Tuesday, February 10, 2009

Sakhi - Kalalai pongenu naa premaloo



నాకిష్టమైన పాటల్లో ఇదొకటి...

చిత్రం: సఖి
సంగీతం: A.R.రెహ్మాన్
గానం: స్వర్ణలత
******************
సాకీ:
ప్రేమలే నేరమా ప్రియా ప్రియా - వలపు విరహమా ఓ నా ప్రియా..
మనసు మమత ఆకాశమా - ఒక తారై మెరిసిన నీవెక్కడో..

పల్లవి:
కలలై పోయెను నా ప్రేమలు - అలలై పొంగెను నా కన్నులు (2)
మదికే అతిధిగ రానేలనో - సెలవైనా అడగక పోనేలనూ..
ఎదురు చూపుకు నిదరేది - ఊగెను ఉసురె కన్నీరై..
మనసు అడిగిన మనిషేక్కడో - నా పిలుపే అందని దూరాలలో.. // కలలై //

చరణం 1:
అనురాగానికి స్వరమేది - సాగర ఘోషకు పెదవేది.. (2)
ఎవరికీ వారే ఎదురు పడి - ఎదలు రగులు యెడబాటులలో..
చివరికి దారే మెలిక పడి - నిను చేరగ నేనే శిలనైతిని..
ఎండ మావిలో నావనులే - ఈ నిట్టూర్పే నా తెరచాపలే.. // కలలై //

చరణం 2:
వెన్నెల మండిన వేదనలో - కలువపూవులా కలత పడి.. (2)
చేసిన బాసలు కలలై పోతే - బతుకే మాయగ మిగులునని..
నీకై వెతికా కౌగిలిని - నీడగ మారిన వలపులతో..
అలిసి వున్నాను ఆశలతో - నను ఓదార్చే నీ పిలుపెన్నడో.. // కలలై //

No comments:

Related Posts with Thumbnails