ఈ పాట - కీరవాణి గారు పాడిన పాటల్లో ఆగ్రస్థానం పొందుతుంది. ఈ పాటలో వచ్చే ఆ "జీర" కీరవాణి గారికే సొంతం. నాకిష్టమైన పాటల్లో ఇదొకటి.
చిత్రం: క్రిమినల్
పాడినవారు: m.m. కీరవాణి
సంగీతం: m.m. కీరవాణి
దర్శకుడు: మహేష్ భట్
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
******************
ఆహ్ హా ఆహ్ హా ఆ...
పల్లవి:
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది // తెలుసా మనసా ఇది //
చరణం 1:
ప్రతి క్షణం... నా కళ్ళల్లో నిలిచే నీ రూపం!
బ్రతుకులో అడుగడుగునా నడిపే నీ స్నేహం!
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు వుంటాను నీ ప్రేమ సాక్షిగా... // తెలుసా మనసా ఇది //
ఆహ్ హా- ఆహ్ హా ఆ...
వచనం:
డార్లింగ్, ఎవెరి బ్రీథ్ యు టేక్,
ఎవెరి మూవ్ యు మేక్ ఐ విల్ బి దేర్,
వాట్ వుడ్ ఐ డు వితౌట్ యు?
ఐ వాంట్ టు లవ్ యు ఫరెవర్!..
అండ్ ఎవెర్ అండ్ ఎవెర్!
చరణం 2:
ఎన్నడూ తీరిపోని రుణముగా వుండిపో!
చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా -
మన ఈగాధ మిగలాలి తుదిలేని చరితగా // తెలుసా మనసా ఇది //
ఆహ్ హా.. అహ్ హా ఆ...
No comments:
Post a Comment