు. 

అవును.. ఈరోజే మన ఆఖరి రోజులా బ్రతకాలి. మన మీద ఆధారపడ్డ వారికీ, మనతో సంబంధం ఉన్నవారికీ మనం వారికి చివరి రోజుల్లో ఏమి చెయ్యాలనుకుంటామో అది నేడే చెయ్యాలి. ఎవరికైనా ఏదైనా రుణానుబంధం తీర్చుకోనేది ఉంటే వెంటనే తీర్చేసుకోండి. ఏదీ వాయిదాల్లో పెట్టకండి అని భావం. 

అలాగే దారిలో మనకు ఎదురైన అవతలివారు మనల్ని బాధపెట్టి ఉన్నా, ఆ పెట్టిన బాధ మీ మంచికోసమే పెట్టారు. ఆరోజు అలా బాధ పెట్టినందువల్లనే ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు అనుకొని, వేరే దారిలో వారిని తప్పించుకొని తిరక్కుండా, నేరుగా ఎదురుపడండి. వారు మాట్లాడటానికి అయిష్టత చూపినా, మీరు మాత్రం - మీ మొహాన సన్నని చిరునవ్వుతో వారిని ఇష్టపడి, పలకరించండి. అప్పుడే మీరు చాలా హాయిగా ఉంటారు. ఆ తరవాత మీరే ఈ విషయాన్ని ఒప్పుకుంటారు కూడా. 

మీరు ఏదైనా పాట పాడాలనుకొంటే - మీ చుట్టూరా ఎవరూ లేరనీ, మీరొక్కరే ఉన్నారనుకొని పాట పాడండి లేదా హమ్ చెయ్యండి. 

అలాగే మీరు నృత్యం చెయ్యాలనుకుంటే - మీకు సరిగా రాకున్నా, మీకు వచ్చిన రీతిలో మీదైన శైలిలో డ్యాన్స్ చెయ్యండి.  ఆ నృత్యాన్ని ఎవరూ చూడకపోతే మీరు ఎంత ఫ్రీ గా చేస్తారో అలా చెయ్యాలి. ఉదాహరణకు : గంగ్నం డ్యాన్స్ కూడా ఫ్రీ స్టైల్ లో ఉంటుంది.. కానీ అది ఎంత ప్రాచుర్యాన్ని పొందిందో మీకు తెలుసుకదా.. ఇలా మీరు చేస్తుంటే - మీరు మీ జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. 

అలా చేసిన నాడు చాలా సంతోషముగా, మీ మొహాన ఒక చెప్పలేని వెలుగుతో చాలా ఆనందముగా ఉంటారు. అది నిజం. మొదట్లో ఈ మాటలని ఒప్పుకోవటానికి సంశయిస్తారు కానీ ఒకసారి అనుభవించాక - మీరే అంటారు " అవును.. నిజమే!!" అనీ..  

Friday, September 6, 2013

Good Morning - 443


శత్రువుని క్షమించు. అతనికి అంతకంటే బాధాకర విషయం మరొకటి లేదు.. 

శత్రువుని క్షమించాలి. అవును.. వినటానికి ఏదోలా ఉన్నా నిజమే. శత్రువుని క్షమించాలి. అలా చేస్తే - ఇద్దరి మధ్యా ఉన్న శత్రుత్వం మరీ పెద్దది కాకుండా ఉంటుంది. అలాగే మన దృష్టి ఎప్పుడూ వారి మీద ఉండక, వేరే విషయాల మీద చూపి, తద్వారా మనం మరింత అభివృద్ధి లోకి చేరుకోవచ్చు. ఈ క్షమించటం అనేది శత్రువుకి అంత సులభముగా జీర్ణం కాదు. పైపెచ్చు మరింత కసిగా మనమీద దాడికో, దుష్ప్రచారానికి పాల్పడవచ్చు. లేదా మనం ఏమి చేస్తున్నామో అనుక్షణం మన నీడలా వెంటాడవచ్చును. ఇలా క్షమించటం వారికి ఎంత బాదిస్తుందీ అంటే చాలానే ఉంటుంది. ఎప్పుడూ కసిగా రగిలిపోతుంటారు. దానివలన వారికి అనవసర కాలాయాపన, విసుగూ, ఒకింత హాస్చర్యమూ కలుగుతాయి. అలా చూసి, చూసి మనమంటే ఇష్టం పెంచుకుంటారు. ఒకానొక బలహీన క్షణంలో వారు మన మీద ప్రేమ ప్రకటిస్తూ బయటపడతారు. 

