Showing posts with label Health. Show all posts
Showing posts with label Health. Show all posts

Tuesday, January 12, 2016

మినరల్ వాటర్ లో వెండి..

మీరు మీ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ తీసుకుంటామూ అనుకంటే - ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ అందించబోతున్నాను. దాన్ని మీరు ఆచరించండి. దాని వల్ల మీరు మరింత ఆరోగ్యముగా ఉంటారని నేను భావిస్తున్నాను. ఇది నిజమా కాదా అనే చర్చ నేను తీయడం లేదు.. నేను ఈ పద్ధతిని గత ఏడెనిమిది సంవత్సరాలుగా విధిగా పాటిస్తున్నాను కనుక - మీకూ మంచి చెయ్యగలదని అనుకుంటున్నాను. నమ్మకం ఉన్నవారు ఆచరించండి. 

ఈరోజుల్లో అందరూ దాదాపుగా మినరల్ వాటర్ అంటూ బబుల్స్ లలో నింపి వచ్చే ప్యాకేజ్డ్ నీటినే అందరూ వాడుతున్నారు. రివర్స్ ఆస్మోసిస్ ప్రక్రియ ద్వారా నీటిని శుభ్రం చేసి, ప్యాకింగ్ చేసి, మన వద్దకి పంపిన ఆ నీరు కొన్ని గంటల తరవాత ఆ నీరు క్షయకరణం కావడం మొదలెడుతుంది. ఆ నీరు మరింత శుద్ధిగా ఉండాలంటే ఏమి చెయ్యాలో ఇప్పుడు చెప్పబోతున్నాను. 

ఆ నీటి బబుల్ ని పెట్టే క్రింది డబ్బాలోని నీళ్ళలో - ఒక వెండి రేకుని వెయ్యండి. వెండికి గల శక్తుల్లో - నీటిలో ఉన్న బ్యాక్టీరియాని చంపే గుణం కూడా ఉందంట. ఒకప్పుడు ఈ మినరల్ వాటర్ / ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ డబ్బాలు లేని కాలములో - యాత్రలకు వెళుతూ లోపల వెండి పూత పూసిన మరచెంబులను తీస్కెల్లె వారట. ఓడల మీద వెళ్ళే వారు పెద్ద పీపాల్లో నీటిని పట్టి, వాటిల్లో వెండి నాణేలని వేసుకొని, ఆ నీటిని వాడేవారట. ఈ విషయం తెలుసుకున్నాక నేనూ ఆ ప్రయోగాన్ని చెయ్యాలని అనుకున్నాను. 

కొద్దిగా వెండిని తీసుకొని, సన్నగా రేకులాగా చేయించాను. ఇలా రేకులా ఎందుకంటే నీటికి ఎక్కువ వైశాల్యములో ఆ వెండి రేకు తగులుతుందని. క్రింది డబ్బా మూతిలో పట్టే విధముగా చేసి, అందులోకి అలా రెండు రేకుల్ని జారవిడిచాను. ఆ తరవాత నీటిని నింపి, వాడుకోవడం మొదలెట్టాను. 

ఇప్పటికీ అలాగే ఆ డబ్బాలో ఆ వెండి రేకులు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతివారం వాటిని శుభ్రముగా కడిగి, మళ్ళీ వాటిని ఆ నీటి డబ్బాలో వేసుకొని ఆ నీటిని వాడుకోవడమే. 

మరి ఏమైనా మార్పు జరిగిందా ? అంటే ఏమి చెప్పగలను. నేనేమీ శాస్త్రవేత్తని కాను. కానీ గమనించిన విషయం ఒకటుంది. గత ఇన్ని సంవత్సర కాలములో మా ఆరోగ్యాలకి డోకా లేదు.. హాయిగా ఉన్నాం. పెద్దవాళ్ళం మాకు రెసిస్టన్స్ పవర్ వల్ల అలా ఉండొచ్చు. కానీ పిల్లలకు అంతగా ఉండదు కదా.. వారూ ఈ నీటినే త్రాగుతారు. వారి ఆరోగ్యాలూ చాలా చాలా బాగున్నాయి. ఈ నూతన సంవత్సర కానుకగా - మీకు ఈ విషయాన్ని పరిచయం చేస్తున్నాను. నమ్మినవారు ఈ సూచనని పాటించండి. 

ఇదే ప్రయోగాన్ని రాగి రేకులతో చేశాను. కానీ ప్యాకేజ్డ్ నీటిలో ఉండే రసాయనాల వల్ల తరచుగా ఆ రాగిరేకు మీద ఆకుపచ్చని రంగులో మలికి / త్రుప్పు / గార పట్టుతున్నది. దాన్ని శుభ్రం చెయ్యడం కాసింత కష్టమైనపనే.. 


Thursday, December 4, 2014

Good Morning - 572


ఆరు బయటి ఆటలు ఆడండి. దాని ద్వారా శారీరక. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. 

