Thursday, February 25, 2010

జయహో సచిన్

సచిన్ టెండూల్కర్ నిన్నటి దక్షిణాఫ్రికా తో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మాచ్లో 147 బంతుల్లో 200 ల పరుగులు చేసాడు. ఇది నిజముగా భారతీయులు గర్వించదగ్గ విషయం. అతని రికార్డుల గురించి ఇక్కడ చెప్పటం లేదు గాని.. అతడికి ఉన్న ఒక గొప్ప ప్రత్యేకతని ఇక్కడ చెప్పదలచుకున్నాను.. 

ఎవరైనా ఎన్నైనా అనుకోనీ! ఎన్నైనా విమర్శలు చేయనీ!! - తన ఆటేదో తాను ఆడుతాడు. వయసు మీద పడింది.. అడ్వర్టైజ్ ల మీదనే దృష్టి.. తన రాంకుల కోసమే ఆట.. ఇలా ఎన్ని విమర్శలున్నా ఒక్క మాట కూడా మాట్లాడక, తానేమిటో తన బ్యాటు ద్వారానే ఆట చూపి సమాధానం చెప్పే ఒక్క మగాడు - సచిన్. విమర్శలు చేసేవారు ఒక విషయం గమనించాలి - ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ప్రతి సినిమా హిట్ చేయలేడు ఎలాగో ఆటకి వచ్చిన ప్రతిసారీ బాగా ఆడటం ఎవరివల్లా కాదు. ఇంతగా చెబుతున్నాను.. నేను సచిన్ అభిమానినా? అని మీకు అనుమానం రావచ్చును.. కాని ఎవరి పట్లా అభిమానం లేదు. నేనూ ఒకప్పుడు గొప్పగా క్రికెట్ ఆడేవాడిని.. నేను ఆడుతున్నానంటే అవతలి జట్లు ఓ మోస్తారు భయానికి గురి అయ్యేటివి.. అవన్నీ ఇప్పుడెందుకులే!.. ఆ అనుభవాల మీద సచిన్ గురించి చెప్పాలనిపించింది.

Wednesday, February 24, 2010

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 4

ఇప్పుడు గుణింతాలు చూద్దామా!.. ఇది బాగా చదివి, అర్థం చేసుకోండి.. బ్లాగు లోని ఈ ట్రాన్స్లేషన్ లో ఇంకా అభివృద్ధి చెయ్యాల్సివున్నది. నేను మొదట్లో ఇలా వ్రాస్తున్నప్పటికన్నా ఇప్పుడు బాగా మార్పు చెందింది. ఇంకా కొన్ని అక్షరాలూ, పదాల అమరిక పద్దతీ.. మార్చాలి. కొన్ని పదాలు ఇంకా టైపు చేయరావు.. వాటిని అభివృద్ధి చేస్తూ ఉండొచ్చు.. అలాంటివి ప్రస్తుతం వదిలేద్దాం! ఆ స్థానములో వాటికి తగిన సమాన అర్థ పదాలని వాడుకుందాం. సరేనా!.. మీరు సిద్ధమేనా.. 

ఇపుడు మీకు "" గుణింతం నేర్పిస్తాను.. దానిప్రకారముగా మిగతావన్నీ యధావిధిగా ఉంటాయి.

= ka అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే క అని వస్తుంది.
కా = kaa అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కా అని వస్తుంది.
కి = ki అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కి అని వస్తుంది.
కీ = kee అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కీ అని వస్తుంది.
కు = ku అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కు అని వస్తుంది.
కూ = koo అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కూ అని వస్తుంది.
కె = ke అని టైప్ చేసి, స్పేస్ బార్ నొక్కి, బాక్ స్పేస్ నొక్కితే వచ్చే పదాల్లో కె ని ఎన్నుకోవాలి. 
కే = ke అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కే అని వస్తుంది.
కై = kai అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కై అని వస్తుంది.
కొ = ko అని టైప్ చేసి, స్పేస్ బార్ నొక్కి, బాక్ స్పేస్ నొక్కితే వచ్చే పదాల్లో కొ ని ఎన్నుకోవాలి.
కో = ko అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కో అని వస్తుంది.
కౌ = kou అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కౌ అని వస్తుంది.
కం = kam అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కం అని వస్తుంది.
కః = kaha అని టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే కః అని వస్తుంది.

ఇలాగే మిగతా గుణింతాలూ చాలా వరకు వస్తాయి. ఇలా రోమన్ ఇంగ్లీష్ లో వ్రాసేటప్పుడు ముఖ్యముగా గమనించాల్సినది ఏమిటంటే - మనం ఎలా మాట్లాడుతామో అలాగే ఆ మాటల ఫోనెటిక్ / ఉచ్చారణ శబ్దాలని అక్షరాలలో వ్రాయాలి. అలా వ్రాయగలిగితేనే తెలుగులో వ్రాయడములో ఉత్తీర్ణులయినట్లు.. అబ్బో! అని భయపడకండి.. నేనున్నానుగా.. You don't fear.. Iam hear.

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 3

రోమన్ ఇంగ్లీష్ లో (అంటే ilaa raayatam.. meeku teluse anukondi) ఒక పదం వ్రాసాక "స్పేస్ బార్" (space bar) ని ఒకసారి నొక్కగానే, తెలుగులోకి ఆ పదం మారుతుంది. కొన్ని పదాలు మారవు. ఇలాంటివాటికి టైపు చేసాక స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి. అప్పుడు ఆ పదాలను ఎన్నుకంటే సరియైన పదములోకి మారిపోతుంది.
ముందుగా "తెలుగు వర్ణమాల" ని ఎలా వ్రాయాలో నేర్పిస్తాను..

= a అని టైప్ చేసి, Space bar నొక్కండి.
= aa అని టైప్ చేసి స్పేస్ నొక్కండి.
= e లేదా i లేదా yi అని టైప్ చేసి, స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి. అందులోంచి ఇ మీద క్లిక్ చేయండి.
= ee అని టైప్ చేసి స్పేస్ నొక్కండి.
= u టైప్ చేసాక స్పేస్ బార్ నొక్కండి. 
= oo టైప్ చేసాక స్పేస్ బార్ నొక్కండి. 
= e కాని ye కాని టైప్ చేసాక, స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి. వచ్చే పదాల్లో ఎ ని క్లిక్ చేస్తే సరి.
= ye అని టైప్ చేసాక, స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి. వచ్చే పదాల్లో ఏ ని క్లిక్ చేస్తే సరి.
= i టైప్ చేసి స్పేస్ బార్ నొక్కితే సరి.
o టైప్ చేసాక, స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి. ఒ ని క్లిక్ చేస్తే సరి.
o టైప్ చేసాక, స్పేస్ నొక్కితే సరి.
= ou టైప్ చేసాక, స్పేస్ నొక్కితే సరి.
అం = am టైప్ చేసాక స్పేస్ బార్ నొక్కితే సరి.
అః = aha టైప్ చేసాక, స్పేస్ నొక్కి, Back space నొక్కితే కొన్ని పదాలు కనిపిస్తాయి, వచ్చే పదాల్లో అః ని క్లిక్ చేస్తే సరి.

ఇవి అభ్యాసం చేయండి.. మిగతాది తరవాతి క్లాసుల్లో చెప్పుకుందామా!

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 2

1. ముందుగా మీరు బ్లాగుని ఏర్పరుచుకున్నాక Settings లోకి వెళ్ళండి.

2. అందులోని Toolbar లో Basic అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని నొక్కండి.

3. అప్పుడు వచ్చిన పేజిలోనే క్రిందిభాగాములో ఇలా కనపడుతుంది.
4. ముందుగా Select post editor లో చూపించినట్లుగా Updated editor, Old editor అంటూ  ఉన్నాయిగా..