Thursday, September 5, 2013

Good Morning - 442


కొన్ని గాయాలను కాలమే మానుపుతుంది అనుకుంటాం.. కానీ ఆ గాయం తాలూకు నొప్పి మనం ఉన్నంత వరకూ మనతోనే ఉంటుంది.. అప్పటివరకూ భరించవలసిందే..! 

అవును.. మనసుకి తగిలిన గాయాలను కాలమే మానుపుతుంది అని బలంగా విశ్వసిస్తాం. కానీ అన్నివేళలా అది నిజం అవదు. కొన్ని గాయాలు మనసు లోపలి పొరలవరకూ వెళ్ళి ఉంటాయి. వాటి తాలూకు నొప్పి ఇంకా పచ్చిగానే ఉంటుంది. అది వారి వారి గాయాల తాలూకు తీవ్రతని బట్టి ఉంటుంది. ఇలాంటి గాయాలను కాలం మానపలేదు. కారణం - ఆ గాయాల తాలూకు నొప్పి మనతో(లో) ఇంకా ఉన్నందువల్లనే. ఎప్పుడైతే ఈ గాయాల తాలూకు నొప్పి దూరం చేసుకుంటామో / మరచిపోతామో అప్పుడే మనసుకి ప్రశాంతత లభించదు. అంతవరకూ ఆ నొప్పిని భరించవలసిందే.. 

Wednesday, September 4, 2013

Good Morning - 441


చెలి చేరే దారులు వెదకాలి. చలి తీరగా కౌగిలి వెదకాలి.. 

Tuesday, September 3, 2013

Good Morning - 440


ప్రతిభ అనేది అందరి దగ్గర ఉన్న ఆయుధం. అయితే దాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకొంటారనేదే ముఖ్యం. 

ప్రతిభ అనేది అందరి వద్దా ఉంటుంది. కొందరిలో చాలా బాగా ఉంటే - కొందరిలో అంతగా కనిపించదు. కనిపించక పోవటానికి వారే కారణం. ప్రతి వ్యక్తిలో నిద్రాణంగా అన్నీ ఉంటాయి. వాటిని మేలుకొలిపి, వాటిని పరిపూర్ణం చెయ్యకపోవడమే చాలామంది చేస్తుంటారు. ఏదైనా ప్రతిభ ఉన్నా - దాన్ని ఎలా ఉపయోగించుకొంటారన్నదే అసలు విషయం. కొందరు చక్కగా తమ ఎదుగుదలకి వాడుకుంటే - మరికొందరు ప్రక్కవారి ఎదుగుదలకి తమ ప్రతిభని ఉపయోగిస్తుంటారు. 

Monday, September 2, 2013

Good Morning - 439


ప్రేమంటే ఏమిటో, మనల్ని ప్రేమించేవాళ్ళని కోల్పోయేదాకా తెలీదు.. 

అవును.! ఇది నిజం.. ప్రేమ అంటే ఏమిటో తెలీని వాళ్ళు కూడా - వారిని ప్రేమించేవారు ఏదో మనస్పర్థ వచ్చి, వారికి దూరమైతే, అప్పుడు ఖచ్చితముగా తెలుస్తుంది. ప్రేమంటే ఏమిటో, మనల్ని ప్రేమించేవారు ఉంటే ఎలా ఉంటుందో.. అనీ. కానీ అలా వారు దూరమైతే - ఆ బాధ ఏమిటో, ఏమి కోల్పోతామో వర్ణనాతీతం. ఇక్కడ ప్రేమనే కాదు.. ఒక మంచి స్నేహం, బంధం.. కూడానూ. అప్పుడే మనం కోల్పోయిన వారి విలువ ఏమిటో కూడా తెలుస్తుంది. వారిని దూరం చేసుకున్నాం అని మనసు పడే పడే బాధ పడుతుంది. 

కానీ ఒక చిన్న అడుగు ముందుకు వేసి, గతం గతః అని నిర్ణయం తీసుకొని, ఎప్పటిలా మునపటి ఆత్మీయ బంధాన్ని కొనసాగించడమే మంచిది. 

Sunday, September 1, 2013

స్నేహబంధం విచ్చిన్నం అవుతున్నప్పుడు..