 అవును.. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. తన జీవన ఉపాధికి  సమయం పోగా, మిగిలిన సమయాన్ని టీవీ ముందు, కంప్యూటర్ ముందో, చిట్ చాటింగ్ కో వాడుతున్నాడు.. కాస్త శారీరక శ్రమని కలిగించే ఆటలు గానీ, పనులని గానీ చెయ్యటానికి ప్రయత్నించడం లేదు.. నిజానికి మనిషి వయస్సు పెరుగుతున్నా కొలదీ తనలో వ్యాధి నిరోధకత లక్షణాలు తక్కువ అవుతూ ఉంటాయి. కండరాలు నెమ్మనెమ్మదిగా క్షీణతకి గురి అవుతూ ఉంటాయి. ఇలాంటి వారు త్వరగానే జబ్బులకి గురి అవుతుంటారు. ఆ జబ్బుల నుండి బయటపడటానికి మందులు వాడుతుంటారు. కొద్దిరోజుల తరవాత జబ్బులు ఆ మందులకు స్పందించడం మానేస్తాయి. ఇంకా వ్యాధులు ముదరడం మొదవుతుంది. ఫలితముగా మందుల గోళీలు పుట్నాల మాదిరిగా వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వేసుకున్నా ఫలితం అంతంత మాత్రమే. పైగా ఆర్ధిక భారం. ఇదంతా అవసరమా...? 

ఈరోజుల్లో కొందరు ఎంత సెన్సిటివ్ గా ఉంటున్నారూ అంటే - ఏసీ లేని ఇంట్లో - పగటి పూట కూడా స్వెటర్, మంకీ క్యాప్ లేకుండా ఉండటం లేదు.. ఇలా వృద్ధులు ఉంటే తప్పులేదు గానీ, యువకులు, యూత్ (30+) ఉంటున్నారు. వారిని చూస్తుంటే చాలా జాలేస్తున్నది. నిజానికి వీరికి ఆ అవసరం లేకుండా చెయ్యవచ్చును.

ప్రొద్దున్నే, లేదా సాయంకాలం సమయాల్లో - కాస్త వ్యాయామం చేస్తే లేదా ఆటలు ఆడితే శరీరానికి శారీరక శ్రమని కలిగించి, కాస్త క్రొవ్వు కరుగుతుంది, లోన కండరాల పటుత్వం పెరుగుతుంది. హార్ట్ బీటింగ్ బాగుంటుంది, శారీరక అందం బాగుంటుంది. వ్యాకర్ధ లక్షణాలు తక్కువ అవుతాయి. శరీరం మునుపటికన్నా మరింత క్రియాశీలముగా ఉంటుంది. శారీరకముగా బాగుంటాం.. మానసిక ఆరోగ్యమూ బాగుంటుంది. క్రొత్తగా ఏదో ఆరోగ్యాన్ని మన శరీరానికి అటాచ్ చేసుకున్నట్లుగా భావిస్తాం కూడా. ఇలా ఉన్నప్పుడు మనలో ఆరోగ్యకరమైన ఆలోచనలు మొదలవుతుంటాయి. ప్రొద్దున్నే లేవాలి. వ్యసనాల జోలికి వెళ్ళకూడదు.. ఆరోగ్యకరమైన పనులని చెయ్యాలి అని తీర్మానించుకుంటూ ఉంటాం.. ఇదంతా అందరికీ తెలుసు.. కానీ అంతగా చెయ్యటానికి ఇష్టపడం.. అదే సమయాన యే బార్ కో, రెస్టారంట్ కో వెళ్ళి వినోదిద్దాం అంటే చాలామంది లగెత్తుకొని వస్తారు. ఫలితముగా భవిష్యత్తులో వేలల్లో.. కాదు కాదు లక్షల్లో హాస్పిటల్స్ లలో కుమ్మరించాల్సి వస్తుంది. 


Monday, May 14, 2012

క్యారీ బ్యాగులు

ఈ మధ్య మార్కెట్లలో ఇచ్చే నల్లని, తెల్లని, నీలి రంగుల్లో ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని చూశారా.. కూరగాయల కొట్లల్లో, హోటల్స్ లలో, కిరాణా దుకాణాలలోనే కాక ఎన్నో చోట్ల ఉచితముగా ఇచ్చే ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ఒకసారి పరిశీలించండి.. మన ఆరోగ్యాలతో ఎంత దారుణముగా అడుకుంటున్నారో మీకే అర్థమవుతుంది.

ఇరవై మైక్రాన్ల మందం లోపు ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ప్రభుత్వ నిషేధం తరవాత, నిషేధం మాటేమితో గానీ, ఎక్కడ చూసినా ఈ ఇరవై మైక్రాన్ల మందము లోపే క్యారీ బ్యాగులు కనిపిస్తున్నాయి, వాడకములోకి వచ్చేస్తున్నాయి కూడా. నిషేధము ముందే కాసింత నయం. జెన్యూన్ ప్లాస్టిక్ తో చేసిన తెల్లని ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని ఇచ్చేవారు. ఇప్పుడు అవి పూర్తిగా మార్కెట్ నుండి మాయం అయ్యి, ఈ బ్యాగులు బయలుదేరాయి. ఎక్కడ చూసినా ఇవే.