5. అందులో మొదటిది Updated editor ని ఎన్నుకొనండి. ఇందులో అయితే చాలా ముఖ్యమైన పనిముట్లు ఉంటాయి.

6. ఆ తరవాత Enable transliteration ఉందిగా!..

7. అందులో మొదటిగదిలో Enable అని పెట్టి, ఆ ప్రక్క గడిలో Telugu - తెలుగు అని ఎన్నుకోండి.

8. ఆతరవాత Save Settings ని నొక్కండి.

9. ఇప్పడు మీరు టపా వ్రాయటానికి మీ బ్లాగులోని New post ని నొక్కండి. 

10. ఇప్పుడు అందులో ఇలా కనిపిస్తుంది. ఇందులో చివరలో ఉన్న "అ" అక్షరాన్ని క్లిక్ చేసి, క్రింది గడిలో రోమన్ ఇంగ్లీషులో వ్రాయడం మొదలెట్టండి. అంతే!.


అంతే! ఇకనుండి మీరు మీ బ్లాగులో వ్రాసినదంతా - ఇలా వ్రాసి Spacebar నొక్కగానే తెలుగులోకి మారిపోతూ ఉంటుంది.

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? - 1

తెలుగులో టైపు చెయ్యడం ఎలా? అని క్రొత్తగా బ్లాగు పెట్టినవారికి, టపాలు, వాఖ్యలు (కామెంట్స్) వ్రాసేవారికీ, గూగుల్ వాడి ఇతర సైట్లలో (ఉదాహరణకి ఆర్కుట్) తెలుగు వ్రాయడం మొదట్లో అర్థం కాదు. చాలా కష్టతరముగా అనిపిస్తుంది. ఎందుకొచ్చినదిరా ఈ గొడవ.. అనుకుంటూ అనాసక్తులమై పోతాము. తెలుగులో వ్రాయడానికి ఎన్నో పద్దతులు ఉన్నాయి.. చాలా తేలిక పరికరాలు మనకి అందుబాటులో ఉన్నాయి. కావాలంటే ఈ లింక్ తెలుగులో టైపు చెయ్యడం ఎలా? నొక్కి చూడండి.. మీ సందేహాలు ఎంతో తీరతాయి..

నేను వాడేది - గూగుల్ వాడి లిప్యంతరం. మొదట్లో అంటే నా బ్లాగుని మొదలెట్టిన రోజుల్లో నా బ్లాగులో తెలుగు సరిగా వచ్చేడిది కాదు. బహుశా నేను బ్లాగులకి క్రొత్త కావడం వల్లనో, టైపింగ్ సరిగా రాకపోవటమో, గూగుల్ లిప్యంతరం అప్పుడు ఇంతగా అభివృద్ధి కాకపోవటమో, ఎలా వ్రాయాలో తెలీనితనం వల్లనో గాని.. మొదట్లో నా బ్లాగుని వ్రాస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను.. సరిగ్గా గుర్తుంది. అప్పుడు ఈ బ్లాగులోని తెలుగు ట్రాన్స్లేషను ఇప్పుడున్నంత బాగా అప్పుడు లేదు. ( ఇపుడు చాలా బాగా అభివృద్ధి చేశారు ) అప్పట్లో తెలుగులో వ్రాయటానికి చాలా కష్టపడ్డాను.ఎవరి సహాయము లేకనే ఏకలవ్యుడిలా నేర్చుకున్నాను. అప్పుడు బ్లాగు లోని తెలుగు కన్నా గూగుల్ వాడి - ఆర్కుట్ లోని తెలుగు ట్రాన్స్లేషను చాలా బాగా ఉండేడిది. ఒక కమ్మ్యూనిటీ లో సినిమా పాటలు వ్రాసానని నేను ఇంతకు ముందే చెప్పానుగా. అలా ఆ పాటలూ ( 90 వరకూ ఉంటాయి ), స్క్రాపులూ వాసేసరికి తెలుగులో వ్రాయటం చాలా బాగా అలవాటయ్యింది. ఇలా అలవాటయ్యాక ఇంగ్లీషులో వ్రాయటం నిజముగానే మనసొప్పటం లేదు. మొదట్లో ఆర్కుట్లోని స్క్రాప్ బుక్ లో వ్రాసి, నా బ్లాగులో పేస్ట్ చేసేవాడిని. ఇప్పుడు డైరక్టుగా నా బ్లాగులోనే వ్రాస్తున్నాను. ఇప్పటికీ బ్లాగులో వ్రాయటములోని ఒక ఇబ్బంది ఏమిటంటే పెద్ద టపా వ్రాసేటప్పుడు కొద్దిసమయము తీసుకొని తెలుగులోకి మారుతుంది. ఏవైనా తప్పులు దిద్దాలంటే నెమ్మదిగా జరుగుతుంది. చాలా పెద్దగా ఉంటే ఆర్కుట్లో వ్రాసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను - ఇంకా.

ఇదీ నా బ్లాగు మొదలెట్టిన మొదట్లోని తెలుగు లిప్యంతరం ఇబ్బందులు. ఇలాంటివి మీకూ ఏర్పడి ఉండొచ్చు. అందుకే మీకు - ఈ గూగుల్ లిప్యంతరము వాడుతున్నప్పుడు ఎలా తెలుగు వ్రాయాలో మీకు కొన్ని క్లాసులు ( ఆ కోప్పడే క్లాసులు కావండీ.. తరగతి పాఠాలు అన్నమాట! ). వ్రాయలేనివారు ఎలా వ్రాయాలో తేలికగా నేర్చుకోండి. ఇలా నేర్చుకున్నందులకి నాకేమీ డబ్బులు ఏమీ ఇవ్వనవసరం లేదు. అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు మీది తెనాలా? మాదీతెనాలే! ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇకనుండీ పాఠాలు మొదలెడుతాను. శ్రద్ధగా అనుసరించండి.. తెలుగు పదాలూ, వాటి ఇంగ్లీషు రోమన్ పద్ధతి చెబుతాను.. అందరూ, క్రొత్తగా బ్లాగుని పెట్టినవారు మరీ శ్రద్ధగా వినండి / చదవండి..

శుక్లాం భరధరం విష్ణూం | శశివర్ణం చతుర్భుజం | ప్రసన్నవదనం ధ్యాయేత్ | సర్వ విఘ్నోప శాంతయేత్ |
సర్వ అవిఘ్నమస్తు..

(టింగ్.. టింగ్.. టింగ్.. టింగ్ గ్ గ్ గ్... )

అప్పుడే గంట కొట్టేసారే!
మొదటి పాఠం సమయం ముగిసింది.
రేపటి క్లాసులో మిగతాది చెప్పుకుందాం..
బ్లాగర్లూ అందరికీ సెలవు.

Sunday, February 21, 2010

ఆర్య - 2 పాట Mr. పెర్ఫెక్ట్ పాటకి అనుకరణ

ఆర్య - 2 పాట Mr. పెర్ఫెక్ట్ పాటకి అనుకరణ:

హే టిప్ టాప్ హీరో కదిలిండో.. - ఎవడికి వీడు హిట్టు ఇవ్వడండో..
ముదురండో.. బలుపండో.. - సినిమా తీయకండో...
ఉప్పు కప్పురంబు ఒక్క లుక్కు నుండో..
వీడి మూవి చూసి మోసపోకండో..

ఫ్లాప్ అండో.. వేస్టండో.. ఓవర్ యాక్షనండో..
కమాన్ కమాన్.. మోస్టు బోరింగు...
కమాన్ కమాన్... మస్తు లాఫింగు..
కమాన్ కమాన్.. వరష్టు యాక్టింగు...
హే యాయి యేహియో.