సోషల్ సైట్స్ కి వచ్చిన క్రొత్తల్లో నాకో మిత్రుడు పరిచయం అయ్యాడు. అలా పరిచయమైన మా స్నేహం దిన దిన ప్రవర్ధమవుతూ చాలా మంచి మిత్రుడయ్యాడు. ప్రతిరోజూ విష్ చేసుకోకుండా ఉండలేనంతగా మా స్నేహం మారింది. అలా చాలా సంవత్సరాలు మా మధ్య స్నేహం కొనసాగింది. ప్రత్యక్షముగా మేము ఇంతవరకూ కలుసుకోలేక పోయినా ప్రతిరోజూ అలా ఆన్లైన్లో తప్పక కలుసుకొనే వాళ్ళం.

మా మధ్య ఎన్నో ముచ్చట్లూ, క్రొత్త కబుర్లు, రకరకాల విశేషాలు అన్నీ ఉన్నాయి. చాట్స్, మేస్సేజులూ, మెయిల్స్ అన్నీ మామూలు అయ్యాయి. నన్ను రాజ్ బ్రో, సోదరా!.. అని పిలిచేవాడు. నేనూ అలాగే ... పిలిచేవాడిని. నేనంటే భయం, గౌరవం, ఎంతగా అంటే - నామీద ఫోటో కామెంట్ చెయ్యటానికే భయపడుతాడు.

అలాంటి మా స్నేహం బ్రేకప్ అయ్యింది. ఎందుకంటే - ఏమి చెబుతాం.. ఒక స్నేహితునిగా, ఇంకో స్నేహితుని మీద ఇలా బ్లాగ్ లో పబ్లిక్ గా చెప్పటం అంత సంస్కారం కాదు. నిజానికి ఎక్కడా, ఎవరితోనూ పంచుకోవద్దు. కానీ ఇక్కడ ఎందుకు చెబుతున్నాను అంటే - ఒక చిన్న విషయం అందరికీ తెలియచేయ్యాలని.. ఆ విషయం చివరిలో వస్తుంది. తద్వారా మీరూ ఏమీ, ఎవరినీ అలా కోల్పోవద్దని.. మీకూ ఈ పోస్ట్ మీ స్నేహ జీవితాన చాలా ఉపయోగకరముగా ఉండాలని నా కోరిక.  అంతే!. అంతే కానీ అతను ఎవరూ? ఏమిటా కథ? అసలేమయ్యింది.. అన్న విషయాలు ఏమీ చెప్పకుండా నేరుగా ముగింపుకి వచ్చేస్తున్నాను. అందులకు మన్నించండి.

...... తనతో దూరంగా ఉండాలని అనుకున్నాను. విండో పీరియడ్ మాదిరిగా కొద్దిరోజులు ఆగాను. తన మీద ఎందరో చెప్పారు.. మీకీ ఇబ్బందులు అన్నీ తన సృష్టి యే అనీ. నా బ్లాగ్ కి రెగ్యులర్ వీక్షకుడు తను. ఏదైనా పోస్ట్ వేస్తే, దాన్ని ఇది వీరి మీద అంటూ ఏదో ఊహించేసుకొని వారికి చెప్పడం లాంటివి చేశాడు. ఒకటి, రెండుసార్లు చెప్పాను - " నీవు తెలుసుకున్నవి అన్నీ నిజాలు కాకపోవచ్చు.. ఏదేదో ఊహించేసుకొని, ఇలా చెప్పడం నాకేమీ నచ్చలేదు. నీవు అనుకున్నట్లు వారివీ, వీరివీ కావు.. అన్నీ ఇలా అందరికీ చెప్పటం, వారిని ఇబ్బంది పెట్టి, నన్ను ఇబ్బంది పెట్టడం.. ఇలా వద్దని చెప్పా. ఇలా చెయ్యటం స్నేహధర్మం కాదు. మీకు చెప్పడమూ నాకూ బాగోదు.. " అన్నాను.

అయినా మారలేదు. నాతో స్నేహముగా ఉంటూ నా విషయాలు ఇతరులకి నాకు తెలీకుండా చెప్పటం చేశాడు. కొద్దిరోజులు అతని విషెస్ కి బదులు ఇవ్వలేదు - నాకు కోపం వచ్చింది అని తెలియచెయ్యాలని. అయినా అలానే చెప్పటం మానలేదు. తద్వారా మరిన్ని చిక్కులు. ఆ చిక్కులు ఎంతగా అంటే - ఈ ఆన్లైన్ లో అంతగా చిక్కులు ఎవరివల్లా ఎదురుకోలేదు. ఈ ఒక్కమాట చాలు.. ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నానో..