ఇప్పుడు మార్కెట్లలో ఇస్తున్న ఈ క్యారీ బ్యాగులని ఒకసారి పరిశీలిద్దాం. మొదట్లో తెల్లని రంగులో / పారదర్శకమైన క్యారీ బ్యాగులు మార్కెట్లో లభ్యం అవుతుండేటివి. నల్ల రంగు క్యారీ బ్యాగులు చాలా తక్కువగా వాడేవారు. నిషేధం తరవాత తెల్లని రంగులోనివి, మార్కెట్ నుండి పూర్తిగా మాయం అయ్యాయి. నల్లని కవర్లలో కూడా జెన్యూన్ ప్లాస్టిక్ నుండి తయారయిన బ్యాగుల స్థానాన, రిసైకిల్డ్ ప్లాస్టిక్ నుండి చేసిన ప్లాస్టిక్ బ్యాగులు రావటం మొదలయ్యాయి. ఇవి బాగుండటం లేదని అంటున్నారని, కాసింత సాంకేతికత పొంది, అదే రిసైకిల్డ్ ప్లాస్టిక్ తో తయారయిన అసంపూర్ణ పారదర్శకత ఉన్న తెలుపు, నీలిరంగు కవర్లు తయారుచేసి, ఇస్తున్నారు. ఈ రంగు కవర్లని చూసి ఒరిజినల్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులనే అనుకుంటాము. కాని తరవాత కాదని తెలుసుకొని, మోసపోతాం.

ఈ ప్లాస్టిక్ కవర్లని ఒకసారి ఓపెన్ చేసి, వాసన చూడండి. మీకు డోకు రావటం ఖాయం. అందులోని ఆహార పదార్థాలని ఇక ఎలా తినగలం? ఆహారపదార్థాలు అయిన పళ్ళు, టిఫినీలు, కేకులు, బిస్కట్స్ ని రెండు భాగాలు చేసి, వీటిల్లో ఒక భాగం పెట్టి కాసేపటి తరవాత తిని చూడండి. అలాగే అందులో పెట్టకుండా బయట పెట్టిన భాగాన్ని కూడా రుచి చూడండి. ఎంత తేడా కనిపిస్తుందో చూడండి. అంతా ఏదో మురికి వాసన వస్తున్నట్లుగా ఉంటుంది చూడండి. 

అలా వాసన వస్తున్న కవర్లని మార్కెట్లో ఎలా అమ్మనిస్తున్నారో, ఎలా వారు మనకి ఇస్తున్నారో, మనం కూడా అసలు వాటి గురించి ఏమీ తెలుసుకోకుండా వాటిని వాడటం ఏమిటో.. ఏమిటో అస్సలు అర్థం కాదు. ఇందులో ఎవరిదీ తప్పు అని మీన మేషాలు లెక్కపెట్టక, దయచేసి ఆ క్యారీ బ్యాగుల్ని వాడకండి. మీ ఆరోగ్యాలని పాడు చేసుకోకండి.  

Friday, July 29, 2011

25 tips for a healthy heart

మీ హృదయం బాగా పనిచెయ్యాలి అంటే - ఈ ఇరవై ఐదు పద్దతులని ఆచరించి చూడండి. మీ హృదయం బాగా పనిచేస్తుంది. 

పెద్దగా చూడాలీ అనుకుంటే ఫోటో మీద డబల్ క్లిక్ చెయ్యండి. 


Monday, July 25, 2011

Health Quotes

ఇవి నా కలెక్షన్స్.. నేను చేసినవి కావు. కాని బాగుంటాయని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను.. 































Tuesday, April 13, 2010

కొన్ని ఎక్సర్సైజులు

ఇప్పుడు మీకు కొన్ని ఎక్సర్సైజులు చూపిస్తాను.. నేర్చుకోండి. చాలా సులభమైనవి అవి.. చూడండి.. నేర్చుకోండి ఆరోగ్యముగా ఉండండి 


ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.. డౌన్లోడ్ చేసుకొని చూసి, నేర్చుకొని ఆరోగ్యముగా ఉండండి. ఇది నా పుట్టినరోజుకి (16)  మీకిస్తున్న చిరుకానుక అనుకోండి. ఇంకోటి కూడా త్వరలో ఇస్తాను..

డౌన్లోడ్ కొరకు లింక్: Diet Exercises  
సైజ్: 1 .63 MB
ఇది winrar పద్దతిలో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నాక ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ (extract) చేసుకోవాలి. ఇందుకు ఇదే బ్లాగులోని winrar (అప్లోడ్ & డౌన్లోడ్) ని ఒక సారి చూడండి. 

Related Posts with Thumbnails