మిస్టెర్ ఫ్లాపర్ ఫ్లాపర్ .. హి ఈజ్ మిస్టెర్ ఫ్లాపర్
లెన్స్ వేసి వెతుకు.. దొరకదు రా ఏ హిట్టు.
ఆహ్.. వీడో జఫ్ఫా యాక్టర్,
ఈ మాటర్ అందరికీ తెలుసు,
వీడి మూవి తీసి, తీసి నా ఆస్తులన్నీ కరిగిపోయినయ్
కాని ఎవడూ మానడు.

పైగా ఈ రొజుల్లో ఇలాంటోల్లకు ఎర్రి ఫాన్సు బాగా ఎక్కువా..
ఐనా ఇంకోసారి ట్రై చేస్తా... హుస్సెన్ సాగర్ లో తోసేస్తా...

** ఇది యే హీరో ని ఉద్దేశించి రాయలేదని నా మనవి.

Thursday, February 18, 2010

Where is the పంచెకట్టు చారీ - అదుర్స్

చిత్రం : అదుర్స్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
పాడినవారు : జూనియర్ ఎన్టీఆర్, రీటా
ఇంగ్లీష్ రాప్ : దేవిశ్రీ ప్రసాద్
రచన : రామజోగయ్య శాస్త్రీ
*********************
సాకీ :
Where is that? - What is that?
Where is that? - What is that?

పల్లవి :
Where is the పంచెకట్టు - where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
What is this suit boot - what is this French cut
What is this gulf scent చారీ
I don’t want పంచెకట్టు - I don’t want పిలకజుట్టు
I don’t want నిలువుబొట్టు పోరీ
I like this suit boot - I like this French cut
I like this gulf scent పోరీ
Farex baby లా ఉండే నువ్వూ - RDX బాంబల్లే అయిపోయావే
నీ Rolex body తో మాచ్ అయ్యేలా - జర remix అయి వచ్చేసానే
where is that? - ఇప్పేసా
where is that? - కట్ చేసా
where is that? - చెరిపేసా
Where is the పంచెకట్టు - where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
I like this suit boot - I like this French cut
I like this gulf scent పోరీ
C H A R I is chari - He is gonna say brand new story
C H A R I is chari - అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ

చరణం 1:
రాహుకాలం చూడందే తెల్లారీ - మంచినీళ్ళైనా ముట్టని ఓ చారీ
Good morning అన్నవే - పెదవుల్తో మితిమీరీ
అరె sentimental గా సుకుమారీ - నే fox tail తొక్కానే కాల్ జారీ
ఆ లక్కేదో నా కిక్కు పెంచిందే - luck మారీ
హే - సేమ్యా ఉప్మాలా ఉండే నువ్వు - Chinese noodles లా change అయ్యావే
femina miss లాంటి నీకోసమే - నే ఇస్టైలు మార్చేసానే!
where is that? - ఇప్పేసా
where is that? - కట్ చేసా
where is that? - చెరిపేసా
Where is the పంచెకట్టు - where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
I like this suit boot - I like this French cut
I like this gulf scent పోరీ

చరణం 2 :
Rewind చేసీ చూస్తే మరీ - స్వాతిముత్యం లాంటిది నీ హిస్టరీ
Romance లో నీకింత scene ఉందా - బ్రహ్మచారీ
నా daily మంత్రాలు పొలమారీ - ఎపుడేం చేసానో నోరు జారి
నా flashback మటాషై మారానిలా - పోరీ
హే - ఎర్రబస్ లాగా ఉండే నువ్వూ - airbus లాగా style అయ్యావే!
mecanas gold లాంటి - నీ beauty కి నేను పోటీగా పోటెత్తానే!
where is that? - ఇప్పేసా
where is that? - కట్ చేసా
where is that? - చెరిపేసా
Where is the పంచెకట్టు - where is the పిలకజుట్టు
Where is the నిలువు బొట్టు చారీ
I like this suit boot - I like this French cut
I like this gulf scent పోరీ
C H A R I is chari - He is gonna say brand new story
C H A R I is chari - అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ !!

ఓ చంద్రకళా.. చంద్రకళా.. - అదుర్స్

చిత్రం : అదుర్స్
గానం: హరిహరన్, రీటా
గీత సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
ఇంగ్లీష్ లిరిక్స్ : రీటా
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
************************
సాకీ :
నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమహా - నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమహా
నీ పట్టుకురుల నలుపుకొక్క ఓం నమహా - మేలుజాతి కోహినూరు సొగసుకు ఓం నమహా

పల్లవి :
ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా - కరకర కొరికే సొగసులకే చాంగుభళా
ఓ ఓ చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా - ఇటు నను నరికే నిగనిగకే చాంగుభళా
ఓ మనసే మరిగే సలసల - వయసే విరిగే ఫెళ ఫెళ
మతులే చెదిరే లా మహ - బాగుందే నీ వంటి వాస్తుకళా
చంద్రకళా..
One more time - చంద్రకళా..
That's the way we like it !
చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా

చరణం 1:
ఓ ఓ ఓ కులుకులకు పత్రం పుష్పం .. తళుకులకు అష్ఠొత్తరం
ya.. that's the way I wann it
చమకులకు ధూపం దీపం - నడకలకు నీరాజనం
yeh.. that's the way to do it
అడుగుకో పువ్వై పుడతా - నీ పదములు ముద్దాడేలా
చీరలా నీ జత కడతా అనునిత్యం - నిను అంటుకు తిరిగేలా
ఓ చంద్రకళా..
One more time - చంద్రకళా..
That's the way we like it!

చరణం 2 :
ఓ పురుషులను పగబట్టేలా - సొగసు పొడి వెదజల్లకే
Ya.. This is the way I ?
వయసు మడి గది దాటేలా - వగలతో వలలల్లకే - Yeh ..?
నీకేసి చూస్తే ధగ ధగ - దరువేస్తుందే దిల్ తబలా
శివకాశి చిటపట సరుకై చెలరేగావే - రంభా రాక్షసిలా
ఓ చంద్రకళా..
One more time - చంద్రకళా..
That's the way we like it !
చంద్రకళా .. చంద్రకళా.. చంద్రకళా
కరకర కొరికే సొగసులకే చాంగుభళా!

Sunday, February 14, 2010

రంగు రంగుల (ను అద్దిన) మాయాబజార్

మాయాబజార్ - తెలుగు చలన చిత్ర రంగములో విరబూసిన ఆణిముత్యాల్లో ఇదొకటి. అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు, నిక్కర్లు  వేసుకొనే వయస్సులో ఈ సినిమా చూసాను. అప్పుడు రేకులు వేసి డబ్బా లాంటి (శ్రీనివాస) టాకీసులో, ఇరవై ఐదు పైసల టికేట్టుతో తెర ముందు నేల క్లాసులో, ఇసుక పోసి ఉన్న స్థలములో కూర్చొని, ఫ్యానులేవీ లేని కాలములో మొదటిసారిగా ఈ నలుపుతెలుపు వర్ణాల మాయాబజార్ సినిమా చూసాను. అప్పుడు నేను నాలుగో, ఐదో క్లాసులో ఉండొచ్చు. మరి ఇప్పుడో..

అధునాతన డిటిఎస్ సిస్టం గల టాకీసులో, డిటిఎస్ సౌండ్ తో, రంగు రంగుల (ను అద్దిన) మాయాబజార్ సినిమాను చల్లని ఎసి లో కపుల్ సీట్లలో కూర్చొని, మరోసారి ఆ మధురమైన సినిమాని ఆస్వాదించాను. కలర్ వర్క్, మరియు శబ్ద గ్రహణం చాలా బాగా పునరుద్దరించి బాగా సొబగులద్దారు. నిజముగా ఈ రంగుల  మాయాబజార్ ని చూసాక ఒక చక్కటి చిత్రాన్ని, మదిలో మరచిపోతున్న తరుణములో పునశ్చరణ చేసుకున్నట్లుగా చూసినట్లయ్యింది.