అలా చెబుతున్నాడు అని నాకు తెలుస్తూనే ఉన్నాయి. ఆధారాలు నాకు లభిస్తూనే ఉన్నాయి కూడా. అవన్నీ పక్కా అనేలా లేవు. ఏదో ఒక లూప్ లైన్ ఉండి, తప్పించుకోనేలా ఉన్నాయవి. ఒకవైపు విసుగూ, మరోవైపు చాలా పాత స్నేహం.. మధ్య నలిగిపోయాను. పోనీ తనేం చెడ్డవాడు అనుకుందామా? కానే కాదు. మనిషి మంచోడే.. నాతో స్నేహములో మనసుకి దగ్గరగా వచ్చేశాడు.

ప్రతి మనిషికీ లోపాలు ఉంటాయి. స్నేహితుడిగా అతన్ని అంగీకరించినప్పుడు - అతనిలోని లోపాలనీ అంగీకరించాలి. అలా అయితేనే - స్నేహం కొనసాగుతుంది. అది నాకు తెలుసు. 

మరి ఇంతగా తెలిశాక మరి అలా ? అని అంటే - అక్కడికే వస్తున్నా.. నా ముందు మంచిగానే ఉంటూ, ఏదో చూసి, ఏదేదో అనుకొని.. అలా చెప్పేసి, అపోహలు సృష్టించి ( తాను అలా సృష్టిస్తున్నాడని తనకి తెలీకున్నా ) ఏమీ తెలీనట్లు నాతో మామూలుగా ఉండటం నాకు నచ్చలేదు. చూసీ చూసీ ఒకసారి చాట్ లో పర్సనల్ గా చెప్పా.. ఇలా వద్దని. ఇలాగే కొనసాగితే - నేను మీకు మిత్రునిగా కొనసాగలేను అనీ. కొన్ని విషయాలు ఎరగా ( అంటే వేరేవారి మీద కొన్ని గాసిప్స్ సృష్టించి ) వేశా. తనొక్కడికే చెబితే - వాటిని ఎవరికైనా చెబుతాడా అనీ. అవీ వేరేవారికి తెలిసిపోయాయి. ఇక పక్కా అని తెలిసింది.

అంతలోనే దేవుడే నాకు మేలు చేశాడా అన్నట్లు, ఒకసారి ఒక విషయం లో తనే ఒక ఆధారాన్ని ( స్క్రీన్ షాట్ ) పంపాడు. అలా నేను పంపమని అడగలేదు. తనంతట తానుగా పంపాడు. అది చూశాక ఎక్కడో చిన్న అనుమానం.. ఇందులో ఏదో తిరకాసు ఉందని నా మనసు శంకించింది. అలా ఎందుకు అంటే - ఆ స్క్రీన్ షాట్ క్రాప్ చెయ్యబడింది కాబట్టి. " ఇలా కట్ Crop చేసినది కాదు, వెంటనే ఈ స్క్రీన్ షాట్ మొత్తంది Crop ( క్రాప్ ) చెయ్యకుండా ఉన్నది మెయిల్ చేసి, పంపమని " వెంటనే చెప్పా. అలా పంపిచేస్తే క్రాప్ లో కట్ కాకుండా మిగతా దాంట్లో ఏమి ఉందో తెలుసుకోవాలనీ.. తను నా వినతిని చూశాడు. చాట్లో కూడా చెప్పా. ఆ చాట్ చూస్తే ఆ చాట్ లో క్రింద seen at... అని వస్తుంది. వచ్చింది కూడా.. అంటే చూశాడు అన్నమాట. కానీ రెండురోజుల తరవాత స్క్రీన్ షాట్ కాపీని మెయిల్ చేశాడు.

