Saturday, February 7, 2009

మరోచరిత్ర - విదిచేయు వింతలన్నీ..

చిత్రం: మరోచరిత్ర
రచన: అత్రేయ
గానం: వాణి జయరాం
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథ్
*****************


పల్లవి:

విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ
విరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో.. (2)

చరణం 1:

ఎదురు చూపులూ ఎదను పిండగా
ఏళ్ళు గడిపెను శకుంతలా
విరహ బాధనూ మరచిపోవగా
నిదురపోయెను ఊర్మిళా
అనురాగమే నిజమనీ
మనసొకటి దాని ఋజువనీ
తుది జయము ప్రేమదేననీ
బలి అయినవీ బ్రతుకులెన్నో // విధి చేయు వింతలన్నీ //  


చరణం 2:

వలచి గెలిచీ కలలు పండిన జంటలేదీ
ఇలలో కులము మతమూ ధనము బలమూ
గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగరాదనీ
ఎడబాసి వేచినాము
మన గాధె యువతరాలకూ కావాలీ మరో చరిత్రా!
కావాలీ మరో చరిత్రా !! // విధి చేయు వింతలన్నీ//

No comments:

Related Posts with Thumbnails