చిన్నప్పుడు అంటే తెలియలేదు గానీ, ఇప్పుడు కొంత ఎదిగిన తరవాత ఈ సినిమాలో గొప్పదనం ఏమిటో తెలుస్తున్నది. అసలు ఎన్నని చెప్పను.. శ్రీకృష్ణుడి చిరునవ్వు అంటే ఏమిటో ఎలా ఉంటుందో, శ్రీకృష్ణుడి మాయలూ దూరదృష్టి, పాండవులు ఒక్క సీనులో లేకుండానే వారి కథని అన్యాపదేశముగా చెప్పటం, ద్రౌపది మానసంరక్షణ ఘట్టాన్ని చిటికె సేపట్లో అర్థం చేసి లాఘవముగా అక్కడ నుండి కథని మళ్ళించడం, అప్పటి కుటుంబ కలహాలు ఇప్పటికీ సజీవముగా ఉన్నట్లు, ఆస్థులు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలాగా ఉండే ప్రస్తుతకాల పరిస్థితిని దర్శకులు ఇందులో అప్పట్లోనే చక్కగా చెప్పారు. అందరూ గొప్పగా చేసారు.

నటులు తమ తమ కీర్తి, కళని చిరస్థాయిగా ఉండాలని - జీవించారనిపిస్తుంది. ఎవరిని తక్కువ చేసి చెప్పటం కాదుగానీ, సావిత్రి గారయితే పరకాయ ప్రవేశం విద్య వచ్చినట్లుగా అమోఘముగా ఎస్వీ రంగారావు గారిని.. క్షమించాలి ఘటోఘజున్ని అనుసరించారు. లక్ష్మణ కుమారులని ఓ ఆట ఆడించినప్పుడయితే అబ్బో!.. నేను వ్రాయలేను.. చూసి తరించాలి. ఇక ఎస్వీ రంగారావు అయితే ఇలాంటి పాత్రలయితే కొట్టిన పిండి అన్నట్లు చేసారు. ఇక లక్ష్మణ కుమారుల పాత్రలో రేలంగి గారి హావభావాలూ అదూర్స్! ముఖ్యముగా సావిత్రి గారితో వచ్చిన సీనులలో ఆయన నటన నభూతో నభవిష్యతి. ఇక ఘంటసాల గారి సంగీతం, పాటలూ, మార్కస్ బాట్లే చాయాగ్రహణం.. ఓహ్!.. లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట ఘంటసాల గారు మూడు గొంతుకలలో పాడటం, మార్కస్ బాట్లే ఈ పాటని మిట్టమధ్యాహ్నం తీసి, అది పండువెన్నెల్లో తీసినట్లుగా చూపించటం.. ట్రిక్ ఫోటోగ్రఫీ ని పెట్టి అప్పట్లోనే అంటే 1952లో గ్రాఫిక్స్ లేని కాలములో సావిత్రిగారిని ఒక సన్నివేశములో ఇద్దరినిగా (double)చూపించటం.. పాత్రలు, చెప్పులు కదలటం, లడ్డూలు ఎగరటం.. ఓహ్! ఇలా ఎన్నని చెప్పను. దర్శక ప్రతిభ కూడా అనన్య సామాన్యం. సుభద్ర ఏడ్చినప్పుడు ఆవిడ కన్నీరు పయ్యెదపై పడి, అది తడిచినట్లు చూపించి పరోక్షముగా ఆవిడ ఎంతగా బాధపడిందో చూపెట్టారు. ఘటోద్ఘచుడు వంటశాలకి వచ్చినప్పుడు వంటకాలు ఆవిరి వస్తునట్లుగా చూపటం.. చిన్న చిన్న లోపాలు రాకుండా ఎంత జాగ్రత్త పడ్డారో తెలియజేస్తున్నది.

Friday, February 12, 2010

మిలే సుర్ మేరా తుమ్హారా

మిలే సుర్ మేరా తుమ్హారా  = చాలా మంది భారతీయుల హృదయాన్తరాలల్లో "మిలే సుర్ మేరా తుమ్హారా.." అనే పాట శాశ్వతముగా నిలిచిపోతుంది.. నిలిచిపోయింది కూడా. అందులో ఏమాత్రం సందేహమే లేదు..

ఈ  పాటని మొదట్లో 15 ఆగష్టు 1988 నాడు దేశవ్యాప్తముగా దూరదర్శన్ లో "unity in diversity" అన్న థీం తో ప్రసారమయ్యింది. ఈ పాటని భారతీయులు తమ ప్రాంతీయ భాష అక్కడక్కడా ఉన్నా, ఈ పాటని మొత్తాన్ని- ఎప్పుడూ వారు మాట్లాడలేని భాష పదాలు కూడా  హమ్ చేసెడివారు. ఈ పాటని చాలావరకూ దూరదర్శన్లో కార్యక్రమాల అనంతరం ఈ పాటని వేసెడివారు. అప్పటికి ఆ కార్యక్రమం అయిపోయినా లేచి, బయటకి పోతున్నవారు కూడా ఈ పాట వస్తుంటే ఆగి, మరీ చూసేడివారు.. అంతగా వీరిని ఆకట్టుకున్న  ఈపాటలో - పెద్ద పెద్ద స్టార్లూ, సంగీత విద్వాంసులూ, సాంస్కృతిక చిహ్నాలూ, ఆటగాళ్ళు, మరియు సామాన్య ప్రజానీకం.. ఇలా  ఎంతమందో కనిపిస్తారు. పాత  మిలే సుర్ మేరా తుమ్హారా.. పాట ని ఇక్కడ చూడండి. http://www.youtube.com/watch?v=gstRrEmTcBc

Sogasu choodatharamaa - Sogasu choodatharamaa

చిత్రం : సొగసు చూడతరమా
సంగీతం : రమణి ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం : K.J.యేసుదాస్
**********
పల్లవి :
సొగసు చూడతరమా!..
సొగసు చూడ తరమా -  నీ సొగసు చూడ తరమా..
మరుని నారి, నారిగ మారి - మదిని నాటు విరిశరమా
సొగసు చూడ - సొగసు చూడతరమా!..

హే.. హె.. హే.. హే.. హె

చరణం 1 :
కులుకే సుప్రభాతాలై - కునుకే స్వప్న గీతాలై
ఉషా కిరణమూ - నిషా తరుణమూ
కలిసె కలికి మేనిగా - రతి కాంతుని కొలువుగా
వెలసే చెలి చిన్నెలలో - సొగసు చూడ తరమా !!

చరణం 2 :
పలుకా చైత్ర రాగాలే - అలకా గ్రీష్మ తాపాలె
మదే, కరిగితే - అదే, మధుఝరీ
చురుకు వరద గౌతమీ - చెలిమి శరత్ పౌర్ణమీ
అతివే.. అన్ని ఋతువులయ్యే

సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా
మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా  
సొగసు చూడ - సొగసు చూడ తరమా!

Thali kattu shubhavela - Anthuleni katha



చిత్రం : అంతులేని కథ   
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : యం యస్ విశ్వనాథన్
గానం : బాలు.
***********
పల్లవి:
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా 
ఒహొహూ అహహా ఊహూహు.. యే హే హే...
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా 
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో // తాళి కట్టు శుభవేళ // 

చరణం 1 :
వికటకవి ని నేను వినండీ ఒక కధ చెపుతాను..
కాకులు దూరని కారడవి..
అందులో - కాలం యెరుగని మానోకటి
ఆ అందాల మానులో - ఆ అద్బుత వనంలో!
చక్కని చిలకలు అక్కా చెల్లెలు - పక్కన గోరింకలు
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు - ఒద్దిక కుదిరెనమ్మా
బావ రావా నన్నేలుకోవా..

తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా 
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..

చరణం 2 :
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు - మిన్నంటి మోగెనమ్మా
థుంథుంథుంథుం. థుథుంథుథుం. - థుంథుంథుంథుం .థుథుంథుథుం
మేళాలు తాళాలు మంగళ వాద్యాలు - మిన్నంటి మోగెనమ్మా
వలపు విమానాన తలపుల వేగాన - వచ్చాయి కాన్కలమ్మా
సింగపూర్ ఎయిర్లైన్స్ అనౌన్సేస్ ది అరైవల్ ఆఫ్ ఫ్లైట్ S 2583
ఊరేగు దారుల వయ్యారి భామలు - వీణలు మీటిరమ్మా
టటటై టటటై టటటై
శింగారి జాణల ముంగాలి మువ్వలు - ఘల్లున మోగెనమ్మా..

తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా -
ఒహొహూ అహహా ఊహూహు - యే హే హే
తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా 
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో..
తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా ...

చరణం 3 :
గోమాత లేగతొ కొండంత ప్రేమతొ - దీవించ వచ్చెనమ్మా.
అంబా - వూ, అంబా - వూ
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు - గ్రీటింగ్సు చెప్పిరమ్మా
విష్ యు బోథ్ ఏ హాపీ లైఫ్.. హాపీ హాపీ మారీడ్ లైఫ్
హి హహ హీ హ హ - హి హి హ హ
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు - మంత్రాలు చదివెనమ్మా
మాంగల్యం తంతునానేనా - మమ జీవన హేతునా
కంఠే బద్నామి శుభగే - త్వంజీవ శరదాంశతం
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు - మంత్రాలు చదివెనమ్మా
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు - వర్దిల్ల మనెనమ్మా

తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా..

చరణం  4 :
చేయి చేయిగ చిలుకా గోరింక - శయ్యకు తరలిరమ్మా
చెల్లెలి కోసం త్యాగము చేసిన - చిలుకమ్మ తొలగెనమ్మా
తప్పుగ తలచిన అప్పటి - గోరింకకిప్పుడు తెలిసెనమ్మా
అది చిలుకే కాదని బావిలొ - కప్పని జాలిగ తలచెనమ్మా

తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా
ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా

Wednesday, February 10, 2010

బ్లాగులోని ఫోటో పెద్దగా కనపడి, స్పష్టముగా చూడాలనుకుంటే?

బ్లాగులలో ఉన్న ఫోటోలూ, స్క్రీన్ షాట్లూ సరిగ్గా, స్పష్టముగా మీకు కనిపించకపోతే, పోనీ అని ఊర్కుంటారా!.. అంత ఊరుకోవాల్సిన అవసరం లేదు. మీకు యే బ్లాగులోనైనా ఫోటో పెద్దగా కనపడి, స్పష్టముగా చూడాలనుకుంటే మీరు ఈ క్రింది పద్దతులు పాటించండి. 
మీరు పెద్దగా చూడాలనుకుంటే :
  • ముందుగా మీకు కావలిసిన ఫోటో వద్దకి వెళ్ళండి.
  • అక్కడ ఏ ఫోటోనైతే పెద్దగా చూడాలనుకుంటున్నారో ఆ ఫోటో మీద మౌస్ కర్సర్ ఉంచి రైట్ క్లిక్ చేయండి.
  • అప్పుడు వచ్చిన పాపప్ బాక్స్ లో అన్నింటికన్నా మీద ఉన్నది, మొదటిది Open the link మీద క్లిక్ చేయండి.
  • అంతే! ఆ ఫోటో పెద్దగా వస్తుంది. ( అంటే ఆ ఫోటో ఒరిజినల్ సైజులో వస్తుంది).
ఒకవేళ మీకు ఆ ఫోటో దా(దో)చుకోవాలనిపిస్తే :
  • ఇప్పుడు వచ్చిన ఫోటో మీద మళ్ళీ రైట్ క్లిక్ చెయ్యండి.
  • అప్పుడు వచ్చిన పాపప్ బాక్స్ లో Save picture as.. ని క్లిక్ చేసి మీరు ఎక్కడ దాచుకోవాలనుకుంటారో అక్కడ సెలెక్ట్ చేసి, Save చెయ్యాలి.
  • అంతే! ఆ ఫోటో మీ స్వంతం.

కామెంట్లు - ప్రోత్సాహం - ప్రేరణ

నా పేరు మీద ఏమున్నాయో అని గూగుల్ లో సరదాగా వెదికాను. పదో - పన్నెండు లింకు పోస్టులను చూపాడు గూగుల్ వాడు.  ఒక్కక్కటిగా చూస్తూ పోయాను.. ఒక లింక్ ఓపెన్ చేసాను. చాలా గొప్ప రచయిత బ్లాగులో నా పేరు కనిపించింది. ఏమిటబ్బా! నా బ్లాగు పేరు ఇందులో ఉంది అనుకుంటూ కళ్ళు నులిమి మరీ చూసా.. ఇప్పుడు మీరు కూడా చూడండి. 

ఇక్కడ ఎర్ర రంగు డబ్బాలో మార్క్ చేసిన కామెంట్ చూసారుగా.. (వ్యక్తుల పేర్లని ఎడిట్ చేసాను).. అది చదివి చాలా సంతోషించాను - అబ్బా!ఇన్నాళ్ళకి నా బ్లాగు ఒకరికి ఉపయోగపడింది అని. కాకపోతే కించిత్ బాధ. ఎందుకంటే ఆ కామెంట్ కూడా నా బ్లాగులో వ్రాస్తే ఎంత బాగుండును. నా బ్లాగు ఎవరికీ ఉపయోగపడటం లేదనీ, ఈ పాటల లిరిక్కులు ఎవరికీ అవసరం ఉండవు.. అనుకొని బ్లాగు మీద నుండి దృష్టి మరల్చిన సమయములో ఆ కామెంట్ వ్రాసారు. ఆ కామెంట్ ఏదో నా బ్లాగులో వ్రాస్తే నాకు ఉత్తేజముగా ఉంది మరిన్ని పోస్టింగులు పెట్టేవాడినిగా.. నిజానికి అక్కడ కామెంట్ వ్రాయకున్నా ఏమీ ఫరవాలేకుండెను. కాని నా దాంట్లో వ్రాస్తే ఇంకా ప్రోత్సాహకరముగా ఉండేడిది కదా.. ఈ విషయం మీరు గమనించి అందరూ పాటించాలని మనవి.

నా బ్లాగులో పోస్టుల క్రింద మీ రియాక్షన్స్ అంటూ పెట్టాను. అది చాలా మంది వాడుటలేదు. మీరు కామెంట్ వ్రాయకున్నా సరే.. కాని ఆ బాక్స్ లలో ఎందులోనైనా క్లిక్ చేసి ఆ టపా ఎలా ఉందో చెపితే నాకూ మీ అభిప్రాయాలు తెలుస్తుందిగా.. నేనేమీ మిమ్మల్ని కోప్పడనుగా.. మరి ఎందుకంత భయం.. ఇప్పటినుండీ ఇక మరవకండీ..

Tuesday, February 9, 2010

ABC's Of Successful Marriage!

ABC's of Successful Marriage!
*******************************
A bsolutely adore each other.
B e best friends.
C ompromise.
D iscover new things together.
E ncourage each other.
F orgive and forget.
G aze into each others eyes.
H old hands and hug a lot. 
I inspire and intrigue each other.
J oke and laugh and have fun.
K iss Kiss Kiss.
L ove with all your hearts.
M arvel at each other's talents.
N uture each other's soul.
O vercome problem together.
P lay games.
Q uiet each other's fears.
R emember the little things.
S ay "I love you" everyday.
T ake time for tenderness.
U nderstand and care deeply.
V alue everything you share.
W ish on stars together.
X -press your true feelings.
Y earn for each other's touch.
Z zzzz in each other's arm.