నేను ఊహించినదే జరిగింది. వచ్చిన స్క్రీన్ షాట్స్ చూశాను. స్క్రీన్ షాట్స్ మారాయి. పక్కాగా అవి వేరు సమయాల్లో తీసినవని అనుమానం నిజం చేసుకోవటానికి ఆ స్క్రీన్ షాట్స్ యొక్క ప్రాపర్టీస్ Properties చూశాను. డౌన్లోడ్ చేసిన ఫోటో మీద మౌస్ కర్సర్ పెట్టి రైట్ క్లిక్ చేస్తే ఒక మెనూ వస్తుంది. అందులో అట్టడుగున ఉండేదే ప్రాపర్టీస్. ఇందులో ఆ ఫోటో ( స్క్రీన్ షాట్) టెక్నికల్ డిటైల్స్ ఉంటాయి. ఫోటో / స్క్రీన్ షాట్ తీసిన సమయం, ఎడిట్ చేసిన సమయం, చివరిసారిగా మార్చిన సమయం.. ఫోటో సైజూ, ఆ ఫోటో పాత్ Photo path అడ్రస్, డిటైల్స్ అన్నీ ఉంటాయి. 

వాటిని క్రియేట్ చేసిన తేదీ, సమయాలు వేరుగా ఉన్నాయి. అక్కడ దొరికాడు. అంటే మొదటి క్రాప్ ఇమేజ్ పంపాక, నేను అడిగితే - ఆ తరవాత ఉన్న మెస్సేజెస్ డిలీట్ చేశాక అప్పుడు మళ్ళీ స్క్రీన్ షాట్స్ కొట్టేశాడు అన్నమాట. ( అని నా ఊహ ) అప్పుడు నాకు పంపాడు. అందులో నాకు పంపిన మెస్సేజెస్ కీ, తరవాత మెస్సేజ్ కీ రెండు రోజుల గ్యాప్ ఉంది. ( మొదట పంపినదాంట్లో నా మీద చర్చ వచ్చింది, అది కంటిన్యూ తప్పక చేసే విషయం.. అక్కడ చర్చ తప్పక జరుగుతుంది. కానీ, దాని కొనసాగింపు మెస్సేజెస్ అక్కడ లేవు. తను చేస్తాడు ఎలాగూ. తను ఎలాగూ నెట్ దగ్గర నుండి దూరముగా వెళ్ళడు. మా మధ్య అన్ని సంవత్సరాల స్నేహకాలములో నాకా విషయం పక్కాగా తెలుసు )

ఇలా రెండు రోజులు ఎందుకు గ్యాప్ వచ్చింది అడిగా. గ్యాప్ ఏమీ లేదని అన్నాడు.

పోనీ రెండురోజుల తరవాత ఎందుకూ మెయిల్ ఆలస్యంగా పంపావూ అంటే - తనకి వంట్లో బాగోలేక ఆన్లైన్ కి రాలేదు అని చెప్పాడు. అవునా అన్నాను. ఇక చాట్ క్లోజ్ చేశాను.

అతడి / నా క్లోజ్ ఫ్రెండ్స్ ని అడిగా - తను ఆ రెండురోజుల్లో తానేమైనా మెస్సేజెస్ పెట్టాడా అనీ..?

" అవును.. వచ్చాడు కదా!.. శుభోదయం మెస్సేజెస్ ఉన్నాయి - అదీ ప్రైవేట్ ఆప్షన్ లో.. మాకు షేరింగ్ లో ఉన్నాయి " అన్నారు. ( పైవేట్ లో పెడితే ఎవరికైతే షేర్ చేశామో వారికి మాత్రమే కనిపిస్తాయి, ఇతరులకి కనిపించవు )

" వాటిని స్క్రీన్ షాట్స్ తీసి పంపరా నాకు.." అని అడిగా. ..తీసి నాకు మెయిల్లో పంపారు.

వాటిని చూశాను. షాకయ్యాను. నిజమే. వాటి మీద సమయం ఆ రెండు రోజులదే ఉంది. ఆ రెండురోజుల్లో ఆన్ లైన్ లోకి వచ్చేశాడు. అలా ఎన్ని ప్రవేట్ మెస్సేజెస్ పెట్టాడో ఏమో..? అవి నాకు అనవసరం.

ఇక నమ్మకం పోయింది. నమ్మకమే స్నేహానికి పునాది. ఆ పునాదియే బలహీనముగా ఉంటే - పైన ఎంత స్నేహ రాజప్రసాదం కట్టినా ఎలా ఉంటుంది. ? అందుకే స్నేహాలలో అనుమానం అంటూ రానీయకూడదు. వస్తే నేరుగా అడగాలి. అలా అడిగిన నాడు - అడగబడిన వారు - వెంటనే ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి, కనీసం క్లుప్తముగా అయినా సమాధానం ఇవ్వాలి. లేకుంటే ఆ అనుమానం ఆ స్నేహాన్ని కోలుకొని దెబ్బతీసే స్థాయికి చేరుకుంటుంది. 

