Sunday, March 31, 2013

Good Morning - 313


ప్రతిదీ చివరకు సుఖాంతం అవుతుంది. ఒకవేళ - సుఖాంతం కాలేదంటే దానికి అసలు అంతమే లేదన్నమాట. 

అవును కదూ.. ప్రతి దానికీ, అది అవమానమే కానీ, అనుమానమే కానీ, యుద్ధమే కానీ, కష్టమే కానీ.. ఏదైనా చివరకు సుఖాంతం అవుతుంది. ఒకవేళ అలా కాలేదూ అంటే అది ఇంకా కొనసాగుతూనే ఉంది అన్నమాట. అంటే అది ఇంకా ముగింపు దశవరకూ చేరుకోలేదు అన్నమాట. 


Saturday, March 30, 2013

Good Morning - 312


ప్రేమని కళ్ళతో చూడలేం.. 
హృదయంతో మాత్రమే చూడగలం. 
- విలియం షేక్స్ స్పియర్. 

Friday, March 29, 2013

Good Morning - 311


చెయ్యగలిగినవాడు చేస్తాడు, చెయ్యలేనివాడు చెబుతాడు. 

Thursday, March 28, 2013

Good Morning - 310


మనం చెప్పే దాంట్లో బలం లేనప్పుడు ఇతరులని దూషిస్తాం, బలహీనుడై ఎదురుగా కనపడితే, రెండు పీకుతాం. 


Wednesday, March 27, 2013

Holi Greetings

నా మిత్రులకీ, 
వారి కుటుంబ సభ్యులకీ, 
నా తోటి బ్లాగర్స్ కీ, 
శ్రేయోభిలాషులకీ, 
కామెంట్స్ పెట్టినవారికీ, 
హోలీ పండగ శుభాకాంక్షలు.  











Tuesday, March 26, 2013

Good Morning - 309


నమ్మకం లేని చోట పచ్చినిజం కూడా అబద్ధం లాగే కనిపిస్తుంది. 

Monday, March 25, 2013

Good Morning - 308


విజేత అంటే - ఏ రంగములోనైనా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డవాడు. 

Sunday, March 24, 2013

Good Morning - 307


మనతో ఏకీభవించే వాళ్ళతో సౌఖ్యముగా ఉండగలం కానీ - ఏకీభవించని వాళ్ళ వల్లే ఎదుగుతాము. 

Friday, March 22, 2013

Good Morning - 305


తేనె తుట్ట నుంచి తేనెను దొంగిలించగలం.. కానీ, తేనెటీగ నుంచి తేనెను తయారుచేయగల నైపుణ్యాన్ని దొంగిలించలేము.. 

Thursday, March 21, 2013

Good Morning - 304


మనకోసం మనం బ్రతకటం వేరు.. మనల్ని ఇష్టపడేవాళ్ళ కోసం - మనం బ్రతకటంలో ఉండే సంతోషాన్ని వెలకట్టలేము. 

Wednesday, March 20, 2013

Good Morning - 303


అన్నింటికన్నా ముందు నిన్ను నువ్వు గౌరవించుకో.. 

అవును.. మనలని మనమే గౌరవించుకోకపోతే - ఇంకెవరు మనకి విలువనిస్తారు? నేనో వెధవని, మూర్ఖుడిని, జఫ్ఫా.. అంటూ ఇతరుల ముందు అంటూ ఉంటే ఇక ఎదుటివారిలో మనపట్ల సదభిప్రాయం ఇక ఏమి ఉంటుంది? ఇక అప్పుడు వారూ మనల్ని మూర్ఖుడు, వెధవా అని పేర్లు పెట్టి పిలుస్తూ, నలుగురిలో పలుచన చేస్తుంటారు. ఈ మన ఆత్మ గౌరవాన్ని మన అనుమతి లేకుండా ఎవరూ మన విలువ తగ్గించలేరు. ఒకవేళ తగ్గించాలని చేసినా అది తాత్కాలికమే.. 

Tuesday, March 19, 2013

Good Morning - 302


నిజాయితీ - మాటమాత్రంగా కాక, నిజంగా ఉండాలి. అది తనను తాను చీల్చుకొని, చర్మాన్ని ఒలుచుకొని, చూసుకోవడం లాంటిది. 

Monday, March 18, 2013

Good Morning - 301


అన్నిటినీ అర్థం చేసుకోవడమే జీవితం. 

జీవితం అన్నాక  కష్టాలూ, సంతోషాలు అన్నీ ఉంటాయి. అవన్నీ జీవితములో ఒక భాగం. కష్టాలూ, కన్నీళ్ళు, బాధలు, సమస్యలూ, అడ్డంకులూ, అవరోధాలూ, ఇబ్బందులూ.... ఉన్నట్లే, సంతోషాలు, మధురాతిమధుర క్షణాలు, ఆనందకరమైన సన్నివేశాలు, మైమరచిపోయే అనుభూతులు, అందమైన జ్ఞాపకాలు... ఇలా అన్నీ ఉంటాయి. ఇవేకాక నిత్యజీవితములో ఎదురయ్యే వారినీ, వారి చేష్టలనీ, భావాలనీ, మనస్తత్వాలనీ అన్నీ అర్థం చేసుకోవాలి.. మనకి ముందు కనిపించేవాటి కన్నా వెనకాల సత్యాలనీ అర్థం చేసుకోవాలి. అలా చేసుకున్ననాడు జీవితం సాఫీగా, సంతోషముగా, తక్కువ వత్తిడితో సాగిపోతుంది. 