కృతజ్ఞతలు - నా బ్లాగు గురించి

నా బ్లాగుని దర్శించి, అమూల్యమైన సలహాలను అందించిన వారికీ, నా బ్లాగుని చూసే వారికీ, నా మిత్రులకీ, శ్రేయోభిలాషులకీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. చాలా తక్కువ కాలములో మీ అందరి మనసుని ఆకట్టుకున్నందులకి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మొదట నా బ్లాగు ఇలా ఉండేడిది. 


ఇలా ఉన్న నా బ్లాగు ఇలా మారింది.


ఆ తరవాత ఇలా మారింది.

ఇప్పుడు మీరు చూస్తున్న రూపములో ఉంది. ఈ చిన్ని ప్రయాణకాలమున ఎన్నో అనుభూతులు కలిగాయి. నూతన సంవత్సరములో నా బ్లాగును మార్చాలి అనుకొని కొద్దిగా శ్రమ తీసుకొని, మార్చాను. ఊహించని ప్రతిస్పందన వచ్చింది. ఇంతగా వస్తుందని / ఉంటుందని నేనసలు ఊహించలేదు. నా పని చేస్తూ పోయాను..

ఇలా వ్రాస్తున్నప్పుడే ఇంకో ఆలోచన వచ్చింది. ఏ  ఏ తేదీలలో ఏమి టపాలు నేను పెట్టానో తెలియ దానికి కోసం ఒక Blog Visitors List   ( ఈ లింకు ద్వారా ఈ ఫైల్ ను దింపుకొని / డౌన్లోడ్ చేసుకొని చూడండి )ఫైల్ తయారు చేసాను. నిజానికి ఈ ఆలోచన జనవరి 8 వ తేదీన వచ్చింది. ఆ రోజునుండీ ఏ ఏ రోజుల్లో ఏ టపాలు పోస్టు చేస్తున్నదీ, ఎంత మంది నా బ్లాగుని విజిట్ చేసారు, వారి సంఖ్య ఏమిటో అన్నీ వ్రాస్తూపోయాను. కొద్దిరోజులయ్యాక పోస్ట్ లింక్ ని అందులో పేస్టు చెయ్యటం జరిగింది. అందుకే ఆ  Blog Visitors List   ఫైల్ సగమునుండి నీలిరంగులో (blue) కనపిస్తుంది. అలా నెల రోజులుగా మైంటైన్ చేసాను. సరిగ్గా నెల రోజుల తరవాత విశ్లేషిస్తున్నాను..

ఇదే నేను నా బ్లాగు గురించి తయారు చేసిన ఎక్సెల్ ఫైల్. ( మైక్రోసాఫ్ట్ ఆఫీసు - 2003 / 2007 ఉన్నవారికి కనిపిస్తుంది. డౌన్లోడ్ సైజు: 50 KB  Blog Visitors List  ) ఇలా చేసినందులకి కొన్ని ప్రయోజనాలు కలిగాయి.

  1. నా బ్లాగులో ఎప్పుడు, యే తారీకులో ఏమి పోస్ట్ చేసానో ఈజీగా నెట్ ఆన్ చెయ్యకుండానే తెలుసుకుంటున్నాను. 

  2. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఏమి పోస్టులు పెట్టానో వివరముగా తెలుసుకుంటున్నాను.

  3. ఆయా సమయాల వరకు నా బ్లాగుని ఎంతమంది దర్శించారో కూడా తెలుసుకుంటున్నాను.

  4. టపాలని కాపీ చేసి పేస్టు చేసే సరికి అది ఇక్కడ లింకుగా మారి నేరుగా ఆ పేజి / పోస్టుకే వెళుతున్నాను. అంటే బ్లాగు ఓపెన్ చేసి, లేబుల్స్ లోనో, Blog Archieve లోకో వెళ్లి ఆ పోస్టు ఎక్కడ ఉన్నదో వేదుక్కోవాలసిన అవసరం లేకుండా నేరుగా ఆ టపా లోకే వెళుతున్నాను.

  5. ఇలా లింక్లను ఎక్సెల్ ఫైల్ లో రావాలంటే మీ బ్లాగుని ఓపెన్ చేసాక, మీ బ్లాగు పోస్టు హెడ్ లైన్ వద్ద ( ఇక్కడ మౌస్ పాయింటర్ ని పెడితే చేతి గుర్తును చూపుతుంది.) ఆ హెడ్ లైను ని మార్కు చేసి, రైట్ క్లిక్ చేసి వచ్చిన బాక్స్ లో Copy నొక్కి, ఎక్సెల్ ఫైల్ లో ఎక్కడ పేస్టు చెయ్యాలో అక్కడ పేస్టు చెయ్యాలి ( దీని గురించి త్వరలో వివరముగా ఫోటోలతో ఒక పోస్టు వ్రాస్తాను.. సరేనా!)..
ఈ నెల రోజులలో నా బ్లాగు గురించిన విశ్లేషణ: 

  1. ఈ నెల రోజుల్లో నా బ్లాగుని 6842 మంది దర్శించారు. (12642 - 5800) అంటే 31 రోజులకి గాను, రోజుకి సగటున 220.70 హిట్స్ వచ్చాయన్నమాట. ఇంతకన్నా హిట్స్ ఉన్న బ్లాగులు అనేకం.. నా బ్లాగు వాటితో పోలిస్తే పీపీలికం.

  2. ఏ ఏ దేశాలనుండి ఎంతమంది చూస్తున్నారు అనే ఆడ్-ఆన్ ని జనవరి సగమునుండి పెట్టాను. (అయినా 6206 పేజీలు  చూసారు అని తెలిసింది.) నేను జనవరి మొత్తములో 108 పోస్టులు, ఫిబ్రవరీలో 16  (ఇప్పటివరకూ)  పోస్టులూ పెట్టాను. 

  3. భారత దేశము నుండి అత్యధికముగా 1131 ( 63.1%), ఆ తర్వాత స్థానములో అమెరికా 424 ( 23.7%) ఉంది.

  4. ఇప్పటివరకూ 34 దేశాలనుండి నా బ్లాగుని చూసారు.  
ఇదంతా గొప్పల కోసం చెప్పుకోవటం కాదు.. ఇలా ఆలోచిస్తేనే ఇంకా మనం మన బ్లాగుని అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన కలుగుతుందని  - చెప్పటం. ఇలా చెప్పితే నాకు ఒరిగేదేమీ ఉండదు. కాని మీరు కూడా మీ బ్లాగులని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారన్న ఆలోచన. - అంతే!!