మిగతా మిత్రులు హెచ్చరించినా, నా పాత మిత్రుడేగా, అలా చెయ్యడు అనుకుంటూ మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించేశాడు. అప్పుడే ఆలోచించుకొని నా విశ్లేషణలతో ఈ పొరపొచ్చాల మీద మెయిల్ పెట్టాను. జవాబు వచ్చింది కానీ అందులో తనదేమీ తప్పులేదని జవాబు. తనది ఉందా లేదా అని మళ్ళీ చూసే శక్తీ నాకు లేదపుడు.... సమస్యలు తగ్గించుకోవాలని అనుకున్నాను. మాటలు, మెస్సేజెస్ అన్నీ మానేశాను. ( ఇక్కడిదాకా చెప్పినది - నిజానికి బయటకి ఇలా పబ్లిక్ గా చెప్పకూడదు. అయినా చెప్పాను.. ఎందుకు చెప్పానూ అంటే - ఇలా మీకూ జరిగితే ఏమి చెయ్యాలో తెలుసుకోవచ్చును అనీ. అంతే! తప్ప తనని ఇబ్బంది పెట్టాలన్నది కాదు.. నేస్తమా! క్షమించు )

( ఇక్కడి నుండీ మీకు చెప్పాల్సింది ) తరవాత ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తకుండా ఉండొచ్చు. కానీ అది సంస్కారం కాదు. అలా చేస్తే - అన్ని సంవత్సరాల స్నేహానికి అర్థం ఉండదు. తన సమాధానం కూడా వినాలి కదా.. మహా అంటే - ఒక అరగంట కావొచ్చు. గంట కావొచ్చు.. అదే చివరిది అనుకున్నప్పుడు తప్పక ఆ సమయం తనకి ఇవ్వాలి. లేకుంటే ఆ స్నేహానికి అర్థం లేదు.  ముద్దాయిగా నిర్ణయం అయ్యాక కూడా కోర్టుల్లో - చివరిసారిగా నీవేమైనా చెప్పుకొనేది ఉందా? అని అడిగినట్లు. వింటే - అంతకాలం చేసిన స్నేహం వృధా కావొచ్చు, లేదా వారి మాటలు విన్నాక ఆ స్నేహం మళ్ళీ చిగురించుకోవచ్చును. కానీ చివరివరకూ ఆ స్నేహాన్ని నిలుపెట్టుకోవడానికి మనం ప్రయత్నించాం అన్న తృప్తిగా ఉంటుంది. 

ఆ తృప్తి మన మిగతా జీవన కాలం తన ఆలోచనలు లేకుండా హాయిగా కొనసాగటానికి, చక్కని అవకాశాన్ని ఇస్తుంది. ఇది నమ్మరు కానీ నిజం. నేను ఆచరించి, అనుభవపూర్వకముగా తెలుసుకున్నాకే మీకు చెబుతున్నాను. ఇంత మంచి విషయాన్ని తెలియచేసిన ఆ మిత్రుడికి ధన్యవాదములు తెలియచెయ్యటానికే ఈ పోస్ట్. 


అప్పుడు కాస్త బిజీ గా ఉన్నా. అయినా వీలుచేసుకొని మాట్లాడా. నన్నెందుకు దూరం చేస్తున్నారు ? ఇలా జరిగిందీ అని తన వైపు నుండి చెప్పాడు.

అంతా సావధానముగా విన్నాను. చాలాసేపు మాట్లాడాను. నా ఇబ్బంది ఏమిటో చెప్పాను. దానివల్ల నాకు ఎంత ఇబ్బందిగా ఉంటున్నదో, నేను ఎంతగా ఇబ్బంది పడ్డానో, ఇంకా ఎలా పడుతున్నానో, ఇవాళ ఇలాగే కొనసాగితే - భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావచ్చునో, తనకీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటాడో  అన్నీ చెప్పాను. తాత్కాలికముగా దూరం గా ఉండాలని అలా చేశాను. అలా దూరముగా ఉంటే నాకు ఎంత మంచిదో, తనకీ ఎంత మంచో చక్కగా విశ్లేషించి చెప్పాను. అలా తనని దూరం చేస్తున్న కారణాలు మాత్రం సూటిగా, స్పష్టముగా చెప్పాను. తను ఎక్కడ పొరబాటు చేశాడో అన్నీ విశదముగా వివరించాను. తన బాధ కొద్దిగా తగ్గటానికి ఈ దూరం కొంత అకాలమే అని చెప్పా. కానీ అది శాశ్వతమే అని నాకు తెలుసు. మొత్తం మాట్లాడనిచ్చాను. ఇక మాట్లాడటానికి ఏమీ మిగలనంతగా మాట్లాడనిచ్చా.