Sunday, March 17, 2013

Good Morning - 300


జీవితం అంటే ఒక సమస్య నుండి మరో సమస్యకి ప్రయాణం అంతే!.. సమస్య లేని జీవితం ఉండదు. 

జీవితం అన్నాక ఎన్నో సమస్యలు. " ఏంట్రా బాబూ నాకే ఇవన్నీ.. " వాపోయేలా ఉంటాయి. నిజానికి సమస్యలు మనిషిని అభివృద్ధిలోకి తీసుకవెళుతాయి. ఈ సమస్యలు ఎవరికైనా సర్వసాధారణం. ప్రతివారికీ తప్పవు. వచ్చిన చిక్కల్లా - వాటిని ఎలా పరిష్కరించుకుంటాం అనే దగ్గరే మన ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. పరమ సత్యం చెప్పాలీ అంటే - సమస్యలు చాలా చిన్నవి. వేరేవారిని వాటిని పరిష్కరించేలా కేలికేలా చేసో, సరియైన పని చెయ్యాల్సింది మరొకటి చేసో, తగిన సమయములో తగిన నిర్ణయం తీసుకోకపోవడమో.. ఇలాంటి అనేకానేక కారణాల వల్ల అవి జటిలమవుతాయి. అప్పుడు ఇంకా చిక్కుముడులుగా మారుతాయి. 

కాస్త తెలివిగా మనకున్న సమస్యలని తెలివిగా పరిష్కరించుకుంటూ వెళితే - చక్కని అభివృద్ధిలోకి వస్తాం. ఒక సమస్య కాగానే / కాకుండానే ఇంకో సమస్యలోకి వెళుతూనే ఉంటాం. అది తప్పని ఆనివార్యపు జీవిత ప్రయాణం.

Saturday, March 16, 2013

Good Morning - 299


నిరంతరం వరదలా వచ్చిపడే అసత్యపు విలువలు మరింత దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. 

నిజమే కదా.. జీవితాన మనకి ఎదురయ్యి, ఆచరించాలి అన్నట్లుగా ఉండే విలువలూ, విషయాలు అనీ సత్యమై ఉండవు, అవి అబద్దాలై కూడా ఉండవచ్చు. నిజమైన విలువలకి చావు ఉండదు. చివరికి అవే నిలబడతాయి. అబద్దాల విలువలు వల్ల మన పేరూ, పరపతి, గౌరవానికి భంగం కలగవచ్చును. అప్పుడు బాధ మిగులుతుంది.. 


Friday, March 15, 2013

Good Morning - 298


మనుష్యులు రెండు రకాలు. 
వర్తమానంలో జీవించేవారు ఒక రకమైతే, 
ఎక్కడా జీవించలేనివారు రెండో రకం. 

Thursday, March 14, 2013

Good Morning - 297


కష్టాల్లో ఓదార్పునిచ్చే స్నేహమే - మనకు కొండంత బలం. 

Tuesday, March 12, 2013

Good Morning - 296


మనం ఆనందముగా ఉండడానికి మంచి మార్గం - ఇతరులను ఆనందముగా ఉంచడమే!

Monday, March 11, 2013

Good Morning - 295


ఎక్కువ ఉన్నవారు ఆశాపరుడై ఉంటాడు.. తక్కువ ఉన్నవారు ఎల్లప్పుడూ పంచుకుంటారు. 

Sunday, March 10, 2013

Good Morning - 294


ఆశ పడ్డవన్నీ అందవు. ఉన్నదానితో సంతృప్తి చెందు. 

Saturday, March 9, 2013

Maha Shivaratri wishes

నా మిత్రులకీ, 
వారి కుటుంబ సభ్యులకీ, 
శ్రేయోభిలాషులకూ, 
తోటి శివ భక్తులకీ, 
ఉపవాస, జాగరణ దీక్షలల్లో ఉన్నవారికీ, 
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. 






Friday, March 8, 2013

Good Morning - 293


ఈ ప్రపంచములో నేనొంటరిని..కానీ నా ప్రపంచములో నేనే - ఓ ప్రపంచం. 

Thursday, March 7, 2013

Good Morning - 292


అభిమానం, ప్రేమ మితి మీరితే ప్రమాదమే..

Wednesday, March 6, 2013

Good Morning - 291


Good Morning - 290


నువ్వు నిజాయితీగా ఉంది, మంచి మానవ సంబంధాలు కొనసాగించినప్పుడే - జీవితం ఆనందంగా ఉంటుంది. 