Monday, February 8, 2010

ఎన్ని సదుపాయాలో ఈ Toolbar లో

ఎన్ని సదుపాయాలో ఈ Toolbar లో


తెలుగువారికోసం చేసిన తెలుగు పరిశోధన సైట్ వారి Toolbar ఎన్నో సదుపాయాలతో మీకు అందు బాటులోకి వచ్చింది.. ఇందులో వరుసగా-
1) search engine
2) E-Mail notifier
3) సమాచారం

తెలుగు వార్తాపత్రికలు (8 ఉన్నాయి)
ఇంగ్లీషు వార్తా పత్రికలు(4 ఉన్నాయి)

వాణిజ్య సమాచారం
1) కరెన్సీ మార్పిడి
2) ప్రపంచ మార్కేట్ ల సమాచారం
3) బంగారం ధరలు
4) మరో మూడు వాణిజ్య సైట్స్
వారపత్రికలు (2 ఉన్నాయి)
మాస పత్రికలు(5 ఉన్నాయి)

గ్రంథాలయాలు
1) తెలుగు పుస్తకాలు(4 సైట్స్)
2) అన్ని పుస్తకాలు (2సైట్స్)
3) ఇంజనీరింగ్ బుక్స్(3 సైట్స్)

Dictionary(8 links)
తెలుగు వికీపీడియా
TV news channel
Cricket info

4) పరికరాలు
configure your system for Telugu
Download Telugu font
Search in Telugu
Telugu typing pads (2)
E-Mail in Telugu (2)
Greetings in Telugu
Telugu blogs (5)
Telugu websites
Telugu groups (7)
Panchangam/calender
Telugu scripting tools
General useful tools (%)
My google services

5) Fun Zone
Mobile stuff
Audio, video (5)

మెదడుకు మేత
గడి-నుడి (పదకేళి)
సుడోకు
Online games (6)
Social Networking sites (17)
(Including exclusive Telugu networking sites)

6) SMS
India SMS (5 links)
World SMS (4 Links)
7) Chat
Chat in Telugu script
All IM chat center

8) Tell about us
ఇక్కడ మీకూ ఈ Toolbar నచ్చినట్లైతే మీ మిత్రులకు దీని గురించి చెప్పవచ్చు.

9) Comments
ఇక్కడ మీరు అందరికీ/Toolbar నిర్వాహకులకూ ఏమైనా చెప్పదలిస్తే రాయవచ్చు.ఇతరులు రాసినవాటిని చదువ వచ్చు. ఇది Community notice board అన్నమాట.

10) privacy
Clears browsers cache, History, Cookies.

ఇదన్నమాట సంగతి. ఇప్పుడు చెప్పండి..ఇది మన తెలుగు వారందరికీ అక్కరకువచ్చేట్టుగా లేదూ? తెలుగు పరిశోధన Toolbar అనేది తెలుగువారికి తమ ప్రపంచాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం. అంతే కాకుండా తెలుగువారిని కలిపే ప్రయత్నం. ఒక్కసారి ఈ Toolbar ని మీరు మీ కంప్యూటర్ లో install చేసికొని చూడండి. ఒక్క క్లిక్ లో మీకు మీ ప్రపంచం అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజురోజూ అభివృద్ధి పరుస్తూనే ఉన్నాం. మేము చేసిన ప్రతిమార్పూ మీ Toolbar ఆటోమెటిక్ గా అప్డేట్ ఔతుంది. అటువంటి సౌకర్యం అందులో ఉంది. మీరొక్కసారి శ్రమతిసుకొని మా Toolbar ని install చేసి చూడండి. బాగుంటే మరికొందరు తెలుగువారికి తెలుపండి. బాగు లేదంటే మాకు తెలపండి. మీ అభిరుచులకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుతాం. ఈ Toolbar కొరకు మా సైట్ - http://teluguthesis.com/ ను సందర్శించండి.

మళ్ళీ కలుద్దాం..

ఇది నాకు వచ్చిన మెయిల్.. మీకు తెలియచేస్తున్నాను..

కృతజ్ఞతలు

మొన్న నా బాగుని దర్శించిన ఒక బ్లాగరు పేజిలో కనిపించిన లింక్ ని నొక్కి, నా బ్లాగును IndiBlogger గ్రూప్ లో చేర్చుకోమన్నాను.. వారికి - అలా చేర్చుకోవటానికి కొన్ని (8) నియమనిబంధనలు ఉన్నాయట. వాటి లింక్ పంపితే చూసాను.. బాగున్నాయి.. OK .

సరేలే! పోనీయండి.

నేనేమీ రేగులర్గా బ్లాగులోకి ఉండాలని రాలేదు.. బహుశా ఈ సంవత్సరం చివరివరకు మైంటైన్ చేస్తాను. ఆ తరవాత వీలున్నప్పుడు.. అని అనుకున్నాను. అందుకే నేను వ్రాయాల్సినవి చాలా టపాలు ఉన్నాయి. అవన్నీ త్వరలోనే వ్రాసేయాలి.. అయినా నేను చెప్పాలనుకున్నవి చెప్పటానికి నేను బ్లాగుని పెట్టాను. చెప్పాల్సింది చెబుతాను.. వారి మెయిల్ చూసాక వెంటనే, సింపుల్గా " Thankyou verymuch for REJECTING of my request.." అని ప్రత్యుత్తరం పంపాను. ఎందుకలా పంపానంటే - ఇప్పటికే రెండు, మూడు రోజులు ఎదురుచూసాను. మన ప్రభుత్వాల నుండి వచ్చే రిప్లై లాగా లేటుగా ప్రతి జవాబు వస్తుందేమో, ఎంతగా ఎదురుచూడాలో అనుకున్నాను. కాని తొందరగానే ప్రత్యుత్తరం పంపారు. అందుకే కృతజ్ఞతలు చెప్పుకోవాలని అలా రిప్లై పంపాను. అంతేగాని అదేమీ దుందుడుకు చర్య కాదని సవినయముగా తెలియచేసుకుంటున్నాను.

Sunday, February 7, 2010

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసనసభ్యుల పట్టిక:

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసనసభ్యుల పట్టిక:
మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు:

* 1952 : షేక్ షాజహాన్ బేగం, పరిగి శాసనసభ నియోజకవర్గం.
* 1952 : కె.వి.పడల్, పాడేరు శాసనసభ నియోజకవర్గం.
* 1952 : ప్రకాశం పంతులు, శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం.
* 1952 : కె.వి.పద్మనాభరాజు, ఉత్తరపల్లి శాసనసభ నియోజకవర్గం.
* 1952 : శ్రీరంగం చిత్తూరు, శాసనసభ నియోజకవర్గం.
* 1952 : వీరాస్వామి, కొడంగల్ శాసనసభ నియోజకవర్గం.
* 1952 : పి.వి.జి.రాజు, విజయనగరం శాసనసభా నియోజకవర్గం.
* 1952 : గంట్లాన సూర్యనారాయణ, విజయనగరం శాసనసభా నియోజకవర్గం.
* 1955 : ఎన్.వెంకటరత్నం, బూరుగుపూడి శాసనసభ నియోజకవర్గం.
* 1955 : రామారావు, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం.
* 1955 : టి.ఎన్.వి.రెడ్డి, తంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం.
* 1956 : అల్లం కృష్ణయ్య, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం.
* 1957 : సీతాకుమారి, బాన్స్ వాడ శాసనసభ నియోజకవర్గం.
* 1957 : పద్మనాభరెడ్డి, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం.
* 1957 : పి.మహేంద్రనాద్, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం.
* 1957 : భాట్టం శ్రీరామమూర్తి, విజయనగరం శాసనసభా నియోజకవర్గం.
* 1960 : జి.డి. నాయుడు, శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం.
* 1962 & 1972 : బి.వి.సుబ్బారెడ్డి, కోయిలకుంట్ల.
* 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం.
* 1962 : టి.రంగారెడ్డి, ఆర్మూరు శాసనసభ నియోజకవర్గం.
* 1962 : కె.పున్నయ్య, ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం.
* 1962 : కె.రాంభూపాల్, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం.
* 1962 : కే.వి.రెడ్డి, భోదన్ శాసనసభ నియోజకవర్గం.
* 1962 : ఎ.రామస్వామి, వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం.
* 1967 : కె.లక్ష్మీనరసింహరావు, జగిత్యాల శాసనసభ నియోజకవర్గం.
* 1968 : ఎ.సంజీవరెడ్డి, రాపూరు శాసనసభ నియోజకవర్గం.
* 1968 : కె.రామయ్య, బూర్గుంపహాడ్ శాసనసభ నియోజకవర్గం.
* 1970 : ఎం.ఎస్.సంజీవరావు, రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం.
* 1972 : ఎస్.భూపాల్, అమరచింతశాసనసభ నియోజకవర్గం.
* 1972 : చింతలపాటి వరప్రసాద మూర్తి , ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం.
* 1972 : ఎమ్.రామమోహనరావు, చింతలపూడి శాసనసభ నియోజకవర్గం.
* 1972 : ఎన్.రామచంద్రారెడ్డి, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం.
* 1972 : ఇ.అయ్యపురెడ్డి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : ఎం.మాణిక్ రావు, తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : కళ్యాణ రామచంద్రరావు, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : జి.గడ్డెన్న, ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : ఎం.సుబ్బారెడ్డి, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : డి.మునుస్వామి, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : ఎస్.పి.నాగిరెడ్డి, మైదుకూరు శాసనసభ నియోజకవర్గం.
* 1972 : వి.రామకృష్ణచౌదరి, అనపర్తి శాసనసభ నియోజకవర్గం.
* 1972 : పి.నర్సారెడ్డి, నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం.
* 1972 : మండలి వెంకటకృష్ణారావు, అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం.
* 1972 : కోదాటి రాజమల్లు, చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా)
* 1972 : పెనుమత్స సాంబశివరాజు, గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
* 1974 : ఆర్.సురేందర్ రెడ్డి, డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం.
* 1975 : ఎన్.యతిరాజారావు, చెన్నూరు శాసనసభ నియోజకవర్గం
* 1981 : టి.అంజయ్య, రామాయంపేట శాసనసభ నియోజకవర్గం
* 2002 : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి: దేవరకొండ శాసనసభ నియోజకవర్గం.