ఒక బాగా ఎరిగిన స్నేహ బంధం విచ్చిన్నం అవుతున్నప్పుడు మనమూ ఒక మెట్టు దిగి, దాన్ని నిలబెట్టుకోవాలన్న - నా ఆన్లైన్ స్నేహితురాళ్ళ అభిప్రాయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకున్నాను. అందుకే ఇదంతా చేశా. ఇంత ఓపికగా ఆగాను. 

ఆ తరవాత అతని స్క్రాప్ బుక్ లో అందరికీ తెలిసేలా ఒక మెస్సేజ్ పెట్టి దూరం అయ్యాను. అప్పటి నుండీ ఇప్పటి వరకూ మళ్ళీ కలవలేదు. తనని దూరం ఉంచాను. మొన్న మొన్నే బ్లాక్ లిస్టు నుండి తనకి స్వేఛ్చ కలిగించాను.

ఇదీ సంగతి.. ఈ పోస్ట్ వల్ల మీకు ఏమి చెప్పాలని అనుకుంటున్నా అని మీరు అనుకోవచ్చు. అదే పాయింట్ కి వస్తున్నా. పై విషయం జస్ట్ ఉదాహరణ సమాచారం గా తెలియచేయ్యాలని అంతే. మీరు చెయ్యాల్సిందల్లా -

మీ మితృలకి ఇబ్బందులు కలిగించేలా మీరు ప్రవర్తించకండి.

వారితో నమ్మకముగానే స్నేహం చెయ్యండి.

మిమ్మల్ని వారు నమ్మారు అనుకోండి. ఆ నమ్మకాన్ని భగ్నం మాత్రం చెయ్యకండి. అలా చేస్తే - ఆ అవతలివారి హృదయం పైకి మామూలుగా ఉన్నా, లోపల మాత్రం అంతులేని క్షోభని అనుభవిస్తుంది.

మీ స్నేహం వారికి ఆహ్లాదకరముగా, నమ్మకముగా, మీ స్నేహము లో సేద తీరేలా, ఒక మంచి మనసు తోడు ఉండేలా చూడండి.

మిమ్మల్ని నమ్మోచ్చును అనేలా మీ ప్రవర్తన ఉండాలి.

కరి విషయాల్ని మరొకరికి, ఆ మరొకరివి ఇంకొకరికి చెప్పటం వలన మీకు వచ్చేది ఏమీ లేదు.  ఇలా అవతలివారికి ఇది ఎలా తెలుసు అని మీరు అనుకొంటే - నా పేరు బయటకి రావొద్దు అని మీరు ఆ విషయాన్ని చెప్పిన వాళ్ళలో ఎవరో ఒకరు - హామీ తీసుకున్నాక ఎవరు అలా అన్నారో వారికి చెప్పేస్తారు. అప్పుడు ఉన్న స్నేహాలు కూడా దూరమై పోతాయి. ఫలితముగా మీరు దూరం అవుతారు. ఇంతకాలం మీరు చేసిన స్నేహానికి, డబ్బుకీ, కేటాయించిన సమయానికి, చేసిన ప్రతిఫలాపేక్ష లేని సేవలకీ - అర్థం లేకుండా పోతుంది. అన్నీ గోవిందా.. గోవిందా.. కానీ మీరు ఇలా అన్నారు అని చెప్పినవారు - మీ మాజీ స్నేహితులకి అల్లం - బెల్లం లా మారిపోతారు. ఒక చిన్న మాట వల్ల వారికి బాగా దగ్గర అవుతారు. మనం అంత చేసి కూడా చిన్న లీకేజీ వల్ల అవతలివారికి దూరం అవుతాం. చాలా చిత్రమైన, చిన్నదైన, నమ్మశక్యం కాని విషయం ఇది.

కవేళ మీ స్నేహితుల్లో ఎవరైనా ఇలా చేస్తుంటే - సున్నితముగా మీ ఇబ్బంది ఏమిటో తన ప్రైవసీ లో చెప్పండి. అర్థం చేసుకుంటే మంచిదే. అప్పటికీ తన గుణం మారకపోతే - ఆ స్నేహానికి దూరముగా ఉండండి. జస్ట్ లైక్ హాయ్ & బై / కీపిన్ టచ్.. లా ఉండండి.