Tuesday, March 5, 2013

Good Morning - 289


మనిషి సహజంగా తన బలహీనతల్ని ఎప్పుడూ ఒప్పుకోడు. వాటిని చూడడు, పట్టించుకోడు. తెలిసినా, తెలిపినా సరిదిద్దుకోడు. 

Good Morning - 288


ఆత్మ విశ్వాసంతో.. నీపై నీవు నమ్మకాన్ని పెట్టుకొని, ప్రయత్నం చేయు - తప్పకుండ అనుకున్నది సాధిస్తావ్..! 

Monday, March 4, 2013

Sunday, March 3, 2013

Good Morning - 286


ప్రతి ఒక్కరూ దేనికో ఒక దానికి ఏదో విధంగా బందీయే. దాన్నుంచి తప్పించుకునే అవకాశం కోసం తపించడమే సాధన. 


Saturday, March 2, 2013

Good Morning - 285




Good Morning - 284


ఉపాసనాంజనేయ ప్రార్థన : 
శ్లోకం || వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్ర్తాంచితం 
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా,
హస్తాబ్జైరసి, ఖేట, పుస్తక, సుధా కుంభం, కుశాద్రిం, హలం, 
ఖట్వాంగం, ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం!! 

Friday, March 1, 2013

ఐన్ స్టీన్ తెలుగులో అన్నాడా?

ఒక్కోసారి కొందరు తమ దూకుడు తనముతో ఏదేదో కామెంట్స్ పెడుతుంటారు. మనం సరిగ్గా కౌంటర్ జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన సంఘటన మొన్నే నాకు కలిగింది. ఆ అనుభవం ఇప్పుడు మీతో పంచుకుంటాను. 


నేను చేసిన ఈ కార్డ్స్ లో ఒకటి ఐన్ స్టీన్ వ్రాసిన కొటేషన్ కూడా ఒకటి ఉంది. ఆ కొటేషన్ ని నా ఆల్బమ్ లో పోస్ట్ చేసుకున్నాను. సాధారణముగా ఆ పోస్ట్స్ అన్నీ అందరికీ కనిపించేలా " పబ్లిక్ " అనే ఆప్షన్ లో పెట్టేస్తాను. ఆ కొటేషన్ మనవాళ్ళకి అర్థమయ్యేలా ఉండేందుకై తెలుగులో వ్రాశాను. ప్రతిదాంట్లో లోపాలని వెదికే ఒక పాఠకుడు ఆ పోస్ట్ ని చూడగానే తనలోని విశ్లేషకుడుకి ఒక మంచి అవకాశం వచ్చిందని ఉప్పొంగిపోయినట్లున్నాడు. వెంటనే ఒక కామెంట్ పెట్టాడు. " ఐన్ స్టీన్ అలా తెలుగులో చెప్పాడా?.." అనీ. 

నిజానికి అలాంటి తుంటరి ప్రేలాపనలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకక్షణం స్థిమితముగా ఉండి, ఆలోచించాను. సమాధానం దొరికింది. వెంటనే అమలులో పెట్టేశాను. 

ఆ కొటేషన్ ని ఇంగ్లీష్ లోకి మార్చాను. అలా మార్చగా - The difference between genius and stupidity is that genius has its limits అని వస్తుంది. ( మేధావికి, మూర్ఖత్వం కి మధ్య తేడా ఏమిటంటే - మేధావితనం కి పరిమితి / హద్దులు ఉంటుంది ) యూదుల భాష హిబ్రూ కాబట్టి, దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ లో పేస్ట్ చేసి, హిబ్రూ భాషలోకి మార్చాను. అప్పుడు ఇలా వచ్చింది. 

      అలా వచ్చినదాన్ని కాపీ, చేసి కామెంట్ బాక్స్ లో పేస్టు చేసి, సమాధానం చెప్పాను. ఐన్ స్టీన్ ఇలా ההבדל בין הגאונות לטיפשות הוא שגאונות יש גבולות. అన్నారు. ఇప్పుడు మీరు - ఆయన యే భాషలో ఆ మాట అన్నారో, ఆ భాషలోనే ఆ కొటేషన్ ని మీరు చదువుకోవచ్చును అని చెప్పాను. ఆ సమాధానం ఆ కామెంట్ పెట్టినతను చూసి ఉండొచ్చును. చూడక ఏమి చేస్తాడు.. తనే గొప్ప కామెంట్ పెట్టాను అనుకున్నవాడు విజయగర్వముతో - తాను పెట్టిన కామెంట్ కి జవాబు వచ్చిందా లేదా అని తప్పక చూస్తాడు. ఇంగ్లీష్ యే సరిగా వ్రాయరానివాడికి ఇక ఆ హిబ్రూ భాష ఏమి అర్థం అవుతుంది? మళ్ళీ ఇక కామెంట్ లేదు.. బాగా పంచ్ పడ్డట్లుంది. బహుశా ఇక ఎప్పుడూ అలా కామెంట్ చెయ్యకపోవచ్చును. 

Related Posts with Thumbnails