Thursday, February 4, 2010

షేవింగ్ - సేవింగ్

డిసెంబర్ చివరి నెలలో అనుకుంటా!.. గడ్డం గీసుకుంటున్నప్పుడు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆహా ఎంత బాగుంటుంది అని మనసు సంతోషముతో గెంతులాడింది. పాపం రేజర్ కి తెలీదుగా.. ఒక చిన్ని గాటు పెట్టింది. అసలు ఆ ఆలోచన వర్కవుట్ అవుతుందా? అనిపించింది. నాతో కాదేమో!! అనుకున్నాను.. ఒకసారి చేసి చూద్దాం అనుకున్నాను.. "ప్రయత్నం పురుష లక్షణం" అనుకుంటూ జై మాతాదీ.. అంటూ క్రొత్త సంవత్సరము లో మొదలెట్టాను. ఈ జనవరి అంతా చూద్దాం అనుకున్నాను.

ఇంతకీ అసలు ఆలోచన చెప్పలేదు గదూ! అయ్యో! నా మతి చెడ..

మరేమీ లేదండీ! బార్బర్ షాపుకెళ్ళి గడ్డం గీయించుకుంటామా.. అలా చేసుకోక ఇంట్లోనే చేసుకొని, అక్కడ ఇచ్చే డబ్బులని పొదుపుచేసి, దేనికైనా సత్కార్యక్రమాలకి వాడితే అనే ఆలోచన. నవ్వొస్తుందా.. మొదట్లో నాకూ అలాగే వచ్చిందండీ! సరదాగా ఉంటుంది అనుకొని ఈ జనవరి ఒకటి నుండి మొదలెట్టాను. నిష్ఠగా ఆచరించాను. గడ్డం చేసుకున్న ప్రతిసారీ డబ్బులు ఒక డబ్బాలో వేసేవాడిని. (నవ్వొస్తుంది కదూ) మా ఇంట్లో అలాగే నవ్వారు. అయినా ఫీలవక "నవ్వితే నాకేమిటి సిగ్గు.." అనుకొని అలా చేసుకున్న ప్రతిసారీ అలా వేస్తూ పోయాను. మా దగ్గర గడ్డానికి సెలూన్లలో ఇరవై రూపాయలు తీసుకుంటారు. బండేసుకొని వెల్లినందులకి ఆవో ఐదు రూపాయల పెట్రోలు ఖర్చు. మొత్తం ఇరవై ఐదు రూపాయలు అన్నమాట!

అలా జనవరి నెలలో గడ్డం గీసుకున్న ప్రతిసారీ డబ్బులు ఆ హుండీ లో వేయటం జరిగింది. మధ్యలో చిల్లర అవసరం వచ్చినా, చేబదులు కావాలన్నా నా శ్రీమతి, పిల్లలు దాట్లోంచి తీయటం మొదలెట్టారు. హమ్మో! లెక్క తెలిసేలా లేదని వాళ్లకి తెలియకుండా దాచేసాను. అలా చాలా కష్టపడి జనవరి అంతా జమ చేసాను. చివరికి జనవరి నెల అయిపోయి ఫిబ్రవరీ వచ్చేసింది. హమ్మయ్య! అనుకుంటూ ఆ నిధిని మహాభాగ్యము అనుకుంటూ సంతోషముగా తెరచి చూసాను. డబ్బులన్నీ లెక్కించాను.

మొత్తం మూడువందల రూపాయలు. ( నెలకి పన్నెండుసార్లు చేసుకున్నట్లున్నాను @ ఇరవై ఐదు ) వామ్మో! ఆఫ్ట్రాల్ గడ్డానికే ఇంత మిగులా.. ఈ డబ్బులతో ఏమి చెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఇందులో పెట్టుబడి క్రింద బ్లేడులకీ, షేవింగ్ క్రీముకీ ముప్పై రూపాయలు ప్రక్కన పెట్టాలి. మిగతావి మిగిలినవి రెండువందలా డెబ్బై రూపాయలు. ఇవి ప్రస్తుతం ఇలానే ఉంచుతాను. ఇక ఫేసియల్, కలరింగ్, మేనిక్యూర్, పెడిక్యూర్.. లాంటివి ఇంట్లో (అంటే మనకి అందదు కాబట్టి శ్రీమతితో) చేయించుకుంటే ఇంకెంత మిగులుతుందో చూడాలి. అలా ఆలోచిస్తుంటే బాగానే మిగిలేలా ఉంది. పైగా అందమైన వారితో ఆ పనిచేయించుకుంటున్నామన్న ఆనందం ఉంటుంది.. (మనలో మన మాట)పనిలో పనిగా మాంచి రొమాన్సూ ఉంటుంది. ట్రై చేయాలి.

Kushalamaa neevu - Balipeetam



చిత్రం: బలిపీఠం (1975) 
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: చక్రవర్తి
గానం:  S. P. బాల సుబ్రహ్మణ్యం,  P. సుశీల. 


*****************
పల్లవి:
కుశలమా.. నీవు కుశలమేనా? -
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను - అంతే
అంతే - అంతే..
కుశలమా.. నీవు కుశలమేనా? -
ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను - అంతే
అంతే - అంతే..  // కుశలమా //

చరణం 1:
చిన్న తల్లి ఏమంది? - నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలి పైన - పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవులపైన - దేవిగారికి ఒకటి
ఒకటేనా.. ఒకటేనా.. - ఎన్నైనా.. ఎన్నెన్నో..
మనసు నిలుపుకోలేక - మరీ మరీ అడిగాను.. అంతే
అంతే.. అంతే..   // కుశలమా //

చరణం 2:
పెరటిలోని పూలపాన్పు - త్వర త్వరగా రమ్మంది.
పొగడ నీడ పొదరిల్లో - దిగులు దిగులుగా ఉంది.
ఎన్ని కబురులంపేనో - ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కలపైనా - నీలిమబ్బు పాయలపైనా
అందేనా.. ఒకటైనా.. - అందెనులే తొందర తెలిసెనులే
ఇన్నినాళ్ళు వదలలేక - ఏదో ఏదో వ్రాశాను అంతే
అంతే.. అంతే.. // కుశలమా //
Related Posts with Thumbnails