మీరు ఇతరుల స్నేహితుల గురించి అనే హక్కు మీకు లేదు. విడమరిచి చెప్పే అంత సీను గానీ, అవతలివారి మాటల అర్థాలు కానీ విశ్లేషించి చెప్పే అంత అవసరం లేదు మీకు. వారితో కాసింత జాగ్రత్త అనే సూచన చెయ్యడం వరకూ ఓకే. అంతకన్నా ఎక్కువ లోలోతుల్లోకి వెళ్ళి మీ - పనికిరాని చెత్త విశ్లేషణలతో ఆ స్నేహాన్ని చెడగొడితే - పగిలిన ఆ స్నేహ హృదయాలు - ఎంతగా క్షోభిస్తాయో మీకు తెలీదు. ఆ పాపం అంతా మీ వల్లనే అని తెలిసిందే అనుకోండి. మిమ్మల్ని ఇక వారు ఎట్టి పరిస్థితుల్లో కానీ వారిరువురు క్షమించరు.. అని బాగా గుర్తు పెట్టుకోండి.

ఆ మిత్రుడు నాకు తెలియచేసిన - స్నేహం బ్రేకప్ అయినప్పుడు వారిరువురే మాట్లాడుకొంటే - ఒకవేళ ఆ స్నేహం తిరిగి కొనసాగవచ్చు, లేదా అంతటితో అక్కడే ఆగిపోవచ్చును.. కానీ ఆ తరవాతి జీవనం హాయిగా - తాము అన్ని ప్రయత్నాలు చేశాం అన్న తృప్తితో కొనసాగిస్తారు అన్న పెద్ద విషయాన్ని తెలియచేసిన ఆ మిత్రునికి వేవేల కృతజ్ఞతలు. ఈ విషయాన్ని మరీ విడమర్చి ( తానెక్కడ ఎలా తప్పు చేశాడో ) ఇలా అందరి ముందు చెప్పటం మాజీ స్నేహితునిగా తప్పే. అందుకే క్షమించు అంటున్నాను. కానీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ విషయం మొత్తం వ్రాశాను. 

నిజానికి ఈ విషయం తను ఫోన్ చేసేదాకా నాకు అలా చెయ్యాలన్న ఊహే రాలేదు. ఇంత అనుభవం ఉన్నా - ఆ విషయం నాకు సరిక్రొత్త అనుభవమే. కానీ నా జీవితం మునుపటి కన్నా హాయిగా, మరింత ఆనందముగా ఉండటానికి ఈ విషయం చాలాసార్లు అనుభవం లోకి వచ్చింది. మొత్తం నా జీవితాన ప్రవేశించి, బాగా దగ్గర అయిన నలుగురు మిత్రులని ఇలాగే ప్రయత్నించి, ఇద్దరినీ పూర్వ మిత్రులుగానే తిరిగి పొందాను. మరో ఇద్దరినీ ఎన్నెన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేశాను. అన్ని ప్రయత్నాలు చేసినట్లు వారికి తెలిసినా, అవతలి వారి నుండి ప్రతిస్పందన రాకపోయేసరికి, ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని యత్నాలు చేసి, దూరం జరిగాను.

ఇప్పుడు హాయిగా ఉన్నాను. నేను ఎన్నెన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేశాను. కానీ, అదృష్టం నా వైపు లేదని వదిలేసుకున్నాను. నా వైపు నుండి అన్నిరకాలుగా ప్రయత్నించాక, ఇంతకన్నా నేనేమీ చెయ్యలేను అనుకొనేలా చేశా. కానీ అవతలి వారి నుండి ఏమీ స్పందన రాలేదు, కానీ ఆ స్నేహాన్ని నిలుపుకోవటానికి అన్నిరకాలుగా ప్రయత్నించా అన్న తృప్తితో చాలా మామూలుగా ఉన్నాను. బాధ లేదు. కొద్దిరోజులు బాధ పడ్డా. ఇప్పుడు అంతా సర్దుకుంది. మనం చేయి ఇస్తే కూడా అందుకోవడానికి వారికి ఇబ్బంది ఉంటే మనమేమి చెయ్యగలం.

Related Posts with Thumbnails